రసవత్తరంగా బ్యాడ్మింటన్ పోటీలు
ముగిసిన 78వ అంతర్ రాష్ట్ర టీం పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని చెన్నుపాటి రామ కోటయ్య మునిసిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో సోమవారం మొదలైన 78వ అంతర్ రాష్ట్ర టీమ్ బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం ముగిశాయి. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. తమిళనాడు, హరియాణా జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోటీలో తమిళనాడు జట్టు విజయం సాధించింది. రన్నర్‌గా హరియాణా జట్టు నిలిచింది. మహిళల టీమ్ బ్యాడ్మింటన్ పోటిల్లో హరియాణా, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య జరిగిన పోటీలో హరియాణా టీమ్ విజయం సాధించింది. విజేతలకు కలెక్టర్ లక్ష్మీశతో పాటుగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ద్వారకనాథ్, టోర్నమెంట్ కన్వీనర్ ఉమర్ రషీద్, గుజరాత్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి మయూర్ పారిఖ్ బహుమతులను అందజేశారు.
నేటి నుంచి
నేషనల్ పోటీలు..
బుధవారం నుంచి 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఇండివిడ్యువల్ చాంపియన్ షిప్–2025 పోటీలు జరుగుతాయని బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలిపింది.
పురుషుల సింగిల్స్‌లో తలపడుతున్న హరియాణా (డార్క్ బ్లూ టీషర్ట్), తమిళనాడు(స్కై బ్లూ టీషర్ట్) క్రీడాకారులు
రసవత్తరంగా బ్యాడ్మింటన్ పోటీలు
రసవత్తరంగా బ్యాడ్మింటన్ పోటీలు
రసవత్తరంగా బ్యాడ్మింటన్ పోటీలు


