అదే జోరు..ఎక్కడ తడబడలేదు..బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో మన అమ్మాయిలు అదరగొట్టారు. విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ–20లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది.
అన్ని విభాగాల్లోనూ సత్తా చాటిన టీమ్ ఇండియా శ్రీలంకను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు కేవలం 128 పరుగులకే కట్టడి చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 11.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన త్వరగానే అవుటైనప్పటికీ,షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. కేవలం 34 బంతుల్లోనే 69 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో భారత్ సునాయస విజయం సాధించింది.
భారత బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తుంటే గ్యాలరీల్లోని అభిమానులు కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తించారు.


