వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటాలి
పెనమలూరు: పాఠశాల విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి అన్నారు. పోరంకి మురళీ రిసార్ట్స్‌లో మంగళవారం రెండు రోజుల రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025–26ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. పాఠశాల కర్రీక్యూలమ్ క్యాలెండర్ ప్రకారం స్టేట్ సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులు ప్రతిభ చాటాలని అన్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఏడు అంశాలలో 188 గ్రూపు ప్రాజెక్ట్‌లను విద్యార్థులు అంశాలవారీగా ప్రదర్శించారు. ఉపాధ్యాయుల కేటగిరీలో 52 ప్రాజెక్ట్‌లు, విద్యార్థుల వ్యక్తిగత ప్రాజెక్ట్‌లు 52 చొప్పున ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రొఫెసర్ టీపీ శర్మ, స్టేట్ ఎకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కే.నాగేశ్వరరావు, డీఈవోలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


