breaking news
Krishna District News
-
వంశీ అనుచరులకు ముందస్తు బెయిల్ మంజూరు
విజయవాడలీగల్: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగా మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ తనపై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ నూతక్కి సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీ, ఆయన అనుచరులపై మాచవరం పోలీసుస్టేషన్లో గత డిసెంబరు నెలలో కేసు నమోదుచేశారు. ఈ కేసులో నిందితులుగా వున్న అనగాని రవి, మూల్పూరి ప్రభుకాంత్, ఓలుపల్లి రంగా, కాట్రు శేషులకు 12వ అదనపు జిల్లా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీని అరెస్టు చేయకుండా ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు కొమ్మా కోట్లు, తేలప్రోలు రాము రిమాండ్ ఖైదీలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. తాజాగా వారికి కూడా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. కాలువలో యువకుడి మృతదేహం లభ్యం పెనమలూరు: పెళ్లి ఇష్టం లేదని బందరు కాలువలో దూకి గల్లంతైన షేక్ నాగుల్‌మీరా మృతదేహం పెదపులిపాక గ్రామ పరిధిలో కాలువలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పడమట దర్శిపేటకు చెందిన షేక్ నాగుల్‌మీరా(23) రాపిడో వాహనం నడుపుతూ జీవిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు అతనికి వివాహం చేయాలని ఈ నెల 16వ తేదీన హనుమాన్‌జంక్షన్ వద్ద మడిచర్ల గ్రామానికి వెళ్లారు.అయితే నాగుల్‌మీరాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. దీంతో అదే రోజు అతను యనమలకుదురులో మిత్రుడి వద్దకు వచ్చి పెళ్లి ఇష్టం లేదని చెప్పి తిరిగి ఇంటికి వెళుతూ పాత పంచాయతీ ఆఫీస్ వద్ద ఉన్న వంతెన వద్ద సెల్‌ఫోన్ బందరు కాలువలో విసిరేసి కాలువలో దూకి గల్లంతయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలించారు. పెదపులిపాక గ్రామ పరిధిలో ఆదివారం కాలువలో నాగుల్‌మీరా మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీకాకుళం(ఘంటసాల): ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శ్రీ ఏకరాతి ప్రసన్న మల్లికార్జున స్వామి ఆలయ పునః నిర్మాణానికి పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన కీ.శే. చెన్నకేశవుల వెంకటేశ్వరరావు – సరస్వతి దంపతుల జ్ఞాపకార్ధం వారి కుమారులు రూ.5 లక్షల విరాళాన్ని సోమవారం కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం శివాలయంలో అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. భారీ విరాళం అందించిన చెన్నకేశవుల నాగమల్లేశ్వరరావు – ఉమామహేశ్వరి, చెన్నకేశవుల నాని – సంధ్యారాణి దంపతులను ఎంపీటీసీ తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), దాసం రామకృష్ణ, కొండవీటి కోటేశ్వరరావు, తమ్మన సోమేశ్వరరావు, మేకా పుల్లయ్య, నవతా రాంబాబు, తమ్మన తాతయ్య, గాజుల సత్యం, గాదె వెంకటేశ్వరరావు తదితరులు దుశ్శాలువాతో సత్కరించారు. -
క్రీడాకారులు ఐక్యత, క్రమశిక్షణ చాటాలి
గుడివాడరూరల్: క్రమశిక్షణ, ఐక్యతను చాటేలా క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలని కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గుడివాడ ఎన్టీఆర్ ప్రాంగణంలో 69వ నేషనల్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 బాలికల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలను గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావ్‌లతో కలసి మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర విద్యా సంస్థలకు చెందిన 27 జట్లు పాల్గొన్నాయి. ర్యాలీగా క్రీడా ప్రాంగణానికి.. తొలుత ఏలూరు రోడ్డులోని హోమియో కళాశాల నుంచి ఎమ్మెల్యే రాము క్రీడాజ్యోతి, క్రీడాకారులు జాతీయ జెండాలను చేతబూని పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి సుభాష్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ బ్యాండ్ మధ్య మార్చ్‌పాస్ట్ చేస్తూ మంత్రి, ఎమ్మెల్యేలు, అధికార, అనధికార ప్రముఖులకు క్రీడాకారులు గౌరవ వందనం చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తొలుత తెలంగాణ–నవోదయ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. పోటీలు ఈనెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. శాప్ చైర్మన్ రవినాయుడు, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ డీఎస్పీ వి.ధీరజ్వినీల్, మునిసిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, డీఈవో సుబ్బారావు, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి భానుమూర్తి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల క్రీడాధికారులు ఝాన్సీలక్ష్మి, కోటేశ్వరరావు పాల్గొన్నారు. పోటీల్లో తొలి రోజు మూడు మ్యాచ్‌లు జరగ్గా.. మొదటి మ్యాచ్‌లో తెలంగాణ, నవోదయ విజ్ఞాన జట్లు తలపడ్డాయి. తెలంగాణ జట్టు 20పాయింట్ల తేడాతో విజయం సాధించింది. 2వ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్‌పై 4పాయింట్ల తేడాతో గెలిచింది. 3వ మ్యాచ్‌లో తమిళనాడు, జార్ఖండ్‌పై 6పాయింట్ల తేడాతో విజయం సాధించింది. -
బెల్టు షాపులు మూయించండి
అవనిగడ్డ: కేవలం మూడు వేల జనాభా ఉన్న గ్రామంలో ఆరు బెల్టుషాపులు ఉన్నాయని, వీటివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, బెల్టు షాపులు మూయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అశ్వరావుపాలెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు దాసినేని శ్రీనివాసరావు సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. అవనిగడ్డ నుంచి అశ్వరావుపాలెం వెళ్లే రహదారిలో, లంకమ్మ మాన్యం వద్ద ఉన్న బెల్టుషాపుల వల్ల స్కూల్, కాలేజీలకు వెళ్లే ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బెల్టు షాపు నిర్వాహకులు మద్యం తాగి రోడ్లపై ఇష్టానుసారంగా సంచరిస్తూ ప్రజలను, రహదారిపై వెళ్లే వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారని, ఈ విషయమై స్థానిక ఎకై ్సజ్ అధికారులకు పలుసార్లు ఫిర్యాదుచేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. బెల్టుషాపులు మూయించి నిర్వాహకులపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దాసినేని శ్రీనివాసరావుతో పాటు కొంతమంది టీడీపీ కార్యకర్తలు, స్థానికులు ఫిర్యాదులో సంతకాలు చేశారు. అశ్వరావుపాలెంలో బెల్టుషాపుల గురించి ఏకంగా టీడీపీ గ్రామ కన్వీనర్ దాసినేని శ్రీనివాసరావు స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. -
ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ లేదు
కోనేరుసెంటర్: ప్రజా సమస్యలను పరిష్కరించటంలో రాజీ పడే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎస్పీ మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి తక్షణమే వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితుల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యలను సామరస్యంగా ఆలకించటంతో పాటు అఽధైర్యపడొద్దు... మీకు మేమున్నామంటూ ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో సిబ్బంది ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే తక్షణమే తన నోటీసులో పెట్టాలని సూచించారు. సమస్య ఎలాంటిదైనా బాధితుల తరఫున పోలీసులు ఉంటారనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలన్నారు. ఆ దిశగా మనమంతా పని చేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించినా బాధితుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు తెలిసినా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో మొత్తం 25 అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రధానమైన అర్జీలు ఇవే... మీకోసంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు -
చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఘంటసాల బౌద్ధ స్థూపం
అంతర్జాతీయ చిత్రకారుడు పద్మశ్రీ ఎస్వీ రామారావు ఘంటసాల: ఘంటసాల గ్రామంలోని బౌద్ధ మహాస్థూపం, శిల్ప సంపదకు ఎంతో ప్రాశస్త్యం ఉందని అంతర్జాతీయ చిత్రకారుడు పద్మశ్రీ ఎస్వీ రామారావు అన్నారు. ఘంటసాల గ్రామంలోని బౌద్ధ మహాస్థూపం, బౌద్ధ మ్యూజియంలోని శిల్ప సంపదను, మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామి వారిని, శ్రీకృష్ణ దేవరాయులు వారి ఆముక్త మాల్యద మండపాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి, నాగార్జున కొండలతో పాటు ఘంటసాల బౌద్ధ మహాస్థూపం, బౌద్ధ శిల్ప సంపదకు ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉందన్నారు. అనంతరం ఎస్వీ రామారావును యువనేత మండలి వెంకట్రామ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, ఎంపీటీసీ తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), అచ్చెంపాలెం సర్పంచ్ గాజుల శ్రీనివాసరావు దుశ్శాలువాతో సత్కరించారు. ఘంటసాల చరిత్ర, శ్రీజలధీశ్వర ఆలయం చరిత్ర పుస్తకాలను అందించారు. -
మిధున్‌రెడ్డికి బెయిల్ షరతుల సడలింపు కోరుతూ పిటీషన్
విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో బెయిల్‌పై వున్న వైఎస్సార్ సీపీ పార్లమెంటు ఫ్లోర్ లీడర్, ఎంపీ మిధున్‌రెడ్డి బెయిల్ షరతుల సడలింపు కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఢిల్లీ పార్లమెంటు హౌస్‌లో మంగళవారం 20వ తేదీన జరిగే ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ సమావేశంలో, ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు బెయిల్ షరతులను సడలింపు కోరుతూ మిధున్‌రెడ్డి తరఫు న్యాయవాది చంద్రగిరి విష్ణువర్ధనరావు సోమవారం ఏసీబీ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఈనెల 23, 26 తేదీలలో విచారణకు సడలింపు కావాలని పిటీషన్లో పేర్కొన్నారు. సిట్ విచారణకు హాజరైన మిధున్‌రెడ్డి సోమవారం నగర పోలీసు కమిషనరేట్‌లోని సిట్ కార్యాలయానికి ఎం.పి మిధున్‌రెడ్డి తన న్యాయవాది చంద్రగిరి విష్ణువర్ధన్తో హాజరయ్యారు. విచారణలో మిధున్‌రెడ్డి విచారణాధికారికి పూర్తిగా సహకరించారు. అనంతరం ఢిల్లీ పర్యటన నిమిత్తం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మద్యం అక్రమ కేసులో బెయిల్ పిటీషన్‌పై విచారణ ఈ కేసులో జైలులో రిమాండ్‌లో ఉన్న అనిల్‌చోక్రా, రోణక్‌కుమార్ పాల్ఘాట్ తరపున న్యాయవాదులు పిట్టల శ్రీనివాస్, విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ ఏసీబీ న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్లు దాఖలు చేశారు. పిటీషన్లపై కౌంటరు దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. అనిల్‌చోక్రా, రోణక్కుమార్ల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు రెండవసారి ఏడు రోజుల కస్టడీ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రాసిక్యూషన్ తరఫు వాదనలు వినిపించారు. న్యాయమూర్తి తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. -
వివాదాలమయం.. ప్రగతి సుదూరం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దుర్గగుడిలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ప్రారంభించిన పలు అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దుర్గగుడి చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిధుల నుంచి రూ. 70 కోట్లను ఆలయ అభివృద్ధికి కేటాయించారు. 2023 డిసెంబర్ 7న దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.216.05 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. రూ.23.14 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇక దశాబ్దాల తరబడి నిర్మాణానికి నోచుకొని మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని సైతం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పునఃనిర్మించింది. 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొండపై కూల్చివేసిన ప్రసాదాల పోటు స్థానంలో పూజా మండపాలు, మహా మండపం ఎదుట అన్నదాన భవనం, గోశాల పక్కనే లడ్డూ ప్రసాదాల పోటు నిర్మాణానికి పూనుకుంది. నాన్చుడు ధోరణి.. ఎన్నికల నాటికి ఓ దశకు చేరుకున్న పనులను పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఏడాదిన్నర దాటినా సరిపోలేదు. పనులు పూర్తి చేయడంలో నాన్చుడు ధోరణిలో వ్యవహారిస్తోంది. ఈ ఏడాది దసరా నాటికి అన్నదాన భవనం, లడ్డూ ప్రసాదాల పోటును సిద్ధం చేసేలా దేవస్థానం కార్యాచరణ సిద్ధం చేసినట్లు ప్రకటిస్తోంది. మరో వైపున 2028 కృష్ణా పుష్కరాల సమయానికి దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులన్నీ పూర్తవుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బహుళ ప్రయోజనాలు.. అమ్మవారి ఆలయం ఎదుట రూ. 26కోట్ల అంచనాలతో నూతన అన్నదాన భవన నిర్మాణం జరుగుతోంది. ఈ నూతన అన్నదాన భవనం గ్రౌండ్ ఫ్లోర్లో స్టోర్స్, అన్న ప్రసాద తయారీకి వంటశాల, ఇతర గదులను నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తులో భక్తులు కూర్చొని భోజనాలు చేసేలా పెద్ద హాల్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే నూతన అన్నదాన భవనం పూర్తయితే మహా మండపంలో ప్రస్తుతం ఉన్న అన్న ప్రసాద వితరణ, భక్తుల క్యూలైన్లను ఇక్కడికి తరలిస్తారు. దీంతో మహా మండపంలోని రెండు, మూడు అంతస్తులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు అంతస్తులలో భక్తులు వేచి ఉండేందుకు హాళ్ల నిర్మాణం చేస్తే బహుళ ప్రయోజనకరంగా ఉండే అవకాశాలున్నాయి. అమ్మవారి సన్నిధిలో ఏడాదిలో ఒకటి, రెండు నెలలు మినహా ప్రతి నెలా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తుల రద్దీతో అటు మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్‌రోడ్డులో రద్దీ నెలకొంటుంది. ఆ రద్దీని నియంత్రించేందుకు మహా మండపంలోని రెండు, మూడు అంతస్తులో హాళ్లను ఏర్పాటు చేయడంతో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయనే అభిప్రాయాలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికంగా భక్తులు.. ఇటీవల దుర్గగుడి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణ రోజుల్లో 40వేల నుంచి 50వేలు, శుక్ర, శని, ఆదివారాల్లో 60వేల నుంచి70వేలు.. పండుగలు, పర్వదినాల్లో 70వేల నుంచి 80వేల మంది అమ్మవారిని దర్శించుకొంటున్నారు. అమ్మవారికి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 15రోజులకు రూ.కోటి నుంచి రూ.1.25కోట్ల ఆదాయం వచ్చేది. తాజాగా సోమవారం జరిగిన హుండీ కానుకల లెక్కింపులో 16 రోజులకు రూ.2.60 కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం భారీగా పెరిగినా భక్తులకు వసతులు కల్పించడంలో దేవదాయశాఖ అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు. భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నారు. వీటిల్లో కొత్త ప్రభుత్వం చాలా పనులు ప్రారంభించలేదు. కొన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయి. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, చేర్పులు అంటూ కాలం వెల్లదీస్తోంది. పనులపై ప్రతి సోమవారం దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సమీక్ష నిర్వహిస్తున్నా ప్రయోజనం శూన్యమనే చెప్పాలి. దుర్గగుడిలో గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పలు వివాదాలు ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దేవస్థానానికి సరఫరా అయ్యే విద్యుత్‌ను నిలిపివేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందనుకునే తరుణంలో అమ్మవారి శ్రీచక్రనవార్చన పూజ అరగంట పాటు నిలిచిపోవడం మరో వివాదం నెలకొంది. అమ్మవారి అభిషేకానికి వినియోగించే పాలలో పురుగు రావడం, దేవస్థానంలో ఉండాల్సిన గోశాలను దేవదాయ శాఖ అనుమతులు లేకుండా పోరంకికి తరలించడం వంటి వరుస వివాదాలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారాలపై వైఎస్సార్ సీపీ నేతలు దేవస్థాన అధికారులను, ట్రస్ట్ బోర్డు సభ్యులను ప్రశ్నించడంతో సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు. పోరంకి నుంచి హుటాహుటిన రెండు గోవులను దేవస్థాన ప్రాంగణంలోని గోశాలకు తరలించి తమ తప్పును సరి చేసుకున్నారు. దీనిపైన విచారణ జరుపుతున్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు కలరింగ్ ఇస్తూ, అందుకు బాధ్యులైన కొంత మంది అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి సరిపెట్టారు. -
విజేఈఈభవ!
రేపటి నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉమ్మడి జిల్లాలో ఐదు కేంద్రాల్లో రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష రాసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా విద్యార్థులు వారి అడ్మిట్ కార్డులో ఉన్న నియమనిబంధనలు ఒకటికి రెండు సార్లు చదువుకోవటం మంచిది. పది మంది పరిశీలకులు పరీక్షను పర్యవేక్షిస్తారు. – జి. బర్నబాస్, పరీక్షల సమన్వయకర్త వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఐఐటీ, ఎన్ఐటీ వంటి దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ –2026కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌ల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కావటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. గొల్లపూడికి చెందిన లైఫ్బ్రిడ్జి ఇన్ఫో టెక్నాలజీస్ (వాసవీ ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్), గవర్నర్‌పేట రామమందిరం రోడ్డులోని ఎస్వీటీ ఇన్ఫోటెక్, కండ్రికలోని ఐకాన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్, కానూరు డొంకరోడ్డులోని శ్రీ విజయదుర్గా ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్, కానూరు గ్రామంలోని ఐకాన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్ పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ పరీక్షకు సుమారుగా 30 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పరీక్ష జరుగుతుంది. -
హైవేపై ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
ఇబ్రహీంపట్నం: సంక్రాంతి పండుగ అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన ప్రజల వాహనాలతో ఇబ్రహీంపట్నంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. తెలంగాణ వైపు ఈనెల 17నుంచి ప్రారంభమైన వాహనాల రద్దీ సోమవారం కూడా కొనసాగింది. ప్రయాణం ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు–మైలవరం మార్గం మీదుగా మళ్లించామని ఆమె తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. రింగ్ సెంటర్లో ట్రాఫిక్ నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ట్రాఫిక్ డీసీపీ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, సీఐ చంద్రశేఖర్, ఆర్ఎస్ఐ బి. లక్ష్మణరావు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అందుతున్న ‘మీ కోసం’ అర్జీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేసీ ఎం. నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి, డీఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి ప్రజాసమస్యల పరిష్కార వేదిక(మీ కోసం)ను నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 75 అర్జీలను తీసుకున్నారు. తొలుత కలెక్టర్ ప్రజాకవి యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, డీఎంఅండ్‌హెచ్‌వో యుగంధర్, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, డీపీవో జె. అరుణ, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, వ్యవసాయ అధికారి పద్మావతి, పౌరసరఫరాల సంస్థ డీఎం శివరాం ప్రసాద్, డీటీడబ్ల్యూవో ఫణిధూర్జటి, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకోవాలి మచిలీపట్నంఅర్బన్: అక్రమ రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య (నాని) కోరారు. సోమవారం మీ కోసంలో కలెక్టర్ డీకే బాలాజీకి వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ సత్రవపాలెం గ్రామానికి చెందిన (లేటు) బుగ్గల గంటయ్యకు రంగారావు, వీరాస్వామి, నాగేశ్వరరావు ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. గంటయ్యకు చెందిన ఆర్ఎస్ నంబర్ 430–3కే లో 0.95 సెంట్ల షెడ్యూల్ ఆస్తి ఉందని, ఆయన ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా మరణించడంతో ఆస్తి ముగ్గురు కుమారులకు వారసత్వంగా వచ్చిందని పేర్కొన్నారు. అయితే, ఆస్తి ఎప్పుడూ విభజన జరగకపోయినా, వీరాస్వామి తనకు పూర్తి హక్కు ఉన్నట్లుగా తప్పుడు వివరాలతో 2025 అక్టోబర్ 3న తన కుమారుడు శివకృష్ణ పేరుపై పార్టిషన్ దస్తావేజును తయారు చేసి, మొగల్తూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు. నిజానికి వీరాస్వామికి ఆస్తిలో కేవలం 1/3 వంతు హక్కు మాత్రమే ఉందని, అయినప్పటికీ మొత్తం 0.95 సెంట్ల భూమి తనదేనన్నట్లు మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కలెక్టర్‌కు వివరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా రిజిస్టరయిన దస్తావేజులను రద్దు చేయడంతో పాటు, బుగ్గల వీరాస్వామి, అతని కుమారుడు శివకృష్ణపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ‘మీ కోసం’లో కలెక్టర్ బాలాజీ -
వక్ఫ్ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి
పెనమలూరు: వక్ఫ్ భూములను ఆక్రమించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిటర్ వక్ఫ్ షేక్ కరీముల్లా బాషా, ఎగ్జిక్యూ టివ్ అధికారి వక్ఫ్ షేక్ షంషుద్దీన్ కోరారు. తాడిగడప గ్రామంలో వక్ఫ్ భూములను సోమవారం వక్ఫ్ అధికారులు పరిశీలించి ఇన్చార్జి తహసీల్దార్ రాజును కలిశారు. వక్ఫ్ భూముల ఆక్రమణల గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా వక్ఫ్ అధికారులు మాట్లాడుతూ కొండపల్లి ఖాజీ సర్వీస్ భూమిలో తాడిగడప, పెదపులిపాక గ్రామమాల్లో సర్వే నంబర్లు 79, 87, 173, 176లలో దాదాపు 43 ఎకరాల సాగు భూమి ఉందని, గత ఏడాది వేసవిలో ఏక్‌సాల్ కౌలు లీజ్ వేలంపాట కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించామన్నారు. తుది ఉత్తర్వులు కోర్టులో విచారణలో ఉన్నాయని, అయితే కొందరు వ్యక్తులు అక్రమంగా వక్ఫ్ భూముల్లోకి ప్రవేశించి సాగుకు నీరు పెడుతున్నారని తెలిపారు. వక్ఫ్ భూముల వద్ద తహసీల్దార్ హెచ్చరిక బోర్డు పెట్టినా ఆక్రమణ దారులు చొరబడుతున్నారని, కోర్టు ధిక్కారం కేసు అవుతుందని తెలిపారు. ఆక్రమణ దారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని తహసీల్దార్‌ను కోరారు. ఈ మేరకు తహసీల్దార్ కూడా చర్యలు తీసుకుంటానని తెలిపారన్నారు. -
ప్రజా కవి యోగి వేమన
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే భాషలో పద్యాలు రాసి ప్రజలను మెప్పించిన ప్రజాకవి యోగి వేమన అని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. వేమన పద్యాలు వినని, తెలియని వారు లేరనడంలో అతిశయోక్తి లేదన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా పోలీస్ కమిషనరేట్‌లో ఆయన చిత్రపటానికి సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగి వేమన తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడని అన్నారు. యోగివేమన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్‌లో 49 ఫిర్యాదులు స్వీకరించారు. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నడవలేని వికలాంగులు, వృద్ధుల వద్దకే వెళ్లి సమస్యను తెలుసుకుని ఫిర్యాదు అందుకున్నారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 25 ఫిర్యాదులు, కుటుంబ కలహాలపై 2, వివిధ మోసాలపై 2, మహిళా సంబంధిత నేరాలపై 2, దొంగతనాలపై 1, కొట్లాటలపై 2, వివిధ సమస్యలపై 15 ఫిర్యాదులు అందాయి. లబ్బీపేట(విజయవాడతూర్పు): పండుగ తిరుగు ప్రయాణం రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, మైలవరం మీదగా మళ్లించినట్లు మళ్లించినట్లు ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం తెలిపారు. దీంతో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారిపై సజావుగా ట్రాఫిక్ కొనసాగుతోందన్నారు. తిరుగు ప్రయాణాల్లో మూడో రోజు కూడా ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సమస్య లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. జి.కొండూరు: ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జి.కొండూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జి.కొండూరులో గుర్తు తెలియని వ్యక్తి(సుమారు 35) ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రధాన రహదారిపై కూర్చున్నాడు. అయితే అదే సమయంలో మైలవరం వైపు నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు కుక్కను తప్పించబోయి రహదారిపై ఉన్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ఒంటిపై చొక్కా లేకపోవడంతో మతిస్థిమితం లేక రహదారిపై తిరుగుతూ ప్రమాదం జరిగిన ప్రదేశంలో కూర్చొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్‌కుమార్ తెలిపారు. పెనమలూరు: కానూరు పప్పులమిల్లు వద్ద రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కానూరు పప్పులమిల్లు వద్ద గుర్తు తెలియని వృద్ధుడు(70) పడిపోయి ఉండటంతో స్థానికుల సమాచారం మేరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న అతను మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని పెనమలూరు పోలీసులు కోరారు. -
క్రీడలతో యువతకు ప్రత్యేక గుర్తింపు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యతో పాటుగా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా యువతకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చెప్పారు. సీతారామ గార్డెన్స్‌లో జరుగుతున్న 51వ జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఫైనల్స్‌లో జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ జట్టు(శాయ్), ఉత్తర ప్రదేశ్ జట్టుపై విజయం సాధించి చాంపియన్ షిప్‌ను కై వసం చేసుకుంది. ముగింపు సభకు బోడే ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కేవీ ప్రభావతి, ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ మాట్లాడుతూ నాలుగు రోజులపాటు సాగిన ఈ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయన్నారు. వివిధ ప్రాంతాల నుంచి 450 మంది కబడ్డీ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభను చూపారన్నారు. ఈ మ్యాచ్‌ల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపిక చేస్తామన్నారు. పారిశ్రామికవేత్త నందమూరి విష్ణువర్థన్ రావు, కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జున్ రావుతో పాటుగా సభ్యులు పాల్గొన్నారు. కబడ్డీ చాంపియన్‌షిప్ ముగింపు సభలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ -
ఖర్చు తడిసి మోపెడవుతోంది..
మినుము పైరు బాగుంది. కాపాడుకునేందుకు ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతోంది. విత్తనాలు కొనుగోలు చేసి, దుక్కు దున్ని, విత్తనాలు చల్లి, వాటిని తడుపుతూ ఉండటంతో పైరు బాగా ఏపుగా పెరిగింది. పచ్చపురుగు ఆశిస్తుండటంతో పురుగుమందు పిచికారి చేస్తున్నా. ఆరుతడి కూడా అంతంతే. ఆరుతడులు ఇస్తూ పంట పండిస్తున్నా తీరా పంట చేతికి వచ్చిన తరువాత మినుము ధర ఎలా ఉంటుందోననే భయం కూడా వెంటాడుతోంది. ఇప్పటికే ధాన్యం ధర గతేడాడాది కంటే బాగా తగ్గింది. –జోగి సుబ్రహ్మణ్యం, బల్లిపర్రు, పెడన మండలం -
వేర్వేరు చోట్ల చికిత్స పొందుతున్న ఇద్దరి మృతి
ఇబ్రహీంపట్నం: వేర్వేరు చోట్ల చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లాకు చెందిన బిజు కేపీ(53) ఎన్టీటీపీఎస్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ఈనెల 14న కొండపల్లికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో బీకాలనీ సెంటర్లో కారు ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని జూపూడిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. అక్కడ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు కేరళలో ఉన్నారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంతో కేరళకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిట్టినగర్‌లో.. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కొత్తపేట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కొత్తపేట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్టినగర్ వలీ వీధికి చెందిన షేక్ సుభాని భార్య, కుమారుడితో ఉంటున్నాడు. సుభానీ ఆటో నడుపుతుంటాడు. ఈ నెల 16న డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన సుభానీ మద్యం తెచ్చుకుని తాగాడు. అదే సమయంలో కుమారుడు కరీముల్లా స్నేహితులతో కలిసి కోడిపందేలు చూడటానికి వెళ్లతానని తండ్రికి చెప్పాడు. చెడు సావాసాలు చేయొద్దని కరీముల్లాను తండ్రి సుభాని మందలించాడు. సాయంత్రం ఇంటి తలుపులన్నీ వేసి ఉండటంతో బాజీ కిటికీ సందులో నుంచి చూడగా, సుభాని లోపల ఫ్యాన్ హుక్కు చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. సుభానీని 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయినట్లు వైద్యులు పేర్కొనడంతో బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. 16 మందికి గాయాలు హనుమాన్‌జంక్షన్‌రూరల్: బాపులపాడు మండలం కానుమోలు వద్ద 216హెచ్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరి గింది. ఉయ్యూరు నుంచి ద్వారకా తిరుమల వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ సహా 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దట్టమైన పొగమంచు రహదారిని కప్పేయడంతో ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించకపోవమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు బలంగా లారీని ఢీకొంది. ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని, క్షతగాత్రులకు సాయం అందించారు. వైద్య సాయానికి బాధితులను గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైళ్లన్నీ కిటకిట.. ప్రయాణం కటకట
● ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా తగ్గని రద్దీ ● జనరల్ కోచ్‌లలో అడుగు పెట్టలేని స్థితి ● ప్రమాదకరంగా ఫుట్‌బోర్డు ప్రయాణం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): జనాలు మళ్లీ పట్నం బాట పట్టారు. సంక్రాంతి పండుగ ముగియడంతో అందరూ తిరుగుపయనమయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి మూడు నుంచి అయిదు రెట్లు అధికంగా వసూళ్ల చేసుకుంటూ ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. పండుగ సమయంలో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని నెలరోజుల నుంచే రిజర్వేషన్లు చేయించుకోవడంతో దాదాపుగా ఆయా మార్గాలలో నడిచే రైళ్లన్నీ ఫుల్ అయ్యి భారీగా వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తోంది. మరికొన్ని రైళ్లలో నోరూమ్ రావడంతో ఊసురుమంటూ ప్రత్యామ్నాయాలను వెతుకుంటున్నారు. కనీసం తత్కాల్ కోటాలో అయినా టికెట్లు దొరుకుతాయేమోనని గంటల తరబడి క్యూలైన్లో నిలుచుంటున్న వారికి తత్కాల్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అయిపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. విజయవాడ మీదుగా 150కి పైగా ప్రత్యేక రైళ్లు.. సంక్రాంతి పండుగ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికులతో ఏపీలోని విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, నర్సాపూర్, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ మీదుగా ఇప్పటికే 150కి పైగా ప్రత్యేక రైళ్ల, జనసాధారణ్ రైళ్ల(అన్‌రిజర్వడ్)ను నడుపుతోంది. తిరుగు ప్రయాణికుల కోసం ఈ రైళ్లను ఈ నెల 21వరకు పొడిగించి నడుపుతున్నారు. వీటిల్లో కూడా అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రమాదకరంగా జనరల్ కోచ్‌లో ప్రయాణం.. రిజర్వేషన్లు దొరకని వారు చేసేది లేక జనరల్ కోచ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో సుమారు వందమంది పట్టే జనరల్ కోచ్‌లో మూడు వందల మంది వరకు ప్రయాణికులు ఎక్కుతుండటంతో అందులో కాలు కదపలేని పరిస్థితి నెలకొంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. దీంతో లగేజీలు, పిల్లలతో ప్రమాదకరమని తెలిసినా కూడా టాయిలెట్లు, ఫుట్‌బోర్డు మెట్ల మీద కుర్చొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. -
ఆరుతడి కోసం పాట్లు
●ఇంజిన్లు, ట్రాక్టర్లతో నీటిని తోడుతూ మినుము పైరును తడుపుతున్న రైతులు ●పురుగు పట్టకుండా గడ్డి మందు పిచికారి ●మినుమును కాపాడుకునేందుకు యత్నం పెడన: ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి రైతులు పాట్లు పడుతున్నారు. రబీలోల రైతన్న ఆరుతడి పంటలను వేసుకున్నాడు. మినుము పైరు బాగా ఏపుగా ఉండటంతో దాన్ని కాపాడుకునేందుకు మరింత అగచాట్లు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. కారణం ఆరు‘తడి’ కూడా లేని పరిస్థితులు నెలకొనడమే. ఆయా కాలువల్లో అడుగునీరు, మురుగు కాలువల్లో ప్రవహిస్తున్న స్వీట్‌వాటర్, పంచాయతీ చెరువుల్లోని నీటిని తోడుకుంటూ మినుము పైరును కాపాడుకునే ప్రయత్నాల్లో రైతన్నలున్నారు. ఆయిల్ ఇంజిన్ల అద్దె భారం అయిల్ ఇంజిన్ల కోసం రోజుకు రూ.వెయ్యికి పైనే అద్దె చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మరికొందరు ట్రాక్టర్లకు మోటారు ఇంజిన్లు ఏర్పాటు చేసి నీటిని తోడుకుంటున్నారు. నలుగురైదుగురు రైతులు వారి పంటలకు ఒక మోటారు ద్వారా తడుపుకొనేలా చూసుకుంటున్నారు. ఎక్కడో దూరంగా ఉన్న కాలువలోని నీటినిగానీ, చెరువులో నీటినిగానీ తోడుకోవాల్సి వస్తే అదనంగా పైపునకు సైతం కిరాయి రూ.వెయ్యికి పైగా చెల్లించాల్సిందే. మరికొందరు స్పేయర్లు ద్వారా నీటిని పోసి తడుపుతున్నారు. స్ప్రేయర్లకు సైతం బాగా గిరాకీ ఏర్పడటంతో డిమాండ్ పెరిగింది. మినుము పైరుపై చీడ పురుగులు, ఎలుకల దాడి మినుము పైరు ఆశాజనకంగా ఉందనకుంటున్న తరుణంలో రైతుకు పచ్చపురుగు, లద్దె పురుగు వంటి తదితర చీడ పురుగులతో పాటు మాడుతెగులు, బూజు తెగులు వంటివి సోకుతాయనే భయం రైతులను వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రైతులు మినుము పైరుకు గడ్డిమందు పిచికారి చేస్తున్నాడు. ఒకసారి పిచికారీ చేసినందుకు రూ.1,500 నుంచి రూ.2 వేలు వరకు ఖర్చు పెడుతున్నారు. మినుము చేతికి వచ్చే వరకు తెగుళ్లు, పురుగులు ఆశించకుండా ఏడు లేదా ఎనిమిది సార్లు పురుగు మందులను పిచికారి చేయాలని రైతులు పేర్కొనడం విశేషం. కొన్ని చోట్ల ఎలుకల బెడద విపరీతంగా ఉండటంతో పొలాల్లో బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలుక చిక్కితే ఒక్కోదానికి రూ.25 చెల్లించేలా రైతులు బోన్లు ఏర్పాటు చేసిన వారితో ఒప్పందం చేసుకుని ఎలుకల బెడద నిలువరించు కుంటున్నారు. -
రాహు కేతు పూజలకు పోటెత్తిన భక్తులు
పెదకాకాని: శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో రాహుకేతు పూజలు జరిపించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం మౌళి అమావాస్య పురస్కరించుకుని పెదకాకాని శివాలయంలో రాహు కేతు పూజలు భక్తులు అధిక సంఖ్యలో జరిపించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం రాహుకాలం 4.30 గంటల వరకూ 1,276 టికెట్లు విక్రయించినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. రాహు కేతు పూజల ద్వారా ఆదివారం రూ.6,38,000 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు, పాలు, తాగునీరు భక్తులకు అందించినట్లు లీలాకుమార్ తెలిపారు. అలానే ఆదివారం ఆలయంలో అంతరాలయ అభిషేకాలు, అంతరాలయ దర్శనాలు, వాహనపూజలు, అన్నప్రాసనలు, నవగ్రహ పూజలు అధికసంఖ్యలో జరిగాయి. అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులందరికీ అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. -
కిక్కిరిసిన బస్టాండ్
బస్టాండ్(విజయవాడ పశ్చిమ): విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ ప్రయాణికులతో కిట కిటలాడింది. సెలవులు ముగియటంతో తమ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు ఆదివారం పెద్ద సంఖ్యలో బస్టాండ్‌కు చేరుకున్నారు. దీంతో బస్టాండ్‌లోని ప్లాట్ఫారంలలో పెద్ద సంఖ్యలో రద్దీ నెలకొంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విశాఖ పట్నం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ అధికారులు 680 ప్రత్యేక బస్సులను కేటాయించారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహకులు ప్రయాణికుల అవసరాలను గుర్తించి తమ చేతివాటంను ప్రదర్శిస్తూ సాధారణ రేట్లపై 4నుంచి 5శాతం అదనంగా వసూళ్లు చేస్తుండటంతో ప్రయాణికులు ఆర్టీసీ వైపు మొగ్గుచూపారు. హైదరాబాద్ రూట్లో నిత్యం ప్రయాణించే బస్సులకు అదనంగా 182, విశాఖపట్నం రూట్లో 370, రాయలసీమ ప్రాంతాలకు 128 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడిపేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
ఆగిన ఫాస్టాగ్..
కీసర(కంచికచర్ల): కంచికచర్ల మండలం కీసర స్వర్ణ టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాలు బారులుదీరాయి. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్లే వాహనాలన్నీ ప్లాజా వద్ద కొంతసేపు ఆగాయి. ఫాస్టాగ్ సిస్టం రెండు లైయిన్ల వద్ద కొంత ఆలస్యం కావటంతో వాహనాలు బారులుదీరాయి. అనంతరం అంతా సజావుగా సాగింది. టోల్‌ప్లాజా వద్ద వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని.. వారి ప్రయాణానికి ఆటంకం కలుగకుండా ఐదు ఫాస్టాగ్ లైన్లను ఏర్పాటు చేసినట్లు ప్లాజా మేనేజర్ జయ ప్రకాష్, సెక్యూరిటీ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. -
తిరుగు ప్రయాణాల రద్దీ
●సమస్యలు తలెత్తకుండా చర్యలు ●ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం లబ్బీపేట(విజయవాడతూర్పు)/ఇబ్రహీంపట్నం: ‘సంక్రాంతికి హైదరాబాద్ నుంచి వచ్చిన వారు తిరుగు ప్రయాణంతో తీవ్రమైన రద్దీ ఏర్పడు తోంది. వేలాది వాహనాలు ఒక్కసారిగా ఒకేవైపు ప్రయాణించడంతో పలు కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇబ్రహీంపట్నంలో సమస్య ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ సమస్య ఎదురుకాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు’ ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం చెప్పారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాలతో జిల్లాలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రియల్‌టైమ్ డేటా వినియోగం, డ్రోన్లతో లైవ్ డేటా అంచనా వేసినట్లు తెలిపారు. పర్యవేక్షణ.. సమగ్ర చర్యలతో శనివారం విపరీతమైన వాహన రద్దీ ఉన్నా నియంత్రించామన్నారు. రెండో రోజూ రద్దీ తిరుగు ప్రయాణాల కారణంగా వాహనాల రద్దీ ఆదివారం కూడా కొనసాగుతున్నట్లు డీసీపీ షిరీన్ బేగం తెలిపారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలో నేషనల్ హైవేపై కొంతమేర ట్రాఫిక్ ఒత్తిడి ఏర్పడుతోందన్నారు. హెవీ వాహనాలను రద్దీ లేని (నాన్–పీక్) సమయాల్లో మాత్రమే విజయవాడ దాటేలా ప్రణాళిక చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారన్నారు. -
గండాలయ స్వామికి ప్రత్యేక పూజలు
మంగళగిరి టౌన్: మంగళగిరి కొండపై ఉన్న శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి కొండపైన ఉన్న గండాలయ స్వామి వారికి అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు నూనె సమర్పించి దీపాలు వెలగించారు. గండాలు రాకుండా స్వామి వారి రక్షణ కోరారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు కొండ మెట్ల మార్గంలోను, ఎయిమ్స్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న కొండ ఘాట్‌రోడ్ మార్గం ద్వారా స్వామిని చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు అన్నదానం మంగళగిరి పట్టణంలోని శివాలయం వద్ద అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం భక్తులకు అన్నదానం నిర్వహించారు. పలువురు ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగుతోందని, గత మూడేళ్లుగా ప్రతి అమావాస్య రోజున అన్నదానం చేస్తున్నామని చెప్పారు. సుమారు 4 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. 40 మంది దాతల సహకారం అందించారన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సాంబశివరావు, సభ్యులు శివసత్యనారాయణ, ప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
25న రాజ్యాంగం.. సవాళ్లుపై జాతీయ సదస్సు
కృష్ణలంక(విజయవాడతూర్పు): గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 25న జనవిజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర కమిటీ, ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలూ) ఆధ్వర్యాన భారత రాజ్యాంగం–సవాళ్లు అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవరావు పేర్కొన్నారు. గవర్నర్‌పేట రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవరావు మాట్లాడుతూ లాయర్లు, ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులు రాజ్యాంగ ప్రాధాన్యం, గొప్పదనాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు తెలియజేసి అవగాహన పెంపొందింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న సదస్సులో భారత రాజ్యాంగం–లౌకికవాదంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, భారత రాజ్యాంగం–ప్రజాస్వామ్య హక్కులుపై ఐలూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, భారత రాజ్యాంగం–ఫెడరలిజంపై ప్రొఫెసర్ చక్కా బెనర్జీ, శాసీ్త్రయ దృక్పథం–రాజ్యాంగంపై మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం ఉపన్యసిస్తారని తెలిపారు. సమావేశంలో జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఏయూ పూర్వ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోటేశ్వరరావు, జేవీవీ కార్యదర్శి బోయి రవి తదితరులు పాల్గొన్నారు. -
ఎంతకై నా తెగిస్తారు..
మద్యం, గంజాయి తాగిన వారి మెదడులో డొపమిన్ అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది. అది వారి మెదడుకి హాయినిస్తుంది. అందుకే మళ్లీ, మళ్లీ తాగాలని చూస్తారు. అందుకోసం దేనికై నా తెగిస్తారు. డబ్బుల కోసం తల్లిదండ్రులపై దాడులు చేసేందుకు కూడా వెనుకాడరు. ఇప్పుడు జరుగుతున్న దాడులన్నీ అలాంటివే. వారి ప్రవర్తనలో మార్పుకోసం కౌన్సెలింగ్, మెడిటేషన్, జీవనశైలి మార్పులు వంటివి చేసుకోవాల్సి ఉంటుంది. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్ -
ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు
● ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూస్తున్న వరుస ఘటనలు ● మాటామాటా పెరిగి హత్యలు ● మద్యం కొనుగోలుకు రూ.10 ఇవ్వలేదని హతమార్చిన వైనం ● రౌడీషీటర్లపై పనిచేయని పోలీసు హెచ్చరికలు ● సంక్రాంతి పండుగ నేపథ్యంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు ● గంజాయి అమ్మకాల్లో రౌడీ షీటర్లది కీలక పాత్ర సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటోంది. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిశాయి. మద్యం మత్తులో మందుబాబులు తెగబడుతున్నారు. వీరంగం సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో జరుగుతున్న దాడుల్లో రౌడీషీటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పోలీసులు వారం వారం స్టేషన్‌కు పిలిపించి, హెచ్చరికలు జారీ చేస్తున్నా.. కొంత మంది పద్ధతుల్లో మార్పు రావటం లేదు. మద్యం మత్తులో.. క్షణికావేశంలో ఏకంగా ప్రాణాలనే తీస్తున్నారు. యువకులను మత్తుకు బానిసలుగా చేస్తూ.. మద్యం మత్తుకు తోడు రౌడీషీటర్లకు, గంజాయికి విడదీయరాని బంధం పెనవేసుకుంది. కొంత మంది గంజాయిని ఆదాయ వనరుగా మార్చుకొని గ్యాంగ్‌లను పోషిస్తున్నారు. విజయవాడలో 470 మంది రౌడీషీటర్లు, 350 మంది సస్పెక్ట్ షీటర్లు ఉన్నారు. 130 మంది క్రియాశీలకంగా ఉంటూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 55 మందిపైన నగర బహిష్కరణ విధించారు. వీరిలో పలువురు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తెప్పించి, నగరంలో ఆదాయం పొందుతున్నారు. కొంత మంది రౌడీషీటర్లు ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో గంజాయి కొని తెచ్చి నగరంలో విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. వీరు తమ అనుచరులతో కలిసి విద్యార్థులు, పనులు చేసుకొనే యువకులను గుర్తించి వారికి గంజాయి సరఫరా చేసి బానిసలుగా మార్చుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్డర్లు తీసుకొంటూ వివిధ ప్రాంతాల్లో గంజాయి ప్యాకెట్లు అందించిన ఘటనలు ఉన్నాయి. నగర బహిష్కరణకు గురైన రౌడీషీటర్లు పోలీసులకు చిక్క కుండా కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోకి వచ్చే శివారు ప్రాంతాల్లో మకాం వేసి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కండ్రికలోని ఓ బార్లో జరిగిన దాడిలో గాయపడిన యువకుడు(ఫైల్) జగ్గయ్యపేటలో బీరు సీసా తో పొడవడంతో మృతి చెందిన నవీన్(ఫైల్) ఈ నెల 11వ తేదీన వీరులపాడు మండల పరిధి జుజ్జూరు గ్రామంలో రాత్రి 11గంటల సమయంలో నందిగామ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు కొమ్మూరు శేషు, అతని అనుచరులు ఫుల్‌గా మద్యం తాగి.. వైఎస్సార్ సీపీకి చెందిన షేక్ ఫయాజ్, అతని భార్య సల్మా, కుమారులు అయాన్, ఆర్యన్లపై విచక్షణారహితంగా దాడి చేశారు. విజయవాడ కేదారేశ్వరపేట 8వ లైన్ ఎర్రకట్ట ప్రాంతానికి చెందిన ధర్మవరపు మోహ న్ కుమార్(24) ఓ పార్సిల్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఈనెల 15వ తేదీ సంక్రాంతి కావడంతో ప్రభాస్ కాలేజీ వద్ద ఉన్న మాధురి బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. కౌంటర్లో పార్సిల్ తీసుకుంటుండగా అయోధ్య నగర్ ప్రాంతానికి చెందిన రాము, సాల్మన్ అనే వ్యక్తులు మోహన్ తలపై బీరు బాటిల్‌తో బలంగా కొట్టారు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానిక వ్యక్తులపై కూడా రాము, సాల్మన్లు దాడి చేశారు. నున్న రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్రిక సమీపంలో ఉన్న పల్స్ బార్లో మూడు రోజుల క్రితం మద్యం బాబుల మధ్య వివాదం జరిగింది. శాంతినగర్, కండ్రిక ప్రాంతాలకు చెందిన యువకులు బార్లో బీరు సీసాలతో దాడులు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. -
రసవత్తరంగా సాఫ్ట్ టెన్నిస్ లీగ్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో ఏపీ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సౌత్ జోన్ అస్మిత ఖేలో ఇండియా సాఫ్ట్ టెన్నిస్ మహిళల లీగ్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్ విభాగంలో సింగిల్స్, డబుల్స్ పోటీలు ఆదివారం జరిగాయి. సబ్ జూనియర్ సింగిల్స్ విభాగంలో శ్రీమతి (తమిళనాడు) చాంపియన్‌గా నిలిచింది. ఏఎస్ వైశాలి (ఆంధ్రప్రదేశ్) ద్వితీయ, రీత్యా (తమిళనాడు) తృతీయ స్థానాల్లో నిలిచారు. సబ్ జూనియర్ డబుల్స్ విభాగంలో మొదటి సెమీ ఫైనల్లో సన్మాతి, రీత్యా (తమిళనాడు) జోడిపై 0–3 తేడాతో శ్రీమతి, అనిల (తమిళనాడు) జోడి విజయం సాధించారు. రెండో సెమీ ఫైనల్లో కనిష్ఠ, మధు (తమిళనాడు)జోడిపై 1–3 తేడాతో శృతిలయ, రిషిక (తమిళనాడు) జోడి గెలుపొందారు. జూనియర్స్ డబుల్స్ విభాగంలో మొదటి సెమీ ఫైనల్లో జానిని, అక్షిత (తమిళనాడు) జోడిపై 0–3 తేడాతో నిషాలిని, తమిళ్వజి (తమిళనాడు) గెలుపొందారు. రెండో సెమీ ఫైనల్స్‌లో ధరణి, తహ (కర్ణాటక) జోడిపై 2–3 తేడాతో సాధన, నరుమూగయ్ (తమిళనాడు) విజయం సాధించారు. సీనియర్ డబల్స్ విభాగంలో మొదటి సెమీ ఫైనల్స్ సోనికా, నిధి (కర్ణాటక) జోడిపై 0–3 తేడాతో రాగశ్రీ, శ్వేత (తమిళనాడు) విజయం సాధించగా రెండవ సెమీ ఫైనల్స్ లో పూర్వ, శ్రీమతి (తమిళనాడు) జోడిపై 0–3 తేడాతో శరణ్య, అమృతల జోడి గెలుపొందారు. సోమవారం డబుల్స్ విభాగంలో ఫైనల్స్ జరుగుతాయని అనంతరం లీగ్ ముగింపు సభ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. -
తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారిని ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సెలవు దినంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. వేకువ జాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం చుట్టూ అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేదదీరారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కాకినాడ టౌన్–మైసూర్ (07033) ఫిబ్రవరి రెండు నుంచి అదే నెల 27వ తేదీ వరకు ప్రతి సోమ, శుక్రవారాలు, మైసూర్– కాకినాడ టౌన్ (07034) ఫిబ్రవరి మూడు నుంచి 28 వరకు ప్రతి మంగళ, శనివారం ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. నర్సాపూర్–ఎస్ఎంవీటీ బెంగళూరు (07153) ఫిబ్రవరి ఆరు నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం, ఎస్ఎంవీటీ బెంగళూరు–నర్సాపూర్ (07154) ఫిబ్రవరి ఏడు నుంచి 28 వరకు ప్రతి శనివారం, హైదరాబాద్–బెలగావి (07043) ఫిబ్రవరి ఐదు నుంచి 12 వరకు ప్రతి గురువారం, బెలగావి– హైదరాబాద్ (07044) ఫిబ్రవరి ఆరు నుంచి 13 వరకు ప్రతి శుక్రవారం, సంత్రగచ్చి– యలహంక (02863) జనవరి 22 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతి గురువారం, యలహంక–సంత్రగచ్చి (02864) జనవరి 24 నుంచి 28 వరకు ప్రతి శనివారం, షాలీమార్–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (02841) ఫిబ్రవరి రెండు నుంచి 23 వరకు, ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (02842) ఫిబ్రవరి నాలుగు నుంచి 25 వరకు ప్రతి బుధవారం నడవనున్నాయి. వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష (ఏఐఎస్ఎస్ఈఈ) ఆదివారం ప్రశాంతంగా జరిగినట్లు స్థానిక పరీక్ష సమన్వయకర్త జి. బర్నబాస్ పేర్కొన్నారు. నగరంతో పాటుగా సరిహద్దు ప్రాంతాల్లోని మూడు కేంద్రాల్లో ఆదివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించారు. నగరంలోని పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (కొత్తపేట), చిట్టూరి విద్యాలయం (గొల్లపూడి), వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ (నున్న) కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. ఆరో తరగతి ప్రవేశానికి 943 మంది విద్యార్థులు రిజిస్టర్ కాగా అందులో 796 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే తొమ్మిదో తరగతి ప్రవేశానికి 343 మంది రిజిస్టర్‌గా కాగా అందులో 272 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు 84.38 శాతం, తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్షకు 79.24 శాతం హాజరైనట్లు బర్నబాస్ తెలిపారు. జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని రంగుల మండపంలో కొలువై ఉన్న గోపయ్య సమేత శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి దర్శనాలు, ప్రసాదాల పంపిణీ, రంగుల మహోత్సవ వివరాలను ఉత్సవ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి తిరుగు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో రంగుల మహోత్సవాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు. అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, తహసీల్దార్ మనోహర్, కమిటీ సభ్యులు కాకులపాటి కృష్ణమోహన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్జిత సేవలకు డిమాండ్.. రద్దీ సాధారణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చొల్లంగి అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరిగిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన రెండు షిఫ్టుల్లో మొత్తం 30 మందికి పైగా ఉభయదాతలు పూజలో పాల్గొన్నారు. తొలుత అమ్మవారికి జరిగిన సుప్రభాత సేవలో 18 మంది పాల్గొన్నారు. ఇక నూతన పూజా మండపంలో జరిగిన లక్ష కుంకుమార్చనలో 23మంది ఉభయదాతలు, శ్రీచక్రనవార్చనలో 12 మంది ఉభయదాతలు, చండీహోమంలో 227 ప్రత్యేక్షంగాను, 71 పరోక్షంగా జరిపించుకున్నారు. గణపతి హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, శాంతి హోమాలలోనూ ఉభయదాతలు పాల్గొన్నారు. రద్దీ సాధారణం.. ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. తెల్లవారుజామున కొద్దిగా రద్దీ ఉండటంతో గత మూడు రోజుల పరిస్థితే నెలకుంటుందని ఆలయ అధికారులు భావించారు. ఉదయం 9 గంటల కల్లా ఆలయ అధికారులు, సిబ్బంది ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక విధులకు హాజరయ్యారు. అయితే 10 గంటల తర్వాత కూడా రద్దీ అంతంత మాత్రంగా ఉండటంతో సంక్రాంతి రద్దీ ముగిసిందని ఆలయ అధికారులు భావించారు. సిఫార్సులపై వచ్చే వారిని సైతం రూ. 500 టికెట్లు ఇచ్చి వీఐపీ దర్శనం కల్పించారు. అయితే కొంత మంది మాత్రం ప్రముఖుల సిఫార్సులతో అమ్మవారి దర్శనానికి వచ్చామని, టికెట్లు కొనుగోలు ఎందుకు కొనుగోలు చేయాలని ఆలయ సిబ్బందిని ప్రశ్నించించడం కనిపించింది. వీఐపీలైనా రూ. 500 టికెట్లు కొనుగోలు చేయాల్సిందేనని ఆలయ అధికారులు, సిబ్బంది పేర్కొనడం కనిపించింది. లోక కల్యాణార్థం సూర్యోపాసన సేవ.. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవను ఆలయ అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. సూర్యోపాసన సేవ 9 గంటలకు ప్రారంభం కాగా 10.20 గంటల వరకు స్వామి వారి అలంకరణకు అవసరమైన పూలను తీసుకురాకపోవడంతో ఆలయ ఈవో శీనానాయక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జిల్లా ప్రగతిని వివరించేలా శకటాల రూపకల్పన
అధికారులకు కలెక్టర్ బాలాజీ ఆదేశం చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రగతిని వివరించేలా శకటాల రూపకల్పన చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో గణతంత్ర దినోత్సవంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ, సంక్షేమ, అభివృద్ధి పథకాలు, జిల్లా ప్రగతిని వివరించేలా శకటాలను రూపొందించటంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్, పేదరిక నిర్మూలన, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, నీటి నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి, కలంకారీ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సంక్రాంతి రద్దీ శనివారం కూడా కొనసాగింది. సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. సర్వ దర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు ఆయా క్యూలైన్ల ద్వారా ప్రధాన ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. మరో వైపున వీఐపీలు, బంధువులు, సిఫార్సులపై వచ్చే భక్తులు, యాత్రికులందరికీ రూ.500 టికెట్లను కొనుగోలు చేయాల్సిందిగా దేవస్థాన అధికారులు మైక్‌లో ప్రచారం చేయించారు. టికెట్లు కొనుగోలు చేయని వారికి రూ.100, రూ.300 క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతించారు. ఉదయం 10 గంటల తర్వాత రద్దీ మరింత అధికం కావడంతో ఆలయ అధికారులు స్కానింగ్ పాయింట్ వద్ద పలువురు అధికారులకు ప్రత్యేక విధులను కేటాయించారు. రద్దీతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన తర్వాత కూడా రద్దీ కొనసాగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతులు, పల్లకీ సేవ, దర్బారు సేవలోనూ రద్దీ కనిపించింది. దుర్గమ్మను దర్శించుకున్న కొరియోగ్రాఫర్ శేఖర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన శేఖర్‌కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందించారు. రేపు కానుకల లెక్కింపు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులు, ముడుపులను ఈనెల 19వ తేదీన లెక్కించనున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో సోమవారం ఉదయం 7 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు -
నాన్న ఇంత దారుణానికి పాల్పడతాడనుకోలేదు
పెనమలూరు: తల్లిని తమ తండ్రి చంపటం జీర్ణించుకోలేక పోతున్నామని, తమ తండ్రికి కచ్చితంగా శిక్ష పడాలని మృతురాలు రేణుకాదేవి కుమార్తె, కుమారుడు ముక్కామల తేజశ్రీ, ముక్కామల నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పోరంకిలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి ముక్కామల ప్రసాద్ చౌదరి ఆకునూరు ఝాన్సీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తమ తల్లి అడ్డుగా ఉందని పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు. తమ పట్ల తండ్రి కపటప్రేమ చూపాడని, తల్లి పేరున ఉన్న ఇంటిని నమ్మకంగా తన పేరున రాయించుకున్నాడని అన్నారు. తమ తండ్రి ఇంత దారుణానికి ఒడికడతాడని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. సెల్‌ఫోన్ డేటా ఆధారంగానే తల్లి హత్య ఉదంతం వెలుగు చూసిందని అన్నారు. హత్య వెనుక పలువురు వ్యక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు ఉన్నాయని దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని కోరారు. నన్ను కూడా చంపాలని చూశారు... తన తండ్రి ప్రసాద్‌చౌదరి, ఆయనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఝాన్సీ తనను కూడా హత్య చేయాలని చూశారని మృతురాలి కుమారుడు నాగేష్ ఆరోపించారు. తనకు ఇష్టం లేకపోయినా తనను యూకేకు బలవంతంగా పంపారని, తనను యూకేలోనే చంపాలని పథకం వేశారని అన్నారు. తాను యూకేకు వెళ్లిన 25 రోజుల్లోనే తల్లిని హత్య చేశారని చెప్పారు. దీంతో తాను ఇండియాకు వచ్చానన్నారు. ఇంత దారుణానికి పాల్పడిన తండ్రి ప్రసాద్‌చౌదరి, ఝాన్సీలకు శిక్షపడాలని అన్నారు. రసవత్తరంగా కబడ్డీ పోటీలు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సీతారామ గార్డెన్స్ ఆవరణలో జరుగుతున్న 51వ జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా శనివారం ప్రీ–క్వార్టర్ ఫైనల్ పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. తొలుత కబడ్డీ క్రీడాకారులను రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ అడిషనల్ డైరెక్టర్ కె.రాజేంద్రప్రసాద్ పరిచయం చేసుకుని పోటీలను వీక్షించారు. శనివారం సాయంత్రం జరిగిన ప్రీ–క్వార్టర్ ఫైనల్ పోటీల్లో హర్యానా టీమ్ 58 పాయింట్లు సాధించగా ఆంధ్ర జట్టు కేవలం 27 పాయింట్లు సాధించి పరాజయం పాలైంది. చండీఘర్, మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన పోటీలో చండీఘర్ జట్టు–52, మధ్యప్రదేశ్ జట్టు–40 పాయింట్లు సాధించగా చండీఘర్ జట్టు విజయం సాధించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్–73 పాయింట్లు సాధించగా పంజాబ్ కేవలం 30 పాయింట్లు మాత్రమే సాధించి ఓటమి పాలైంది. చత్తీస్ఘడ్, ఉత్తరాంచల్ జట్ల మధ్య జరిగిన రసవత్తర పోటీలో చత్తీస్ఘడ్–51, ఉత్తరాంచల్–50 పాయింట్లు సాధించాయి. ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఛత్తీస్‌ఘడ్ విజయాన్ని కై వసం చేసుకుంది. గోవా, కర్ణాటక జట్ల మధ్య, తమిళనాడు, మహారాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్‌లు కూడా రసవత్తరంగా జరిగాయి. 22 నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి 26వ వరకు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు శనివారం బ్రహ్మోత్సవ వివరాలు వెల్లడించారు. ఈనెల 22వ తేదీ మాఘ శుద్ధ చవితి గురువారము ఉదయం 11 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరిస్తారని తెలిపారు. అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు శేషవాహనంపై రావివారిపాలెం గ్రామం వరకు గ్రామోత్సవము, రాత్రి 7 గంటలకు ఎదురుకోలు ఉత్సవం, రాత్రి 8 గంటలకు స్వామివారి దివ్య కల్యాణ మహోత్సం జరుగుతాయని తెలిపారు. అనంతరం నంది వాహనముపై గ్రామోత్సవం నిర్వహిస్తారన్నారు. 24వ తేదీ రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారి రథోత్సవం, 26వ తేదీ రాత్రి 7 గంటలకు స్థానిక పుష్కరిణిలో శ్రీస్వామివార్ల తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు దేవాలయంలో నిత్య ఆర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. -
ఏవి తల్లీ... నాడు వెలిగిన కళాకాంతులు..!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కూచిపూడి, భరతనాట్యం, గాత్ర కచేరీ, సంగీత కచేరీలతో ఒకప్పుడు కళకళలాడిన దుర్గగుడి కళావేదిక నేడు కళాప్రదర్శనలు లేక వెలవెలబోతోంది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలోని రాజగోపురం ఎదుట దేవస్థానం కళాకారుల ప్రదర్శనల కోసం కళావేదికను ఏర్పాటు చేసింది. గత ఏడాదిలో నెలకు దాదాపు 20 రోజుల పాటు కళాకారుల ప్రదర్శనలతో నిత్య కల్యాణం... పచ్చతోరణంలా కళావేదిక వెలిగిపోయేది. ఈ ఏడాది తెలుగు వారి పెద్ద పండుగైన సంక్రాంతి పర్వదినాన సైతం కనీసం కళా ప్రదర్శనలు లేకుండా పోయాయి. అయితే ఏడాది కాలంలో దుర్గగుడి అధికారులు కళాకారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుతో కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వారంలో ఒకటి, రెండు రోజులు మినహా కళాప్రదర్శనలు జరిగేది. కొంతకాలం తర్వాత కేవలం భక్తుల రద్దీ అధికంగా ఉండే శుక్ర , శని, ఆదివారాలు మాత్రమే కళాప్రదర్శనలకు అనుమతించారు. ఇప్పుడు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కళా ప్రదర్శన చూడటమే గగనమైందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కళావేదిక అంటే కళా ప్రదర్శనల కోసం కాకుండా కేవలం నెలలో ఒక సారి జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి కల్యాణం కోసమే అన్నట్టుగా ఉందని భక్తులు అంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం... అమ్మవారి ఆలయంలో తమ కళలను ప్రదర్శించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబయి, ఢిల్లీ, ఒడిశాల నుంచి సైతం కళాకారులు దరఖాస్తు చేసుకుంటారు. అమ్మవారి సన్నిధిలో కళాప్రదర్శన ఇవ్వడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకునే చిన్నారులు తాము గజ్జెలు కట్టిన తర్వాత తొలిసారిగా అమ్మవారి సన్నిధిలో కళాప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాకారులకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం తమకు నామమాత్రంగా ఇచ్చే పారితోషికం ఇవ్వకపోయినా, ఉచితంగా అయినా అమ్మవారి సన్నిధిలో కళా ప్రదర్శన ఇచ్చేందుకు అనేక మంది కళాకారులు ముందుకు వస్తున్నారు. మరో వైపున ఆలయ ప్రాంగణంలోని కళావేదికను కొండ కిందకు తరలించాలని దేవదాయ శాఖలోని ముఖ్య అధికారి దుర్గగుడి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దసరా ఉత్సవాల అనంతరం లక్షలాది రూపాయలు వెచ్చించి కళావేదికకు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. కనీసం మరమ్మతులు చేసిన బిల్లు కూడా ఇంకా చెల్లింపులు అవకుండా కళావేదికను తొలగించాలని చూడటం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. అమ్మవారి సన్నిధిలో కళావేదిక కొనసాగిస్తారో లేక కొండ దిగువకు తరలిస్తారో వేచి చూడాలి. -
తీరం పొడవునా భారీ కోత
కోడూరు: హంసలదీవి సాగరతీరం పొడవునా భారీ కోత ఏర్పడింది. పాలకాయతిప్ప బీచ్ నుంచి హంసలదీవి సాగరసంగమం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఇసుకతిన్నెలు కోతకు గురయ్యాయి. గతంలో కేవలం సంగమ ప్రాంతంలో మాత్రమే కోత ఉండగా, ప్రస్తుతం బీచ్ వద్ద కూడా కోత ఏర్పడడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. సముద్ర రహదారికి సమాంతరంగా ఈ కోత ఏర్పడింది. సముద్రాన్ని, తీరం ఒడ్డును వేరు చేస్తున్నట్లు ఈ కోత సుమారు మూడు అడుగుల మేర ఉంది. ఇటీవల తుపాన్ల సమయంలో కొంతమేర కోత ఏర్పడిందని, క్రమేణా పెరుగుతూ కోత రహదారి అంచును తాకిందని స్థానిక మత్స్యకారులు తెలిపారు. సంగమం వద్ద కృష్ణమ్మ పాదాలు, విగ్రహం చుట్టూ కూడా ఇసుకతిన్నెలు భారీగా కోతకు గురయ్యాయి. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి ఏలూరుకు చెందిన వేములపల్లి సతీష్ చౌదరి కుటుంబం శని వారం రూ.1,01,116 విరాళం సమర్పించింది. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో సౌత్ జోన్ అస్మిత ఖేలో ఇండియా సాఫ్ట్ టెన్నిస్ మహిళల లీగ్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రీడాకారులు సత్తాచాటారు. జూనియర్ సింగిల్స్ విభా గంలో నరుమూగయ్ (తమిళనాడు), సీనియర్ సింగిల్స్ విభాగంలో రాగశ్రీ (తమిళనాడు) చాంపియన్లుగా నిలిచారు. జూనియర్ విభాగంలో శ్వేత (తమిళనాడు) ద్వితీయ, సోనికా (కర్ణాటక), సంజూ (తమిళనాడు) తృతీయ స్థానాలను సొంతం చేసుకున్నారు. సీనియర్ విభాగంలో షాలిని (తమిళనాడు) ద్వితీయ, యాజిని (తమిళనాడు), సాధన (తమిళనాడు) తృతీయ స్థానాలను సాధించారు. జూనియర్ విభాగంలో మొదటి సెమీ ఫైనల్స్‌లో యాజిని (తమిళనాడు)పై 1–3 తేడాతో ఎ.ఎస్.షాలిని (తమిళనాడు), రెండో సెమీ ఫైనల్స్‌లో సాధన (తమిళనాడు)పై 0–3 తేడాతో నరుమూగయ్ (తమిళనాడు) విజయం సాధించారు. ఫైన ల్స్‌లో ఏఎస్.షాలిని (తమిళనాడు)పై 1–3 తేడాతో నరుమూగయ్ (తమిళనాడు) గెలు పొందింది. సీనియర్ విభాగంలో మొదటి సెమీ ఫైనల్స్‌లో సోనికా (కర్ణాటక)పై 0–3 తేడాతో రాగశ్రీ (తమిళనాడు), రెండో సెమీ ఫైనల్స్‌లో సంజూ (కేరళ)పై 0–3 తేడాతో శ్వేత (తమిళనాడు) గెలుపొందారు. ఫైనల్స్‌లో శ్వేత (తమిళనాడు)పై 0–3 తేడాతో రాగశ్రీ (తమిళనాడు) విజయం సాధించింది. ఆది, సోమవారాలు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ డబల్స్ విభాగంలో మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చిన వారు సెలవులు ముగియడంతో తిరుగు పయనమవుతున్నారు. శనివారమే కొంత మంది బయలుదేరి వెళ్తుండగా, మరి కొందరు ఆదివారం ప్రయాణమవుతున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. డిమాండ్‌ను బట్టి టికెట్ల రేట్లు పెంచేస్తున్నారు. అసలు ధరకు రెండు, మూడు రెట్లు అమాంతం పెంచేశారు. దీంతో ఇదేమి దోపిడీ అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆ తర్వాత బెంగళూరుకు డిమాండ్ ఏర్పడింది. నిత్యం విజయవాడ నుంచి హైదరాబాద్, వేర్వేరు ప్రాంతాలకు 200 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ మీదగా వెళ్లే బస్సులు మరో 400 వరకూ ఉంటాయి. రిటర్న్ జర్నీకే ఎక్కువ డిమాండ్ ఈ ఏడాది సంక్రాంతి పండక్కి ముందు రెండో శనివారం, ఆదివారం రావడంతో హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల నుంచి శుక్రవారం సాయంత్రం నుంచి సొంతూళ్లకు రావడం ప్రారంభించారు. అలా మంగళవారం రాత్రి వరకూ నాలుగు రోజుల పాటు వస్తూనే ఉన్నారు. వారంతా శని, ఆదివారాల్లో తిరుగు ప్రయాణం చేస్తుండటంతో రద్దీ ఎక్కువైందని అధికారులు పేర్కొంటున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులు దీనినే అదునుగా తీసుకుని ఏసీ, నాన్ ఏసీ సీట్ల చార్జీలను అమాంతం పెంచేసి ప్రయాణికులను దోచుకుంటున్నారు. 7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 38.3148 టీఎంసీలు. సంక్రాంతి పండుగ కోసం సొంత ఊర్లకు వచ్చేటప్పుడు కానీ తిరిగి వెళ్లేటప్పుడు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఈ తనిఖీలు ఆదివారం రాత్రి వరకూ కొనసాగుతాయి. అవసరమైతే సోమవారం కూడా నిర్వహిస్తాం. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 163 బస్సులపై కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు రూ.6,11,250 జరిమానాలు విధించాం. – ప్రవీణ్, ఆర్టీఓ, విజయవాడ -
బరితెగించి ఘర్షణలు
కంకిపాడు: సంక్రాంతి బరులు బీభత్సకాండకు వేదికలయ్యాయి. అడుగడుగునా ఘర్షణలు, తోపులాటలతో ఉద్రిక్తంగా సాగాయి. బరుల్లో జరిగిన అమానుష చర్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయినా పోలీసులు పట్టుకున్న దాఖలాలు లేవు. ఈ ఘటనలపై ఎలాంటి కేసులూ నమోదవ లేదు. సంక్రాంతి బరుల నిర్వాహకులపై తమకు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని పోలీసులు చెప్పడం గమ నార్హం. పెనమలూరు నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బరుల వద్ద యథేచ్ఛగా కోడిపందేలను నిర్వహించారు. బరుల్లో కోడి పందేలతో పాటుగా పేకాట, లోన–బయట, గుండాట, కోతముక్క, పూల్‌గేమ్ వంటి జూద క్రీడలు ఎన్నో జరిపించారు. సంక్రాంతి పండుగ ముందు రోజు నుంచి శుక్రవారం రాత్రి వరకూ జూదం, కోడిపందేలను అధికారపక్షం అండతో నిర్వాహకులు బరితెగించి జరిపించారు. కోర్టు ఆదేశాలు ఉన్నా సంక్రాంతి బరులు అడ్డగోలుగా సాగాయి. కంకిపాడు బైపాస్ వెంబడి బరిలో పేకాట నిర్వాహకుడు అధికారపక్షం సహకారంతో పందేల గడువు ముగిశాక స్థానికంగా ఉన్న ఓ వెంచరులో టేబుళ్లు ఏర్పాటుచేయించి పేకాట జరిపించేలా అందరూ సహకరించారని తెలుస్తోంది. బరుల్లో అమానుషం ఈడుపుగల్లు బరిలో పేకాట (లోన–బయట) నిర్వహణ విషయంలో జూదరులకు, బరి పర్యవేక్షకులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది. దొంగ పేక నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు వినిపించాయి. ఆ విషయమై ప్రశ్నించిన జూదరిపై బరి పర్యవేక్షకులు, బందోబస్తుకు నియమించిన వ్యక్తులు దాడి చేసినన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉప్పలూరు బరిలో కొందరు యువకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఓ చిన్న వివాదం కాస్తా ముదిరి ఘర్షణకు దారి తీయటంతో రెండు వర్గాల యువకులు కొట్లాటకు తెగబడ్డారు. రెండు వర్గాల మధ్య గొడవ బీభత్సానికి దారితీసింది. చివరికి స్థానికులు చొరవతీసుకోవటంతో వివాదం ముగిసింది. మరో వైపు తోట్లవల్లూరుకు చెందిన 11 మందిని ఉప్పలూరు బరి ప్రాంగణంలో కొందరు వ్యక్తులు చొక్కాలు విప్పించి తాళ్లతో కట్టేసి హంగామా చేశారు. ‘ఎన్ని రోజులు నుంచి చేస్తున్నారు? ఒక్కొక్కరు ఎంత దొంగ తనం చేశారు? గజ దొంగల్లా ఉన్నారే?’ అంటూ వారు చేసిన వ్యాఖ్యలతో ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. తప్పు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్ష పడేలా పోలీసులకు అప్పగించాలే కానీ అమానవీయంగా చొక్కాలు విప్పించటం, చేతులు తాళ్లతో కట్టేయటం ఏమిటంటూ నెటిజన్లు, ప్రజాతంత్ర వాదులు విమర్శిస్తున్న పరిస్థితి. అయితే అప్పు విషయమై జరిగిన లావాదేవీలపై కొందరు వ్యక్తులు ఈ విధంగా వ్యవహరించటంతో అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పటం గమనార్హం. అయితే స్టేషన్లో నమోదైన కేసుకు, వీడియోల్లో జరిగిన సంభాషణలకు సంబంధం లేకపోవటం విశేషం. మరో వైపు బరుల్లో జరిగిన ఘర్షణలపై చిన్న కేసు కూడా నమోదు కాలేదు. శాంతిభద్రతల అంశం తలెత్తితే పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవటం, కేసులు నమోదు చేయటం సాధారణం. అయితే ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేవు. భీతిల్లిన జనం సందడిగా జరుపుకొనే సంక్రాంతి కాస్తా ఈసారి బీభత్సకాండను తలపించటంతో సామాన్య ప్రజలు భీతిల్లారు. బరుల్లో చోటుచేసుకున్న ఘటనలతో వణికిపోయారు. సంప్రదాయబద్ధంగా వేడుకగా సాగే కోడి పందేలు, జూద క్రీడలు ఘర్షణలు, కొట్లాటకు దారితీయటంపై జనం మండిపడుతున్నారు. అధికారపక్ష నేతల బరితెగింపుపై విమర్శలు గుప్పిస్తున్నారు. బరుల్లో ఘర్షణలు, కొట్లాటలు జరిగాయని ఎలాంటి ఫిర్యాదులూ అందలేదు. ఫిర్యాదులు వస్తే కేసులు నమోదుచేస్తాం. తోట్లవల్లూరుకు చెందిన వ్యక్తుల విషయంలో అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. చర్యలు తీసుకుంటాం. – డి.సందీప్, ఎస్ఐ, కంకిపాడు -
సాల్మన్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): పల్నాడు జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సాల్మన్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దళిత కార్యకర్త సాల్మన్ టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురవడం బాధాకరమన్నారు. ఈ హత్యకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, నిందితులకు శిక్ష పడేలా పోలీసులు పనిచేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే వైఎస్సార్ సీపీ తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. -
సాగరతీరానికి పర్యాటక శోభ
కోడూరు: సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హంసలదీవి సాగరతీరం పర్యాటక శోభతో కళకళలాడింది. సెలవుల సందర్భంగా స్వగ్రామాలకు వచ్చిన వారంతా కుటుంబ సమేతంగా సాగరతీరానికి వచ్చి సందడి చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల నుంచి పర్యాటకులు ప్రత్యేక వాహనాల్లో సాగరతీరానికి తరలివచ్చారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో సేదతీరి, సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. యువకుల క్రికెట్, వాలీబాల్ ఆటలతో ఉత్సాహంగా గడిపారు. పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. చిలకలపూడి (మచిలీపట్నం): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శబ్ద, వాయు కాలుష్య నియంత్రణ కోసం కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ శనివారం సైకిల్‌పై విధులకు హాజరయ్యారు. వాయుకాలుష్య నియంత్రణ కోసం ప్రతి శనివారం ప్రతి ఉద్యోగి, ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చేందుకు కాలినడకన లేదా సైకిల్‌పై రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సైకిల్‌పై విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాయు కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలికోసం చేపట్టిన చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): తమ ఆర్థికాభివృద్ధికి చేయూత ఇచ్చేలా ఏర్పాటు చేసిన రైజ్ సెంటర్ సేవలను స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. గుంటుపల్లిలో ఏర్పాటు చేసిన రైజ్ సెంటర్లో మహిళల శిక్షణ సదస్సును ఆయన శనివారం పరిశీలించారు. చేతి వృత్తుల ద్వారా వివిధ ఉత్ప త్తులను రూపొందించి, మార్కెటింగ్ చేస్తున్న మహిళతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైజ్ సెంటర్లో గత జూలై నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. కంప్యూటర్ ఎక్స్ఎల్, ఎంఎస్ ఆఫీస్ వంటి కోర్సులను మహిళలు ఉచితంగా నేర్చుకోవచ్చని సూచించారు. డీఆర్వో పీడీ నాంచారరావు, మెప్మా పీడీ కృష్ణ ప్రసాద్, ఆర్డీఓ చైతన్య, ఉద్యానశాఖ అధికారి బాలాజీకుమార్, స్కిల్ డవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): పశు సంవర్ధక సేవలను పశుపోషకులకు మరింత చేరువ చేయడానికి ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు కృష్ణా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వ హిస్తామని కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. ఈ శిబిరాల పోస్టర్‌ను తన చాంబర్లో శనివారం ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ శిబిరాల్లో జీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయడంతోపాటు, ఎదకు రాని పశువులకు పరీక్షలు నిర్వహించి సూచనలు చేస్తారని పేర్కొన్నారు. గర్భకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి వైద్యసహాయం అందిస్తారని తెలిపారు. ప్రతి మండలానికి రెండు చొప్పున 26 మండలాలకు 52 టీమ్‌లను ఏర్పాటు చేసి శిబిరాలు నిర్వహించనున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ చిన నరసింహులు, డాక్టర్ మధుబాబు, డాక్టర్ విజయ కుమార్ పాల్గొన్నారు. -
రెడ్ బుక్కు పరాకాష్ట సాల్మన్ హత్య
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జాన్‌విక్టర్ గుడివాడ టౌన్: మంత్రి లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ దారుణ హత్యకు గురయ్యాడని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. సాల్మన్‌ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్‌విక్టర్ డిమాండ్ చేశారు. గుడివాడ పట్టణంలోని నాగవరప్పాడులో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద సాల్మన్ హత్యను ఖండిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం జరిగింది. డౌన్ డౌన్ హోం మంత్రి, డౌన్ డౌన్ చంద్రబాబు అన్న నినాదాలు హోరెత్తాయి. దళితులపై దాడులను ఆపాలి, నిందితులను కఠినంగా శిక్షించా లని పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్ మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో దళితులపై హత్యలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై వివక్ష పెరిగిందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడులు చెయ్యడం, హత్యలకు తెగబడటం, గ్రామ బహిష్కరణ విధించడం, కుల వివక్షతో చిన్నారులను సైతం వేధించడం వంటి దారుణాలు పెచ్చుమీరాయని విమర్శించారు. ఎన్నికల అనంతరం రెండేళ్లగా గ్రామం విడిచి జీవిస్తున్న మందా సాల్మన్ అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు సొంతూరికి వస్తే టీడీపీ గూండాలు ఇనుపరాడ్లతో దాడికి పాల్పడి హత్య చెయ్యడం దుర్మార్గమన్నారు. టీడీపీ నాయకుల అండతోనే ఈ హత్య జరిగిందని విమర్శించారు. ఈ కేసులో నింది తులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పెయ్యల ఆదాము, మెండా కిరణ్, ఆర్.చిన్నా, కారె జోసఫ్, సీహెచ్.నాని, సీహెచ్.జోషి, కె.నాగరాజు, జి.రవి, సురేఖ, మామిళ్ల ఎలీషా, ఎన్.అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి బండలాగుడు ప్రదర్శనలు
ఘంటసాల: ఒంగోలు జాతి వృషభాల సంరక్షణకు ఘంటసాల గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వృషభ రాజాల ప్రదర్శన ఆదర్శంగా నిలుస్తుందని ఎన్నారై గొర్రెపాటి రంగనాథబాబు అన్నారు. మన ఊరు మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా డాక్టర్ గొర్రెపాటి నవనీతకృష్ణ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో గ్రామస్తులు, దాతల సహకారంతో నిర్వహించిన మూడు రోజుల రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభ రాజాల బండలాగుడు ప్రదర్శనలు శుక్రవారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యూ కేటగిరి, రెండు పళ్ల విభాగం బండలాగుడు ప్రదర్శనలను ఎన్నారై రంగనాథబాబు, మూల్పూరి వెంకట్రావు, పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాసరావు, టీడీపీ నేత బొబ్బా గోవర్థన్, ఏఏంసీ చైర్మన్ తోట కనకదుర్గ, పలువురు ప్రముఖులు పోటీలను ప్రారంభించి ప్రసంగించగా నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు. న్యూ కేటగిరి విభాగం విజేత ఎంకేఎం బుల్స్.. గురువారం జరిగిన న్యూ కేటగిరి విభాగంలో విజయవాడ – ఘంటసాలకు చెందిన ఎంకేఎం బుల్స్ అధినేత మేకా కృష్ణ మోహన్ ఎడ్లజత మొదటిస్థానం సాధించగా, గుంటూరు జిల్లా కొండవాలవారిపాలెంకు చెందిన జీపీ చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మీదీక్షిత చౌదరి జత రెండో స్థానం, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన పోతిన లక్ష్మిత్ చౌదరి జత మూడో స్థానం సాధించాయి. నాల్గవ స్థానంలో గుంటూరు జిల్లా తోటపాలెంకు చెందిన రామినేని రత్తయ్య చౌదరి జత, ఐదో స్థానంలో కృష్ణాజిల్లా కళ్లంవారిపాలెంకు చెందిన బదిగం సుబ్బారెడ్డి జత, 6వ స్థానం సుఖవాసి సతీష్ బాబు జత, 7, 8 స్థానాల్లో కృష్ణాజిల్లా చినపులిపాకకు చెందిన ఆర్వీఎస్ బుల్స్ నిలిచాయి. రెండు పళ్ల విజేత ఆర్కే బుల్స్ జత.. శుక్రవారం సాయంత్రం జరిగిన రెండు పళ్ల విభాగంలో బాపట్లజిల్లా వేటపాలెంకు చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి జత విజేతగా నిలవగా, కృష్ణాజిల్లా అయినపూడికు చెందిన మేడిశెట్టి వెంకటేశ్వరరావు జత, కొల్లిపరకు చెందిన ఆరేపల్లి ముక్తేశ్వరరావు జత ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాపట్ల జిల్లా క్రాపకు చెందిన టీఎస్ఆర్ బుల్స్ తలశిల రవితేజ, సాయితేజల జత నాల్గవస్థానం, ఘంటసాల గ్రామానికి చెందిన వీవీఆర్ బుల్స్ వేమూరి చిన్మయి ఎడ్ల జత, వల్లూరిపాలెంకు చెందిన చెన్నుపాటి నాగేంద్రం జత తర్వాత స్థానాల్లో నిలిచాయి. విజేతలైన వృషభాల యజమానులకు జీఎస్టీ డెప్యూటీ కమిషనర్ గొర్రెపాటి రవీంద్రబాబు, రాధిక దంపతుల చేతుల మీదుగా నగదు బహుమతులను అందించారు. -
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ చైర్మన్‌కు సన్మానం
రిమ్మనపూడి(పామర్రు): నార్త్ అమెరికా తెలుగు సొసైటీ చైర్మన్‌గా ఎంపికై న కంచర్ల నందకిషోర్ తన స్వగ్రామమైన పామర్రు మండల పరిధి రిమ్మనపూడి గ్రామానికి శుక్రవారం చేరుకున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గ్రామానికి చేరుకుని ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం గ్రామంలో చైర్మన్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను నలుదిశలా వ్యాపింప చేసే విధంగా నంద కిషోర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తెలుగు వారి ఖ్యాతిని ఇనుమడింప చేసే విధంగా పల్లెటూరి నుంచి అమెరికా వంటి అగ్రరాజ్యంలో తెలుగు సొసైటీకి చైర్మన్‌గా ఎంపిక కావడం ఎంతో విశేషమని కొనియాడారు. రిమ్మనపూడి గ్రామాభివృద్ధికి నంద కిషోర్ సహాయ సహకారాలను అందించడం ఎంతో ప్రశంసనీయమన్నారు. అనంతరం నంద కిషోర్‌ను ఘనంగా చేశారు. కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, కృష్ణామిల్క్ యూనియన్ విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, పామర్రు ఏఎంసీ చైర్మన్ జన్ను శోభన్‌బాబు, కూటమి నేతలు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026కబడ్డీతో యువతలో టీమ్ వర్క్ పెంపొందుతుందని ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారిని శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో అన్ని క్యూలైన్లు కిటకిటలాడాయి. సాక్షి, విజయవాడ: సంక్రాంతి నేపథ్యంలో విజయవాడ రోడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అందరూ పల్లె బాట పట్టడంతో గురువారం ఏలూరు రోడ్డు నిర్మానుష్యంగా మారింది. I -
గంగినేనిలో తెలుగు తమ్ముళ్ల వీర విహారం
● గంగినేని కోడి పందేల బరి వద్ద కొట్లాట ● తెలంగాణకు చెందిన యువకుడిపై తీవ్ర స్థాయిలో దాడి ● అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌పై దాడి చేసిన తమ్ముళ్లు జి.కొండూరు: సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన కోడి పందేల బరి వద్ద తెలుగు తమ్ముళ్లు వీర విహారం చేశారు. గంగినేని గ్రామంలో కోడి పందేల బరి వద్ద ముగింపు సంబరాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం తెలుగు తమ్ముళ్లు డీజేలతో డ్యాన్సులు వేస్తుండగా తెలంగాణ రాష్ట్రం, రేమిడిచర్లకు చెందిన గోసి పరమేశ్వరరావు అనే వ్యక్తి న్యూడిల్స్ తింటూ తెలుగు తమ్ముళ్ల సంబరాలపై కామెంట్ చేశాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా రెచ్చిపోయి అతనిపై తీవ్రస్థాయిలో దాడికి దిగారు. దీనితో పరమేశ్వరరావు తల పగిలి అపస్మారకస్థితిలోకి వెళ్లగా అతని పక్కన వచ్చిన వ్యక్తులు అడ్డుకోబోగా వారిపై కూడా దాడికి తెగబడ్డారు. దీనితో వారు పరారయ్యారు. అదే సమయంలో అక్కడి చేరుకున్న జి.కొండూరు పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ వీరకుమార్ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతనిపై కూడా దాడికి తెగబడడం విస్మయానికి గురి చేసింది. కానిస్టేబుల్ని సైతం కొట్టడంతో కొట్లాటను ఆపేందుకు గ్రామస్తులు ఎవరూ సాహసం చేయలేకపోయారు. ఆ తర్వాత కోడి పందేల నిర్వాహకులు అడ్డుకోవడంతో గొడవ సర్ధుమణిగింది. తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రుడు పరమేశ్వరరావును ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి తెగబడిన నలుగురు వ్యక్తులను జి.కొండూరు పోలీసులు అదుపులోకి తీసుకోగా అసలు దాడి చేసిన తెలుగు తమ్ముళ్లను వదిలేసి అమాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. -
క్రీస్తు బోధనల సారం.. జోసఫ్ తంబి జీవితం
పెద్దఅవుటపల్లి(గన్నవరం): ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో గత మూడు రోజులుగా జరుగుతున్న 81వ వర్ధంతి మహోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ మేత్రాసనం పీఠాధిపతులు తెలగతోటి జోసఫ్ రాజారావు నేతృత్వంలో సమష్టి దివ్యబలిపూజను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ దేవుని బిడ్డలుగా జీవించాలంటే పవిత్రత, వినయ, విధేయతలు కలిగి ఉండాలని చెప్పారు. ప్రేమ, సేవాగుణం కలిగి ఉండి అవసరతలో ఉన్నవారికి సహాయం చేయాలని తెలిపారు. క్రీస్తు బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకున్న బ్రదర్ జోసఫ్ తంబి ధన్యుడని చెప్పారు. వినమ్రుడు, దయాగుణం కలిగిన తంబి కష్టాల్లో కూడా దేవుడి సేవ మరువలేదని గుర్తుచేశారు. మహోన్నతుడైన తంబి ఇక్కడ నివసించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా తెలిపారు. అనంతరం బిషప్‌ను పుణ్యక్షేత్ర రెక్టర్ జోసఫ్ పాలడుగు, విచారణ గురువులు అభిలాష్ గోపు సత్కరించారు. అందరికీ కృతజ్ఞతలు.. సాయంత్రం పెద్దఅవుటపల్లి విచారణ గురువులు ఆధ్వర్యంలో కృతజ్ఞత సమష్టి దివ్యబలిపూజను సమర్పించారు. దేవుడి కృప వల్లే తంబి 81వ వర్ధంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయని జోసఫ్ తెలిపారు. అందుకు తంబి మద్యస్థ ప్రార్థనలు కూడా తోడయ్యాయని చెప్పారు. ఉత్సవాలు విజయవంతం జరిగేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రదర్ జోసఫ్ తంబి గాయక బృందం, ఫాదర్ గొలమూరి సుధాకర్ గాయక బృందం అలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ప్రొవిన్సియల్ రెవ. ఫాదర్ ప్రత్తిపాటి మరియదాసు, పలువురు విచారణ గురువులు పాల్గొన్నారు. చివరి రోజున బ్రదర్ జోసఫ్ తంబి సమాధిని దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి భక్తులు రావడంతో పుణ్యక్షేత్రం జన సంద్రంగా మారింది. -
ప్రజల్లో అవగాహన పెరగాలి..
బేసిక్ లైఫ్ సపోర్టు విధానాలపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి అవసరం ఉంది. ముఖ్యంగా సీపీఆర్ గురించి తెలుసుకోవాలి. కుటుంబ సభ్యులో, స్నేహితులో మనముందు కుప్పకూలినప్పుడు.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తక్షణమే సీపీఆర్ చేస్తే శరీరంలో రక్తప్రసరణ జరిగేలా చేయవచ్చు. ఈ విధానంపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన పెంచాల్సి ఉంది. కళాశాలల విద్యార్థులు, ప్రైవేటు సంస్థల్లో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. – డాక్టర్ మొవ్వ పద్మ, క్రిటికల్‌కేర్ నిపుణులు -
క్రీడలతో టీమ్ వర్క్ పెంపు
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): కబడ్డీతో యువతలో టీమ్ వర్క్ పెంపొందుతుందని ఎకై ్సజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఈడుపుగల్లులోని సీతారామ గార్డెన్స్ ఆవరణలో 51వ జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలను గురువారం ప్రారంభమయ్యాయి. కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ హాజరై పోటీలను ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలను నిర్మిస్తామన్నారు. ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ మాట్లాడుతూ.. 51వ జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పలు రాష్ట్రాలకు చెందిన 450 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. లీగ్ కమ్ నాకౌట్ దశలో పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళలో పోటీలు జరుగుతాయన్నారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కేవీ ప్రభావతి, పారిశ్రామికవేత్త నందమూరి విష్ణువర్థన్‌రావు, అసోసియేషన్ సభ్యులు అర్జునరావు, కేవీ నాంచారయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆగిన గుండెను తట్టిలేపే సీపీఆర్
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండెపోటు.. విద్యుత్‌షాక్.. నీటిలో మునక.. వంటి ప్రమాదాలు సంభవించినప్పుడు అకస్మాత్తుగా గుండె ఆడిపోతుంది. అలాంటి సమయంలో అప్రమత్తమై ఛాతీపై ఒత్తిడి (కార్డియో పల్మనరీ రీససిటేషన్–సీపీఆర్) చేయడం ద్వారా తిరిగి గుండె కొట్టుకునేలా చేయవచ్చని క్రిటికల్ కేర్ నిపుణులు చెబుతున్నారు. ఈ విధానంపై అవగాహన ఎంతో ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. షాక్‌కు గురైతే ఇలా చేయాలి.. ఎలక్ట్రికల్ షాక్‌కు గురైనప్పుడు గుండె షార్ట్ సర్క్యూట్ అవుతుంది. గుండె వేగం నిమిషానికి 400 నుంచి 500 సార్లు కొట్టుకోవడంతో శరీరంలో రక్తప్రసరణ నిలిచిపోతుంది. ఈ సమయంలో సీపీఆర్ చేస్తూనే వీలయినంత త్వరగా ఆస్పత్రికి చేర్చాలి. అక్కడ రోగిని పరీక్షించి డీసీ విద్యుత్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె సాధారణ స్థితికి తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు. నీట మునిగిన వారిని ఒడ్డుకు చేర్చిన తర్వాత కార్డియాక్ అరెస్టు అయితే సీపీఆర్‌ను అనుసరించాలంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో సైతం ఒక్కో సమయంలో గుండె ఆగిపోతుందని, ఈ విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. ఎస్ఎంసీలో స్కిల్ ల్యాబ్.. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేసి, గత ప్రభుత్వంలో పోలీస్, ఫైర్, ఇతర అత్యవసర సేవల సిబ్బందికి బేసిక్ లైఫ్ సపోర్టు విధానాలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో అడ్వాన్స్డ్ బేసిక్ లైఫ్ సపోర్టు అంబులెన్స్‌లో రోగిని తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. ప్రస్తుతం ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అకస్మాత్తుగా కుప్పకూలిన వ్యక్తి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయినట్టు గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు సీపీఆర్ పద్ధతిని అనుసరించాలి. కుప్పకూలిన వ్యక్తిని చదునుగా ఉన్న ప్రాంతానికి తీసుకు వచ్చి వెల్లకిలా పడుకోబెట్టాలి. పల్స్ లేకపోతే వెంటనే రెండు చేతులతో ఛాతి మధ్య భాగంలో ఒత్తిడి చేయాలి. నిమిషానికి వందసార్లు నొక్కడం ద్వారా గుండె చేసే రక్తం పంపింగ్‌కు మనం కృత్రిమంగా చేసినట్లవుతుంది. దీంతో మెదడుకు రక్తప్రసరణ జరిగి బ్రెయిన్ డెత్‌ను నిరోధించడంతో పాటు, గుండె తిరిగి కొట్టుకునేలా చేయవచ్చు. ఇలా చేస్తూనే నోటి ద్వారా కృత్రిమంగా శ్వాస అందిస్తే రక్తంలో ఆక్సిజన్ శాతం కూడా సాధారణ స్థితికి చేరుతుంది. -
చెప్పుల దుకాణంలోకి దూసుకువెళ్లిన కారు
కోడూరు: మద్యం మత్తులో ఓ వ్యక్తి అతి వేగంగా కారు నడుపుతూ చెప్పుల దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటన కోడూరులో చోటుచేసుకుంది. స్థానిక గొల్లపాలెం రోడ్డులోని పంచాయతీ వెనుక భాగంలో కోడూరుకు చెందిన బాబూరావు చెప్పులు కుట్టే దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కోడూరుకు చెందిన కందుల వెంకట చందు మద్యం మత్తులో కారు నడుపుతూ అతి వేగంగా చెప్పుల షాపును ఢీ కొట్టి దుకాణంలోకి దూసుకువెళ్లాడు. ఘటన జరిగిన వెంటనే వెంకట చందు అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే ఆ సమయంలో దుకాణం వద్ద ఉన్న అద్దంకి ఏడుకొండలుకు బలమైన గాయాలయ్యాయి. మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రెండు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. బాధితులను 108 వాహనంలో హుటాహుటినా అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడుకొండలు పరిస్థితి విషమంగా ఉండడంతో మచిలీపట్నంకు తరలించారు. ఘటనా స్థలాన్ని కోడూరు పోలీసులు పరిశీలించి, వివరాలు సేకరించారు. కారు నడుపుతున్న వెంకట చందుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చాణిక్య తెలిపారు. అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): నగరంలో మందుబాబుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నాలుగు రోజుల క్రితం భవానీపురంలోని బబ్బూరి గ్రౌండ్స్‌లో కొందరు వ్యక్తులు మద్యం సేవించి కార్‌తో హల్చల్ చేసిన ఘటనను మరువక ముందే సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో మరో వ్యక్తి తల పగలగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేదారేశ్వరపేట ఎనిమిదో లైన్‌కు చెందిన ధర్మవరపు మోహన్‌కుమార్(24) అనే వ్యక్తి ఈ నెల 15న వారి ఇంటి సమీపంలో ఉన్న బార్లో మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో తనకు గతంలో పరిచయం ఉన్న రాము అనే వ్యక్తి సాల్మన్ అనే మరో వ్యక్తితో కలిసి మోహన్‌కుమార్ దగ్గరకు వచ్చి ఏంట్రా నాతో సరిగా మాట్లాడడం లేదు.. పట్టించుకోవడం లేదని అతనితో గొడవపడ్డారు. మోహన్‌కుమార్ వారితో మాట్లాడకుండా బార్ కౌంటర్లోకి వెళ్లి మద్యం కొనుగోలు చేస్తుండగా ఇంతలో రాము వచ్చి మోహన్‌తో గొడవ పడుతూ ఉండగా సాల్మన్ తన చేతిలో ఉన్న బీరు సీసాతో మోహన్ తల పగలకొట్టాడు. దీంతో మోహన్ తలకు, చెవి వద్ద తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడి ఘటనను అడ్డుకునేందుకు అక్కడే ఉన్న మరికొంతమంది ప్రయత్నించగా వారిపై కూడా రాము, సాల్మన్ దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
జూద క్రాంతులు!
బరుల వద్దే బార్లు.. విజయవాడ రామవరప్పాడు సమీపంలో ఏర్పాటు చేసిన బరుల వద్ద పార్క్ చేసిన వాహనాలుకేసరపల్లిలో చిన్నబజార్, పెద్ద బజార్ ఆడుతున్న పందెం రాయుళ్లునియోజకవర్గ ప్రజా ప్రతినిధులు బరుల కేటగిరీని బట్టి రూ.30 లక్షల నుంచి రూ.2కోట్లకు పైగా దండుకున్నారు. పోలీసులు తామేమి తక్కువ కాదన్నట్లు బరుల వద్ద బేరం కుదుర్చుకున్నారు. దీంతో బరుల నిర్వాహకులు రెచ్చిపోయారు. తమకు అడ్డూ అదుపూ లేదన్నట్లు, రేకులతో పెద్ద, పెద్ద వాటర్ ప్రూఫ్ షెడ్లు ఏర్పాటు చేసి, అందులో సకల సౌకర్యాలు కల్పించారు. విచ్చలవిడిగా కేసినో నిర్వహించి రూ.కోట్లు కొల్లగొట్టారు. గోవా, నేపాల్ నుంచి నిపుణులను రంగంలోకి దించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం, లక్ష రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టి మద్యం, విందు ఏర్పాటు చేశారు. వీరికోసం కారవ్యాన్లు కూడా అందుబాటులో ఉంచారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంక్రాంతి సంబరాల ముసుగులో హైటెక్ బరులు ఏర్పాటు చేసి, అడ్డగోలుగా పచ్చనేతలు కోట్లు దండుకున్నారు. మూడు రోజులూ రాత్రింబగళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా కోడిపందేలు, జూద క్రీడలు, కేసినో ఏర్పాటు చేశారు. కళ్లెదుటే పందెం పుంజులు కత్తులు దూస్తున్నా, పేకలు గాలిలో ఎగుతున్నా, చినబజారు, పెద్దబజారు, లోన, బయట, గుండాట, కోతముక్క, త్రీకాట్స్, ఆటలు జోరుగా ఓపెన్‌గా సాగుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. బరుల వద్ద మద్యం ఏరులై పారింది. భారీ స్టాల్స్, బార్ల మాదిరి ఏర్పాటు చేసి జోరుగా మద్యం అమ్మకాలు చేశారు. భారీగా రేట్లు పెంచి సొమ్ము చేసుకున్నారు. కొంత మంది ద్విచక్రవాహనాలు, ఆటోల్లో పెట్టుకొని గ్లాసుల్లో మద్యం పోసి, మందు బాబులకు అమ్మకాలు చేశారు. ఆ పక్కనే బిర్యానీ సెంటర్లు, మాంసం దుకాణాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ పేరుతో భారీ దోపిడీకి తెగబడ్డారు. విజయవాడ శివారులో మూడు ప్రధాన బరుల వద్ద ద్విచక్ర వాహనానికి రూ.50, కార్లకు రూ.200 కేవలం మూడుగంటల సమయానికే తీసుకున్నారు. వేలాది వాహనాలు బరుల వద్ద బారులు తీరడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది. కనీసం పోలీసులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. -
తిరుపతమ్మ సేవలో తెలంగాణ డెప్యూటీ సీఎం
పెనుగంచిప్రోలు: శ్రీ తిరుపతమ్మ వారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ముందుగా అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. అధికారులు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ కనుమ రోజున ఎంతో మహిమ కలిగిన అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, ఆలయ మాజీ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మకు పలువురి విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన గడ్డం వెంకట శివాజీ దంపతులు ఆలయ అభివృద్ధి నిమిత్తం రూ.1,00,116, దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి హైదరాబాద్ రామకృష్ణాపురానికి చెందిన కూర్మాల పాండురంగారావు కుటుంబం కూర్మాల భవ్యశ్రీ పేరిట రూ. లక్ష, అమ్మవారి నిత్యాన్నదానానికి బోలిశెట్టి వెంకట శివశంకర్ కుమార్, శ్రీదేవి పేరిట కుటుంబ సభ్యులు రూ. 1,51,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. కేసరపల్లిలో రూ. కోటి కోడి పందెం గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లిలో జరుగుతున్న కోడి పందేల శిబిరంలో శుక్రవారం జరిగిన కోటి రూపాయల పందెం హైలెట్‌గా నిలిచింది. ఈ పందెంలో ఎక్స్నెక్స్ కంపెనీకి చెందిన అమర్ సేతువ పుంజును దింపగా, అరవపల్లి సుబ్రహ్మణ్యం, కుర్ర శ్రీనివాసరావు, బీబీజీ మల్లికార్జునరెడ్డి సంయుక్తంగా డేగా పుంజును బరిలోకి దింపారు. సుమారు కొన్ని సెకన్ల పాటు హోరాహోరీగా జరిగిన ఈ పందెంలో సేతువ పుంజు విజయం సాధించగా అమర్ రూ. కోటి గెలుచుకున్నారు. ఈ పందెం గురించి నిర్వాహకులు ఉదయం నుంచి ప్రచారం చేయడంతో తిలకించేందుకు ఎక్కువ మంది జనం తరలివచ్చారు. -
కాల్ రికార్డే హంతకులను పట్టించింది
● భార్యను హత్య చేసి అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించిన భర్త ● ఏడు నెలలు తరువాత కాల్ రికార్డుతో వెలుగు చూసిన నిజం ● భర్తతో పాటు వివాహేతర సంబంధం నడుపుతున్న మహిళ అరెస్ట్ పెనమలూరు: భార్యను హత్య చేసి సహజ మరణంగా నమ్మించిన భర్త అసలు స్వరూపం ఏడు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. మరో మహిళతో కలిసి భార్య హత్యకు పన్నిన పథకం కాల్ రికార్డర్లో నమోదైంది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కృష్ణాజిల్లా పోరంకిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోరంకి పాత పోస్టాఫీసు ప్రాంతంలో ముక్కామాల ప్రసాద్‌చౌదరి(పండు)(53), భార్య రేణకాదేవి(48) ఉంటున్నారు. వీరికి 1998వ సంవత్సరంలో వివాహమైంది. రేణుకాదేవిది గుంటూరు జిల్లా నీరుకొండ గ్రామం. వీరికి ముక్కామాల తేజశ్రీ, ముక్కామాల నగేష్ పిల్లలు ఉన్నారు. కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా, కుమారుడు యూకేలో చదువుతున్నాడు. అయితే ప్రసాద్‌చౌదరికి దురలవాట్లు కారణంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా ప్రసాద్‌చౌదరికి పోరంకి బ్రహ్మంగారి గుడి వద్ద ఉంటున్న ఆకునూరు ఝాన్సీ(35)తో పరిచయం ఏర్పడింది. ఝాన్సీ భర్త ఐదేళ్ల క్రితం కనబడకుండా పోయాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. అప్పటి నుంచి ఝాన్సీ బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. రేణుకాదేవి ఇంటికి వచ్చి ఝాన్సీ మేకప్ వేసేది. దీంతో ఝాన్సీకి ఇంట్లో చనువు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రసాద్‌చౌదరికి ఝాన్సీకి వివాహేత సంబంధం ఏర్పడింది. వీరిద్దరు కలిసి తిరుగుతుండటంతో భార్య రేణుకాదేవి అభ్యంతరం తెలిపింది. దీంతో దంపతుల మధ్య గొడవలు తారస్థాయి చేరాయి. భార్య రేణుకాదేవి బరువు తగ్గటానికి లైపో చేసుకోవటంతో ఆరోగ్యం బాగా లేదన్న సాకుతో ప్రసాద్‌చౌదరి ఝాన్సీతో పూర్తి స్థాయిలో సంబంధం కొనసాగించాడు. భార్య అడ్డుగా ఉందని.. వారి మధ్య గొడవలు పెరుగుతుండటంతో రేణుకాదేవిని హత్య చేయాలని ప్రసాద్‌చౌదరి, ఝాన్సీ పథకం పన్నారు. ఎవరికి అనుమానం రాకుండా చంపి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. రేణుకాదేవిని చంపే సమయంలో ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటే అనుమానం రాదని పథకం వేశారు. హత్యకు ముందు ఝాన్సీ ఖమ్మంకు వెళ్లింది. ఫోన్లో ఝాన్సీ ఇచ్చిన సూచనలతో ప్రసాద్‌చౌదరి గతేడాది మే 18న గ్రామంలో జరిగిన గుడి వార్షికోత్సవాల్లో రేణుకాదేవి పాల్గొన్నారు. తరువాత భర్తతో ఇంటికి వెళ్లి రేణుకాదేవి నిద్రపోగా, పక్క గదిలో అత్తమామలు నిద్రపోయారు. ప్రసాద్‌చౌదరి అర్ధరాత్రి ఇంట్లో మద్యం తాగి మే 19వ తేదీ వేకువజామున నిద్రపోతున్న రేణుకాదేవిని ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. భార్య మృతి చెందిందని నిర్ధారించుకున్న తరువాత కొద్ది సమయం వేచి చూసి ఏమీ తెలియనట్లు పక్క గదిలో నిద్రపోతున్న అత్త మామలు నన్నపనేని సామ్రాజ్యం, ప్రసాదరావును లేపి రేణుకాదేవి కదలటం లేదని చెప్పాడు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి పోరంకిలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అనారోగ్యంతో రేణుకాదేవి మృతి చెందినట్లు నమ్మించాడు. కుమారుడు యూకే నుంచి వచ్చిన తరువాత మే 21న అంత్యక్రియలు చేసి దినం కార్యక్రమాలు పూర్తి చేశాడు. ఈ వ్యవహారమంతా ప్రసాద్‌చౌదరి, ఝాన్సీ వేసిన పథకం ప్రకారం చేశారు. రేణుకాదేవిని హత్య చేసిన తరువాత తమకు అడ్డు తొలిగిందని ప్రసాద్‌చౌదరి, ఝాన్సీలు భావించారు. అయితే సెల్‌ఫోన్ వారి జాతకాన్ని బయటపెట్టింది. ప్రసాద్‌చౌదరి కుమారుడు నగేష్ యూకేకు వెళ్లిన సమయంలో అతని సెల్‌ఫోన్ తండ్రికి ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రసాద్‌చౌదరి ఆ ఫోన్ వాడుతున్నాడు. ఝాన్సీతో కలిసి ప్రసాద్‌చౌదరి హత్యకు రచించిన పథకం సంభాషణ మొత్తం ఫోన్లో రికార్డు అయింది. కొన్ని నెలలు గడిచాయి. తల్లి చనిపోయిన నాటి నుంచి ఊర్లోనే ఉంటున్న కుమారుడు నగేష్ ఇటీవల తండ్రి వాడుతున్న తన ఫోన్‌ను పరిశీలించాడు. ఫోన్లో రికార్డు అయిన సంభాషణలు విని తండ్రే పథకం పన్ని తల్లిని హత్య చేశాడన్న విషయం తెసుకున్నాడు. ఇది తెలుసుకున్న ప్రసాద్‌చౌదరి, ఝాన్సీ వారి సాక్షాలు లేకుండా ఉండటానికి తమ వద్ద ఉన్న ఫోన్లు ధ్వంసం చేశారు. అయితే అప్పటికే ఫోన్ సంభాషణను భద్రపర్చిన నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీఎస్ సీఐ గోవిందరాజు, బృందం ప్రత్యేకంగా దర్యాపు చేశారు. నిందితులు పక్కా ఆధారాలతో దొరకటంతో ఈ నెల 13న ప్రసాద్‌చౌదరి, ఝాన్సీలను అరెస్టు చేశారు. కోర్టు ఇద్దరికి రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రసాద్‌చౌదరి తల్లి శివపార్వతి, యూఎస్‌లో ఉంటున్న సోదరుడు చందర్రావులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోడి పందేల బరి వద్ద బ్లేడ్‌తో దాడి
భూషణగుళ్ల(పెదపారుపూడి): కోడి పందేల బరి వద్ద బ్లేడ్‌తో వ్యక్తిని గాయపరిచిన సంఘటన మండలంలోని భూషణగుళ్లలో శుక్రవారం చోటుచేసుకుంది. గుడివాడ ఏరియా ఆస్పత్రి ఆవుట్ పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని భూషణగుళ్ల గ్రామంలో జరుగుతున్న కోడి పందేల బరి వద్ద గుడివాడ పట్టణంలోని ధనియాలపేటకు చెందిన అనగాని జగన్నాథం(45) అదే గ్రామానికి చెందిన విక్కుర్తి ఈశ్వరరావు తండ్రికి పందెం విషయంలో గొడవ జరిగింది. ఇంటి వద్ద ఉన్న ఈశ్వరరావుకు విషయం తెలపటంతో తనతో పాటు బ్లేడ్ తీసుకుని వచ్చాడు. కోడి పందెం గెలిచిన జగన్నాథం కోడి పుంజును తీసుకుంటుండగా ఈశ్వరరావు బ్లేడ్‌తో దాడి చేశాడు. ఈదాడిలో జగన్నాథం మెడపై తీవ్రంగా గాయమైంది. దీంతో బాధితుడిని ప్రైవేట్ వాహనంలో గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తీసుకువెళ్లాలని వైద్యులు సూచించినట్లు జగన్నాథం కుటుంబ సభ్యులు చెప్పారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, కేసు వివరాలను పెదపారుపూడి పోలీస్ స్టేషన్‌కు పంపామని గుడివాడ పోలీసులు తెలిపారు. -
ఆకట్టుకున్న మత్స్యకారులకు విసుర వల పోటీలు
నాగాయలంక: కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని మండవ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సౌజన్యం, ఏపీ సంప్రదాయ మత్స్యకారుల సేవా సమితి సహకారంతో స్థానిక శ్రీరామపాద క్షేత్రం ఘాట్ ప్రాంగణంలో కృష్ణానది తీరాన శుక్రవారం సాయంత్రం విసురు వల పోటీలు నిర్వహించారు. కృష్ణానదిలో వృత్తి కళాత్మకంగా చేపల వేటలో వల విసరడం ఎంతో చాకచక్యంతో కూడి ఉంటుంది. దీని నైపుణ్యం ప్రామాణికంగా ఘాట్ ఒడ్డున ప్రత్యేకంగా అమర్చిన క్రీడా కోర్ట్‌లో విసురు వల నైపుణ్యతను పరిశీలించారు. వల వేటలో మొత్తం 30 మంది పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన ముగ్గురికి బహుమతులు, పోటీలో పాల్గొన్నవారికి ప్రోత్సాహకాలను ట్రస్ట్ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, సేవా సమతి ప్రధాన కార్యదర్శి లకనం నాగాంజనేయులు అందచేశారు. తొలుత మత్స్యకారులకు విసురు వల అందించి పోటీలను ప్రారంభించారు. జిల్లా మత్స్యకార సహకార సంఘం డైరెక్టర్ కర్రి కృష్ణమూర్తి, సేవా సమతి స్థానిక అధ్యక్షుడు నాగిడి తాతారావు, మత్స్యకార నేతలు రేవు సువర్ణరాజు, లంకె బుల్లి బసవయ్య, ఒడుగు దశరయ్య, నాగిడి పోతురాజు పాల్గొన్నారు. తలశిల రఘుశేఖర్, ఒడుగు వెంకటేశ్వరరావు పోటీలు నిర్వహించారు. -
దుర్గమ్మ నిత్యాన్నదానానికి రూ. 4 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి అనకాపల్లికి చెందిన భక్తులు సోమవారం రూ. 4 లక్షల విరాళాన్ని అందజేశారు. అనకాపల్లికి చెందిన కొలగంటి అభియాన్ రూ. 2లక్షలు, కొలగంటి రవి రూ. 2లక్షల విరాళాన్ని అమ్మవారి నిత్యాన్నదానం నిమిత్తం ఆలయ అధికారులకు అందించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని దువ్వ గ్రామానికి చెందిన కొప్పిశెట్టి శ్రీవల్లీ కుటుంబం ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. వేంకటేశ్వరుని సన్నిధిలో.. తిరుమలగిరి(జగ్గయ్యపేట): తిరుమలగిరి వాల్మీకోద్భవ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదానానికి మండలంలోని తొర్రకుంటపాలెం గ్రామానికి చెందిన తరిగొప్పల వెంకట సతీష్ దంపతులు సోమవారం రూ. లక్ష విరాళంగా అందించినట్లు ఆలయ ఈవో సాంబశివరావు తెలిపారు. -
గొలుసు దొంగలు అరెస్ట్
●నిందితుడు ర్యాపిడో పైలెట్ ●చోరీల్లో మైనర్ భాగస్వామ్యం పటమట(విజయవాడతూర్పు): దుర్వ్యసనాలకు అలవాటు పడి రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో గొలుసు దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని పటమట పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచారు. దీనిపై సెంట్రల్ ఏసీపీ దామోదర్, పటమట సీఐ పవన్ కిషోర్ సోమవారం పటమట పీఎస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీపీ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న దొంగతనాలు– చైన్ స్నాచింగ్‌లను నివారించడంలో ప్రత్యేక దృష్టి సారించి విజయవాడలో అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేశామన్నారు. పటమట దర్శిపేట మర్రిచెట్టు ప్రాంతానికి చెందిన మోదుగుల రాజారావు ప్రైవేట్ కాలేజీలో పని చేస్తూ, పార్ట్ టైమ్‌గా ర్యాపిడో రైడర్ కూడా చేస్తుంటారు. వ్యవసనాలకు బానిసైన రాజారావుకు అతని సంపాదన సరిపోవడం లేదు. తక్కువ కాలంలో బాగా డబ్బు సంపాదించాలనే కోరికతో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల వద్ద చైన్లను స్నాచింగ్ చేయటం, లేదా వారిని బెదిరించి దొంగతనం చేయడం పరిపాటిగా మారిందన్నారు. మోటార్‌సైకిల్‌పై రెక్కీ ఇతనికి స్థానిక మైనర్ భాగస్వామి కావటంతో నగర పరిసరప్రాంతాల్లో మోటార్ సైకల్పై రెక్కి నిర్వహించేవారని, ఇటీవల పటమట పీఎస్ పరిధిలో రెండు స్నాచింగ్‌లు చేశారని తెలిపారు. రామలింగేశ్వర్ నగర్ పుట్టరోడ్డులో, ఎంజీ రోడ్డు లో ఉన్న స్టీల్ షాప్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల మెడలో రెండు చైన్ స్నాచింగ్‌లు చేశారన్నారు. దీనిపై నమోదైన కేసు విచారణలో క్రైం ఎస్.ఐ డి.హరికృష్ణ, ఏ.ఎస్.ఐ వి.గోపి, హెడ్ కానిస్టేబుల్ కాళీ, ఇతర సిబ్బందితో నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వీరికి అందిన పక్కా సమాచారంతో పటమట దర్శిపేట మర్రిచెట్టు వద్ద వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేశామన్నారు. నిందితుల వద్ద సుమారు రూ. 3.50 లక్షల విలువైన 34 గ్రాముల బంగారు ఆభరణాలు (చోరీ సొత్తు)ను, నేరానికి ఉపయోగించిన చాకు, ద్విచక్ర వాహన్నాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. -
ఆరుగురు ‘గంజాయి’ నిందితుల అరెస్ట్
కంకిపాడు: గంజాయి తాగుతూ, విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులను కంకిపాడు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కంకిపాడు సీఐ జె.మురళీకృష్ణ స్థానిక పీఎస్‌లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సోమవారం కంకిపాడు పీఎస్ పరిధిలోని ప్రొద్దుటూరు శివారు గాయత్రీ విహార్‌లోని ఖాళీ స్థలాల్లో తనిఖీలు చేశారు. 18–25 ఏళ్ల యువకులు పోలీసుల రాకను గుర్తించి పారిపోయేందుకు ప్రయత్నించారు. వీరిలో ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.200 కిలోలు గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీ అయ్యారు. పట్టుబడ్డ ఆరుగురిలో గోసాలకు చెందిన షేక్కాలేష, విజయవాడ కృష్ణలంకకు చెందిన గండ్ర వెంకట దినేష్‌కుమార్, ఈడుపుగల్లు గ్రామానికి చెందిన గూడవల్లి షాలేమ్‌రాజు, గండ్రపు కుమార్, ప్రొద్దుటూరుకు చెందిన కొనళ్ల కిరీటి, మరో మైనరు ఉన్నారు. పరారీలో ఉన్న యువకులు కోసం గాలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ మురళీకృష్ణ సూచించారు. 21 కిలోల గంజాయి స్వాధీనం మధురానగర్(విజయవాడసెంట్రల్): గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న ముగ్గురిని గుణదల పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుణదల రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి అమ్మడం జరుగుతుందని ఆదివారం గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనుకి కచ్చితమైన సమాచారం అందింది. ఆయన, సిబ్బంది కలిసి గుణదల రైల్వేస్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులను చూసి ముగ్గురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విచారణలో ఒకరు భవానీపురానికి చెందిన గుంటూరు ప్రవీణ్, మరొకరు క్రీస్తురాజపురానికి చెందిన గొల్ల ప్రభుకుమార్, మూడో వ్యక్తి లబ్బీపేటకు చెందిన కస్తూరి సాయి తేజగా గుర్తించారు. వీరిపై వివిధ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. 21 కేజీలు గంజాయిని సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సోమవారం రిమాండ్‌కు పంపించగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధిస్తూ జైలుకు పంపించారు. -
యూరియా కోసం రైతుల ఇక్కట్లు
●ఒక్క బస్తా యూరియా కోసం తిప్పలు ●మొక్కుబడిగా సొసైటీల్లో అమ్మకాలు ●వరి సాగులో తీవ్ర ఇబ్బందులు తిరువూరు: యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతున్నారు. అవి ఎలా ఉన్నాయంటే ‘వరి నాట్లు వేశాం, యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరుగుతున్నాం. సహకార సంఘాల్లో సోమవారం యూరియా సరఫరా చేస్తున్నారని తెలిసి తెల్లవారుజామునే క్యూలైన్లో నిలబడ్డాం. టోకెన్లు ఇచ్చి లైన్లో ఉండమన్నారు. మధ్యాహ్నం వరకు ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదు. మాకంటే వెనుక వచ్చిన పెద్ద రైతులకు ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చి పంపారు. ట్రాక్టర్లలో 50, 100 బస్తాల యూరియాను తరలిస్తుంటే అధికారులు పట్టించుకోవట్లేదు’ అని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలోని సన్న, చిన్నకారు రైతులు వాపోయారు. మునుకుళ్లలో రెండు విడతల్లో యూరియా కోరుతూ రైతు సేవా కేంద్రాల వద్ద వేచి ఉన్న రైతులు రిక్తహస్తాలతో వెనక్కి వెళ్లారు. మూడో విడతలో కొందరు రైతులకే బస్తాలు అందాయి. మునుకుళ్ల సొసైటీకి 400 బస్తాలు, లక్ష్మీపురం సొసైటీకి 500 బస్తాల యూరియా రాగా వందల మంది రైతులు బారులు తీరారు. మునుకుళ్ల సొసైటీ వద్ద ఎండలో నిలబడలేక తమ పట్టాదారు పాస్‌పుస్తకాలు, అడంగల్స్ జిరాక్సు కాపీలు, చెప్పులు లైన్లో ఉంచిన రైతులు టోకెన్లు పొందినా ప్రయోజనం లేకుండా పోయింది. వామకుంట్ల, అక్కపాలెం గ్రామాల రైతుల పేర్లు చెప్పి మునుకుళ్లలోని పెద్ద రైతులు యూరియా కట్టలు తరలించుకుపోతుంటే ప్రేక్షకపాత్ర పోషిస్తున్నామని చిన్న, సన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరిసాగుకు యూరియా కీలకం ప్రస్తుతం నాట్లు వేసిన వరిపైరులో యూరియా చాలా అవసరం. కనీసం ఎకరాకు ఒక బస్తా వేసినా పంట నిలబడుతుంది. మార్కెట్లో యూరియా అమ్మకాలు లేకపోవడం, సొసైటీల్లో అరకొరగా మాత్రమే సరఫరా జరుగుతుండటంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు మండలంలో 10 వేల ఎకరాల్లో ఇంతవరకు వరి నాట్లు పడగా, మొదటివిడత యూరియా వేసి రెండో విడత కోసం ఎదురుచూస్తున్నామంటూ పలువురు చెబుతున్నారు. -
గణతంత్ర వేడుకలకు సిద్ధార్థ ఎన్సీసీ విద్యార్థి
పెనమలూరు: గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి కానూరు కేసీపీ సిద్ధార్థ ఆదర్శ పాఠశాల విద్యార్థి జె.శ్రీరామ్‌కు అవకాశం దక్కింది. ఏపీ 17వ బెటాలియన్‌కు చెందిన శ్రీరామ్ న్యూఢిల్లీలో జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఏపీ, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ సందర్భంగా పాఠశాల కన్వీనర్ వీరపనేని శశికళ, ప్రిన్సిపాల్ సాయికృష్ణ, ఎన్సీసీ కమాండింగ్ అధికారులు హరిబాబు, పాండే తదితరులు అభినందనలు తెలిపారు. కూచిపూడి(మొవ్వ): కూచిపూడి–పెడసనగల్లు రోడ్డులోని నన్నపనేని గ్రౌండ్స్‌లో మన ఊరు –మన సంక్రాంతి సందర్భంగా రెండు రోజుల పాటు సాగే జాతీయ పొట్టేళ్ల పందేలు సోమవారం ప్రారంభమయ్యాయి. నన్నపనేని యువసేన ఆధ్వర్యాన తొలిరోజు కర్ణాటక జాతి పొట్టేళ్ల పందేల్లో వందకు పైగా పొట్టేళ్లను హైదరాబాద్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల యజమానులు తీసుకువచ్చి పోటీల్లో పాల్గొన్నారు. నన్నపనేని వీరేంద్ర పర్యవేక్షణలో కొనసాగుతున్న పోటీలను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. కూచిపూడిలో సుమారు 60 ఏళ్ల క్రితం పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. కోనేరుసెంటర్: మీ కోసంలో తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీకోసంలో ఎస్పీ బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. పలు అర్జీలను ఎస్పీ అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. అర్జీల్లో కొన్ని.. అవనిగడ్డ నుంచి రాణి అనే బాఽధితురాలు ఎస్పీని కలిసి తనకు వివాహం జరిగి ఐదేళ్లు కాగా ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు చెప్పింది. ఆడపిల్లలు కావడంతో అత్తింటివారు పుట్టింటికి పంపించేసి తన భర్తకు మరొక వివాహం చేయాలని చూస్తున్నారని, అంతేకాక తనతో బలవంతంగా విడాకులు ఇప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారంటూ వాపోయింది. తనతో పాటు తన బిడ్డలకు న్యాయం చేయాలని ప్రాథేయపడింది. –పెనమలూరుకు చెందిన వృద్ధుడు నాంచారయ్య తనకు ఇద్దరు మగ పిల్లలని, పెద్ద కుమారుడు ప్రమాదవశాత్తు చనిపోయాడని, అతని భార్య అత్తమామలమనే కనికరం లేకుండా తమ ఆస్తిని కాజేయాలనే దురుద్దేశంతో ఉంటోందన్నారు. తమను వేధిస్తున్నారని న్యాయం చేయాలని కోరారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): దూరదృష్టి గల శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రపంచ వైద్య విజ్ఞానానికి ఎనలేని సేవలందించిన డాక్టర్ సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో సోమవారం రీసెర్చ్ డే వేడుకలు నిర్వహించారు. తొలుత యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ సుబ్బారావు విగ్రహాన్ని వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. అనంతరం వైద్య రంగంలో విశిష్ట పరిశోధనలు చేస్తున్న పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులకు ఉత్తమ పరిశోధకుల అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీసీ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు ఆధునిక బయోకెమిస్ట్రీ పితామహుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారన్నారు. ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డును సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ ,డైరెక్టర్ – కార్డియో వాస్క్యులర్ సర్జికల్ రీసెర్చ్, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ లోకేశ్వరరావు సజ్జాకు ప్రదానం చేశారు. అనంతరం ఆయన ‘మెడికల్ రీసెర్చ్ – గతం, వర్తమానం, భవిష్యత్’ అంశంపై ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్‌బాబు, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుధ తదితరులు పాల్గొన్నారు. -
లివర్ జరభద్రం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా కాలేయాన్ని కాటేసే సిరోసిస్పై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. ఇటీవల కాలంలో కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారు అధికంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. అందుకు మధుమేహం, కొన్ని రకాల మందులు వాడకం, హెపటైటీస్, ఒబెసిటీ, ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్ సేవనం కారణమంటున్నారు. ఫ్యాటీ లివర్‌ను అశ్రద్ధ చేస్తే సిరోసిస్‌కు దారి తీస్తుందని, క్రమేణా క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతి వంద మందిలో 60 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుండగా, 15 శాతం మందిలో గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉంటున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. లివర్ సిర్రోసిస్‌కు గురైన వారిలో ఆల్కాహాల్ సేవించే వారితో పాటు ఆల్కాహాల్ సేవించని వారు సైతం ఆ వ్యాధికి గురవడం ఆందోళన కలిగిస్తోంది. ఇవే నిదర్శనం.. ● నున్నకు చెందిన రాజేష్ తరచూ ఆల్కాహాల్ సేవిస్తుంటారు. ఇటీవల తరచూ తీవ్రమైన కడుపునొప్పి, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్యతో ఆస్పత్రికి వెళ్లాడు. అతనికి స్కాన్ చేయగా లివర్ సిర్రోసిస్‌గా గుర్తించారు. ● కంచికచర్లకు చెందిన వెంకట్ తరచూ నాన్‌వెజ్ తింటుంటాడు. అతనికి ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పితో పాటు వాంతులు కూడా అవుతుండటంతో ఆస్పత్రికి వచ్చాడు. అతనికి స్కాన్‌లో గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్‌తో పాటు ఫ్యాటీ లివర్ థర్డ్ స్టేజ్‌లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలా నిత్యం చేస్తున్న అబ్డామిన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లలో ఫ్యాటీలివర్ ఉన్న వారు ఎక్కువగా ఉంటున్నారు. ఆస్పత్రులకు క్యూ... లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు వస్తున్న వారిలో అల్సర్స్, అరుగుదల ఇబ్బందులతో పాటు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వారు కూడా ఎక్కువగా ఉంటున్నారు. హెపటైటీస్ బీ, సీ కేసులు వస్తున్నాయి. ఇటీవల కాలంలో సిరోసిస్ కేసులు ఎక్కువగా చూస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీలివర్ కేసులు పదుల సంఖ్యలో ఉంటున్నాయని వారు అంటున్నారు. నాన్ ఆల్కహాలిస్టుల్లో ఫ్యాటీ లివర్ సిరోసిస్‌కు దారితీస్తే ప్రాణాంతకం కావచ్చు. వీరు అప్రమత్తంగా ఉండాలి.. లివర్ సమస్యలు ఎక్కువగా మధుమేహులు, హోపోథైరాయిడ్ ఉన్న వారు, హెపటైటీస్ సీ, రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలు అబ్నార్మల్ ఉన్న వారిలో వస్తున్నాయి. ఫ్యాటీలివర్ కామన్‌గా భావించి అశ్రద్ధ చేస్తుండటంతో అదికాస్త సిరోసిస్‌కు దారితీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీలివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చునని, కానీ సిరోసిస్‌కు దారితీస్తే లివర్ గట్టిపడి వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదని వైద్యులు అంటున్నారు. లివర్ ఫంక్షన్లో తేడా వస్తుందని, ఆ పరిస్థితుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం ఒక్కటే మార్గమని వారు అంటున్నారు. ముందు జాగ్రత్త మేలు.. శారీరక శ్రమలేని జీవన విధానానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. దానికి తోడు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న జంక్‌ఫుడ్స్‌ను తింటున్నారు. దీంతో శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి, లివర్‌పై ప్రభావం చూపుతున్నాయి. 40 ఏళ్లు దాటిన వారు ప్రతి ఏటా లివర్ ఫంక్షన్ టెస్ట్, కొలస్ట్రాల్ లెవల్స్, థైరాయిడ్, షుగర్ పరీక్షలతో పాటు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించుకుంటే మంచిది. ఇప్పుడు లివర్ పనితీరును ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఫైబ్రోస్కాన్ అందుబాటులోకి వచ్చింది. ఆయా పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మేలను వైద్యులు సూచిస్తున్నారు. పెరుగుతున్న లివర్ సిర్రోసిస్ కేసులు అశ్రద్ధ చేస్తే క్యాన్సర్‌కు దారి తీస్తున్న వైనం ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేయరాదు రెగ్యులర్‌గా స్క్రీనింగ్ తప్పనిసరి అంటున్న వైద్యులు శ్రమలేని జీవన విధానం ఆహారపు అలవాట్లు పెరుగుతున్న మధుమేహులు ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం ఆల్కహాల్ సేవనం -
వైఎస్సార్ సీపీ మాజీ కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి చెందిన వైఎస్సార్ సీపీ మాజీ కౌన్సిలర్ కోసూరి లక్ష్మీనాంచారయ్య ఆదివారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి కారణం తాను అతిగా నమ్మిన వ్యక్తి మోసం చేయటమని మీడియా ఎదుట వాపోయాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి కథనం మేరకు.. గతేడాది ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాలకు సంబంధించి మాజీ కౌన్సిలర్ నాంచారయ్య తన కుమార్తె పేరుతో పాటు తనకు అత్యంత సన్నిహితుడైన పసుపులేని అనిల్ పేరిట వైన్‌షాపులకు దరఖాస్తు చేశారు. లాటరీలో నాంచారయ్య కుమార్తె పేరుతో పాటు అనిల్ పేరిట షాపులు దక్కాయి. మచిలీపట్నంలోని కోటావారితుళ్ల సెంటర్లో షాపు నిర్వహిస్తున్నారు. అనిల్ పేరు మీద వచ్చిన లైసెన్స్‌కు సంబంధించి ఎకై ్సజ్‌శాఖకు చెల్లించాల్సిన నగదు మొత్తం నాంచారయ్య భరించారు. ఈ క్రమంలో రూ.50 లక్షలు ఇవ్వాలని లేదంటే తన షాపు తనకు ఇచ్చేయాలని అనిల్ వేధిస్తున్నాడు. దీంతో వివాదం జరుగుతోంది. జనసేన నాయకుడి ప్రోద్బలంతో.. శనివారం అనిల్ ఆర్‌పేట పోలీస్ స్టేషన్లో నాంచారయ్యపై ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం అనిల్ జనసేనపార్టీకి చెందిన ఓ నాయకుడి ప్రోద్బలంతో మద్యం షాపునకు వెళ్లి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ తతంగాన్ని సీసీ కెమెరాలో చూసిన నాంచారయ్య వైన్‌షాపు వద్దకు వెళ్లారు. అనిల్ ప్రవర్తనతో విసుగుచెంది షాపు వద్దే డబ్బాలోని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో సిబ్బంది నాంచారయ్యను చికిత్స నిమిత్తం మచిలీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నాంచారయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను ఆత్మహత్యకు కారణం పసుపులేటి అనిల్, పసుపులేటి వేణుగోపాలరావు, పోతన వంశీ అని తెలిపారు. నాంచారయ్య అతని బంధువర్గం తనపై దాడి చేసినట్లు అనిల్ మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో చేరాడు. మద్యం షాపు లైసెన్స్‌దారుడి వేధింపులే కారణమంటూ ఆవేదన -
14 నుంచి రాష్ట్ర స్థాయి వృషభ రాజాల బండ లాగుడు ప్రదర్శన
ఘంటసాల: మన ఊరు – మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఘంటసాల గ్రామంలో గొర్రె పాటి నవనీతకృష్ణ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వృషభ రాజాల బండ లాగుడు ప్రదర్శనలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఘంటసాల జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు జరిగే బండ లాగుడు ప్రదర్శన పోటీల కరపత్రాలను ఆదివారం పంపిణీ చేయడంతో పాటు ప్రదర్శన ఏర్పాట్లను నిర్వాహకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. 14న ఆరుపళ్ల విభాగం ప్రదర్శన, 15న న్యూ కేటగిరి ప్రదర్శన, 16న రెండు పళ్లు విభాగంలో ప్రదర్శనతో పాటు ప్రతి రోజూ విజేతలకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందిస్తామన్నారు. 14న ప్రత్యేకంగా ఒంగోలు జాతి ఆవుల అందాల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రదర్శన కమిటీ ప్రతినిధులు బండి పరాత్పరరావు, దోనేపూడి రవి శంకర్, గొర్రెపాటి సురేష్, గొర్రెపాటి శ్రీనివాస్, మూల్పూరి చెన్న కేశవరావు, కొండపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
గోసంరక్షణకు విరాళాలు..
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భక్తుల నుంచి గో సంరక్షణ నిమిత్తం విరాళాలను సేకరిస్తోంది. వీటితో అమ్మవారి సన్నిధిలో గోశాలను మరింత అభివృద్ధి చేయాల్సిన దేవస్థాన అధికారులు, తమ ఇష్టానుసారంగా గోవులను ఆలయానికి దూరంగా తరలించడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి ఆలయం దిగువ ప్రైవేటు వ్యక్తులు సొసైటీ పేరిట గోశాలను నిర్వహిస్తున్నప్పుడు దేవస్థానం గోశాలను నిర్వహించడంలో ఇబ్బందులు ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. దుర్గగుడికి 15 కిలోమీటర్ల దూరంలో గోవులను తరలించడం కంటే దేవస్థానానికి కూతవేటు దూరంలో నిరుపయోగంగా ఉన్న సీవీరెడ్డి చారిటీస్, ఏనుగుల షెడ్డును వినియోగంలోకి తీసువస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఆలయంలో ఉన్న గోవులను అమ్మవారికి అందనంత దూరంలో ఉంచాల్సి వచ్చిందో అధికారులు భక్తులు సమాధానం చెప్పాలంటున్నారు. -
ఆత్మీయ కలయికలతో అసమానతలు లేని సమాజం
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): అసమానతలు లేని సమాజం కోసం ఇలాంటి ఆత్మీయ కలయికలు తరచూ జరగాలని సమతా పార్టీ జాతీయ కమిటీ మాజీ అధ్యక్షుడు వీవీ కృష్ణారావు అన్నారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సంక్రాంతి ఆత్మీయ కలయిక ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకతీతంగా గత 10 సంవత్సరాలుగా ఈ ఆత్మీయ కలయికను నిర్వహిస్తున్నానన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రజల పరం కావాలని, అసమానతలు లేని సమాజమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కృష్ణారావు ఆకాంక్షించారు. విధానాలు వేరైనా అభ్యుదయం, సమానత్వం కోసం ఆత్మీయంగా అందరూ కలిసి పనిచేయాలన్నారు. పాల్గొన్న ప్రముఖులు.. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తూ రాష్ట్రాలపై బలవంతంగా రద్దుతోందన్నారు. ఆత్మీయ కలయికలో ఎమ్మెల్సీ బి.టి.నాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పోలీస్ విశ్రాంత అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ షుబ్లీ, సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, సీపీఐ నాయకురాలు అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలనుకొండ శివాజీ, బీజేపీ నాయకుడు లక్ష్మీపతి రాజా, జీఎస్టీ(ఆడిట్) కమిషనర్ ఆనంద్, ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్‌కుమార్, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, హైకోర్టు న్యాయవాది రవితేజ, మాదిగ దండోరా నాయకుడు కృపాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతి సందడి షురూ !
కీసర(కంచికచర్ల): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇతర రాష్ట్రాల్లో నివసించే ఆంధ్ర ప్రాంత ప్రజలు ఆదివారం కూడా కార్లు, ఇతర వాహనాలలో సొంతూళ్లకు బయలుదేరారు. కంచికచర్ల మండలంలోని కీసర టోల్‌ప్లాజా వద్ద ఏడు కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఫాస్టాగ్ సిస్టం ఉండటంతో వాహనాలన్నీ ఆగకుండా వెళ్తున్నాయి. ఆదివారం 14 వేల వాహనాలు హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపునకు వెళ్లాయని ప్లాజా మేనేజర్ జయప్రకాష్ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఈ ఏడా ది అధిక సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నారు. ప్లాజా వద్ద వాహనాలు నిలబడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జయప్రకాష్ చెప్పారు. ఆయుష్‌లో ఈఎస్ఐ సేవలు లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ సేవలను అధికారికంగా ప్రారంభించినట్లు ఆస్పత్రి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.జయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సేవల ప్రారంభంతో వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ ద్వారా నాణ్యమైన, సమగ్ర వైద్య సేవలు తమ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈఎస్ఐలో అర్హులైన లబ్ధిదారులకు, అవుట్ పేషెంట్స్, ఇన్‌పేషెంట్ సేవలతో పాటు డయాగ్నోస్టిక్ పరీక్షలు, శస్త్రచికిత్సలు, అవసరమైన ఇతర వైద్య సేవలను పొందవచ్చన్నారు. ఈఎస్ఐ కార్పొరేషన్, సీజీహెచ్ఎస్ నిబంధనల ప్రకారం సేవలు అందించనున్నట్లు జయలక్ష్మి తెలిపారు. ఈఎస్ఐ లబ్ధిదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నున్నలో కోడిపందేల బరులు ధ్వంసం టాస్క్‌ఫోర్స్: విజయవాడ రూరల్ మండలం నున్న శివారులోని వికాస్ కాలేజీ రోడ్డులో సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు కోడిపందేలు నిర్వహించేందుకు సిద్ధం చేసిన బరులను పోలీసులు ఆదివారం సాయంత్రం ధ్వంసం చేశారు. కోడి పందేల నిర్వహణపై టీడీపీ నేతలు నున్నలో సమావేశమై చర్చించుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై సాక్షిలో ‘మూడు రోజులు కోడి పందేలు పెట్టేద్దాం’ శీర్షికన ఆదివారం కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఏసీపీ స్రవంతి రాయ్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది కోడి పందేల కోసం సిద్ధం చేసిన బరులను పరిశీలించారు. ట్రాక్టర్లతో సదరు బరులను ధ్వంసం చేశారు. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ ఆదేశాలను ఉల్లంఘించి కోడిపందేలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. సీఐ కృష్ణమోహన్, పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. స్థిరాస్తి సమకూర్చుకునేందుకు క్రెడాయ్ దిక్సూచి లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో స్థిరాస్తి సమకూర్చుకునేందుకు ఇదే సరైన సమయమని ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) చైర్మన్ ఆరె.శివారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారికి క్రెడాయ్ దిక్సూచిగా వ్యవహరిస్తోందన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన 11వ క్రెడాయ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సభకు శివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మధ్య తరగతి వారు సొంతిల్లు సమకూర్చుకునేలా పెట్టుబడులు పెడుతున్నారని, నిర్మాణ రంగం గాడిలో పడుతోందనడానికి ఇది సంకేతమని పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరం అటు రియల్ ఎస్టేట్ రంగానికి, ఇటు నిర్మాణ రంగానికి అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ క్రెడాయ్ విభాగం ప్రధాన కార్యదర్శి దాసరి రాంబాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన వృద్ధి వస్తుందని ఆకాంక్షించారు. భవన నిర్మాణ రంగం బాగుంటే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. విజయవాడ క్రెడాయ్ విభాగం చైర్మన్ సీహెచ్ సతీష్ బాబు, ప్రెసిడెంట్ జీఎస్ఆర్ మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి కె.రఘురామ్, కోశాధికారి సత్య సాయిరామ్ పాల్గొన్నారు. -
స్క్రీనింగ్ తప్పనిసరి..
లివర్ వ్యాధులకు ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. కొందరిలో సాధారణంగా జ్వరం, కామెర్లు, నీరసం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. మధుమేహులు, ఆల్కహాల్ సేవించే వారు, ఒబెసిటీ ఉన్న వారు, హెపటైటీస్ వైరస్లు ఉన్న వారు ముందుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో పాటు ఇప్పుడు ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఫైబ్రోస్కాన్ అందుబాటులోకి వచ్చింది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్ వ్యాయామం తప్పనిసరి. – డాక్టర్ చింతా వీర అభినవ్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్● -
మతోన్మాదంపై ఉద్యమిద్దాం
విశాలాంధ్ర పుస్తకాల ఆవిష్కరణ సభలో వక్తలు వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దేశంలో చోటు చేసుకున్న మతోన్మాద పరిస్థితులపై, ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న విచ్ఛిన్నకర ధోరణలపై ప్రజాస్వామ్యవాదులంతా కలిసి పని చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా బీవీ పట్టాభిరాం సాహిత్యవేదికపై విశాలాంధ్ర పుస్తకాల ఆవిష్కరణ సభ ఆదివారం జరిగింది. విశాలాంధ్ర సంస్థ బాధ్యుడు గడ్డం కోటేశ్వరరావు సంకలనం చేసిన ‘లౌకికత్వం– ప్రజాస్వామ్యంపై మతోన్మాదుల దాడి’, డాక్టర్ దేవరాజు మహారాజు రాసిన ‘హిందుత్వ సింహాసనంపై అబద్ధాల చక్రవర్తి’, ఏటుకూరి బలరామమూర్తి రాసిన ‘మనచరిత్ర’, వీపీహెచ్ సంకలనం చేసిన ‘చంద్రం వ్యాసావళి’ పుస్తకాలను ఆవిష్కరించారు. సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు ఈ పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రజలే మతోన్మాదంపై పోరాడాలి సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలతో కలిసి ఉద్యమించటం ద్వారానే మతోన్మాదాన్ని జయించగలమని వామపక్షవాదులకు రచయిత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న సూచించారు. మతోన్మాదాన్ని జయించడం ఉపన్యాసాల వల్ల కాదన్నారు. అహంకారంపై కవుల ధిక్కారం ‘జనకవనం’ బీవీ పట్టాభిరాం సాహిత్యవేదికపై నిర్వహించిన తొలి కార్యక్రమంలో కవులు తమ కవిత్వం ద్వారా ప్రపంచంపై దాష్టీకం చెలాయించాలని చూస్తున్న అమెరికా అహంకారంపై ధిక్కార స్వరాలు వినిపించారు. సాహి తీ స్రవంతి, మిత్ర సాహిత్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కవితా సదస్సుకు వొరప్రసాద్, తంగిరాల సోని ప్రయోక్తలుగా వ్యవహరించారు. సింగంపల్లి అశోక్ కుమార్, యింద్రవల్లి రమేష్, లెనిన్ ధనిశెట్టి, సత్యాజీ, గుండు నారాయణరావు, చలపాక ప్రకాష్, నేలపూరి రత్నాజీ, అజయ్ కుమార్ తదితరులు తమ సంక్షిప్త సందేశాలలో శ్రోతలను అలరించారు. మందరపు హైమవతి ప్రారంభ కవిత చదవగా, శిఖా– ఆకాష్, వైష్ణవిశ్రీ, అనిల్ డ్యాని, బంగర్రాజు కంఠ, డాక్టర్ జడా సుబ్బారావు తదితరులు తమ కవితాగానంతో అమెరికా దౌష్ట్యాన్ని ఖండించారు. సునిశిత విమర్శ చేసే ‘మంచికంటి కథలు’ సామాన్యుల జీవితాల్లో వస్తున్న వివిధ పరిణామాలను సునిశితంగా గమనించి, వాటిలోని మంచి చెడులను సున్నితంగా పాఠకుల దృష్టికి తేవడంలో కథకుడిగా మంచికంటి విజయం సాధించారని సంపాదకులు నండూరి రాజగోపాల్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవం పదోరోజు ఆదివారం బీవీ పట్టాభిరాం సాహిత్యవేదికపై రెండో ‘అంబేడ్కర్ మనవాడు’ పేరుతో మంచికంటి రాసిన కథా సంకలనాన్ని శ్రీశ్రీ సంస్థ అధినేత విశ్వేశ్వరరావు ఆవిష్కరించారు. మరో గ్రంథాలయ ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు కాట్రగడ్డ దయానంద్ అధ్యక్షత వహించారు. రచయిత మన్నం త్రిమూర్తులు తొలిప్రతిని స్వీకరించారు. నండూరి రాజగోపాల్ పుస్తకాన్ని సమీక్షించారు. -
హైటెక్ హంగులు..
కోడిపందేలు తిలకించేలా గ్యాలరీలు, ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడీ స్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం వచ్చినా, మంచు వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ రెయిన్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. కేసినోను తలదన్నేలా జూద క్రీడలు నిర్వహించేందుకు భారీ షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏసీతో పాటు అన్ని హంగులు సమకూర్చుతున్నారు. వేల మంది కూర్చొని చూసేందుకు వీలుగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతేక్యంగా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బరుల్లో ఒక్కో విభాగం విభజించి, రేటు పెట్టి బయటి వ్యక్తులకు కేటాయిస్తున్నారు. జూద క్రీడలు, కోడిపందేలు, కేసినో, ఫుడ్, మందు, ఇలా స్టాల్స్‌గా విభజించి రేట్లు నిర్ణయించారు. ఈ బరుల నిర్వహణలో గంజాయి కేసుల్లో ఉన్న వారు ఉన్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు సాయంత్రం 6 గంటల వరకు సంప్రదాయబద్ధంగా పోటీలు నిర్వహించుకొంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. డే అండ్ నైట్ జూద క్రీడలు, కోడిపందేలు వంటి వాటి వల్లే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటి నియంత్రణను పోలీసులు, రెవెన్యూ ఉన్నతాధికారులు ఏవిధంగా చేస్తారో వేచి చూడాల్సిందే. -
పోరాట యోధుడు వడ్డే ఓబన్న
చిలకలపూడి(మచిలీపట్నం): దేశం కోసం బ్రిటీష్ వారితో పోరాటం చేసిన యోధుడు వడ్డే ఓబన్న అని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని ఆదివారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఎంతో మందిలో వడ్డే ఓబన్న ఒకరన్నారు. బ్రిటీష్ ప్రభుత్వంలో వడ్డే ఓబన్న గ్రామరక్షకుడిగా ఉద్యోగం చేస్తూ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పోరాటానికి దిగారన్నారు. ఓబన్న గురించి రాసిన పుస్తకం కర్నూలులో ఉన్నట్లు తమకు తెలిసిందని దాని ప్రతిని తెప్పించి కలెక్టరేట్లోని గ్రంథాలయంలో ఉంచుతామన్నారు. బీసీ సంక్షేమ సాధికారత అధికారి జి. రమేష్, గిరిజన సంక్షేమాధికారి ఫణిదూర్జటి, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. హోరాహోరీగా రెవెన్యూ ఉద్యోగుల సంఘ ఎన్నికలు చిలకలపూడి(మచిలీపట్నం): ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కృష్ణాజిల్లా కార్యవర్గ ఎన్నికలు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. స్థానిక రెవెన్యూ భవన్లో ఉదయం 10 గంటల నుంచి ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘ ఎన్నికల్లో రెండు ప్యానళ్లు పోటీ పడ్డాయి. పేటేటి సత్యనారాయణ 12మంది సభ్యులతో ప్యానల్‌గా, ఎంవీ శ్యామ్‌నాఽథ్ 12 మంది సభ్యులతో ప్యానల్‌గా పోటీపడ్డారు. ఈ ఎన్నికల ప్రక్రియలో పేటేటి సత్యనారాయణ అధ్యక్షుడిగా గెలుపొందగా, ఎంవీ శ్యామ్‌నాఽథ్ ప్యానల్ సభ్యులు ఎక్కువ మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరో ప్యానల్లోని ఎంవీ శ్యామ్‌నాఽథ్ ఎన్నికయ్యారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
ఉయ్యూరు: నగల దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఉయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు ఆదివారం ఉయ్యూరు టౌన్ పోలీసుస్టేషన్లో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఐ భీమవరానికి చెందిన గొర్రెల సత్యనారాయణ చిన్ననాటి నుంచే విలాసాలకు అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారు నగల దుకాణాలను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఇరు రాష్ట్రాల్లో 30కి పైగా కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం పోలీసుస్టేషన్లో చోరీ కేసు నమోదైంది. మధ్యాహ్న భోజన సమయాన్ని అదునుగా చేసుకుని నగల దుకాణాల్లోకి చొరబడి ఆభరణాలను అపహరిస్తుంటాడు. చోరీ సొత్తు కొంటున్న వ్యక్తి పట్టివేత.. ఈ క్రమంలో గత నెల 20న ఉయ్యూరు మార్కెట్ సెంటర్ సమీపంలో శ్రీకృష్ణసాయి జ్యూయలర్స్‌లో షాపు యజమానురాలు భోజనం చేస్తున్న సమయంలో షాపులోకి ప్రవేశించి 80 గ్రాములు విలువైన 35 జతల బంగారు చెవి దిద్దులను అపహరించుకుపోయాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సత్యనారాయణను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీఎస్ సీఐ గోవిందరాజు, ఉయ్యూరు పట్టణ సీఐ రామారావు సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి ఉయ్యూరు మార్కెట్‌యార్డు సమీపంలో సత్యనారాయణను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 30 జతల చెవి దిద్దులు, 12 చిన్న ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ రూ.12 లక్షలు ఉంటుందన్నారు. సత్యనారాయణతో పాటు చోరీ సొత్తు కొనటానికి వచ్చిన కంచర్ల సాయిసుధీర్ను గుంటూరు నల్లచెరువు సమీపంలో అరెస్ట్ చేశారు. వారిని అరెస్ట్ చేసి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సూపర్‌స్టార్ కృష్ణ పేరు నిలబెట్టడమే తన లక్ష్యమని ఆయన మనువడు వర్థమాన హీరో జయకృష్ణ అన్నారు. విజయవాడ లెనిన్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన సూపర్‌స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో ఘట్టమనేని జయకృష్ణ, శేషగిరిరావు పాల్గొని సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈనాడు సినిమాలోని రామరాజు పాత్ర గెటప్‌లో ఉన్న విగ్రహం ఏర్పాటు చేశారు. జయకృష్ణను ప్రేక్షకులు ఆదరించాలి.. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ.. అగ్నిపర్వతం సినిమా విడుదలై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాత కృష్ణ విగ్రహం అభిమానులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విగ్రహావిష్కరణకు వచ్చి అభిమానులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తనకు బాబాయ్ మహేష్ బాబు సపోర్ట్ ఉందన్నారు. తను నటించే సినిమా ఫస్ట్ లుక్‌ను మహేష్ బాబు లాంచ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. సినీ నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. కాబోయే సూపర్ స్టార్ జయకృష్ణ అని కొనియాడారు. ఘట్టమనేని శేషగిరిరావు మాట్లాడుతూ జయకృష్ణను ప్రేక్షకులు ఆదరించాలని, కృష్ణ లెగసీ కొనసాగాలన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, వెనిగండ్ల రాము, నిర్మాత జెమిని కిరణ్, విగ్రహ కమిటీ సభ్యులు సుధాస్వామి, శీరం బుజ్జి, జితేంద్ర, పెద్ద సంఖ్యలో కృష్ణ అభిమానులు పాల్గొన్నారు. -
వైభవంగా ఘనరాగ పంచరత్న కీర్తనల గోష్టిగానం
విజయవాడకల్చరల్: సద్గురు సంగీత సభ, భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జీవీఆర్ సంగీత కళాశాలలో నిర్వహిస్తున్న 31వ త్యాగరాజస్వామి ఆరాధాన ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. త్యాగరాజస్వామి రచించిన స్వరపరచిన ఘనరాగ పంచరత్న కీర్తనలు జగదానందకారక, దుడుకుగల, సాధించినే, కనకన రుచిరా, ఎందరో మహానుభావులు కీర్తనలను 200 మంది గాయకులు వాద్యకారుల సహకారంతో ఆలపించారు. వాగ్గేయకారుడు సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబు, మోదుమూడి సుధాకర్, వేమూరి విశ్వనాథ్, గౌరీనాథ్, పారుపల్లి సుబ్బరాయ ఫల్గుణ్, గాయత్రీ గౌరీనాథ్, అంజనా సుధాకర్, మల్లాది కార్తీక త్రివేణి పంచరత్న కీర్తనల గోష్టిగానంలో పాల్గొన్నారు. స్వరార్చన కార్యక్రమంలో భాగంగా విద్యావైద్యనాథ్, పసుమర్తి పావని, పసుమర్తి పవిత్ర, అచల శంకరనాథ్(వీణ), కొత్తపల్లి వందన, విష్ణుభోట్ల సోదరీమణులు, సీవీపీ శాస్త్రి, పోపూరి శ్రీరాం చరణ్, చిట్టా కార్తీక్, చిట్టా దీపక్ త్యాగరాజ స్వామి రచించిన కీర్తనలను ఆలపించారు. సంగీత విద్వాంసులు ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఆలపించడంతో సంగీత ఉత్సవాలు ముగిశాయి. -
కనిపించని క్షీరధార!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కేవలం గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుందని పెద్దల వాక్కు. అంతటి విశేషమైన గోమాతను సాక్షాత్తూ అమ్మలగన్నమ్మ దుర్గమ్మ సన్నిధికి దూరం చేశారు. ఇంద్రకీలాద్రిపై ఉండాల్సిన గోవులను ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోరంకిలోకి వేద పాఠశాలకు తరలించారు. దీంతో అమ్మవారి, అయ్యవారి పూజలు, అభిషేకాలను అవసరమైన ఆవు పాల కోసం ప్యాకెట్ పాలు, టెట్రా ప్యాకెట్ పాలపై ఆధారపడాల్సి వచ్చింది. తొలి దర్శనం గోమాతే.. ఆలయ ప్రాంగణంలో క్యూలైన్ల పక్కన గోశాల ఉండేది. క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు తొలుత గోమాతను దర్శించుకున్న అనంతరం ఎడమ వైపునకు తిరిగితే అమ్మవారి బంగారు గోపురం, కుడివైపునకు తిరిగి చూస్తే రాజగోపురం దర్శనమిస్తుంది. ఇక ఆలయానికి విచ్చేసే పీఠాధిపతులు, స్వామిజీలు సైతం గోమాతను దర్శించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కృష్ణాష్టమి వంటి విశేష పర్వదినాల్లో ఆలయ అధికారులకు గోమాతకు పూజలు నిర్వహించి ఇక లక్ష్మీగణపతి విగ్రహం పక్కనే గోకులం ఏర్పాటు చేసి అందులో గోమాత కోసం గరుకు రాయిని సైతం ఏర్పాటు చేశారు. గోశాల, గోకులంలో నాలుగు గోమాతలను సంరక్షించేందుకు ఇద్దరు సుశిక్షకులైన గోసంరక్షకులు ఉండేవారు. గోమాత బాగోగులు చూసుకోవడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళ పాలు పితికి ఆలయంలో అందించేవారు. ఇక అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు తమ శక్తి కొలది విరాళాలను అక్కడే ఉన్న హుండీలో వేసేవారు. ప్రతి నిత్యం అమ్మవారి దర్శనానికి విచ్చేసే అనేక మంది భక్తులు కొండ దిగువ నుంచి మేత తీసుకువచ్చి గోవులకు అందించేవారు. పునాదులతో పెకిలించి.. ఈ ఏడాది దసరా ఉత్సవాల సమయంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న గోశాలను, గోకులంలో గోమాతలను పోరంకిలోని వేద పాఠశాలకు తరలించారు. అయితే ఉత్సవాల అనంతరం గోమాతలను తిరిగి దుర్గగుడికి తీసుకువస్తారని భక్తులందరూ భావించారు. అయితే ఇంత వరకు అటువంటి చర్యలేమీ తీసుకోకపోగా, ఆలయ ప్రాంగణంలో గోశాలను పునాదులతో పెకిలించారు. పవిత్రమైన గోవులు ఉండే గోశాల స్థలంలో ఇప్పుడు కుక్కలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇక గోకులం శానిటేషన్ సిబ్బందికి ఆవాసంగా మారింది. అక్కడే భోజనాలు చేయడం, విశ్రాంతి తీసుకోవడం తమకు పనికి రాని సామగ్రిని భద్రపరుచుకునే గోడౌన్‌గా మారిపోయింది. శివార్చనకు ప్యాకెట్ పాలు.. దుర్గగుడి ప్రాంగణంలోని గోశాలలో ఆవుల ద్వారా ప్రతి నిత్యం సుమారు పది లీటర్లకు పైగా పాలు లభించేవి. ఈ పాలను ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి అభిషేకాలకు వినియోగించే వారు. ప్రతి నిత్యం గోవులను సంరక్షించే వ్యక్తి తెల్లవారుజామున నాలుగు గంటలకే పాలు పితికి వాటిని శివాలయంలో అర్చకులకు అందించే వారు. అయితే ఇప్పుడు మల్లేశ్వర స్వామి వారికి గోశాల నుంచి వచ్చే పాలు కాకుండా ప్యాకెట్లు, డబ్బాలలో తెచ్చిన పాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధమైన ఆలయాలు, పుణ్యక్షేత్రాలలో శివార్చనకు ప్యాకెట్ పాలను వినియోగించరు. అయితే ఇంద్రకీలాద్రిపై మాత్రం ప్రతి నిత్యం శివయ్య అభిషేకానికి ప్యాకెట్ పాలను వినియోగించడం ఎంత వరకు సబబో దుర్గగుడి అధికారులే చెప్పాలి. దుర్గమ్మకు అల్లంత దూరాన గోమాత దుర్గగుడిలో శ్రీచక్ర పూజలో వినియోగించే పాలలో పురుగు వచ్చిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీచక్రనవార్చన పూజ నిర్వహించే అర్చకుడి విధుల్లో ఆదివారం నుంచి మార్పు చేసినట్లు సమాచారం. అర్చకుడికి లక్ష కుంకుమార్చన పర్యవేక్షణతో పాటు ఆదిదంపతులకు సాయంత్రం సమయంలో జరిగే పల్లకీ సేవ, దర్బారు సేవ నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మరో వైపు ఆలయ ఏఈఓ వెంకటరెడ్డి నుంచి విచారణ కమిటీ రికార్డు పూర్వకంగా స్టేట్ మెంట్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు అర్చకుడు పూజలో ఉండటంతో ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేనందున వాట్సాప్‌లో సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని కొంత మంది ఆలయ అధికారులు కావాలనే బయటకు సమాచారం ఇచ్చినట్లు ఈఓ గుర్తించి.. సంబంధిత అధికారులపై చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. -
ఆకట్టుకున్న ఆవుల అందాల పోటీలు
గన్నవరం: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆవరణలో ఆదివారం శ్రీలక్ష్మీనరసింహ సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయ స్థాయిలో ఆవుల అందాల పోటీలను నిర్వహించారు. తొలుత ఈ పోటీలను ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి ఆవులను తీసుకువచ్చారు. ఈ పోటీల్లో గెలుపొందిన పశువులకు సంబంధించిన యాజమానులకు 6.50 లక్షల నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. పోటీల నిర్వాహకులు కాసరనేని రాజా, ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం ఇన్చార్జ్ సర్పంచ్ పాలడుగు నాని, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, మాజీ సర్పంచ్ గూడపాటి తులసిమోహన్ పాల్గొన్నారు. పోటీల్లో విజేతల వివరాలు.. ఈ పోటీల్లో ఒంగోలు జాతి పళ్లు కలిపిన ఆవుల విభాగంలో ఏలూరు జిల్లాకు చెందిన అడపా శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా ఇస్రంపేటకు చెందిన తువ్వాటి బాలకృష్ణ, తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా సుబ్బారావు ఆవులు మూడు స్థానాల్లో నిలిచాయి. ఒంగోలు జాతి ఆరు పళ్ల విభాగంలో కంకిపాడుకు చెందిన వట్టి కృష్ణయ్య ఆవులు ద్వితీయ స్థానం, నాలుగు పళ్ల విభాగంలో పమిడిముక్కల మండలం పమిడిగుంటపాలెంకు చెందిన మైనేని వంశీకృష్ణ మొదటి స్థానం, ఒంగోలు జాతి రెండు పళ్ల విభాగంలో పెనమలూరుకు చెందిన కిలారు వెంకటేశ్వరరావు ఆవులు మొదటి స్థానంలో నిలిచాయి, బెంజిసర్కిల్ వద్ద కారు దగ్ధం పటమట(విజయవాడతూర్పు): తాడేపల్లి నుంచి కానూరు వస్తున్న ిఓ కారు బెంజిసర్కిల్ వద్దకు రాగానే మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి డ్రైవర్‌ను అప్రమత్తం చేయటంతో ఎలాంటి ప్రాణనష్టం కలగలేదు. దీనిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కానూరుకు చెందిన పాకనాటి గౌతమ్‌రాజ్ కానూరు మెయిన్‌రోడ్డులో ఉన్న పీఆర్ హాస్పిటల్స్‌లో వైద్యునిగా పనిచేస్తున్నారు. ఆదివారం తాడేపల్లిలో వ్యక్తిగత పని ముగించుకుని తన ఈవీ(ఎలక్ట్రికల్ వెహికల్) కారులో ఇంటికి తిరిగివెళ్తున్న సమయంలో బెంజిసర్కిల్ దాటిన తర్వాత సర్వోత్తమ గ్రంథాలయ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి కారులో పొగలు రావటం చూసి స్థానికులు గౌతమ్రాజ్ను అప్రమత్తం చేశారు. వెంటనే కారును పక్కన ఆపి కారు దిగాడు. అదే సమయంలో మంటలు పెద్దగా వ్యాపించటంతో స్థానికులు ఆటోనగర్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. -
కార్మిక హక్కులను కాలరాస్తున్న మోదీ, చంద్రబాబు
భవానీపురం(విజయవాడపశ్చిమ): దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు తీవ్రమవుతున్న తరుణంలో ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 18న ఖమ్మంలో జరుగనున్న పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం భవానీపురం వెంకటేశ్వర ఫౌండ్రీ వద్ద నుంచి చేపట్టిన బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అక్కడ నుంచి స్వాతి సెంటర్, సితార సెంటర్, చిట్టినగర్, కాళేశ్వరరావు మార్కెట్, కృష్ణలంక స్వర్గపురి వద్దకు ర్యాలీ చేరుకుంది. కమ్యూనిస్ట్ ఉద్యమ స్ఫూర్తి.. శతాబ్ది ఉత్సవాలు ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా తప్పుట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే బాటలో నడుస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, చంద్రబాబు కార్మికుల హక్కుల కంటే కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుండటం దుర్మార్గమన్నారు. అన్ని వర్గాలకు చెందాల్సిన సంపదను కేవలం కొద్ది మందికి మాత్రమే చేరేలా వారు నిర్ణయాలను తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. పార్టీ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మాజీ మేయర్ టి.వెంకటేశ్వరరావు నాయకత్వంలో సీపీఐ రెండు సార్లు విజయవాడ నగరాన్ని పాలించిందని, పౌరులపై భారాలు మోపకుండా ప్రజాసంక్షేమంపై దృష్టి సారించిందన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమ స్ఫూర్తిని శతాబ్ది ఉత్సవాలు సూచిస్తున్నాయని చెప్పారు. ర్యాలీలో నగర పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, వివిధ డివిజన్లలోని పార్టీ కార్యదర్శులు, ప్రజాసంఘాల కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య -
వాలీబాల్ విజేత ఏపీఎస్పీ బెటాలియన్
ఇబ్రహీంపట్నం: రావి ఫణి యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన వాలీబాల్ పోటీలు శనివారం రాత్రి హోరాహోరీగా జరిగాయి. వెల్లటూరు, శక్తినగర్, ఏపీఎస్పీ బెటాలియన్, తదితర జట్లు తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్ వెల్లటూరు, ఏపీఎస్పీ జట్లు మధ్య జరగగా, ఏపీఎస్పీ బెటాలియన్ జట్టు విజేతగా నిలిచింది. విజేతకు మునిసిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, గణేష్ ట్రాన్స్పోర్ట్ అధినేత రాం ప్రసాద్ బహుమతులు అందజేశారు. 13న పొట్టేళ్ల పోటీలు జరగనున్నట్లు నిర్వాహకుడు రావి ఫణి తెలిపారు. నేటి నుంచి పొట్టేళ్ల పందేలు కూచిపూడి(మొవ్వ): సంక్రాతి సంబరాల్లో భాగంగా మొవ్వ మండలం కూచిపూడిలోని నన్నపనేని గ్రౌండ్స్‌లో నన్నపనేని యువసేన ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పొట్టేళ్ల పందేలను సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైయ్యే ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాంపూర్, కర్ణాటక, వినైతి జాతులకు చెందిన పెందెం పొట్టేలు సుమారు 250 వరకు ఇక్కడికి తీసుకొచ్చారు. వీటిని చూసేందుకు స్థానిక ప్రజలు, పిల్లలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు యజమానులు తమ పొట్టేళ్లతో తరలి వచ్చారు. ఈ పోటీలను రాంపూర్ జాతి, కర్ణాటక జాతుల ప్రకారం రెండు విభాగాలుగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు నన్నపనేని వీరేంద్ర తెలిపారు. దుర్గమ్మ సన్నిధిలో రద్దీ సాధారణం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచి ఆదిదంపతులైన దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు ఉదయం 11.40 గంటలకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. మహానివేదన అనంతరం తిరిగి 12.20 గంటలకు దర్శనాలు ప్రారంభం కాగా ఘాట్ రోడ్డుపై నుంచి వచ్చే క్యూలైన్లు గాలిగోపురం వరకు, మహామండపం వైపు నుంచి వచ్చే భక్తుల క్యూ మైక్ ప్రచార కేంద్రం వరకు మాత్ర మే చేరింది. రద్దీ సాధారణంగా ఉన్నా దేవస్థానం రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి, అంతరాలయం రద్దు చేసింది. రూ. 300 టికెట్లపై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అంతరాలయ దర్శనం ప్రారంభమైంది. సాయంత్రం వరకు రద్దీ సాధారణంగానే కొనసాగింది. రెవెన్యూ కార్యాలయంలో విచారణ కంచికచర్ల: కంచికచర్ల రెవెన్యూ కార్యాలయంలో ఈనెల 9తేదీ తెల్లవారుజామున రెవెన్యూ రికార్డులు అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఘటనపై చీఫ్ కమిషనర్ ల్యాండ్ ఎక్విజేషన్(సీసీ ఎల్ఏ) జయలక్ష్మి ఆదివారం విచారణ చేపట్టారు. ముందుగా రెవెన్యూ కార్యాలయంలో దగ్ధమైన రికార్డు గదిని జేసీతో కలసి పరిశీలించారు. రికార్డులు దగ్ధమవటానికి కారణాలు రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ వల్ల కాలిపోయాయా లేదా ఆకతాయిల వల్ల ఏమైనా జరిగిందా అని పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ఆమె చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, నందిగామ ఆర్డీఓ కె. బాలకృష్ణ, తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు నందిగామ రూరల్ సీఐ చవాన్ తదితరులున్నారు. -
యువ రచయితలు రావటం మంచి పరిణామం
యువ రచయితలు రావటం చాలా మంచి పరిణామం. కొన్ని సంవత్సరాలుగా యువత రచనల వైపు రావటం కనపడటం లేదు. చాలా మంది ఇతర రంగాల వైపు వెళ్లిపోతున్నారు. కొంతమంది యువత మంచి రచనలతో సాహిత్య రంగంలో అడుగులు వేస్తున్నారు. వారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అటువంటి వారిని అందరూ ప్రోత్సహించాలి. విజయవాడ పుస్తక మహోత్సవంలో కొత్త రచయితలు తమ రచనలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు. ఇదే విధంగా మరింతగా యు వరచయితలు ముందుకు రావాలి. – టి.మనోహర్‌నాయుడు, అధ్యక్షులు, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ -
జీజీహెచ్‌లో డెలివర్రీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం నిండు గర్భిణుల పాలిట శాపంగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అరకొరగా మాత్రమే ప్రసవాలు జరుగుతున్నాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి పురిటి నొప్పులతో గర్భిణులు విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)కి వస్తు న్నారు. దీంతో జీజీహెచ్‌పై భారం పెరుగుతోంది. ఒక్కొక్కసారి పడకలు చాలక ఒకే బెడ్‌పై ఇద్దరు గర్భిణులు, బాలింతలు ఉండాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంటోంది. అందుకు వైద్యులు, వైద్యాధికారుల తప్పిదం ఏమీ లేకున్నా, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణంగా నిలుస్తోంది. ఇతర ప్రసూతి ఆస్పత్రులను నిర్లక్ష్యం చేయడంతో అందరూ జీజీహెచ్‌కు వస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. నాలుగు జిల్లాలకు పెద్దదిక్కు విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) ప్రసూతి విభాగానికి కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు జిల్లాల నుంచి గర్భిణులు ప్రసవం కోసం వస్తుంటారు. వీరిలో కొందరు ఇక్కడే గర్భిణిగా ఉన్న సమయంలో మందులు వాడే వారు ఉంటుండగా, మరికొందరు అత్యవసరంగా ఇతర ఆస్పత్రుల నుంచి రిఫర్ చేసిన వారు ఉంటున్నారు. అంతేకాదు తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు వంటి ఆస్పత్రుల నుంచి సాయంత్రం అయితే చాలు గర్భిణుల పరిస్థితి కొద్దిగా క్రిటికల్‌గా ఉన్నా విజయవాడకు తరలించేస్తున్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చినా సాధారణ ప్రసవం జరుగుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. గత ప్రభుత్వంలో మూడు యూనిట్లు పెంపు ప్రసూతి విభాగంలో ఒకప్పుడు మూడు యూనిట్లు ఉండేవి. ఒక్కో యూనిట్‌కు 30 పడకల చొప్పున 90 పడకలు అధికారికంగా ఉండేవి. అవి చాలక తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో గత ప్రభుత్వంలో మరో మూడు యూనిట్లు మంజూరు చేసింది. ఫలితంగా అదనంగా 90 పడకలు పెరగడంతో పాటు, వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెరిగారు. దీంతో ప్రస్తుతం ఆరు యూనిట్లు ఉండగా 180 పడకలు అధికారికంగా ఉన్నాయి. లేబర్ రూమ్‌లో మరో 20 పడకలు ఉన్నాయి. అనధికారికంగా 225 పడకలు వరకూ ఉన్నాయి. అయినప్పటికీ పడకలు చాలని పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి 250 నుంచి 300 మంది వరకూ గర్భిణులు, బాలింతలతో పాటు, గర్భకోశ వ్యాధులకు గురైన మహిళలు చికిత్స పొందుతుంటారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రులకు ప్రసవం కోసం వెళితే లక్ష రూపాయలకు పైగా బిల్లు చెల్లించాల్సి వస్తోంది. అంతేకాదు పుట్టిన బిడ్డకు ఎన్ఐసీయూలో చికిత్స అవసరం అయితే ఎన్ని రూ.లక్షలు అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పేదలే కాదు, మధ్యతరగతి ప్రజలు సైతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలకు వెళ్లేందుకు ధైర్యం చేయడం లేదు. సాధారణ ప్రసవాలు, సిజేరియన్లను ఆరోగ్య శ్రీలో చేర్చినా ఒక్క ప్రైవేటు ఆస్పత్రి కూడా ఆ పథకంలో ప్రసవం చేసేందుకు ముందుకు రాక పోవడంతో జీజీహెచ్ పెద్ద దిక్కుగా మారింది. అక్కడికి వెళితే పడకలు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నియోజకవర్గంలో 50 పడకల ప్రసూతి ఆస్పత్రి ఏర్పాటు చేసి, నిపుణులైన వైద్యులను నియమించాలి. అక్కడే సిజేరియన్, స్కానింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ప్రసవం కోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలు ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో 50 పడకలతో ప్రసూతి ఆస్పత్రిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మేయర్ గత ప్రభుత్వంలో నాడు–నేడు పథకం ద్వారా పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. అంతేకాదు డెలివరీ రూమ్స్ ఏర్పాటు చేసి, అత్యాధునిక డెలివరీ టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రసవాలు చేసేందుకు అనువైన పరిస్థితిని కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం వైద్య రంగంపై నిర్లక్ష్య వైఖరి కారణంగా అవన్నీ మూలన పడ్డాయి. అధిక శాతం పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరగని పరిస్థితి నెలకొంది. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో కూడా అరకొరగానే జరుగుతున్నాయి. దీంతో జీజీహెచ్‌పై భారం పెరిగింది. -
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ (07473) రైలు ఈ నెల 11, 12 తేదీల్లో ఉదయం 7.55 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, అదేరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07474) ఈ నెల 10, 11 తేదీల్లో మధ్యాహ్నం 3.15 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయలుదేరి, అదేరోజు రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–విజయవాడ (07475) రైలు ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, అదేరోజు మధ్యాహ్నం 1.40 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07476) ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడలో బయలుదేరి అదేరోజు రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. చల్లపల్లి: మండలంలోని గ్రామాల్లో విద్యుత్ విజిలెన్స్ అధికారులు శనివారం నివాస గృహాలు, వ్యాపార సముదాయాల్లో తనిఖీలు చేశారు. రూ.6.44లక్షల జరిమానా విధించారు. తనిఖీల అనంతరం చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో జరిగిన సమావేశంలో అధికారులు మాట్లాడారు. జిల్లా విద్యుత్ విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ వాసు, ఉయ్యూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు బి.వి.సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు 27 బృందాలుగా ఏర్పడి 1971 నివాస గృహాలు, 186 వాణిజ్య సముదాయాల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అదనపు లోడు వినియోగిస్తున్న 225 సర్వీసులకు జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో చల్లపల్లి, ఉయ్యూరు ఎడిఈలు ఎన్.సుబ్రహ్మణ్యేశ్వరరావు, జి.హేమకుమార్, ఏఈ జి.బసవశాస్త్రులు, డివిజన్ పరిధిలోని ఏఈలు, జెఈలు, లైన్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
టన్ను రేషన్ బియ్యం స్వాధీనం
కోడూరు: అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ చాణిక్య తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని జరుగువానిపాలెం గ్రామానికి చెందిన పచ్చ నాగరాజు తన ఇంటి వద్ద రేషన్ బియ్యం నిల్వ చేశాడనే సమాచారంతో దాడి చేసినట్లు ఎస్ఐ చెప్పారు. ఈ దాడిలో 40 సంచుల్లో నిల్వ చేసిన వెయ్యి కేజీలు (టన్ను) రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాగరాజుపై కేసు నమోదు చేసి మధ్యవర్తుల సమక్షంలో అరెస్టు చేసినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చల్లపల్లి: గ్యాస్ పొయ్యి వద్ద మంటలను ఆర్పబోయిన ఓ వృద్ధురాలు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటన మండల పరిధిలోని పురిటిగడ్డలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పురిటిగడ్డ గ్రామానికి చెందిన ఎన్.విమల కుమారి(80) శనివారం ఉదయం గ్యాస్ పొయ్యిపై టీ కాస్తుండగా రెగ్యులేటర్ వద్ద గ్యాస్ లీకు అయ్యి మంటలు వ్యాపించాయి. కంగారుపడిన విమలకుమారి వెంటనే తన చీరతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. ఇంతలో మంటలు చీరకు అంటుకుని వళ్ళంతా వ్యాపించటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి 108లో ఆమెను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. కె. కొత్తపాలెం(మోపిదేవి): పాత కక్షల నేపథ్యంలో కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి కె.కొత్తపాలెంలో జరిగింది. ఎస్ఐ గౌతమ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మత్తి యోగి బాలవర్ధన్, చందన ప్రసాద్ గ్రామస్తులు. వీరి మధ్య గతంలో పాత కక్షలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం రాత్రి మత్తి యోగి బాలవర్ధన్ గ్రామంలో మద్యం దుకాణం వద్దకు వచ్చాడు. అక్కడ మద్యం తీసుకుంటున్న సమయంలో చందన ప్రసాద్ కూడా మద్యం కోసం వచ్చాడు. కొంత సేపటి తర్వాత మద్యం తాగిన చందన ప్రసాద్ పాత గొడవల నేపథ్యంలో బాలవర్ధన్పై కత్తితో దాడి చేశాడు. దాడిలో బాలవర్ధన్ చేతి వేళ్లు తెగిపోయాయి. తలపై బలమైన గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయవాడకు తరలించారు. బాధితుడి భార్య బార్య మత్తి నాగభవాని ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌతమ్‌కుమార్ వివరించారు. కృత్తివెన్ను: ఉప్పులూరు గ్రామంలో కోడికత్తులు కలిగి ఉన్న వ్యక్తిని గుర్తించి అతని నుంచి 70 కోడికత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పైడిబాబు తెలిపారు. వచ్చిన సమాచారం మేరకు సోదా చేయగా గ్రామానికి చెందిన చెక్కా నాగరాజు అనే వ్యక్తి వద్ద కోడికత్తులు దొరికాయన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని ప్రివెన్షన్ ఆఫ్ క్రియాల్టీ టు యానిమల్ యాక్టు కింద కేసు నమోదు చేశామన్నారు. సంక్రాంతి పండుగ పేరుతో ఎలాంటి జూదాలు నిర్వహించిన, పాల్గొన్నా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని శెట్టిగుంట పంచాయతీ తిరుపతి–కడప జాతీయ రహదారిలో శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని విజయవాడకు చెందిన దుర్గారావు (52) అనే వ్యక్తి మృతి చెందాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించడానికి కోడూరులో ఉంటున్నట్లు అతని బంధువులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కొణకంచి(పెనుగంచిప్రోలు):రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలంలోని కొణకంచి గ్రామ సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు వేదాద్రిలో స్వామి వారి దర్శనం అనంతరం అదుపు తప్పి కొణకంచి గ్రామ సమీపంలో చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో సీటు బెల్టు పెట్టుకుని డ్రైవర్ పక్క సీటులో వైజాగ్‌కు చెందిన కూర్చొన్న ఎన్నింటి నీలకంఠ (45) అనే వ్యక్తి మృతి చెందగా డ్రైవర్ రమేష్‌తో పాటు కారులో ఉన్న పవన్ , శ్రీకాంత్, సాయికుమార్ మిగిలిన నలుగురు వ్యక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో హెచ్ఆర్గా పని చేస్తూ స్నేహితులతో కలిసి వేదాద్రిలో స్వామివారిని దర్శించుకుని విజయవాడ అమ్మవారి దర్శనానికి బయలు దేరారు. స్థానిక ఎస్ఐ అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదం విషయం తెలుసుకున్న చిల్లకల్లు సూర్య శ్రీనివాస్, ఎస్ఐ–2 సాయి మణికంఠ సమాచారం తెలుసుకుని హుఠాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. -
శ్రీనివాసుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రులో ఉన్న భూ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు భారీ అన్నసమారాధన జరిగింది. అన్నసంతర్పణను నిర్వహకులు కె. బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. మేఘా ఇంజి నీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఆర్థిక సాయంతో ఈ అన్న సమారాధన జరిగిందని నిర్వాహకులు తెలిపారు. సర్వ పుష్పాలంకరణతో దర్శనమిచ్చిన స్వామికి విశేషాభిషాకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. దుర్గమ్మకు భక్తుల విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. పెన మలూరు మండలం కానూరు మైత్రినగర్‌కు చెందిన కొల్లూరి రామ్‌ప్రకాష్ కుటుంబం నిత్యా న్నదానానికి రూ.లక్ష, హైదరాబాద్‌కు చెందిన భావన భాగ్యలక్ష్మి కుటుంబం రూ.1,00,101 విరాళం అందజేశాయి. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన కిర్ల నాగవెంకట దుర్గానవీన్ కుటుంబం అమ్మవారి రూ.2,11,450 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంఅందించారు. బకాయిలు విడుదల చేయాలని వినతి లబ్బీపేట(విజయవాడతూర్పు): కాంట్రాక్టర్లకు బకాయిలు విడుదల చేసి సంక్రాంతి జరుపుకొనే అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణాజిల్లా అసోసియేషన్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కోరారు. లబ్బీపేటలోని తమ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు మండవ సాయి మాట్లాడుతూ.. బడ్జెట్ లేకుండా టెండర్లు పిలవడంతో బిల్లుల బకాయిలు పేరు కుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతినాటికైనా కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లిస్తే అదే కానుకగా భావిస్తామన్నారు. బకాయిలు రూ.10 వేల కోట్లకు చేరాయని వివరించారు. తాము బయట అప్పులు తెచ్చి పనులు చేశామని, వారికి వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తమ విజ్ఞప్తిని మన్నించాలని కోరారు. అమరావతి పనుల్లో చిన్న, మధ్య తర గతి కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి లింగం రవికిరణ్, కోశాధికారి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. ‘లిఖిత’ సేవలు అభినందనీయం కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణాజిల్లా పోలీసుశాఖకు లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఏలూరు రేంజ్ ఐజీపీ జి.వి.జి.అశోక్‌కుమార్ కొనియాడారు. కృష్ణాజిల్లా పోలీసుశాఖకు లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో అందజేసిన తొమ్మిది బొలేరో వాహనాలను ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడుతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీపీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ..ఈ వాహనాలను అవనిగడ్డ, బందరు రూరల్ స్టేషన్లకు ఉపయోగిస్తామన్నారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గట్టిపాటి శ్రీనివాసరావును ఐజీపీ, ఎస్పీ, ఎమ్మెల్యేలు కలిసి సన్మానించారు. బందరు డీఎస్పీ సీహెచ్. రాజ తదితరులు పాల్గొన్నారు. -
జంగం దేవరుల జీవితాలను వివరించాను
మాది అనంతపురం జిల్లా. నేను నా ప్రాంతంలో దగ్గరగా చూసిన బుడుగు జంగం దేవరుల జీవితాలను వివరిస్తూ ‘జంగాల్’ పేరుతో నవలను తీసుకొచ్చాను. ప్రస్తుత సమాజంలో వారి పరిస్థితితో పాటుగా వారు తమ అస్థిత్వం కోసం పోరాడుతున్న తీరును సైతం దీనిలో వివరించే ప్రయత్నం చేశాను. చాలా బాగా విక్రయాలు జరుగుతున్నాయి. ఇది నా మొదటి నవల. మరో నవల వచ్చే నెలలో ప్రచురింపబడుతుంది. నా నవలకు మంచి ఆదరణ లభిస్తుంది. చాలా మంది ఆశీస్సులందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. మున్ముందు మరిన్ని రచనలు తీసుకురావాలని బలంగా కోరుకుంటున్నాను. – జీవన్ గుడిమిచెర్ల, యువరచయిత అనంతపురం -
సమ్మోహనం.. స్వరరాగ సమ్మేళనం
విజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతికశాఖ సంగీత సన్మండలి ఆధ్వర్యంలో జీవీఆర్ సంగీత కళాశాలలో నిర్వహిస్తున్న 31వ వార్షిక సంగీత మహోత్సవాలు స్వరరాగ సమ్మేళనంగా సాగుతున్నాయి. శనివారం నాటి కార్యక్రమంలో గంటి శాంభవి, వైఎస్ తమన్, రాజరాజేశ్వరి, లోళ్ళ జయరాం, అంబటిపూడి తులసి, భవ్యశ్రీ గీతిక, ఎన్జీఎస్ కీర్తన, పోపూరి శ్యామసుందర్, చింతలపాటి మంజుల, మాచిరాజు కీర్తనాశర్మ, ధూళిపాళ వాసవి, ఎస్.అమృత వర్షిణి, డాక్టర్ ద్వారం లక్ష్మి, పోపూరి గౌరీనాఽథ్, మల్లాది సూరిబాబులు త్యాగరాజ స్వామి స్వరపరచి రచించిన కీర్తనలను మధురంగా ఆలపించారు.నేటితో ఆరాధనా ఉత్సవాల ముగింపు: ఆదివారం నాటి కార్యక్రమంలో ఆరాధానా సంగీతోత్సవాలు ముగుస్తాయని అధ్యక్షుడు మోదుమూడి సుధాకర్ తెలిపారు. -
దూసుకొస్తున్న యువ కలాలు..
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): గడిచిన కొన్ని దశాబ్ధాలుగా తెలుగు సాహిత్యంలో యువతరం కనిపించిన దాఖలాలు చాలా తక్కువే. తెలుగు నాట పాతతరం రచయితలు తరువాత కొత్తగా వచ్చేవారు లేకుండా పోతున్నారని సభల్లో అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు అనేకం. ముఖ్యంగా ప్రస్తుతం సాఫ్ట్వేర్ లేదా ఇంకొక వైపో ఉపాధి కోసం పరుగులు తీస్తున్న యువత సాహిత్యంపై దృష్టి సారించటం లేదనే వాదనల్లో వాస్తవం లేకపోలేదు. కానీ ఆ వాదనలకు, ఆ వ్యాఖ్యలకు భిన్నంగా నేటి యువత రచనా వ్యాసంగంలోకి అడుగులు పెడుతోంది. మేం సైతం రచనలు చేస్తాం.. అందరినీ అలరిస్తాం... అంటూ యువత సాహిత్య రంగం వైపు దూసుకొస్తుంది. తెలుగు సాహిత్య రంగంలో కొత్త పుంతలు తొక్కించేందుకు యువత కదం తొక్కటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రాచుర్యం పొందిన చాలా మంది సాహితీవేత్తల్లో చదువులు పూర్తయిన తరువాతే వారి రచనలు బాగా వెలుగులోకి వచ్చాయి. అలాగే చాలా రచనలు ఆ తరువాతే పుస్తక రూపంలో పాఠకులకు చేరువయ్యాయి. కానీ నేడు కొంతమంది యువ రచయితలు కళాశాలలో చదువుతూనే మరోవైపు సాహిత్యంలోనూ తమధైన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు. తమ రచనలను పుస్తక రూపంలో మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. చుట్టూ చూసిన అంశాలే నవలలుగా... కొత్తగా వస్తున్న యువత తమ చుట్టూ కనిపిస్తున్న అంశాలనే నవలలుగా తీసుకొస్తున్నారు. సమాజంలో అనేక అటుపోటులను ఎదుర్కొంటున్న సామాజిక వర్గాల జీవన పోరాటాన్ని ఒక యువ రచయిత వివరిస్తూ నవలను తీసుకొచ్చాడు. మరో యువ రచయిత్రి తమకు ఆత్మీయులైన వ్యక్తులు మరణిస్తే అంతటితో తమ జీవితం సైతం అయిపోయిందని చాలా మంది భ్రమపడుతూ తీవ్రంగా కుమిలిపోతారు. అలాగే మహిళలు మరింత ఒత్తిడికి గురై జీవితాలను నాశనం చేసుకుంటున్న తీరును వివరిస్తూ ఒక నవలను తీసుకొచ్చింది. -
నవల సెకండ్ ఎడిషన్‌కు వెళ్తున్నాను
నాది జగ్గయ్యపేట, నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నేను నా తొలి నవలగా ‘తుది శ్వాసే ప్రారంభం’ తీసుకొచ్చాను. మన ఆత్మీయులు చనిపోయినప్పుడు మనం చాలా కోల్పోయినట్లుగా భావిస్తాం. మన జీవితాలు అంతటితో అయిపోయాయని అనుకొని బాధపడతాం. కానీ అది సరికాదు. చిన్నచిన్న సమస్యలతో అంతా అయిపోయిందని అనుకుంటాం. అలాగే మహిళలు ఇలాగే ఉండాలి, ఇలా చేస్తేనే మంచివారు, ఇలా ఉంటేనే గౌరవం లభిస్తుందనే వాదనలు సైతం సరికాదు. మహిళలకు అస్థిత్వం ఉంటుంది. ఆ అంశాలను నా నవలలో వివరించాను. ఈ నవల మంచి ఆదరణ లభించింది. త్వరలోనే రెండో ఎడిషన్‌కు వెళ్తున్నాను. – నందిని, యువ రచయిత్రి, జగ్గయ్యపేట -
ఆటోని ఢీకొట్టిన కారు
పామర్రు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై కనుమూరు సంధ్యా ఆక్వా వద్ద ఆటోను కారు ఢీకొట్టిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో పక్కనే ఉన్న పంట బోదెలోకి ఆటో దూసుకెళ్లింది. దీనిలో ఉన్న భార్యాభర్తలు, ఇద్దరు చిన్నారులకు ఏవిధమైన గాయాలు కాలేదు. అదేవిధంగా కారు కూడా పల్టీ కొట్టి పక్కనే ఉన్న పంట బోదెలోకి వెళ్లింది. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయని, అదేవిధంగా కారులో ఇరుక్కుపోయిన వారిని స్థానికులు స్పందించి బయటికి తీశారు. వీరికి కూడా స్వల్ప గాయాలవడంతో దగ్గరలోని వైద్యశాలకు తరలించారు. -
రీసర్వేకు సహకరించాలి
ఆక్వా రైతులకు కలెక్టర్ బాలాజీ సూచన నందివాడ: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన రీసర్వేకు ఆక్వా రైతులు సహకరించాలని కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. నందివాడ మండలం అనమనపూడి గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయం వద్ద గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆక్వా భూముల రీసర్వే సమస్యలపై అనమనపూడి, దండిగనపూడి, గండేపూడి గ్రామాల రైతులతో శనివారం సాయంత్రం కలెక్టర్ సమావేశమై చర్చించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. నందివాడ మండలంలో ఆక్వా సాగు అధిక మని, వ్యక్తిగతంగా కాకుండా ఒకే చెరువు కింద అనేక మంది రైతులకు చెందిన భూములు సాగులో ఉన్నాయన్నారు. వాటికి రీసర్వే చేసే క్రమంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి భూముల విషయంలో సరిహద్దులు, భూవిస్తీర్ణం సరిపోలిన వాటికి సబ్ డివిజన్ చేసి ఎల్పీఎం (ల్యాండ్ పార్సెల్ మ్యాప్) సంఖ్య కేటాయిస్తామన్నారు. ఉమ్మడి భూములకు జాయింట్ ఎల్పీఎం కేటాయిస్తే భవిష్యత్తులో ఆయా భూముల రైతులకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రైతులు సహకరించాలని కోరారు. ఉమ్మడి భూముల విస్తీర్ణం విషయంలో రైతులు ఏకాభిప్రాయంతో ముందుకొస్తే చాలావరకు సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆ దిశగా ఆలోచన చేయాలని కోరారు. అనంతరం ఆయా గ్రామాల మహిళలు కలెక్టర్‌ను కలిసి గుడివాడ నుంచి తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం కేవలం విద్యార్థుల కోసం మాత్రమే ఉదయం సాయంత్రం రెండు ట్రిప్పులు వస్తున్నాయని, గ్రామంలోని ప్రజల కోసం అదనంగా బస్సులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటామని వారికి కలెక్టర్ భరోసా ఇచ్చారు. తహసీల్దారు గురునాథ్ మూర్తి, సర్పంచి అడుసుమిల్లి సీతామహాలక్ష్మి, మండల, గ్రామ సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
అస్త్రమ్ ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆధ్వర్యంలో రూపొందించిన అస్ట్రమ్ ప్రాజెక్టుకు స్కోచ్–2025 గోల్డ్ కేటగిరీ అవార్డు దక్కింది. ట్రాఫిక్ నిర్వహణ, పాలన, ప్రజాసేవలో అత్యుత్తమ ప్రతిభను గుర్తిస్తూ పోలీస్, భద్రత కింద స్కోచ్–2025 గోల్డ్ అవార్డును ప్రదానం చేశారు. అక్టోబర్ 2024లో ప్రారంభించిన అస్త్రమ్ ప్రాజెక్టు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నగరంలోని ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు, సందేశాలు ఇస్తూ సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో ట్రాఫిక్ రద్దీలో 50 శాతం, రోడ్డు ప్రమాదాల్లో 30 శాతం తగ్గించగలిగినట్లు పేర్కొన్నారు. ప్రజలకు గ్రీన్ చానల్ హోల్డింగ్ సమయం 15 నుంచి 20 నిమిషాల నుంచి కేవలం ఒకటి లేదా రెండు నిమిషాలకు తగ్గింపు, ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి నివారణకు తగు చర్యలు తీసుకున్నారు. అస్త్రమ్తో ప్రజలకు జరిగిన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్కోచ్–2025 గోల్డ్ కేటగిరీ అవార్డును ప్రకటించారు. ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్‌బేగం, స్పెషల్ బ్రాంచి ఏసీపీ భానుప్రకాష్‌రెడ్డి, టెక్నికల్ సిబ్బంది ఈ అవార్డును అందుకున్నారు. -
రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని రక్షించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని రక్షించాలని, అన్ని హిందూ ఆలయాలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. చంద్ర బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలు, దేవతామూర్తులు, భక్తులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హిందూ ద్రోహిగా ముద్ర వేసుకుందని ధ్వజమెత్తారు. విజయవాడ ధర్నా చౌక్‌లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూ ఆలయాలు, ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో దయానంద దత్త స్వామి, జ్యోతి స్వరూపానంద స్వామిజీ పాల్గొని శివలింగానికి సంప్రోక్షణ చేశారు. ఆస్థిర పాలన పోవాలని, సుస్థిర పాలన రావాలని వేదపండితులు ఈశ్వరుడిని వేడుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి నాడు ద్రాక్షారామంలో కపాలేశ్వరస్వామి శివలింగాన్ని టీడీపీ నేత సోదరుడు ధ్వంసం చేశా రని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి గుడిలో తొమ్మిది మంది చనిపోతే అది ప్రైవేట్ ఆలయమని, ప్రభుత్వానికి సంబంధం లేదని పాలకులు తప్పించుకున్నారని విమర్శించారు. సింహాచలంలో నాణ్యత లేకుండా నిర్మించిన గోడ కూలి చందనోత్సవం రోజు భక్తులు మృతి చెందడానికి ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు. కాశీ నాయన క్షేత్రంలో అన్నదాన క్షేత్రం, భక్తుల నివాసాలను అటవీ భూమని చెప్పి ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చేసిందన్నారు. సనాతన ధర్మం అంటూ కాషాయం వేసుకుని అవసరానికి అవతారాలు ఎత్తే డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తన అటవీశాఖలో జరిగిన ఆ దారుణంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో హిందూ ఆలయాలు పరిరక్షించబడ్డాయని గుర్తుచేశారు. దుర్గగుడిలో పాలలో పురుగులు వచ్చిన ఘటనపై విచారణ చేపట్టాలని, శివలింగం ధ్వంసం చేసిన వారిపై క్రిమి నల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం హిందూ ద్రోహి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లా డుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం హిందూ ద్రోహిగా ముద్రవేసుకుందన్నారు. ఆలయాల పరిరక్షణ, భక్తుల ప్రాణాలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ముక్కోటి ఏకాదశి నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆరుగురు భక్తులు, సింహాచలంలో చందనోత్సవంలో ఆరుగురు భక్తులను పొట్టనబెట్టుకుందన్నారు. గోవిందరాజుల గోపురంపై తాగుబోతు వీరంగం వేశాడని, తిరుమలలో మద్యపానం, మాంసాహారం, ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేయడం ఇలా.. రోజుకో ఆపచారం జరుగుతోందన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టనబెట్టుకున్నాడని, కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 45 ఆలయాలను ధ్వంసం చేయించాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే హిందూ సంఘాలు, స్వామీజీలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గతంలో అపచారం జరగకపోయినా పవన్ కల్యాణ్ దీక్ష పట్టి ఊగిపోయారని, ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు, భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, రవిచంద్ర, కార్పొరేటర్లు మల్లేశ్వరి, శర్వాణి మూర్తి, యర్రగొర్ల తిరుపతమ్మ, నాయకులు ఉద్దంటి సురేష్, కుక్కల రమేష్, సుందర్ పాల్, పులప కృష్ణ, చల్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక పోరాట సాధనం.. నాటకం
నాటక రచయిత కందిమళ్ల సాంబశివరావు వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): నాటకం సామాజిక పోరాట సాధనమని నాటక రచయిత కందిమళ్ల సాంబశివరావు పేర్కొన్నారు. తెలుగు నాటకరంగం పూర్వ వైభవం సంతరించుకోవాలంటే ప్రపంచ సాహిత్యాన్నీ, నాటకరంగ పోకడలను అధ్యయనం చేయాలని నాటక పరిషత్తుల నిర్వాహకులకు సూచించారు. 36వ విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ‘పాతికేళ్ల నాటకరంగం’పై శనివారం జరిగిన సదస్సులో ప్రధాన వక్తగా కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ.. యువ తరానికి నాటకరంగ మౌలిక స్వరూప స్వభావాలు, విశిష్టత తెలిసేలా ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వానికి, నాటకరంగ ప్రియులకు విజ్ఞప్తి చేశారు. సభకు అధ్యక్షత వహించిన నాటక పరిషత్ నిర్వాహకుడు అప్పాజోశ్యుల సత్యనారాయణ మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ తరఫున సాహితీకారులకు జీవన సాఫల్యపురస్కారాలు అందజేస్తున్నామని తెలిపారు. శ్రావ్యకావ్యానికీ, దృశ్యకావ్యానికీ మధ్యగల తేడాను పట్టుకున్న రచయితలు మాత్రమే మంచి నాటకాలను రాయగలరన్నారు. వీధి నాటక కళాకారుడు కె.శాంతారావు మాట్లా డుతూ.. ప్రపంచీకరణ ప్రమాదాలను తొలిగా ప్రజ ల్లోకి తీసుకెళ్లిన ఘనత తెలుగులో వీధి నాటకాలదేనని అన్నారు. నాటకకర్త వల్లూరి శివప్రసాద్ పుస్తక మహోత్సవసంఘం తరఫున కార్యక్రమానికి స్వాగతం పలికారు. జనవిజ్ఞాన వేదిక పుస్తకాల ఆవిష్కరణ బీవీ పట్టాభిరామ్ సాహిత్య వేదికపై మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన జనవిజ్ఞాన వేదిక పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. ‘దాచేస్తే దాగని సత్యం – జీవపరిణామం’ పుస్తకాన్ని దేవరాజు మహారాజు, ‘మానవతామూర్తి మేడమ్ క్యూరీ’ పుస్తకాన్ని సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి శ్రీనివాసరావు, ‘బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక’ పుస్తకాన్ని రాచర్ల శివ ఆవిష్కరించారు. సామాజిక పరిణామాలకు దర్పణం చలపాక కవిత్వం రచయిత చలపాక ప్రకాష్ తన కవితలలో వివిధ సామాజిక పరిణామాలకు, వాటికి నలిగిపోతున్న సామాన్యుల జీవనాలకు దర్పణం పట్టారని వక్తలు పేర్కొన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా చలపాక ప్రకాష్ కవితాసంపుటి ‘కవిత్వం రాసే చేతులు’ను బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి కె.లక్ష్మయ్య ఆవిష్కరించారు. సాహితీవేత్తలు డాక్టర్ గుమ్మా సాంబశివరావు, నానా, వెన్నా వల్లభరావు, మౌనశ్రీ మల్లిక్, వశిష్ట సోమేపల్లి, డాక్టర్ చుండూరు మాణిక్యాలరావు తదితరులు ప్రసంగించారు. ప్రతి ఒక్కరి జీవితంలో హాస్యం భాగం కావాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అన్నారు. పుస్తక మహోత్సవంలో నిర్వహించిన నవ్వుల విందు కార్యక్రమం శ్రోతలకు వీనులవిందు చేసింది. పోలవరం సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం పూర్వ సంచాలకులు ముంజులూరి కృష్ణకుమారి, పారిశ్రామికవేత్త మాజేటి సురేంద్రనాథ్, రచయిత్రి రవి కృష్ణకుమారి, రచయిత్రి వాడవల్లి కృష్ణకుమారి శ్రోతలను నవ్వించారు. సాహితీ సంస్థ బాధ్యుడు గోళ్ల నారాయణరావు వందన సమర్పణ చేశారు. -
ఉద్యోగాలకు 525 మంది ఎంపిక
నున్న(విజయవాడరూరల్): నున్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో 525 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తిరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ పరమేశ్వరరావు తెలిపారు. బెంగళూరుకు చెందిన ఎకా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, కంపెనీ హెచ్ఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి మెగా జాబ్‌మేళాను ప్రారంభించారు. జాబ్‌మేళాలో ఐటీ, నాన్‌ఐటీ, ఇన్ఫ్రా, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్లకు సంబంధించిన 19 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ప్రఖ్యాత యాక్సెంచర్, బిర్లా సాఫ్ట్, కాన్సెంట్రిక్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఎన్.నర్సిరెడ్డి మాట్లాడుతూ.. జాబ్‌మేళాకు వివిధ జిల్లాల నుంచి 980 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పరమేశ్వరరావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎం.గణేష్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
దిగుబడులపై రైతుల ఆశకు కత్తెర
పెనుగంచిప్రోలు: రబీ సీజన్లో ఆరుతడి పంటగా మొక్కజొన్నకు సాగు చేస్తున్న రైతులకు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. మొక్క జొన్న పైరును కత్తెర పురుగు ఆశిస్తోంది. ఈ పురుగు ఉధృతి కారణంగా పంట దిగుబడులు పడిపోతాయని రైతులు ఆందో ళన చెందుతున్నారు. పంట తొలినాళ్లలోనే పురుగు ఆశించిందని, తమ ఆశలను కత్తెర పురుగు ఆడియాశలు చేసేలా ఉందని కలవరపడుతున్నారు. ఈ పురుగును తొలి దశలోనే గుర్తించి నియంత్రించకపోతే నష్టం తప్పదని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్‌లో అధిక వర్షాల కారణంగా పత్తి, తెగుళ్లు ఆశించి మిర్చి పైర్లు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆరుతడి పంటగా రబీలో ఎక్కువగా మొక్కజొన్న సాగు చేపట్టారు. గత ఏడాది ఎన్టీఆర్ జిల్లాలో 18,272 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది ఆ విస్తీర్ణం 24 వేల ఎకరాలకు చేరింది. మరో రెండు వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం కొన్ని చోట్ల పంట 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. సాగు విస్తీర్ణంలో ఇప్పటికే 10 నుంచి 20 శాతం వరకు పంటను కత్తెర పురుగు ఆశించిందని రైతులు అంటున్నారు. పెరిగిన పెట్టుబడులు ఈ ఏడాది మొక్కజొన్న సాగుకు నెట్టుబడులు పెరిగాయి. సాధారణంగా ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా పెట్టుబడి ఖర్చవుతోంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచే కత్తెర పురుగు ఆశించటంతో రైతులు మందులు పిచికారీ చేస్తున్నారు. ఒక్కో రైతు మూడు నుంచి నాలుగు పార్లు మందులు పిచికారీ చేస్తున్నారు. దీంతో కేవలం మందులకే రూ.10 వేలకు పైగా అదనంగా ఖర్చు చేస్తున్నారు. యాజమాన్య పద్ధతులు ఇలా.. సమగ్ర యాజమాన్య పద్ధతులతో కత్తెర పురుగులు నివారించవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఎకరానికి 8 నుంచి పది వరకు లింగార్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. లీటరు నీటికి ఐదు మిల్లీ లీటర్ల వేపనూనె కలిపి పిచికారీ చేసుకోవటం వల్ల కత్తెర పురుగు గుడ్లు, మొదటి దశ లార్వాను నాశనం చేయవచ్చు. తొలిదశలో పురుగు నివారణకు క్లోరిఫైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాల్ 400 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. రెండు, మూడు దశల్లో ఉధృతంగా ఉన్నప్పుడు పురుగును అరికట్టటానికి లీటరు నీటికి ఇమామెక్టిన్ బెంజోయెట్ ఐదు శాతం ఎస్జీ మందును మిల్లీ లీటరు కలిపి ఎకరానికి 80 గ్రాముల మందును పిచికారీ చేయాలి. నాలుగు, ఐదు దశల్లో పురుగు నివారణకు విషపు ఎరలు వాడాలి. విషపు ఎరను సొంతగా తయారు చేసుకోవాలి. రెండు కిలోల బెల్లం, పది కిలోల తవుడు మిశ్రమానికి రెండు లీటర్ల నీటిని కలిపి 24 గంటల పాటు పులియనివ్వాలి. ఈ మిశ్రమాన్ని పంట పొలంలో వాడటానికి అరగంట ముందు దానికి వంద గ్రాముల లథయోడికర్ అనే మందును కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసుకుని మొక్క సుడి భాగాల్లో వేయాలి. మొక్కజొన్న పైరును ఆశించిన కత్తెర పురుగు ఎన్టీఆర్ జిల్లాలో 24 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు ఇప్పటికే 10 నుంచి 20 శాతం పంటను ఆశించిన పురుగు -
ఆర్టీసీ ఉద్యోగులకు పీవీసీ గుర్తింపు కార్డులు
విజయవాడలీగల్: వుద్యం అక్రమ కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న జోగి రాము, జోగి రమేష్, దారబోయిన ప్రసాద్ తరఫున దాఖలైన బెయిల్ పిటీషన్లపై గురువారం విచారణ పూర్తయింది. ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి లెనిన్‌బాబు తీర్పును ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. సయ్యద్ హాజీ, కట్టా రాజు, మిథున్ దాస్, అంతాదాస్ తరఫున దాఖలైన బెయిల్ పిటీషన్లపై ప్రాసిక్యూషన్ కౌంటర్లు దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను ఈ నెల 12వ తేదీకి, షేక్ అల్లాభక్షు తరఫున దాఖ లైన బెయిల్ పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేయా లని ఆదేశిస్తూ ఈ నెల 19వ తేదీకి ఎకై ్సజ్ కోర్టు న్యాయూర్తి లెనిన్‌బాబు వాయిదా వేశారు. ఈ కేసులో జినేష్, షీబు నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎకై ్సజ్ పోలీసులు ఎౖక్సైజ్ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్‌పై డిఫెన్స్ న్యాయవాదులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశిస్తూ కౌంటర్ నిమిత్తం ఈ నెల 12వ తేదీకి వాయిదా చేశారు. అద్దేపల్లి జనార్దనరావు, అద్దేపల్లి జగన్మోహనరావు, తలారి రంగయ్య, బాలాజీ, సుదర్శన్ తరఫున దాఖలైన బెయిల్ పిటీషన్లపై ప్రాసిక్యూషన్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడంతో న్యాయ మూర్తి విచారణను వాయిదా వేశారు. -
పారిశుద్ధ్య పనులు సజావుగా నిర్వహించాలి
మునిసిపల్ కమిషనర్లకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదేశంపాయకాపురం(విజయవాడరూరల్): నున్న పోలీస్ స్టేషన్ పరిధి పాయకాపురం ప్రాతానికి చెందిన నిరజ హత్య కేసులో ఆమె భర్త వడ్డాది దుర్గారావు (39)కు మహిళా సెషన్స్ కోర్టు జడ్జి జి.రాజేశ్వరి జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చారు. 2020వ సంవత్సరం ఎల్బీఎస్ నగర్, పాయకాపురానికి చెందిన వడ్డాది దుర్గారావుకు నీరజను ఇచ్చి పెద్దల సమక్షంలో రెండో వివాహం చేశారు. దుర్గారావు చెడు వ్యసనాలకు బానిసై భార్యను సరిగా చూసుకోకుండా అనుమానిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలో 2021, మే ఐదో తేదీన నీరజను భర్త కత్తితో పొడిచి చంపేశాడు. అదే నెల ఏడో తేదీన నింది తుడిని అప్పటి సీఐ హనీష్‌బాబు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో మహిళా సెషన్స్ కోర్టు జడ్జి జి.రాజేశ్వరి జీవిత ఖైదు, జరిమానా విధించారు. కంచికచర్ల: సంక్రాంతి పండుగ సందర్భంగా, సెలవుల నిమిత్తం హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వచ్చే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని డీసీపీ బి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మండలంలోని కీసర టోల్‌ప్లాజా వద్ద డివిజన్ పోలీస్ అధికారులు, రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారులు, నేష నల్ హైవే అథారిటీ అధికారులు, టోల్‌ప్లాజా అధికారులతో గురువారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునే విధంగా భద్రతా చర్యలు తీసుకోవాల డీసీపీ సూచించారు. అనంతరం 47వ భద్రతా మాసో త్సవాలు కార్యక్రమంలో డీసీపీ లక్ష్మీనారాయణ పోలీస్ అధికారులతో కలసి పాల్గొన్నారు. వాహనదారులందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందిగామ డివిజన్ ఏసీపీ తిలక్, నందిగామ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పూర్ణిమ, నందిగామ టౌన్, నందిగామ రూరల్ సీఐలు వై.వి.ఎల్.నాయుడు, డి.చవాన్, పలువురు ఎస్ఐలు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు. -
కత్తెర పురుగు జీవిత కాలం 60 రోజులు
కత్తెర పురుగు జీవిత కాలం 60 రోజుల వరకు ఉంటుంది. మొక్క జొన్న విత్తిన వారం నుంచి పది రోజుల తరువాత వచ్చే మొలకలను భూమిలో ఉండే తల్లిపురుగులు ఆశిస్తాయి. మొక్కలపై గుంపులుగా గుడ్లు పెడుతుంటాయి. గుడ్లు నుంచి బయటకు వచ్చిన పురుగులు మొక్క ఆకులను గోకి తింటాయి. దీంతో ఆకులపై నిలువుగా రంధ్రాలు ఏర్పడతాయి. పురుగులు పెద్దవి అయిన తరువాత మొవ్వులో చేరి లోపల కాండాన్ని తినేస్తాయి. మొవ్వను పూర్తిగా తినేయటం వల్ల మొవ్వు కత్తిరించినట్లుగా ఉంటుంది. పురుగు తిని విసర్జించిన మల పదార్థాలతో మొవ్వ నిండిపో తుంది. మొవ్వులో ఉన్న పూతకు కూడా నష్టం కలుగుతుంది. ఫలితంగా కండెలు తయారు కావు. కొళ్లికూళ్లలో కత్తెర పురుగు ఆశించిన మొక్క -
లూయిస్ బ్రెయిలీ సేవలు చిరస్మరణీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): లూయిస్ బ్రెయిలీ సేవలు చిరస్మరణీయమైనవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. నగరంలో ఎంజీ రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో గురువారం జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరిగింది. విభిన్న ప్రతిభావంతులు, అధికారులు, చిన్నారులతో కలిసి లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నేత్ర సమస్యలు ఉన్నాయని కలత చెందొద్దన్నారు. బ్రెయిలీ చూపిన మార్గంలో నడిచి ఎవరికీ తక్కువ కాదని నిరూపించాలన్నారు. అపుడే బ్రెయిలీకి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కలెక్టర్.. బ్రెయిలీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3న నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన దివ్యాంగ ఉద్యోగులకు మెరిట్ అవార్డులు అందించారు. విజయవాడలో లూయీస్ బ్రెయిలీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని వివిధ సంఘాల ప్రతినిధులు కోరగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ చైర్పర్సన్ జి.నారాయణస్వామి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని బాగా చదువుకునేందుకు అవసరమైన ఉపకరణాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వాడ్రేవు కామరాజు, ఠాగూరు గ్రంథాలయ అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
రహదారి భద్రత అందరి బాధ్యత కోనేరుసెంటర్: రహదారి భద్రత అందరి బాధ్యత అని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన గురువారం జిల్లా పోలీసులు హెల్మెట్ వాడకంపై మచిలీపట్నంలో బైక్ ర్యాలీ చేశారు. దీన్ని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కృష్ణాజిల్లా విస్తీర్ణం ఎక్కువ భాగం జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన రహదారి ప్రమాదాలను గమనిస్తే అత్యధిక శాతం ద్విచక్ర వాహనాల కారణంగా జరిగినట్లు తెలుస్తోందన్నారు. హెల్మెట్ లేక ఎంతోమంది వాహనచోదకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ప్రమాదాల కారణంగా ఎవరూ మరణించకూడదనే ఉద్దేశంతో ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. హెల్మెట్ ధరించకపోతే కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామన్నారు. హెల్మెట్‌ధారణ అనేది బాధ్యతగా గుర్తించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపడం, మితిమీరిన వేగంతో వెళ్లడం, పరిమితికి మించి ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. పశువుల యజమానులు వారి పశువులను రోడ్లపై వదిలి ప్రమాదాలకు కారణమైనట్లు తెలిస్తే సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేసి కటకటాల పాల్జేస్తామని హెచ్చరించారు. ర్యాలీలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, బందరు డీఎస్పీ సీహెచ్ రాజా, సీఐలు ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
సాగుతున్న పెండింగ్ పనులు
ప్రస్తుతం నున్న వద్ద అసంపూర్తిగా ఉన్న పనులను చేస్తున్నారు. అంబాపురం, జక్కంపూడి మధ్య ఉన్న లైన్లనే ఎత్తు పెంచే విధంగా ఒప్పందం కుదరడంతో, అక్కడ ఎత్తు పెంచే పనులు సాగుతున్నాయి. గొల్లపూడి, చిన అవుటుపల్లి వద్ద జాతీయ రహదారులను అను సంధా నించే పనులు జరుగుతున్నాయి. మూడు చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నా ప్రస్తుతం వాహనాలను బైపాస్ పైకి అనుమతిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో సర్వీసు రోడ్డు మీదుగా ప్రస్తుతం వాహనాలు వెళ్తున్నాయి. ప్రస్తుతం రోజుకు 10వేల వాహనాలకు పైగా బైసాస్పై ప్రయాణిస్తున్నాయి. సంకాంత్రి పండుగ సమయంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి విశాఖ పట్నం వైపు వెళ్లే వాహనాలన్నీ విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది. -
16న ‘కార్పొరేట్’ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్రం తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టం, విత్తన చట్టం, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని రైతు సంఘాల సమన్వయ సమితి, ట్రేడ్ యూనియన్ల జేఏసీ, కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈనెల 16న గ్రామ గ్రామాన నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చింది. గురువారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సమన్వయ సమితి సమావేశం జరిగింది. సమితి కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతు సంఘాలు ఢిల్లీలో ఆందోళన చేస్తే కేంద్రం లిఖిత పూర్వక హామీ ఇచ్చిందని, ఆ తర్వాత దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సమస్యలపై పోరాడుతున్న ప్రజా సంఘాల నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. దీనిపై 12న ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు, ఎడిటర్లను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర చైర్మన్ కామన ప్రభాకర్‌రావు, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై.కేశవరావు, ఏపీ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.పోలారి, ఏపీ రైతు కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాహితీ విమర్శకు ఉత్తమ సాహిత్యమే లక్ష్యం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సాహితీ విమర్శకు ఉత్తమ సాహిత్యమే లక్ష్యం కావాలని సాహితీ విమర్శకులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నారు. విజయవాడ బుక్ పెస్టివల్ సొసైటీ ఆధ్వర్యాన జరుగుతున్న విజయవాడ పుస్తక మహోత్సవంలో ఏడో రోజు గురువారం బీవీ పట్టాభిరామ్ సాహిత్య వేదికపై ‘పాతికేళ్ల సాహిత్య విమర్శ’ పై సదస్సును నిర్వహించారు. ముఖ్యవక్త చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ సమాజమూ, సాహిత్యమూ, సాహిత్య విమర్శ పరస్పర ఆధారితాలన్నారు. తెలుగులో సాహిత్య విమర్శ పేరుతో ప్రచురిస్తున్నవన్నీ నిజమైన విమర్శలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. పాతికేళ్లలో తెలుగులో దాదాపుగా 500 సాహిత్య విమర్శగ్రంథాలు వచ్చాయన్నారు. సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి మాట్లాడుతూ సాధారణంగా విమర్శను అర్థం చేసుకోవడం, అందులోనూ సాహిత్య విమర్శను అర్థం చేసుకోవడం అంత తేలిక కాదన్నారు. సాహితీ విమర్శ సాహిత్యానికి చాలా అవసరమన్నారు. సాహితీవేత్త గుంటూరు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ పాతికేళ్లలో ప్రాంతీయ, అస్తిత్వ స్పృహతో వచ్చిన విమర్శలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రాంతీయ స్పృహతో విమర్శించడం సాహిత్య విమర్శలో కొత్తకోణమన్నారు. పుస్తక మహోత్సవ సంఘ అధ్యక్షుడు మనోహర్ నాయుడు గోష్ఠికి స్వాగతం పలికారు. సభకు చినుకు పత్రిక సంపాదకుడు నండూరి రాజగోపాల్ అధ్యక్షత వహించారు. విలువలను తట్టిలేపిన మునిపల్లె రాజు కథలు మానవీయ విలువలను తట్టిలేపేందుకు కథలను సాధనంగా వాడుకున్న చక్కని కథారచయిత మునిపల్లె రాజు అని రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి అన్నారు. పుస్తక మహోత్సవంలో భాగంగా సాహిత్య వేదికపై సాహితీవేత్త మునిపల్లె రాజు శతజయంతి సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కథారచనాపరంగా మునిపల్లె రాజు సంప్రదాయ అభిమాని అయినా వాటిలోని మూలాలను అర్థం చేసుకుని మూఢాచారాలకు వ్యతిరేకించాడన్నారు. ఆయన రాసిన 70 కథల్లో సామాన్య మానవుల గుండెచప్పుడు వినిపిస్తుందన్నారు. సభాధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మునిపల్లె రాజు తెలుగు సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన కథారచయిత అని చెప్పారు. సాహితీ సంపాదకులు కాట్రగడ్డ దయానంద్, కొప్పర్తి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నిస్తే రౌడీషీట్లు తెరుస్తున్నారు ప్రస్తుత పాలకులు తమ వైఫల్యాలను ప్రశ్నిస్తే వారిపై రౌడీషీట్లు తెరుస్తున్నారని విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్ హరనాథ్‌రెడ్డి అన్నారు. ఇటీవల మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్న తీరును విమర్శిస్తే వారిపై కేసులు పెడుతున్న సంఘటనలను ఉదహరించారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ముద్రించిన పలు గ్రంథాలను విజయవాడ పుస్తక మహోత్సవం ప్రాంగణంలో గురువారం ఆవిష్కరించారు. ఆర్వీ రామారావు రాసిన ‘శతవసంతాల అరుణ పథం’ను, డాక్టర్ దేవరాజు మహారాజు రాసిన ‘మానవ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది?, ‘సైన్స్‌కు దేశంలో గడ్డుకాలం’, పుస్తకాలను, నికొలై ఇవనోవ్ రాసిన ‘కార్ల్ మార్క్స్ జీవిత సంగ్రహం’లను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. సభకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు గడ్డం కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్రజాశక్తి దినపత్రిక పూర్వ సంపాదకులు ఎంవీఎస్ శర్మ, ఏఎన్‌యూ విశ్రాంత ఆచార్యులు ఆచార్య సీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సినీరంగంలో విజయంతో మర్యాద సినిమా రంగంలో సక్సెస్ అయినప్పుడే మర్యాద లభిస్తుందని లేకపోతే పట్టించుకునే వారు ఉండరని రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. పుస్తక మహోత్సవంలో భాగంగా యండమూరి వీరేంద్రనాథ్, సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి సినీ అనుభవాల జుగల్బందీ కార్యక్రమాన్ని గురువారం రాత్రి పట్టాభిరామ్ సాహితీవేదికపై నిర్వహించారు. తొలుత యండమూరి, కోదండరామిరెడ్డి కలసి తీసిన అభిలాష తదితర సినిమాల అనుభవాలను శ్రోతలతో పంచుకున్నారు. -
ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల (ఐపీఈ–2026) నిర్వహణకు శాఖల అధికారులు ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి హాల్లో గురువారం కలెక్టర్ లక్ష్మీశ.. ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు, జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయన్నారు. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు 98 కేంద్రాల్లో జరుగుతాయని వివరించారు. థియరీ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. 36,734 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 39,534 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 76,268 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వివరించారు. జిల్లా స్ట్రాంగ్ రూమ్, 17 స్టోరేజ్ పాయింట్ల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. ప్రతి దశలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో నో సెల్ ఫోన్ జోన్‌గా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రాక్టికల్, థియరీ పరీక్షలకు నాలుగు చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్లు, థియరీ పరీక్షలకు మూడు సిటింగ్ స్క్వాడ్ల ఏర్పాటుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన వసతులు సమకూర్చాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి బి.ప్రభాకరరావు, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఈసీ సభ్యులు జి.ఝాన్సీ, ఎన్.వెంకటరావు, జి.వెంకటరమణ, కె.విష్ణుకాంత్, డీఈవో ఎల్.చంద్రకళ, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, ఆర్టీసీ అధికారి టి.సాయిచరణ్‌తేజ, పోస్టల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ఎట్టకేలకు..
వెస్ట్ బైపాస్కు వీడిన చిక్కుముడి..! సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎట్టకేలకు వెస్ట్ బైపాస్ పనులకు సంబంధించి చిక్కుముడులు వీడుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పనులు పూర్తయితే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కార్‌లో కొందరు అధికార పార్టీ నేతలే పనులు ముందుకు సాగకుండా అడ్డుకోవడంతో మూడు చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పుడు వాటికి మోక్షం కలిగింది. ప్యాకేజీ 3 కింద చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మేర వెస్ట్ బైపాస్ పనులకు ఫిబ్రవరి 2021లో శ్రీకారం చుట్టారు. పని విలువ రూ.1,148 కోట్లుగా నిర్ణయించారు. గత ప్రభుత్వ హయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు శరవేగంగా కదిలాయి. జనవరి 2024లో బైపాస్‌ను ప్రారంభించడానికి పనులను పరుగులు పెట్టించారు. 90 శాతం పైగా పనులు జరిగాయి. అయితే బైపాస్ రోడ్డును ప్రారంభిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని టీడీపీ నేతలు కుట్రలు పన్నారు. రైతుల ముసుగులో కొంతమంది విద్యుత్ టవర్ల మార్పిడి ప్రాంతంలో పనులు పూర్తి కాకుండా అడ్డుకొన్నారు. మూడు చోట్ల మాత్రమే పనులు ఆగిపోయాయి. 90 మీటర్ల మేర జక్కంపూడి, నున్న ప్రాంతంలో విద్యుత్తు టవర్లు ఉన్న ప్రాంతంలో రోడ్డు పనులు ఆగిపోయాయి. రోడ్డు పనులు పూర్తి స్థాయిలో అయిన తర్వాతే ఇరువైపులా బైపాస్కు అనుసంధానం చేసే పనులు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిన అవుటపల్లి, గొల్లపూడి వద్ద అనుసంధాన పనులు నిలిచిపోయాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా మిగిలిన పనులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం చేసింది. విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో ఉంచుకొని చివరకు తాత్కాలికంగా వాహన రాకపోకలను అనుమతించారు. ఈ నేపథ్యంలో చివరకు అధికారులు మిగిన పనులపై దృష్టి సారించారు. పూర్తి స్థాయిలో ఫిబ్రవరి చివరి నాటికి పనులు పూర్తి చేసి, వెస్ట్ బైపాస్‌ను అందుబాటులోకి తేవడానికి అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. జక్కంపూడి– అంబాపురం మధ్య పాముల కాలువ వంతెన నిర్మాణం చేపట్టక పోవడంతో, ప్రస్తుతం వాహనాలు తాత్కాలిక మార్గంలో ఒకే వైపు రాకపోకలు సాగించాల్సింది. అక్కడ వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. హైదరా బాద్ నుంచి వచ్చే వారు గొల్లపూడి సమీపంలో బైపాస్‌లోకి ప్రవేశించే చోట, రహదారి పనులు ఇరుకుగా ఉండటంతో, వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. పశ్చిమ బైపాస్, ఎన్‌హెచ్–16 కలిసే చోట , అనుసంధాన పనులు పూర్తి కాక పోవటంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాఒటి ఆటంకాలను తొలగించాని పూర్తిస్థాయిలో వెస్ట్ బైపాస్‌ను అందుబాటులోకి తేవాల్సి ఉంది. -
సమష్టి కృషితో రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ లబ్బీపేట(విజయవాడతూర్పు): సమష్టి కృషితో రోడ్డు ప్రమాదాలకు నివారిద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలే కుటుంబాలను సురక్షితంగా నిలబెడతాయని సూచించారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఎంజీ రోడ్డులో వాక్‌థాన్ నిర్వహించారు. ఈట్ స్ట్రీట్ వద్ద ట్రాఫిక్ డీసీపీ షరీన్‌బేగం, రవాణా శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ వాక్‌థాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, మద్యం తాగి వాహనాలు నడపకపోవడం, అధిక వేగాన్ని నివారించడం వంటి జాగ్రత్తలు కుటుంబాలకు భద్రత కల్పిస్తాయన్నారు. శాసీ్త్రయ దృక్పథంతో ట్రాఫిక్ ప్రణాళికలను అమలుచేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. డీసీపీ షేక్ షరీన్ బేగం మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా యని ఆందోళన వ్యక్తంచేశారు. హెల్మెట్ తప్పక ధరించాలని, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండా లని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగన్, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఎ.మోహన్, ఆర్టీఓలు ఆర్.ప్రవీణ్, ఎ.వెంకటేశ్వరరావు, రవాణా శాఖ ఉద్యోగుల సంఘ జోనల్ అధ్యక్షుడు ఎం. రాజుబాబు, ఎన్ఎస్ఎస్ జిల్లా సమన్వయకర్త కె. రమేష్, సుధీక్షణ్ ఫౌండేషన్ బాధ్యులు సీహెచ్ విమల, పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆవకాయ్.. అసంబద్ధం
భవానీపురం(విజయవాడపశ్చిమ): తెలుగు సినిమా, సాహిత్యం, కళల సమ్మేళనంగా ప్రభుత్వం మూడు రోజులపాటు విజయవాడలో ‘అమరావతి ఆవకాయ్’ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తోంది. సినిమా, సాహిత్యం, కళలకు ఆవకాయ్‌తో సంబంధం ఏమిటో అర్థం కావడంలేదని పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టూరిజం ఉన్నతాధికారులకే అంతుబట్టక ‘ఇది అసం‘బద్ద’ ఆవకాయ్ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ఆవకాయ్ ఫెస్టివల్ ఎందుకో? ఏమిటో? అంటూ తలలు పట్టుకుంటున్నారు. మూడు రోజుల ఆవకాయ్ కార్యక్రమాల్లో తెలుగు సంస్కృతి, సాహిత్యానికి సంబంధించి ఒకటీ అరా మినహా ఉత్తర భారత సంస్కృతికే పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆవకాయ్ నామకరణం చేసిన టూరిజం అధికారితోపాటు ఈవెంట్ నిర్వాహకులు (టీమ్ వర్క్ ఆర్ట్స్) కూడా ఉత్తర భారత్‌కు చెందిన వారే కావడం గమనార్హం. ఈ కార్యక్రమాల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలకు ఇంతవరకు సమాచారం లేకపోవడంతో వారు మండిపడుతున్నారు. తెలుగు సంస్కృతికి చోటెక్కడ? ఆవకాయ్ ఉత్సవంలో తొలిరోజు పున్నమిఘాట్లో జమ్మెర్స్ సంగీత ప్రదర్శన, ఒమాజియో పెర్ఫార్మింగ్ కంపెనీ వారి హర్ ఫ్రేమ్స్ – హర్ ఫైర్, రెండో రోజు మెహ్ఫిల్–ఏ–సుఖాన్ (అనుభూతినిచ్చే ముషైరా), ఆజ్ రంగ్ హై – ఏవీజీ వర్సెస్ నిజామీ బంధు (సంగీత విభావరి), మూడో రోజు చౌరాస్తా సంగీత ప్రదర్శన, జావేద్ అలీ సంగీత కచేరీ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక భవానీ ద్వీపంలో తుహోస్ ఆదిత్య రాయ్‌తో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిబిరం, నాధూలాల్ సోలంకితో నగారా శిక్షణ శిబిరం, ఫ్రెంచ్ నృత్య కళాకారులు గిల్లెస్ చుయొన్తో డాన్స్ శిక్షణ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఉత్తర భారత సంస్కృతికే పెద్దపీట వేసినట్లుగా కళాకారులు పేర్కొంటున్నారు. తెలుగు సంస్కృతి, సాహిత్యాలకు సంబంధించిన అనేక మంది సాహితీవేత్తలు, కళాకారులు ఉండగా వారికి ఈ కార్యక్రమాల్ల్లో చోటు కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. తెలుగు వారికే సొంతమైన పద్య నాటకాలు, లబ్ధప్రతిష్టులైన అష్ట, శతావధానుల కార్యక్రమాలు, సంగీత విద్వాంసుల కచ్చేరీలు ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జానపద కళారూపమైన తోలుబొమ్మలాట ప్రదర్శన తప్ప గరగలు, తప్పెట నృత్యాలు వంటి అనేక సంప్రదాయ కళలపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులకు ఈ ఆవకాయ్లో స్థానం కల్పించకుండా మనదికాని సంస్కృతిని ఇక్కడ ప్రదర్శించటం ఎంతవరకు సమంజసమో నిర్వాహకులకే తెలియాలని అంటున్నారు. అమరావతి ఆవకాయ్‌ను సంక్రాంతి మూడు రోజులు నిర్వహిస్తే బాగుండేది. ముందే నిర్వహించడం వల్ల విజయవాడ బుక్ ఫెస్టివల్‌పై ప్రభావం పడుతుంది. అసలు కవులు, రచయితలకు ముఖాముఖి, కవి సమ్మేళనాలు ఉంటాయన్న విషయం తెలియదు. రచయితల సంఘాలకు ఎటువంటి సమాచారం లేదు. కార్యక్రమాల రూపకల్పన బాగేనే ఉంది కానీ దానిలో పరిపూర్ణత కనిపించడం లేదు. స్థానికులకు సమాచారం లేనప్పుడు రాష్ట్రం నుంచి ఎవరు పాల్గొంటారో అర్థం కావడం లేదు. – చలపాక ప్రకాష్, ఏపీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి -
కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026ఎన్టీఆర్ జిల్లాలో మరో ఐదు ఇసుక రీచ్‌లు గుర్తింపు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మను సినీ నటుడు రాజేంద్రప్రసాద్ బుధవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సంక్రాంతి పండగకు ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. చట్టాలపై గ్రామాల నుంచి జిల్లాస్థాయి వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో జిల్లా జంతు సంక్షేమ సంఘం సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీఓల సారథ్యంలోని కమిటీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎక్కడా కోడి పందేలు జరగకుండా చూడాలన్నారు. జంతు సంక్షేమ సంఘాల సలహాలు సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. 14 నుంచి జంతు సంక్షేమ పక్షోత్సవాలు ఈ నెల 14 నుంచి 31వ తేదీ వరకు జంతు సంక్షేమ పక్షోత్సవాలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. జంతు సంక్షేమ సంస్థలు, జంతు సంక్షేమ సంఘాలతో పాటు రెవెన్యూ, విద్య, పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖల అధికా రులతో సమన్వయం చేసుకొని కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీపీఓ పి.లావణ్యకుమారి, డీఈఓ ఎల్.చంద్రకళ, జంతుసంక్షేమ సంస్థల ప్రతినిధులు రవికుమార్, వెంకటేశ్వర్లు, శ్రీపద్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి హుండీల్లో భక్తులు సమ ర్పించిన కానుకల ద్వారా రూ.1,07,20,970 ఆదాయం వచ్చిందని ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఆలయ ప్రాంగ ణంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.వి.సాంబశివరావు, మచిలీపట్నం డివిజన్ తనిఖీ అధికారి కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో బుధవారం ఉదయం హుండీ కానుకలు లెక్కించగా 84 రోజులకు రూ.1,07,20,970 ఆదాయం వచ్చింది. 1.830 కిలోల వెండి, 44.81 గ్రాములు బంగారం, 98 ఆమెరికా డాలర్లు, సౌదీ అరే బియా, కెనడా, సింగపూర్, బూటాన్, మంగో లియా, నేపాల్ దేశాల కరెన్సీ లభించింది. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, సేవా సమితి సభ్యులు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో 16 వేల కిలోమీటర్ల మేర రహదారులకు రూ.1,081 కోట్లతో మరమ్మతులు చేపట్టామని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి.జనార్దనరెడ్డి అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్లో బుధవారం మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.3,380 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే టెండర్లు పిచామని తెలిపారు. కృష్ణాజిల్లాలో రూ.160 కోట్లతో 1518 కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతులు, మచిలీపట్నం నియోజకవర్గంలో రూ.33 కోట్లతో రోడ్ల అభివృద్ధి చేపడుతున్నామని వివరించారు. హార్బర్‌కు నడకుదిటి పేరు.. మచిలీపట్నం పోర్టు పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయని, డిసెంబర్ నాటికి ఆపరేషన్లోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రులు తెలిపారు. గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మా ణంలో సాంకేతికంగా సమస్యలు వచ్చాయని జూన్ నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. హార్బ ర్కు మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు పేరును పెట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శుభ పరిణామమన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం. రామకృష్ణ, జేసీ ఎం.నవీన్, డీఆర్వో చంద్రశేఖర రావు, బందరు ఓడరేవు సీఈ రాఘవరావు, రహదారులు, భవనాలశాఖ సీఎస్సీ ఎన్.శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ భాస్కర్, డీఈ లోకేష్, మెగా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధి తులసీదాస్ పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో కొత్త రీచ్‌లను గుర్తించిన అధికారులు, వాటిలో ఇసుక తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ఐదు రీచ్‌లను గుర్తించి, వాటికి సంబంధించి అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. వచ్చే వారం ఈ రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు, లోడింగ్, అన్‌లోడింగ్‌లను ఏజెన్సీల ద్వారా నిర్వహించేందుకు ఈ–టెండర్లు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో 15 ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇచ్చారు. వీటి గడువు గత ఏడాది అక్టోబర్ 15వ తేదీతోనే ముగిసింది. ప్రస్తుతం కేవలం జిల్లాలో రెండు రీచ్‌లకు మాత్రమే అనుమతి ఉంది. కాసరాబాద, పొక్కునూరులో రీచ్‌లకు సంబంధించి రెండు లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం అనుమతులు వచ్చిన మల్కాపురం రీచ్‌లో 74,250 టన్నులు, ఏటూరులో 74,850, మున్నలూరులో 74,400, గనిఅత్కూరు 73,500, పొక్కనూరులో 2.04 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. పొక్కునూరు మినహా మిగిలిన నాలుగు రీచ్‌ల్లో కూలీల ద్వారానే ఇసుక లోడింగ్, అన్లోడింగ్ చేయాల్సి ఉంటుంది. పొక్కనూరులో మాత్రం సెమీ మెకనైజ్డ్ ద్వారా ఇసుక తవ్వకాలు, లోడింగ్, అన్లోడింగ్ చేసుకొనే అవకాశం కల్పించనున్నారు. ఆగని ఇసుక దోపిడీ గత ఏడాది వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు ఇబ్బంది లేకుండా అధికారులు డిపోల్లో ఇసుక నిల్వలు ఉంచారు. అయితే డిపోల్లోని ఇసుక అమ్మకాలు నామ మాత్రంగానే సాగాయి. మోగులూరు, కంచల, కీసర, ట్రక్ టెర్మినల్, వేములపల్లి, అల్లూరుపాడు, భవానీపురం, ఏటూరు ఇసుక డిపోల్లో ఏడు లక్షల టన్నులకుపైగా ఇసుక నిల్వలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇసుక అక్రమ దోపిడీ మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కాసరాబాద, పొక్కునూరు ఇసుక రీచ్‌లు పార్లమెంటు ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీల్లో ఇసుక లోడింగ్ చేయాలంటే రూ.10 వేల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి ఇసుక తరలిస్తున్నారు. పచ్చనేతల కనుసన్నల్లోనే ఇసుక దందా నడుస్తుండటంతో పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇసుక దందాకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప, క్షేత్ర స్థాయిలో మాత్రం అమలు కావటం లేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ●సందర్శకులతో కిటకిటలాడుతున్న విజయవాడ బుక్ ఫెస్టివల్ 7చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక బోర్డర్ చెక్ పోస్టులను ఎత్తివేయడం ఇసుక మాఫియాకు కలిసొచ్చింది. అడ్డుకునే వారే లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రధానంగా గంపలగూడెం మండలంలోని కనుమూరు, వినగడప, తిరువూరు మండలంలోని గానుగపాడు, రోలుపడి గ్రామాల పరిధిలో భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో భారీ గుంతలు ఏర్పడి కట్టెలేరు స్వరూపమే మారింది. మునేరు పరీవాహక ప్రాంతాల నుంచి సైతం తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా భారీగా జరుగుతోంది. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని అధికా రులు హంగామా చేయడమే తప్ప ఫలితం మాత్రం లేదు. రాత్రిళ్లు డొంక మార్గాల ద్వారా తెలంగాణకు ఆంధ్ర ఇసుక తరలి వెళుతోంది. ఖమ్మం ప్రాంతంలో లారీ ఇసుక ధర రూ.35 వేలు, ట్రాక్టరు ఇసుక ధర రూ.7 వేల నుంచి రూ.9 వేల చొప్పున పలుకుతోంది. దీంతో ఎన్టీఆర్ జిల్లా నుంచి ఆ ప్రాంతాలకు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక అంశాన్ని అడ్డుపెట్టుకొని ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వాగుల్లో ఇసుకను సమీప గ్రామాల ప్రజలు తమ అవసరాలకు కూలీలతో లోడింగ్ చేసుకొని ఉచి తంగా తరలించుకోవచ్చు అన్నది ప్రభుత్వ ఉచిత విధానం. ఈ విధానం ఇసుక మాఫియాకు వరంగా మారింది. తిరువూరు, గంలగూడెం మండలాల్లో కట్టెలేరు ప్రవహిస్తోంది. ఇక్కడ పార్లమెంటు ప్రజా ప్రతినిధి అనుచరులు యథే చ్ఛగా ఇసుక తవ్వకాలు సాగి స్తున్నారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా రవాణా చేసి రూ.లక్షలు దండుకొంటున్నారు. -
కోడలిపై మామ హత్యాయత్నం
కోనేరుసెంటర్: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. కోడలిపై మామ కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ కానిస్టేబుల్ మామను అడ్డుకోవటంతో కోడలు ప్రాణాలతో బయటపడింది. మచిలీపట్నం పరాస్ పేటకు చెందిన ఆకూరి నాగశ్వేతకు వలందపాలెంకు చెందిన కలిదిండి వెంకన్నతో 2022లో వివాహం జరిగింది. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. ఏడాదిన్నరగా భార్యాభర్తలతో పాటు రెండు కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో నాగశ్వేత పుట్టింట్లోనే ఉంటోంది. కాగా శ్వేత కాపురానికి రావాలంటూ భర్త వెంకన్నబాబు కోర్టులో పిటిషన్ వేశాడు. పోలీస్ స్టేషన్‌కు కూతవేట దూరంలో.. ఈ క్రమంలో శ్వేత మామ సోమరాజు బుధవారం రాత్రి మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఓ మెడికల్ షాపు ఎదుట పదునైన కత్తితో కోడలిపై దాడి చేశాడు. ఆమెను అంత మొందించేందుకు తలపై బలంగా నరికాడు. శ్వేత చేయి అడ్డుపెట్టుకోవడంతో చేతితోపాటు తలకు బలమైన గాయాలు అయ్యాయి. అదే సమయంలో పక్కనే ఉన్న ఈగల్ టీం కానిస్టేబుల్ మూర్తి సోమరాజును అడ్డుకున్నారు. అతని చేతిలో కత్తిని లాక్కుని సోమరాజును చిలకలపూడి పోలీసులకు అప్పగించారు. జరిగిన సంఘటనను తెలుసుకున్న బందరు డీఎస్పీ సీహెచ్ రాజా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలు శ్వేత మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శ్వేత తండ్రి రాజు ఎస్పీ కార్యాలయంలోని పీసీఆర్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కోడలిపై మామ హత్య చేసేందుకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైన కోడలు -
ఒత్తిడిని అధిగమించవచ్చు..
అనవసరపు ఒత్తిడికి దూరంగా ఉండాలి. తీవ్రమైన ఒత్తిడి కారణంగా అనేక రుగ్మతలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత తీవ్రమైన ప్రభావం చూపుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అయితే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మానసిక వైద్యులను సంప్రదించేందుకు వెనుకాడకూడదు. సరైన సమయంలో కౌన్సెలింగ్, చికిత్స పొందడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. – డాక్టర్ అశోక్‌బాబు, మానసిక వైద్య నిపుణుడు ప్రస్తుతం యువత ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. వారిపై సెల్‌ఫోన్, సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటోంది. వాటిని అడిక్ట్ అవడంతో ఇతర వాటిపై దృష్టి సారించలేక పోతున్నారు. చదువులో రాణించలేక పోవడం, ఉద్యోగంలో పనిపై దృష్టి పెట్ట లేకపోతున్నారు. యువత దేనినైనా అవసరం మేరకు వినియోగించడం అలవాటు చేసుకోవాలి. మానసిక ఉల్లాసం కోసం కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఆటలు వంటి వాటిపై దృష్టి సారించాలి. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్టు ● -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
కంకిపాడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. ఎస్ఐ డి.సందీప్ తెలిపిన కథనం మేరకు.. కంకిపాడు పట్టణంలోని బీబీఆర్ నగర్‌కు చెందిన వల్లెపు సత్తిరాజు(45) కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈనెల 4వ తేదీన తీవ్ర మనస్తాపానికి గురై ఎలుకల మందు పేస్ట్ తిన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సత్తిరాజు మృతి చెందా డు. ఆస్పత్రి వర్గాల సమాచారం, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మంగళవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. పెనమలూ రు: బందరు కాలువలో మహిళ దూకి గల్లంతైన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు తులసీనగర్‌కు చెందిన దోనేపూడి పుష్పావతి(67) కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె కుమారుడి వద్ద ఉంటుంది. కాగా కుమారుడు టీడీపీ నాయకుడు దోనేపూడి రవికిరణ్ గత రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. తల్లి ఇంట్లోనే ఉంది. శ్రీ శైలం నుంచి మంగళవారం తిరిగి ఇంటికి రాగా తల్లి ఇంట్లో కనబడలేదు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కాగా తాడిగడప పాత వంతెన వద్ద మహిళ మంగళవారం బందరు కాలువలో మహిళ దూకినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వంతెన వద్దకు చేరుకున్న ఎస్ఐ రమేష్ పరిశీలించగా వంతెన వద్ద చెప్పుల జత ఉండటంతో పుష్పావతివిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. బందరు కాలువలో దూకిన ఆమె కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. అయితే రాత్రి వరకు ఆమె ఆచూకీ దొరకలేదు. -
దుర్గమ్మకు విరాళంగా నగదు, వెండి కిరీటం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు బుధవారం రూ.4.50 లక్షల విరాళాలను అందజేశారు. విజయవాడ గుణదలకు చెందిన యార్లగడ్డ అమన్, మానవ్ కుటుంబ సభ్యులు నిత్యాన్నదానానికి రూ. 2 లక్షలు, రూ. 2.50 లక్షల విలువైన వెండితో తయారు చేయించిన కిరీటాన్ని ఆలయ ఈవో శీనానాయక్‌కు అందజేశారు. వెండితో తయారు చేయించిన కిరీటానికి బంగారు పూత వేయించినట్లు దాతలు పేర్కొన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన బొడ్డు అనసూయ కుటుంబం ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను బహూకరించారు. బాలికపై లైంగికదాడి చందర్లపాడు(నందిగామ టౌన్): బాలికపై యువకుడు లైంగికదాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక పక్క గ్రామంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతోంది. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చిన ఆమైపె అదే గ్రామానికి చెందిన జాషువా అనే యువకుడు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి డిసెంబర్ 26న ఇంట్లోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికై నా చెబితే ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పెట్టటంతో పాటు బాలికతో పాటు తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. బాలిక నీరసంగా ఉండటంతో పాటు హాస్టల్‌కు వెళ్లనని చెప్పటంతో ఏమైందంటూ తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించారు. జరిగింది చెప్పగా బుధవారం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ధర్మరాజు తెలిపారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. -
ఒత్తిడిని ఓడిస్తేనే ఆరోగ్యం పదిలం!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉరుకులు పరుగుల జీవితంలో మానసిక ఒత్తిళ్లు సర్వరోగాలకు మూలకారణంగా నిలుస్తున్నాయి. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతోందని, ఇన్ఫెక్షన్లతో పాటు అనేక సమస్యలకు దారితీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇటీవల చిన్నారుల్లో ఆకస్మిక గుండెపోట్లకు ఒత్తిళ్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇవే నిదర్శనాలు.. ● పటమటకు చెందిన 40 ఏళ్ల విక్రమ్ కార్పొరేట్ సంస్థలో మంచి ఉద్యోగం చేసేవాడు. ఏడాది కిందట ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. నిద్ర పట్టక పోవడం, ఆలోచనలు ఎక్కువగా చేయడంతో తలనొప్పి, ఇతర రుగ్మతలకు గురయ్యాడు. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా జబ్బు లేదని చెప్పి, ఒత్తిడే కారణమని తేల్చారు. ● లబ్బీపేటకు చెందిన 35 ఏళ్ల రాజేష్ ప్రభుత్వ ఉద్యోగి. ప్రతిరోజూ అర్ధరాత్రి దాటే వరకూ సెల్‌ఫోన్ చూస్తూ, ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే సమయానికి నిద్రలేచే వాడు కాదు. నిత్యం ఇలా హడావుడిగా బయలు దేరడం, ఆఫీస్‌కు పరుగులు పెట్టే క్రమంలో ఒత్తిడికి గురయ్యాడు. అవి తీవ్రరూపం దాల్చడంతో సైకాలజిస్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇలా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణిలు అన్ని వర్గాలకు చెందిన వారు మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. కొరవడిన మానసికోల్లాసం.. నగరంలోని పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా ప్రాంగణాలు లేని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకూ పుస్తకాలతోనే కుస్తీ పట్టించడంతో పిల్లల్లో సృజనాత్మకత దెబ్బతినడంతో పాటు, జ్ఞాపకశక్తిని కోల్పోతున్నట్లు, మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ఆటపాటలతో చదివిన వారిలో తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయని, బట్టీ చదువులతో రోబోలుగా మారుతున్నారని అంటున్నారు. అంతేకాక వారిలో సామాజిక, నైతిక విలువుల కూడా పెంపొందడం లేదని చెబుతున్నారు. విద్యార్థుల ఆకాంక్షను పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాదు పెద్దవాళ్లు ప్రతి రోజూ ఆహ్లాదమైన వాతావరణంలో కాసేపు గడిపేందుకు అవసరమైన పార్కులు వంటివి అందుబాటులో లేవు. రోడ్డు మీదకు వస్తే ట్రాఫిక్ చిక్కులతో మరింత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా గుర్తించండి.. నిద్రలేమితో బాధపడుతున్నారా.. ఎల్లప్పుడూ దిగులుగా అనిపిస్తుందా.. ఏకాగ్రతా కుదరడం లేదా? అయితే మీకు మానసిక నిపుణుల సలహా ఎంతో అవసరం. ఇలాంటి వారు క్లిష్ట పరిస్థితుల్లో నికోటిన్, డ్రగ్స్, ఆల్కాహాల్‌తో పాటు, ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పిల్లల్లో తరచూ కోపం, చికాకు పడటం, తలను గోడకేసి కొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మానసిక అశాంతికి కారణమయ్యే వ్యతిరేక భావనలు పెరిగిపోతుంటే తక్షణమే కౌన్సెలింగ్ పొందడం, ఆరోగ్య సలహా తీసుకోవడానికి మొహమాటపడకూడదు. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే నిపుణులను సంప్రదించండి. ఉరుకుల పరుగుల జీవితంతో మానసిక సమస్యలు వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం హార్మోన్ల అసమతుల్యతతో మహిళల్లో పీరియడ్స్ సమస్యలు మానసిక ఉల్లాసంపై దృష్టి ఏదీ? అదుపులో ఉండని దీర్ఘకాలిక వ్యాధులు రుగ్మతలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న వైనం నిద్ర పట్టక పోవడం ఆకలి లేకపోవడం, ఎక్కువ ఆహారం తినడం ఒబెసిటీకి గురవడం హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మహిళల్లో పీరియడ్స్ ఇబ్బందులు మధుమేహం, రక్తపోటు అదుపులో ఉండక పోవడం తీవ్రమైన ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు వ్యాధి నిరోధక శక్తి తగ్గడంలో ఇన్ఫెక్షన్స్ సోకడం ప్రతిరోజూ 7 గంటలు తగ్గకుండా నిద్ర పోవడం, అది కూడా ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం ప్రతిరోజు వ్యాయామం చేయడం యోగా, మెడిటేషన్‌పై దృష్టి సారించడం సెల్‌ఫోన్ చూడటం మాని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవడం భావోద్వేగాలు, ప్రవర్తనలపై అదుపు కలిగి ఉండటం అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవడం -
రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం నియోజకవర్గంలో రూ. 39కోట్లతో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి కొల్లు రవీంద్రతో కలసి బుధవారం స్థానిక కాలేఖాన్‌పేటలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ. 33 కోట్ల నిధులతో మచిలీపట్నంనుంచి కమ్మవారి చెరువు వయా చిన్నాపురం డబుల్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు, రూ. 6 కోట్ల నిధులతో మచిలీపట్నం శివగంగ దేవాలయం నుంచి చిన్నాపురం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చిన్నాపురంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు పాల్గొన్నారు. ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొండపల్లి రైల్వే స్టేషన్ పరిశీలన కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి రైల్వే స్టేషన్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఎంపీ కేశినేని శివనాఽథ్, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ రైల్వే అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. కొండపల్లి నుంచి విజయవాడ వరకు రైల్వే ట్రాక్ వెంబడి డ్రెయినేజీ వ్యవస్థను మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఇప్పటికే రూ.10కోట్లు ప్రతిపాదనలు పంపా మన్నారు. రానున్న రోజుల్లో స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు పేర్కొన్నారు. త్వరలో రైల్వే స్టేషన్‌కు నూతన హంగులు సంతరించుకుంటాయని ఎమ్మెల్యే వసంత తెలిపారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. పోలీసు సిబ్బందికి ముగిసిన మూడు రోజుల శిక్షణ లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్‌నేరాలు, సోషల్ మీడియా కేసులను త్వరితగతిన ఛేదించడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ బుధవారం ముగిసింది. ఈ శిక్షణలో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది 130 మంది పాల్గొన్నా రు. ఈ శిక్షణలో సైబర్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ డైరెక్టర్ ప్రసాద్ పాటిబండ్ల, మనిషి యాదవ్, కృష్ణ కిరణ్, సంజయ్ కుమార్, కరుణాకర్ రెడ్డి, శివ కుమార్, ప్రసన్న లక్ష్మి పలు అంశాలపై శిక్షణ ఇవ్వగా, వా రిని సీపీ రాజశేఖరబాబు సత్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ వల్ల ఆయా కేసులను త్వరితగతిన అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు, దర్యాప్తులో కచ్చితమైన సాక్ష్యాలను సేకరించి నిందితులు తప్పించుకోకుండా చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆటోను ఢీకొట్టిన లారీ ఉపాధ్యాయురాలితో పాటు ఆమె భర్త మృతి జగ్గయ్యపేట అర్బన్: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు, ఆమె భర్త మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. జగ్గయ్యపేట పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల(బాలురు)లో హిందీ టీచర్‌గా పనిచేస్తున్న వడ్డాది వెంకటరత్నం(38)భర్తతో కలిసి ఖమ్మం జిల్లా వైరాలో నివాసముంటున్నారు. అక్టోబర్ నెలలో హిందీ టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగం లభించింది. వైరా నుంచి రోజూ విధులకు హాజరవుతున్నారు. భర్త రాము ట్రాలీ ఆటోలో దుప్పట్లు, పరుపులు వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు భార్యను కూడా ఆటోలో తీసుకువెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పాఠశాలలో స్టడీ అవర్స్ అనంతరం భర్తతో కలిసి ఆటోలో ఇంటికి వెళ్తుండగా వైరా మండలం సోమవారం గ్రామ సమీపంలో ఆటో ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన భర్త రాము(43)ను అంబులెన్స్‌లో ఖమ్మంలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. వారికి ఇద్దరు కుమారులు కాగా ఒకరు 10, మరొకరు 7వ తర గతి చదువుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉద్యోగం వచ్చిన నెలల వ్యవధిలోనే.. మృతదేహాలను జగ్గయ్యపేట పాఠశాల నుంచి ప్రిన్సిపాల్ టి. ఉమేష్బాబుతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది వైరా వెళ్లి పరామర్శించటంతో పాటు కుటుంబసభ్యులను ఓదార్చారు. పెళ్లి తరువాత ఎంతో కష్టపడి డిస్టెన్స్‌లో చదువుకుని ఆంధ్రాతో పాటు తెలంగాణ డీఎస్సీలో కూడా ఉద్యోగం సాధించిన నెలల వ్యవధిలోనే ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం కుటుంబ సభ్యులతో పాటు మమ్మల్ని ఎంతో కలిచి వేసిందని ప్రిన్సిపాల్ ఉమేష్బాబుతో పాటు తోటి ఉపాధ్యాయులు తెలిపారు. -
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ ఆరోగ్య సంస్థలైన జీజీహెచ్, సీహెచ్సీలలో సిజేరియన్ డెలివరీల రేటును తగ్గించే దిశగా సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్ సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం చైల్డ్ డెత్ రివ్యూ (సీడీఆర్), మాతృ మరణాలపై (ఎండీఎస్ఆర్) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రసవాలు ప్రోత్సహిస్తూనే ఎపిడ్యూరల్ అనస్థీషియాతో నొప్పిలేని ప్రసవాలను విస్తృతంగా అమలు చేయాలని తెలిపారు. ఆర్సీహెచ్ 2.0 అమలు విధానం, హెచ్‌పీఆర్ ఐడీ మ్యాపింగ్, డేటా కచ్చితత్వం, సేవల సమగ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న జేఎస్వై చెల్లింపుల అంశాన్ని సమీక్షించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో డీసీహెచ్ఎస్, అనస్థీషియా విభాగాధిపతి, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్‌తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఆవకాయ్ ఉత్సవాల్లో పర్యాటకులకే పెద్ద పీట
భవానీపురం(విజయవాడపశ్చిమ): రేపటి నుంచి మూడు రోజులపాటు విజయవాడలో నిర్వహించనున్న ఆవకాయ్ అమరావతి (సినిమ, సంస్కృతి, సాహిత్యం) ఉత్సవాల్లో పర్యాటకులకే పెద్ద పీట వేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. ఉత్సవాలకు సంబంధించి మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమన్వయ శాఖల అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సంద ర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఉత్సవాల నిర్వహణలో అనుభవం ఉన్న టీమ్‌వర్క్ సంస్థ భాగస్వామ్యంతో ఆవకాయ్ అమరావతి నిర్వహిస్తున్నామని తెలిపారు. పున్నమి ఘాట్‌తోపాటు భవానీ ద్వీపంలో కూడా వినూత్న కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. 20 సెక్టార్లకు సంబంధించి ఒక్కో సెక్టార్‌కు జిల్లా అధికారితో పాటు రెవెన్యూ, పోలీస్, వీఎంసీలకు చెందిన అధికారులు, సిబ్బందితో బృందాలను నియమించామని వివరించారు. ఉత్సవాలకు ఉచితంగా పేర్లు నమోదు చేసుకోవచ్చని, వేదికల వద్ద స్పాట్ రిజిస్ట్రేషన్‌కు వీలుకల్పించామని తెలిపారు. ఆధు నిక సాంకేతిక సహాయంతో ఆవకాయ్ అమరావతి ఉత్సవాలకు భద్రతా ఏర్పాట్లు చేశామని సీపీ రాజ శేఖరబాబు తెలిపారు. ఏపీటీఏ డెప్యూటీ సీఈఓ ఎ.శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, టీమ్‌వర్క్ సంస్థ ప్రతినిధి సయ్యద్ శ్యామ్, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా టూరిజం అధికారి ఎ.శిల్ప, వీఎంసీ ఏడీసీ డాక్టర్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి
సీఎండీ పుల్లారెడ్డి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ విని యోగదారులకు నాణ్యమైన సేవలు అందించా లని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ ఎన్టీఆర్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ సర్వీసులు త్వరితగతిన విడుదల చేయాలన్నారు. ప్రజలకు 24 గంటలూ నిరంతరా యంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. బిల్లింగ్ సకాలంలో పూర్తి చేయాలని, రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం సాధించాలని సూచించారు. లో ఓల్టేజ్ సమస్య పరిష్కరించాలని, ఫీడర్ల బ్రేక్ డౌన్ లేకుండా నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టరు టెక్నికల్ మురళీ కృష్ణ యాదవ్, డైరెక్టర్ ఫైనాన్స్ వెంకటేశ్వర్లు, సీజీఎంలు, జీఎంలు, ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్ రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రు ప్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం – చర్లపల్లి (08513) ప్రత్యేక రైలు ఈనెల 18వ తేదీన రాత్రి 11 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08514) ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు విశాఖపట్నం చేరుతుంది. పలు రైళ్లు రద్దు ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ మీదుగా నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ తెలిపారు. 13వ తేదీన నర్సాపూర్ – చర్లపల్లి (07254), 17న చర్లపల్లి – నర్సాపూర్ (07233), 19న వికా రాబాద్ – నర్సాపూర్ (07260), వికారాబాద్ – కాకినాడ టౌన్ (07287), 20న వికారాబాద్ – నర్సాపూర్ (07266), వికారాబాద్ – కాకి నాడ టౌన్ (07286) రైళ్లు పూర్తిగా రద్దయ్యాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని సూచించారు. శ్రీకాళహస్తి: విజయవాడ నగరానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అప్పులు ఇచ్చిన వారు వేధిస్తున్నారని మనస్తపం చెంది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో మంగళవారం ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన వెంకటేశ్వర్లు, ఉషశ్రీ దంపతులు వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయారు. అప్పులు తీర్చాలని రుణ దాతలు వత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుమారుడు సాయి రాజేష్(17), సాయి దీక్షిత (13)తో కలిసి వెంకటేశ్వర్లు, ఉషశ్రీ దంపతులు మూడు నెలల క్రితం శ్రీకాళహస్తికి చేరుకున్నారు. పట్టణంలోని కొండమిట్టలో ఓ అద్దె ఇంటిలో ఉంటూ, ముక్కంటి ఆలయం సమీ పంలోని హోటల్లో పనిచేస్తూ జీవిస్తున్నారు. అప్పులు ఇచ్చిన వారు శ్రీకాళహస్తిలో వీరి ఆచూకీని గుర్తించారు. ఆదివారం వారి ఇంటి వద్దకు చేరుకుని డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడిగారు. దీంతో మనస్తాపం చెందిన వెంకటేశ్వర్లు, ఉషశ్రీ తమ ఇద్దరు పిల్లలతో కలిసి అదే రోజు అర్ధరాత్రి సమయంలో మందు తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వారిని స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసే విచారిస్తున్నామని తెలిపారు. విజయవాడలీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి వేల్పుల భవాని మంగళ వారం తీర్పునిచ్చారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో నివసించే మహిళకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఆమె చిన్న కుమార్తె (8)తో ఇంటిపక్కన నివసించే రావూరి వెంకటేశ్వరరావు (50) 2019 మే నెల 31న అసభ్యంగా ప్రవర్తించాడు. గతంలో కూడా ఆ బాలికపై వెంకటేశ్వరరావు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై అజిత్‌సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గడ్డం రాజేశ్వరరావు, కృష్ణవేణి, ప్రస్తుత నార్త్ ఏసీపీ కె.స్రవంతిరాయ్‌తో పాటు సీఐల పర్యవేక్షణలో మొత్తం 12 మంది సాక్షు లను విచారించారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో మంగళవారం విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి వేల్పుల భవాని నిందితుడికి కఠిన శిక్ష విధించారు. బాధితురాలికి రూ.5 లక్షలు నష్ట పరిహారంగా అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయమూర్తి ఆదేశించారు. -
డబ్బులు ఊరికే రావు!
లబ్బీపేట(విజయవాడతూర్పు): విదేశాల్లో ఉంటూ లోకల్‌గా ఏజెంట్లను నియమించుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఒక నేరానికి.. మరో నేరానికి పొంతన లేకుండా కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. వాటిని నివారించడం పోలీసులకు సైతం పెనుసవాల్‌గా మారుతోంది. విదేశాల్లో ఉంటారు.. లోకల్ఫోన్ నంబర్‌తో మాట్లాడతారు. అకౌంట్స్ కూడా లోకల్ బ్యాంక్‌లవే చెబుతూ నమ్మిస్తుంటారు. ఈ తరుణంలో ప్రజలు అవగాహనతో మెలగడం.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చినప్పుడు భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వడమే పరిష్కార మార్గంగా పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా నేరం జరిగిన తర్వాత వెంటనే సైబర్ కై మ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. డబ్బు ఆశ చూపి.. కుచ్చుటోపీ.. విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లకు లోకల్‌గా కొందరు ఏజెంట్లు పనిచేస్తుంటారు. వారి ద్వారా సామాన్యులకు డబ్బు ఆశ చూపి కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తారు. అనంతరం ఆ అకౌంట్స్ వివరాలు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్వర్డ్ వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతాయి. దీంతో వాళ్లు నేరాలకు పాల్పడినప్పుడు, ఆ నగదును స్థానికంగా ఉన్న ఈ అకౌంట్స్‌లో ఒకదాని తర్వాత మరొకటి వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఐదారు అకౌంట్స్‌కు మళ్లిస్తుంటారు. ఇటీవల లబ్బీపేటకు చెందిన ఒక యువకుడు రూ.10 వేలకు ఆశపడి అకౌంట్స్ వివరాలు ఇస్తే రెండు రోజుల్లో రూ.2 కోట్ల మేర లావాదేవీలు చేయడంతో అతను సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవానీ పురానికి చెందిన సైబర్ నేరగాళ్లకు సహకరించే మణికంఠ అనే నిందితుడి ద్వారా లబ్బీపేటకు చెందిన దంపతులు ఆ యువకుడికి రూ.10వేలు ఇచ్చి అకౌంట్ వివరాలు తీసుకున్నట్లు గుర్తించారు. దాదాపు సైబర్ నేరగాళ్లు నగదు లావాదేవీలు చేసే అకౌంట్లు అన్నీ ఇలానే ఉంటున్నాయి. రికవరీలు సవాలే.. సైబర్ క్రైమ్ కేసుల్లో రికవరీలు సవాల్‌గానే ఉంటోంది. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు అందినప్పుడు మాత్రమే రికవరీ వేగంగా చేయగలుగుతున్నారు. బాధితుడి అకౌంట్ నుంచి డబ్బులు ఎన్ని అకౌంట్లకు వెళ్లాయో తెలుసుకుని, ఏదైనా అకౌంట్లలో నగదు ఉన్నట్లు గుర్తిస్తే ఆ బ్యాంకర్లతో మాట్లాడి సీజ్ చేయిస్తున్నారు. అలా ఇటీవల కొందరికి ఊరట కలిగింది. అయితే నేరాల్లో బాధితులు కోల్పోయిన మొత్తాలతో పోలిస్తే రికవరీ నామమాత్రంగానే ఉంటోంది. చిన్న నేరాలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంటున్నాయి. కరెంట్ ఖాతాల వెనుక సైబర్ కేటుగాళ్లు! డబ్బు ఆశ చూపి సామాన్యులతో కరెంట్ ఖాతాలు అదే తరహాలోనే ఫోన్ సిమ్ కార్డులు కూడా.. విదేశాల్లో ఉంటూ లోకల్ సిమ్‌లను వినియోగిస్తున్న నేరగాళ్లు పోలీసులకు సైతం పెనుసవాల్‌గా మారుతున్న సైబరాసురులు సైబర్ నేరాలను నిరోధించేందుకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరాల నియంత్రణలో కీలకంగా ఉండే బ్యాంకు అధికారులు, సిబ్బందికి సీపీ ఎస్వీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలి. సీబీఐ, ఈడీ అధికారులంటూ ఫోన్ చేస్తే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని అంటున్నారు.సైబర్ నేరగాళ్లు ఏ రూపంలో వస్తారో తెలియడం లేదు. ప్రతి నేరం కొత్తగానే ఉంటోంది. ఒకరిని సీబీఐ, ఈడీ అధికారుల పేరుతో బెదిరిస్తారు.. మరొకరిని ఉమెన్ ట్రాఫికింగ్ కేసు నమోదైందని డిజిటల్ అరెస్టు అంటూ ఆందోళనకు గురి చేస్తారు.. ఇంకొకరిని పొలిటికల్ నేత పేరుతో ఫోన్ చేసి పదవులు ఇప్పిస్తాం.. బిల్లులు ఇప్పిస్తామంటూ ఆశల వల వేసి నగదును దోచేస్తారు. ఓఎల్ఎక్స్ పేరుతో కొందరు.. వాట్సాప్‌కు ఏపీకే ఫైల్స్‌ను పంపించడం ద్వారా వారి ఫోన్లను హ్యాక్ చేసి మరికొందరు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు కాజేస్తుంటారు. ఇలా సరికొత్త ఎత్తులతో సైబర్ నేరగాళ్లు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే ఒక ఏడీఓతో పర్సనల్ లోన్ పెట్టించి మరీ దోచేసిన ఘటన ఇటీవల వెలుగుచూసింది. అధిక వడ్డీలు ఆశ చూపి మొగల్రాజపురానికి చెందిన ఒకరి వద్ద రూ.25 లక్షలు దోపిడీ చేశారు. సైబర్ నేరగాళ్లు మయన్మార్, వియత్నం, కంబోడియా, దావోస్, థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాల్లో మకాం వేస్తుంటారు. కానీ వాళ్లు వాడే సిమ్‌లు అన్నీ లోకల్ నంబర్లు గానే ఉంటాయి. లోకల్‌గా ఉన్న ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున సిమ్స్‌ను సమీకరించి వాటిని నేరాలకు పాల్పడే సమయంలో మాట్లాడేందుకు వినియోగిస్తున్నారు. సిమ్‌బాక్స్ ద్వారా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చేందుకు ఈ సిమ్‌లను ఉపయోగిస్తుంటారు. వాళ్లు ఫోన్ చేసినప్పుడు లోకల్ నంబర్లతో మాట్లాడుతుండటంతో బాధితులు నమ్మేస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. -
నాడు మానవ మేధ.. నేడు కృత్రిమ మేధ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పుస్తకం.. నాడు మానవ మేధస్సును తీర్చిదిద్దితే, నేడు కృత్రిమ మేధస్సు రూపకల్పనలోనూ ప్రధాన భూమికను పోషిస్తుందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా నిర్వహించిన పుస్తక ప్రియుల పాదయాత్ర మంగళవారం సందడిగా సాగింది. పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల వద్ద యాత్రను ఆర్పీ సిసోడియా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పాదయాత్రకు నాయకత్వం వహించారు. ‘మాదక ద్రవ్యాలు వద్దు – పుస్తకాలే ముద్దు’ అనే ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ముగింపు సభలో ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ వేగంగా మారుతున్న సాంకేతికత వల్ల పుస్తకాల తయారీ, ప్రచురణ, పంపిణీ, పఠనాల స్వరూప స్వభావాలే మారిపోతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో పుస్తక ప్రియులంతా జ్ఞానాన్ని అందించడం, సమాజానికి వెలుగులు పంచడం అనే పుస్తకాల మౌలిక స్వభావం మారిపోకుండా చూడాలన్నారు. తరువాత తరాలకు పుస్తకాలను అందించాల్సిన బాధ్యతను స్వీకరించాలన్నారు. భాషా సేవల్లో సవ్యసాచి మండలి.. పాదయాత్ర అనంతర సభను మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సభగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి జీవితంపై ‘దివిసీమ గాంధీ’ పుస్తకాన్ని సాహిత్య అకాడమీ పురస్కార విజేత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంత నిబద్ధత కలిగిన నాయకులు అని వివరించారు. నున్న(విజయవాడరూరల్): నున్న గ్రామంలో బుధవారం మామిడి రైతులకు మామిడి తోటల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా ఉద్యాన శాఖాధికారి పి.బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూజివీడు మామిడి పరిశోధన సంస్థ నుంచి శాస్త్రవేత్తలు డాక్టర్ కనకమహాలక్ష్మి, డాక్టర షాలిరాజు హాజరవుతున్నారని పేర్కొన్నారు. మామిడి రైతులు పాల్గొనాలని కోరారు. -
ఫ్లైయాష్ ప్రశ్నార్థకం!
మూసివేత దిశగా ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలుఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ అధికారుల తీరుతో ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలు మూతపడే దశకు చేరుతున్నాయి. ఎన్టీటీపీఎస్ సంస్థలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలయ్యే మెత్తటి బూడిదను ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలకు రవాణా చేయాల్సి ఉంది. గతంలో 20శాతం బూడిద బ్రిక్స్ కంపెనీలకు ఇవ్వాలనే ఉత్తర్వులు ప్రభుత్వాలు ఇచ్చాయి. అయితే ఎన్టీటీపీఎస్ అధికారులు బూడిద కృత్రిమ కొరత సృష్టించి బ్రిక్స్ కంపెనీలకు రవాణా కాకుండా అడ్డుకుంటున్నట్లు ఆయా కంపె నీల యజమానులు ఆరోపిస్తున్నారు. గతంలో ఉచితం, ఆ తర్వాత రూ.50 చొప్పున కొనుగోలు చేసిన కంపెనీల యజమానులు ఇప్పుడు లారీ రూ.10వేలు చెల్లించి బూడిద లోడింగ్ చేసుకుంటున్నారు. గతంలో రోజుకు 100లారీలు బూడిద లోడింగ్ జరిగితే ఇప్పుడు నెలకు 100లారీలు లోడింగ్ అవడం కష్టంగా మారింది. ఇదే మాదిరిగా కొనసాగితే ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లోని సుమారు 2వేల ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ ప్రైవేటు కంపెనీకి బూడిద లోడింగ్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఆ ప్రభావం బ్రిక్స్ కంపెనీలపై పడుతున్నట్లు తెలుస్తోంది. ఫ్లైయాష్పైనే ఆధారం.. గ్రామాలు, పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారు గృహ నిర్మాణాల కోసం ఫ్లైయాష్ బ్రిక్స్ ఎక్కువగా వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలుగా బ్రిక్స్ కంపెనీలు అనేక ప్రాంతాల్లో నెలకొల్పారు. అపార్ట్మెంట్లు, గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు బ్రిక్స్‌తో నిర్మాణం జరుపుతుంటారు. బ్రిక్స్ కంపె నీలు గతంలో బూడిద టన్ను రూ.30 చొప్పున కొనుగోలు చేసేవి. ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో టన్ను రూ.50 చొప్పున కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఎన్టీటీపీఎస్ బూడిద రవాణా ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో అధికారులు కృత్రిమ కొరత సృష్టించి లారీ బూడిద రూ.10వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని బ్రిక్స్ కంపెనీలు యజమానులు ఆరోపిస్తున్నారు. గతంలో రోజుకు 100లారీలు లోడింగ్ అయ్యేవని, ఇప్పుడు కొరత సృష్టించడం వల్ల నెలకు 100 లారీలు లోడింగ్ అవడం కష్టంగా మారిందని చెబుతున్నారు. ఉచితంగా ఇచ్చిన వైఎస్సార్.. 30ఏళ్ల క్రితం 1996లో ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలకు టన్ను రూ.30 చొప్పున ఎన్టీటీపీఎస్ ప్లాంట్ నుంచి బూడిద సరఫరా జరిగేది. ఆ తరువాత 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీ ప్రతినిధులు కలిసి టన్ను బూడిద రూ.30చొప్పున కొనుగోలు చేయలేకపోతున్నామని, ఫ్లైయాష్ ఉచితంగా ఇప్పించాలని లిఖిత పూర్వకంగా కోరారు. ఆయన మంచి మనసుతో బ్రిక్స్ కంపెనీలకు ఉచితంగా ఫ్లైయాష్ ఇవ్వాలని ఎన్టీటీపీఎస్ సంస్థకు ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు టన్ను రూ.50 చొప్పున ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలకు బూడిద అమ్మాలని సంస్థ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. టన్ను రూ.50 చొప్పున ఇప్పటి వరకు కొనుగోలు చేసి కంపెనీలను నడపగలిగారు. 30ఏళ్లుగా ఎన్నో వ్యయప్రయాసలు, కష్టనష్టాలు భరించి నిలబడిన ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీల పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో ఒడిదొడుకులకు గురవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఫ్లైయాష్ కంపెనీలకు యాష్ ఇవ్వకుండా కృత్రిమ కొరత సృష్టించడంతో సుమారు రెండు వేల ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలు మూత పడే పరిస్థితులు నెలకొన్నాయి. 2024 వరకు చిన్న మధ్య తరహా పరిశ్రమలుగా ఏర్పడిన యాష్ బ్రిక్స్ కంపెనీలకు రోజుకి సుమారు వంద లారీల ఫ్లైయాష్ ఎన్టీటీపీఎస్ ప్లాంట్ నుంచి సరఫరా జరిగేది. దాని వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లోని సుమారుగా రెండు వేల కంపెనీలు నడిచేవి. ఒక్కొక్క బ్రిక్స్ కంపెనీ మీద ఆధారపడి యాభై మంది కార్మికులకు జీవనోపాధి లభించేది. ఇప్పుడు ఎన్టీటీపీఎస్కు చెందిన ఓ అధికారి ధన దాహానికి బ్రిక్స్ కంపెనీలు మూత పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ అధికారి లారీకి రూ.10వేలు చొప్పున వసూలు చేసి నగదులో స్థానిక టీడీపీ నాయకులు సైతం వాటాలు తీసుకుంటున్నారని బ్రిక్స్ కంపెనీల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇదే ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీల ప్రతినిధులు 2018లో అమరావతి రాజధాని నిర్మాణం కోసం సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి రూ.15లక్షలు చెక్కు అందజేశారు. నేడు అదే ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలు అదే టీడీపీ నాయకుల, అధికారుల ధన దాహానికి మూత పడే పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రత్యక్ష బ్రిక్స్ కంపెనీల యజమానులు ఆందోళనకు సిద్ధమవుతామని ప్రకటించారు. -
పరిశ్రమల ఏర్పాటుకు అడ్డంకులు తొలగించండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో పరిశ్ర మలు నెలకొల్పేందుకు ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులకు సూచించారు. తన చాంబర్లో వివిధశాఖల అధికారులతో మంగళవారం సాయంత్రంసమావేశం నిర్వహించి పారిశ్రామిక యూనిట్ల పురోగతి, సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. పరిశ్రమలను నెలకొల్పటంలో ఉన్న అడ్డంకులను తొలగించి వేగంగా వ్యాపారం జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో మంజూరైన 377 పరిశ్రమలను వెంటనే ఏర్పాటు చేసేందుకు 20 మంది అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించి, ఒక్కొక్కరికి 20 మంది పారిశ్రామికవేత్తలను కేటాయించామని పేర్కొన్నారు. ప్రత్యేకాధికా రులు తమ పరిధిలోని ప్రతి పారిశ్రామికవేత్తను నేరుగా సంప్రదించి వారికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములకు సంబంధించి సరిహద్దు సమస్యలు లేకుండా సర్వే నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా, బ్యాంకు రుణాలు అంశాలపై కూడా అధికారులు దృష్టిసారించాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, జిల్లా పరిశ్రమల మేనేజర్ ఆర్.వెంకట్రావు, ఎల్డీఎం రవీంద్రరెడ్డి, డీఎఫ్ఓ సునీత, జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి పోతురాజు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
రసవత్తరంగా పోలీస్ టీ20 క్రికెట్ పోటీలు
మూలపాడు(ఇబ్రహీంపట్నం): రెండో ఆల్ ఇండియా పోలీస్ టీ20 క్రికెట్ పోటీలు మూలపాడు ఏసీఏ క్రికెట్ స్టేడియంలో రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నెల ఐదో తేదీన ప్రారంభమైన ఈ పోటీలు 11వ తేదీ వరకు కొనసాగుతాయి. త్వరలో జరగనున్న సౌత్‌జోన్ క్రికెట్ జట్టు సెలక్షన్స్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. నాలుగు రేంజ్‌ల నుంచి 11 క్రికెట్ టీమ్‌లు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. రెండో రోజు మంగళవారం డీవీఆర్ గ్రౌండ్లో ఏపీఎస్పీ రేంజ్–2, ఇంటిలిజెన్స్ టీమ్‌లు తలపడగా, ఏపీఎస్పీ టీమ్ పది వికెట్లు కోల్పోయి 109 రన్స్ స్కోర్ చేసింది. అనంతరం ఇంటిలిజెన్స్ టీమ్ ఆరు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి విజేతగా నిలిచింది. చుక్కపల్లి పిచ్చయ్య గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో అనంత పూర్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేయగా, సీఐడీ టీమ్ ఆరు వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో అనంతపూర్ జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఏసీబీ జట్టుకు ఆరు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా మినిస్ట్రీరియల్ స్టాఫ్ జట్టు 84 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. మరో పోటీలో ఆపరేషన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నాలుగు వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఈగట్ జట్టు 107 పరుగులకు ఆలౌటై ఓటమి చెందింది. -
జోగి సోదరుల బెయిల్ పిటీషన్
విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో విజయవాడ జిల్లాజైలులో రిమాండ్‌లో ఉన్న జోగి రమేష్, జోగి రాము ఎకై ్సజ్ కోర్టులో మంగళవారం బెయిల్ పిటీషన్లు దాఖలు చేశారు. గతంలో వారు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో మరోసారి బెయిల్ కోరుతూ పిటీషన్లు దాఖలు చేశారు. కంచికచర్ల: ఊకపొట్టును ట్రాక్టర్లో లోడు చేసి, ఆ వాహనంపై తిరుగు ప్రయాణమైన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు.. నందిగామ శివారు అనాసాగరం గ్రామానికి చెందిన కె.నరసింహారావు(45) ట్రాక్టర్‌కు ఊకపొట్టు లోడ్ చేసేందుకు మండలంలోని కొత్తపేట గ్రామానికి వెళ్లాడు. లోడ్ చేసిన అనంతరం అదే ట్రాక్టర్‌పై డ్రైవర్ పక్కన కూర్చుని ఇంటికి వస్తుండగా పరిటాలలోని నక్కలంపేట సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనల నరసింహారావు తలకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ట్రాక్టర్ డ్రైవర్ నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యం పొందుతుండగా పరిస్థితి విష మించి నరసింహారావు మృతి చెందాడు. మృతుడి కుమారుడు తిరుపతిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చిన్నారిని చితకబాదిన టీచర్, ఆయా
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): ఎల్కేజీ చదువుతున్న చిన్నారిని టీచర్, ఆయా తీవ్రంగా కొట్టిన ఘటన విజయవాడ చిట్టినగర్‌లో జరిగింది. చిట్టినగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో కలరా హాస్పిటల్ ప్రాంతానికి ఐదేళ్ల చిన్నారి ఎల్కేజీ చదువుతోంది. కొద్ది రోజులుగా ఆ చిన్నారి స్కూల్‌కు వెళ్లనని మారం చేస్తోంది. చిట్టినగర్‌లోని నగరాల కళ్యాణ మండపం సమీపంలో ఉన్న స్మార్ట్ క్యాంపస్‌కు ఆ చిన్నారిని తల్లిదండ్రులు సోమవారం తీసుకువెళ్లి ఆయాకు అప్పగించారు. అప్పటికే ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుండటంతో పాపను ఆయా కొట్టింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన టీచర్ కూడా ఆ పాపను కర్రతో తీవ్రంగా కొట్టింది. పాప వంటిపై వాతలు తేలాయి. సాయంత్రం షాపు నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పాప వీపుపై చేతి అచ్చు కనిపించడం, తలపై గాయం, చేతులపైన కమిలిన గాయాలు ఉండటాన్ని గమనించారు. వెంటనే స్కూల్ నిర్వాహకులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం చిన్నారిని తీసు కుని స్కూల్‌కు వెళ్లిన తల్లిదండ్రులు, బంధువులు ఆయా, టీచర్లను నిలదీశారు. ఈ క్రమంలో చిన్నారి బంధువులు స్కూల్ ఆయాపై చేయి చేసుకు న్నట్లు తెలిసింది. చిన్నారిని గాయపరిచిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కొత్తపేట సీఐ చిన్న కొండలరావును వివరణ కోరగా.. ఆ ఘటనపై ఫిర్యాదు అందలేదన్నారు.చిన్నారి తల, చేతిపై గాయాలు -
వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా కార్యాలయానికి కొలతలు
మచిలీపట్నంటౌన్: నగరంలోని జిల్లా కోర్టు సెంటర్ సమీపంలో నిర్మించిన వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయ భవనానికి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది మంగళవారం కొలతలు వేశారు. మునిసిపల్ కమిషనర్ సీహెచ్.వి.వి.ఎస్.బాపిరాజు పర్యవేక్షణలో కొలతలు వేశారు. కార్యాలయ కొలతల కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కొలతలు వేస్తున్నామని కమిషనర్ బాపిరాజు మీడియాకు తెలిపారు. అయితే హైకోర్టు పూర్తి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయో మాత్రం చెప్పకుండా దాటవేశారు. కార్యాలయం బయటి కొలతలను సిబ్బంది తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఏసీపీ హరి ప్రసాద్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పలువురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాలు అని చెప్పిన మునిసిపల్ కమిషనర్ -
తిరుపతమ్మకు నీరాజనాలు
● రంగుల మహోత్సవానికి తరలివచ్చిన అమ్మవారు ● గ్రామాల్లో ఎడ్ల బండ్లకు భక్తుల ప్రత్యేక పూజలు ● ఈ నెల 28న పెనుగంచిప్రోలుకు అమ్మవారి తిరుగు ప్రయాణం జగ్గయ్యపేట: ప్రతి రెండేళ్లకొకసారి జరుపుకొనే రంగుల మహోత్సవానికి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారితో పాటు సహదేవతల విగ్రహాలు మంగళవారం పట్టణంలోని దస్తావేజుల సెంటరు లోని రంగుల మండపం వద్దకు చేరుకున్నాయి. సోమవారం పెనుగంచిప్రోలు గ్రామంలో ప్రత్యేక పూజలనంతరం రంగుల మహోత్సవానికి బయలు దేరిన అమ్మవారు, సహదేవతల విగ్రహాలు మక్కపేట, చిల్లకల్లు మీదుగా పట్టణానికి చేరుకున్నాయి. డప్పు, కోలాట వాయిద్యాల నడుమ అమ్మవారి విగ్రహాలు తీసుకొస్తున్న ఎడ్ల బండ్లకు భక్తులు ఎదురేగి వార పోసి స్వాగతం పలికారు. చిల్లకల్లు గ్రామంలోని ఆల్‌సెయింట్స్ పాఠశాల నుంచి రామ్‌కో క్వార్టర్స్ వద్దకు వచ్చేందుకు ఆరు గంటల సమయం పట్టింది. చిల్లకల్లు పోలీస్ స్టేషన్ వద్ద విజయవాడ డీసీపీ లక్ష్మీనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు తోట సూర్య శ్రీనివాస్, సాయి మణికంఠ, సిబ్బంది అమ్మవారికి వార పోసి స్వాగతం పలికారు. కళాకారులతో కలిసి సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది చిందేశారు. జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కళాశాల నుంచి రంగుల మండపం వరకు శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అమ్మవారికి పూజలు చేసి స్వాగతం పలికారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. మండపంలో కొలువుదీరిన అమ్మవారు. సహదేవతలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు దర్శించుకుని పూజలు చేశారు. రంగుల మహోత్సవాన్ని ముగించుకుని ఈ నెల 28వ తేదీన తిరిగి పెనుగంచి ప్రోలుకు అమ్మవారు పయనమవుతారు. రంగుల మండపం వద్ద ఆలయ సాంప్రదాయం ప్రకారం గాజర్ల వంశీయులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్, తిరుపతమ్మ అమ్మవారి ఆలయ ఈవో మహేశ్వరరెడ్డి, రంగుల మండపం కమిటీ సభ్యులు ఆకుల బాజీ, పంతంగి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
9,10,11 తేదీల్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో
రామవరప్పాడు(విజయవాడ రూరల్): విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 9,10,11 తేదీల్లో క్రెడాయ్ 11వ ప్రాపర్టీ షో జరుగుతుందని సంస్థ విజయవాడ చాప్టర్ చైర్మన్ సతీష్‌బాబు, అధ్యక్షుడు మోహన్‌రావు తెలిపారు. క్రెడాయ్ 11వ ప్రాపర్టీ షో సందర్భంగా రామవరప్పాడు రింగ్ సమీపంలోని ఓ హోటల్లో మంగళవారం కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. సొంత ఇంటిని సాకారం చేసుకోవడం మధ్య తరగతి వారి కలని, దానిని నెరవేర్చడంలో భాగంలోనే క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ప్రాపర్టీ షోలు నిర్వహించి, అన్ని విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొస్తోందని తెలిపారు. ఈ ప్రాపర్టీ షోలో 50 స్టాళ్లు ఉంటాయన్నారు. ఈ స్టాళ్లలో పోసమ్ ఇన్ఫ్రా, బీబీజీ, లచన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, పీవీఆర్ గ్రూప్, వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఆర్ఆర్ ఇన్ఫ్రా, హిమజ కన్స్ట్రక్షన్స్, హరివిల్లు ప్రొమోటర్స్ వివిధ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వీరే కాకుండా ఐసీఐసీఐ, యూనియన్, హెచ్డీఎఫ్సీ, ఇండియన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇతర ప్రముఖ బిల్డర్లు, గృహోపకరణాల కంపెనీలు ముందుకు వచ్చినట్లు తెలిపారు. గృహోపకరణాలకు సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఒకే సముదాయంలో లభించడం గృహ నిర్మాణదారులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాపర్టీ షోలో వినియోగదారులకు ప్లాట్ నచ్చితే వారికి అక్కడే బ్యాంక్‌ల ద్వారా రుణ సౌకర్యం కలిగించే సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ షోకు హాజరయ్యే వినియోగదారుకుల ప్రత్యేక కూపను ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ కార్యదర్శి రఘరామ్, కోశాధి కారి సాయిరామ్, మేనేజింగ్ కమిటీ సభ్యులు, స్టాల్ హోల్డర్లు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026●క్వారీల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు ●కొండలను పిండి చేస్తున్న అక్రమార్కులు ●నిబంధనలను పట్టించుకోని వైనం ●ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి ●పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు కంచికచర్ల: నందిగామ నియోజకవర్గంలోని పలు క్వారీల్లో అక్రమార్కులు చెలరేగుతున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. నిబంధనలు తూచ్ అంటూ కొండలను పిండి చేస్తున్నారు. భారీ రిగ్గులతో పేలుళ్లు జరుపుతూ గుల్లగుల్ల చేస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా, భద్రతా చర్యలు పాటించ కుండా సాగిస్తున్న బ్లాస్టింగ్లతో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బ్లాస్టింగ్‌లకు అనుభవం లేని కార్మికులను వినియోగించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. లీజుకు తీసుకున్న కొండలను అనుమతికి మించి తవ్వేస్తున్న అక్రమార్కులు సమీపంలోని అటవీ భూములను కొల్లగొడుతున్నారు. ఆ భూముల్లోనూ తవ్వకాలు సాగిస్తూ ప్రభుత్వ సంప దను దోచేస్తున్నారు. క్వారీల్లో జరుగుతున్న తవ్వకా లను తక్కువగా చూపించడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండిపడుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు క్వారీ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. కొండలను తవ్వి రూ.కోట్లలో అక్రమ సంపాదనకు తెరదీశారు. కొంత మంది అధికారులకు ముడుపులు చెల్లించి వారి అండదండలతో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ ప్రభుత్వ సంపదను దోచేస్తున్నారు. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ ప్రాంతంలో సర్వే నంబర్ 801లో 1,204 ఎకరాల్లో రాతి క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల సమీపంలో విస్తారంగా కొండ పోరంబోకు భూమి ఉంది. ఆ పక్కనే కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్‌లో పలు రకాల జంతువులు, పక్షులు, అటవీ సంపద ఉంది. ఈ కొండల్లో గత ప్రభుత్వాలు 74 మందికి లీజులు మంజూరు చేశాయి. అయితే కొంత మంది నిబంధనలకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు సాగిస్తూ కొండలను పిండి చేస్తున్నారు. అయితే ఈ అక్రమాల వైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. కొండరాళ్లను పిండి చేసేందుకు రెండో క్వాలిటీ జిలెటిన్‌స్టిక్స్‌తో బ్లాస్టింగ్లు చేస్తున్నారు. పేలుళ్ల సమయంలో భారీ శబ్దాల కారణంగా కొండ పల్లి రిజర్వు ఫారెస్ట్‌లో జంతువులు, పక్షులు ఆందోళనకు గురవుతున్నాయి. కొన్ని ప్రాణాలు కోల్పోతున్నాయి. మరికొన్ని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోతున్నాయి. ఫలితంగా పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. క్వారీల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న సమయంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్‌శాఖల అధికా రులు అటువైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సంబందిత అధికారు లకు కాంట్రాక్టర్లు ముడుపులు అందించడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. 7దొనబండ క్వారీల్లో తనిఖీలు చేస్తాం. ప్రభుత్వం ఎంత మేరకు ఏఏ యజమానులకు అనుమతులు ఇచ్చింది, అసలు అనుమతులు ఉన్నాయా? లేవా? ప్రభుత్వం కేటాయించిన క్వారీల్లోనే తవ్వ కాలు జరుపుతున్నారా? లేదా? అన్న కోణంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. అనుమతులు లేని క్వారీలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అక్రమంగా తవ్వకాలు జరిపితే క్వారీలను సీజ్ చేయటం ఖాయం. – సీహెచ్ నరసింహారావు తహసీల్దార్, కంచికచర్ల మైలవరం: స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సోమ వారం ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ పటమటకు చెందిన కోనేరు బాబూరావు, విజయకుమారి దంపతులు సోమ వారం రూ.1,00,116 విరాళం సమర్పించారు.గన్నవరంరూరల్: మండలంలోని చినఅవుట పల్లిలో ఉన్న సిద్ధార్థ దంత వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా జరిగాయి. -
‘దేశం’ తమ్ముళ్ల కుమ్ములాట
గుడివాడరూరల్: పాత కక్షల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మండలంలోని లింగవరం గ్రామ పంచాయతీ చేపల చెరువులను గతంలో వేలం పాట దక్కించుకున్న టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావుపై గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిని స్థానికులు అడ్డుకుని గాయపడిన శ్రీనివాసరావును ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు చేశానని కక్ష.. వైద్య చికిత్స అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ లింగవరం గ్రామంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేశానని, దీన్ని మనసులో పెట్టుకున్న గ్రామంలోని టీడీపీ నాయకులుగా చెలామణి అవుతున్న చిరంజీవిరెడ్డి, మందపాలి గోపాలస్వామి, మందపాటి శివయ్య.. తాను హార్ట్ పెషేంట్ని అని కూడా చూడకుండా దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని శ్రీనివాసరావు చెప్పారు. కాగా ఘర్షణ సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ఎన్.చంటిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్ధి చెప్పారు. -
ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం భూమాత పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తే రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చునన్నారు. అధికంగా రసాయనిక ఎరువులు వాడు తున్న 100 గ్రామ పంచాయతీలను గుర్తించి, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, డీసీఓ చంద్రశేఖరరెడ్డి, డీపీఎం కె.పార్థసారథి, మార్క్ ఫెడ్ డీఎం మురళీకిషోర్, వ్యవసాయశాఖ ఏడీ ఎన్ మణిధర్ తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సంక్రాంతి సీజన్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ఈ నెల ఏడు నుంచి 20వ తేదీ వరకు చర్లపల్లి రైల్వేస్టేషన్లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ కల్పించినట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ సోమవారం ఒక ప్రకటకలో తెలిపారు. గూడూరు – సికింద్రాబాద్ (12709), కాకినాడపోర్టు–లింగంపల్లి (12737), తిరుపతి – సికింద్రాబాద్ (12763), కాకినాడ టౌన్ – లింగంపల్లి (12775), విశాఖపట్నం – సికింద్రాబాద్ (12739), సికింద్రాబాద్ – భువనేశ్వర్ న్యూ (17016), హైదరాబాద్ – విశాఖపట్నం (12728), లింగంపల్లి – కాకినాడ టౌన్ (12776), సికింద్రాబాద్– విశాఖపట్నం (127 40), లింగంపల్లి – కాకినాడ పోర్టు (12738), సికింద్రాబాద్ – గూడూరు (12710) రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): వివిధ కులాల అభివృద్ధి, సంక్షేమానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ఆయా కులాల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఏపీ బెస్త సంక్షేమ, అభివృద్ధి కార్పొ రేషన్ చైర్మన్‌గా నియమితులైన బొమ్మన్ శ్రీధర్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సోమవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె తొలుత వ్యాస మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. త్వరలో ఆదరణ పథకాన్ని ప్రారంభించి ఆధునిక పరికరాలను అందిస్తామని తెలిపారు. మత్స్యకా రుల వేట విరామ భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు, ప్రమాద బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. బెస్త కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టిన బొమ్మన్ శ్రీధర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యటించి బెస్త సామాజికవర్గం సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లుగా పవన్ కుమార్, శ్రీనివాసులు, మల్లికార్జున, మనోహర్, చంద్రశేఖర్, కె. భాస్కరరావు, కె.శ్రీధర్, ఎం.వెంకట సుబ్బయ్య, పి.అమరావతి, పి.తిరుమగళ్, పళని బొమ్మన్, రామాంజనేయులు, సీహెచ్ సోమయ్య, టి.జి.రమేష్‌బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ, మత్స్యకార, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ల చైర్మన్లు కొల్లు పెద్ది రాజు, చిలకల పూడి పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
ఐదు రోజుల పనిదినాల కోసం డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో చేపట్టిన జాతీయ ఆందోళనలో భాగంగా ఈ ధర్నాను నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఆలిండియా స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్. చంద్రశేఖర్ మాట్లాడుతూ 12వ ద్వైపాక్షిక ఒప్పందం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో కుదిరిన ఒప్పందం నేటి వరకు అమలు కాలేదన్నారు. ఇంతకన్నా దురదృష్టకరమైన విషయం మరొకటి లేదన్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే బ్యాంకుల్లో ఐదు రోజుల పనిదినాలు ప్రవేశపెడుతున్నామని ప్రకటించి మాట తప్పిందన్నారు. ఇప్పటికే ఎల్ఐసీ, జీఐసీ, ఆర్బీఐలో ఐదు రోజుల పని దినాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్లో మాత్రం అమలు చేయలేకపోవడం ఎంతో దురదృష్టకరమన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈనెల 27న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. విజయ శేఖర్, నాయకులు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. సంగీత సేవతో జీవితం సార్థకం విజయవాడ కల్చరల్: సంగీత సద్గురువుల సేవలో జీవితాలను సార్థకం చేసుకోవాలని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. సంగీత సన్మండలి ఆధ్వర్యంలో 31వ త్యాగరాజస్వామి ఆరాధన, సంగీతోత్సవాలు జీవీఆర్ సంగీత కళాశాలలో సోమవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమాలను ప్రారంభించిన గంగరాజు మాట్లాడుతూ తెలుగు వాడైన త్యాగరాజస్వామి సంకీర్తనలకు తమిళ నాట గుడికట్టారన్నారు. కళాకారులు కోసమే జీవీఆర్ కళాశాలలో వేదిక నిర్మించామన్నారు. వేదిక నిర్మాణానికి గతంలోనే కొంతమంది రాజకీయ నాయకులు అడ్డంకులు సృష్టించినట్లు తెలిపారు. సంగీత సన్మండలి అధ్యక్షుడు మోదుమూడి సుధాకర్ సభకు అధ్యక్షత వహించారు. సంగీత విద్వాంసుడు మల్లాది శ్రీరాం ప్రసాద్ త్యాగరాజస్వామి సంకీర్తనలలోని భక్తితత్వం, సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ కీలక ప్రసంగం చేశారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్ సి.జ్యోతిర్మయి, సంస్థ ఉపాధ్యక్షుడు జొన్నవిత్తుల ప్రభాకర శాస్త్రి, సంగీత విధూషీమణి అంజనా సుధాకర్ పాల్గొన్నారు. సంగీత కార్యక్రమంలో భాగంగా ఎస్. సాత్విక, మల్లాది సోదరీమణులు, బెంగళూరు చెందిన అలేఖ్య, హైదరాబాద్‌కు చెందిన డీవీ మోహన కృష్ణ త్యాగరాజ స్వామి కృతులను ఆలపించారు. -
పుస్తకాలకు సమాజాన్ని శాసించే శక్తి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సమాజాన్ని శాసించే శక్తి పుస్తకాలకు ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో సోమవారం సాయంత్రం ఆచార్య గుజ్జు చెన్నారెడ్డి రచించిన ‘ధర్మపురి’ నవలను కృష్ణయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంపై పుస్తకాల ప్రభావం ఉంటుందన్నారు. గుజ్జు చెన్నారెడ్డి నవలను తీసుకురావటం అభినందనీయమన్నారు. రచయిత చెన్నారెడ్డి మాట్లాడుతూ.. బుద్ధుని చరిత్రతో ప్రభావితమై, దానిని ఆధునిక పరిస్థితులకు అన్వయిస్తూ ఈ నవల రాసినట్లు తెలిపారు. ఈగల్ ఎస్పీ నగేష్‌బాబు మాట్లాడుతూ.. మత్తు మందుల్లాంటి ప్రమాదకర వ్యసనాల నుంచి భావితరాలను రక్షించే శక్తి మంచి పుస్తకాలకు ఉందన్నారు. ప్రభుత్వ సహాయ కార్యదర్శి కృష్ణయ్య, పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షుడు మనోహర్ నాయుడు పాల్గొన్నారు. మినీ కవితా ఉద్యమ సారథి కొల్లూరి ఎక్స్‌రే పత్రిక సంస్థాపకుడు కొల్లూరి మినీ కవితా ఉద్యమ సారథి అని పలువురు వక్తలు కొనియాడారు. ఎక్స్‌రే పత్రిక, నెలనెలా వెన్నెల కార్యక్రమం ద్వారా మినీ కవితా ఉద్యమానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో కవి, ఎక్స్‌రే పత్రిక సంస్థాపకుడు కొల్లూరి సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి చలపాక ప్రకాష్ అధ్యక్షత వహించారు. సింగంపల్లి అశోక్ కుమార్, బి.ఆంజనేయరాజు, కందికొండ రవికిరణ్, ఉమామహేశ్వరి, శైలజ సామినేని ప్రసంగించారు. సమాజాన్ని ఆవిష్కరించే సాధనం కవిత్వం సమాజ వాస్తవ స్వరూపాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించే సాధనం కవిత్వమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. ‘పాతికేళ్ల కవిత’ అంశంపై చర్చాగోష్ఠిని బీవీ పట్టాభిరామ్ సాహిత్యవేదికపై నిర్వహించారు. రచయిత ఖాదర్ మొహియుద్దీన్, కడలి సత్యనారాయణ, కవి అనిల్ డ్యానీ ప్రసంగించారు. సాహితీ స్రవంతి సత్యాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాధికారి మెరుపుల అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
సాగర్ కాలువలో పడి వృద్ధుడి మృతి
తిరువూరు: స్థానిక 9వ వార్డుకు చెందిన బాణావతు మణిరాం (68) ప్రమాదవశాత్తూ ఎన్ఎస్పీ తిరువూరు మేజరు కాలువలో పడి ఆదివారం రాత్రి మరణించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మణిరాం మూర్ఛ వ్యాధిగ్రస్తుడై ఇంటివద్దే ఉంటున్నాడు. అతని భార్య మంగమ్మ టౌన్‌షిప్‌లోని ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. వీరికి సంతానం లేదు. ఆదివారం భార్య పనిచేస్తున్న స్కూలు వద్దకు వెళుతూ ఫిట్స్ వచ్చి మేజరు కాలువలో పడి ఊపిరాడక మరణించినట్లు తెలిపారు. మణిరాం మృతదేహాన్ని సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి వెలికితీశారు. గుడివాడరూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మల్లాయపాలెం పరిధిలోని టిడ్కో కాలనీలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గంధం విజయభాస్కరరావు(55), బసవ నాగమహాలక్ష్మి దంపతులకు టిడ్కో కాలనీలో సీ–76 ఎస్–4లో సొంత ప్లాటు కలిగి ఉన్నారు. అయితే గతకొంతకాలంగా ఎన్టీఆర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. విజయభాస్కరరావు మద్యానికి బానిసై తరచూ చనిపోతానంటూ భార్యను బెదిరించేవాడు. ఈక్రమంలో ఈనెల 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు టిడ్కో కాలనీలో ఉన్న సొంత ప్లాటుకు వెళ్లి కుమార్తెకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పాడు. మద్యం తాగి గతంలో కూడా ఇలా మూడు, నాలుగుసార్లు చెప్పి ఉండటంతో అలా ఏమి జరగదనే అభిప్రాయంతో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఉరికి వేలాడుతూ.. సోమవారం మధ్యాహ్నం అయినా ఇంటికి కుమార్తె టిడ్కో కాలనీలోని ప్లాటుకు వెళ్లి చూడగా తండ్రి విజయభాస్కరరావు ఉరివేసుకుని వేలాడుతున్నట్లు కన్పించాడు. ఈ క్రమంలో కుమార్తె, స్థానికులు సమాచారాన్ని పోలీసులకు తెలుపగా ఎస్ఐ ఎన్.చంటిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉండగా వారికి వివాహాలయ్యాయి. మృతుని కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట కుమ్మరి వీధి 5వ లైన్లో బొట్టా రాజేంద్రకుమార్ తన భార్య, ఇద్దరు ఆడపిల్లలతో నివాసం ఉంటున్నాడు. అదే భవనంలో కింది అంతస్తులో రాజేంద్రకుమార్ తమ్ముడు నాగేంద్ర తేజత్కుమార్ తన భార్య శైలజకుమారితో నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా రాజేంద్రకుమార్‌కు తన భార్యతో గొడవ పడుతుండటంతో ఆమె పిల్లలను తీసుకుని కృష్ణలంకలోని పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం రాజేంద్రకుమార్ ఇంట్లో ఉండగా, తమ్ముడు నాగేంద్ర భోజనం తీసుకుని గదికి వెళ్లాడు. అయితే ఇంటి తలుపులు వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా, రాజేంద్రకుమార్ వేలాడుతూ కనిపించాడు. దీంతో నాగేంద్ర చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు బలవంతంగా తెరిచి లోపలకు వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉయ్యాల కట్టే ప్లాస్టిక్ తాడుతో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరి వేసుకుని మార్బుల్ కార్మికుడి ఆత్మహత్య మద్యానికి బానిసైన మార్బుల్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట పోతిన అప్పలస్వామి వారి వీధిలో రాంపిళ్ల శ్రీలక్ష్మి, బాబి దంపతులు నివాసం ఉంటున్నారు. బాజీ మార్బుల్ పని చేస్తుంటాడు. గత కొంత కాలంగా మద్యం అతిగా తాగడమే కాకుండా భార్యను వేదింపులకు గురి చేయసాగాడు. 15 రోజుల కిందట బాగా మద్యం తాగి వచ్చిన బాబి భార్యను, తల్లిని వేదించడంతో వారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. సోమవారం ఉదయం చుట్టు పక్కల వారు శ్రీలక్ష్మికి ఫోన్ నుంచి ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని చెప్పారు. దీంతో ఇంటికి వచ్చి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు బాబి ఉరి వేసుకుని శవమై కనిపించాడు. శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోడి పందేలు నిర్వహిస్తే కేసులు తప్పవు
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కోడి పందేలు నిర్వహించటం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా నిర్వహిస్తే కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కోడిపందేలు నిర్వహించటం చట్టరీత్యా నేరమన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో ఎక్కడైనా కోడిపందేలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్, మండల, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయటం జరిగిందని, ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తుంటే సమాచారం అందించాలన్నారు. ముందుగానే కోడిపందేలు నిర్వహించే వారిని గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డీఎఫ్‌వో సునీత, డీఈవో సుబ్బారావు, డీఎస్పీ సీహెచ్ రాజా, ఆర్టీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో గుంటూరు జైలులో రిమాండ్‌లో ఉన్న యద్దల నవీన్‌కృష్ణ తరఫున న్యాయవాది యక్కంటి పుల్లారెడ్డి ఏసీబీ న్యాయస్థానంలో మధ్యంతర బెయిల్ దాఖలు చేశారు. నవీన్‌కృష్ణ భార్య గర్భవతిగా ఉండటంతో ఆమెను చూసుకునేందుకు అందుబాటులో ఉండటానికి నెలరోజులపాటు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్లో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్‌కు నోటీసు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇదే కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న అనిల్ చోక్రాకు ఆస్తమా ఉందని, ప్రస్తుతం చలికాలం కావడంతో వేడినీటిని తాగేందుకు జైలులో అనుమతించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది పిట్టల శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటీషన్‌పై జైలర్‌కు ప్రాసిక్యూషన్‌కు నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. -
సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకపోయినా సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తోందని మండిపడింది. సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో జేఏసీ ఆధ్వర్యాన సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులు జరిగే ఈ దీక్షల్లో తొలి రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. జేఏసీ నాయకులు బొలినేని రఘురాం, టి.వెంకటరామయ్య మాట్లాడుతూ.. తక్షణమే జీఓ 36ను అమలు చేయాలని, డీఎల్‌ఎస్‌ఎఫ్ ఏర్పాటు చేసి జీతభత్యాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2019, 2024 పీఆర్సీలు అమలు కాలేదని, తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, చట్ట ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని, రిటైర్మెంట్ వయసు పెంపు, రూ. 5 లక్షలకు తగ్గకుండా ఆరోగ్య బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా స్పందన లేకపోవడంతో కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. రిలే నిరాహార దీక్షలో ఎం.వెంకటేశ్వరరావు, ఎస్.ఖాజా మొహిద్దీన్, పి.సత్యనారాయణ, కె.సత్యనారాయణ, జిల్లాలోని సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు -
సమస్యల సత్వర పరిష్కారానికి కృషి
కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో వచ్చిన ప్రతి అర్జీపై విచారణ జరిపించి బాధితులకు తప్పక న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుల సమస్యలను సావదానంగా ఆలకించి పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే న్యాయం కోసం వచ్చే బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీ కోసంలో 30 అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● పెనమలూరుకు చెందిన సావిత్రి అనే బాధితురాలు ఎస్పీని కలిసి ఐదేళ్ల కిందట తనకు వివాహం కాగా బాబు, పాప ఉన్నారని తెలిపారు. అయితే అత్తింటివారు అదనపు కట్నం కోసం తనను మానసికంగా వేధిస్తున్నారని, తన భర్తకు మరో వివాహం చేసేందుకు సైతం పూనుకుంటున్నట్లు వివరించారు. వ్యసనాలకు బానిసైన భర్త తనపై భౌతికదాడికి పాల్పడుతూ హింసలు పెడుతున్నారని, తనకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. ● బంటుమిల్లికి చెందిన ప్రసాద్ అనే రైతు ఎస్పీని కలిసి తన పొలం సరిహద్దుదారుడు తన పొలంలోకి వెళ్లనీయకుండా ఇబ్బందులు పెడుతున్నాడని తెలిపారు. అదేమంటే బెదిరింపులకు పాల్పడుతూ దాడికి తెగబడుతున్నాడని వాపోయారు. అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. ● అవనిగడ్డకు చెందిన నరసయ్య వ్యవసాయ పనుల కోసం బంధువుల వద్ద కొంత నగదు అప్పుగా తీసుకున్నానని క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ అధిక వడ్డీ పేరుతో మరింత కట్టాలని వేధిస్తున్నాడంటూ వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు -
వివాహిత దారుణ హత్య
మైలవరం: మండల కేంద్రం రెడ్డిగూడెం శివారు రాఘవాపురంలో సంగెపు శ్రావణి(30)అనే వివాహిత ఆదివారం రాత్రి హత్యకు గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సంగెపు శ్రావణి అనే వివాహిత విస్సన్నపేటలో ఒక వస్త్రాల దుకాణంలో పనిచేస్తోంది. యథావిధిగా ఆదివారం తను విధులు ముగించుకుని రాత్రి పదకొండు గంటల సమయంలో మరో వ్యక్తి సాయంతో ఇంటికి చేరుకున్నట్లు తెలిసింది. ఆ సమయంలో ఆమె భర్త నాగరాజు తన తండ్రి కోటేశ్వరరావుకు ఆరోగ్యం బాలేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి అక్కడే ఉన్నాడు. ఆమె అత్త కూడా ఇద్దరు పిల్లలతో కలిసి వేరే గదిలో నిద్రపోయారు. అయితే అత్త ఉదయాన్నే నిద్ర లేచి చూసే సరికి శ్రావణి రక్తపు మడుగులో శవమై పడి ఉంది. ముమ్మర దర్యాప్తు.. సమాచారం అందుకున్న మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రెడ్డిగూడెం ఎస్ఐ శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడి కోసం ఎనిమిది బృందాలుగా ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే ఇప్పటికే అనుమానితుడైన ఓ వ్యక్తిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గుణదల(విజయవాడ తూర్పు): బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై మాచవరం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం కార్మికనగర్‌కు చెందిన ఇద్దరు బాలికలు(8) స్నేహితులు. ఈ నెల 26వ తేదీన ఇరువురూ ఆడుకుంటున్నారు. ఈ సమయంలో ఆ ఇంటి పక్కన అద్దెకు ఉంటూ.. తాపి పని చేసుకుని జీవనం సాగించే ఎం. రామకృష్ణ(26) మద్యం తాగి ఈ ఇద్దరు బాలికలను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలికలు తమ తలిదండ్రులకు చెప్పడంతో.. నిలదీసేందుకు వచ్చిన సమయానికే ఆ నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రెండు రోజుల తరువాత తిరిగి వచ్చిన అతడు మరలా బాలికలపై వేధింపులకు పాల్పడ్డాడు. విషయం స్థానిక పెద్దలకు తెలిసేలోపే మరలా పరారయ్యాడు. తరచూ మైనర్ బాలికలను వేధిస్తున్న కారణంగా తమ బిడ్డలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఇరువురి బాలికల్లో ఓ బాలిక తల్లి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వైభవంగా శ్రీతిరుపతమ్మ రంగుల మహోత్సవం
పెనుగంచిప్రోలు: ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వ హించే పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మ వారి రంగుల మహోత్సవం సోమవారం అంగ రంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.11 గంటలకు వేద పండితులు, ఆలయ అర్చకుల మంత్రోచ్చరణ మధ్య మహా నివేదన అనంతరం శ్రీగోపయ్యసమేత శ్రీతిరుపతమ్మ విగ్రహాలు, అమ్మ, స్వామివారి ఉత్సవమూర్తులు, సహదేవతలైన మల్లమ్మ, చంద్రయ్య, అంకమ్మ, పెద్దమ్మ, మద్దిరావమ్మ, ఉన్నవూరు అంకమ్మ, గుర్రం వాహనాలను ఆలయం నుంచి ఈఓ బి. మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్‌బాబు, సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, డీసీపీ బి.లక్ష్మీనారాయణ, అధికారుల సమక్షంలో ఆలయం నుంచి వెలుపలకు తీసుకొచ్చారు. అనంతరం విగ్రహా లను సేవకులు(రజకులు)తలపై పెట్టుకొని గ్రామ వీధుల్లో మేళతాళాలు, డప్పు వాయుద్యాలు, కోలాట నృత్యాలతో ఊరేగించారు. బేతాళ నృత్యాలు, శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలు, తెలంగాణకు చెందిన కొమ్ములవారి నృత్యాలతో పాటు కోలాట నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోలీస్ స్టేషన్ వద్ద నందిగామ ఏసీపీ తిలక్, జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఎం.ఎస్.కె.అర్జున్ అమ్మ వార్ల విగ్రహాలకు స్వాగతం పలికి నీళ్లు వారు పోశారు. విగ్రహాలను తలపై మోసిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రానికి విగ్రహాలు రంగుల మండపం వద్దకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో కేడీఈసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, ఆలయ ఈఈ ఎల్.రమా, ఏఈ రాజు, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, ఆలయ మాజీ చైర్మన్లు కాకాని శ్రీనివాసరావు, వాసిరెడ్డి బెనర్జీ, నూతలపాటి చెన్నకేశవరావు, లగడపాటి వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
దేశభవిష్యత్లో యువత భాగస్వాములు కావాలి
కమలానందభారతి విజయవాడ కల్చరల్: ౖహెందవజాతిని జాగృత పరచాలని భువనేశ్వరి పిఠాధిపతి కమలానందభారతి అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బీఆర్టీఎస్ రోడ్డులోని శంకరామార్గ్‌లో ఆదివారం హైందవ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కమలానంద భారతి మాట్లాడుతూ నేటి యువత దేశ భవిష్యత్‌లో భాగస్వాములు కావాలని సూచించారు. భారతదేశ సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని కోరారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం దేశ భవిష్యత్ రూపురేఖలను సమూలంగా మార్చివేసిందన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ ఆంధ్రప్రదేశ్ ప్రచారక్ విజయాదిత్య మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కలమతాలకు ఆతీతంగా పనిచేస్తోందన్నారు. హైందవ చైతన్యమే భారత సంక్షేమమని పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రజలతోమమేకమై పనిచేస్తోందని వివరించారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన డాక్టర్ కుందా శ్రీధర్, ఉపదృష్ట అనూరాధ ప్రసంగించారు. తొలుత శోభాయాత్రను నిర్వహించారు. కార్యక్రమ సమన్వయకర్తగా నాగలింగం శివాజీ వ్యవహరించారు. -
పేదల బియ్యంతో..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియాసాక్షి ప్రతినిధి, విజయవాడ: పేదల బియ్యాన్ని బొక్కేస్తున్నారు. చౌక ధరల దుకాణాలు కేంద్రంగా భారీగా స్మగ్లింగ్ సాగిస్తున్నారు. లబ్ధిదారుడికి పదో పరకో ఆశచూపి.. రూ.కోట్లు దండుకుంటున్నారు. రేషన్ షాపులకు వెళ్లిన వారికి డీలర్ల ద్వారా నగదు బదిలీ చేసి, ఆ బియ్యాన్ని దర్జాగా షాపుల్లోనే నిల్వ ఉంచుకుంటున్నారు. తనిఖీలు చేయాల్సిన పౌరసరఫరాల అధికారులు, విజిలెన్స్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సీఎస్డీటీలు, ఆర్ఐలు ఏళ్ల తరబడి తిష్ట వేసి, రేషన్ మాఫియాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు కూడా నెలవారీ మామూళ్లు పెట్టుకొని, దందాకు పచ్చ జెండా ఊపుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికార పార్టీ నేతలే రేషన్ మాఫియాకు కొమ్ముకాస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ వాహనాలు ద్వారా అక్రమాలు పెరిగిపోతున్నాయని ప్రచారం చేసిన ప్రభుత్వం ప్రస్తుతం చాలాచోట్ల సంచులు విప్పకుండానే బియ్యాన్ని తరలించేస్తున్నా చోద్యం చూస్తోంది. నెలకు పది కోట్లకు పైనే సంపాదన.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 50 శాతం మంది మాత్రమే రేషన్ బియ్యం తీసుకుని వినియోగిస్తున్నారు. నియోజకవర్గానికి నెలకు 500 మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని రైస్ మిల్లులో పాలిష్ చేసి, కాకినాడ పోర్టు మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. మిగిలిన వారంతా డీలర్ల ద్వారా దళారులే అక్రమ రవాణా చేస్తున్నారు. లబ్ధిదారుడు నుంచి కిలో రూ.10 నుంచి రూ.14కు డీలర్ల నుంచి దళారులు కొనుగోలు చేస్తారు. అక్కడ నుంచి దళారులు ప్రధాన మాఫియా నేతలకు కిలో రూ.20 నుంచి రూ.24కు అమ్ముతారు. ఈ బియ్యాన్ని పాలిష్ చేయించి కిలో రూ.50 నుంచి రూ.60కి కాకినాడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కొన్నిచోట్ల అయితే సంచులు కూడా మార్చకుండా నేరుగా ఈ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. వీటి ద్వారా జిల్లాలో రేషన్ మాఫియా ప్రతి నెలా రూ.10కోట్లకు పైగా సంపాదిస్తున్నట్టు సమాచారం. నెలకు రూ.35 లక్షలు.. రేషన్ బియ్యం అక్రమ రవాణాని చూసీ చూడనట్టు వదిలేస్తున్నందుకు ప్రతినెలా నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు రూ.35 లక్షలు, పోలీసులకు ప్రతి నియోజకవర్గం నుంచి నెలకు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు రేషన్ మాఫియా ముట్ట చెబుతున్నట్టు తెలిసింది. కొంతమంది డీలర్లు తాము అడిగినంత బియ్యం ఇవ్వకపోతే విజిలెన్స్ అధికారులతో లేదంటే స్థానిక అధికారులతో తనిఖీలు చేయించి బెదిరించి తమ దారికి తెచ్చుకుంటారు. అధికార పార్టీ నేతలే అక్రమ బియ్యం రవాణా చేస్తుండటంతో పోలీసులు, ఇతర అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఏజెంట్లు.. ఎన్టీఆర్ జిల్లాలో అక్రమ బియ్యం రవాణా కోసం పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే వ్యక్తి అన్ని మండలాల్లో అధికార పార్టీ నేతలతో అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. పార్లమెంటు ప్రజా ప్రతినిధికే ఏకంగా నెలకు రూ.కోటికి పైగా ముడుపులు ముట్ట జెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్న తన ఏజెంట్ల ద్వారా రేషన్ బియ్యాన్ని విస్సన్నపేటకు తరలించి అక్కడ నుంచి నేరుగా కాకినాడ పోర్టుకు రవాణా చేస్తున్నట్టు తెలిసింది. తెల్లవారుజామున రెండు గంటల నుంచి 5 గంటల మధ్య ఎక్కువగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. ముందుగా ఒకరు మోటార్ సైకిల్‌పై వచ్చి ట్రయల్ వేస్తారు. తమకు అనుకూలమైన పోలీసులు ఉంటే దగ్గరలో లోడు చేసుకుని రెడీగా ఉన్న వాహన డ్రైవర్‌కు రమ్మని సమాచారం ఇస్తారు. ఈ వాహనానికి ముందు గానీ, వెనుక గానీ మాఫియా నేతలు మరో వాహనంలో వెళతారు. ప్రతిరోజూ ఒకే రూటులో కాకుండా రూట్లు మార్చి అక్రమ రవాణా చేస్తుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి కూలీ డబ్బులిచ్చి ద్విచక్ర వాహనాలపై తమకు కావాల్సి ప్రాంతాలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు. విజయవాడ, గన్నవరం, గుడివాడ, పామర్రు ప్రాంతాల నుంచి వచ్చే రేషన్ బియ్యాన్ని గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక ప్రాంతానికి తరలిస్తున్నారు. అక్కడ నుంచి నేరుగా కాకినాడ ఓడరేవుకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలుసార్లు పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్ జరిపిన దాడుల్లో 200 టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. ఏదో పట్టుకున్నట్టు చూపించాలని అనే ఉద్దేశంతో గుర్తొచ్చినపుడల్లా దాడులు చేస్తుంటారని, ఇవి కాకుండా రోజుకి టన్నుల కొద్దీ అక్రమ బియ్యం తరలి పోతూనే ఉంటుందని కొంతమంది బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక్కడ కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం మాఫియాకు పామర్రుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు నడిపిస్తున్నట్టు సమాచారం. ఎవరైనా అధికారులు తనిఖీలకు వెళుతుంటే ముందుగానే వారికి సమాచారం ఇచ్చి ఆ ప్రాంతం నుంచి వాటిని మార్చేస్తుంటారు. -
కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ పీపీవీ మాల్ రోడ్డులో ఏర్పాటు చేసి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూమ్‌ను శ్రీకమలానంద భారతిస్వామి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అధినేత బయ్యా రవి మాట్లాడుతూ రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల ప్రజల విశేష ఆధారాభిమానాలతో విజయవాడ నగరంలో తమ నాలుగవ షోరూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంచీపురానికి చెందిన వెయ్యిమంది వీవర్స్ తమ కస్టమర్స్ అభిరుచులకు అనుగుణంగా పట్టువస్త్రాలు తయారు చేస్తున్నట్లు వివరించారు. వీవర్స్ టు కస్టమర్ అనే నినాదంతో వ్యాపారం సాగిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. -
కేబుల్ సిబ్బందిపై దాడిచేసిన యువకుల అరెస్ట్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మద్యం మత్తులో సిటీకేబుల్ సిబ్బందిపై దాడికి పాల్పడిన ముగ్గురు యువకులకు కృష్ణా జిల్లా పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వారిని నడిరోడ్డుపై నడిపించుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..స్థానిక బలరామునిపేటకు చెందిన వల్లెపు వెంకటేష్, వల్లెపు ఏసు, వల్లెపు సాయి అన్నదమ్ముల పిల్లలు. ఈ ముగ్గురు శనివారం రాత్రి మద్యం మత్తులో సిటీ కేబుల్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వాచ్‌మన్‌గా పనిచేసే వృద్ధుడు చలపతిని చితకబాదారు. అడ్డువెళ్లిన మరో ఇద్దరు సిబ్బంది సాయి, సుబ్బారావుపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అక్కడితో ఆగకుండా కార్యాలయంలోకి వెళ్లిన సిబ్బందిని వెంటాడి దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ ఏసుబాబు ఆదివారం ముగ్గురు నిందితులను బలరామునిపేటలో అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్ వరకు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వెంకటేష్, ఏసుపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
ఉత్సాహంగా సిప్ అర్థమెటిక్ జీనియస్ కాంటెస్ట్
భవానీపురం(విజయవాడపశ్చిమ): సోషియబుల్ ఇంటలెక్చువల్ అండ్ ప్రోగ్రెసివ్ (సిప్) అకాడమీ రాష్ట్ర స్థాయి అర్థమెటిక్ జీనియస్ కాంటెస్ట్ సీజన్–10 కార్యక్రమం ఆదివారం కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగాయి. ఈ పోటీలో వివిధ జిల్లాల్లోని పాఠశాలల నుంచి సుమారు 1050 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన విద్యార్థులు ఫిబ్రవరి 1న చైన్నెలో జరిగే నేషనల్ లెవెల్ పోటీలకు హాజరవుతారు. ఈ సందర్భంగా సిప్ స్టేట్ హెడ్ గోపాలకృష్ణ మాకినేని మాట్లాడుతూ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సిప్ అబాకస్ రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ పోటీలు పిల్లల్లో ఏకాగ్రత, దృశ్య జ్ఞాపక శక్తి, అంకగణిత నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయన్నారు. గత 22 ఏళ్లల్లో సిప్ అబాకస్ 10లక్షలకుపైగా పిల్లలకు శిక్షణ ఇచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ ఏరియా హెడ్స్ జమీర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రాంచైజీల నిర్వాహకులు పాల్గొన్నారు. -
బీసీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి విద్యే కీలకం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో బీసీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి విద్యే కీలకమని, ఆ దిశగా డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ కోచింగ్‌తోపాటు బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునికీకరణ ద్వారా కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. ఏపీ బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన రాష్ట్ర మహాసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలండర్, డైరీని ఆవిష్కరించారు. ఆ ఘనత ఎన్టీఆర్‌దే.. మంత్రి సవిత మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించి వారు అన్ని విధాలా ఎదిగేలా చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి వారధులని, వారి హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం మాట్లాడుతూ బీసీలకు ఉద్యోగోన్నతుల్లో రిజర్వేషన్లు, క్రిమిలేయర్ తొలగింపు, బీసీ అట్రాసిటీ చట్టం అమలు చేయాలని కోరారు. బీసీ వెల్ఫేర్ ముఖ్యకార్యదర్శి ఎస్.సత్యనారాయణ, బీసీ, ఓబీసీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ బి.కేదారేశ్వరరావు, జనరల్ సెక్రటరీలు పి.శ్రీధర్, పి.భూషణ్‌రావు, ట్రెజరర్ వై.శంకరరావు, 26 జిల్లాల ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘శ్రీభవిష్య’ బ్రోచర్ ఆవిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్రీభవిష్య గ్లోబల్ స్కూల్ నగర విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ సూచించారు. శ్రీభవిష్య ఎడ్యుకేషనల్ అకాడమీ యాజమాన్యం నూతనంగా ఏర్పాటు చేయనున్న శ్రీభవిష్య గ్లోబల్ స్కూల్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం మహాత్మాగాంధీరోడ్డులోని శ్రీశేషసాయి కళ్యాణ మండపంలో జరిగింది. గతేడాది శ్రీభవిష్య ఎడ్యుకేషనల్ అకాడమీ నుంచి ఐఐటీ, నీట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈసందర్భంగా శ్రీభవిష్య డైరెక్టర్లు మాట్లాడుతూ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ స్కూల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. శ్రీ భవిష్య గ్లోబల్ స్కూల్లో ప్రతి విద్యార్థిని ఐఐటీ, నీట్ లాంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలో విజయం సాధించేలా తీర్చిదిద్దుతుందని వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లతోపాటు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బంటుమిల్లి: మండల పరిధిలోని అర్తమూరు గ్రామం వద్ద 216 జాతీయ రహదారి మార్జిన్‌లోని వసంతరాయకోడు మైనర్ డ్రైయిన్‌లో పడి ఓవ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొర్లపాడు గ్రామానికి చెందిన వ్యయసాయ కూలీ బోడావుల నాగేంద్రం(45) తల్లిదండ్రులతో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన అతను రెండురోజులుగా ఇంటికి రావడంలేదు. ఈ క్రమంలో నాగేంద్రం రహదారి మార్జిన్‌లోని మైనర్ డ్రైయిన్‌లో పడి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. మద్యం తాగి రహదారి గోడపై పడుకుని ప్రమాదవశాత్తూ దొర్లి డ్రైయిన్‌లో పడి మృతిచెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఏ.గణేష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం వన్‌టౌన్‌లోని సామారంగం చౌక్‌లోగల ది బెజవాడ కమర్షియల్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కమిషనర్ విజయసారధి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు.అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ఓ.నాగేశ్వరరావు, సెక్రటరీ కోసూరు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి డార్విన్ అధ్యక్షత వహించారు. అశోక్‌జైన్, డాక్టర్ దుర్గా నాగరాజు, జిల్లా నాయకులు అల్తాఫ్, ఎన్.సురేష్, వి. కొండలరావు తదితరులు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు: అమ్మవారి రంగుల మహోత్సవం విజయవంతానికి అందరూ సహకరించాలని పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ ఆలయ ఈవో బి.మహేశ్వరరెడ్డి ఆదివారం కోరారు. రంగుల మహోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం 6.11గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం దేవతామూర్తులను గర్భాలయం నుంచి బయటకు తీసుకువచ్చి, మధ్యాహ్నానానికి గ్రామంలోని రంగుల మండపం వద్దకు చేరుస్తామన్నారు. అర్ధరాత్రి 12 గంటల తరువాత విగ్రహాలు వత్సవాయి మండలం మక్కపేట చేరుతాయన్నారు. అక్కడి నుంచి చిల్లకల్లు మీదుగా మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు జగ్గయ్యపేటలోని రంగుల మండపానికి విగ్రహాలు చేరుతాయన్నారు. ఉత్సవం సందర్భంగా ఆలయ మాజీ చైర్మన్ నూతలపాటి చెన్నకేశవరావు ఆధ్వర్యంలో విగ్రహాల ముందు బేతాళ వేషాలు, కోలాట నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. బండ్లు వెంట అంబులెన్స్, ఫైర్ ఇంజిన్‌ను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని ఈవో కోరారు. -
అమెరికాది యుద్ధోన్మాదం: సీపీఎం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని అందరూ నిరసించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వెనిజులా దేశ అధ్యక్షుడు మదురో అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వెనిజులా ఆయిల్ నిక్షేపాలపై పెత్తనం కోసమే అమెరికా అక్రమ దాడులకు పాల్పడిందన్నారు. అమెరికా మూడో ప్రపంచదేశాలపై అమానుషంగా విరుచుకుపడుతుందన్నారు. తన పెత్తనాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికి ఎంతటి దుశ్చర్యలకైనా వెనుకాడడం లేదని విమర్శించారు. ఈ దాడులు, అరెస్ట్‌లను ప్రపంచం యావత్ ముక్తకంఠంతో ఖండిస్తున్నా, మనదేశ పాలకులు నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. ప్రపంచ ఆధిపత్య అహంకారంతో ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడడం గర్హనీయమన్నారు. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన డ్రగ్స్ సరఫరా చేసే దేశాల జాబితాలో వెనిజులా లేదని గుర్తుచేశారు. ప్రపంచ సహజ సంపదపై తనదేశ కంపెనీల పెత్తనానికే అమెరికా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మధురో, ఆయన భార్యను డ్రగ్స్ పేరుతో అక్రమ అరెస్టులకు పాల్పడడం అమెరికా ఒంటెత్తు పోకడలకు నిదర్శమన్నారు. అమెరికా పెత్తనాన్ని అందరూ ఖండించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు రమాదేవి, ఆపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
పూర్ణాహుతితో ముగిసిన ఆరుద్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ నటరాజ స్వామి వారి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న ఆరుద్రోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం హోమగుండం వద్ద పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకుడు ఎల్డీ ప్రసాద్ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు జరిపించిన పూర్ణాహుతిలో ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం వేద ఆశీర్వచనం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వారు ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి మూలమంత్ర హవనం, మంటప పూజలను ఆలయ అర్చకులు జరిపించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పాల్గొన్నారు. సాయంత్రం శ్రీశివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వారికి నగరోత్సవ సేవ కనుల పండువగా సాగింది. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంపై ఉత్సవ మూర్తులు నగర పురవీధుల్లో విహరించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఓపెన్ కేటగిరీలో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్‌లో ఆడేందుకు క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 8వ తేదీన నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణీ ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లాలోని క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా మైదానంలో విలువిద్య, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్‌లో ఎంపికలు జరుగుతాయని వివరించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్ట్ ఫొటోలు–2, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంతో ఆ రోజు ఉదయం 8గంటలకు కాకినాడ క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలోని ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్.వెంకటరమణను సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆరుద్రోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి నుంచి శివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వారికి నగరోత్సవ సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహామండపం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వారి ఉత్సవ మూర్తులు కొలువై ఉండగా, ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో, చైర్మన్లు కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తుల కోలాట నృత్యాలతో ఊరేగింపు కనకదుర్గనగర్, రథం సెంటర్, వినాయకుడి గుడి, దుర్గగుడి టోల్గేట్ మీదగా ఆలయానికి చేరుకుంది. మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం భక్తజనంతో పోటెత్తింది. ఉదయం తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళగిరి టౌన్: మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సోమవారం మంగళగిరి రానున్నారు. ఆయన ఉదయం లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థాన ఎగువ, దిగువ సన్నిధిలోని స్వామివార్లను దర్శించుకోనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు ధరమ్ బీర్ గోకుల్ ఆలయానికి రానున్నారని, సంబంధిత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. -
నవజాత శిశువులకు ఆధునిక చికిత్సలపై సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నవజాత శిశువులకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యం, అత్యవసర సమయంలో అందించాల్సిన చికిత్సలపై అను మై బేబీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్తో కలిసి ఎనికేపాడులోని ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఈ సదస్సును అను హాస్పటల్స్ గ్రూప్ ౖచైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 400మందికి పైగా వైద్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈసందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ నవజాత శిశువుల వైద్యంలో ఎన్నో ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ చికిత్సలతో శిశుమరణాల రేటును గణనీయంగా తగ్గిందన్నారు. సదస్సులో ఎన్ఆర్పీ, పిడియాట్రిక్ రీససిటేషన్ అండ్ ఎఫ్బి ఆస్పిరేషన్, ఇంటుబేషన్లతోపాటు, నియోనాటాలజీ ఎమర్జెన్సీస్, పిడియాట్రిక్ సర్జరీ, పిడియాట్రిక్ ఎమర్జెన్సీస్లపై నిపుణులు విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. కార్యక్రమంలో అను మైబేబీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీదేవి, డైరెక్టర్లు డాక్టర్ ఎస్.కిరణ్‌కుమార్, కె.రవికుమార్, పిడియాట్రిక్ టీమ్ డాక్టర్ బి.రేవంత్, డాక్టర్ ఎం.ఎన్.శ్వేత, డాక్టర్ గోవింద రాజులు, డాక్టర్ జోత్స్న ముత్యాల, డాక్టర్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
● ఆపాదమస్తకం.. పుస్తకం
విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం సాహితీ సుగంధాలు వెదజల్లు తోంది. చల్లని సాయంత్రం వేళలో వేలాదిగా కొలువుదీరిన పుస్తకాలు ఆహ్వానం పలుకుతుండగా.. వేదికలపై ప్రముఖుల ప్రసంగాలు.. మ్యాజిక్షోలు, విద్యార్థుల ప్రదర్శనలు ఆకర్షిస్తున్నాయి. విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణం మూడో రోజు ఆదివారం జనసంద్రంగా మారింది. సెలవురోజు క ావడంతో పెద్ద సంఖ్యలో వచ్చిన పుస్తక ప్రియులు వివిధ స్టాళ్లను ఆసక్తిగా తిలకిస్తూ.. ఆయా వేదికలపై కార్యక్రమాలను ఆస్వాదించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
బాధ్యతగా హెల్మెట్ ధరించాలి
జాయింట్ రవాణా కమిషనర్ మోహన్లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం బాధ్యతగా భావించాలని, అది ప్రమాదాల తీవ్రతను తగ్గించి ప్రాణాలను కాపాడుతుందని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎ. మోహన్ అన్నారు. మహాత్మాగాంధీరోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద ఆదివారం హెల్మెట్ ధరించని వాహనదారులపై రవాణాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎ. మోహన్ మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి 31 వరకూ రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వాహనదారులకు, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగిస్తున్నామన్నారు. వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదాలకు గురైన వారిలో సంవత్సరానికి వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. -
వాలీబాల పోటీల విజేత సచివాలయం జట్టు
మధురానగర్(విజయవాడసెంట్రల్): ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని ప్రత్యే క రక్షణ దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్మీట్ వాలీ బాల్ పోటీ లు ఆదివా రం ముగిశాయి. ఈ పోటీల్లో మొత్తం ఆరు టీమ్‌లు పాల్గొన్నాయి. సచివాలయం, ఎయిర్‌పోర్టు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోటీల్లో సచివాలయం టీమ్ విజేతగా నిలువగా, ఎయిర్‌పోర్టు జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈసందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ పి.హేమసుందరరావు, ప్రభుత్వ ముద్రణాలయం ఇన్చార్జి జూనియర్ మేనేజర్ నాగవరపు శరత్ మాట్లాడుతూ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న ఉద్యోగులను అభినందించారు. క్రీడలలో ప్రావీణ్యం పెంపొందించుకోవాలని తద్వారా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు. విజేతలకు రిపబ్లిక్ డే రోజున బహుమతి ప్రధానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సిస్టెంట్ కమాండెంట్ పీవీఎస్ఎన్ మల్లికార్జునరావు. ఇన్స్పెక్టర్లు సిహెచ్ విజయ్‌కుమార్, బి.ఫణికుమార్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. పెడన: బీసీలు రాజ్యాధికారం కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు సంఘటితంగా పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ రాష్ట్ర సంఘ నాయకులు పిలుపునిచ్చారు. పెడన పట్టణంలోని తోటమాల ఫంక్షన్ హాల్లో కృష్ణాజిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర బీసీల గౌరవసభను నిర్వహించారు. సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షుడు గూడవల్లి కృష్ణార్జునరావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 140పైగా ఉన్న బీసీ కులాలు రాజ్యాధికారమే అంతిమలక్ష్యంగా సంఘటిత పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వై.నూకానమ్మ యాదవ్ తదితరులు ప్రసంగించారు. హక్కులు, రిజర్వేషన్లు, సమాన అవకాశాల కోసం జరిగే సామాజిక, రాజకీయపోరాటమే బీసీ ఉద్యమ లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు వై.నాగేశ్వరరావు, సంఘ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు బొర్రా కాశీ విశ్వేశ్వరరావు(కాశీ), బెల్లంకొండ లక్ష్మణ్, వీరంకి శ్రీనివాసరావు, మట్టా వెంకటేశ్వర రావు, పార్టీ వెంకటేశ్వరరావు, కాలేపు సూరిబాబు, వేముల ప్రసాద్, మురాల ఫణి, కట్టా సతీష్, కాగిత వాసు, బెజవాడ నాగరాజు, తాతా వీరబాబు, జంపాన ఫకీర్, బళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో సమగ్ర క్రీడా పాలసీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సమగ్ర క్రీడా పాలసీతో రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్, కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న విధానాలను రాష్ట్రంలోనూ అనుసరించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ దిశగా క్రీడల్లో ముందున్న తమిళనాడు రాష్ట్రంతో సహా 17 రాష్ట్రాల క్రీడావిధానాలు, పనితీరును అధ్యయనం చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానాల్లో మౌలికవసతుల అభివృద్ధి కోసం రూ.54 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టామన్నారు. శాశ్వత క్రీడా మౌలికవసతుల అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం, విశాఖపట్నం కొమ్మాదిలో రూ.25కోట్లతో ఆధునిక స్టేడియం నిర్మాణం, విజయనగరంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు, అరకు–పాడేరు ప్రాంతాల్లో క్రీడల్లో ప్రతిభ ఉన్న గిరిజన పిల్లల కోసం ఎస్టీ కంపోనెంట్ నిధులు, స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాకినాడలో ఖేలో ఇండియా పథకం కింద సింథటిక్ ట్రాక్ పూర్తి చేసి, అక్కడే క్రీడా అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియాన్ని ఆధునిక ప్రమాణాలతో అభివృద్థి చేసేందుకు శాప్ చర్యలు చేపడుతోందన్నారు. తిరుపతిలో స్టేడియం, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని ప్రధాన క్రీడా కేంద్రంగా అభివృద్థి చేస్తామన్నారు. పలువురు కబడ్డీ క్రీడాకారుల సర్టిఫికెట్లు నకిలీవని నిర్ధారణ కావడంతో వారి మీద చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు శాప్ ద్వారా గుర్తింపు పొందిన క్రీడా సంఘాలు నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొనాలని, రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాలు ఈనెల 15వ తేదీలోపు క్రీడా యాప్‌లో తమకు సంబంధించిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో శాప్ డైరెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. – శాప్ చైర్మన్ రవినాయుడు -
నాట్య సౌరభం.. సంక్రాంతి సంబరం
విజయవాడ కల్చరల్: జేఎంఎస్ యోగభారతి అకాడమీ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో స్థానిక కేబీఎన్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు–2026 తెలుగు సంప్రదాయ సౌరభాన్ని చాటింది. నేటి యువతకు సంక్రాంతి పండుగలోని పరమార్థం వివరించడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నాట్యాచార్యులు జంగం విజయకుమార్, నిర్వాహకుడు శ్రీనివాస చక్రవర్తి తెలిపారు. జంగం స్టిస్టర్స్ మనీషా చక్రవర్తి, శ్రీనివాస చక్రవర్తి పర్యవేక్షణలో 90 పైగా చిన్నారులు నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు. తెల్లవారక ముందే రైతులు పొలాలకు వెళ్లడం, ఇంటి ముందు గొబ్బెమ్మలు, పల్లె జీవన సౌందర్యం, హరిదాసులు, గంగి రెద్దులు, పిట్టల దొరలు, చెక్కభజనలు, బుర్రకథలు, కోలాటం తదితర అంశాలతో కూడిన నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా, కేబీఎన్ కళాశాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డాక్టర్ వి. నారాయణరావు, కళాశాల ప్రిన్సిపాల్ జి. కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. రెండుగంటలపాటు సాగిన నృత్య కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
జూడోలో ఒలింపిక్ మెడల్ సాధించాలి
అవనిగడ్డ: జూడో క్రీడల్లో దివిసీమ క్రీడాకారులు ఒలింపిక్ మెడల్ సాధించాలని బొండాడ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. అవనిగడ్డలోని ఎస్విఎల్ క్రాంతి కళాశాలలో కృష్ణాజిల్లా జూడో అసోసియేషన్ వారిచే బొండాడ రాఘవేంద్రరావు సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన జూడో శిక్షణ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాఘవేంద్రరావు మాట్లాడుతూ జూడో క్రీడలో శిక్షణ పొందితే ఆరోగ్యం, ఆత్మరక్షణతోపాటు ఈరంగం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చన్కానరు. ఒలింపిక్, ఏషియా గేమ్స్ పోటీల్లో స్థానం కలిగిన జూడో క్రీడల్లో ఆంతర్జాతీయ స్థాయి టోర్నమెంటును రాష్ట్రంలో నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి జల క్రీడల్లో మెడల్స్ సాధిస్తున్న దివిసీమ బాలిక నాగిడి గాయిత్రి స్ఫూర్తితో విద్యార్థులు జూడోలో పతకాలు సాధించాలని సూచించారు. ఈసందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన జూడో క్రీడాకారులు అద్భుతమైన జూడో విన్యాసాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎస్విఎల్ క్రాంతి విద్యాసంస్థల చైర్మన్ దుట్టా ఉమామహేశ్వరరావు, జూడో అసొసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి నామిశెట్టి వెంకట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతా శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ డాక్టర్ గమిడి శ్రీనివాసరావు ప్రసంగించారు. జూడో శిక్షణా కేంద్రం నిర్వహణకు అవసరమైన షీట్స్, దుస్తులను రాఘవేంద్రరావు అందజేశారు.


