కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Feb 9 2026 8:22 AM | Updated on Feb 9 2026 8:22 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 వర్గాలుగా చీలిన విజయవాడ సెంట్రల్‌ టీడీపీ పులిచింతల సమాచారం బీసెంట్‌ రోడ్డులో భారీ దందా.. తీవ్రమవుతున్న విభేదాలు..

న్యూస్‌రీల్‌

నేడు ‘మీ కోసం’

సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
వర్గాలుగా చీలిన విజయవాడ సెంట్రల్‌ టీడీపీ

7

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 36.1837

టీఎంసీలుగా ఉంది.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దందాలతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. చివరకు ఫుట్‌పాత్‌లు, టిఫిన్‌ బండిని కూడా వదలకుండా భారీ రేట్లు పెట్టి వసూళ్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడ అదనపు అంతస్తులు, అక్రమ కట్టడాలు కడుతున్నా స్థానిక టీడీపీ నేతలు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ముఖ్య అనుచరుడు వాలిపోతున్నారు. దీంతో స్థానిక టీడీపీ నేతలకు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నియమించిన ఏజెంటుకు మధ్య విభేదాలు పొడ చూపుతున్నాయి. కొన్ని చోట్ల బహిరంగంగానే తన్నుకోవడంతో రచ్చ, రచ్చ అవుతోంది. ఈ విషయం నియోజకవర్గ ప్రజాప్రతినిధి దృష్టికి వెళ్లినా, తన ‘ఏజెంట్‌’ వైపే మొగ్గు చూపుతుండటంతో ఆయనపై క్యాడర్‌ సైతం కారాలు, మిరియాలు నూరుతోంది. ఎవ్వరు ఏమనుకుంటే, నాకేంటి.. అన్న రీతిలో ఆ ఏజెంట్‌ వసూళ్ల పర్వం కొనసాగిస్తూనే ఉండటం ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ‘తమ్ముళ్ల’ మధ్య జరుగుతున్న గొడవల వెనుక అసలు రహస్యం ఈ దందాల వసూళ్లలో వచ్చిన తేడాలే అనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

ఇంతకు మునుపు బీసెంట్‌ రోడ్డులో స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో దందా జరిగేది. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఇద్దరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని స్వయంగా దందాలు చేస్తూ వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. ఇందులో ఒకరేమో పలు కేసుల్లో నిందితుడు, మరొకరు ఇటుకల వ్యాపారి కావడం విశేషం. ప్రధానంగా బీసెంట్‌ రోడ్డులో కొత్తగా 16 బండ్లు ఏర్పాటు చేసి, బండికి రూ. 4లక్షల చొప్పున వసూలు చేశారు. దీంతో పాటు రెండో సెక్టార్‌లో ఒక్కో పాత బండి నుంచి రూ.3లక్షల చొప్పున రూ.35 లక్షలు వసూలు చేశారు. మొత్తం మీద బీసెంట్‌ రోడ్డులో హాకర్ల నుంచి రూ. కోటికి పైగా వసూళ్లు రాబట్టారు.

అ‘ధన’పు వసూళ్లు..

దీంతో పాటు అక్కడ నాలుగు భవనాలకు సంబంధించి అదనపు అంతస్తుల నిర్మించారు. వీరు అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధిని కలుసుకొని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాకే నిర్మాణం చేసుకున్నారు. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా బిల్డింగ్‌ వ్యవహారం చూస్తున్న ప్రజాప్రతినిధి ఏజెంట్‌ అయిన ఇటుక వ్యాపారి అక్కడ వాలిపోయారు. అదనపు అంత స్తులు నిర్మించిన భవన నిర్మాణ యజమానులను, నియోజకవర్గ ప్రజా ప్రతినిధిని కలవాలని హుకుం జారీ చేశారు. వారు వెంటనే నియోజకవర్గ ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లి, స్థానిక ప్రజా ప్రతినిధికి చెప్పి నిర్మాణం చేసుకున్నామని చెప్పారు. ఆగ్రహంతో రగిలి పోయిన నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధి మధ్యాహ్నం 12 గంటలలోపు అదనపు అంతస్తుకు రూ.25 లక్షల చొప్పున, మధ్యాహ్నం 12 గంటల లోపు తెచ్చి ఇవ్వాలని ఆదేశించారు. వారు డబ్బు సమీకరించుకొని తీసుకురావడం కొంత ఆలస్యం కావడంతో నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఏజెంటు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో పాటు ట్రాక్టర్లు, బుల్డోజర్లు తీసుకొని కూల్చేందుకు సిద్ధం చేసినట్లు చర్చ సాగుతోంది. డబ్బులు తీసుకు వస్తున్నామని, ఫోన్‌ చేసి చెప్పి, వెంటనే ముట్టజెప్పడంతో శాంతించినట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధికి, నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి మధ్య వసూళ్లలో కోల్డ్‌ వార్‌ నడిచి.. చివరకు బహిరంగ తన్నులాటకు దారి తీసినట్లు సమాచారం. ప్రధానంగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఏజెంట్లు టీడీపీకి అనుకూలంగా ఉన్న సామాజిక వర్గం వారు కావడం, స్థానిక నియోజకవర్గ ప్రజా ప్రతినిధి స్థానికంగా బలమైన సామాజిక వర్గం వారు కావడంతో అక్కడ వర్గ పోరు మరింత ముదిరినట్లు తెలుస్తోంది.

వసూళ్లలో విభేదాలతో

ఇటీవల బాహాబాహీ

కార్పొరేటర్‌ వర్సెస్‌ నియోజకవర్గ

ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు

ఎక్కడ అదనపు అంతస్తు వేసినా

వాలిపోతున్న ‘ఏజెంట్‌’

రగిలిపోతున్న స్థానిక టీడీపీ నేతలు

బీసెంట్‌ రోడ్డులో చిరు వ్యాపారులనూ వదలని వైనం

చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. కాల్‌ సెంటర్‌(1100)కు కాల్‌ చేసి కూడా అర్జీ నమోదు, దాని స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు.

అజిత్‌ సింగ్‌నగర్‌లో ఓ బ్రాందీ షాపు మార్పు విషయంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఏజెంటు తలదూర్చడంతో పాయకాపురానికి చెందిన నేతలు ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజా ప్రతినిధి దృష్టికి తీసుకువచ్చారు. అయినప్పటికీ ఆయన వారి మాట వినకపోవడంతో చివరకు బార్లకు సంబంధించి ఓ వ్యక్తి ద్వారా మధ్య వర్తిత్వం చేయించి రూ.4లక్షలు చెల్లించినట్లు అక్కడ చర్చ సాగుతోంది. నాలుగు స్తంభాల సెంటర్‌ సమీపంలో ఇద్దరు వ్యక్తులకు 200 గజాల స్థలం ఉంది. దాని పక్కనే ప్రభుత్వానికి చెందిన 100 గజాల స్థలం ఉంది. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, దానిని కలుపుకోవటంతో అక్కడ రచ్చ జరుగుతోంది. 64వ డివిజన్‌లో ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేత బ్యానర్లను చించి వేయటంతో అక్కడ గందరగోళం నెలకొంది. మధురానగర్‌లో ఓ టీడీపీ స్థానిక ప్రజా ప్రతినిధి, ఇటుక వ్యాపారి పెత్తనాన్ని జీర్ణించుకోలేక రగిలిపోతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనికితోడు రేషన్‌ బియ్యం, మట్టి దందా జోరుగా సాగుతోంది. బీసెంట్‌ రోడ్డులోనూ దందా ఇతనే కొనసాగిస్తున్నారు. మొత్తం మీద సెంట్రల్‌ నియోజకవర్గంలో ఎక్కడ భవన నిర్మాణం, అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్న నియోజక వర్గ ప్రజా ప్రతినిధి ఏజెంటు (ఇటుకల వ్యాపారి) వాలిపోతున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల పాత్ర తానే పోషిస్తూ, బిల్డింగ్‌ను బట్టి పెనాల్టీ వసూలు చేస్తున్నారు. ఈ దందాతో భవనాలు నిర్మించే యజమానులు హడలిపోతున్నారు. ఇక్కడ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితం అవుతున్నారు.

కృష్ణాజిల్లా1
1/6

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/6

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/6

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/6

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/6

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా6
6/6

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement