జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం
రోడ్లు వేసిన కొన్ని రోజులకే దెబ్బతిన్నాయి. భారీ వాహనాలు రాకపోకలు ఏమీ లేవు. కేవలం ద్విచక్ర వాహానాలు అంచుల పక్కకు వెళ్తేనే రోడ్లు బీటలు వారడంతో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వస్తున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నామమాత్రంగా పరిశీలించారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం.
– తిక్కిశెట్టి వెంకటసీతారామప్రసాద్‌బాబు, మాజీ సర్పంచ్, గురువిందగుంట
ఆ రోడ్డు వెంబడి లారీలు లోడుతో వెళ్లడం వల్ల కొత్తగా వేసిన రోడ్లు అంచులు దెబ్బతిని ఉండవచ్చు. ఈ విషయం నా దృష్టికి రాగానే ఆరా తీశాను. సచివాలయ సిబ్బంది నుంచి సమాచారం తీసుకున్నా. ధాన్యం లోడు లారీలు తిరిగినట్లు సమాచారం వచ్చింది. అయితే కొత్తగా వేసిన రోడ్లు కావడంతో తక్షణం సంబంధిత కాంట్రాక్టరుకు కూడా సమాచారం తెలియజేశా. సరిచేయాలని చెప్పాను. ఒకటి రెండు రోజుల్లో వాటిని సరి చేస్తామన్నారు.
– ధర్మయ్య, ఏఈ, పంచాయతీ రాజ్, పెడన
●
జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం


