భక్తి నీరాజనం
న్యూస్‌రీల్
భక్త జన సంద్రంగా మారిన కొండ 15 లక్షల మంది యాత్రికుల రాక ఘనంగా ముగిసిన గుణదల ఉత్సవాలు
కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
విశ్వమాతకు
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 537.60 అడుగులకు చేరింది. ఇది 183.3636 టీఎంసీలకు సమానం.
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని చిన జీయర్ స్వామి బుధవారం దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు.
సమర్థంగా విధులు నిర్వర్తించండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రెవెన్యూ అంశాలు, రెవెన్యూ రికార్డులను పటిష్టపరిచి సమర్థంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్‌తో కలిసి రెవెన్యూ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. రెవెన్యూ క్లినిక్, 22ఏ కేసుల పరిష్కారం, రీ సర్వే, జాయింట్ ఎల్‌పీఎం, మీ – కోసం, ఈకేవైసీ, కోర్టు కేసులు తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. తప్పులు జరగకుండా రీ సర్వే చేపట్టాలన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు మండలాల్లో సర్వే సిబ్బంది, వీఆర్వోలతో సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించాలన్నారు. రీ సర్వేలో విస్తీర్ణంలో ఐదు శాతానికి మించి తేడా వస్తేనే భూహక్కుదారులతో జాగ్రత్తగా మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములు తొలగించే అంశానికి వచ్చే అర్జీలను సేవల పోర్టల్‌లో పెట్టాలన్నారు. గ్రామకంఠం, ప్రభుత్వ భూమిని సబ్‌డివిజన్ చేయలేమని, అయితే భూపరిపాలన ముఖ్య కమిషనర్ కార్యాలయానికి ఈ–ఆఫీస్ ద్వారా ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జేసీ నవీన్ మాట్లాడుతూ.. నాలుగో విడత రీ సర్వే నివేదికలు ప్రతిరోజూ ఆర్డీఓలు తప్పనిసరిగా పంపాలన్నారు. ప్రభుత్వభూమి, ప్రైవేటు భూమి కలిసి ఉంటే దానిని విభజించేందుకు అవకాశం త్వరలో రానుందన్నారు. ఇందు కోసం పాత సర్వే నంబరు తదితర వివరాలు ఈ–ఆఫీస్ ద్వారా పంపాలన్నారు. మీ–కోసం అర్జీల్లో మూడు శాతం గడువు దాటి పరిష్కరిస్తున్నారని, పది శాతం అర్జీలు రీ–ఓపెన్ అవుతున్నాయని వివరించారు. అర్జీల పరిష్కా రంలో నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించాలన్నారు. కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీఓలు బాలసుబ్రహ్మణ్యం, హేలా షారోన్, సర్వే ఏడీ లక్ష్మణ్ పాల్గొన్నారు.
భక్తులతో పోటెత్తిన
గుణదల పుణ్యక్షేత్రం
గుణదల(విజయవాడ తూర్పు): ప్రఖ్యాత క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రమైన గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో మూడు రోజులు ఘనంగా జరిగిన ఉత్సవాలు బుధవారం ముగిశాయి. లోక మాతను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చారు. పుణ్యక్షేత్ర ప్రాంగణాలు, కొండదారులన్నీ యాత్రికులతో నిండిపోయాయి. భక్తులు మరియమాతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆఖరి రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యాత్రికులు తరలి వచ్చి ఉత్సవాల్లో పాల్గొని తరించారు.
లక్షలాదిగా భక్తుల రాక
గుణదల ఉత్సవాలకు మూడు రోజుల్లో సుమారు 15 లక్షల మంది యాత్రికులు వచ్చారని ఆలయ నిర్వాహకులు అంచనా వేశారు. ఉత్సవాల ఆఖరి రోజు కావడంతో అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వెల్లువలా తరలివచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో పాటు నగర వాసులు సైతం కుల మతాలకు అతీతంగా తిరునాళ్లలో పాల్గొనటం ప్రాధాన్యత సంతరించుకుంది. భక్తుల రాకతో పుణ్యక్షేత్ర ప్రాంగణాలన్నీ కిక్కిరిసి కనిపించాయి. ఉత్స వాల ముగింపు ప్రార్థనలకు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను ఉత్సవ నిర్వాహకులు వేదిక పైకి ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. మరియమాత దయతో నగరంతో పాటు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. ఉత్సవాలకు హాజరైన భక్తులందరికీ ఆ తల్లి దీవెనలు ఉండాలని కాంక్షించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ తదితరులు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు.
సర్వమానవులు శాంతి, సమాధానాలతో జీవించాలంటే క్రీస్తు మార్గమే శరణ్యమని విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు అన్నారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరిగిన ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. సమాజంలో అసమానతలు తొలగిన నాడు దేశం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. సర్వ మానవాళి కోసం తన ప్రాణాలను అర్పించిన క్రీస్తు చూపిన శాంతి మార్గంలో నడుచుకోవాలని సూచించారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరిగిన మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశా యని ఆనందం వ్యక్తం చేశారు. భక్తులు అందరిపై మరియతల్లి దీవెనలు ఉండాలని కాంక్షించారు. అనంతరం అమెరికాకు చెందిన బిషప్ షమీంద్ర జయవర్ధన, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం.గాబ్రియేలు తదితర గురువులు సమష్టి దివ్యబలి పూజ సమర్పించి, భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు.
7
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం
భక్తి నీరాజనం


