జెడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసిన సీఈఓ
బీబీఏ నూతన
కార్యవర్గం ఎన్నిక విజయవాడలీగల్: బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) ఎన్నికలు పూర్తయ్యాయి. 120 ఏళ్ల చరిత్ర కలిగిన బీబీఏకు 2026–27వ సంవ త్సరానికి అధ్యక్షుడిగా విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా వి.కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా బండారుపల్లి లెనిన్, జాయింట్ సెక్రటరీగా జెట్టి రవికుమార్, స్పోర్ట్స్ సెక్రటరీగా రామతేజ, లైబ్రేరియన్‌గా ముష్టి శ్రీకాంత్, ట్రెజ రర్‌గా వేములపల్లి పద్మజ, లేడీస్ సెక్రటరీగా ఉషాజ్యోతి ఎన్నికయ్యారు. రెండేళ్లు పైన 14 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, పదేళ్లు, 20 ఏళ్లు, 30 ఏళ్లు పైబడిన సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ 1996లో బీబీఏ మెంబరుగా ఎన్రోలై సీనియర్ న్యాయవాదులు టి.శివరామి రెడ్డి, శిష్టా ్లరామకృష్ణ వద్ద జూనియర్ న్యాయ వాదిగా వృత్తిని ప్రారంభించి, ఎన్నో కేసుల్లో విజయం సాధించారు. నూతన కార్యవర్గానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్ కుమార్ బుధవారం అభినందనలు తెలిపారు.
ఉడాన్‌తో విమానయాన
రంగానికి ఊతం విమానాశ్రయం(గన్నవరం): ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సవరించిన ప్రాంతీయ అనుసంధాన (ఉడాన్) పథకం దోహదపడుతుందని గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి పేర్కొన్నారు. స్థానిక విమానాశ్రయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నవీకరించిన ఉడాన్ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా విమాన కనెక్టివిటీని పెంచేందుకు వంద విమానాశ్రయాలు, కేంద్ర పాలిత, ద్వీప, ఈశన్య ప్రాంతాల్లో 200 హెలి పోర్టులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మించిన విమానాశ్రయాల్లో మూడేళ్ల వరకు ఆపరేషన్లు, మెయింటినెన్స్ మద్దతు అందిస్తుందన్నారు. చిన్న, మధ్యస్థ నగరాల నుంచి ప్రజలకు కనెక్టివిటీని పెంచేందుకు పెద్ద విమానాల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లను సరసమైన చార్జీలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఉడాన్ పథకం కింద సర్వీస్‌లు నడిపే ఎయిర్ లైన్స్ సంస్థలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను మూడేళ్ల నుంచి ఐదేళ్ల పొడిగించినట్లుగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నవీకరించిన ఉడాన్ పథకం విమానయానం రంగం అభివృద్ధికి మరింత ఊతమిస్తుందన్నారు. విమానాశ్రయ అధికారి శ్రీహరిరావు పాల్గొన్నారు.
ఫెర్రీ ఇసుక రేవుపై
అధికారుల దాడి
చిలకలపూడి(మచిలీపట్నం): జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన జె.అరుణ బుధవారం ఆమె చాంబర్లో మర్యా దపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఇటీవల నిర్వహించిన బదిలీల్లో ఆమె జెడ్పీ సీఈఓగా నియమితులయ్యారు. మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
ఇబ్రహీంపట్నం: స్థానిక ఫెర్రీ ఇసుకరేవుపై తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, సీఐ ఎ.సుబ్రహ్మణ్యం బుధవారం ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో అనుమతులు లేకుండా కృష్ణానది గర్భం నుంచి ఇసుక తీసుకొచ్చిన పడవల నుంచి లోడింగ్ చేస్తున్న ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వాల్టా చట్టం మేరకు ఒక్కొక ట్రాక్టర్‌కు రూ.10 వేల చొప్పున ఫెనాల్టీ విధించారు. ఫెనాల్టీ చెల్లించే వరకు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే పడవలు, డ్రెడ్జింగ్ యంత్రాలు, మ్యా నువల్ క్రేన్ల జోలికి అధికారులు వెళ్లకపోవడం గమనార్హం.