ఐసీయూలోనే అబ్దుల్లా.. | - | Sakshi
Sakshi News home page

ఐసీయూలోనే అబ్దుల్లా..

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

ఐసీయూలోనే అబ్దుల్లా..

చల్లపల్లి పోలీస్టేషన్లో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన ఎస్‌ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు, డ్రైవర్‌ డి.నాగరాజులు క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం వీరితో పాటు తీవ్రంగా గాయపడిన కోర్టు కానిస్టేబుల్‌ అబ్దుల్లా ముగ్గురూ గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగరాజుకు కంటి చూపు దెబ్బతినటంతో కుడి కంటికి వైద్యులు బుధవారం ఆపరేషన్‌ చేశారు. రెండో కంటికి కూడా మరోసారి పరీక్షలు జరిపి అవసరమైతే ఆపరేషన్‌ చేస్తామని వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన కోర్టు కానిస్టేబుల్‌ షేక్‌ అబ్దుల్లా మాత్రం ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ఆయన్ని చూసేందుకు ఎవరనీ లోపలికి అనుమతించటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement