అవినీతికి సైలో | - | Sakshi
Sakshi News home page

అవినీతికి సైలో

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 అవినీతికి సైలో u8లో బదిలీల్లో మాయాజాలం నూతన బదిలీలపై చర్చ

న్యూస్‌రీల్‌

సైలో అవినీతి మయం

నిర్బంధించి.. నిర్ధాక్షిణ్యంగా..

సింహ వాహనంపై ఆది దంపతులు

నిత్యాన్నదానానికి విరాళం

కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెటింగ్‌కు భరోసా

అవినీతి మయంగా

ఎన్టీటీపీఎస్‌ సైలో విభాగం

ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అంతర్గత

బదిలీలతో తీవ్ర ఒత్తిడి

నూతన బదిలీల చర్చపై

మండిపడుతున్న ఉద్యోగులు

ఇబ్రహీంపట్నం: నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ సైలో (బూదిద ప్లాంట్‌)విభాగంలో అవినీతి తార స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ ఆదాయ మార్గంగా ఉన్న సైలో విభాగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను తొలగించి ఓ సామాజిక వర్గం వారిని మాత్రమే కొనసాగిస్తున్నారని సమాచారం. సైలో విభాగంలో వివిధ సిమెంట్‌ కంపెనీ లారీలకు లోడింగ్‌ ద్వారా వచ్చే నగదు, లారీ కాటా మాయాజాలంతో సంపాదించిన సొమ్ముల్లో వాటాలు రాజకీయ నేతల జేబుల్లోకి చేర్చేందుకే ఆ సామాజిక వర్గం ఉద్యో గులకు అక్కడ పెద్ద పీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక డీఈఈ స్థాయి అధికారి ఇటీవల కావాలని బదిలీ చేయించుకున్నారు.

విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం వెలువడే సైలో(మెత్తటి బూడిద), ఎన్టీటీపీఎస్‌ చెరువులోకి వచ్చే బూడిదను లారీలకు లోడింగ్‌ చేసేందుకు ఏడాది క్రితం చైన్నెకు చెందిన రెప్లెక్స్‌ కంపెనీకి మూడేళ్లకు లీజుకు ఇచ్చారు. సైలో ప్లాంటు రెప్లెక్స్‌ కంపెనీకి అప్పగించాలనే నేపంతో ప్లాంటులో పని చేస్తున్న సుమారు 20 మంది ఉద్యోగుల్లో ఎనిమిది మంది ఎస్సీ ఉద్యోగులను వేరే ప్లాంటుకు బదిలీ చేశారు. సైలోలో కాసుల పంట పండటంతో వారిలో కొందరు రూ.50 వేల వరకు ఇచ్చి ఈ ప్లాంటు విధుల్లో చేరారు. అనతి కాలంలోనే వేరే ప్లాంటుకు బదిలీ చేయడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మిగిలిన 12 మందికి కూడా బదిలీ తప్పదని ఏడాదిగా చెబుతున్నారే తప్ప చేయడంలేదు. కొందరు బదిలీ ఉత్తర్వులు తీసుకుని కూడా రాజకీయ పలుకుబడితో అక్కడే తిష్టవేశారని సమాచారం.

ఎస్సీ, బీసీ ఉద్యోగులను సైలో నుంచి తప్పించడంలో అధికార పార్టీ నేతలు, యూనియన్‌ నాయకులు విజయవంతమయ్యారు. ఇప్పుడు విజయవాడకు చెందిన ప్రజాప్రతినిధి వద్ద స్థానిక టీడీపీ నాయులు సైలో లో నూతన నియామకాలు చేపట్టాలనే విషయాన్ని తరపైకి తెచ్చారని సమాచారం. ఈ తంతు విజయవంతమైతే ఉద్యోగులను నుంచి రూ.లక్షల్లో వసూలవు తుంది. ఉన్నవారిని తొలగించి నూతన బదిలీలు చేయడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సంస్థలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని రాజకీయ నాయకులు, యూనియన్‌ నేతలు, అధికారులు ధన దాహంతో సైలో ప్లాంటులో మళ్లీ బదిలీలపై చర్చలు జరపడంపై మండిపడుతున్నారు. బదిలీలపై సైలో విభాగం అధి కారి వివరణ కోరగా.. సంస్థ చీఫ్‌ ఇంజినీర్‌ శివరామాంజనేయులు ఆదేశాల మేరకు ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు అంతర్గత బదిలీలు చేశామన్నారు. కులాల వారీగా బదిలీ చేయాల్సిన అవసరం సంస్థకు లేదని పేర్కొన్నారు. సైలోలో నూతన బదిలీలు, నగదు వసూలు విషయం ఇప్పటి వరకు తన వద్దకు చేరలేదని స్పష్టం చేశారు.

7

ఎన్టీటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం వెలువడే తడి బూడిద చెరువులోకి, మెత్తటి పొడి బూడిద సైలో ప్లాంటుకు చేరుతుంది. సైలో నుంచి వచ్చే బూడిదను సిమెంట్‌, సిమెంట్‌ ఇటుకల తయారీకి వాడతారు. దీంతో ఈ బూడిదకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. లోడింగ్‌ సమయాల్లో డిమాండ్‌ను బట్టి భారీగా నగదు చేతులు మారుతుంది. పలు సిమెంట్‌ కంపెనీలు లారీ లోడింగ్‌కు నెలకు సుమారు రూ.3 లక్షల వరకు అక్కడి ఉద్యోగులకు ముట్టజెబుతారని సమాచారం. సిమెంట్‌ ఇటుకల కంపెనీలకు ఉచితగా బూడిద లోడింగ్‌ చేస్తామని పైకి చెబుతున్నప్పటికీ వారు కూడా ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందే. లోడింగ్‌ అయిన లారీలు కాటా పెట్టే సమయంలో అధిక లోడు పేరుతో ఒక్కొక లారీకి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తారు. రోజుకు 150 లారీల వరకు లోడింగ్‌ జరుగుతుంది. అధిక లోడు పేరుతో కాటా వద్ద రోజుకు మూడు షిప్టుల్లో సుమారు రూ.50 వేలు వరకు వసూలు చేస్తారు. అక్రమ మార్గాన సేకరించిన ఈ నగదు రాజకీయ నేతలు, ఉద్యోగులు, అధికారులు పంచు కుని సైలో ప్లాంటును అవినీతి మయంగా మార్చారనే విమర్శలు ఉన్నాయి.

మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో అధికారులు బుధవారం మరో కూల్చివేత పర్వానికి తెరలేపారు. ఇంటిని కూల్చొద్దని అడ్డుపడిన బాధితులను పోలీసులు ఈడ్చిపారేశారు.

దుర్గగుడిలో చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. ఆదిదంపతులు బుధవారం సింహ వాహనంపై నగరోత్సవంలో విహరించారు.

మోపిదేవి: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి హనుమకొండకు చెందిన ఎ.రాహుల్‌ రెడ్డి, సుస్మిత రూ.1.30 లక్షల విరాళం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement