ఎల్‌నినో పరిస్థితులపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో పరిస్థితులపై అవగాహన అవసరం

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎల్‌నినో వాతావరణ పరిస్థితులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలోని ఏపీఏవోఎస్‌ అసోసియేషన్‌ భవనంలో బుధవారం పీఎండీఎస్‌, ప్రకృతి సాగు విధానాలతో ఎల్‌నినో మిటిగేషన్‌పై జరుగుతున్న జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేలా సాగు విధానాలతో ప్రోత్స హించాలని సూచించారు. సాగు ఖర్చులు తగ్గించి వివిధ వాతావరణ పరిస్థితుల్లో రైతులకు సుస్థిర ఆదాయం సాధ్యం కావాలంటే పీఎండీఎస్‌, ట్రేసబిలిటీ, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్‌ (పీజీఎస్‌), సర్టిఫికేషన్‌ వంటి వాటిపై దృష్టిసారించాలన్నారు. వీటిని రైతులకు చేరువచేసేలా చేయిపట్టి నడిపించాలని సూచించారు. పీఎండీఎస్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే పశుగ్రాసంతో పాలలో వెన్నశాతం పెరుగుతుందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్‌ విజయకుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ అరుణ, ఏటీఎంఏ పీడీ మాధవీలత, డీడీ వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జ్‌ డీపీఎం గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement