పేర్ని నాని కుటుంబంపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపు | Machilipatnam: Case Registered Against Perni Nani and Kittu | Sakshi
Sakshi News home page

పేర్ని నాని కుటుంబంపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపు

Apr 3 2026 10:06 AM | Updated on Apr 3 2026 10:47 AM

Machilipatnam: Case Registered Against Perni Nani and Kittu

సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొబ్బరితోటలో అక్రమంగా కూల్చేసిన ఇంటిని పరిశీలించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు వెళ్లారు.

అయితే, పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐను దూషించారంటూ పేర్ని కిట్టుపై కేసు నమోదు చేశారు. కిట్టుతో పాటు పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు. ఇనకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదు మేరకు పేర్ని కిట్టుపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, నగరంలోని 6వ వార్డు కొబ్బరి తోటలో నిర్మాణంలో ఉన్న శ్రీపతి వెంకటాచలం ఇంటిని అకారణంగా కూల్చివేసిన నేపథ్యంలో గురువారం ఆయన ఆ ఇంటిని పేర్ని నాని, పేర్ని కిట్టు పరిశీలించి, బాధితుడిని పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా చనిపోయేలోపు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనే ఆశతో ఎంతో శ్రమకోర్చి రూపాయి, రూపాయి కూడబెట్టుకొని ఇల్లు నిర్మించుకుంటారన్నారు. అటువంటి ఇంటిని ఎటువంటి నోటీసులు లేకుండా అర్ధాంతరంగా కూల్చివేయటం దారుణమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement