‘కేసీఆర్‌ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా’ | Perni Nani Mass Warning To Kollu Ravindra | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా’

Apr 2 2026 3:43 PM | Updated on Apr 2 2026 6:32 PM

Perni Nani Mass Warning To Kollu Ravindra

సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో ఆరో వార్డులో అక్రమంగా కూల్చేసిన ఇంటిని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు. మంత్రి కొల్లు రవీంద్ర, పోలీసులు, అధికారుల తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్రకు పేర్నినాని మాస్ వార్నింగ్ ఇచ్చారు.  పేదల గుండెల్లో ప్రొక్లెయిన్లు దించి వారికి నొప్పి కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘మూడేళ్లు ఆగు కొల్లు రవీంద్ర. పేదల గుండెల్లో నువ్వు దింపిన గునపాల నొప్పి నీకు కూడా చూపిస్తా. 2029లో వైఎస్‌ జగన్ ప్రభుత్వం రాగానే ఇదే బాపిరాజును బందరు తీసుకొస్తా. ఇదే బాపిరాజు చౌదరిని మళ్లీ బందరు మున్సిపల్ కమిషనర్‌గా తీసుకొస్తా. పేదల గుండెల్లో నొప్పి ఎలా ఉంటుందో నీకు కూడా రుచి చూపిస్తా. నీకు, నీ పెన్ డ్రైవ్‌లు దాచి నిన్ను అడిస్తున్నవాడికి చెబుతున్నా. జేసీబీ బక్కెట్లు దిగితే నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తా. ఇదే బాపిరాజు.. ఇదే పోలీసులను బందరు తీసుకొస్తా.

..అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు.. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను. బందరు కాదు.. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాసరే.. నువ్వు తెలంగాణ వెళ్తే.. అవసరమైతే కేసీఆర్‌ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆలోచన చేయాలి. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని రాతపూర్వకంగా బందోబస్తు ఇవ్వాలని అడిగారా?. కొల్లు రవీంద్ర తానా అంటే మీరు తందానా అనడం భావ్యమేనా?. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని బందోబస్తు అడిగితే ఆ లెటర్‌ను మీడియాకు విడుదల చేయండి.

..బందరులో కొల్లు రవీంద్ర వెంట పోలీసులు తప్ప వచ్చే టీడీపీ కార్యకర్త లేడు. మమ్మల్ని కూడా వదిలేసి మా కాపులు నీ పల్లకి మోశారు. నీ దగ్గర పనిచేసేవాడు ఓ కాపు ఆడపిల్లకు కడుపు చేస్తే ఏం న్యాయం చేశావ్. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది.. నీకు ఆ మాత్రం కూడా విశ్వాసం లేకపోతే ఎలా?’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు.

నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..అవసరమైతే KCR కాళ్ళు పట్టుకు నైనా సరే..

Advertisement
 
Advertisement
Advertisement