ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌కు పితృ వియోగం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌కు పితృ వియోగం

Feb 19 2026 9:39 AM | Updated on Feb 19 2026 9:39 AM

ఎమ్మె

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌కు పితృ వియోగం

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాంకు పితృవియోగం కలిగింది. విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలో నివసిస్తున్న రఘురాం తండ్రి తలశిల చంద్రశేఖరరావు (88) బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన మంగళవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం వేకువజామున తుది శ్వాస విడిచారు. చంద్రశేఖరరావు భౌతికకాయాన్ని గొల్లపూడి లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి చంద్రశేఖరరావు భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. రఘురాంను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. శ్రద్ధాంజలి ఘటించిన వారిలో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్‌, మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్‌, టి.జె.భరత్‌, చంద్రశేఖర్‌, ఇజ్రాయిల్‌, అరుణకుమార్‌, కవురు శ్రీను, వరుదు కల్యాణి, కల్పలత, మంగమ్మ, రామసుబ్బారెడ్డి, తూమాటి మాధవరావు, రుహుల్లా, ఇషాక్‌బాషా, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రులు జోగి రమేష్‌, వెలంపల్లి శ్రీనివాస్‌, కురసాల కన్నబాబు, విడదల రజిని, ఆదిమూలపు సురేష్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి సాంబశివారెడ్డి, ఏసురత్నం, రామచంద్రారెడ్డి, ఎమ్మె ల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మల్లాది విష్ణు, గోపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సుధాకర్‌బాబు, అన్నాబత్తుని శివ కుమార్‌, నల్లగట్ల స్వామిదాసు, రాపాక వరప్రసాద్‌, దూలం నాగేశ్వరరావు, జెడ్పీ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గ, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు తన్నీరు నాగేశ్వరరావు, దేవభక్తుని చక్రవర్తి, వరికూటి అశోక్‌బాబు, బలసాని కిరణ్‌, ఉప్పాల రాము, వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలు గౌతంరెడ్డి, పోతిన మహేష్‌, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మనోహరరెడ్డి, సురద్శన్‌రెడ్డి, నాయకులు షేక్‌ ఆసిఫ్‌, కాకుమాను రాజశేఖర్‌, బందెల కిరణ్‌రాజ్‌, దొడ్డ అంజిరెడ్డి, కర్నాటి రాంబాబు, నగరపాలక సంస్థ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ సత్యనారాయణ, జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ, ఎన్నారై కోమటి జయరాం తదితరులు చంద్రశేఖరరావు భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌కు పితృ వియోగం 1
1/1

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌కు పితృ వియోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement