ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో హుబ్లీ–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో హుబ్లీ–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌

Feb 17 2026 8:58 AM | Updated on Feb 17 2026 8:58 AM

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో హుబ్లీ–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో హుబ్లీ–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో హుబ్లీ–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ కనులపండువగా శివపార్వతుల కల్యాణం 19 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు కిడ్నీ వ్యాధితో వృద్ధుడు మృతి అప్రమత్తతతో రహదారి ప్రమాదాల నివారణ

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల భద్రత, సౌలభ్యం కోసం భారతీయ రైల్వే ఐసీఎఫ్‌ కోచ్‌ల స్థానంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఆధునీకరిస్తోంది. అందులో భాగంగా ఇప్పటివరకు ఐసీఎఫ్‌ కోచ్‌లతో నడుస్తున్న హుబ్లీ–విజయవాడ (17330/17329) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మంగళవారం నుంచి రైల్వేశాఖ కొత్త ఎల్‌హెచ్‌బీ (లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌) కోచ్‌లతో ఆధునీకరించారు. ఈ కోచ్‌ల ప్రవేశంతో విజయవాడ–హుబ్లి ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సామర్ధ్యం గణనీయంగా పెరిగింది. ఇప్పటికే ఉన్న ఐసీఎఫ్‌ కోచ్‌లు ఏసీ 2 టైర్‌లో 46 బెర్త్‌లు, ఏసీ 3 టైర్‌లో 64 బెర్త్‌లు, స్లీపర్‌ క్లాస్‌లో ఒక్కో కోచ్‌లో 72 బెర్త్‌లతో నడిచేది. కొత్త ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల రాకతో ఏసీ 2 టైర్‌లో 52 బెర్త్‌లు, ఏసీ 3 టైర్‌లో 72 బెర్త్‌లు, ఒక్కో స్లీపర్‌ క్లాస్‌లో 78 బెర్త్‌ల సామర్ధ్యంతో నడుస్తుంది. ఈ పెరుగుదలతో ఐసీఎఫ్‌ కోచ్‌ రేక్‌లో మొత్తం 742 బెర్త్‌ల నుంచి 814 ఎల్‌బీహెచ్‌ కోచ్‌లకు పెరిగింది. దీని ఫలితంగా అదనంగా 72 బెర్త్‌లు పెరిగాయి.

ముక్త్యాల(జగ్గయ్యపేట): మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి గ్రామంలోని భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలతో ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. కనులపండువగా నిర్వహించిన కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వంశపారంపర్య ధర్మకర్త తరఫున కేసీపీ ప్రతినిధి రాంప్రసాద్‌ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి పూజలు చేశారు.

విజయవాడ కల్చరల్‌: శ్రీకృష్ణ తెలుగు ఆర్ట్స్‌ థియేటర్‌ ఆధ్వర్యంలో సంస్థ 26వ వార్షికోత్సవం సందర్భంగా గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఈనెల 19 నుంచి మూడు రోజు ల పాటు జాతీయ సాంఘిక నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ సహాయ కార్యదర్శి మొక్కపాటి అవంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19న హేలాపురి అసోసియేషన్‌ వారి అనగనగా ఓ రాత్రి, స్వర్ణసూర్య డ్రామా లవర్స్‌ వారి సీ్త్రమాత్రేనమః, ఉషోదయ కళానికేతన్‌ వారి మంచి మనసులు, 20న చైతన్య కళాస్రవంతి వారి అగ్నిసాక్షి, విజయవాడ సాంస్కృతిక సంస్థ వారి మమ్మల్ని బ్రతకనివ్వండి, హర్ష క్రియేషన్స్‌ వారి చెరిగిపోని చిరునామా, 21న తెలుగు కళాసమితి వారి చిటికిన వేలు, కాలహారతి కళాతిరుమాలి వారి ప్రియమైన శత్రువులు నాటికలు ప్రదర్శిస్తారని వివరించారు. చివరి రోజు విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందన్నారు.

గంపలగూడెం: కిడ్నీ వ్యాధితో వృద్ధుడు మృతి చెందిన ఘటన సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలంలో జరిగింది. సేకరించిన వివరాల మేరకు.. మండలంలోని వినగడప తండాకు చెందిన లాకవత్తు బాలాజీ(65) పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నాడు. కూలి పనులు చేసుకుని భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకునే బాలాజీ మంచానికే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలో వ్యాధి తీవ్రత మరింత పెరిగి సోమవారం ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మండలంలోని అనుముల్లంక, కనుమూరు, గోసవీడు శివారు రామకృష్ణాపురం గ్రామాల్లోనూ ఫ్లోరైడ్‌ నీటి కారణంగా కిడ్నీ మరణాలు సంభవిస్తున్నాయి.

కృష్ణా కలెక్టర్‌ బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): నిత్యం అప్రమత్తంగా ఉంటూ రహదారి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం సాయంత్రం రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్క అధికారి బాధ్యత అని, అందుకు కారణమయ్యే బ్లాక్‌ స్పాట్‌లను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ పరిష్కారం చేపట్టడం ద్వారా ప్రమాదాలకు అవకాశం లేకుండా ఉంటుందన్నారు. జాతీయ రహదారులకు చేరుకునే 28 ప్రాంతాల్లోని అప్రోచ్‌ రహదారులకు అత్యవసరంగా స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల వేగ నియంత్రణ కోసం జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన డ్రమ్ములు రాత్రి సమయాల్లో వాహనచోదకులకు కనిపించకపోవటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా డ్రమ్ములకు పూర్తి స్థాయిలో రేడియం స్టిక్కర్లు వేయాలని సూచించారు. జాతీయ రహదారులపై ప్రయాణించే ఆర్టీసీ బస్సులకు జీపీఎస్‌ పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వీవీ నాయుడు, జిల్లా రవాణాధికారి ఎన్‌యూఎన్‌ఎస్‌ శ్రీనివాస్‌, జాతీయ రహదారుల అధికార సంస్థ పీడీ విద్యాసాగర్‌, జిల్లా ప్రజారవాణాధికారి వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement