అన్ని వర్గాలకూ వంచన
బడ్జెట్
2026–27
రాష్ట్ర బడ్జెట్లో ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు ప్రభుత్వం మొండి చేయి చూపింది. డాక్టర్ వైఎస్సార్ ముస్లిం మైనార్టీలకు నాడు బడ్జెట్‌లో పెద్దపీట వేసి సంక్షేమ సారథిగా మారారు. ఆయనకు మించిన విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత చంద్రబాబు సర్కార్ బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ముస్లిం మైనార్టీలకు బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసి అన్ని విధాలా ఆదుకుంటామని హామీలు ఇచ్చారు.ఇప్పుడు పట్టించుకోవడం లేదు.
–షేక్ సలార్ దాదా, మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్
చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్‌లో అన్ని వర్గాలనూ వంచనకు గురి చేసింది. ఎన్నికల ముందు సూపర్‌సిక్స్ హామీలంటూ ఊదరగొట్టి ఇప్పడు వాటికి బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. 18 నుంచి 59 ఏళ్ల వయసు లోపు మహిళలకు ఆడ్డబిడ్డ నిధి కింద రూ.1500 అంటూ ఊరావాడా ప్రచారం చేసి.. మూడో బడ్జెట్‌లో కూడా దాని ఊసే లేదు. నాడు ఎడాపెడా హామీలు ఇచ్చి.. బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప ఏమీ లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు
–సాక్షి నెట్‌వర్క్
గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పింఛన్లు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాలపై బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే నిరుద్యోగులు నమ్మి ఓట్లేశారు. నిరుద్యోగులతో పాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఈ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. అన్ని వర్గాలకు బడ్జెట్‌లో మాత్రం నామమాత్రంగా నిధులు కేటాయించడం చూస్తే రాష్ట్ర ప్రజలపై కూటమి పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోంది.
–సింహాద్రి రమేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డ
సూపర్‌సిక్స్‌లో నాలుగు హామీలకు చంద్రబాబు సర్కార్ పంగనామాలు పెట్టింది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకు 50ఏళ్లకే పింఛన్‌లు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాలకు గత రెండు బడ్జెట్‌లతో పాటు ఈ బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించలేదు. అంకెల గారడీ తప్ప అమలులో సాధ్యమయ్యేలా లేదు. ప్రజలను నమ్మించి మోసం చేసినందుకు ప్రభుత్వానికి తగిన బుద్ధిచెబుతారు.
–వేములకొండ తిరుపతిరావు(వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్)
అన్ని వర్గాలకూ వంచన
అన్ని వర్గాలకూ వంచన


