సువేందుకు అనుకూలం.. ఆయనను తొలగించండి: టీఎంసీ | TMC Complaint Against RO at Bhavanipur Segment | Sakshi
Sakshi News home page

సువేందుకు అనుకూలం.. ఆయనను తొలగించండి: టీఎంసీ

Apr 4 2026 7:09 AM | Updated on Apr 4 2026 9:15 AM

TMC Complaint Against RO at Bhavanipur Segment

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి­(ఆర్‌వో)ను వెంటనే తొలగించాలని అధికార టీఎంసీ డిమాండ్‌ చేసింది. ఇదే నియోజకవర్గం నుంచి టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండటం తెల్సిందే. ఇక్కడి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఆర్‌వో సురాజిత్‌ రాయ్‌ సన్నిహితుడంటూ ఆరోపించింది. ఈ మేరకు చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి(సీఈవో) మనోజ్‌ కుమార్‌ అగర్వాల్‌కు శుక్రవారం ఒక వినతిపత్రం సమర్పించింది.

ప్రస్తుత ఆర్వో రాయ్‌ గతంలో నందిగ్రామ్‌ నియోజకవర్గంలో బ్లాక్‌ అభివృద్ధి అధికారిగా ఉన్నప్పుడే సువేందుకు అనుకూలంగా బహిరంగంగానే వ్యవహరించినట్లు పేర్కొంది. అలాంటి అధికారిని సరిగ్గా ఎన్నికల వేళ ఆర్‌వోగా నియమించడం అనుమానాలకు తావిస్తోందని టీఎంసీ పేర్కొంది. ఈ నియామకం తటస్థ వైఖరికి భంగకరంగా ఉంటుందని పేర్కొంది. ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు ఉందని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement