west bengal assembly elections
-
భారత రాజకీయాల్లోనే పెను సంచలనం!
పశ్చిమ బెంగాల్.. దశాబ్దాల పాటు వామపక్షాలకు అండగా నిలిచింది. ఆ తర్వాత 'దీదీ' మమతా బెనర్జీని అక్కున చేర్చుకుంది. కానీ, నిన్నటి సోమవారం వెలువడిన ఫలితాలు భారత రాజకీయ యవనికపై ఒక కొత్త చరిత్రను లిఖించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ, అసాధ్యమనుకున్న బెంగాల్ కోటను బద్ధలు కొట్టింది. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితం కాదు.. భారత ప్రజాస్వామ్యాన్ని తనదైన శైలిలో మార్చాలనుకుంటున్న బీజేపీకి దక్కిన అతిపెద్ద విజయం.పదేళ్ల క్రితం కేవలం 3 సీట్లు ఉన్న బీజేపీ, నేడు 294 స్థానాలకు గాను 208 సీట్లు గెలుచుకోవడం ఒక అద్భుతం. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలన కుప్పకూలిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ కోల్పోయి దెబ్బతిన్న బీజేపీకి, ఈ విజయం సంజీవనిలా మారింది. హర్యానా, మహారాష్ట్ర, బీహార్లలో గెలుస్తూ వస్తున్న బీజేపీకి, బెంగాల్ విజయం కిరీటంలో మణి లాంటిది.ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకే పరిమితం కాలేదు. ఎన్నికల కంటే ముందే దాదాపు 90 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం పెను దుమారం రేపింది. వీరిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఓట్లను లూటీ చేసింది.. ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని 100కు పైగా సీట్లలో మోసానికి పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లుగా.. మమత ఓటమి ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రాల స్వయంప్రతిపత్తి గురించి గట్టిగా మాట్లాడే ఒక బలమైన గొంతుక ఇప్పుడు మూగబోయింది. చివరకు తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో కూడా మమత ఓడిపోవడం శోచనీయం. తన పాత మిత్రుడు, ప్రస్తుతం బీజేపీ నేత అయిన సువేందు అధికారి చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. ఆయనే ఇప్పుడు బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి అవినీతి. విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకున్నారన్న ఆరోపణలు, ఇతర కుంభకోణాలు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని నింపాయి. రెండోది భద్రత. గతేడాది కోల్‌కతా ఆసుపత్రిలో జరిగిన డాక్టర్ రేప్, హత్య ఉదంతం దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. ఆ బాధితురాలి తల్లిని అభ్యర్థిగా నిలబెట్టిన బీజేపీ, మహిళా ఓటర్ల మద్దతును పూర్తిగా తనవైపు తిప్పుకుంది. దీదీ మంచిదే కానీ, ఆమె పార్టీ అవినీతిమయం.. పరిశ్రమలను తరిమేశారు అన్న సామాన్యుడి మాటలే బెంగాల్లో ప్రతిధ్వనించాయి. సెక్యులరిజం వర్సెస్ హిందూత్వ ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా, లౌకికవాదానికి, కమ్యూనిస్ట్ ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న బెంగాల్, ఇప్పుడు హిందూత్వ రాజకీయాల వైపు మొగ్గు చూపడం దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు. మమత బెంగాలీ సంస్కృతిని రక్షించాలని పిలుపునిచ్చినా, ప్రజలు మాత్రం ఉద్యోగాలు మరియు అభివృద్ధికే ఓటు వేశారు.దక్షిణాది రాజకీయాల్లో తమిళనాడు ఎప్పుడూ ఒక ఉద్వేగభరితమైన ప్రయోగశాలే. కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత శూన్యంగా మారిన ఆ గడ్డపై, ఇప్పుడు 'దళపతి' విజయ్ ఒక ఆశగా నిలిచారు. ఈ ఎన్నికల్లో ఒక రాజకీయ నూతన విదేశీయుడిగా అడుగుపెట్టి, దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీల పునాదులను కదిలించడం సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ విజయం వెనుక విజయ్ పడ్డ సంఘర్షణ అంతా ఇంతా కాదు. గ్లామర్, అధికారం మధ్య ఆయన నలిగిపోలేదు. అటు ప్రజల ఆకాంక్షలకు, ఇటు తన వ్యక్తిగత జీవితానికి మధ్య ఉన్న సన్నని గీతపై నడుస్తూ ఈ ఘనత సాధించారు. సొంత కుటుంబం తన రాజకీయ ప్రస్థానంపై చేసిన వ్యాఖ్యలు ఆయనను మానసికంగా ఎంతో కుంగదీశాయి. కుటుంబ సభ్యులతో ఉన్న ఆస్తి, పేరు ప్రఖ్యాతుల గొడవలు బహిరంగమైనప్పుడు, శత్రువులు ఆయనను విమర్శించడానికి అస్త్రాలుగా వాడుకున్నారు. కానీ, తన ఇంట్లో రగులుతున్న ఆ వేదనను దిగమింగుకుని, బయట ప్రజల కోసం నిలబడ్డ విజయ్ తీరు చూసి తమిళ తంబీలు ఫిదా అయ్యారు. ఆయన గెలుపు వెనుక కేవలం స్టార్డమ్ మాత్రమే లేదు, ఒంటరిగా నిలబడి పోరాడిన ఒక వ్యక్తి తాలూకు నిశ్శబ్ద ఆవేదన కూడా ఉంది.ఇక చివరగా, కేరళం,అక్కడ రాజకీయాల గురించి చెప్పాలంటే అది ఎప్పుడూ ఎల్.డి.ఎఫ్, యు.డి.ఎఫ్ మధ్య సాగే హోరాహోరీ పోరాటం. కానీ, ఈసారి దేవుడి సొంత గడ్డపై కమలం పువ్వు వికసించిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కమ్యూనిస్ట్ భావజాలం బలంగా ఉన్న కేరళలో, బిజెపి తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం అంటే అది ఒక భావజాల విప్లవమే అని చెప్పాలి. క్రైస్తవ మైనారిటీలతో చేతులు కలుపుతూ, మోదీ గ్యారంటీ ని కేరళంలో ఇంటింటికి తీసుకెళ్లడంలో ఆ పార్టీ సఫలమైంది. పశ్చిమ బెంగాల్లో సాధించిన భారీ విజయంతో పోలిస్తే కేరళలో వచ్చిన ఓట్ల శాతం అతి తక్కువే కావొచ్చు, కానీ కేరళ ఓటరు మదిలో బిజెపి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ముద్ర వేయడం మాత్రం ఆ రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం. అజేయమైన కోటలుగా భావించిన నియోజకవర్గాల్లో కూడా బిజెపి ఓట్ల శాతం పెరగడం చూస్తుంటే, కేరళలో మార్పు మొదలైందని స్పష్టమవుతోంది.మొత్తంగా చూస్తే, ఈ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై ఒక నూతన శకాన్ని ఆవిష్కరించాయి. అజేయమని భావించిన మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోవడం, అస్సాం నుంచి కేరళ దాకా బీజేపీ తన ప్రభావాన్ని విస్తరించుకోవడం కేవలం ఒక పార్టీ గెలుపు మాత్రమే కాదు.. అది దేశంలో మారుతున్న సామాన్యుడి ఆకాంక్షలకు నిదర్శనం. ప్రాంతీయ భావోద్వేగాలు, సంస్కృతి పేరుతో చేసే రాజకీయాల కంటే అభివృద్ధి, భద్రత, అవినీతి రహిత పాలనే ముఖ్యమని ఓటరు తీర్పునిచ్చాడు. అటు తమిళనాడులో విజయ్ వంటి కొత్త తరం నాయకుల రాక, ఇటు బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలు.. వెరసి 2026 నాటి ఈ రాజకీయ చిత్రం దేశ భవిష్యత్తును సరికొత్త తీరాలకు తీసుకెళ్లేలా కనిపిస్తోంది. పాత వ్యవస్థలు పోయి, ప్రజాస్వామ్య సంస్థల పట్ల విశ్వాసం పెరిగేలా ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును రాజకీయ పక్షాలు ఎలా గౌరవిస్తాయో వేచి చూడాలి. -
బెంగాల్ టైగర్ బీజేపీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ‘పరివర్తన్’కే ప్రజ లు ఓటేశారు. మార్పునకు పట్టంగట్టారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ఓటర్లు ముగింపు పలికారు. నిజమైన అభివృద్ధి జరగాలంటే ‘డబుల్ ఇంజన్’ప్రభుత్వం రావాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపును గౌరవించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకే విజయం కట్టబెట్టారు. చరిత్రాత్మక తీర్పు ఇచ్చా రు. అంగ, కళింగ రాజ్యాలను ఇప్పటికే కైవసం చేసుకున్న కాషాయ పార్టీ ఎట్టకేలకు తన లక్ష్యాన్ని చేరుకుంది. తూర్పు భారతదేశంలోని వంగ రా జ్యాన్ని సైతం జయించింది. మొట్టమొదటిసారిగా బెంగాల్లో జయకేతనం ఎగురవేసింది. దీదీ కోట ను బద్దలుకొట్టి బెంగాల్ టైగర్‌గా అవతరించింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 293 స్థానాల్లో సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టగా, ఏకంగా 206 స్థానాల్లో విజయఢంకా మోగించింది. మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. టీఎంసీకి కోలుకోలేని నష్టం ప్రాంతాలు, జనాభా స్థితిగతులకు అతీతంగా అన్నిచోట్లా ప్రభంజనం సృష్టించింది. తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటల్లోకి సైతం బీజేపీ చొచ్చుకెళ్లింది. ప్రభుత్వ పాలన మాత్రమే కాకుండా బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో నిర్మాణాత్మక మార్పును ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ తన ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మరోసారి పరాజయం పాలయ్యారు. ఈసారి అసెంబ్లీ స్థానం మాత్రమే మారింది, ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. 2021లో ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోగా, ప్రస్తుతం భవానీపూర్‌లో చేదు అనుభవం చవిచూశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు కోలుకోలేని నష్టం జరిగింది. ఆ పార్టీ 81 స్థానాలకే పరిమితమైంది. 100కుపైగాసీట్లను లూటీ చేశారంటూ బీజేపీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. సీపీఎం 1, ఇతరులు మరో మూడు సీట్లు గెల్చుకున్నారు. ఒక నియోజకవర్గంలో ఈనెల 21న రీపోలింగ్ జరుగనుంది. 54 ఏళ్ల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ బెంగాల్ చరిత్రలో 1972 తర్వాత తొలిసారిగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రాన్ని పరిపాలించబోతోంది. 54 ఏళ్ల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ రావడం గమనార్హం. బెంగాల్లో తమ పార్టీ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ప్రజా తీర్పును ప్రశంసించారు. రాష్ట్రంలో కమలం వికసించిందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బీజేపీ కృషి చేస్తుందని ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి మోదీయే కేంద్రబిందువుగా నిలిచారు. మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బూత్‌స్థాయి నెట్వర్క్, అభ్యర్థుల ఎంపిక, సామాజిక వర్గాలను సమన్వయం చేస్తూ ముఖ్య వ్యూహకర్తగా వ్యవహరించారు. బీజేపీ ఆధిక్యం ఉత్తర బెంగాల్ నుంచి జంగల్‌మహల్, దక్షిణ బెంగాల్ వరకు, సరిహద్దు జిల్లాల నుంచి పారిశ్రామిక ప్రాంతాల వరకూ విస్తరించింది.రాష్ట్రమంతటా ప్రభంజనం సృష్టించింది. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. 2021 నాటి ఎన్నికల్లో 38 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 45 శాతానికిపైగా ఓట్లు చేజిక్కించుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఓట్ల శాతం 48 శాతం నుంచి 40.94 శాతానికి పడిపోయింది. బీజేపీకి ఉత్తర బెంగాల్లో గట్టి పట్టుంది. ప్రస్తుతం దక్షిణ ప్రాంతంలోనూ మంచి ఫలితాలు సాధించింది. రాజధాని కోల్‌కతా సహా హౌరా, హూగ్లీ జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించింది.బ్రాత్య బసు, మానస్ రంజన్ భూనియా, శశి పంజా, చంద్రిమా భట్టాచార్య సహా 20 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. ఈ తీర్పు బీజేపీకి ఒక కీలక మలుపు. 1990వ దశకం వరకు బెంగాల్లో నామమాత్రంగా ఉన్న ఆ పార్టీ అధికార పీఠం అధిరోహించే స్థాయికి చేరింది. తన చిరకాల స్వప్నం నెరవేర్చుకుంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల పాలనను చూసిన ప్రజలు ఇకపై బీజేపీ పాలనకు ప్రత్యక్ష సాక్షులు కాబోతున్నారు. -
టీవీకే అద్భుత పెర్ఫార్మన్స్.. కంగ్రాట్స్: మోదీ
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల ఫలితాలతో పాటు మిగతా రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలపై ఆయన ట్వీట్లు చేశారు.“పశ్చిమ బెంగాల్లో కమలం వికసించింది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజాశక్తి విజయం సాధించింది. బీజేపీ సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి. పశ్చిమ బెంగాల్ ప్రజల ప్రతి ఒక్కరికీ నేను నమస్కరిస్తున్నాను. ప్రజలు బీజేపీకి అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా పార్టీ సాధ్యమైన ప్రతిదీ చేస్తుందని నేను హామీ ఇస్తున్నాను. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు, గౌరవం కల్పించే ప్రభుత్వాన్ని అందిస్తాము. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన ఈ చరిత్రాత్మక విజయం అనేక తరాలుగా కష్టపడి పనిచేసిన అనేక మంది కార్యకర్తల ప్రయత్నాలు, పోరాటాలు లేకుండా సాధ్యమయ్యేది కాదు. వారందరికీ నేను వందనం చేస్తున్నాను. ఏళ్ల తరబడి వారు కష్టపడి పని చేశారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు, మా అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వారు మా పార్టీకి అసలైన బలం’’ అని తెలిపారు.టీవీకేకు అభినందనలు ‘‘తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు. ప్రజల సమస్యల పరిష్కారం, వారి జీవన పరిస్థితుల మెరుగుదలలో మేము ఎప్పుడూ ముందుండి పని చేస్తాము. టీవీకే అద్భుత ప్రదర్శనకు అభినందనలు. కేంద్రం తమిళనాడు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుతుంది’’ అని ప్రధాని మోదీ చెప్పారు.అస్సాంలో వారి కృషి వల్లే.. “అస్సాం మరోసారి బీజేపీ-ఎన్డీఏను ఆశీర్వదించింది. అస్సాం విధాన్ సభ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీఏ విజయం సాధించడం, మా కూటమి అభివృద్ధిపై పెట్టిన దృష్టి, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలన్న ప్రయత్నాలకు ఉన్న అచంచల విశ్వాసాన్ని చూపిస్తోంది. ఈ భారీ విజయం ఇచ్చినందుకు అస్సాంలోని నా సోదరులు, సోదరీమణులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.రాష్ట్రంలో మార్పు కోసం మేము నిరంతరం పనిచేస్తామని వారికి హామీ ఇస్తున్నాను. అస్సాం ప్రజల మధ్య నిరంతరం కృషి చేసిన బీజేపీ-ఎన్డీఏ కార్యకర్తలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. గత దశాబ్దంలో మా పార్టీ కూటమి ఎంతగా ఎదిగిందో చూడటం ప్రశంసనీయమైన విషయం. వారి కృషి వల్లే మా సానుకూల అజెండా ప్రజల మనసులను తాకింది’’ అని అన్నారు. కేరళ గురించి..‘‘కేరళలో ఎన్డీయేకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కేరళ పురోగతికి, వికసిత కేరళ లక్ష్యం సాధన కోసం కష్టపడతాము. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధించినందుకు అభినందనలు’’ అని మోదీ చెప్పారు. ప్రభుత్వ పనితీరు ఆధారంగా తీర్పు ‘‘పుదుచ్చేరికి ధన్యవాదాలు. మంచి పాలనలో మా గత అనుభవం, ఎన్.రంగస్వామి నాయకత్వంలోని ప్రభుత్వ పని ఆధారంగా పుదుచ్చేరి ప్రజలు ఎన్డీయేకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఈ ఆశీర్వాదం మా సుపరిపాలనను బలపరచే ప్రయత్నాలకు ఊతం ఇస్తుంది’’ అని చెప్పారు. -
మమతా బెనర్జీ పార్టీని దెబ్బ తీసిన ‘ఎం’
పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు బ్రేక్ వేస్తూ.. భారీ ఆధిక్యం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. ట్రెండ్స్ ప్రకారం.. డబుల్ సెంచరీకి చేరువగా ఆధిక్యంలో కొనసాగుతూ అధికార కైవసం దిశగా పయనిస్తోంది. టీంఎసీ 100 లోపే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిందనేదానిపై విశ్లేషణలు నడుస్తున్నాయి. ‘‘బెంగాల్ మళ్లీ గెలుస్తుంది’’.. ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి ఆహారపు అలవాట్లను కూడా మారుస్తారు’’ అంటూ ఈ మమతా బెనర్జీ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారాన్ని అక్కడి ఓటర్లు సున్నితంగా తిరస్కరించారు. మార్పు అవసరం అనే బీజేపీ నినాదానికి పట్టం కట్టారు. అయితే.. వీటితో పాటు ‘ఎం’(M) అనే ఫ్యాక్టర్ కూడా టీఎంసీ ఓటమికి ఓ కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. M.. మహిళలు: గత మూడు టర్మ్‌లు టీఎంసీ విజయానికి మహిళలు ప్రధాన కారణం. అయితే ఆర్జీకర్ ఘటన, సందేశ్‌ఖాళి వివాదం మహిళలపై భద్రతపై నీలి నీడలు కమ్మేలా చేశాయి. బీజేపీ ఈ అంశాలను ఉపయోగించుకుంది. ఆర్టీకర్ బాధితురాలి తల్లిని ఏకంగా ఎన్నికల బరిలో దింపింది. మహిళా సెంటిమెంట్‌ను బీజేపీ ఓట్లుగా మార్చుకుంది. M.. ముస్లింలు: బెంగాల్లో టీఎంసీ సంప్రదాయంగా మైనారిటీ ఓటు బ్యాంక్‌పై ఆధారపడింది. ఆ జనాభాలో 27 శాతం టీఎంసీ మద్దతుగా ఉండేది. అయితే.. ఎన్ఆర్సీ, యూసీసీ భయాలు.. అలాగే ఓటర్ల జాబితా (SIR) వివాదం ఈసారి ముస్లిం ఓటు ధోరణిని ప్రభావితం చేసింది. అంతేకాదు.. ముస్లిం ప్రాబల్యం ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్ లలో ముస్లిం ఓట్లలో చీలిక ఏర్పడిందని.. బీజేపీకి ఇది బాగా కలిసొచ్చిందని చెబుతున్నారుM.. (మైగ్రేంట్స్.. వలసదారులు): ఇతర రాష్ట్రాల్లో పనిచేసే వలస కార్మికులు తిరిగి వచ్చి ఓటు వేశారు. ఓటర్ల జాబితాలో పేరు ఉండాలంటే తప్పనిసరిగా ఓటు వేయాలని భావించారు. వీరి ఓటు ధోరణి ఎన్నికల్లో కీలకంగా మారింది. ఈ క్రమంలోనే బెంగాల్ చరిత్రలోనే.. భారీగా పోలింగ్ నమోదు అయ్యింది.. M.. (మటువా కమ్యూనిటీ): రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న ఈ సామాజిక వర్గం.. బీజేపీకి బలమైన మద్దతు ఇచ్చింది. ఈ ఓటు టీఎంసీకి పెద్ద దెబ్బగా మారింది.M.. (మెషినరీ.. బీజేపీ యంత్రాంగం): టీఎంసీ కేవలం తన ప్రచారం మీదే ఆధారపడింది. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించలేకపోయింది. కానీ, బీజేపీ మాత్రం కేంద్రం నుంచి భారీ స్థాయిలో ప్రచార యంత్రాంగం, నాయకులను రప్పించుకుంది. ర్యాలీలు, రోడ్‌షోలు, సభలు నిర్వహించింది. ఇది ఎన్నికల్లో BJPకి బలమైన ప్రోత్సాహం ఇచ్చింది. తద్వారా ఓటర్లపై ప్రభావం చూపించింది. M.. (మోదీ): ప్రధాని మోదీ వ్యక్తిత్వం, దఫదఫాలుగా చేసిన సుదీర్ఘ ప్రచారం, ప్రసంగాలు కమలం పార్టీకి బాగా కలిసొచ్చాయి. చివరగా.. M.. (మమతా బెనర్జీ): మమతా బెనర్జీ వ్యక్తిత్వం, “మా మట్టి మనుష్” భావోద్వేగ పిలుపు టీఎంసీకి బలాన్ని ఇచ్చింది. కానీ, ఇది ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ప్రతిపక్ష బీజేపీ ఆమెపై అవినీతి, హింసా, శాంతి భధ్రతలు క్షీణించడం.. తదితర అంశాలతో దాడి చేసింది. ప్రభుత్వ వ్యతిరేకత నాడి పట్టుకుని సరికొత్త పాలనా వాగ్దానాలకు చేసింది. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. అంతేకాదు..ఈ 2026 ఎన్నికల్లో కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ వంటి పార్టీలతో ఓటు విభజన జరిగింది. ఇది కీలక నియోజకవర్గాల్లో టీఎంసీకి భారీ నష్టం కలిగించింది. వీటికి తోడు.. బెంగాల్లో కేంద్రం జోక్యం తగదంటూ గత ఐదేళ్లుగా మమతా బెనర్జీ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేక సవరణలో దాదాపు 91 లక్షల ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. వీటిపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉద్యమానికి దిగారు. అయితే టీఎంసీపై ఇవేవీ ప్రజల్లో సింపథీని రాబట్టలేకపోయాయి. -
దీదీ నాలుగోసారి సీఎం అవుతారా?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో కౌంటింగ్ షురూ కానుంది. మొత్తం 294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో అధికారం కైవసం చేసుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. ఒక్క ఫాల్తా తప్ప అన్ని ఫలితాలు ఇవాళ వెలువడతాయి. ఆ నియోజకవర్గంలో 24న ఉప ఎన్నిక జరగనుంది. మిగిలిన 293 స్థానాల ఓట్ల కౌంటింగ్ కోసం 77 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెంగాల్ ఫలితాలను అటు ఢిల్లీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నుడూలేని విధంగా ఈసారి భారీగా పోలింగ్ నమోదు కావడం ఇందుకు మరో కారణం. టీఎంసీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. నాలుగోసారి మమతా బెనర్జీ సీఎం అవుతారా?.. బెంగాల్లో మమతకు బీజేపీ చెక్ పెడుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తర్వాత ఈవీఎంలను లెక్కించనున్నారు. రెండు గంటల తర్వాత ట్రెండ్స్ వెలువడే చాన్స్ ఉంది. మరోవైపు కౌంటింగ్ హాల్లో సెల్ఫోన్లు నిషేధించారు. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎస్ఐఆర్ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా భవానీపూర్‌లో మమత వర్సెస్ అధికారి సువేందు మధ్య టఫ్ వార్ తప్పదనే అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా.. బెంగాల్ ఫలితాలు జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కొద్ది గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెర పడనుంది. -
సుప్రీం కోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేంద్ర ఉద్యోగులను నియమించడంపై అభ్యంతరాలతో ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను శనివారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. మైక్రో అబ్జర్వర్లు ఎంపిక విషయంలో కేంద్రం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా కోర్టు పూర్తిగా సమర్థించింది. ‘‘రాష్ట్రమైనా.. కేంద్రమైనా.. ప్రభుత్వ ఉద్యోగులు వారి విధుల్లో భాగంగానే పని చేస్తారు. వారికి ఎలాంటి విధేయతలు ఉండవు. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండడంలో తప్పేముంది?. ఆ ఎంపికలో పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. సిబ్బంది నియామకంపై రాజకీయ పార్టీలను ఈసీ సంప్రదించాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారంలో రాజకీయం చేయడం తగదు’’ అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా ఉన్న రాష్ట్ర ఉద్యోగులను తప్పించి ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించారంటూ ఈసీపై టీఎంసీ ఆరోపణలకు దిగింది. అయితే ఈసీ ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. కేంద్ర ఉద్యోగులతో పాటు రాష్ట్ర ఉద్యోగులు కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. అయినప్పటికీ టీఎంసీ పార్టీ శుక్రవారం కోల్‌కతా హైకోర్టులో ఓ పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. అయితే ఇక్కడ కూడా మమతా బెనర్జీకి బిగ్ షాకే తగిలింది. ఈ విషయంలో ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమంటు సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.పశ్చిమ బెంగాల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. మునుపెన్నడూ లేని స్థాయిలో పోలింగ్ శాతం నమోదుకాగా.. కనీవినీ ఎరుగని రీతిలో ఒక్క హింసాత్మక ఘటన కూడా చోటు చేసుకోలేదు. అయితే రెండో విడత పోలింగ్ తర్వాత అధికార టీఎంసీ సంచలన ఆరోపణలకు దిగింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ధర్నాకు దిగింది. అయితే ఆ ఆరోపణల్ని ఈసీ ఖండించింది. మే 4వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. రేపే పలు బూత్‌లలో రీపోలింగ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లా దక్షిణ 24 పరగణాలకు చెందిన పలు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కమలం గుర్తు కనిపించకుండా ఈవీఎంలకు ట్యాప్ అతికించారంటూ బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో పాటు అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సౌత్ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్, మగ్రాహట్ పశ్చిమ్ నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో శనివారం (మే 2, 2026) తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మగ్రాహట్ పశ్చిమ్‌లోని 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్లోని 4 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ఉత్తర్వులో పేర్కొంది.142 మగ్రాహట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, 143 డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 ఏప్రిల్ 2026న జరిగిన పోలింగ్‌కు సంబంధించి రిటర్నింగ్ అధికారులు,పరిశీలకుల నివేదికల ఆధారంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 58(2) ప్రకారం ఆ రోజు జరిగిన పోలింగ్ చెల్లదని కమిషన్ ప్రకటించింది.అందుకు అనుగుణంగా మే 2, 2026న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వులో తెలిపారు. పోలింగ్ ప్రాంతంలో డప్పులు కొట్టి విస్తృతంగా ప్రచారం చేయాలని, అలాగే పోటీ అభ్యర్థులకు లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. -
226 స్థానాల్లో గెలుస్తాం
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల్లో తాము 226కు పైగా సీట్లలో విజయం సాధిస్తామని టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. వివిధ సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ వెనుక బీజేపీ హస్తముందని, వాటిని తాము విశ్వసించలేమని ఆమె తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో తమ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కాషాయ పార్టీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. షేర్ మార్కెట్‌ను నిలకడగా ఉంచేందుకు బీజేపీ నేతలు చేసిన చిట్టచివరి ప్రయత్నం ఎగ్జిట్‌పోల్స్ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం సీఎం మమత సోషల్‌మీడియాలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. బీజేపీ కార్యాలయం నుంచి వచి్చన ఆదేశాల మేరకే టీవీ చానళ్లలో ఎన్నికల ఫలితాలపై ముందస్తు అంచనాలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. బెంగాల్ అసెంబ్లీలోని 294 స్థానాల్లో బీజేపీ మెజారిటీ సాధించనుందంటూ బుధవారం వెలువడిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పడం తెల్సిందే. ‘బీజేపీ కార్యాలయం నుంచి 1.08 గంటలకు వచి్చన ఆదేశాల ప్రకారమే టీవీ చానళ్లు చూపించాయి. అదంతా ప్రసారమయ్యేలా వాళ్లకు డబ్బు అందింది. దీనిపై నా వద్ద కచి్చతమైన సమాచారముంది. తాము చెప్పినట్లే చూపించాలని బీజేపీ నేతలు చానళ్లపై ఒత్తిడి తెచ్చారు’అని మమత ఆరోపించారు. ‘226కు పైగా సీట్లను గెల్చుకుంటాం. 230 వరకు కూడా రావచ్చు. ప్రజల తిరుగులేని తీర్పు మాపక్షానే ఉంటుంది’ అని అన్నారు. -
ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద టీఎంసీ ధర్నా
కోల్‌కతా: ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంల వద్ద అప్రమత్తంగా ఉండాలంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆ పార్టీ అభ్యర్థులు కునాల్ ఘోష్, శశి పంజా గురువారం ధర్నాకు దిగారు. ఖుదీరాం అనుశీలన్ కేంద్రలోని స్ట్రాంగ్‌రూంలో అవకతవకలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఇక్కడ బుధవారం రెండో విడత పోలింగ్ ముగియడం తెల్సిందే. ‘స్ట్రాంగ్ రూం వద్ద బైటాయించిన తమను అధికారులు మధ్యాహ్నం అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. సాయంత్రం 4 గంటలకు స్ట్రాంగ్‌రూంలను తిరిగి తెరుస్తామంటూ ఆ తర్వాత మాకు సమాచారమిచ్చారు’అని కునాల్ ఘోష్ తెలిపారు. ‘దీంతో, మా కార్యకర్తలంతా వెళ్లిపోయారు. మళ్లీ తెరుస్తామని సమాచారమివ్వడంతో హడావుడిగా తిరిగి వచ్చేశాం. ఇప్పుడేమో మమ్మల్ని రానివ్వడం లేదు. బీజేపీ నేతలకు మాత్రం అనుమతిచ్చారు’అని ఆయన ఆరోపించారు. ‘బ్యాలెట్ పేపర్లను లోపలకు తీసుకెళ్లారు. లైవ్‌లో ఇదంతా కనిపిస్తూనే ఉంది. అయిన్పటికీ, ఏమీ జరగడం లేదని సీఈవో అంటున్నారు’అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భవానీపూర్ స్ట్రాంగ్‌రూంలో మమత తన నియోజకవర్గం(భవానీపూర్) ఈవీఎంలను భద్రపరచిన షకావత్ స్కూల్ వద్దకు సీఎం మమత సాయంత్రానికల్లా చేరుకు న్నారు. అవకతవకలు జరిగే ఆస్కారముందన్న అనుమానంతో తన ఎన్నికల ఏజెంట్‌తోపాటు స్ట్రాంగ్‌రూంలోకి వెళ్లి అక్కడే కూర్చున్నారు. -
బెంగాల్ కిరీటం బీజేపీదే!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు నకు ప్రజలు పట్టం కట్టబోతున్నారని ‘టుడేస్ చాణక్య’ఎగ్జిట్‌పోల్ స్పష్టంచేసింది. బెంగాల్ అధికార కిరీటం ఈసారి బీజేపీకి దక్కడం ఖాయమని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 294 ఉండగా మెజార్టీ మార్కు 147 స్థానాలు. బీజేపీ 192కిపైగా స్థానాలు గెల్చుకొని స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టంచేసింది. చాణక్య ఎగ్జిట్‌పోల్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 సీట్లు గెల్చుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు తేలింది. ఇతరులు కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతారని చాణక్య తెలియజేసింది. ఈ ఫలితాలు వాస్తవ రూపం దాలిస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అది అతిపెద్ద మార్పు అవుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 15 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరపడినట్లేనని అంటున్నారు. బీజేపీకి అనుకూలంగా ప్రజల మద్దతు బలంగా ఏకీకృతం అవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది ఓటర్ల ప్రాధాన్యతలో నిర్ణయాత్మక మార్పును తెలియజేస్తోంది. బెంగాల్లో ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మరికొన్ని ఎగ్జిట్‌పోల్స్ తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించాయి. మమతా బెనర్జీ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాబోతున్నట్లు వివరించాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో రెండు కీలకమైన పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం సాగుతుందని పేర్కొన్నాయి. 2021 ఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాన్నే అంచనా వేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్‌కు విజయం దక్కింది. ఆ పార్టీ 215 సీట్లు గెల్చుకుంది. బీజేపీ 77 స్థానాలు మాత్రమే దక్కించుకొని ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. తమిళనాట రెండో స్థానంలో విజయ్ పార్టీ తమిళనాడులో దళపతి విజయ్ నిర్ణయాత్మక శక్తిగా అవతరించబోతున్నట్టు టుడేస్ చాణక్య స్పష్టంచేసింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) ఈ ఎన్నికల్లో 30 శాతం ఓట్లతో దాదాపు 63 సీట్లు సాధించబోతున్నట్లు తెలియజేసింది. అధికార డీఎంకేకు 125 స్థానాలు, విపక్ష అన్నాడీఎంకేకు కేవలం 45 స్థానాలు దక్కే వీలున్నట్లు వివరించింది. విజయ్ పార్టీ రెండో స్థానంలో నిలవబోతున్నట్లు తెలిపింది. సామాజికవర్గాల పరంగా చూస్తే బీసీల్లో 29 శాతం మంది, అత్యంత వెనుకబడిన వర్గాల్లో 27 శాతం మంది, ఎస్సీలు, క్రైస్తవుల్లో 34 శాతం మంది విజయ్ పార్టీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ముస్లింలు మాత్రం అధికార డీఎంకేకు మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది. యువతలో టీవీకేకు అమితాదరణ కనిపించింది. 30 ఏళ్లలోపు ఓటర్లు, ప్రధానంగా తొలిసారి ఓటు వేసినవారు, విద్యార్థులు నిరుద్యోగులు దళపతి పార్టీకి జైకొట్టారు. మరోవైపు మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ మళ్లీ డీఎంకే గెలుపు ఖాయమని తెలియజేశాయి. ‘యాక్సిస్ మై ఇండియా’మాత్రమే విజయ్ పార్టీ జయకేతనం ఎగురవేయబోతున్నట్లు తేల్చిచెప్పింది. కేరళలో యూడీఎఫ్‌కు విజయావకాశాలు కేరళలో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్యగట్టి పోటీ నెలకొన్నట్లు టుడేస్ చాణక్య ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు విజయావకాశాలు ఉన్నట్లు తెలిపింది. 140 సీట్లకు గాను యూడీఎఫ్‌కు దాదాపు 69 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని వెల్లడించింది. 126 సీట్లకు గాను బీజేపీ 50 శాతం ఓట్లతో ఏకంగా 102 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బెంగాల్ ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించని ‘యాక్సిస్ మై ఇండియా’ పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌ను ‘యాక్సిస్ మై ఇండియా’ప్రకటించలేదు. బుధవారం ఇతర రాష్ట్రాల ఫలితాలను ప్రకటించినప్పటికీ బెంగాల్ విషయం ప్రస్తావించలేదు. గురువారం ప్రకటిస్తారని భావించగా.. అది సాధ్యం కాలేదు. బెంగాల్లో భయానక వాతావరణం నెలకొందని, ఇతరులతో మాట్లాడేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని, శాంపిల్ సేకరించే పరిస్థితి కూడా లేదని ‘యాక్సిస్ మై ఇండియా’అధినేత ప్రదీప్ గుప్తా చెప్పారు. అసంపూర్ణమైన సమాచారంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించలేమని నిస్సహాయత వ్యక్తంచేశారు. -
రెండో దశలోనూ రికార్డ్ స్థాయిలో
కోల్‌కతా: బీజేపీ, టీఎంసీ ముఖ్యనేతల హోరాహోరీ ప్రచారపర్వం తర్వాత బుధవారం పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం రాత్రి 7.45 గంటలకు అందిన సమాచారం మేరకు రెండో దఫాలో రికార్డ్ స్థాయిలో 92.48 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసేనాటికి క్యూ వరసల్లో నిల్చున్న వాళ్లకు సైతం ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే వీలుంది. తొలి దశలో 93.19 శాతం పోలింగ్ నమోదైన విషయం తెల్సిందే. మొదటి, రెండో దశ పోలింగ్ శాతాలను కలుపుకుంటే సగటును 92.84 శాతం పోలింగ్ నమోదైంది. ఇది రాష్ట్రచరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతమని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో 2011లో 84.72 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం రెండో దశలో 142 స్థానాలకుగాను బుధవారం 40వేలకుపైగా పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు బారులు తీరి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్బ బర్ధమాన్ జిల్లాలో అత్యధికంగా 93.78 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో 88.59 శాతం పోలింగ్ నమోదైంది. భవానీపూర్ నుంచి పోటీచేస్తున్న 71 ఏళ్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉదయం నియోజకవర్గంలోని చక్రబేరియా ప్రాంతంలోని 70వ నంబర్ వార్డ్‌లో పోలింగ్‌కేంద్రంలో ఓటేసి బయటికొచ్చి కూర్చున్నారు. అదే సమయానికి మమతపై పోటీకి దిగిన బీజేపీ రాష్ట్ర ముఖ్యనేత సువేంధు అధికారి అక్కడికి వచ్చారు. కానీ ఇద్దరి మధ్యా ఎలాంటి సంభాషణ జరగలేదు. ఈమెకు ఒక్కరు కూడా ఓటేయబోరు అని సువేంధు వ్యాఖ్యానించారు. పానీహటిలో బీజేపీ మహిళా అభ్యర్థి, ఆర్జీకర్ బోధనాస్పత్రిలో హత్యోదంతంలో బాధిత వైద్యురాలి తల్లి రత్నా దేభ్నాథ్ కారును టీఎంసీ కార్యకర్తలు అడ్డుకుని నిరసనతెలిపారు. బసంతిలో తమ కారును టీఎంసీ గూండాలు అడ్డుకుని డ్రైవర్‌ను కొట్టారని బీజేపీ అభ్యర్థి బికాశ్ సర్దార్ ఆరోపించారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద సీఆర్పీఎఫ్జవాన్లు గూండాల్లా ప్రవర్తిస్తూ మహిళా ఓటర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. హౌరాలోని సథాఛియాలో నాలుగేళ్ల పిల్లాడిని, ఆమె తల్లిని క్యూవరసలో సరిగా నిల్చోలేదని సీఆర్పీఎఫ్ జవాన్లు విచక్షణారహితంగా కొట్టారని టీఎంసీ ఆరోపించింది. -
బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో తాను వెళ్లిన ప్రతిచోటా ప్రజల నాడిని గమనించానని, బీజేపీ విజయం ఖాయమని తేలిపోయినట్లు వెల్లడించారు. మే 4 తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి పశ్చిమ బెంగాల్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. సోమవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్పూర్లో ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. రెండో విడత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. సిండికేట్ రాజ్, రాజకీయ హింస, చొరబాట్లు, ఆర్థిక పతనానికి తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోందని మండిపడ్డారు. తూర్పు భారతదేశ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్ ప్రగతి దేశ అభివృద్ధితో ముడిపడి ఉందన్నారు. తూర్పు ప్రాంతం తన చారిత్రక బలాన్ని, ప్రతిష్టను తిరిగి పొందాలని ఆకాంక్షించారు. మా, మాటీ, మానుష్ ను వదిలేశారు తృణమూల్ కాంగ్రెస్ పాలనలో బెంగాల్ అభివృద్ధి తిరుగుముఖం పట్టింది. బెదిరింపులు, దూషణలు, అబద్ధాలకు ఆ పార్టీ పర్యాయపదంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ పెద్దలు నన్ను, రాజ్యాంగబద్ధ సంస్థలను, చివరికి సాయుధ దళాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇష్టానుసారంగా దూషించారు. గత 15 ఏళ్లలో ఏం సాధించారని ప్రశ్నిస్తే ఒక్కరు కూడా సమాధానం చెప్పడం లేదు. అధికారంలోకి వచ్చేందుకు వాడుకున్న నినాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేడు వదిలేసింది. మా, మాటీ, మానుష్ను పక్కనపెట్టారు. మహిళలు, రైతులు, యువత కోసం చేసిందేమీ లేదు. ఇది మోదీ గ్యారంటీ కోల్‌కతాను లండన్‌లా మారుస్తామని టీఎంసీ హామీ ఇచ్చింది. కానీ, చొరబాటుదార్లకు అడ్డాగా మార్చేసింది. బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదార్లను బయటకు పంపిస్తాం. భారతదేశ పౌరులకు రక్షణ కల్పిస్తాం. కుల, మతాలకు అతీతంగా భారతీయులకు రక్షణ ఉంటుంది. పొరుగు దేశాల్లో మత హింసను తట్టుకోలేక శరణార్థులుగా వచ్చినవారికి భారత పౌరసత్వం కల్పిస్తాం. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ. ఇప్పుడు బెంగాల్ వంతు గతంలో భారతదేశం సుసంపన్నంగా ఉన్నప్పుడు.. దానికి అంగ, బంగా, కళింగ(నేటి బిహార్, బెంగాల్ ఒడిశా) అనే మూడు బలమైన మూలస్తంభాలు ఉండేవి. ఈ మూలస్తంభాలు బలహీనపడినప్పుడు దేశానికి పెద్ద దెబ్బ తగిలింది. తూర్పు ప్రాంతాల అభివృద్ధి లేకుండా దేశ అభివృద్ధి అసంపూర్ణం. బిహార్, ఒడిశాలో కమలం వికసించింది. ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చింది. ఇక్కడి పరిస్థితి చూస్తూ ఉంటే కమల వికాసానికి అడ్డే లేదని స్పష్టమవుతోంది. పశ్చిమ బెంగాల్‌కు సేవ చేయడం, భద్రత కల్పించడం, కాపాడడం నా కర్తవ్యం, బాధ్యత’’అని మోదీ స్పష్టంచేశారు.తీర్థయాత్రలాగ గడిచిందిఆడియో సందేశం, బహిరంగ లేఖ విడుదల చేసిన మోదీ పశ్చిమ బెంగాల్లో ర్యాలీల్లో ప్రసంగించినప్పుడు, రోడ్ షోల్లో పాల్గొన్నప్పుడు తాను ఒక తీర్థయాత్రలో ఉన్నట్లుగా భావించానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల ప్రచారమంతటా కాళీమాత భక్తుల నుండి లభించిన దైవిక శక్తి, ప్రజల ఆశీర్వాదాలు తనకు ఎంతో బలాన్నిచ్చాయని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోమవారం ఒక ఆడియో సందేశం, బహిరంగ లేఖను విడుదల చేశారు. బెంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని పునరుద్ఘాటించారు. బీజేపీ సీఎం ప్రమాణ స్వీకార వేడుకను ప్రజలతో కలిసి జరుపుకుంటానని వివరించారు. తీవ్రమైన ఎండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ తనకు ఏమాత్రం అలసట అనిపించలేదని పేర్కొన్నారు. ర్యాలీలు, రోడ్ షోల్లో పాల్గొనడం తీర్థయాత్రకు వెళ్లిన భావన కలిగించిందని స్పష్టంచేశారు. -
'నేను చద్దాను కాదు.. పార్టీ మారను'
కోల్‌కతా: తమ పార్టీ నాయకురాలు మమతా బెనర్జీని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి, గాయకురాలు సయాని ఘోష్ అన్నారు. 2029లో దేశానికి మమత ప్రధాని అవుతారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా జవాబిచ్చారామె. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ టీవీ చానల్ రిపోర్టర్‌తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. మమత ప్రధాని అయితే ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉందా అని ప్రశ్నించగా.. అటువంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు.రాఘవ్ చద్దా లాగా మీరు కూడా ఎప్పుడైనా సొంత పార్టీని వీడిని బీజేపీలో చేరే అవకాశం ఉందా అని అడగ్గా.. అలాంటి పరిస్థితే ఉత్పన్నం కాదన్నారు. ''నేను సయాని ఘోష్, రాఘవ్ చద్దాను కాదు. ఎప్పటికీ సంఘ పరివార్‌కు దూరంగానే ఉంటాన''ని చెప్పారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలను బీజేపీ భయపెడుతోందని ఆరోపించారు. బీజేపీ దగ్గర వేల కోట్ల డబ్బు, ఈడీ, సీబీఐ, అధికారం ఉంటే.. తమకు అండగా హవాయి చెప్పులు, తెల్లచీర ధరించిన మమతా బెనర్జీ ఉన్నారని అన్నారు.బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి బ్రిగేడ్ నేత అంటూ ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలను సయాని ఘోష్ (Saayoni Ghosh) సమర్ధించుకున్నారు. మమతా బెనర్జీని ఉద్దేశించి ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని.. ఆ మాటలు వింటే బిగ్రేడ్ కాదు, సీగ్రేడ్ నాయకుడంటారని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు మళ్లీ తమ పార్టీకే పట్టం కడతారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణజాదవ్పూర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సయాని ఘోష్.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. తన వాక్చాత్యురం, హావభావాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడికి వెళ్లినా తనదైన శైలిలో ఓటర్లకు దగ్గరయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తృణమూల్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు.చదవండి: కేజ్రీవాల్‌కు షాక్.. చద్దాకు జాక్‌పాట్? ముగిసిన ఎన్నికల ప్రచారంపశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికలకు ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ఎన్నికలు ప్రచారం సాగించాయి. ఆయా పార్టీల అగ్రనేతల ప్రచారంతో బెంగాల్ హోరెత్తింది. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా.. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సుడిగాలి పర్యటనలు చేశారు. 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి. Anchor : Will you also someday switch parties and join BJP like Chadha?TMC MP : I am Sayoni Ghosh , not Raghav Chadha, it will never become Sanghi Chadhi.This woman is on fire 🔥 pic.twitter.com/70bixFBihA— Roshan Rai (@RoshanKrRaii) April 27, 2026 -
బెంగాల్లో గూండారాజ్
కోల్‌కతా: టీఎంసీ పాలనలో పశ్చిమ బెంగాల్లో గూండారాజ్ సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మహిళలను వేధించే గూండాలకు తృణమూల్ ఆశ్రయమిస్తోందని ఆరోపించారు. ఆదివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఠాకూర్‌నగర్, హూగ్లీ జిల్లాలోని అరామ్‌బాగ్‌లో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. ‘‘క్రూరమైన తృణమూల్ ప్రభుత్వం మహిళలను హింసించే గూండాలకు అండగా నిలుస్తోంది. ఈ అరాచకాలను ఇకపై సహించబోమని చెప్పాల్సిన సమయం వచ్చింది’’ అని అన్నారు. మహిళల భద్రతకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. సందేశ్‌కాళీ బాధితురాలు రేఖా పాత్ర, ఆర్జీ కర్ బోధనాసుపత్రి బాధితురాలైన వైద్యురాలి తల్లి రత్న దేవనాథ్‌కు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్లిచ్చిందని ఆయన గుర్తు చేశారు. పొరుగు దేశాల్లో మత హింసను తట్టుకోలేక వలస వచ్చినవారికి సీఏఏ కింద భారత పౌరసత్వం కల్పిస్తామని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో తృణమూల్ చెప్పే అబద్ధాలను నమ్మొద్దని ఆయన కోరారు. మహిళలపై అత్యాచారాలు, హింసకు పాల్పడే దుండగులను మే 4 తర్వాత రాబోయే బీజేపీ ప్రభుత్వం న్యాయస్థానం ముందు నిలబెడుతుందని మోదీ స్పష్టం చేశారు. ‘‘బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఎప్పుడో ఖాయమైంది. రెండో దశ పోలింగ్ ఆ విజయాన్ని సుస్థిరం చేస్తుంది. తొలి దశలో 93 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడంతో తృణమూల్ అహం దెబ్బతిన్నది. ఆ పార్టీ ఇప్పుడు ‘మా, మాటీ, మానుష్’ గురించి మాట్లాడడం మానేసింది. ఎందుకంటే వారి అరాచక పాలనలో మా (అమ్మ) కన్నీరు పెడుతోంది. మాటీ (భూమి)ని ముఠాలు, చొరబాటుదారులకు అప్పగించారు. మానుష్ (ప్రజలు) ఉద్యోగాలు, ఉపాధి కోసం వలస పోవాల్సిన దుస్థితి దాపురించింది’’ అని ఆక్షేపించారు. ‘‘మేం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ బెంగాల్లో అమలు చేస్తామన్నారు. ఈ దిశగా తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుంటాం’’ అని ప్రకటించారు. ఆలయాల్లో మోదీ పూజలు ప్రధాని మోదీ బెంగాల్ ఠాకూర్ నగర్లో ఠాకూర్‌బారీ ఆలయంలో పూజలు చేశారు. కోల్‌కతాలో ప్రఖ్యాత థన్థానియా కాళీ ఆలయాన్నీ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని దుకాణంలో పూజా సామగ్రి కొనుగోలు చేశారు. అనంతరం ఉత్తర కోల్‌కతాలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. -
బీజేపీ పొలిటికల్ గేమ్.. బెంగాల్ తర్వాత ఆ రాష్ట్రమే!
కేంద్రంలోని అధికార బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారం పొలిటికల్ గేమ్‌తో ముందుకు సాగుతోంది. ఇప్పటికే బీహార్ రాజకీయాల్లో బీజేపీకి తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అటు బెంగాల్లో కూడా విజయం బీజేపీదేనని కాషాయ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, తదుపరి బీజేపీ టార్గెట్ పంజాబ్ అనే వార్తలు జాతీయ స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే బీజేపీలోకి రాఘవ్ చద్దా సహా పలువురు నేతల చేరికలు అనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే బీజేపీ అడుగులు వేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మరి పంజాబ్‌లో బీజేపీకి అధికారం అంత సులువు కాదనే విషయాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. బీహార్‌లో సంబరాలు జరుగుతుండగా గంగానది బీహార్ నుండి బెంగాల్‌కు ప్రవహిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించి.. తదుపరి ఎన్నికల పోరుకు సంకేతం ఇచ్చారు. ఇప్పుడు, బెంగాల్ దంగల్ ముగియక ముందే పంజాబ్ యుద్ధం మొదలైంది. బీజేపీ ఎన్నికల రథం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందన్న సంకేతాలిస్తూ.. పంజాబ్‌లో 2027 ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలపై కాషాయ దళం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ పొలిటికల్ గేమ్‌లో భాగంగా పంజాబ్ రాజకీయాల్లోకి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఎంపీలు రాఘవ్ చద్దా, పంజాబ్‌కు చెందిన మరో ఐదుగురు ఎంపీలు బీజేపీలో చేరడం ఈ విషయాన్నే సూచిస్తుంది.బీజేపీ సమస్య.. అయితే, పంజాబ్‌లో బీజేపీ ఎన్నడూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. పంజాబ్‌లో బీజేపీకి స్థానిక నాయకుల కొరత ఉంది. పంజాబ్‌లో బీజేపీకి ప్రధాన సవాళ్లు స్థానిక నాయకత్వం లోపం, సిక్కు రైతు వర్గం నమ్మకం పొందడం. అలాగే, దశాబ్దాలుగా శిరోమణి అకాలీ దళ్ (SAD)కు జూనియర్ భాగస్వామిగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. వ్యవసాయ బిల్లుల విషయంలో 2020లో విడిపోవడానికి ముందు శిరోమణి.. బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీకి అధికారం కావాలంటే దానికి రాష్ట్రంతో సంబంధం ఉన్న నాయకులు అవసరం. ప్రస్తుతం పంజాబ్‌లో బీజేపీకి ఉన్న ఏకైక ప్రముఖ నాయకుడు రవ్నీత్ సింగ్ బిట్టు. ఆయన కాంగ్రెస్ నుండి పార్టీలోకి మారారు. దీంతో, పాత నాయకులు, కొత్తగా చేరిన వారి మధ్య విభేదాలు, వ్యూహాత్మక గందరగోళం నెలకొంది.అవకాశాలు.. మరోవైపు.. ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే మరి కొందరు కీలక నేతలు కావాల్సిందే. ఈ విషయంలోనే ఆప్ నుండి బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, ఇతర ఎంపీల పాత్ర పంజాబ్‌లో బీజేపీకి ఎంతో కీలకం కానుంది. ఎంపీలు రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, విక్రమ్ సాహ్నే వంటి ప్రముఖులు బీజేపీలో చేరడం ఆమ్ ఆద్మీ పార్టీలో విభజనను చూపిస్తోంది. దీంతో, బీజేపీకి కొత్త ఓటర్లను ఆకర్షించే అవకాశం ఏర్పడింది. రాఘవ్ చద్దా వంటి యువ నాయకులు బీజేపీకి పట్టణ, చదువుకున్న, మధ్యతరగతి ఓటర్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది. అకాళీదళ్ బలహీనతతో సిక్కు మతపరమైన ఓటు బ్యాంక్ బీజేపీ వైపు మళ్లే చాన్స్ కూడా ఉంది. ఇదిలా ఉండగా.. పట్టణ హిందూ ఓటర్లలో కాంగ్రెస్ ప్రభావం తగ్గడం బీజేపీకి ప్రధానంగా లాభం కావచ్చు.బీజేపీ వ్యూహాలు.. రైతు వర్గం నమ్మకం పొందడం బీజేపీకి అత్యవసరం. వ్యవసాయ చట్టాలపై నిరసనల తర్వాత బీజేపీపై రైతు వర్గంలో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతు ఇచ్చే విధానాలు, ఎంఎస్పీ హామీలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై బీజేపీ హామీ ఇస్తే అది పార్టీకి మైలేజ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఎంపీల చేరిక కూడా బీజేపీకి ప్లస్ కాగా.. అధికార ఆప్, కాంగ్రెస్ పార్టీలకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.గత ఫలితాలు.. పంజాబ్‌లో 2022లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. రాష్ట్రంలో 117 అసెంబ్లీలో 92 స్థానాలు గెలిచి, పంజాబ్‌లో తొలిసారి పూర్తి మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ కేవలం 18 స్థానాలకు పరిమితమైంది. ఇదే సమయంలో శిరోమణి అకాళీదల్ 15 నుంచి 3 స్థానాలకు పడిపోయింది. బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసినప్పటికీ, పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. -
అంగ.. వంగ.. కళింగ..!
కోల్‌కతా: బెంగాల్లో మొదటి విడత ఓటింగ్ సరళిని చూస్తే ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రాచీన సామ్రాజ్యాలు, ప్రస్తుత తూర్పు భారత రాష్ట్రాలైన అంగ(బిహార్), వంగ(బెంగాల్), కళింగ(ఒడిశా)ల్లో వచ్చే నెలలో ఉండేది బీజేపీ ప్రభుత్వాలేనని ఆయన ప్రకటించారు. కోల్‌కతాలో శుక్రవారం మంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. బెంగాల్లో మొదటి దశలో పోలింగ్ జరిగిన 152 సీట్లకుగాను బీజేపీ 110పైగా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయం 92 శాతం మంది ఓట్లేసి ఈసారి సునామీ సృష్టించారు. సీట్లు, మెజారిటీ ఎక్కువగానే ఉండొచ్చు’అంటూ అంచనా వేశారు. -
మలి దశ.. మహా సంగ్రామం!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. రాష్ట్ర భవితవ్యాన్ని, రాబోయే ఐదేళ్ల అధికార పీఠాన్ని శాసించే అత్యంత కీలకమైన రెండో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. తొలి దశలో 152 స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ ముగియగా..29న మిగిలిన 142 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ బెంగాల్, కోల్‌కతా, హౌరా, హూగ్లీ, దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలో జరగనున్న ఈ పోరును అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీలు జీవన్మరణ సమస్యగా తీసుకున్నాయి. దశాబ్దన్నర కాలంగా కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకోవాలని దీదీ సైన్యం సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. ఎలాగైనా కోటను బద్దలు కొట్టి తీరాలని కమలనాథులు వ్యూహాలకు పదును పెట్టారు. సమరానికి సై అంటున్న కీలక నియోజకవర్గాలు ఇవే.. : రెండో దశలో అర్బన్, సెమీ–అర్బన్, చారిత్రక ప్రాధాన్యం ఉన్న అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గెలుపు ఆయా పార్టీల నైతిక స్థైర్యాన్ని నిర్ణయించనున్నాయి. → సింగూరు (హూగ్లీ జిల్లా): బెంగాల్ రాజకీయాల్లో సింగూరుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. టాటా నానో ప్లాంట్‌కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేసిన చారిత్రక పోరాటం టీఎంసీని అధికారంలోకి తెచ్చింది. అయితే, ఇక్కడ ఇప్పుడు పారిశ్రామికీకరణ, ఉపాధి లేమి ప్రధాన సమస్యలుగా మారాయి. ఈసారి ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇస్తుండటంతో, సింగూరులో మళ్లీ సెంటిమెంట్ గెలుస్తుందా లేక అభివృద్ధి నినాదం నెగ్గుతుందా అనేది ఆసక్తికరం. → భవానీపూర్ (కోల్‌కతా): ఇది ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత పట్టున్న వీఐపీ నియోజకవర్గం. ఇక్కడ తమ ఆధిపత్యాన్ని ఏకపక్షంగా కొనసాగించడం టీఎంసీకి ప్రతిష్టాత్మకం. ఈ స్థానంలో మెజారిటీ తగ్గకుండా చూసుకునే బాధ్యతను టీఎంసీ అగ్రనాయకత్వం భుజాన వేసుకుంది. → డైమండ్ హార్బర్ (దక్షిణ 24 పరగణాలు): మమత మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కంచుకోట ఇది. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ ప్రాబల్యాన్ని దెబ్బకొట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. → టోలీగంజ్ (కోల్‌కతా): టాలీవుడ్ (బెంగాలీ సినిమా) పరిశ్రమకు గుండెకాయ లాంటి ఈ నియోజకవర్గంలో గ్లామర్‌తో పాటు రాజకీయ వేడి ఎక్కువే. ఇక్కడ సినీ ప్రముఖుల ప్రభావం ఎక్కువ. ఇరు పార్టీలు ఇక్కడ హోరాహోరీగా తలపడుతున్నాయి. → హౌరా సెంట్రల్, శివపూర్ (హౌరా జిల్లా): పారిశ్రామిక ప్రాంతాలైన ఈ నియోజకవర్గాల్లో కార్మికులు, మైనార్టీ ఓటర్లు కీలకం. ఇక్కడ మూతపడిన పరిశ్రమలు, మౌలిక సదుపాయాల లేమిని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకున్నాయి. → జాదవ్‌పూర్, కసబ (కోల్‌కతా పరిసరాలు): విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ చూస్తుండగా.. ఐటీ, ఉపాధి నినాదంతో, నూతన టెక్ పార్కుల ప్రగతితో టీఎంసీ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. టీఎంసీకి కలిసొచ్చే అంశాలు.. సవాళ్లు మమతా సర్కార్‌కు క్షేత్రస్థాయిలో ఉన్న పటిష్టమైన కేడర్ అతిపెద్ద ఆయుధం. ముఖ్యంగా ‘లక్ష్మీర్ భాండార్’, ’కన్యాశ్రీ’లాంటి మహిళా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో టీఎంసీకి ఓటు బ్యాంకుగా మారాయి. మహిళా ఓటర్లు ఆ పార్టీకి వెన్నెముకగా నిలుస్తున్నారు. అయితే, స్థానిక నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలు (ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, రేషన్ కుంభకోణం), సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల సహజంగానే వ్యక్తమయ్యే ప్రభుత్వ వ్యతిరేకత వారికి ప్రధాన సవాల్. బీజేపీ ఆశలు.. ఆందోళనలు ప్రతిపక్ష నేత సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ఈసారి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏకీకృతం చేయడంలో, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సఫలమవుతోంది. మైనార్టీల బుజ్జగింపు రాజకీయాలను ఎండగడుతూ మెజారిటీ వర్గాలను ఏకం చేసే వ్యూహం అమలు చేస్తోంది. అయితే, దక్షిణ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం ప్రధాన లోపం. (ఆచార్య శరత్ చంద్ర ముక్తవరం) -
బెంగాల్ ఫైల్స్ బయటపెడతాం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రెండో దశ ఎన్నికల ప్రచారసభల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలనపై ప్రధాని మోదీ విమర్శల నిప్పులు కురిపించారు. శుక్రవారం నార్త్ 24 పరగణాల జిల్లా, జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని బారూయ్‌పూర్, డమ్‌డమ్ లోక్‌సభ నియోజకవర్గంలోనే పానీహటిల్లో ఎన్నికల ప్రచారర్యాలీల్లో మోదీ ప్రసంగించారు. ‘‘టీఎంసీ అంటేనే మహిళా వ్యతిరేక పార్టీ. న్యాయం కావాలని బెంగాలీ మహిళలు అడిగితే టీఎంసీ ప్రభుత్వం ఇల్లుదాటి బయటకు రాకండి అని ఉచిత సలహాలు పడేస్తుంది. మేం అధికారంలోకి రాగానే టీఎంసీ ప్రభుత్వం మహిళలపై చేసిన అకృత్యాలు, ప్రజలపై దౌర్జన్యం, దోపిడీ సంబంధిత ప్రతి ఫైల్‌ను బయటపెడతాం. మహిళలపై అరాచకాల ప్రతి ఫైల్‌ను తెరుస్తాం. న్యాయం చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ’’అని మోదీ అన్నారు. ‘‘తొలిదఫా ఎన్నికల్లో పోలింగ్‌శాతం భారీస్థాయిలో నమోదైంది. ఇది టీఎంసీ సాగించిన మహా ఆటవిక పాలన అంతంకాబోతోందనడానికి సూచిక. ఇది టీఎంసీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలంటూ బీజేపీ చేసిన ప్రచారానికి దక్కిన భారీ మద్దతు. 3.6 కోట్ల మంది ఓటర్లు ఏకంగా 93 శాతం పోలింగ్ నమోదుచేసి రాష్ట్రంలో మార్పురాబోతోందని స్పష్టంచేశారు’’అని మోదీ అన్నారు. కొన్ని నెలల క్రితం ఆర్జీకర్ బోధనాస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనను మోదీ గుర్తుచేశారు. ‘‘తన కూతురు వైద్యురాలిగా మారేందుకు ఒక తల్లి ఎంతగానో శ్రమించింది. రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వం ఆ కుమార్తెను తల్లికి దూరం చేసింది. మేం ఆ అత్యాచార బాధితురాలి తల్లి రత్నా దేబ్‌నాథ్‌ను పానిహటీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చాం. సందేశ్‌ఖాలీ అరాచకాల బాధితుల్లో ఒక మహిళను సైతం అభ్యర్థిగా బరిలో నిలిపాం. మమతా బెనర్జీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేవాలయాలను నేలమట్టం చేసింది. ఓటర్లు కదిలొచ్చి స్వయంగా మళ్లీ బ్యాలెట్ ఓట్ల ద్వారా ఆ ఆలయాలను పునర్నిర్మిస్తున్నారు. తొలి దశ పోలింగ్‌లో భారీ ఓటింగ్‌తో ఇది మొదలైంది. రెండో దశ పోలింగ్‌తో నిర్మాణం సంపూర్ణమవుతుంది. అప్పుడు మేం గెలిచి ప్రజాస్వామ్య ఆలయంపై విజయపతాక ఎగరేస్తాం. ఓటింగ్ వరద చూసి టీఎంసీ నేతలు వణికిపోతున్నారు. కోపంతో ఓటర్లు, బీజేపీ కార్యకర్తలను టీఎంసీ గూండాలు బెదిరిస్తున్నారు. తొలిదఫా ఎన్నికల ఓటింగ్ అధికార పార్టీ ఓటమిని కళ్లకు కట్టింది. మే 4వ తేదీన ఫలితాలొస్తాయి. అప్పుడు టీఎంసీ గూండాలకు రాష్ట్రంలో దాక్కోడానికి చోటే ఉండదు. మార్పు కావాల్సిందే... బీజేపీ సర్కార్ రావాల్సిందే అని బెంగాల్ ప్రతిధ్వనిస్తోంది’’అని మోదీ అన్నారు. ఇది పోరాటాల గడ్డ.. ‘‘ఎన్నికలు అనేవి అతిపెద్ద సైద్ధాంతిక పోరాటం. పశ్చిమబెంగాల్ అనేది పోరాటాల గడ్డ. ధైర్యవంతుల అడ్డా. దాస్యశృంఖలాలు తెంపాలంటే రక్తం ధారపోయండి మీకు స్వేచ్ఛా స్వాతం్రత్యాలను సిద్ధింపజేస్తానని నేతాజీ సెలవిచ్చారు. ఇప్పుడు బెంగాల్లో మరో విప్లవం రావాల్సిన తరుణమొచ్చింది. మీ ఓటుతోనే ఈ విప్లవం సుసాధ్యం. ఏళ్ల కష్టాలను బీజేపీ ఒక్క దెబ్బతో తొలగించబోతోంది. భయం, అవినీతి, సిండికేట్ పాలన, మహిళలపై దౌర్జన్యాలు, నిరుద్యోగం, బలవంతపు వలసలు, చొరబాటుదారుల ఆక్రమణల నుంచి బీజేపీ శాశ్వత పరిష్కారం చూపిస్తుంది’’అని మోదీ హామీ ఇచ్చారు. ‘మీ సోదరుడిగా చెబుతున్నా. మహిళల భద్రతే మాకు అత్యంత ముఖ్యం. బెంగాల్లో మహిళా శక్తే ఈ రాష్ట్రంలో నూతన శకాన్ని లిఖించబోతోంది’అని అన్నారు.దశాబ్దానికి మించి దారుణ దోపిడీ ‘‘గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటోంది. అవినీతి, చొరబాట్లతో రాష్ట్రం పరువు తీస్తోంది. బొగ్గు, ఇసుక, రేషన్, చిట్‌ఫండ్ ఇలా ప్రతిదాంట్లో కుంభకోణాలుచేశారు. అవినీతి మరకలు అంటని రంగమే లేదు. ఉన్నత విద్యా ప్రమాణాలతో భాసిల్లిన జాదవ్‌పూర్ వర్సిటీ వంటి ప్రతిష్టాత్మకవర్సిటీలను రాజకీయ క్రీడాస్థలిగా మార్చేసింది. విద్యార్థులతో బలవంతంగా ధర్నాలు, నిరసన ర్యాలీలు చేయిస్తున్నారు. ఇలాంటి దారుణాలకు మేం వచ్చాక చరమగీతం పాడుతాం. చిన్న దుకాణదారులు మొదలు పెద్ద వ్యాపారులదాకా, ట్యాక్సీ డ్రైవర్లు మొదలు రిక్షావాలాలదాకా, ప్రభుత్వ ఉద్యోగులు మొదలు పోలీస్లదాకా అందరూ ధైర్యంగా కమలదళానికి దన్నుగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు సైతం బీజేపీకే మద్దతు పలుకుతున్నారు. తొలిదఫాలో తొలిసారి ఓటేసిన వాళ్లూ మాకే అండగా నిలబడ్డారు. ఇక మీవంతు’’అంటూ యువ ఓటర్లకు మోదీ పిలుపునిచ్చారు.హూగ్లీలో మోదీ పడవ షికారు ఎన్నికల ప్రచారం కోసం కోల్‌కతాకు వచ్చిన మోదీ అక్కడి ప్రిన్సిప్ ఘాట్‌కు చేరుకుని హూగ్లీ నదిలో కొద్దిసేపు బోటు షికారు చేశారు. అక్కడి రమణీయమైన దృశ్యాలను వెంటతీసుకొచ్చిన తమ కెమెరాలో బంధించారు. గంగానదికి హూగ్లీ ఉపనది. ‘‘గంగానది అనేది ప్రతి ఒక్క బెంగాళీ మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. బెంగాల్ ఆత్మలో గంగానదీ సజీవంగా పారుతుంది. యావత్ మానవ నాగరికత స్ఫూర్తిని ఈ పవిత్రనదీజలాలు వెంటతీసుకొచ్చాయి. ఈరోజు ఉదయం కోల్‌కతాలో హూగ్లీ నది హొయలను నా కెమెరా కంటితో చూశా. కొన్ని జ్ఞాపకాలను ఫొటోలుగా కెమెరాలో బంధించా. విద్యాసాగర్ సేతు, ప్రఖ్యాత హౌరా వంతెనను పడవలో ప్రయాణిస్తూ దగ్గర్నుంచి తిలకించి ముగ్ధుడినయ్యా. హూగ్లీ నదీతీరంలో కాసేపు గడిపి గంగామాత రుణం తీర్చుకునే సదవకాశం సంపాదించా’’అని అన్నారు. తాను తీసిన ఫొటోలను తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. మోదీ తన పడవలో షికారుకు రావడంతో పడవనడిపే గౌరంగా బిశ్వాస్ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ప్రధాని రాబోతున్నారని నాకు ముందస్తుగా ఎవరూ చెప్పలేదు. హఠాత్తుగా అధికారులు వచ్చి షికారుకు వస్తావా? అని అడిగారు. సరేనన్నా. హఠాత్తుగా మోదీ వచ్చి పడవలో కూర్చున్నారు. గంటసేపు నదిలో తిప్పా. రూ.1,000 ఇచ్చారు’’అని బిశ్వాస్ వెల్లడించారు. -
అల్లరిమూకలపై డేగ కన్ను
సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్లో తొలి దశ పోలింగ్ సందర్భంగా సమస్యలు సృష్టించే వారు, అల్లరి మూకలను కట్టడి చేయడంపై ఈసీ దృష్టిపెట్టింది. ఇలాంటి వారితో కూడిన వెయ్యిమంది జాబితాను సిద్ధం చేసింది. ఇందులో 9మంది వరకు తృణమూల్ ఎమ్మెల్యేలున్నారు. పలువురు అభ్యర్థులు, కౌన్సిలర్లు ఉన్నారు. వీరిపై పోలీసు నిఘా పెరిగింది. ఈ జాబితాపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. తమ నాయకులను ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఈ ప్రయత్నమని ఆరోపించింది. దీనిపై టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. నిర్దిష్ట ఆధారాలు లేకుండా రాజకీయ నాయకులను సమస్యాత్మక వ్యక్తులుగా గుర్తించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన సమయంలో ఈ జాబితా వెలుగులోకి రావడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. -
బెంగాల్లో నేడు తొలి దశ పోలింగ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు తొలి దశ పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాలకు గాను 152 సీట్లకు ఎన్నిక జరగనుంది. ఉత్తర బెంగాల్‌లోని 8 జిల్లాలతోపాటు ముర్షిదాబాద్, హుగ్లీ, నడియా, బిర్భూమ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 54 సీట్లు బీజేపీకి కీలకంగా మారాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్‌లో 3.60 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 167 మంది మహిళలు సహా మొత్తం 1,478 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 8 వేలకు పైగా పోలింగ్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈసీ రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల బలగాలను మోహరించింది. వీరితోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. ప్రభావం చూపే కీలకాంశాలివే.. అవినీతి, నిరుద్యోగం వంటి కీలక అంశాల కంటే ఈసారి సామాజిక గుర్తింపు, పౌరసత్వం, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి అంశాలకే ప్రాధాన్యం పెరిగిన విభిన్న పరిస్థితులు నెలకొన్న వేళ ఈ జిల్లాల్లో సాధించే ఆధిక్యాన్ని బట్టే బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గట్టి ప్రతిపక్షంగా ఎదిగేందుకు ఉత్తర బెంగాల్లో సాధించిన ఫలితాలే కీలకంగా మారాయి. ఇదే ఊపుతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశలో ఈ ప్రాంతంలో ఉన్న 152 సీట్లకుగాను బీజేపీ 59 చోట్ల విజయం సాధించగా, అధికార టీఎంసీ 93 సీట్లు దక్కించుకుంది. ఉత్తరబెంగాల్‌లో బీజేపీ ప్రభావాన్ని అడ్డుకోవడం అధికార పక్షానికి కూడా చాలా కీలకం. ఎందుకంటే, ఇది రెండో దశతోపాటు రాష్ట్రంలో మొత్తం రాజకీయ వాతావరణంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రాంతాలేవైనా సర్ ఒక్కటే.. ఉత్తర బెంగాల్లో తేయాకు తోటలున్న జల్పాయ్గురి అలీపూర్‌దువార్, కొండప్రాంతాలైన డార్జిలింగ్, కాలింపాంగ్, రాజ్బన్షీలున్న కూచ్ బెహార్ ఉన్నాయి. సరిహద్దుల్లోని మల్దా, ఉత్తర దినాజ్‌పూర్, మైనారిటీల ప్రాబల్యమున్న ముర్షిదాబాద్, నడియాలున్నాయి. ఎన్ని తేడాలున్నప్పటికీ, ప్రతి జిల్లాలోనూ ఓటింగ్ సరళిని ప్రభావితం చేయనున్న ఏకైక అంశం ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో సర్ కారణంగా 91 లక్షలకు పైగా పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో ఇవి సుమారు 12 శాతం. ఒక్క ముర్షిదాబాద్ జిల్లాలోనే 7.48 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. తర్వాత, నడియాలో 4.85 లక్షలు, మాల్దాలో 4.59 లక్షలు, ఉత్తర్ దినాజ్పూర్లో 3.63 లక్షలు, కూచ్ బెహార్లో 2.42లక్షలకు పైగా ఓట్లను పక్కనబెట్టారు. దీంతో, ఎన్నికల్లో ప్రచారాంశాలే ఏకంగా మారిపోయాయి. అవినీతి, నిరుద్యోగం, సంక్షేమ పథకాలు అప్రాధాన్యాంశాలు కాగా, పౌరసత్వం, చొరబాట్లు, బోగస్ ఓట్లు, తొలగింపునకు గురైన ఓటర్లు, విదేశీయులు వంటివాటికి ప్రాధాన్యం పెరిగిపోయింది. చొరబాట్లు, పౌరసత్వం అంశాలకు సర్‌ను రెఫరెండంగా బీజేపీ అభివర్ణించగా, నిజమైన ఓటర్లను ముఖ్యంగా మైనారిటీలు, వలస కార్మికులు, పేదల పేర్లను తొలగించారంటూ టీఎంసీ ప్రచారం చేసుకుంది. బరిలో పలువురు ప్రముఖులు మొదటి దశ బరిలో పలువురు ప్రముఖ నేతలున్నారు. ముఖ్యంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఒకరు. 2021 ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని ఆయన ఇక్కడ ఓడించారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలు ఈయన చుట్టూతా నడుస్తున్నాయి. ఈసారి ఇక్కడ సువేందుకు నమ్మినబంటుగా ఉన్న పబిత్రా కర్ టీఎంసీ తరఫున బరిలో ఉన్నారు. అదేవిధంగా, బహరంపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత ఆధిర్ రంజన్ చౌదరి, బీజేపీ ఎమ్మెల్యే సుబ్రతా మైత్రా పోటీ పడుతున్నారు. మాతాభంగలో కేంద్ర మాజీ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పోటీ చేస్తున్నారు. ఖరగ్‌పూర్ సదర్‌లో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, టీఎంసీకి చెందిన ప్రదీప్ సర్కార్ తలపడుతున్నారు.నన్ను భయపెట్టాలని చూస్తున్నారు: మమతఆమ్డాంగా(పశ్చిమ బెంగాల్): పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ భారీ సంఖ్యలో శాంతి భద్రతల కోసమంటూ సాయుధ బలగాలను మోహరించడంతోపాటు సీఆర్పీఎఫ్ వాహనాలను రంగంలోకి దించడంపై సీఎం మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లక్షలాదిగా బలగాలను తరలించి కేంద్రం తనను భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. సీఎం మమత బుధవారం ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ‘సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్లతోపాట రైల్వే బలగాలను కూడా కేంద్రం ఇక్కడ ఎన్నికల కోసం తీసుకువచి్చంది ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ మాత్రమే, ఎవరినీ చంపడానికి కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల కోసం బెంగాల్‌కు మునుపెన్నడూ లేని విధంగా సుమారు రెండు లక్షల కేంద్ర బలగాలను తీసుకువచ్చారు. ఇంత భారీ స్థాయిలో బలగాలను మోహరించి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?’అంటూ కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. -
ఇన్ని లక్షల మందిని ఎందుకు పంపారు?: మమతా బెనర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కేంద్ర బలగాలను భారీగా మోహరించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ చర్య వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని విమర్శించారు.ఉత్తర 24 పరగణాలలో తృణమూల్ కాంగ్రెస్ ర్యాలీలో మాట్లాడిన బెనర్జీ.. శాంతిభద్రతలు కాపాడటానికి వచ్చిన సీఆర్పీఎఫ్ సాయుధ వాహనాల వినియోగం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగాలు, రైల్వే వంటి సంస్థలు కూడా పోలింగ్ విధుల్లో నిమగ్నమయ్యాయని అన్నారు.“ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండుగ, ఇది ప్రజలకు హాని చేసే సమయం కాదు” అని మమతా బెనర్జీ చెప్పారు. ఎవరైనా పోలింగ్ వేళ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని తర అనుచరులను కోరారు. సుమారు 2 లక్షల కేంద్ర సిబ్బందిని రాష్ట్రానికి తీసుకువచ్చారని చెప్పారు. “ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించడం ద్వారా నన్ను భయపెట్టాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.బీజేపీకి మమత సవాల్ విసురుతూ.. “సాయుధ వాహనాలకు శక్తి ఎక్కువా లేక ప్రజలకు శక్తి ఎక్కువా చూడాలి. నేను దేనికీ భయపడను. ఇలాంటి సాయుధ వాహనాలను మణిపూర్‌లో వినియోగించాలి. మణిపూర్‌లో మూడు సంవత్సరాలుగా అశాంతి కొనసాగుతోంది. బెంగాల్లో అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారు” అని తెలిపారు.జాతీయ భద్రత అంశాలపై కూడా ఆమె మాట్లాడారు. “పహల్గామ్లో ఉగ్రవాదులు భారతీయులను హతమార్చినా, కేంద్ర సర్కారు పాకిస్థాన్‌పై చర్య తీసుకోలేకపోతోంది. కానీ బెంగాల్ ఎన్నికల కోసం మాత్రం అన్ని బలగాలను తీసుకువస్తున్నారు” అని అన్నారు. కాగా, గురువారం (ఏప్రిల్ 22) పశ్చిమ బెంగాల్లో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. -
ముగిసిన మొదటి విడత ప్రచారం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లకు గాను ఈ నెల 23వ తేదీన 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో 3.60 కోట్ల అర్హులైన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ భారీగా భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. మొదటి విడతలో 8 వేల పోలింగ్ బూత్‌లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించింది. పోలింగ్ సజావుగా సాగేందుకు సుమారు 2,450 కంపెనీలు, రెండున్నర లక్షల కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. అదనంగా 2,193 క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది.రాష్ట్రంలోని మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్‌పూర్, కూచ్ బెహార్, బిర్బూమ్, బురŠాద్వన్ జిల్లాలపై ఈసీ ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. మొదటి విడతలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్, కేంద్ర మాజీ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పోటీలో ఉన్న మాతాభంగ, కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్న బెహరంపూర్ తదితర నియోజకవర్గాలున్నాయి. పశ్చిమ్ మేదినీపూర్ జిల్లా ఖరగ్‌పూర్ సదర్‌లో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, టీఎంసీకి చెందిన ప్రదీప్ సర్కార్ ముఖాముఖి తలపడుతున్నారు. ఈ నెల 29వ తేదీన రెండో విడత పోలింగ్, మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నాయి.టీఎంసీ, బీజేపీ మధ్యే అసలు పోటీటీఎంసీ వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టేందుకు చెమటోడ్చుతుండగా, మమతా బెనర్జీని గద్దె దించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన సర్ ప్రక్రియతో 91 లక్షల ఓట్లు తొలగింపునకు గురి కావడం తమకు కలిసి వస్తోందని కాషాయ దళం ఆశతో ఉంది. మొదటి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల హింస, దిగజారిన శాంతి భద్రతల అంశం, పెచ్చుమీరిన అవినీతిపై సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను టీఎంసీ ప్రోత్సహిస్తోందని వీరు ఆరోపణలు గుప్పించారు. కాగా, టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సర్ ద్వారా బీజేపీ ఓటరు జాబితాను తారుమారు చేసి, అనుకూలంగా మార్చుకుందని వీరు విమర్శించారు. కేంద్ర విభాగాలను వాడుకుంటూ బీజేపీ నాయకులు తమ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే చేపలు, గుడ్లు, మాంసంపై నిషేధం తీసుకువస్తుందని, ప్రజల ఆహార అలవాట్లను కూడా శాసిస్తుందని ప్రజలను టీఎంసీ హెచ్చరించారు. కాగా, కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌తోపాటు గతంలో దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న సీపీఎం ప్రభావం కూడా అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. -
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. కీలక అభ్యర్థులు వీరే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ఏప్రిల్ 23న జరుగుతుంది. తొలి దశలో 152 స్థానాలకు పోలింగ్ ఉంటుంది. తొలి దశ ప్రచారం మంగళవారం (ఏప్రిల్ 21)న ముగిసింది. మిగిలిన ప్రాంతాల్లో ఏప్రిల్ 29న ఓటింగ్ జరుగుతుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు.రాజకీయంగా కీలకమైన పశ్చిమ బెంగాల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యే ఉంది. ఏప్రిల్ 23న ఓటింగ్ 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో ఉన్నాయి.తొలి దశలో పోటీ చేసే కీలక అభ్యర్థులునందిగ్రామ్లో సువేందు అధికారి vs పబిత్ర కర్బీజేపీ నేత సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. 2021లో మమతా బెనర్జీని ఓడించి ఈ స్థానాన్ని గెలిచారు. అలాగే భవానీపూర్ నుంచి కూడా ఆన పోటీ చేస్తున్నాడు. నందిగ్రామ్ లో ఏప్రిల్ 23న, భవానీపూర్‌లో ఏప్రిల్ 29న పోలింగ్ జరుగుతుంది. సువేందు అధికారి 2020లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో టీఎంసీ 294 స్థానాలకుగానూ 213 స్థానాలు గెలిచింది. కానీ, నందిగ్రామ్‌లో సువేందు అధికారి.. బెనర్జీపై విజయం సాధించారు.ప్రస్తుతం అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అధికారి. టీఎంసీ అభ్యర్థి పబిత్ర కర్ పై ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కర్ ఒకప్పుడు బీజేపీలో కొనసాగారు. తర్వాత టీఎంసీ చేరారు. ఇప్పుడు తన మాజీ గురువుతో పోటీ పడుతున్నారు.బహరంపూర్‌లో అధీర్ రంజన్ చౌధురి vs సుబ్రత మైత్రాఅధీర్ రంజన్ చౌధురి దీర్ఘకాలం కాంగ్రెస్ ఎంపీగా బహరంపూర్ నుంచి 5 సార్లు గెలిచారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ నేత యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలో బహరంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సుబ్రత మైత్రాను ఎదుర్కొంటున్నారు.ఆసన్సోల్ దక్షిణలో అగ్నిమిత్ర పాల్ vs తపాస్ బెనర్జీఅగ్నిమిత్ర పాల్ బీజేపీ మహిళా నాయకుల్లో ప్రముఖురాలు. 2019లో బీజేపీలో చేరి, 2021 ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి సాయోని ఘోష్ పై విజయం సాధించారు. ఇప్పుడు టీఎంసీ అభ్యర్థి తపాస్ బెనర్జీతో పోటీ పడుతున్నారు. తపాస్ బెనర్జీ టీఎంసీకి చెందిన సీనియర్ నాయకుడు. 2011 నుంచి 2021 వరకు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.ఖరగ్‌పూర్ సదర్‌లో దిలీప్ ఘోష్ vs ప్రదీప్ సర్కార్దిలీప్ ఘోష్ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. పశ్చిమ బెంగాల్ లో పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. 2016లో ఖరగ్‌పూర్ సదర్ నుంచి గెలిచారు. 2021లో బీజేపీ అభ్యర్థి హిరణ్ చటర్జీ స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2026 ఎన్నికల్లో ఘోష్ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ ప్రదీప్ సర్కార్ ను రంగంలోకి దింపింది. సర్కార్ 2019 ఉపఎన్నికలో గెలిచారు.మథాభంగాలో నిసిత్ ప్రమాణిక్ vs సబ్‌లు బర్మన్కేంద్ర మాజీ మంత్రి నిసిత్ ప్రమాణిక్ బీజేపీ అభ్యర్థిగా కూచ్ బెహార్ జిల్లా మథాభంగా (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ నుంచి సబ్‌లు బర్మన్ పోటీకి దిగారు. సీపీఎం అభ్యర్థి ఖగేన్ చంద్ర బర్మన్, కాంగ్రెస్ అభ్యర్థి క్షితేంద్ర నాథ్ బర్మన్ కూడా రంగంలో ఉన్నారు. ప్రమాణిక్ 2021 లో దిన్హాటా నుంచి గెలిచారు. తర్వాత లోక్ సభ సభ్యత్వం కొనసాగించేందుకు ఆ స్థానాన్ని ఖాళీ చేశారు. ఉపఎన్నికలో ఉదయన్ గుహ గెలిచారు.డోంకల్లో హుమాయున్ కబీర్ vs మొస్తాఫిజుర్ రహమాన్మాజీ టీఎంసీ నేత, మమతా బెనర్జీ కేబినెట్లో మంత్రిగా పనిచేసి హుమాయున్ కబీర్.. ఇప్పుడు ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీని స్థాపించి స్వతంత్రంగా పోటీ నిర్ణయం తీసుకున్నారు. 2025 లో బాబ్రీ మసీదు నిర్మాణ ప్రతిపాదన కారణంగా ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కబీర్, సీపీఎం అభ్యర్థి మొస్తాఫిజుర్ రహమాన్ పై పోటీ చేస్తున్నారు. 2021లో ఈ స్థానం నుంచి టీఎంసీకి చెందిన జాఫికుల్ ఇస్లాం గెలిచారు.పానిహాటిలో రత్నా దేవనాథ్ vs నిర్మల్ ఘోష్ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనలో అత్యాచారం, హత్యకు గురైన మహిళా వైద్యురాలి తల్లి రత్నా దేవనాథ్. బీజేపీ అభ్యర్థిగా పానిహాటి నుంచి రత్నా దేవనాథ్ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థి టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్. -
దీదీ లోకల్ మంత్రం.. కమలం బూత్ తంత్రం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటున్న కొద్దీ ప్రధాన రాజకీయ పక్షాలైన అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ తమ ప్రభుత్వంపై వ్యతిరేకతను అధిగమించేందుకు స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈసారి తృణమూల్‌ను ఎలాగైనా గద్దె దింపి రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికలు రచిస్తోంది. తృణమూల్ ‘ప్రతిజ్ఞా స్తంభాలు’ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ‘స్థానిక మేనిఫెస్టో’లతో తృణమూల్ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. స్థానికంగా ప్రధాన సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి మేనిఫెస్టోల్లో హామీలిస్తోంది. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో మూడు అసెంబ్లీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా 291 చోట్లా తృణమూల్ బరిలో ఉంది. అభ్యర్థుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు ప్రతి నియోజకవర్గంలో ‘ప్రతిజ్ఞా స్తంభం’ పేరిట వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. స్థానిక అభ్యర్థి తాలూకు ఎన్నికల కార్యాలయం ముందు ఈ స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానిపై అభ్యర్థి పేరుతో పాటు సమస్యల పరిష్కారానికి చేస్తున్న వాగ్దానాలను పొందుపరుస్తున్నారు. వారంక్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞా స్తంభాలు, ప్రచార కార్యక్రమాల వీడియోను పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా పంచుకుంది. అభ్యర్థి ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉంటారనే స్పష్టమైన సందేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపడం దీని వెనక వ్యూహమని భావిస్తున్నారు. గతం నుంచి బీజేపీ పాఠాలు ఇక బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సంస్థాగత లోపాలను దిద్దుకునే పనిలో పడింది. ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభల ద్వారా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూనే, అసలు యుద్ధభూమి అయిన పోలింగ్ బూత్‌ల నిర్వహణపై ఈసారి ప్రధానంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 85,379 పోలింగ్ బూత్‌ల్లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు మినహాయించి అంతటా ఇప్పటికే బూత్ కమిటీల ఏర్పాటును పూర్తి చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెలరేగిన హింస కారణంగా బీజేపీ కార్యకర్తలు భారీగా బూత్‌లను వదిలి వెళ్లడం ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తరాదని కార్యకర్తలకు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. చివరి నిమిషం దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ బూత్‌ను వదలకూడదని ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేరుగా బూత్ స్థాయి కార్యకర్తలతో సంభాషిస్తూ ఉత్సాహం నింపుతున్నారు. బూత్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా అమలు చేసేందుకు బెంగాల్‌ను బీజేపీ ఐదు భాగాలుగా విభజించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు అనంత్ నారాయణ్ మిశ్రా, పవన్ రాణా, సిద్ధార్థన్, ఎన్.మధుకర్, పవన్ సాయ్‌కి వాటి బాధ్యతలు అప్పగించింది. వీరంతా గత అక్టోబర్ నుంచే క్షేత్రస్థాయిలో మకాం వేశారు. సంస్థాగత లోపాలను సరిదిద్దుతూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. మూడు నుంచి ఐదు బూత్‌లను కలిపి ఒక ‘శక్తి కేంద్రం’గా ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణ బాధ్యతలను రా్రõÙ్టతర నేతలకు అప్పగించారు. నిరంతర సమీక్షలతో బూత్ స్థాయిలో రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. బూత్ మేనేజ్మెంట్లో ఈసారి తృణమూల్‌కు దీటుగా నిలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది.రంగంలోకి ఆరెస్సెస్ క్షేత్రస్థాయిలో హిందువులను ఏకం చేసేందుకు ఆరెస్సెస్ ఆధ్వర్యంలో బెంగాల్ అంతటా ముమ్మర ప్రచారం సాగుతోంది. బెంగాలీ హిందువుల ఉనికిని ఈ ఎన్నికలు కీలకమంటూ ప్రచారం చేస్తోంది. ఎన్నికల హింసకు వెరచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండే ధోరణికి స్వస్తి పలకాలి. ప్రతి బూత్నూ సురక్షితం చేసి, ఓటర్లు నిర్భయంగా ఓటేసేలా చూడాలి’’ అని కార్యకర్తలకు సూచిస్తోంది. ఈసారి ఒక్క బూత్ నుంచి కూడా తమ కార్యకర్తలను తృణమూల్ పారదోలే పరిస్థితి ఉండబోదని ఆరెస్సెస్ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన ఆరెస్సెస్ స్వయంసేవకులు జనజాగరణ కార్యక్రమంలో నిమగ్నమైనట్టు వెల్లడించారు. శరత్ చంద్ర ముక్తవరం -
టీఎంసీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ అధికారులు శుక్రవారం టీఎంసీ నేతల ఇళ్లలో సోదాలు చేపట్టారు. వీరిలో ఒకరు రస్బెహారీ అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తున్న టీఎంసీ ఎమ్మెల్యే దేబాశీస్ కుమార్ కాగా, మరొకరు భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీని బలపర్చిన మిరాజ్ షా కావడం గమనార్హం. కోల్‌కతాలోని దేబాశీస్ కుమార్ నివాసం, ఎన్నికల కార్యాలయం, ఆయనకు సంబంధించిన ఇతర కార్యాలయాల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించిన తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఐటీ అధికారుల మరో బృందం దక్షిణ కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్డులో ఉన్న మిరాజ్ షా నివాసంపై దాడి చేసింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని బలపర్చిన నాలుగు వేర్వేరు మతాలకు చెందిన నేతల్లో మిరాజ్ ఒకరు. దేబాశీస్ కుమార్ సన్నిహితుడు, టీఎంసీ నేత కుమార్ సాహాకు చెందిన కాళీఘాట్ నివాసంపైనా ఐటీ దాడులు జరిగాయి. భూకుంభకోణం ఆరోపణలున్న దేబాశీస్ కుమార్ ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. తమ నేతల ఇళ్లలో ఐటీ సోదాలను టీఎంసీ ఖండించింది. తమ పార్టీ నేతలను రెచ్చగొట్టేందుకు, వేధించేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలా దాడులు చేయిస్తోందని ఆరోపించింది. ఐటీ సోదాల సమయంలో దేబాశీస్ నివాసం వద్ద గుమికూడిన టీఎంసీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందు జాగ్రత్తగా అక్కడ కేంద్ర బలగాలను మోహరించారు. -
పాకిస్తాన్‌కు వార్నింగ్.. అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్కత్తా: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం హీటెక్కింది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తామే పాకిస్తాన్‌లోని వారి ఇళ్లలోకి చొరబడి చంపేస్తామని హెచ్చరించారు. దీంతో, బెంగాల్ రాజకీయంలో మరింత చర్చకు దారి తీసింది.తృణముల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సోమవారం బెంగాల్‌లోని సిలిగురిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్‌కతాపై పాకిస్తాన్ ఇటీవల చేసిన హెచ్చరికకు కేంద్రం స్పందించిన తీరుపై విమర్శలు గుప్పించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. ‘భారత్-పాకిస్తాన్ మధ్య భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తితే కోల్‌కతా లక్ష్యం కావచ్చని పాకిస్తాన్ నాయకుడు ఒకరు మాట్లాడారు. కోల్‌కతాను పేల్చివేస్తామని ఖవాజా ఆసిఫ్ అన్నారు. మన ప్రధానమంత్రి, హోం మంత్రి, రక్షణ మంత్రి.. ఆయన వ్యాఖ్యలకు మౌనంగా ఉండిపోయారు. కానీ, నేను మాత్రం ఊరుకోను. నేను నా జాబితాలో ఖవాజా ఆసిఫ్ పేరు రాసుకున్నాను. మమతా బెనర్జీ, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు.. మేము వారి ఇళ్లలోకి చొరబడి వారిని చంపుతాము’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, అతను పాకిస్తాన్లో కూర్చుని కోల్‌కతాపై దాడి చేస్తామని బెదిరిస్తున్నాడు. దీనిపై అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ మౌనంగా ఉన్నారు. బెంగాల్ విషయంలో మాత్రం అమిత్ షా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన ప్రతీరోజు మమ్మల్ని బంగ్లాదేశీయులు, పాకిస్తానీయులు అని పిలుస్తారు. కానీ, పాకిస్తాన్ కోల్‌కతాను బెదిరించినప్పుడు మాత్రం ఆయన మూగ ప్రేక్షకుడుగా మారిపోతారు. ప్రధాని మోదీ కూడా బెంగాల్లో టీఎంసీని ఓడించాలని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. కానీ, పాకిస్తాన్ వ్యాఖ్యలపై ఆయన కూడా స్పందించరు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలతో బెంగాల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఇక, అంతకుముందు.. భారత్‌ను ఉద్దేశించి పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి ప్రేలాపనలు చేశారు. భవిష్యత్తులో భారత్ ఏదైనా దాడులకు పాల్పడితే.. కోల్‌కతానూ లక్ష్యంగా చేసుకుంటామన్నారు. ప్రతిదాడులను ఆ ప్రాంతం వరకూ తీసుకెళ్తామంటూ వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. -
సువేందుకు అనుకూలం.. ఆయనను తొలగించండి: టీఎంసీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి(ఆర్వో)ను వెంటనే తొలగించాలని అధికార టీఎంసీ డిమాండ్ చేసింది. ఇదే నియోజకవర్గం నుంచి టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండటం తెల్సిందే. ఇక్కడి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఆర్వో సురాజిత్ రాయ్ సన్నిహితుడంటూ ఆరోపించింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) మనోజ్ కుమార్ అగర్వాల్‌కు శుక్రవారం ఒక వినతిపత్రం సమర్పించింది.ప్రస్తుత ఆర్వో రాయ్ గతంలో నందిగ్రామ్ నియోజకవర్గంలో బ్లాక్ అభివృద్ధి అధికారిగా ఉన్నప్పుడే సువేందుకు అనుకూలంగా బహిరంగంగానే వ్యవహరించినట్లు పేర్కొంది. అలాంటి అధికారిని సరిగ్గా ఎన్నికల వేళ ఆర్వోగా నియమించడం అనుమానాలకు తావిస్తోందని టీఎంసీ పేర్కొంది. ఈ నియామకం తటస్థ వైఖరికి భంగకరంగా ఉంటుందని పేర్కొంది. ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు ఉందని తెలిపింది. -
బెంగాల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు.. తొలి జాబితా ఇదే
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఒంటరిగా దిగుతున్న కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఏకంగా 284 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లకు ఏప్రిల్ 23, 29వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనుండటం తెల్సిందే.ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ ఆధిర్ రంజన్ చౌదరి, బహరంపూర్ నుంచి టీఎంసీ మాజీ ఎంపీ మౌసమ్ నూర్ మాలతిపూర్ నుంచి పోటీకి దిగనున్నారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు బెంగాల్ సీనియర్ నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ జాబితాను ఖరారు చేశారు. The AICC leadership has approved the following candidates for the West Bengal Assembly elections. My best wishes to them all. More than Congress candidates, they are people’s candidates representing diverse religious, cultural, geographical, and professional identities. We will… pic.twitter.com/3R2BjFhWdv— Subhankar Sarkar শুভঙ্কর সরকার (@subhankar_cong) March 29, 2026మూడో ఓటరు లిస్ట్ బెంగాల్లో ప్రచురించిన ఈసీకోల్కతా: పశ్చిమబెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అనంతరం మూడో అదనపు ఓటరు జాబితాను ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. శనివారం రాత్రి 11.30 గంటలకు ప్రచురించిన ఈ జాబితాలో బూత్‌లవారీ వివరాలున్నాయి.అయితే ఇందులో కూడా తొలగించిన, కొత్తగా చేర్చిన పేర్ల సంఖ్యను వెల్లడించలేదు! సోమవారం తొలి అదనపు జాబితాను, శుక్రవారం రాత్రి రెండో జాబితాను ఈసీ విడుదల చేయడం తెలిసిందే. చదవండి: దీదీ 'చేప'లకు మోదీ గాలం? -
ఉత్తరాన గట్టిపోరు.. 54 స్థానాలు కీలకం
పశ్చిమబెంగాల్లో ఈసారి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నడుమ సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు అచ్చం దంగల్ కుస్తీ పోటీలను తలదన్నుతోంది. ఒకటి కేంద్రంలో, మరొకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పారీ్టలు కావడంతో ఈ ఎన్నికలను రెండు పక్షాలూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ బరిలో ఇప్పటికే విజయాల హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది.రాష్ట్రంలో కొన్నేళ్లుగా క్రమంగా విస్తరిస్తూ వస్తున్న కాషాయ దళం ఈసారి టీఎంసీని ఎలాగైనా ఓడించి తొలిసారి అధికారాన్ని ఒడిసిపట్టాలని పట్టుదలగా ఉంది. ఆ క్రమంలో కీలకమైన ఉత్తర బెంగాల్ ప్రాంతంపై 2 పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. తనకిప్పటికే పట్టున్న ఈ ప్రాంతాన్ని కంచుకోటగా మార్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ తలమునకలుగా ఉంది. పలు ప్రాంతీయ హామీలతో ఉత్తర బెంగాల్వాసులను ఆకట్టుకునేందుకు, ఆదరణ పెంచుకునేందుకు తృణమూల్ ప్రయత్నిస్తోంది.నువ్వా, నేనా! బీజేపీ, టీఎంసీ ఎన్నికల పోరుకు ఉత్తర బెంగాల్ ప్రాంతం కీలకంగా మారింది. ఇక్కడ 54 అసెంబ్లీ సీట్లపై రెండు పార్టీలూ గట్టిగా దృష్టి పెట్టాయి. ఒకప్పుడు కొరకరాని కొయ్యగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీలో కొన్నేళ్లుగా బలపడుతూ వస్తోంది. ఆ పట్టును ఈసారి మరింతగా పెంచుకోవడమే లక్ష్యంగా ఉత్తర బెంగాల్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా దృష్టి పెట్టింది. ఈసారి ఇక్కడ కనీసం 40 అసెంబ్లీ స్థానాలకు పైగా గెలిపించే బాధ్యతలను పార్టీ బెంగాల్ ఇన్చార్జి సునీల్ బన్సర్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు అప్పగించింది. వారు ఇటీవలే ముఖ్య స్థానిక నేతలతో కీలక సమావేశం నిర్వహించి సమగ్ర ప్రచార వ్యూహం సిద్ధం చేశారు. అందులో భాగంగా మూడంచెల ప్రచార పర్వానికి బీజేపీ తెర తీసింది. ఉత్తర బెంగాల్‌కు తృణమూల్‌కు అన్నివిధాలా ద్రోహం చేస్తోందంటూ హోరెత్తిస్తోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది. ‘సరికొత్త ఉత్తర బెంగాల్’ నినాదంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటింటి ప్రచారంతో దూకుడు పెంచుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఉత్తర బెంగాల్‌కు దీదీ కేవలం 0.002 శాతం నిధులు విదిలించారన్న బీజేపీ ఆరోపణలు ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. బాగ్డోగ్రా విమానాశ్రయ విస్తరణలో భూమి కోల్పోనున్న రైతులు, కార్మిక సంస్కరణల పేరిట తేయాకు పనివారికి అన్యాయం తదితరాలను కూడా బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కూడా అప్రమత్తమైంది. ఉత్తర బెంగాల్లో అధిక సంఖ్యలో ఉండే తేయాకు కార్మికుల సంక్షేమానికి ఇప్పటికే పలు హామీలిచ్చింది. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తామని పేర్కొంది. రైతులకు ఎలాంటి అన్యాయమూ జరగకుండా చూసుకునే బాధ్యత మమతదేనంటూ టీఎంసీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బెంగాలీ అస్తిత్వ నినాదాన్ని ప్రధానంగా ముందుకు తెస్తున్నారు. ఎందుకు కీలకం.. ఉత్తర బెంగాల్ గిరిజనులు, మైనారిటీ ప్రాబల్య ప్రాంతం. ఇది చారిత్రకంగా తృణమూల్‌కు పెద్దగా పట్టు లేని ప్రాంతమనే చెప్పాలి. తొలినుంచీ ఇక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. అవి బలహీనపడ్డాక కొన్నేళ్లుగా వాటి స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తూ వస్తోంది. ఇక్కడి డార్జిలింగ్, కూచ్ బెహార్, జల్పాయ్గురి, దినాజ్‌పూర్ ప్రాంతాల్లో బీజేపీ హవా క్రమంగా పెరుగుతూ వస్తోంది. డార్జిలింగ్ లోక్‌సభ స్థానాన్ని 2009 నుంచీ బీజేపీయే నెగ్గుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఇక్కడ 25 స్థానాలు నెగ్గితే బీజేపీ కేవలం మూడింటితోనే సరిపెట్టుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఉత్తర బెంగాల్‌లోని 8 సీట్లకుగాను బీజేపీ ఏడింటిని చేజిక్కించుకుంది. అదే ఊపులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకంగా 30 సీట్లు ఒడిసిపట్టింది. తృణమూల్ 24 సీట్లతో సరిపెట్టుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 6 స్థానాలు నెగ్గింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అభ్యర్థుల ప్రచార పాట్లు!
ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లడగటం పాత పద్ధతి. పశ్చిమ బెంగాల్లో అభ్యర్థులు ప్రచారం రూటు మార్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వింత పాట్లు పడుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని కుండను పగుల గొట్టడం వంటి ఆటలు ఒకరు ఆడుతుంటే.. మరొక అభ్యర్థి బార్బర్ అవతారమెత్తారు. ఇంకొకరు ఏకంగా వంటింట్లోకి వెళ్లి చపాతీలు చేస్తే.. మరొకరు గుడిలో భజన కీర్తనలు పాడే పరమ భక్తుడిగా మారిపోయారు.చపాతీలు చేస్తూ... అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ఇక్కట్లు అందరికీ తెలిసిందే. హుగ్లీలోని పుర్సురాలో గ్యాస్ లేక కట్టెల పొయ్యితో కుస్తీలు పడుతున్న ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు టీఎంసీ అభ్యర్థి పార్థ హజారీ. ఓ ఇంట్లో నేరుగా కిచెన్‌లోకి వెళ్లి మట్టి పొయ్యిపై రొట్టెలు చేశారు. సునాయాసంగా రొట్టె చేసి తన పాక కళను ప్రదర్శించారు. ‘‘గతంలో నేను రొట్టెలు చేశాను. వంట గురించి కొంత తెలుసు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక చాలా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. వారికి సాయం చేయాలని ప్రయతి్నంచాను’’ అని చెప్పుకొచ్చారు.కళ్లకు గంతలు కట్టుకుని.. రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో అసాధారణమైన ఎన్నికల ప్రచారం జరుగుతోంది. రంజాన్ పండుగ సందర్భంగా స్థానికంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ చంద్ర బౌరీ సంప్రదాయ ‘హండీ ఫోడ్’ ఆట ఆడారు. కళ్లకు గంతలు కట్టుకుని, కుండను కర్రతో పగలగొట్టడానికి ప్రయతి్నంచారు. అయితే కుండ పగులగొట్టడంలో ఆయన విఫలమైనప్పటికీ.. జరగబోయే ఎన్నికల్లో బీజేపీ కూడా ఇలాగే ఓడిపోతుందని సింబాలిక్ చెప్పాలనుకున్నారు. దీనిని బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే అనూప్ కుమార్ సాహా విమర్శించారు. కళ్లు మూసుకుని బీజేపీని ఓడించడం సాధ్యం కాదంటూ అధికార పారీ్టపై తవ్రంగా స్పందించిన ఆయన.. సామాన్య ప్రజలను ఆకట్టుకోవడానికి క్షురకుడి అవతారమెత్తారు. సాహా దుబ్రాజ్‌పూర్‌లో ఒక గ్రామస్తుడికి ఏకంగా గడ్డమే గీశారు! ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.సీపీఎం అభ్యర్థి పూజలు పానిహటిలో సీపీఎం పార్టీ అభ్యర్థి కల్తాన్ దాస్‌గుప్తా పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా పక్కకు పెట్టి మరీ ఏకంగా మహోత్సవ్ తళా ఘాట్ ఆలయంలో ప్రార్థనలతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలాంటి వైరుధ్యాలు గతంలో కూడా చోటుచేసుకున్నాయని దాస్‌గుప్తా చెప్పారు. మాజీ రాష్ట్ర మంత్రి, దివంగత సుభాష్ చక్రవర్తి సైతం ఒకప్పుడు తారాపీఠ్ ఆలయంలో ఇలాగే ప్రార్థనలు చేసి పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చకు తెరలేపారు. గోపీబల్లవ్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బీజేపీ రాజేశ్ మహతో ఏకంగా భక్తుడి అవతారమెత్తారు. ఝార్గ్రామ్ అటవీ ప్రాంతంలోని పటాశిముల్లో ఇంటింటి ప్రచారానికి ముందు హరి నామ సంకీర్తన పాడారు. గ్రామస్తులతో కలిసి భక్తి గీతాలు ఆలపించారు. సభలో ప్రజలపై గులాల్ చల్లుతూ ఆడుకున్నారు.‘మత్స్య’ రాజకీయాలు బీజేపీ అధికారంలోకి వస్తే మాంసాహారాన్ని నిషేధిస్తుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బిధాన్నగర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శరద్వాత్ ముఖర్జీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సాల్ట్ లేక్‌లోని ఐఏ మార్కెట్లో ఆయన ‘కట్ల’ చేపను చేతిలో పట్టుకుని మరీ ప్రచారం చేశారు. ‘‘బెంగాలీ సంస్కృతిలో చేపలు, అన్నం ప్రధానాహారం. అలాంటిది, బీజేపీ గెలిస్తే చేపలను తినకుండా నిషేధం విధిస్తుందని టీఎంసీ తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘బెంగాలీలకు చేప ఆహారం మాత్రమే కాదు. మన సంప్రదాయం. మన గుర్తింపులో ఒక భాగం. చేప లేకుండా ఏ శుభకార్యమూ ప్రారంభం కాదు. చివరకు పెళ్లి పత్రికలతో కూడా చేపను పంపిస్తారు. అందుకే చేప ద్వారానే నా ప్రత్యర్థులకు సందేశం పంపాలనుకుంటున్నా. చేపలు, అన్నంపై నిషేధం సంగతి అలా ఉంచితే... ప్రజలు కనీసం ఒక చేప ముక్కను కూడా కొనలేని దుస్థితిని టీఎంసీ పాలన తీసుకొచ్చింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలు రెండింతలు ఎక్కువగా చేపలు తినగలుగుతారు’ అని పేర్కొన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ టికెట్ అడిగా: ఆర్జీ కర్ బాధితురాలి తల్లి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని రేప్, హత్య ఘటనలో బాధితురాలి తల్లికి ఈసారి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. పనిహాతీ నియోజకవర్గం నుంచి ఈమెను బరిలో దింపాలని విపక్ష బీజేపీ గతంలో నిర్ణయించుకున్నా అందుకు అప్పట్లో ఈమె తన సమ్మతి తెలపలేదు. తాజాగా రంగంలోకి దూకాలని నిర్ణయించుకున్నట్లు ఆమె గురువారం ప్రకటించారు. ‘‘మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే హత్యాచార ఘటనలో మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. నా కూతురు విషయంలో న్యాయపోరాటంలో భాగంగా బరిలోకి దిగుతా. పనిహాతీ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వాలని బీజేపీ నాయకులను వ్యక్తిగతంగా అడిగాను. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ నాకు అవకాశం కల్పిస్తే బెంగాల్లో తణమూల్ ప్రభుత్వాన్ని ఓడించి మహిళలకు భద్రత కల్పించడానికి ప్రయత్నిస్తాను’’ అని ఆమె అన్నారు. కాగా, బీజేపీ తాజాగా విడుదల చేసిన బీజేపీ రెండో జాబితా లోనూ ఆమె పేరు లేదు.కచ్చితంగా టికెట్ వస్తుందిబాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. తన భార్య అభ్యర్థిత్వం గురించి బీజేపీ నాయకులతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయన్నారు. తాము లాంఛనంగా పార్టీలో చేరిన తర్వాతే తన భార్యను అభ్యర్థిగా ప్రకటిస్తారని వెల్లడించారు. తమకు కచ్చితంగా పోటీ చేసే అవకాశం బీజేపీ కల్పిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం పోరాడటానికే తన భార్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తోందని చెప్పారు. 112 మందితో బెంగాల్లో బీజేపీ రెండో జాబితా న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ శాసనసభలో పోటీచేసే 112 మంది అభ్యర్థులతో బీజేపీ తమ రెండో జాబితాను గురువారం విడుదలచేసింది. హింగాల్‌గంజ్‌లో రేఖా పాత్రాను, సోనార్పూర్ దక్షిణ్‌లో రూపా గంగూలీని బీజేపీ బరిలోకి దింపుతోంది. ఇతాహర్లో సబితా బర్మన్, నబగ్రామ్‌లో దిలీప్ సాహా, ఖర్గ్రామ్లో మిథాలీ మాల్, కండీలో గర్గీదాస్ ఘోష్‌ను పోటీకి నిలబెడుతున్నట్లు బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది.భరత్పూర్ నుంచి అనామికా ఘోష్, బొంగావ్ దక్షిణ్ నుంచి స్వపన్ మజూందర్, కమర్హాతిమ్ నుంచి అరూప్ చౌదరీ, సందేశ్‌ఖాలీ నుంచి సనత్ సర్దార్, మందిర్బజార్ నుంచి మల్లికా పైక్, ఎంటలీ నుంచి ప్రియాంకా తిబేరేవాల్, బాలాగఢ్ నుంచి సుమనా సర్కార్ పోటీకి నిలబడుతున్నారు. చదవండి: కేరళ సీఎం విజయన్ ఆస్తులు ఎంతో తెలుసా? -
రెండు దశల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరో దశ సమావేశాల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కోల్‌కతాలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో అధికార టీఎంసీ మినహా, రాష్ట్రంలోని చాలా రాజకీయ పార్టీలు ఒకటి లేదా రెండు దశల ఎన్నికలు కోరాయని, భద్రతా దళాల అధికారులు కూడా ఇలాంటి సూచనలే చేశారని చెప్పారు.పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికలకు సంబంధించిన హింసను అరికట్టడం సులభమవుతుంది. తుది నిర్ణయం తీసుకునే ముందు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారని ఆయన అన్నారు. ‘288 సీట్లున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాం. పశ్చిమ బెంగాల్లోనూ ఒకే దశలో నిర్వహించడం అసాధ్యమైతే కాదు. అయితే.. ఇక్కడ భద్రతా అంశాల దృష్ట్యా అది అసంభవం అనిపిస్తోంది’ అని అన్నారు.ఎన్నికల సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఈసీకి ప్రధాన ఆందోళనగా మారాయని, అయితే గట్టి నిఘా ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు హామీ ఇచ్చారని అధికారి తెలిపారు.చదవండి: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటూ.. -
బెంగాల్లో మూడేళ్లలోనే ఎన్నికలు.. ‘ముందస్తు’పై బీజేపీ హింట్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టి అధినేత్రి మమతా బెనర్జీ పాపులర్ డైలాగ్ ‘ఖేలా హోబ్’(ఆట ఆడదాం)ను తిరిగి టీఎంసీపైనే ప్రయోగిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు ఆట ఆడాల్సి ఉందని పేర్కొంది. తాము అహింసను నమ్ముతామని నొక్కి చెప్పారు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సుకంతా మజుందర్. అయితే, తమను రెచ్చగొడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బర్రక్‌పోరాలో నిర్వహించిన బహిర సభలో ఈ మేరకు టీఎంసీపై విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్ర ఆస్తులను అమ్మేస్తున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని భరోసా ఇస్తున్నా. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా నేను ఆశ్చర్యపోను.’ అంటూ ముందస్తు ఎన్నికలపై హించ్ ఇచ్చారు బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మజుందర్. 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల కేసుల్లో సుమారు 300 మంది టీఎంసీ కార్యకర్తలు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. మరింత మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చిరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఏ స్థాయిలో ఉన్నా.. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నంత వరకు తప్పించుకోలేరని పేర్కొన్నారు. పోలీస్ బలగాలు తటస్థంగా ఉండేలా లోక్‌సభలో బిల్లు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: కోవిడ్ అప్డేట్.. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మందిలో రోగనిరోధక శక్తి -
Mamata Banerjee: భారత్‌ను రక్షించిన బెంగాల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ తన తీర్పుతో భారతదేశాన్ని రక్షించిందని తృణమూ ల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం మమతా బెనర్జీ అన్నారు. శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి అఖండ విజయం కట్టబెట్టిన బెంగాల్ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె ఆదివారం సాయంత్రం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. కోవిడ్–19 మహమ్మారిని అరికట్టడమే తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడా విజయోత్సవాలు జరపొద్దని పార్టీ శ్రేణుల కు విజ్ఞప్తి చేశారు. ఇది బెంగాల్ ప్రజల విజయం, ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్యానించారు. ఈరోజు భారత్‌ను బెంగాల్ కాపాడిందని పేర్కొ న్నారు. మానవత్వాన్ని సైతం రక్షించిందని వివరిం చారు. ఎన్నో అవాంతరాలకు ఎదురొడ్డి నిలిస్తే ఈ గెలుపుదక్కిందని వెల్లడించారు. కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, యంత్రాం గానికి వ్యతిరేకంగా పోరాటం సాగించామని గుర్తుచేశారు. డబుల్ ఇంజన్ కాదు.. డబుల్ సెంచరీ ఎన్నికల సంఘం(ఈసీ) తీరుపైనా దీదీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈసీ తమ పార్టీని వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా డబుల్ ఇంజన్ ప్రభుత్వం గురించి మాట్లాడగా, ఎన్నికల్లో తమ పార్టీ డబుల్ సెంచరీ సాధించిందని వ్యాఖ్యానించారు. 2021లో 221 సీట్లు సాధించాలని ఆశించామని, లక్ష్యానికి చేరువయ్యా మని చెప్పారు. నందిగ్రామ్‌లో ఓట్ల లెక్కింపులో గందరగోళం జరిగిందని, దీనిపై కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. బెంగాల్లో గొప్ప విజయం సాధించామని, అదే సమయంలో నందిగ్రామ్ ప్రజల తీర్పును గౌరవిస్తానని పేర్కొన్నారు. వారి తీర్పు ఏదైనప్పటికీ అంగీకరిస్తానని తెలిపారు. భారతీయులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాల్సిందే ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని మమతా బెనర్జీ తెలిపారు. పూర్తిగా కోలుకుంటానని, కాలుకు కట్టు (ప్లాస్టర్) తొలగిస్తానని కొద్ది రోజుల క్రితమే చెప్పానని అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. బెంగాల్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తానని పునరు ద్ఘాటించారు. ప్రతి భారతీయుడికి ఉచితంగా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని 140 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వడానికి రూ.30,000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఉచిత టీకా విషయంలో తన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే కోల్‌కతాలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ధర్నాలో కూర్చుంటానని హెచ్చరించారు. ఎన్నికల్లో తమ పార్టీకి అద్భుతమైన విజయం దక్కినప్పటికీ ప్రమాణ స్వీకారం నిరాడంబరంగానే చేస్తానని చెప్పారు. ఆర్భాటానికి దూరంగా ఉంటామన్నారు. కరోనా ఉధృతి కారణంగా విజయోత్సవాలకు సమయం లేదని, మహమ్మారిని అరికట్టడంపైనే దృష్టి పెడతానని వివరించారు. ఈ ముప్పు తొలగిపోయాక కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మెగా ర్యాలీ నిర్వహిస్తామన్నారు. -
బెంగాల్: ముగిసిన తుది విడత పోలింగ్
► బెంగాల్ లో నేడు జరుగుతున్న తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటల వరకు 76.07 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బీభం: 81.82 శాతం కోల్‌కతా నార్త్: 57.85 శాతం మాల్డా: 79.98 శాతం ముర్షిదాబాద్: 78.09 శాతం ► బెంగాల్ తుది విడత పోలింగ్ లో భాగంగా నేడు జరుగుతున్న ఎన్నికల్లో సా.5.30 గంటల వరకు 76.07 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ► బెంగాల్ తుది విడత పోలింగ్ లో భాగంగా నేడు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం 3గంటల వరకు 68.66 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మాల్డా: 70.85% ముర్షిదాబాద్: 70.91% కోల్‌కతా: 51.40% బీభం: 73.92% ► బెంగాల్లో చివరి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 వరకు 37.80 శాతం పోలింగ్ నమోదైంది.ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్నారు. ► ఉదయం 9:30 వరకు 16.04 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ► పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. నటుడు మిథున్ చక్రవర్తి ఉత్తర కోల్‌కతాలోని కాశిపూర్-బెల్గాచియా పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుక్నురు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ఇంత ప్రశాంతంగా గతంలో ఎప్పుడూ ఓటు వేయలేదని తెలిపారు. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చివరి విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం 11,680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆఖరి విడత ఎన్నికల బరిలో 283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాస్క్‌లు, సానిటైజర్లు పోలింగ్ కేంద్రాల ముందు ఏర్పాటు చేశారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. చదవండి: లాక్డౌన్ ఉంది ఎలా బతకాలి?.. 'ఆకలితో చస్తే.. చావు' -
బెంగాల్ నాలుగోదశ ఎన్నికల పోలింగ్ లో హింస
-
మమత పాలనలో నిర్మమత
హల్దియా: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మమతా బెనర్జీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో అమలు చేయడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి రాష్ట్ర ప్రజలు మమత(ఆప్యాయత)ను కోరుకుంటే గత పదేళ్లలో నిర్మమత(క్రూరత్వం) దక్కిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అధికార దుర్వినియోగానికి పర్యాయపదంగా మారిపోయిందని దుయ్యబట్టారు. గత పదేళ్లలో ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందన్నారు. అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. ‘‘భారత్ మాతాకీ జై అని నినదిస్తే సీఎం మమతా బెనర్జీ కోపగించుకుంటున్నారు. హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న ప్రజలపై ఆగ్రహిస్తున్నారు. దేశాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి కుట్రలు జరుగుతుంటే మమతా బెనర్జీ నోరు విప్పడం లేదు’’ అని మోదీ విమర్శించారు. వన్ నేషన్.. వన్ గ్యాస్గ్రిడ్ ప్రధాని మోదీ హల్దియాలో చమురు, సహజ వాయువు రంగాలకు సంబంధించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆదివారం జాతికి అంకితం చేశారు. ఇందులో 348 కిలోమీటర్ల డోభీ–దుర్గాపూర్ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ కూడా ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘గెయిల్’ నిర్మించింది. ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్‌ను మోదీ ప్రారంభించారు. భారతీయ తేనీరుపై అంతర్జాతీయ కుట్ర భారతీయ తేనీరును అప్రతిష్టపాలు చేయడానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ కుట్రకు అస్సాంలోని టీ కార్మికులు ధీటైన జవాబు ఇస్తారని అన్నారు. తేయాకు ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అస్సాంలో ప్రధాని మోదీ ఆదివారం పర్యటించారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే రెండోసారి. రాష్ట్రంలో రూ.8,210 కోట్లతో రహదారులను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ‘అసోంమాలా’ పథకాన్ని ప్రారంభించారు. రెండు వైద్య కళాశాలల నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఆయన.. తేయాకు రంగానికి కేంద్ర బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. అస్సాంలో ప్రతి టీ కార్మికుడికి రూ.3,000 చొప్పున సాయం అందిస్తున్నామని వెల్లడించారు. గత ఐదేళ్లలో అస్సాం గణనీయంగా అభివృద్ధి సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. మౌలిక వసతులు మెరుగయ్యాయని అన్నారు. ఐదేళ్లలో కొత్తగా ఆరు మెడికల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు. అధునాతన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. -
బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి: అమిత్ షా
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం బీజేపీని ఎంచుకున్నారని అన్నారు. అమిత్ షా ఆదివారం బోల్పూర్లో రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి తృణమూల్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. ‘ఈ రోడ్ షో మమతా దీదీ పట్ల బెంగాల్ ప్రజలు కోపాన్ని చూపిస్తోంది. ఇలాంటి రోడ్ షో నా జీవితంలో చూడలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల బెంగాల్ ప్రజల నమ్మకం, ప్రేమ ఈ రోడ్ షో చూపిస్తోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్ పాలన చూశారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అయిదేళ్లలో స్వర్ణ బెంగాల్ సాధిస్తాం’ అని అమిత్ షా అన్నారు. అంతకు ముందు ఆయన విశ్వభారతి యూనివర్శిటీని సందర్శించారు. ఆ తర్వాత బెంగాలీ ఫోక్ సింగర్ నివాసంలో అమిత్ షా మధ్యాహ్న భోజనం చేశారు. (అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి సువెందు అధికారి) కాగా 2021 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ శరవేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పశ్చిమ బెంగాల్లో పర్యటించిన విషయం విదితమే. మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో 294 అసెంబ్లీ సీట్లలో 200 మేర స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. (మమతకు వరుస షాక్‌లు.. స్పీకర్ ట్విస్టు!) -
అసదుద్దీన్ ఒవైసీ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించింది. ఈమేరకు ఏఐఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ నేతలతో శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను వారితో చర్చించారు. బెంగాల్ ప్రతినిధులతో ఈరోజు ఫలవంతమైన చర్చలు జరిగాయని అసదుద్దీన్ ట్విటర్లో పేర్కొన్నారు. బెంగాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉన్నతికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. సమావేశానికి హాజరైన నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక వచ్చే ఏడు జరగునున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీచేస్తామని ఏఐఎంఐఎం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీకి దిగుతుండటంతో ఆయా పార్టీల్లో కలవరం మొదలైంది. తమ ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి ఎంఐఎం ఏ విధంగా చేటు చేస్తుందోనని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎంఐఎం దెబ్బతో బిహార్‌లో మహాఘట్ బంధన్‌ను అధికారానికి దూరం చేసింది. ఆర్జేడీకి సంప్రదాయ ఓటు బ్యాంకులో యాదవులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు. ఐదు స్థానాల్లో గెలుపొందడమే కాకుండా.. చాలా స్థానాల్లో ఆర్జేడీ ఓట్లను చీల్చింది. ఇదిలాఉండగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బెంగాల్లో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. టీఎంసీ వర్గాలే ఈ దాడికి పాల్పాడ్డాయని బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ఎంఐఎం కూడా రంగంలోకి దిగడంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. జాతీయ స్థాయిలో విస్తరణ ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఎంఐఎం.. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న సంకల్పంతో ఒక్కో రాష్ట్రంలో అడుగు మోపుతుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో వేళ్లూనుకుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబర్చి అదే ఉత్సాహంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి సై అంది. బెంగాల్ అసెంబ్లీలో కనీసం 20 మంది ఎంఐఎం సభ్యులుండేలా ఓవైసీ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీమాంచల్ ప్రాంతంతోపాటు.. 24 పరగణాలు, అసన్సోల్ వంటి ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీకి బలమైన కేడర్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముస్లింల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను ఎంఐఎం టార్గెట్ చేస్తోంది. -
మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో కలిసి పోటీ చేయడానికి ఏఐఎంఐఎం ముందుకొచ్చింది. ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదించారు. బిహార్‌లో తన పార్టీ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్న అసదుద్దీన్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పావులు కదుపుతున్నారు. బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో 5 సీట్ల గెలుపుతో ఎంఐఎం ఉత్సాహంగా ఉంది. అందుకే పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లోనూ తన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్లు ఒవైసీ ప్రకటించారు. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, దక్షిణ 24 పరగణా జిల్లాలపై ఒవైసీ దృష్టిసారించారు. ఈ ఐదు జిల్లాల్లో సుమారు 60కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మమతాకు ఎంత నష్టం? బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం ఎంట్రీని తృణమూల్ కాంగ్రెస్ తమ ఓటు బ్యాంకుకు ముప్పుగానే భావిస్తోంది. బిహార్ ఎన్నికల్లో సంచలనంగా మారిన మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో, బెంగాల్లో తమకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలను ఒవైసీ తన వైపు తిప్పుకుంటారని టీఎంసీ, కాంగ్రెస్‌లకు ఆందోళన మొదలైంది. పశ్చిమ బెంగాల్లో 24 శాతం బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఉండగా, 6 శాతం హిందీ మాట్లాడే ముస్లింలు ఉన్నారు. వాస్తవానికి, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీల మ«ధ్యే జరగనుంది. అదే సమయంలో కాంగ్రెస్, వామపక్షాలు సైతం మమతాతో పోరాడుతున్నాయి. ఇలాంటి త్రికోణ పోటీ మధ్యలో, ఎంఐఎం దీటైన అభ్యర్థులతో బెంగాల్ ఎన్నికల బరిలో దిగితే, బిహార్‌లో మహాకూటమి మాదిరిగా మమతా బెనర్జీ ప్రత్యక్ష నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటుబ్యాంకును దెబ్బతీసేందుకు ఎంఐఎంను కమలదళం రంగంలోకి దింపిందని టీఎంసీ నేతల వాదన. బీజీపీ బీ–టీంగా పనిచేస్తూ, లౌకిక పార్టీల ఓటుబ్యాంకుకు నష్టం చేకూర్చటమే ఎంఐఎం లక్ష్యమని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. -
రూపా గంగూలీపై రజాక్ అనుచిత వ్యాఖ్యలు
కోల్ కతా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార టీఎంసీ, బెంగాల్ లో చోటు కోసం పాకులాడుతోన్న బీజేల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే వాగ్బాణాలు కాస్తా గతితప్పి, మహిళలను కించపరిచేస్థాయికి దిగజారాయి. ప్రముఖ నటి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రూపా గంగూలీపై టీఎంసీకి చెందిన వృద్ధ నేత రజాక్ మొల్లా అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనాదరణ పొందిన 'మహాభారత్' సీరియల్ లో ద్రౌపతి పాత్రలో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రూపా గంగూలీ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హౌరా (నార్త్) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆ స్థానంలో ప్రముఖ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా (టీఎంసీ)ను ఆమెను ఢీకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో పోరు హోరాహోరీగా మారింది. ఇతర నాయకులు కూడా తమ అభ్యర్థుల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బుధవారం టీఎంసీ ప్రచారసభలో పాల్గొన్న ఆ పార్టీ నేత రాజక్ మొల్లా, రూపా గంగూలీని ఉద్దేశించి.. 'ఆమె తాగే సిగరెట్ పొడవు ఎంతుంటుందో నాకు తెలుసు. సీరియల్ పాత్రలోనే కాదు నిజజీవితంలోనూ ఆమె ద్రౌపతే' అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని రజాక్.. తమ అధినేత్రి మమతా బెనర్జీపైనా, మరో నటి మున్ మున్ సేన్ పైనా అసహనపూరిత వ్యాఖ్యలు చేశారు. మున్ మున్ సేన్ ను పార్లమెంట్ (రాజ్యసభకు) పంపాలని మమత భావిస్తున్నదని, అయితే మున్ మున్ లాంటి సెలబ్రిటీలు ఎంపీలుగా ఏమాత్రం పనికిరారని, వారికి ప్రజాసమస్యలపై అవగాహన ఉండదని, అందుకే మమత ఆపని చేయకూడదని కోరుకుంటున్నట్లు రజాక్ చెప్పారు. అసలే ఎన్నికల సమయం కావటంతో రజాక్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఒక మహిళ నేతృత్వంలో నడిచే పార్టీ నాయకులు మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దారుణమని, రజాక్ తనను అవమానించారని, ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని రూపా గంగూలీ అన్నారు. -
ఈసారి ఒంటరిగానే పోటీ చేస్తాం
ఎన్నికల షెడ్యూలు అలా విడుదల అయ్యిందో లేదో... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే తన పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు. ఆరు దశల్లో పశ్చిమబెంగాల్‌కు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని మమత చెప్పారు. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు బైచుంగ్ భూటియా ఈసారి సిలిగురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నారు. అలాగే ఉత్తర హౌరా నుంచి లక్ష్మీరతన్ శుక్లా, బాలీ నుంచి వైశాలి దాల్మియా పోటీ చేస్తారని ఆమె అన్నారు. 2011 ఎన్నికలలో తమ పార్టీ తరఫున మొత్తం 31 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారని, ఈసారి వారి సంఖ్య 45కు పెరిగిందని మమత వివరించారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్‌కు 2011లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్‌యూసీ పార్టీలతో కలిసి టీఎంసీ పోటీచేసింది. అప్పట్లో ఈ కూటమికి మొత్తం 227 స్థానాలు వచ్చాయి. టీఎంసీ ఒక్కటీ విడిగా 184 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీకి 42, ఎస్యూసీకి ఒక స్థానం దక్కాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావల్సిన మెజారిటీ సొంతంగానే దక్కడంతో ఈసారి ఒంటరిపోరువైపే మమత మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.


