అంగ.. వంగ.. కళింగ..!  | Anga, Banga, Kalinga will have BJP governments next month | Sakshi
Sakshi News home page

అంగ.. వంగ.. కళింగ..! 

Apr 25 2026 5:48 AM | Updated on Apr 25 2026 5:48 AM

Anga, Banga, Kalinga will have BJP governments next month

వచ్చే నెలలో ఈ మూడు చోట్లా ఉండేది బీజేపీ ప్రభుత్వాలే: అమిత్‌ షా 

కోల్‌కతా: బెంగాల్‌లో మొదటి విడత ఓటింగ్‌ సరళిని చూస్తే ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. ప్రాచీన సామ్రాజ్యాలు, ప్రస్తుత తూర్పు భారత రాష్ట్రాలైన అంగ(బిహార్‌), వంగ(బెంగాల్‌), కళింగ(ఒడిశా)ల్లో వచ్చే నెలలో ఉండేది బీజేపీ ప్రభుత్వాలేనని ఆయన ప్రకటించారు. 

కోల్‌కతాలో శుక్రవారం మంత్రి అమిత్‌ షా మీడియాతో మాట్లాడారు. బెంగాల్‌లో మొదటి దశలో పోలింగ్‌ జరిగిన 152 సీట్లకుగాను బీజేపీ 110పైగా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయం 92 శాతం మంది ఓట్లేసి ఈసారి సునామీ సృష్టించారు. సీట్లు, మెజారిటీ ఎక్కువగానే ఉండొచ్చు’అంటూ అంచనా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement