రూ. 130 కోట్ల మాజీ క్రికెటర్‌ లగ్జరీ బంగ్లా : అదుర్స్‌ | Rs 130 crore Former cricketer Virender Sehwag bungalow interesting facts | Sakshi
Sakshi News home page

రూ. 130 కోట్ల మాజీ క్రికెటర్‌ లగ్జరీ బంగ్లా : అదుర్స్‌

Apr 24 2026 6:52 PM | Updated on Apr 24 2026 7:45 PM

Rs 130 crore Former cricketer Virender Sehwag bungalow interesting facts

సాక్షి, న్యూఢిల్లీ:  భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, 'నజఫ్‌గఢ్ నవాబ్' నివాసముండే బంగ్లా 'కృష్ణ నివాస్' విశేషాలు  నెట్టింట  సందడిగా మారాయి. న్యూఢిల్లీలోని విలాసవంత మైన ప్రాంతమైన హౌజ్ ఖాస్‌(Hauz Khas) లో 'కృష్ణ నివాస్' అనే విశాలమైన బంగ్లాలో నివసిస్తోంది సెహ్వాగ్‌ కుటుంబం.  ఢిల్లీ లాంటి  నగరంలో ఇంత పెద్ద పచ్చని తోట ఉండటం చాలా అరుదు. అద్భుతమైన ఇంటీరియర్‌తో అందంగా తీర్చిదిద్దిన ఆయన నివాసానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలంటే  ఈ కథనం చదవాల్సిందే.

సెహ్వాగ్ తన తల్లి పేరు మీద ఈ బంగళాకు 'కృష్ణ నివాస్' అని పేరు పెట్టారు. బంగ్లా విలువ సుమారు రూ. 130 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో 12 విలాసవంతమైన గదులు, ఒక పెద్ద తోట, అలాగే ఆయన తన కుటుంబంతో సమయం గడిపే ఒక పార్క్ ఉన్నాయి.   ఉండే ఈ ఇంటిలో జంతువుల కోసం ప్రత్యేకంగా లాన్ నిర్మించడం విశేషం.

ఇంటి ప్రత్యేకతలు:
లివింగ్‌ రూమ్ : అతిథులు లోపలికి రాగానే పెద్దదైన, అద్భుతంగా అలంకరించబడిన లివింగ్ రూమ్ కనిపిస్తుంది. సెహ్వాగ్ తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక్కడి ఫోటోలను షేర్ చేస్తుంటారు.

విజిటర్స్ రూమ్: ఈ భవనంలో ప్రత్యేకంగా విజిటర్స్ బుక్ ఉంటుంది. సెహ్వాగ్ ఇంట్లో ఉన్నప్పుడు వంటవారు, ఫిట్‌నెస్ ట్రైనర్లు, అర్చకులు మాత్రమే కాకుండా విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు, జర్నలిస్టులు కూడా వస్తుంటారు.

8 మాస్టర్ బెడ్‌రూమ్‌లు: ఈ ఇంట్లో 8 విశాలమైన మాస్టర్ బెడ్‌రూమ్‌లు ఉన్నాయి, వీటిలో ప్రతి గదికి ప్రత్యేకమైన జాకూజీ (Jacuzzi విశ్రాంతికోసం, హైడ్రోథెరపీ కోసం మసాజ్, బబుల్‌ బాత్‌, నీటిలో మునిగి ఉండే పవర్డ్ జెట్‌ల వ్యవస్థతో కూడిన పెద్ద స్నానపు తొట్టి లేదా పూల్‌) సదుపాయం ఉంది. సెహ్వాగ్ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తారు. దీపావళి వంటి పండుగలను జరుపుకోవడానికి ఇంట్లో అందమైన పూజ గది ఉంది.

స‍్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఏంటంటే..
సెహ్వాగ్ సాధించిన విజయాలకు గుర్తుగా ఒక ప్రత్యేకమైన ట్రోఫీ గది ఉంది. ఇందులో ఆయన ఉపయోగించిన బ్యాట్లు, మెడల్స్, జ్ఞాపికలు మరియు బంగారు పూత పూసిన షీల్డ్‌లు ఉన్నాయి. ఇక్కడ సెహ్వాగ్ తన కుమారులతో క్రికెట్ ఆడటం, యోగా, బ్యాడ్మింటన్ ఆడటం వంటివి చేస్తారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ఏంతో ప్రేమగా నిర్మించుకున్న భవనం కేవలం విలాసానికి చిహ్నం మాత్రమే కాదు, సెహ్వాగ్ కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనం. తల్లి పేరు మీద ఇంటికి పేరు పెట్టడం నుండి, మదర్స్ డే వంటి వేడుకలను ఇక్కడే జరుపుకోవడం వరకు ఈ ఇల్లు సెహ్వాగ్ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ప్రశాంతంగా సమయం గడపడానికి ఈ విశాలమైన ప్రాంగణం  చక్కటి వేదిక అనడంలో సందేహం లేదు

కాగా 2004లో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్‌ను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ సెహ్వాగ్ ఉన్నారు. 2007లో ఆర్యవీర్ సెహ్వాగ్, 2010లో వేదాంత్ సెహ్వాగ్ పుట్టాడు. అయితే దాదాపు 20 ఏళ్ల తరువాత ఇటీవల భార్యతో అభిప్రాయ భేదాల వల్ల సెహ్వాగ్ విడాకులు తీసుకున్నాడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం అతడు వ్యాఖ్యాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement