సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్‌లను భారీగా బదిలీ చేసింది. ఈమేరకు ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ పై ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది మే 1 నుంచి ఈ నియామకాలు అమల్లోకి రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన భారీ IPS అధికారుల బదిలీలలో భాగంగా, డాక్టర్ తరుణ్ జోషి 'ఫ్యూచర్ సిటీ' పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అలాగే బి. సుమతి మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖా గోయల్ నియమితులయ్యారు. దీంతొ పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ ల్యాబ్ అదనపు బాధ్యతలు కొనసాగుతాయి. విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా దేవేంద్ర సింగ్ చౌహాన్ బదిలీ అయ్యారు. మల్టీ జోన్-2 ఐజీపీగా నియమితులైన షాహ్నవాజ్ ఖాసిమ్‌కు పర్సనల్ ఐజీపీ అదనపు బాధ్యతలు అప్పగించారు. సుధీర్ బాబు పదవీ విరమణ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా తరుణ్ జోషి నియమితులయ్యారు. అవినాష్ మహంతి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా బదిలీ కాగా, ఏసీబీ డైరెక్టర్ అదనపు బాధ్యతలను నిర్వర్విస్తారు. కార్తికేయ ఐజీపీ ఇంటెలిజెన్స్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా, ప్రస్తుతం SIB (ఇంటెలిజెన్స్) IGPగా ఉన్న బి. సుమతి నియమితులు కావడం విశేషం.


