ఆరోగ్యకరంగా భావించేవే కేన్సర్‌కి కారణమా..! | A new study Suggests Fruits And Vegetables May Increase Cancer Risk | Sakshi
Sakshi News home page

ఆ పద్ధతిలో పండించే పం‍డ్లు, కూరగాయలతో జరభద్రం..! అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు

Apr 24 2026 12:31 PM | Updated on Apr 24 2026 1:12 PM

A new study Suggests Fruits And Vegetables May Increase Cancer Risk

ఇన్నాళ్లు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఆరోగ్యానికి మంచివని చెబుతుండేవారు పోషకాహార నిపుణులు. కానీ ఇప్పుడు అవే ప్రమాదకరమైనవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఊపితిత్తుల కేన్సర్‌ స్మోకింగ్‌ చేసేవాళ్లకే వస్తుందనేది జగమెరిగిన సత్యం. కానీ చాలా కేసుల్లో ధూమపానం చేయకుండానే ఈ వ్యాధి బారినపడ్డట్లు తేలింది. అందుకు గల కారణాలు తెలిస్తే విస్తుపోవాల్సిందే.

యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC) పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం..పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండే ఆహారాన్నే అధికంగా తీసుకున్న యువకులలోనే ఊపిరితిత్తుల కేన్సర్‌ అధికమని తేలింది. దీనికి ప్రధాన కారణం సాంప్రదాయ పద్దతలిలో పండించకపోవడమేనని చెబుతున్నారు పరిశోధకులు. ఫెర్టిలైజర్లు ఉపయోగించి పండించిన పండ్లు, కూరగాలు, తృణధాన్యాలు తీసుకువడంతో..వాటిపై పురుగుల మందులు అవశేషాలు ఉండటంతో చిన్న వయసులోనే యువత ఈ కేన్సర్‌బారిన పడుతున్నట్లు  వెలడైంది. 

ఈ మేరకు అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ 2026 వార్షిక సమావేశంలో 187 మంది రోగుల ఆహార విశ్లేషణ నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో సుమారు 50 ఏళ్లలోపు వయసున్న రోగులకు ఊపిరితిత్తుల కేన్సర్‌ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. 'హెల్తీ ఈటింగ్ ఇండెక్స్'ను ఉపయోగించి ఆయా రోగుల్లో పరీక్షించగా, వారందరి సగటు స్కోర్‌ 65గా ఉందని అన్నారు. సాధారణ అమెరికన్లతో పోలిస్తే ఈ యువ రోగులు ముదురు ఆకుపచ్చ కూరగాయలు, చిక్కుళ్ళు,తృణధాన్యాలను ఎక్కువగా తీసుకున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. 

ముఖ్యంగా మహిళల్లో ఈ స్కోర్‌ మరింత అధికంగా ఉంది. పాల ఉత్పత్తులు, మాంసం, అనేక ప్రాసెస్‌ చేసిన ఆహారాలతో పోలిస్తే..ఆరోగ్యకరమైనవిగా పిలిచే ఈ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలలోని పురుగుల మందుల అవశేషాల వల్లే ఈ కేన్సర్‌ వచ్చే ప్రమాదం అధికం అని తేలింది. అంతేగాదు ఈ పురుగలమందుల ప్రభావానికి గురైన రైతుల్లో సైతం ఊపిరితిత్తల కేన్సర్‌ వచ్చే అవకాశం అత్యంత అధికంగా ఉందని డాక్టర్‌ జార్జ్‌ నీవా పేర్కొన్నారు. అలాగే చాలామటుకు ఊపిరితిత్తుల కేన్సర్‌ కేసుల్లో స్మోకింగ్‌ కారణం కాదని చెప్పారు. 

పైగా 50 ఏళ్లలోపు ధూమపానం చేయని వారిలో, ముఖ్యంగా మహిళల్లో ఈ కేన్సర్‌ సర్వసాధరంగా మారిందని అన్నారు. అంతేగాదు ఆయా రోగులు ఈ వ్యాధి నిర్థారణకు మందు వరకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నవారేనని చెప్పుకొచ్చారు. ఇదెంత వరకు నిజం అన్న దిశగా దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు శాస్త్రవేత్తలు. కానీ ఈ పరిశోధన ఫెస్టిసైడ్స్‌ వినియోగించకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని హైలెట్‌ చేసింది కదూ..!.

(చదవండి: వ్యాయామం లేకుండానే 12 కిలోలు..! డాక్టర్‌ వెల్‌నెస్‌ మంత్ర)
 

Advertisement
 
Advertisement
Advertisement