ఆధునిక కాలంలో బరువు తగ్గడం అనేది చాలా సమస్యాత్మకంగా మారింది. చాలామంది వెయిట్‌లాస్ అయ్యేలా సర్జరీలు, మందుల వెంట పరిగెడుతున్నారు. మరికొందరు ఆరోగ్యకరంగా తగ్గేందుకు పాట్లు పడుతున్నారు. ఆ క్రమంలో కొందరు ఇతరులకు ప్రేరణ కలిగించేలా అద్భుతంగా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు కూడా. కానీ వాళ్లందరూ చెప్పేది కొద్దికిద్దిగా తింటూ ఎక్కువసార్లు తినమని, మంచి ఆహారపు అలవాట్లు తదితర టిప్స్ ఇస్తే. ఈ వ్యక్తి మాత్రం అత్యంత వింత వెయిట్‌లాస్ చిట్కాలు ఇచ్చాడు. అవి చూస్తే ఇవేం చిట్కాలు అనిపించినా..అంతకుమునుపు, తదుపరి పరివర్తన చూస్తే నిజంగా అవే సరైనవా? అనే ఆశ్చర్యం కలుగకమానదు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామా
కువార్ కపూర్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన వెయిట్‌లాస్ జర్నీని షేర్ చేశారు. తాను ఒకప్పుడు 142 కిలోల బరువు ఉండేవాడినని తెలిపాడు. పైగా కొన్ని రకాల వింత ఫిట్‌నెస్ టిప్స్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తదితరాలు తన వెయిట్‌లాస్ సీక్రెట్ అని చెబుతున్నాడు. వర్కౌట్లు, మంచి ఆహారపు అలవాట్లు వరకు ఓకే. కానీ ఈ వింత ఫిట్‌నెస్ టిప్స్ ఏంటి..?. బరువు తగ్గడానికి అవెలా ఉపయోగపడ్డాయ్?
డైట్ సోడా తాగడం
బరువు తగ్గే ప్రయాణంలో డైట్ కోక్, సోడా, శీతల పానీయాలు, ఇతర చక్కెర పానీయాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కానీ భోజనంతో పాటు డైట్ సోడా తాగడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుందని కువార్ నొక్కి చెప్పారు. కేలరీలు లేని, సాధారణ ఫిజీ డ్రింక్ లాగే రుచిగా ఉండే సోడాను ఎంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడం
భోజనం తర్వాత చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడం వల్ల అతిగా తినాలనే కోరికలను నివారిస్తుందట. కొలెస్ట్రాల్ తగ్గేలా ఎక్కువ కేలరీలు తీసుకోకుండా చేస్తుందట.
ముందుగా ప్రోటీన్
ప్రోటీన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వింతైన చిట్కా కాదు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లకు ఇది చాలా అవసరం. ప్లేట్‌లో ఎల్లప్పుడూ ముందుగాప్రోటీన్, తర్వాత కార్బోహైడ్రేట్లు చేర్చుకోవాలని కువార్ పేర్కొన్నారు.
టీ మాక్సింగ్
రోజంతా ఎక్కువగా కదలడం, ఉదాహరణకు ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు కాలు ఊపడం లేదా అటూ ఇటూ తిరగడం వంటివి, మనకు తెలియకుండానే అదనపు కేలరీలను ఖర్చు చేస్తాయంట. పైగా అనుకున్నదానికంటే వేగంగా కేలరీలు ఖర్చు అవుతాయట.
ఎక్కువగా నిలబడటం
కువార్ ప్రకారం, మీరు స్క్రీన్ చూసే సమయంలో సగం సేపు కేవలం నిలబడటం వల్ల ఎక్కువ శక్తిని ఖర్చు అవుతుందట. జువారీ కేలరీల ఖర్చులో ఇది కూడా చిన్నగా బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట
3-2-1 రూల్..
3-2-1 రూల్ కువార్‌కు మరింత స్థిరంగా కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడింది. దీని ప్రకారం నిద్రపోయే మూడు గంటల ముందు చివరి భోజనం ముగించడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడటానికి సమయం లభిస్తుంది. త్వరిత గతిన బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట. ఇక రెండు గంటలు హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం,ఇక ఒక గంట స్క్రీన్‌టైమ్ కోసం. ఇలా ప్లాన్‌చేస్తే అమాంతం చాలా బరువు తగ్గుతామని చెబుతున్నాడు.
మంచి అరుగుదల కోసం నడక
భోజనం చేసిన వెంటనే ఐదు నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడానికి బదులుగా కండరాలకు చేరవేయడానికి సహాయపడుతుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంటాయి.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. అందరికీ ఈ టిప్స్ వర్తించవు. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్‌లో టాపర్‌గా..!)


