మరణం వరకు వెళ్ళి.. మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి రావడం సాధ్యమేనా? | Patricia Dilts My Pathways to Wholeness Book On Breast Cancer | Sakshi
Sakshi News home page

మరణం వరకు వెళ్ళి.. మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి రావడం సాధ్యమేనా?

Apr 17 2026 9:33 AM | Updated on Apr 17 2026 10:07 AM

Patricia Dilts My Pathways to Wholeness Book On Breast Cancer

Patricia Dilts అనే మహిళకు 1978లో Breast Cancer నిర్ధారణ అయింది. వెంటనే Radical Mastectomy చికిత్స అందించారు. "చికిత్స విజయవంతమైంది, ఆందోళన అవసరం లేదు" అని వైద్యులు ఎంతో నమ్మకంగా చెప్పారు. కానీ కాలం పగబట్టింది. 1982లో క్యాన్సర్ మహమ్మారి తిరిగి దాడి చేసింది. ఈసారి అది మరింత భీభత్సంగా స్కల్, స్పైన్, రిబ్స్, పెల్విస్ వరకు పాకిపోయింది. బోన్ బయాప్సీ రిపోర్టులు చూసిన నిపుణులు చేతులెత్తేశారు. "ఇక మేము చేయగలిగేది ఏమీ లేదు. ఆమెకు చివరి రోజులు సుఖంగా గడిచేలా చూద్దాం" అని తేల్చి చెప్పారు.

కానీ ప్యాట్రిసియా ఆ తర్వాత 13.5 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారు. వారానికి అనేక సార్లు అర మైలు ఈత కొడుతూ, ఐరోపా అంతటా యాత్రలు చేస్తూ, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించారు.

అదెలా సాధ్యం? 
ఒక సైకాలజిస్ట్ గా, న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపిస్ట్ గా, ఈ అసాధారణమైన కేసును నేను కేవలం ఒక అద్భుతంగానో, అదృష్టంగానో పరిగణించను. దీని వెనుక మన Neuro-Biology లో దాగి ఉన్న అపారమైన, నిగూఢమైన శక్తి దాగి ఉంది. దీనిని మనం లోతుగా విశ్లేషించాలి.

అసలైన స్వస్థత ఎక్కడ, ఎలా మొదలవుతుంది?
ప్యాట్రిసియా తన ఈ అసాధారణమైన అనుభవాన్ని My Pathway to Wholeness అనే పుస్తకంలో అక్షరబద్ధం చేశారు. ఆమె ఆ పుస్తకంలో చెప్పిన అతి ముఖ్యమైన, మన కళ్ళు తెరిపించే మాట... "Healing comes from within — it is not a function of techniques. It is the commitment of an individual to release the tremendous natural self-correcting capabilities of the human body."
మన శరీరానికి self-healing శక్తి అద్భుతంగా ఉంది. కానీ ఆ శక్తికి తాళం వేసి ఉంటుంది. ఆ తాళం చెవి మరెక్కడో లేదు, మన మనసులోనే భద్రంగా ఉంది!

వారసత్వంగా వచ్చిన నమ్మకం! 
ప్యాట్రిసియా తల్లి రొమ్ము క్యాన్సర్‌తోనే చనిపోయారు. ఆమె అక్క కూడా అదే విధంగా అకాల మరణం చెందారు. దీంతో ఆమె subconscious mind లో ఒక లోతైన, నిశ్శబ్దమైన, కానీ విధ్వంసకరమైన నమ్మకం పాతుకుపోయింది. మన కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ వస్తే చనిపోవాల్సిందే. ఒకవేళ నేను బతికితే, చనిపోయిన నా తల్లికి, అక్కకు నేను ద్రోహం (disloyal) చేసినట్టే అని ఆమె ఒక ప్రమాదకరమైన సమీకరణాన్ని నిర్మించుకున్నారు. ఇది rational thought కాదు. కానీ ఇది ఆమె nervous system లో చాలా లోతుగా పాతుకుపోయింది. ఇలాంటి ప్రాణాంతక నమ్మకాన్ని కేవలం పైపై మార్పులతో  తొలగించడం సాధ్యం కాదు. Beliefs & Values స్థాయిలో లోతైన మానసిక విశ్లేషణ, పునర్నిర్మాణం జరగాల్సిందే.

ఒక జీవితాన్ని మలుపు తిప్పిన నాలుగు రోజులు
Patricia కుమారుడు, NLP pioneer అయిన Robert Dilts, తన తల్లితో కలిసి నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా ఎన్‌ఎల్‌పి చికిత్స చేశారు. ఆ నాలుగు రోజులూ వారు విరామం లేకుండా పనిచేశారు. పని చేయని సమయాల్లో ఆమె కేవలం ఆహారం తీసుకోవడం లేదా నిద్రపోవడం మాత్రమే చేసేది. అంతటి exhausting inner work అది.

ఆ నాలుగు రోజులలో వారు సాధించిన విజయాలు...
🔹 ఆమె కుటుంబం నుండి వారసత్వంగా వచ్చిన inherited limiting beliefs ను గుర్తించి, వాటిని నిర్మూలించడం.
🔹 ఆమె జీవితంలో ఎదురైన major internal conflicts గుర్తించి, వాటిని పరిష్కరించి, ఒకదానితో ఒకటి అనుసంధానించడం (integrate).
🔹 తనను తాను "ఒక రోగిని" (patient identity) గా భావించే స్థితి నుండి "నేను సంపూర్ణంగా, ఆరోగ్యంగా జీవించే వ్యక్తిని" (wholeness identity) అనే నూతన గుర్తింపుకు మారడం.
🔹ఈ మానసిక మార్పు జరిగిన తక్షణమే, ఆమె శరీరం అద్భుతంగా స్పందించడం మొదలుపెట్టింది. క్యాన్సర్ కణాలు నశించడం, శరీరం స్వస్థత వైపు అడుగులు వేయడం డాక్టర్లను ఆశ్చర్యపరిచింది.

సైన్స్ ఏం చెప్తోంది? — Psychoneuroimmunology
మనం నమ్మే ప్రతి నమ్మకం మన నాడీ వ్యవస్థకు నేరుగా సంకేతాలను పంపుతుంది. ఆ సంకేతాలకు అనుగుణంగా మన మెదడు Neuropeptides విడుదల చేస్తుంది. ఈ న్యూరోపెప్టైడ్లు మన రోగనిరోధక వ్యవస్థను (Immune system) ఉత్తేజపరుస్తాయి లేదా బలహీనపరుస్తాయి.
🔹 "నేను చనిపోతాను" అనే బలమైన నమ్మకం ఉంటే.. శరీరం ఆ నమ్మకానికి లోబడి, పోరాటాన్ని ఆపేసి, వ్యాధికి లొంగిపోతుంది. దీనినే Nocebo Effect అంటారు.
🔹 "నేను బతుకుతాను, ఆరోగ్యం నా హక్కు" అనే దృఢమైన నమ్మకం ఉంటే.. శరీరం ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి తన శక్తులన్నింటినీ సమీకరించి, వ్యాధితో పోరాడుతుంది. దీనినే Mind-Body Medicine అంటారు. ప్యాట్రిసియా చేసిన అద్భుతం ఇదే. ఆమె doctor verdict ను ధైర్యంగా తిరస్కరించింది. తన మనసులో, తన నాడీ వ్యవస్థలో తన మనుగడపై ఒక దృఢమైన, తిరుగులేని expectancy నిర్మించుకుంది.

Wholeness అంటే కేవలం నయమవడం మాత్రమే కాదు!
ప్యాట్రిసియా లక్ష్యం కేవలం "క్యాన్సర్ నయమవడం" (cure) మాత్రమే కాదు. ఆమె దృష్టిలో 'స్వస్థత' అంటే... శరీరం, మనసు, భావోద్వేగ జీవితం, కుటుంబ సంబంధాలు, తన identity... ఇవన్నీ కలిసి ఒక పరిపూర్ణమైన స్థితిగా (wholeness) మారడం. అందుకే ఆమె తన పుస్తకానికి పెట్టిన పేరు "Pathway to Wholeness",  "Pathway to Cure" కాదు. ఈ తేడాను గమనించడం చాలా ముఖ్యం.

జీవితంలో సంక్షోభాలు వివిధ రూపాల్లో రావచ్చు. అవి శారీరక వ్యాధిగా, మానసిక ఒత్తిడిగా, relationship failures, లేదా career collapse గా పరిణమించవచ్చు. కానీ ప్యాట్రిసియా కథ మనకు ఒక స్పష్టమైన, శక్తివంతమైన సత్యాన్ని బోధిస్తుంది. "మీ శరీరం మీకు వ్యతిరేకంగా పని చేసే ముందు, మీ నమ్మకాలు మీకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయా అని ఒకసారి పరీక్షించుకోండి." మీరు మీ అంతర్గత సంభాషణను, మీ మూల నమ్మకాలను మార్చుకోగలిగితే, మీ జీవన గమనాన్ని మార్చుకోగలరు. మీలో స్వస్థత కలిగించే అపారమైన శక్తి ఉంది. ఆ శక్తిని గుర్తించండి!

కౌన్సెలింగ్ సెషన్లలో మేము చేసేది ఇదే... 
🔹 మీ unconsious mindలో పాతుకుపోయిన Limiting Beliefs ను గుర్తించి, వాటిని నిర్మూలించి, కొత్త, అనుకూల నమ్మకాలను ప్రతిష్టించడం.
🔹 Scientific NLP protocols ద్వారా మీ natural resourcefulness అన్‌లాక్ చేయడం.
🔹 శరీరం, మనసు, జీవితం — ఈ మూడింటినీ కలిపి wholeness వైపు, సంపూర్ణ ఆరోగ్యం వైపు నడిపించడం.
-సైకాలజిస్ట్ విశేష్. 

Advertisement
 
Advertisement
Advertisement