ఐపీఎల్ 2026 సీజన్‌తో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ.. హఠాత్తుగా నెట్టింట సరికొత్త చర్చకు దారి తీశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చిన్నదాని ఫొటోలకు లైక్ కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు ఆయన గతంలో చెప్పిన అల్గారిథం వ్యాఖ్యను మళ్లీ తెరపైకి తీసుకువచ్చి, హాస్యాస్పదమైన మీమ్స్‌తో నింపేశారు. ఇంతకీ ఆమె ఎవరంటే..
ఆ ఫొటోలో ఉంది దక్షిణాఫ్రికా ఇన్‌ఫ్లూయెన్సర్ లిజ్‌లాజ్. ఆమె ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్‌గా ఉంటూ, ట్రావెల్ వ్లాగ్స్, లైఫ్‌స్టైల్ కంటెంట్, మ్యూజిక్ వీడియోలు పంచుకుంటుంది. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ ఆద్వైత్ వైద్య ఆమెతో ఫొటో షూట్ చేశాడు. ఆమె వాటిని తన ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. కోహ్లి ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను లైక్ చేయడంతో లిజ్‌లాజ్ పేరు భారతీయ సోషల్ మీడియాలో హఠాత్తుగా ట్రెండింగ్ అయింది.
కిందటి ఏడాది నటి, ఇన్‌ఫ్లుయెన్సర్ అవనీత్ కౌర్ ఫొటోకు కూడా కోహ్లి లైక్ కొట్టడం చర్చనీయాంశమైంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ క్లియర్ చేస్తుండగా.. యాక్సిడెంటల్ జరిగిపోయిందని.. అల్గారిథం వల్లే అయ్యిందని కోహ్లి ఏదో వివరణ ఇచ్చారు.
Photo Courtesy : lizlaz_tv (instagram)


