'నాన్న'గా గర్వించే క్షణం..! | A techie showed the offer letter to his father goes viral | Sakshi
Sakshi News home page

'నాన్న'గా గర్వించే క్షణం..! పిల్లల నుంచి ఆశించేది ఇదేకదా..

Apr 16 2026 12:18 PM | Updated on Apr 16 2026 12:23 PM

A techie showed the offer letter to his father goes viral

పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటే ఏ తల్లిదండ్రులకైనా.. అంతకు మించి కావాల్సింది ఏముంటుంది. అలాంటి క్షణం ఏ నాన్న అంత తేలిగ్గా మర్చిపోలేని జ్ఞాపకం కూడా. అలాంటి అనుభూతినే ఓ టెకీ తండ్రి పొందాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఒక సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజనీర్‌ తన తండ్రికి అమెజాన్‌ ఆఫర్‌ లెటర్‌ చూపిస్తూన్న వీడియో ఇది. అది అందరి దృష్టిని అమితంగా ఆకర్షించడమే గాక ప్రతితల్లిదండ్రులు పిల్లల నుంచి ఆశించేది ఇదే కదా అని నెటిజన్లు అంటుడంటం విశేషం. ఆ వీడియోని శైలేంద్ర యాదవ్‌ అనే టెకీ పంచుకున్నారు. ఆయన ఆ వీడియోకి మా నాన్న నా ఆఫర్‌ లెటర్‌ చదవుతున్నారు అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో టెకీ తండ్రి ఆఫర్‌ లెటర్‌ చదువుతూ కనిపిస్తారు. 

ఇది నాన్నగా గర్వించే క్షణం, హృదయానికి హత్తుకునే ఘటన కూడా అని నెటిజన్లు అభివర్ణిస్తూ పోస్టులు పెట్టారు. ఇక టెకీ శైలేంద్ర పోస్ట్‌లో తాను రైతు కుటంబం నుంచి వచ్చాననని. సరైన విద్యకు అవకాశాలు పరిమితులుగా ఉండే మా కుటుంబంలో ఇంజనీర్‌ అయిన మొదటి వ్యక్తిని తానేనని అన్నారు. తన చదువు కోసం తన తండ్రి ఎన్ని ప్రైవేట్‌ ఉద్యోగాలు చేశారో కూడా చెప్పాడు. 

తనకు ఉత్తమ అవకాశాలు రావడం కోసం చాలా కష్టపడ్డారని అన్నారు. చివరికి  అమెజాన్ నుంచి ఎస్‌డిఇ-2 ఆఫర్‌ను సంపాదించాను. అయితే ఈ విషయాన్ని మాములుగా చెప్పకూడదనిపించి వాలెంటైన్స్‌ డే రోజున చాల సర్ప్రైజ్‌ ఇచేలా చెప్పాను. ఈ గుడ్‌న్యూస్‌ చెప్పడం కోసమే బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లానని అన్నాడు. ఆయన నాకోసం చేసిన వాటన్నింటిలో చాలా చిన్న మొత్తంలో ఇలా తిరిగి ఇచ్చినట్లుగా నాకనపించిందన్నారు.  

(చదవండి: జస్ట్‌ రూ.11 వేల లాటరీ టికెట్‌కి ఏకంగా రూ. 9.3 కోట్లు..!)
 

Advertisement
 
Advertisement
Advertisement