జస్ట్‌ రూ.11 వేల లాటరీ టికెట్‌కి ఏకంగా రూ. 9.3 కోట్లు..! | A Lottery Ticket For Rs 11,000 Is Offering More ThanRs 9 Crore Picasso | Sakshi
Sakshi News home page

జస్ట్‌ రూ.11 వేల లాటరీ టికెట్‌కి ఏకంగా రూ. 9.3 కోట్లు..!

Apr 15 2026 12:34 PM | Updated on Apr 15 2026 12:48 PM

A Lottery Ticket For Rs 11,000 Is Offering More ThanRs 9 Crore Picasso

ఒక్కోసారి మన వెచ్చించే ధరకు వచ్చే వస్తువుకి సంబంధ ఉండదు. ఇలాంటివి ఎక్కువగా లాటరీలోనే జరుగుతుంటుంది. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే లక్కీమ్యాన్‌ అయ్యాడు. 

ఈ ఘటన ప్రాన్స్‌లో  చోటు చేసుకుంది. ప్రాన్స్‌లోని రాఫిల్‌(లాటరీ టికెట్‌ల సంస్థ)లో ఒక వ్యక్తి సుమారు వంద యూరోలు అంటే మన దేశ కరెన్సీలో రూ. 10,984 ధరకే స్పానిష్‌ కళాకారుడైన పికాసో గీసిన చిత్రపటాన్ని గెలుచుకున్నాడు. దీని ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 9.3 కోట్లు విలువ చేస్తుందట. అంత తక్కువ ధరకు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌పై ఏకంగా అన్ని కోట్లు విలువ చేసే చిత్రపటాన్ని గెలుచుకుని రాత్రికిరాత్రే అదృష్టవంతుడిగా మారిపోయాడు. అయితే దీని ద్వారా వచ్చే ఆదాయన్ని అల్జీమర్స్‌ పరిశోధనకు వినియోగిస్తారట. 

అంటే ఈ గెలుచుకున్న చిత్రపటాన్ని పారిస్‌లోని క్రిస్టీస్‌ వేలం నిర్వహిస్తారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని అందరికీ ఉపయోగపడేలా ఆ వ్యాధిపై పరిశోధనలకు వినియోగిస్తారట. కాగా, కాగితంపై ఉన్న ఒక మహిళ తల మాదిరిగా కనిపిస్తున్న ఈ గౌహష్‌ చిత్రాన్ని 1940లో చిత్రించారు. ఇలాంటి ఘటన తొలిసారేం కాదు. గతంలో కూడా స్పానిష్ కళాకారుడైన పికాసో  క్యూబిస్ట్ కాలంలో 1914లో చిత్రించిన “మ్యాన్ ఇన్ ది ఒపెరా హ్యాట్” చిత్రాన్ని పెన్సిల్వేనియాకు చెందిన ఒక ఫైర్-స్ప్రింక్లర్ వ్యాపారంలో పనిచేసే వ్యక్తి గెలుచుకున్నాడు. 

కాగా, రాఫిల్ (Raffle) అనేది ఒక రకమైన అదృష్ట లాటరీ లేదా పోటీ. ఇందులో పాల్గొనేవారు టిక్కెట్‌లను కొనుగోలు చేస్తారు, ఆ టిక్కెట్‌ల నుండి యాదృచ్ఛికంగా (randomly) విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. ఇది సాధారణంగా నిధుల సేకరణ (fundraising) కోసం లేదా స్వచ్ఛంద సంస్థల కోసం నిర్వహిస్తారు. ఇక ఈ ఛారిటీనికి అల్జీమర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధికారులు నిర్వహిస్తున్నారు. ఇది అల్జీమర్ సంబంధిత వైద్య పరిశోధనలకు నిధులు సమకూర్చే అగ్రగామి ప్రైవేట్‌ సంస్థగా అవతరించించి.  

(చదవండి: 98 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా బామ్మ..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement