breaking news
france
-
ఫ్రాన్స్,స్పెయిన్‌లను దహిస్తోన్న కార్చిచ్చు
పారిస్: ఫ్రాన్స్,స్పెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో భీకర కార్చిచ్చు దహించివేస్తోంది. ఇప్పటి వరకు రెండు దేశాల్లో 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం గిరాండ్‌లో సుమారు 42వేల హెక్టార్ల మేర అడవి కాలిపోయింది. సమీప 240 ఇళ్లు కాలిపోయాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన 75 మంది సిబ్బంది గాయపడ్డారు. 18 విమానాలు, హెలికాప్టర్లతో 2,500కి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బోర్డో నగర ప్రధాన రహదారిని పాక్షికంగా మూసేశారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ చుట్టుపక్కల కార్చిచ్చు వ్యాపించింది. స్పెయిన్‌లో 76వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాలెన్సియా శివారు ప్రాంతం మనిసెస్లో కార్చిచ్చులో ఒకరు మరణించారు.ఓరెగాన్‌లో వ్యాపిస్తున్న కార్చిచ్చుఅమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రం వార్మ్ స్ప్రింగ్స్ సమీపంలో బెంచ్ఫైర్ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. దీంతో, ఆ ప్రాంత జెఫెర్సన్ కౌంటీ నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ అధికారులు హెచ్చరికలు చేశారు. వార్మ్ స్ప్రింగ్స్ సమీపంలోని 26వ నంబర్ రహదారిని అధికారులు మూసివేశారు. -
ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు భారీ జరిమానా..
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్‌లోని కార్మిక నియంత్రణ సంస్థ 1.75 లక్షల యూరోలు (సుమారు రూ.1.75 కోట్లు) జరిమానా విధించింది. కంపెనీ ఉపయోగిస్తున్న ఉద్యోగుల వర్కింగ్ టైమ్ రికార్డింగ్ సిస్టమ్ ఫ్రెంచ్ కార్మిక చట్టాలకు పూర్తిగా అనుగుణంగా లేదని అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ జూలై 25న స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.ఫ్రెంచ్ అధికారుల పరిశీలనలో, కొందరు ఉద్యోగుల పని గంటలను ఖచ్చితంగా నమోదు చేయడం, ఆడిట్‌కు అనుకూలంగా భద్రపరచడం, సమర్థవంతంగా పర్యవేక్షించడం వంటి అంశాల్లో కంపెనీ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు తేలింది. దీంతో మొత్తం 175,000 యూరోలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ లోపాలు ఏ విభాగానికి చెందిన ఉద్యోగులకు సంబంధించినవో, వ్యవస్థలో మార్పులు చేయాలని ఆదేశించారా లేదా అనే వివరాలను ఇన్ఫోసిస్ వెల్లడించలేదు.అయితే ఈ పరిణామం తమ ఆర్థిక ఫలితాలు, కార్యకలాపాలు లేదా వ్యాపారంపై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం చూపదని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. జరిమానా సమాచారం అందిన వెంటనే బహిరంగంగా వెల్లడించకపోవడానికి కారణంగా, ముందుగా సమాచారాన్ని ధ్రువీకరించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.యూరప్‌లో ఉద్యోగుల పని గంటల నమోదు, విశ్రాంతి సమయాలు, ఓవర్‌టైమ్ వంటి అంశాలపై కార్మిక చట్టాలు అత్యంత కఠినంగా అమలవుతాయి. ఈ నేపథ్యంలో బహుళజాతి సంస్థలు స్థానిక నిబంధనలకు అనుగుణంగా తమ హెచ్ఆర్, టైమ్-ట్రాకింగ్ వ్యవస్థలను నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. తాజా జరిమానా కూడా అదే తరహా కంప్లయన్స్ లోపాలకు సంబంధించినదేనని ఇన్ఫోసిస్ వెల్లడించింది. -
ఫ్రాన్స్, స్పెయిన్‌లను చుట్టేసిన కార్చిచ్చు
ఆర్కకాన్ (ఫ్రాన్స్): యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్, స్పెయిన్లు కార్చిచ్చుల సమస్యతో అట్టుడికిపోతున్నాయి. రెండు దేశాల్లోనూ కనీసం రెండు లక్షల అరవై వేల మందిని మంటల నుంచి రక్షించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మంటలను అదుపు చేయడం కష్టమైన నేపథ్యంలో శుక్రవారం ఫ్రాన్స్‌లోని బోర్డాక్స్, స్పెయిన్‌లోని మాడ్రిడ్ నగరాల పరిసరాల్లో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతోపాటు వాతావరణంలో వస్తున్న దీర్ఘకాలిక మార్పుల కారణంగా కార్చిచ్చులు చెలరేగిపోతున్నాయి. మంటలార్పేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలు దాని తీవ్రత ముందు నెరవేరడం లేదని స్పెయిన్ అగ్నిమాపక దళ సిబ్బందికి చెందిన కొందరు అధికారులు వాపోయారు. అట్లాంటిక్ సముద్రతీర ప్రాంతంలోని పర్యాటక ప్రాంతంలో కార్చిచ్చుల నుంచి తప్పించుకునేందుకు పడవలు ఉపయోగించారని, గిరోండే, లాండెస్ ప్రాంతాల్లోనే సుమారు 1.97 లక్షల మంది ఇళ్లు వదిలి వెళ్లిపోయారని, స్పెయిన్ మధ్యప్రాంతంలో ఈ సంఖ్య అరవై వేల వరకూ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కార్చిచ్చులను అడ్డుకునే ప్రయత్నంలో పలువురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని, అదృష్టవశాత్తూ ప్రాణనష్టమేదీ జరగలేదని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఫ్రాన్స్ నైరుతి దిక్కున కార్చిచ్చులు విశాలమైన ప్రదేశాన్ని సర్వనాశనం చేశాయని, ప్రస్తుతం అవి గిరోండి ప్రాంతంలోని బోర్డాక్స్ నగరం వైపు వెళుతున్నాయని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి లారెంట్ నునేజ్ తెలిపారు. ఒక రోజు ముందు ఈ కార్చిచ్చు ఫెరెట్ ద్వీపకల్ప ప్రాంతంలో సుమారు 140 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి వ్యాపించిందని, ఫలితంగా గిరోండే ప్రాంతంలో లక్ష పదివేల మంది ఇళ్లు వదిలి వెళ్లిపోయారని వివరించారు. ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సైనికులను రంగంలోకి దించాలని, పౌరులకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్నోను ఆదేశించారు. సహాయక చర్యలకు సాయపడాల్సిందిగా యూరోపియన్ దేశాలను అరి్థంచామని, క్రొయేíÙయా, పోర్చుగీస్లు మంటలార్పేందుకు పనికొచ్చే విమానాలను పంపుతున్నాయని మాక్రాన్ వివరించారు. చెక్ రిపబ్లిక్, స్లొవాకియాలు రెంఉడ బ్లాక్‌హాక్ హెలీకాప్టర్లను పంపుతున్నట్లు తెలిపారు. రంగంలో స్పెయిన్ సైనికులు... స్పెయిన్‌లో కార్చిచ్చులను అదుపులోకి తెచ్చేందుకు వేల మంది సైనికులు ప్రయత్నిస్తున్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఫెర్నాండో గ్రాండే మార్లస్కా తెలిపారు. దేశంలో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించామని చెప్పారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ కార్చిచ్చులతో నాశనమైన ప్రాంతాలను, కమాండ్ సెంటర్‌ను శనివారం సందర్శించారు. గత దశాబ్దకాలంలో ఏటా సుమారు లక్ష ఎకరాల ప్రాంతం కార్చిచ్చులకు బలవుతుంటే ఈ ఏడాది అది మరో 30 వేల ఎకరాలు ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లోని కార్చిచ్చులు మాడ్రిడ్ ప్రాంతంలో కలిసిపోవడంతో అక్కడ మంటల తీవ్రత పెరిగిందని, సుమారు 30 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతం ప్రభావితమైందని స్థానిక అధికారి ఇసబెల్ డియాజ్ అయుసో తెలిపారు. ఈ ఒక్క ఏడాదిలోనే స్పెయిన్‌లో కార్చిచ్చుల కారణంగా సుమారు 130000 హెక్టార్ల విస్తీర్ణంలోని ప్రదేశం నాశనమైంది. -
స్పెయిన్ నంబర్‌వన్.. ర్యాంకింగ్స్‌లో మొరాకో, నార్వే సంచలనం
ఫిఫా ప్రపంచకప్ 2026 టైటిల్ గెలుచుకున్న స్పెయిన్ జట్టు మరోసారి నంబర్‌వన్ ర్యాంకును అందుకుంది. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఫిఫా అధికారికంగా ర్యాంకులను విడుదల చేసింది. చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ నంబర్‌వన్ స్థానానికి చేరుకోగా, రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా రెండో స్థానానికి పడిపోయింది. Photo Credit: FIFA Twitterర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, ఈసారి ఫిఫాలో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న మొరాకో, నార్వే జట్లు మాత్రం సంచలనం సృష్టించాయి. ఫిఫా చరిత్రలోనే మొరాకో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుంది. క్వార్టర్స్‌లో ఓడిన మొరాకో ఆరో స్థానంలో నిలిచింది. ఎర్లింగ్ హాలండ్ సారథ్యంలోని నార్వే కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. ఈ ఫిఫాలో క్వార్టర్స్ చేరుకొని చరిత్ర సృష్టించిన నార్వే 12 స్థానాలు ఎగబాకి 19వ స్థానం (టాప్-20)లో నిలిచింది.Photo Credit: FIFA Twitterఇక కాంస్యం గెలిచిన ఇంగ్లండ్ మూడో స్థానంలో, ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టిన పోర్చుగల్ రెండు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోగా, అదే సమయంలో బ్రెజిల్ ఐదో స్థానానికి చేరుకుంది. ఇక బెల్జింయం, నెదర్లాండ్స్, మెక్సికో వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలు దక్కించుకున్నాయి. ఫిఫా 2026లో పేలవ ప్రదర్శన కనబరిచిన మాజీ చాంపియన్ జర్మనీ మాత్రం టాప్-10లో చోటు కోల్పోయి 12వ స్థానంలో నిలవగా, క్రొయేషియా 13వ స్థానంలో ఉంది. ఇక ఈసారి ఫిఫాలో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న అనామక జట్టు కేప్‌వెర్డె 8 స్థానాలు ఎగబాకి 64వ స్థానంలో నిలిచింది. ఈ ఫిఫాలో కేప్‌వెర్డె ప్రిక్వార్టర్స్ వరకు చేరుకున్న సంగతి తెలిసిందే.చదవండి: అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ -
ఫుట్‌బాల్ ప్రపంచాన్ని షేక్ చేసిన 10 గోల్స్ మ్యాచ్c
-
ఫిఫా ప్రపంచకప్.. మూడో స్ధానం ఇంగ్లండ్‌దే
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీని ఇంగ్లండ్ విజయంతో ముగించింది. ఈ టోర్నీలో భాగంగా మయామి వేదికగా మూడో స్ధానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై 6-4 తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. ఈ 'బ్రాంజ్ ఫైనల్' పోరు ఫస్ట్ హాఫ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు అదరగొట్టారు. మ్యాచ్ ప్రారంభమైన కేవలం 2 నిమిషాలకే కెప్టెన్ డెక్లాన్ రైస్ ఒక అద్భుతమైన లాంగ్-రేంజ్ గోల్‌తో ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 18వ నిమిషంలో ఎజ్రీ కొన్సా గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. అనంతరం బుకాయో సాకా వరుసగా రెండు గోల్స్‌ను సాధించి ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇంగ్లండ్‌ను 4-0తో తిరుగులేని స్థితిలో నిలిపాడు. తొలి ఆర్ధ భాగంలో ఫ్రాన్స్ ఎలాంటి గోల్ చేయకపోవడంతో ఇంగ్లండ్ సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు.కానీ సెకెండ్ హాఫ్‌లో మాత్రం ఫ్రాన్స్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. కెప్టెన్ ఎంబాపే 48వ నిమిషంలో ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ను అందించాడు. వెంటనే 54వ నిమిషంలో ఫ్రాన్స్ ఫార్వర్డ్ బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ సాధించాడు. ఆ తర్వాత 66వ నిమిషంలో ఎంబాపే మరో గోల్ కొట్టడంతో స్కోరు 4-3కి చేరింది. దీంతో ఇంగ్లండ్ డౌగౌట్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావారణం నెలకొంది. అయితే ఫ్రాన్స్ జట్టు మ్యాచ్‌ను సమం చేసేలా కనిపించిన సమయంలో, ఇంగ్లండ్ స్టార్ బుకాయో సాకా మరోసారి సత్తాచాటాడు. 87వ నిమిషంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచి తన హాట్రిక్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ గోల్‌తో ఇంగ్లండ్ 5-3 ఆధిక్యంలోకి వెళ్లింది. అదనపు సమయంలో ఫ్రాన్స్ మళ్లీ గోల్ సాధించి పోటీలో నిలిచింది. కానీ మ్యాచ్ ఆఖరి నిమిషంలో ఇంగ్లండ్ మిడ్ ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ మరో గోల్ కొట్టి తన జట్టు విజయాన్ని 6-4తో ఖరారు చేశాడు. ఈ అద్భుత విజయంతో ఇంగ్లండ్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. 1966 తర్వాత ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఓ మెడల్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. -
మూడో స్థానం కోసం ఫ్రాన్స్, ఇంగ్లండ్ మధ్య పోరు
ఫిఫా ప్రపంచకప్-2026లో ఫైనల్‌కు చేరాలన్న కల నెరవేరకపోయినా, టోర్నీని విజయంతో ముగించాలని ఫ్రాన్స్, ఇంగ్లండ్ జట్లు పట్టుదలగా ఉన్నాయి. శనివారం జరిగే మూడో స్థానం ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో ఈ రెండు యూరోపియన్ దిగ్గజాలు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ అర్దరాత్రి (జులై 19) 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో ఫ్రాన్స్, అర్జెంటీనా చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ (మూడో స్థానం) ఆడాల్సి రావడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఇరు జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు స్పష్టం చేశారు."ఈ మ్యాచ్ ఆడాలని ఎవరూ కోరుకోలేదు"ఫ్రాన్స్ డిఫెండర్ ఇబ్రహిమా కొనాటే మాట్లాడుతూ, "మేమంతా ఫైనల్లో ఆడాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు ఇలా మారాయి. ఇప్పుడు మూడో స్థానం కోసం అయినా గెలిచి టోర్నీని ముగించాలని చూస్తున్నాం" అని తెలిపాడు.తుచెల్పై విమర్శలు.. జట్టులో మార్పులుఅర్జెంటీనాతో సెమీఫైనల్లో వ్యూహాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇంగ్లండ్ కోచ్ థామస్ తుచెల్, ఈ మ్యాచ్‌లో జట్టులో మార్పులు చేస్తామని వెల్లడించారు."ఈ మ్యాచ్ ఆడాలని ఎవరికీ ఉండదు. కానీ ఇది ప్రపంచకప్ అధికారిక మ్యాచ్. గత 60 ఏళ్లలో ఇంగ్లండ్‌కు ఇదే అత్యుత్తమ ప్రపంచకప్ ఫలితం సాధించే అవకాశం. ఆటగాళ్ల పోరాట పటిమను మరోసారి చూపించాల్సిన సమయం ఇది" అని తుచెల్ అన్నారు.సెమీఫైనల్లో చివరి నిమిషాల్లో ఆధిక్యాన్ని కోల్పోవడంపై బాధ్యత తనదేనని కూడా ఆయన అంగీకరించారు.గోల్డెన్ బూట్ రేసులో ఎంబపేఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబపే ఈ మ్యాచ్‌లో మరో లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 8 గోల్స్ చేసిన అతడు అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీతో సమానంగా ఉన్నాడు. అయితే నాలుగు అసిస్టులతో మెస్సీ ఆధిక్యంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్‌హామ్ తలో ఆరు గోల్స్‌తో పోటీలో ఉన్నారు.ఇదిలా ఉంటే, అర్జెంటీనా-స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
గురి తప్పిన ఫ్రెంచ్ కిక్
ఒకరిద్దరి మెరుపులు ప్రతీసారి ఏ జట్టుకైనా విజయం అందించవని మరోసారి నిరూపితమైంది. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగితే... అడుగడుగునా సమన్వయం ప్రదర్శిస్తూ.. సమష్టిగా ముందుకు కదిలితే... ఎంతటి మేటి ప్రత్యర్థినైనా బోల్తా కొట్టించవచ్చని మళ్లీ రుజువైంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఈసారి కచ్చితంగా ఫ్రాన్స్ విజేతగా నిలుస్తుందని భావించినవారందరి అంచనాలను తారుమారు చేస్తూ స్పెయిన్ సంచలనం సృష్టించింది. కలిసికట్టుగా కళ్లు చెదిరే ఆటతీరుతో ఫ్రాన్స్ ఫైనల్ ఆశలను సెమీఫైనల్లోనే గల్లంతు చేసిన స్పెయిన్... 16 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. డాలస్: ప్రత్యర్థి స్థాయి చూసి భయపడలేదు... లయబద్దమైన ఆటతో ప్రత్యర్థినే భయపెట్టింది... ఆరంభం నుంచి అంతం వరకు మ్యాచ్‌పై నియంత్రణ కోల్పోలేదు... పకడ్బందీగా ఆడి ప్రత్యర్థినే ఆద్యంతం నియంత్రించింది... తొలి క్షణం నుంచే ప్రత్యర్థి గోల్‌పోస్ట్ దిశగా కదం తొక్కింది.... ప్రత్యర్థి ఆటగాళ్లను ఎక్కడికక్కడే కట్టడి కూడా చేసింది. వెరసి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్పెయిన్ అనూహ్యంగా టైటిల్ ఫేవరెట్‌గా అవతరించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ముగిసిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్ 2–0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ జట్టును బోల్తా కొట్టించింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒయర్జబాల్ (22వ నిమిషంలో), పెడ్రో పోరో (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ గెలుపుతో స్పెయిన్ 2010 తర్వాత ఈ మెగా ఈవెంట్లో మళ్లీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా ఓటమి లేకుండా వరుసగా 37వ మ్యాచ్‌ను ముగించింది. ఈ క్రమంలో ఇటలీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును స్పెయిన్ సవరించింది. ఎంబాపె తడబాటు...2018 ప్రపంచకప్‌లో టైటిల్ సాధించి... 2022లో రన్నరప్‌గా నిలిచి... ఈసారి మ్యాచ్ మ్యాచ్‌కూ రాటుదేలే ఆటతీరుతో అదరగొట్టిన ఫ్రాన్స్ కీలకమైన సమరంలో ఉసూరుమనిపించింది. ఏమాత్రం పోరాటపటిమ కనబర్చకుండా స్పెయిన్ ‘కిక్’ఎక్కించే ఆటకు సమాధానం ఇవ్వకుండా ఫ్రాన్స్ చేతులెత్తేసింది. సెమీఫైనల్ చేరే క్రమంలో ఫ్రాన్స్ కెపె్టన్ కిలియన్ ఎంబాపె 8 గోల్స్... మరో స్టార్ ఫార్వర్డ్ ఉస్మాన్ డెంబెలె 5 గోల్స్ చేసి సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరు సెమీఫైనల్లోనూ మెరిపిస్తారని... ఫ్రాన్స్ జట్టును ఫైనల్‌కు చేరుస్తారని అభిమానులు ఆశించారు. కానీ ఎంబాపె, డెంబెలె కీలక సమరంలో తేలిపోయారు. స్పెయిన్ డిఫెండర్లను దాటి ఆ జట్టు గోల్‌పోస్ట్ వరకు వెళ్లడంలో ఎంబాపె, డెంబెలె విఫలమయ్యారు. అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా అనుకూలంగా మల్చుకోలేకపోయారు. ఎంబాపెను నియంత్రించడంలో పూర్తిగా సఫలమైన స్పెయిన్ చివరకు మ్యాచ్ ఫలితాన్ని కూడా శాసించింది. ఆరంభం నుంచే వ్యూహాత్మకంగా ఆడిన స్పెయిన్ 22వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను సంపాదించింది. ‘డి’ ఏరియాలో లమీన్ యామల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లుకాస్ డిగ్నె మొరటుగా అడ్డుకున్నాడు.దాంతో రిఫరీ స్పెయిన్‌కు పెనాల్టీ కిక్ ఇవ్వగా... మికెల్ ఒయర్జబాల్ బంతిని లక్ష్యానికి చేర్చి స్పెయిన్‌ను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. ఈ టోర్నీలో ఒయర్జబాల్కిది ఐదో గోల్ కావడం విశేషం. అనంతరం 58వ నిమిషంలో డానీ ఓల్మో అందించిన పాస్‌ను పెడ్రో గోల్‌గా మలచడంతో స్పెయిన్ ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆలస్యంగానైనా ఫ్రాన్స్ పుంజుకుంటుందని, స్కోరును సమం చేస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నా... స్పెయిన్ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. -
సెమీస్‌లో ఫ్రాన్స్ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన స్పెయిన్
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. డల్లాస్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో 2-0 తేడాతో పటిష్టమైన ఫ్రాన్స్‌ను స్పెయిన్ మట్టికరిపించింది. ఈ అద్భుత విజయంతో స్పెయిన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫిఫా చర్రితలో స్పెయిన్ ఫైనల్‌కు అర్హత సాధించడం ఇది రెండో సారి.ఒయర్జబాల్ పెనాల్టీ గోల్ఈ మ్యాచ్ 21వ నిమిషంలో స్పెయిన్ టీనేజ్ సంచలనం లామైన్ యమల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లూకాస్ డిగ్నె బాక్స్‌లో ఫౌల్ చేయడంతో స్పెయిన్‌కు పెనాల్టీ లభించింది. ఈ సువర్ణ అవకాశాన్ని స్పెయిన్ స్టార్ ఫార్వర్డ్ మికెల్ ఒయర్జబాల్ గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. సెకెండ్ హాఫ్‌లో కూడా "లా రోజా" జట్టు తమ జోరును కొనసాగించింది. 58వ నిమిషంలో పెడ్రో పోర్రో సూపర్ స్ట్రైక్‌తో మరో గోల్ కొట్టి స్పెయిన్ విజయాన్ని ఖాయం చేశాడు. అయితే ఈ కీలక మ్యాచ్‌లో కిలియన్ ఎంబాపె సారథ్యంలోని ఫ్రాన్స్ జట్టు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. వరుస తప్పిదాల కారణంగా ఫ్రాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ హాఫ్‌లోనే ఫ్రాన్స్ స్టార్ సెంటర్-బ్యాక్ ఆటగాడు విలియం సాలిబా గాయంతో మైదానాన్ని వీడటం కూడా ఆజట్టును దెబ్బ తీసింది. ఈ టోర్నమెంట్లో ఫ్రాన్స్ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం ఇదే మొదటిసారి. -
ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీస్.. ఫైనల్ చేరేదెవరు?
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. 16 ఏళ్ల తర్వాత ఫిఫాలో ఫైనల్ చేరాలని స్పెయిన్ భావిస్తుంటే.. మరోవైపు వరుసగా మూడో ఫిఫాలోనూ ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఫ్రాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదనిపిస్తోంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గతంలో జర్మనీ (1982, 1986, 1990), బ్రెజిల్ (1994, 1998, 2002) జట్ల తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీల్లో ఫైనల్ చేరాయి. తాజాగా వరుసగా మూడోసారి ఫిఫా ఫైనల్ చేరడం ద్వారా మూడో జట్టుగా గుర్తింపు పొందాలని ఫ్రాన్స్ ఉబలాటపడుతోంది. టైటిల్ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన ఫ్రాన్స్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ అజేయంగా సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది.కెప్టెన్ ఎంబాపె (8 గోల్స్), డెంబెలె (5 గోల్స్), బార్కోలా (2 గోల్స్), డిజైర్ డుయి (1 గోల్) అద్భుత ఆటతీరుకు ప్రత్యర్థి జట్లు ఓటమివైపు నిలవాల్సి వస్తోంది. మరోవైపు స్పెయిన్ కూడా ఓటమి లేకుండానే సెమీఫైనల్‌కు చేరుకుంది. ఫ్రాన్స్ మాదిరిగానే స్పెయిన్ ఏ ఒకరిద్దరి ఆటతీరుపైనే ఆధార పడటం లేదు. మికెల్ ఒయర్జబాల్ (4 గోల్స్), మికెల్ మెరీనో (2 గోల్స్), బయేనా (1 గోల్), రూయిజ్ (1 గోల్), పెడ్రో (1 గోల్), లమీన్ యమాల్ (1 గోల్) సమష్టి ప్రదర్శనతో స్పెయిన్ అనూహ్యంగా టైటిల్ రేసులోకి వచ్చింది. Photo Credit: FIFA Twitterముఖాముఖి పోరులో ఫ్రాన్స్‌పై స్పెయిన్‌దే పైచేయిగా ఉంది. రెండు జట్లు ఇప్పటి వరకు 38 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 18 మ్యాచ్‌ల్లో స్పెయిన్, 13 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ గెలిచాయి. ఏడు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచకప్‌లో మాత్రం ఫ్రాన్స్, స్పెయిన్ ఒక్కసారే ప్రత్యర్థులుగా నిలిచాయి. 2006 ప్రపంచకప్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1తో స్పెయిన్‌ను ఓడించింది. చదవండి: సీఎస్కే హెడ్‌కోచ్ పదవి.. రేసులో ఊహించని పేర్లు! -
సెమీస్ సమరం.. ఎవరి బలమెంత?
ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈసారి గ్రూప్ దశలో 48 జట్లు పాల్గొన్నాయి. రౌండ్ ఆఫ్ 32, ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో వడపోత తర్వాత నాలుగు జట్లు మిగిలాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అర్జెంటీనా దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టగా, 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా వరుసగా మూడోసారి (2018, 2022, 2026) సెమీస్‌కు దూసుకొచ్చింది. ఇక 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ (2010 విజేత) సెమీస్‌లో అడుగుపెడితే, అటు మాజీ చాంపియన్ ఇంగ్లండ్ కూడా తన దూకుడైన ఆటతీరుతో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇప్పటిదాకా తమకు ఎదురైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ వచ్చిన ఈ నాలుగు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో సెమీస్‌లో తలపడనున్నాయి. గత ఫిఫా ప్రపంచకప్ లాగే ఈసారి ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ పోరును చూస్తామా లేక స్పెయిన్, ఇంగ్లండ్ ఆట చూస్తామా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో సెమీస్‌లో ఎవరితో ఎవరు తలపడనున్నారనేది ఒకసారి పరిశీలిద్దాం. ఒస్మోన్ డెంబ్లీ, ఫ్రాన్స్ (Phot Credit: FIFA Twitter)జట్ల బలాబలాలు👉ఫ్రాన్స్ తరఫున ఎంబాపె అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఈసారి ఫిఫాలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, మూడు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఎంబాపె తర్వాత ఒస్మోన్ డెంబ్లీ కూడా ఫ్రాన్స్‌కు బలమైన ఆటగాడు. ఫార్వార్డ్ ప్లేయర్ అయిన డెంబ్లీ ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్, రెండు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు.👉ఇక స్పెయిన్ తరఫున కెప్టెన్ రొడ్రితో పాటు యామినే లమాల్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. వీరిద్దరితో పాటు మైకెల్ ఒయర్జబాల్ (ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్), గోల్ కీపర్ ఉనైయి సిమోన్లు కూడా తమదైన ఆటతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.మైకెల్ ఒయర్జబాల్, స్పెయిన్ (Phot Credit: FIFA Twitter)👉ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హ్యారీకేన్ ఈసారి ఎలాగైనా ఫిఫా ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తరఫున ఈసారి ఫిఫాలో ఆరు మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ చేసి ఆ జట్టు తరఫున గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు. హ్యారికేన్కు తోడుగా జూడ్ బెల్లింగ్హమ్ కూడా కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. బెల్లింగ్హమ్ కూడా ఆరు గోల్స్ చేసి హ్యారికేన్తో సమానంగా ఉన్నాడు.👉డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాకు కర్త, కర్మ, క్రియ.. లియోనల్ మెస్సీ. మెస్సీ ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. మెస్సీతో పాటు ఎమిలో మార్టినేజ్, జులియన్ అల్వరెజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్‌లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.జూడ్ బెల్లింగ్హమ్, ఇంగ్లండ్ (Phot Credit: FIFA Twitter)తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ఫ్రాన్స్, స్పెయిన్ జట్ల మధ్య తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం జులై 15న (బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు) జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 38 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా.. స్పెయిన్‌దే పైచేయి. 38 మ్యాచ్‌ల్లో స్పెయిన్ 18 గెలవగా.. ఫ్రాన్స్ 13 గెలిచింది. 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే ఫిఫా ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు కేవలం ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2016 ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్ 3-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది.అలెక్సిస్ మాక్ అలిస్టర్, అర్జెంటీనా (Phot Credit: FIFA Twitter)రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్ఫిఫాలో రెండో సెమీ-ఫైనల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జులై 16 (భారత కాలమాన ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 గంటలు) అట్లాంటా వేదికగా జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐదు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడగా.. వీటిలో ఇంగ్లండ్ మూడు, అర్జెంటీనా రెండు గెలిచాయి. 40 ఏళ్ల క్రితం (1986 ఫిఫా) ఇరుజట్ల మధ్య జరిగిన సెమీస్‌లో అర్జెంటీనా పైచేయి సాధించింది.సెమీఫైనల్ షెడ్యూల్:👉తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్, బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అర్లింగ్టన్, టెక్సస్👉రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్, గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అట్లాంటాSemi-final match-ups 👀#FIFAWorldCup pic.twitter.com/2WWvIw4E06— FIFA World Cup (@FIFAWorldCup) July 12, 2026చదవండి: శతకంతో ప్రపంచ రికార్డు.. తొలి మహిళా క్రికెటర్‌గా యస్తిక భాటియా -
‘ఎంబాపె కాస్కో.. 2024 సెమీస్‌ను రిపీట్ చేస్తాం’
ఫిఫా ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ స్పెయిన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియంను చిత్తు చేసింది. మ్యాచ్‌లో స్పెయిర్ రెండు గోల్స్ చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు స్టార్ ఆటగాడు లామినే యమాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 18 ఏళ్ల లామినే యమాల్ ఈ ఫిపాలో పెద్దగా గోల్స్ కొట్టకపోయినప్పటికీ కీలక సమయాల్లో తన సహచరులకు అసిస్ట్‌లు, పాస్‌లు అందిస్తూ స్పెయిన్ విజయాల్లో ముఖ్యపాత్ర వహిస్తున్నాడు. ఇక వరుసగా మూడో ఫిఫా ప్రపంచకప్‌లోనూ సెమీస్ చేరి సూపర్ ఫామ్‌లో ఉన్న ఫ్రాన్స్‌ను స్పెయిన్ ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలోనే లామినే యమాల్ ఫ్రాన్స్ జట్టుకు వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. బెల్జియంతో క్వార్టర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత లామినే యమాల్ మాట్లాడాడు. ‘టోర్నీని చాలా ఉత్సాహంగా ప్రారంభించాం. మా ప్రయాణంలో సెమీస్ దశలో అడుగుపెట్టాం. ఫ్రాన్స్ అంటే మాకు భయం లేదు. నిజానికి మేము కాదు వాళ్లే మాకు భయపడతారేమో. ఎందుకంటే 2024 యూరోకప్ సెమీస్‌లో మా చేతిలోనే ఫ్రాన్స్ ఓడిపోయింది. ఆ తర్వాత మేము కప్‌ను కూడా ఎగరేసుకుపోయాం. ఇప్పుడు మళ్లీ 2024 నాటి యూరోకప్ సెమీస్నే రిపీట్ చేయబోతున్నాం. ఒత్తిడి మాకంటే ఫ్రాన్స్‌పైనే ఎక్కువ ఉంటుంది. మేము గెలుస్తామా లేదా అన్న సంగతి పక్కనబెడితే మాత్రం ఈసారి మా మధ్య జరగబోయే మ్యాచ్ మాత్రం ఫిఫా చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్‌ల్లో ఒకటిగా నిలిచిపోనుంది.’ అని చెప్పుకొచ్చాడు.ఇక యూఈఎఫ్ఏ యూరో 2024 కప్‌లో సెమీస్‌లో స్పెయిన్ 2-1తో ఫ్రాన్స్‌ను ఓడించింది. అప్పటికి 16 ఏళ్ల వయసున్న లామినే యమాల్ లాంగ్ రేంజ్ స్ట్రైక్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి తరలించడం ఇప్పటికీ రికార్డుగా నిలిచిపోయింది. ఇదే మ్యాచ్‌లో డాని ఓల్మో మరో గోల్ సాధించాడు. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌ను 1-2తో చిత్తు చేసిన స్పెయిన్ యూరో చాంపియన్స్‌గా నిలిచింది. ఫిఫా ప్రపంచకప్‌లో జూలై 14న జరగనున్న సెమీఫైనల్లో ఫ్రాన్స్, స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.🚨 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋: 𝐅𝐑𝐀𝐍𝐂𝐄 🇫🇷 𝐕𝐒 🇪🇸 𝐒𝐏𝐀𝐈𝐍 𝐈𝐍 𝐓𝐇𝐄 𝐒𝐄𝐌𝐈-𝐅𝐈𝐍𝐀𝐋𝐒 𝐎𝐅 𝐓𝐇𝐄 𝟐𝟎𝟐𝟔 𝐖𝐎𝐑𝐋𝐃 𝐂𝐔𝐏 🍿 pic.twitter.com/Ob8JJatAmd— 433 (@433) July 10, 2026 🚨⭐️ OFFICIAL: Lamine Yamal, FIFA Man of the Match for Spain-Belgium. pic.twitter.com/hbDaRMT6sn— Fabrizio Romano (@FabrizioRomano) July 10, 2026Read: సచిన్, కోహ్లి సరసన గిల్.. టీమిండియా కెప్టెన్‌గా రికార్డు -
అరుదైన ఫీట్‌తో ఫిఫా చరిత్రను తిరగరాసిన ఎంబాపె
ఫిపా ప్రపంచకప్ 2026లో ఫ్రాన్స్ సంచలనం కైలియన్ ఎంబాపె గోల్స్ వర్షం కురిపిస్తున్నాడు. 30 ఏళ్లు కూడా నిండని ఎంబాపె ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్, మూడు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో మెస్సీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు మరోసారి ఫైనల్లో తలపడితే ఎవరికి గోల్డెన్ బూట్ అందుతుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లో మొరాకోను చిత్తు చేసిన ఫ్రాన్స్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక 27 ఏళ్ల ఎంబాపెకు ఫిఫా ప్రపంచకప్పుల్లో ఇది 20వ గోల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఎంబాపె ఒక అరుదైన ఫీట్ సాధించి ఫిఫా చరిత్రను తిరగరాశాడు. 30 ఏళ్ల లోపే ఫిఫాలో 20 గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా కైలియన్ ఎంబాపె రికార్డు సృష్టించాడు.ఇక ఫిఫా ప్రపంచకప్పుల్లో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో ఎంబాపె రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ (21 గోల్స్) ఉన్నాడు. మెస్సీ రికార్డును అధిగమించేందుకు ఎంబాపె రెండు గోల్స్ దూరంలో నిలిచాడు. ఇక మొరాకోతో మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-0తో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తొలి అర్ధభాగంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంలో విఫలమైన ఎంబాపె రెండో అర్ధభాగంలో మాత్రం 60వ నిమిషంలో గోల్‌తో మెరిశాడు. ఈ ఫిఫాలో ఎంబాపెకు ఇది 8వ గోల్ కావడం విశేషం. ఆ తర్వాత 66వ నిమిషంలో డెంబ్లీకి పాస్ అందించి అతడు రెండో గోల్ కొట్టడంలో సహాయపడ్డాడు. 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టు 2022లో రన్నరప్‌గా నిలిచింది. ఇక వరుసగా మూడోసారి సెమీస్ చేరిన ఫ్రాన్స్ టైటిల్ అందుకునేందుకు రెండు అడుగుల దూరంలో ఉంది. -
సెమీస్ చేరిన ఫ్రాన్స్‌కు భారీ షాక్!?
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో మాజీ చాంపియన్ ఫ్రాన్స్ సెమీస్‌కు దూసుకువెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0తో చిత్తు చేసి.. ఎనిమిదోసారి సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. బోస్టన్ వేదికగా శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే అదరగొట్టాడు.తొలుత 26వ నిమిషంలో ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ కిక్‌ను వృథా చేసినప్పటికీ.. 60వ నిమిషంలో ఎంబాపె గోల్ కొట్టడంతో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. ఇక 66వ నిమిషంలో డెంబెలె మరో గోల్ గొట్టి మొరాకోకు షాకిచ్చాడు. ఆ తర్వాత మొరాకోను నిలువరించడంలో సఫలమైన ఫ్రాన్స్.. ఈసారి టాప్-4 బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.ఊహించని షాక్ఇదిలా ఉంటే.. గోల్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కిలియన్ ఎంబాపె గాయపడటం కలకలం రేపింది. మ్యాచ్ రెండో అర్ధ భాగం 77వ నిమిషంలో ఎంబాపె మడిమ నొప్పితో విలవిల్లాడాడు. దీంతో ఫ్రాన్స్ మేనేజర్ డిడెర్ డెచాంప్స్ ఫిలిప్ మటేటాను ఎంబాపే స్థానంలో మైదానంలోకి పంపగా.. ఎంబాపె బయటకు వచ్చాడు. ఈ క్రమంలో మటేటా మిగిలిన 13 నిమిషాలు మైదానంలో ఉండగా.. ఎంబాపె తిరిగి వెళ్లలేదు.ఊపిరి పీల్చుకో!దీంతో సెమీస్ చేరిన ఆనందంలో ఉన్న ఫ్రాన్స్‌కు ఊహించని షాక్ తగిలినట్లయింది. అయితే, తన గాయంపై ఎంబాపె స్పందిస్తూ.. అభిమానులకు ఊరట కలిగించే విషయం చెప్పాడు.‘‘నేను బాగానే ఉన్నాను. నా చీలమండకు దెబ్బ తగిలింది. అయితే, ఇప్పుడు అంతా బాగానే ఉంది.నాకంటే కూడా మటేటా ఆఖరి 15 నిమిషాల మ్యాచ్ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా, సన్నద్ధంగా ఉన్నాడు’’ అని ఎంబాపె చమత్కరించాడు.చదవండి: నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం? -
వరల్డ్‌కప్ సెమీస్‌కు దూసుకువెళ్లిన ఫ్రాన్స్
బోస్టన్: అంచనాలకు అనుగుణంగా రాణించిన ఫ్రాన్స్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ముగిసిన తొలి క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ ఫ్రాన్స్ 2–0 గోల్స్ తేడాతో మొరాకో జట్టును ఓడించి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఫ్రాన్స్ తరఫున కెప్టెన్ కిలియన్ ఎంబాపె (60వ నిమిషంలో), డెంబెలె (66వ నిమిషంలో) ఒక్కో గోల్ చేసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు 26వ నిమిషంలో ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ కిక్‌ను ఎంబాపె వృథా చేశాడు. ఇక స్పెయిన్, బెల్జియం జట్ల మధ్య రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో ఫ్రాన్స్ తలపడుతుంది. ఎంబాపె 20వ గోల్ప్రపంచకప్ చరిత్రలో ఎంబాపెకిది 20వ గోల్ కావడం విశేషం. ఇక తొలి అర్ధభాగంలో మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బౌను అద్భుత ప్రదర్శన కారణంగా ఫ్రాన్స్ ఖాతా తెరువలేకపోయింది. అయితే రెండో అర్ధభాగంలో మొరాకో డిఫెండర్లు తడబడ్డారు. 60వ నిమిషంలో డిజైర్ డుయి అందించిన పాస్‌ను ఎంబాపె లక్ష్యానికి చేర్చగా... ఆరు నిమిషాల తర్వాత ఎంబాపె అందించిన పాస్‌ను డెంబెలె గోల్‌గా మలిచాడు. ఆరు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసిన ఫ్రాన్స్ మరింత జోరు పెంచగా... మొరాకో డీలా పడిపోయింది. కాగా గత ప్రపంచకప్ సెమీఫైనల్లో ఫ్రాన్స్ చేతిలోనే ఓడిన మొరాకో జట్టు ఈసారి క్వార్టర్ ఫైనల్లో ఓటమి చవిచూసింది. We need to talk about the nonsense FIFA , Referee & VAR did here pic.twitter.com/egdEcGxISu— sᴛᴇᴘʜ (@stephiscodee) July 9, 2026 2022: France 🆚 Morocco#FIFAWorldCup pic.twitter.com/vlzRbKwzr2— FIFA World Cup (@FIFAWorldCup) July 9, 2026 -
ఆఫ్రికా నుండి ఫ్రెంచ్ నిష్క్రమణ?
గత నెలాఖరులో ఫ్రెంచ్ ప్రభుత్వంతో ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దౌత్య సంబంధాలు తెంచుకోవటంతో ఫ్రాన్స్ – ఆఫ్రికా ఘర్షణ తారస్థాయికి చేరింది. ఆఫ్రికా నుండి ఫ్రాన్స్ నిష్క్రమణ ఖాయమైంది. 1880–1919 మధ్యకాలంలో 90 శాతం ఆఫ్రికా ఖండం వలస పాలకుల అధీనంలోకి వచ్చింది. బ్రిటన్ తరువాత ఫ్రాన్స్ ఆఫ్రికాను ఆక్రమించుకొన్న రెండవ అతిపెద్ద వలస రాజ్యం. పోర్చుగల్, బెల్జియం, జర్మనీ, ఇటలీ కూడా ఆఫ్రికాలో వలసలను ఏర్పరచాయి. ఫ్రాన్స్ ప్రధానంగా పశ్చిమ, మధ్య ఆఫ్రికాలను ఆక్రమించింది. ఫ్రాన్స్ వలస సామ్రాజ్యం ఉచ్ఛ దశలో ఆఫ్రికాలో సుమారు 33 శాతం ప్రాంతంలో విస్తరించింది. 1960లో ఫ్రాన్స్ 14 ఆఫ్రికా దేశాలకు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. అల్జీరియా 1962లో ఫ్రెంచ్ పాలన నుండి విముక్తి పొందింది.ఫ్రాన్స్ తీరు వేరు!వలస దేశాలకు బ్రిటన్, పోర్చుగల్, జర్మనీ, ఇటలీ స్వాతంత్య్రాన్ని ఇచ్చిన తరువాత, ఆయా దేశాల నుండి పూర్తిగా వైదొలిగాయి. కానీ ఫ్రాన్స్, రాజకీయ స్వాతంత్య్రాన్ని ఇచ్చినప్పటికీ, సైనిక, ఆర్థిక, సాంస్కృతిక నియంత్రణను కొనసాగించింది. 1960– 2025 మధ్యకాలంలో ఫ్రాన్స్ సైన్యం ముప్పయిసార్లకు పైగా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నది. 2013లో మాలీలో ఫ్రెంచ్ సైన్యం ఆప రేషన్ సెవాల్ను చేపట్టింది. అనేక సందర్భాలలో ఫ్రెంచ్ సైన్యం దుష్ట నియంత పాలకులకు దన్నుగా నిలిచింది. గాబన్లో ఒమర్ బాంగో, చాద్‌లో డెబీ ఫ్రెంచ్ సైన్యం మద్దతుతోనే పాలించారు. ఫ్రెంచ్ అనుకూల పాలకులను ప్రతిష్ఠించటానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఫ్రెంచ్ ప్రభుత్వం వదులుకోలేదు. పూర్వ వలస దేశాల పాలకుల వ్యక్తిగత భద్రతకు ఫ్రెంచ్ సైనికులను వినియోగించారు. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన కరెన్సీని ఫ్రాన్స్ తన గుప్పిట్లో ఉంచుకున్నది. 14 పూర్వ ఆఫ్రికన్ వలస దేశాలు సీఎఫ్ఏ ఫ్రాంక్ను కరెన్సీగా వాడతాయి. దీనిని యూరోకు అనుసంధానం చేశారు. 2021 వరకు ఈ నోట్లను ఫ్రెంచ్ ట్రెజరీ ముద్రించేది. కరెన్సీ రిజర్వ్‌ను ఫ్రెంచ్ బ్యాంకులలో నిలువ చేస్తున్నారు. వడ్డీరేట్లు, ద్రవ్య విధానాన్ని ఫ్రాన్స్ తన నియంత్రణలో ఉంచుకున్నది. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మైనింగ్, రవాణా, కమ్యూనికేషన్ రంగాలను ఫ్రెంచ్ కంపెనీలు తమ గుత్తాధిపత్యంలో ఉంచుకొన్నాయి. 21 ఆఫ్రికన్ దేశాలు ఫ్రెంచ్ను అధికార భాషగా వాడుతున్నాయి. ముప్పై లక్షలకుపైగా ఆఫ్రికన్లు ఫ్రాన్స్‌లో నివసిస్తున్నారు.2020 తరువాత ఫ్రాన్స్ జోక్యానికి వ్యతిరేకంగా ఎదురుగాలి మొదలైంది. పెద్ద ఎత్తున యువత నిరసన ప్రదర్శనలు జరిగాయి. 2020–21లో మాలి, బుర్కినా ఫాసో, గినియాల్లో ఫ్రెంచ్ అనుకూల పాలకులను తిరుగుబాటుదారులు కూలదోశారు. 2022లో మాలి నుండి ఫ్రెంచ్ సైన్యాన్ని బహిష్కరించారు. 2023లో నైజర్, గాబన్ లలో తిరుగుబాటు తరువాత ఫ్రెంచ్ సైన్యాన్ని బహిష్కరించారు. 2024లో సెనెగల్, ఐవరీ కోస్ట్, ఛాద్ల నుండి ఫ్రెంచ్ సైన్యాన్ని ఉపసంహరించారు. ప్రస్తుతం ఎర్ర సముద్రం సమీపంలోని జిబూతిలో మాత్రమే ఫ్రెంచ్ తన సైనిక స్థావరాన్ని నిర్వహిస్తున్నది. పెరుగుతున్న చైనా ప్రభావంఆఫ్రికా నుండి ఫ్రాన్స్ నిష్క్రమణకు ఆఫ్రికాపై రష్యా, చైనా దృష్టిని సారించటమూ కారణమే. రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ (కిరాయి సైన్యం) ఆఫ్రికన్ దేశాలకు భద్రతా సహాయాన్ని ఇవ్వటా నికి ముందుకొచ్చింది. వాగ్నర్ నాయకుడి మరణం తరువాత ఈ సైన్యాన్ని ఆఫ్రికా కోర్గా పేరుమార్చి రష్యా నేరుగా తన నియంత్ర ణలోకి తీసుకున్నది. జిహాదీల అణచి వేత, అంతర్గత భద్రత, అధ్య క్షుల వ్యక్తిగత భద్రతలను మాలీ, నైజర్, గాబన్, ఛాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, బుర్కినా ఫోసోలలో పర్యవేక్షించటానికి రష్యా ఒప్పందాలను చేసుకున్నది. గనుల భద్రత కూడా రష్యన్ సైనికుల నియంత్రణలో ఉన్నది. ప్రతిగా ఈ దేశాలు బంగారాన్ని చెల్లిస్తున్నాయి. మాలి, బుర్కినా ఫోసోలోని బంగారం, నైజర్‌లోని యురేనియం, గినియాలోని బాక్సైట్ గనుల నుండి ఫ్రెంచ్‌కి చెందిన ఒరానో వంటి కంపెనీలు వైదొలగాల్సి వచ్చింది. ఇదే అదనుగా చైనా తన ఆర్థిక, వాణిజ్య సామ్రాజ్యాన్ని ఫ్రెంచ్ –ఆఫ్రికాలోనికి గత రెండు దశబ్దాలుగా విస్తరిస్తున్నది. ఫ్రెంచ్ ఫ్రాంక్ను కరెన్సీగా వాడుతున్న 14 ఆఫ్రికన్ దేశాలలో పది దేశాలకు ఇప్పుడు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. దొరాల (జిబూతి), కిర్చి (గినియా), అబిడ్జాన్ (ఐవరీ కోస్ట్), పాయింట్ నాయిర్ (కాంగో) రేవు పట్టణాలను చైనా అభివృద్ధి పరచింది. పది విమానా శ్రయాలు, పార్లమెంటు భవనాలు, స్టేడియాలను నిర్మించింది. ఫ్రెంచ్ కంపెనీలతో పోలిస్తే చైనా కంపెనీలు తక్కువ వడ్డీతో రుణాలు అందించాయి. హువే, జెడ్‌టీఈ వంటి చైనా కంపెనీలు సెనెగల్, ఐవరీ కోస్ట్, గాబన్, కామెరూన్లలో 4జీ/5జీ సేవలను అందిస్తున్నాయి. విద్యుత్ వాహనాలు, బ్యాటరీల తయారీకి అవసర మైన బాక్సైట్ (గినియా), కోబాల్ట్, రాగి(కాంగో), మాంగనీస్ (గాబన్)లతో పాటుగా యురేనియం (నైజర్), చమురు, గ్యాస్ (మారిటానియా)లను చైనా ప్రతిఫలంగా చౌకగా పొందు తున్నది.మనకో సువర్ణావకాశంభారత్కు కూడా ఫ్రాంకో ఆఫ్రికన్ ప్రాంతంలో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోవటానికి ఇది మంచి తరుణం. చౌకైన, తేలికపాటి ఆయుధాలు, సైనిక శిక్షణ రంగాలలో ఈ దేశా లతో ఒప్పందాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూఎన్ శాంతి పరిరక్షణ బలగాలతో అనుభవం భారత్‌కు కలిసొచ్చే అంశం. సముద్ర జలాల పహారా, గస్తీలో కూడా భాగస్వామ్యానికి అవకాశాలున్నాయి. ఈ దేశాలలోని ఖనిజ వనరుల వెలికితీతలో భారత కంపెనీల పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. చైనా మాదిరిగా ఆ దేశాలను రుణ ఊబిలోకి నెట్టకుండా పరస్పర ప్రయో జనకరమైన ఉమ్మడి భాగస్వామ్యాలను ప్రతిపాదించటం వలన ఆ దేశాలు భారత్‌ను ఎంచుకోవటానికి అవకాశం ఉన్నది. ఫార్మాస్యూ టికల్స్ ఎగుమతితోపాటుగా, యూపీఐ, ఆధార్ సేవలను విస్తరింప జేయటానికి కూడా అవకాశం ఉన్నది. చైనా కంపెనీలు ఈ ప్రాంతంలో రెండు దశాబ్దాల నుండి పాతుకుపోయి ఉన్నాయి. ప్రాజెక్టులను అతి తక్కువ సమయంలో పూర్తి చేయటంలో అవి దిట్ట. మన ప్రైవేటు రంగ కంపెనీలు ఈ రేసులో పాల్గొంటే తప్పితే ఈ ప్రాంతంలో భారత్ నిలబడలేదు. పశ్చిమ ఆఫ్రికాకు నేరుగా సముద్ర రవాణా మార్గం లేకపోవటం భారత్‌కు ప్రతికూలాంశం.ఈ నేపథ్యంలో ఆఫ్రికాపై తన పట్టును వదులుకోవటానికి ఫ్రాన్స్ అంగీకరించదు. వలస మనస్తత్వాన్ని, యాజమాన్య ధోర ణిని వదలివేసి పూర్వ వలస దేశాలను సమానులుగా అంగీకరించి, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించటం శ్రేయస్కరం. ఎర్ర సముద్ర భద్రతకు జిబూతి సైనిక స్థావరం, గినియా సింధు శాఖ భద్రతకు గాబన్ సైనిక స్థావరం కీలకం. ఫ్రాంకో ఆఫ్రికన్ దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసు కోకుండా యూరో పియన్ యూనియన్ ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కొనసాగించటం ఫ్రాన్స్ ముందున్న మార్గం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఎనిమిది జట్ల సయ్యాట.. ఫిఫా క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదే
ఫిఫా ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్ దశకు చేరింది. ఇక్కడి నుంచి మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా మారనున్నాయి. లీగ్ దశలో 48 జట్లు పోటీపడితే అందులో నుంచి 32 జట్లు రౌండ్ ఆఫ్ 32కు చేరాయి. అక్కడి నుంచి 16 జట్లు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్లో 8 జట్లు (అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే, బెల్జియం, ఇంగ్లండ్, మొరాకో, స్విట్జర్లాండ్) అమీతుమీకి సిద్ధమ వుతున్నాయి. ఎంబాపె (ఫ్రాన్స్), మెస్సీ (అర్జెంటీనా)ఈ ఫిఫాలో భారీ అంచనాలు పెట్టుకున్న పెద్ద జట్లలో చాలా వరకు నిష్క్రమించడం గమనార్హం. జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్స్, క్రొయేషియా లాంటి జట్లు ప్రిక్వార్టర్స్‌లోనే తమ ఆటను ముగించాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా తమ స్థాయికి తగ్గట్లే వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ 5 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, ఒక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు యువ సంచలనం కైలియన్ ఎంబాపె 5 మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్‌తో మెస్సీని అనుసరిస్తున్నాడు. ఎర్లింగ్ హాలండ్ (నార్వే), లామినే యమాల్ (స్పెయిన్)అన్నీ కుదిరితే 2022 ఫిఫాలో ఫైనల్లో తలపడిన అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు ఈసారి సెమీస్ లేదా మరోసారి ఫైనల్లో తలపడే అవకాశముంది. మరోవైపు మాజీ చాంపియన్లు స్పెయిన్, ఇంగ్లండ్‌తో పాటు బెల్జియం తమ స్థాయి ఆటతీరుతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. ఇక ఎవరూ ఊహించని రీతిలో మొరాకో నార్వే, స్విట్జర్లాండ్ కూడా ప్రిక్వార్టర్స్‌లో అదరగొట్టి క్వార్టర్స్‌లో ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో క్వార్టర్ ఫైనల్ దశలో ఏ జట్టు ఎవరితో తలపడనుంది, ఏ సమయానికి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం.లుకాకు (బెల్జియం), హ్యారీకేన్ (ఇంగ్లండ్)క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్:👉ఫ్రాన్స్ వర్సెస్ మొరాకో, జూలై 10, తెల్లవారుజామున 1.30 గంటలకు, వేదిక: బోస్టన్👉స్పెయిన్ వర్సెస్ బెల్జియం, జూలై 11, అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: లాస్ ఏంజెలెస్👉నార్వే వర్సెస్ ఇంగ్లండ్, జూలై 12, తెల్లవారుజామున 2.30 గంటలకు, వేదిక: మియామి స్టేడియం👉అర్జెంటీనా వర్సెస్ స్విట్జర్లాండ్, జూలై 12, ఉదయం 6.30 గంటలకు, వేదిక: కాన్సాస్ సిటీక్వార్టర్ ఫైనల్లో గెలిచిన నాలుగు జట్లు జూలై 15, 16వ తేదీల్లో జరగనున్న సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఇక ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్ జూలై 19 (ఆదివారం) తెల్లవారుజామున 2.30 గంటలకు జరగనుంది.Read: టీమిండియాకు ఆర్చర్ చురకలు.. ‘వైభవ్‌కు ఇదే నా సవాల్’ -
వివాదంలో ఎంబాపె.. ‘క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడుస్తా!’
ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాపె వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ తరఫున అదరగొడుతున్న ఎంబాపె.. పరాగ్వేతో మ్యాచ్ అనంతరం ఆ దేశానికి చెందిన మహిళా సెనెటర్ సెలెస్టే అమరిల్లాను ఉద్దేశించి ‘నీచమైన మహిళ’ అని ఉద్దేశిస్తూ ఎంబాపె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు పెట్టడం అగ్గిని రాజేసింది. ఎంబాపె తనకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని సెలెస్టే డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఎంబాపె చేసిన వ్యాఖ్యలు జాతి వివక్షపూరితంగా ఉన్నాయని, అతడు క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని హెచ్చరించడం ఇక్కడ కొసమెరుపు.అసలేం జరిగిందంటే?ఫిఫాలో ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్, పరాగ్వే తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0తో పరాగ్వేను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ పూర్తయ్యాక ఎంబాపే ‘ఎక్స్’లో సెలిస్టే అమరిల్లాను నీచమైన మహిళగా పేర్కొంటూ పోస్ట్ పెట్టాడు. ‘మేడం సెలెస్టీ.. మీరు ఒక నీచమైన మహిళ. సెనేటర్ పదవికి మీరు అనర్హులు. మీరు పరాగ్వే ప్రతినిధులు కారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో పరాగ్వే జట్టు అద్భుత ప్రదర్శనతో మీ నిర్లక్ష్య ధోరణిని, మీరు చూపిన జాతి వివక్షను అందరూ మరిచిపోయారు. మీరు అశక్తులు. దేశ ప్రతినిధిగా మిమ్మల్ని చూపడానికి అనర్హులు. విద్వేషాన్ని, జాతివివక్షను ప్రపంచమంతా వ్యాపింప జేయాలనుకునే ఆమెలాంటి వాళ్లను నేను అనుమతించను’ అని ఎంబాపె సంచలన పోస్టు పెట్టాడు.ఎంబాపె పెట్టిన పోస్ట్ చూసి సెలెస్టీ కోపంతో ఉగిపోయింది. తనను నీచమైన మహిళ అనేందుకు, సెనెటర్ పదవికి అనర్హురాలు అనడానికి ఎంబాపెకు అర్హత లేదని మండిపడ్డారు. ‘సమస్య నీకు, నాకు మధ్య. ఫ్రాన్స్‌ను ఉద్దేశించి నేను ఏమీ అనలేదు. నేను ఫ్రాన్స్‌లోని స్కూల్లో చదివాను. పదిహేడేళ్లు వచ్చేవరకూ ఇక్కడే చదివా. ఫ్రెంచ్ మాట్లాడుతా. ఫ్రాన్స్ రావడం అంటే నాకు ఇష్టం. నాకు ఫ్రాన్స్‌తో ఏ సమస్యా లేదు. నీతోనే సమస్య. మ్యాచ్ అనంతరం ఎంబాపే తన కోపాన్ని, ధిక్కార స్వభావాన్ని చూపాడు. పరాగ్వే ఆటగాళ్లు, గోల్ కీపర్ పట్ల అతడు ప్రవర్తించిన తీరు నా దేశాన్ని గాయపరిచింది. కాబట్టి ఎంబాపే తన పోస్ట్ పట్ల బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేదంటే అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’ అని సెలెస్టీ పేర్కొంది. గోల్డెన్ బూట్ రేసులో ఎంబాపెఇక ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో మొరాకోతో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన ఎంబాపె ఏడు గోల్స్, రెండు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో దూసుకుపోతున్నాడు. ఎంబాపెకు పోటీగా అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ కూడా ఉన్నాడు. మెస్సీ 4 మ్యాచ్‌ల్లోనే ఏడు గోల్స్ చేయడం విశేషం. నేడు జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్‌తో అర్జెంటీనా తలపడనున్న నేపథ్యంలో మెస్సీ ఎన్ని గోల్స్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. -
ఫ్రాన్స్ అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రమాదం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌కు పెను ప్రమాదం తప్పింది. సిరియాలో మెక్రాన్ బసచేసిన హోటల్ వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రమాదం నుంచి అధ్యక్షుడు తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు పౌరులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ సిరియా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా డమాస్కస్‌లో ఆయన హోటల్లో బసచేశారు. అయితే ఆ హోటల్ సమీపంలో మూడు కారు బాంబులు పేలడంతో తీవ్ర కలకలం రేగింది. పేలుళ్లు జరిగిన సమయంలో, ఆయన అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో కలిసి అధ్యక్ష భవనంలో ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ప్రకటన విడుదల చేయలేదు.2024లో అహ్మద్ అల్-షారా నేతృత్వంలోని తిరుగుబాటుదారులు బషర్ అల్-అసద్ పాలనను పడగొట్టిన తర్వాత, సిరియాలో పర్యటించిన మొదటి యూరోపియన్ యూనియన్ (EU) దేశాధినేత మాక్రాన్ మాత్రమే.ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఈ పేలుళ్లు సిరియాలో ఇంకా ఎదురవుతున్న భారీ భద్రతా సవాళ్లను మరోసిరా తేటతెల్లం చేశాయి.The target was a bus for the Ministry of Tourism near the Four Seasons. This is an assassination attempt against Macron pic.twitter.com/CDIVYKdZkm— Munir 🇱🇧🇵🇸 (@JnoubiSyrian) July 7, 2026 -
ఫ్రాన్స్‌దే పైచేయి
ఫిలడెల్ఫియా: మూడోసారి ప్రపంచ కప్ టైటిల్ సాధించాలని ఆశిస్తున్న ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు ఆ దిశగా మరో అడుగు వేసింది. పరాగ్వే జట్టుతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 1–0తో గెలిచి ఈ మెగా ఈవెంట్లో పదోసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ 70వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను కెప్టెన్ ఎంబాపె గోల్‌గా మలిచి ఫ్రాన్స్ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈనెల 10న జరిగే క్వార్టర్ ఫైనల్లో మొరాకో జట్టుతో ఫ్రాన్స్ తలపడుతుంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో మొరాకో జట్టును ఓడించే ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరింది. 1998, 2018 ప్రపంచకప్‌లలో టైటిల్ గెలిచిన ఫ్రాన్స్ 2022లో రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచకప్‌లో ఐదోసారి ప్రిక్వార్టర్ ఫైనల్ నాకౌట్ మ్యాచ్ ఆడిన పరాగ్వే జట్టు... ఫ్రాన్స్ జట్టును ఓడించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినా చివరకు ఓటమితో సరిపెట్టుకుంది. నాకౌట్ దశ తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగుసార్లు చాంపియన్, నాలుగుసార్లు రన్నరప్ జర్మనీ జట్టుపై ‘పెనాల్టీ షూటౌట్’లో సంచలన విజయం నమోదు చేసిన పరాగ్వే జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం అత్యంత మొరటుగా ఆడింది. ఫ్రాన్స్ జట్టు స్టార్ ప్లేయర్లు ఎంబాపె, డెంబెలె, డిజైర్ డుయి, అడ్రియన్ రబియోట్, మనూ కోన్లను ఎక్కడ పడితే అక్కడ నిలువరించేందుకు పరాగ్వే ఆటగాళ్లు ప్రయత్నించారు. ఫ్రాన్స్ ఆటగాళ్లతో వాగ్వాదం చేయడం... జెర్సీలు పట్టి లాగడం... మోచేతులతో ఢీకొట్టడం... కాళ్లలో కాళ్లు పెట్టి అడ్డగించడం... చేశారు. పరాగ్వే ఆటగాళ్ల మొరటు ఆటతీరుపై రిఫరీ ఇల్గిజ్ తంతాòÙవ్ (ఉజ్బెకిస్తాన్) ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అందర్నీ నివ్వెరపరిచింది. మ్యాచ్ మొత్తంలో పరాగ్వే ఆటగాళ్లను కనీసం ఒక్కయెల్లో కార్డుతో కూడా రిఫరీ హెచ్చరించకపోగా.. ముగ్గురు ఫ్రాన్స్ ఆటగాళ్లకు ఆయన యెల్లో కార్డులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. తొలి అర్ధభాగంలో ఒక్కసారి కూడా పరాగ్వే గోల్‌పోస్ట్‌పై షాట్ కొట్టని ఫ్రాన్స్... రెండో అర్ధభాగంలో జోరు పెంచింది. వారి ప్రయత్నం 70వ నిమిషంలో ఫలించింది. ‘డి’ ఏరియాలో ఫ్రాన్స్ ఫార్వర్డ్ డిజైర్ డుయిని పరాగ్వే డిఫెండర్ గోమెజ్ కింద పడేశాడు. వీడియో రీప్లే పరిశీలించాక రిఫరీ ఫ్రాన్స్ జట్టుకు పెనాల్టీ కిక్‌ను ప్రదానం చేశారు. ఎంబాపె దీనిని గోల్‌గా మలిచాడు. ఈ టోర్నీలో ఎంబాపె కిది ఏడో గోల్కాగా... ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో 19వ గోల్ కావడం విశేషం. ఖాతా తెరిచిన తర్వాత ఫ్రాన్స్ ఆటగాళ్లు రెండో గోల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే పరాగ్వే గోల్‌కీపర్ ఒర్లాండో గిల్ అడ్డుగోడలా నిలబడ్డాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎంబాపెతో కరచాలనం చేసేందుకు పరాగ్వే గోల్‌కీపర్ ఒర్లాండో వెళ్లగా ఫ్రాన్స్ కెప్టెన్ స్పందించలేదు. దాంతో ఒర్లాండో తన చేతిలో ఉన్న బంతిని ఎంబాపె వీపు పైకి విసిరేసి తన అసహనాన్ని ప్రదర్శించాడు. -
ఎంబపే జోరు.. క్వార్టర్ ఫైనల్లో మొరాకో, ఫ్రాన్స్
ఫిఫా ప్రపంచకప్ 2026లో మొరాకో, ఫ్రాన్స్ జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. తొలి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో సహా ఆతిథ్య జట్టు కెనడాపై మొరాకో.. పరాగ్వేపై ఫ్రాన్స్ గెలుపొందాయి. మొరాకో కెనడాపై 3-0 గోల్స్ తేడాతో గెలుపొందగా.. ఫ్రాన్స్ పరాగ్వేను 1-0 గోల్స్‌తో చిత్తు చేసింది.చరిత్ర సృష్టించిన మొరాకోకెనడాపై గెలుపుతో మొరాకో చరిత్ర సృష్టించింది. వరుసగా రెండు ప్రపంచకప్‌లలో క్వార్టర్స్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ జట్టుగా రికార్డు నెలకొల్పింది. మొరాకో ఈ ఘనత సాధించడానికి అజెద్దీన్ ఔనాహీ (Azzedine Ounahi) తోడ్పడ్డాడు. ఈ మ్యాచ్‌లో అజెద్దీన్ రెండు గోల్స్‌తో మొరాకోకు చారిత్రక విజయాన్ని అందించాడు. అదనపు సమయంలో సూఫియాన్ రహిమీ (Soufiane Rahimi) మరో గోల్ చేసి మొరాకోను క్వార్టర్స్‌కు చేర్చాడు.ఎంబపే జోరుప్రస్తుత ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ కెప్టెన్ కైలియన్ ఎంబపే జోరు కొనసాగుతోంది. వరుసగా అతడు మరో మ్యాచ్‌లో గోల్ సాధించి తన జట్టును గెలిపించాడు. ఈ గోల్‌తో అతడు మెస్సీతో సమానంగా 7 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో ముందున్నాడు. పరాగ్వేతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఎంబపే 70వ నిమిషంలో పెనాల్టీ ద్వారా గోల్ చేసి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాడు.క్వార్టర్స్‌లో ఫ్రాన్స్-మొరాకో పోరుఈ విజయాల తర్వాత జూలై 9న బోస్టన్‌లో జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్, మొరాకో తలపడనున్నాయి. -
రాజమౌళికి అరుదైన గౌరవం.. దర్శకధీరుడు ఎమోషనల్
దర్శకధీరుడు రాజమౌళి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఫ్రాన్స్ లియాన్‌లోని ప్రతిష్టాత్మక లూమియర్ మ్యూజియంలోని దిగ్గజాల సరసన నిలిచారు. ఫ్రాన్స్ సినీ దిగ్గజాలతో పాటు మన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పేరును శాశ్వతంగా మ్యూజియంలో ముద్రించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా పంచుకున్నారు. తన జీవితాంతం గుర్తుండిపోయే ఈ జ్ఞాపకాన్ని అందించినందుకు ధన్వవాదాలు తెలిపారు.కాగా.. ఫ్రాన్స్‌లోని లియాన్‌లో ఉన్న లూమియర్ మ్యూజియంలో గతంలో 'ఈగ', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలను ప్రదర్శించారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్ చేసిన రూమ్‌ను రాజమౌళి సందర్శించారు. ఈ సందర్భంగా లూమియర్ ఇన్స్టిట్యూట్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రేమాక్స్ రాజమౌళికి సర్ప్రైజ్ ఇస్తూ ఆయన పేరు ముద్రించిన శిలాఫలకాన్ని అందించారు. ఈ ప్రకటనతో తాను భావోద్వేగానికి లోనయ్యానని రాజమౌళి రాసుకొచ్చారు. అక్కడ ఫలకాలతో నిండిన ఒక గోడకు మార్టిన్ స్కోర్సెస్, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరాంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా వంటి దిగ్గజాల పేర్లు... వాటిని ఎర్రటి వస్త్రంతో కప్పబడిన ఒక ప్లేట్‌ను గమనించానని దర్శకధీరుడు ట్వీట్ చేశారు. అక్కడ నా పేరు చూసి మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయిందని రాజమౌళి పోస్ట్ చేశారు.Visited the Lumière Museum and the screening room where Eega and RRR was screened to a full house in Lyon, France.Thierry Frémaux, the director of the Institut Lumière and the Cannes Film Festival, was gracious enough to introduce me. Then he said he had planned a surprise and… pic.twitter.com/2ZA8UT7Zxf— rajamouli ss (@ssrajamouli) July 2, 2026 -
పాకిస్థాన్‌లో ఫ్రెంచ్ మహిళ 10 ఏళ్ల బందీఖానా.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్!
భావప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో, ఒక మహిళ తన ఐదుగురు పిల్లలతో కలిసి ఏకంగా పదేళ్ల పాటు చీకటి గదిలోనే బందీగా నలిగిపోయిన ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘోర మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.2014లో పాకిస్థాన్‌కు వచ్చిన నాటి నుండి నేటి వరకు కనీసం సూర్యరశ్మి కూడా సరిగ్గా తగలని ఒక మట్టి ఇటుకల గదిలో బందీగా మారిన ఒక ఫ్రెంచ్ మహిళను, ఆమె ఐదుగురు పిల్లలను పాకిస్థాన్ పోలీసులు ఎట్టకేలకు రక్షించారు. లవ్ మ్యారేజ్, విదేశీ ప్రయాణం జీవితాన్ని మారుస్తుందని ఆశపడిన ఆ మహిళకు పాకిస్థాన్ సరిహద్దు గ్రామం ఒక నరకకూపాన్ని ఎలా పరిచయం చేసిందో వివరిస్తూ సాగే ఒక సంచలన నిజాల కథనం ఇది.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, 54 ఏళ్ల సిల్వీ యాస్మినా అనే ఫ్రెంచ్ మహిళ తన పాకిస్థానీ భర్త అహ్మద్ ఖాన్‌తో కలిసి పన్నెండేళ్ల క్రితం పాకిస్థాన్ అడుగుపెట్టింది. అఫ్గానిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బారా అనే చిన్న పట్టణంలో ఒక శిథిలావస్థకు చేరిన మట్టి ఇటుకల ఇంట్లోకి ఆమెను తీసుకెళ్లిన భర్త, నాటి నుండి ఆమె బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా కట్టడి చేశాడు. మానసికంగా, శారీరకంగా విపరీతమైన క్రూర స్వభావం కలిగిన అహ్మద్ ఖాన్, రోజువారీగా ఆమెను పశువుకంటే హీనంగా హింసించేవాడు.కేవలం గదికే పరిమితం చేయడమే కాకుండా, బాహ్య ప్రపంచానికి ఏ చిన్న సమాచారం పొక్కినా చంపేస్తానని బెదిరిస్తూ పదేళ్లకు పైగా ఒక బందీలా ఉంచాడు. ఈ క్రమంలో పుట్టిన ఐదుగురు పిల్లలను కూడా కనీసం స్కూలు ముఖం చూడనివ్వకుండా, ఆ నలుగు గోడల మధ్యే బంధీలుగా ఉంచడం ఆ భర్త క్రూరత్వానికి పరాకాష్టగా నిలిచింది. అయితే, ఈ సుదీర్ఘ నరకయాతన నుండి బయటపడటానికి ఆ దేవుడే ఒక మార్గాన్ని చూపించాడు. ఒకరోజు భర్త కళ్ళు కప్పి, యాస్మినా కుమారుల్లో ఒకడు అత్యంత చాకచక్యంగా ఆ ఇరుకైన బందీఖానా నుండి తప్పించుకున్నాడు.ఎలాగోలా ప్రాణాలు చేతబట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆ బాలుడు, తన తల్లి పడుతున్న నరకయాతనను, తమ బందీఖానా గురించిన వివరాలను పోలీసులకు వివరించాడు. బాలుడి మాటలకు దిగ్భ్రాంతి చెందిన జిల్లా పోలీస్ చీఫ్ వకార్ అహ్మద్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగింది. నిఘా నీడన ఉన్న ఆ మట్టి ఇటుకల ఇంటిపై మెరుపు దాడి చేసి, ముఖంపై తీవ్ర గాయాలతో దీనస్థితిలో ఉన్న సిల్వీ యాస్మినాను, ఆమె ఐదుగురు పిల్లలను సురక్షితంగా రక్షించారు. క్రూర భర్త అహ్మద్ ఖాన్‌ను అక్కడికక్కడే అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం జైలుకు తరలించారు.రక్షించబడిన అనంతరం పోలీసులు రికార్డ్ చేసిన వీడియోలో సిల్వీ యాస్మినా ఇంగ్లీష్, ప్యాంటో భాషల మిశ్రమంలో మాట్లాడుతూ, తనను ఈ నరకం నుండి కాపాడిన పోలీసు అధికారులకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. 2014 నుండి తాను ఈ దేశంలో కనీసం స్వేచ్ఛగా శ్వాస కూడా తీసుకోలేకపోయానని, కళ్లెదుటే పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంటే ఏమీ చేయలేని స్థితిలో రోదించానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను, తన పిల్లలను ఎలాగైనా తిరిగి ఫ్రాన్స్ పంపించి వేయాలని ఆమె అధికారులను వేడుకుంది. ప్రస్తుతం బాధితులకు రక్షణ కల్పించేందుకు వారిని మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పాకిస్థాన్ ప్రభుత్వం, బాధితుల స్వదేశీ పునరావాసం కోసం ఇస్లామాబాద్‌లోని ఫ్రెంచ్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతోంది.పాకిస్థాన్‌లో మహిళలపై జరిగే గృహహింస, సంప్రదాయాల పేరుతో సాగే వేధింపుల తీవ్రతకు ఈ అంతర్జాతీయ ఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం, పాకిస్థాన్‌లో ప్రతి ఏటా వందలాది మంది మహిళలు భర్తలు, కుటుంబ సభ్యుల చేతిలో శారీరక, మానసిక హింసకు గురవుతున్నారు. అయితే సమాజానికి భయపడి చాలా కేసులు వెలుగులోకి రావడం లేదు. ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాల్లో కఠినమైన సంప్రదాయ నిబంధనలను ఉల్లంఘించారనే నెపంతో అక్కడ ఏటా ఎంతో మంది మహిళలు పరువు హత్యలకు గురవుతున్నారు. ఒక విదేశీ మహిళకే ఇలాంటి దుస్థితి పడితే, ఇక స్థానిక మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలంటూ సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అంతర్జాతీయ సమాజంతో పాటు స్థానిక చట్టాలకు కూడా ఒక పెద్ద మేల్కొలుపు కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మెస్సీని దాటేసిన ఎంబాపె.. ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన ఫ్రాన్స్
ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ దూసుకుపోతోంది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ జట్టు రౌండ్ ఆఫ్ 32లో స్వీడన్‌ను 3-0తో చిత్తు చేసింది. కైలియన్ ఎంబాపె మరోసారి డబుల్ గోల్స్ (45, 74వ నిమిషం)తో మెరవగా, బ్రాడ్లీ బార్కోలా (53వ నిమిషం) మరో గోల్ సాధించాడు. ఫ్రాన్స్ దూకుడుకు స్వీడన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఎక్కువసేపు బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకోవడంతో స్వీడన్‌కు గోల్‌పోస్టుపై దాడులు చేసే అవకాశాలు కూడా తక్కువగానే వచ్చాయి. నిర్ణీత సమయం ముగిసేలోపే ఫ్రాన్స్ విజయం ఖరారు అయిపోయింది. ఇక ప్రీ క్వార్టర్స్‌లో పరాగ్వేతో ఫ్రాన్స్ తలపడనుంది.ఆమడదూరంలో మెస్సీఫిఫా చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో కైలియన్ ఎంబాపె సరికొత్త రికార్డు సృష్టించాడు. మెస్సీకి కూడా సాధ్యం కాని రికార్డును ఎంబాపె తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటంటే ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా ఎంబాపె (10 గోల్స్) తొలి స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో బ్రెజిల్ దిగ్గజ ఆటగాళ్లు లియోనిదాస్, రొనాల్డో ఫిఫా నాకౌట్ దశలో (8 గోల్స్) సమానంగా ఉన్నారు. వీరి తర్వాత జస్ట్ ఫౌంటైన్, వావా, ఒల్డ్రిచ్, పీలే (7 గోల్స్) ఉన్నారు. ఇక అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ (5 గోల్స్) 12వ స్థానంలో నిలిచి ఎంబాపెకు ఆమడ దూరంలో నిలిచాడు. ఇక ఎంబాపె ఆడిన మూడు వరల్డ్‌కప్స్ (2018, 2022, 2026) నాకౌట్ దశలు కలిపి 10 గోల్స్ కొట్టగా.. ఇందులో 2018లో నాకౌట్ దశలో మూడు గోల్స్, 2022 ఫిఫా నాకౌట్ దశల్లో ఐదు గోల్స్, తాజాగా 2026 ఫిఫాలో నాకౌట్ దశలో ఇప్పటికే రెండు గోల్స్ సాధించాడు. ఈ ప్రపంచకప్ ముగిసేసరికి నాకౌట్ దశలో ఇంకెన్ని గోల్స్ చేస్తాడో చూడాలి. ఈ లెక్కన 27 ఏళ్ల ఎంబాపె వచ్చే ఫిఫా ప్రపంచకప్ (2030) నాటికి ఎవరికీ అందనంత ఎత్తులో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.మెస్సీ రికార్డుకు అడుగు దూరంలోఇక ఫ్రాన్స్ సంచలనం కైలియన్ ఎంబాపె రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే వస్తున్నాడు. తాజాగా స్వీడన్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్ చేయడం ద్వారా ఎంబాపె (18 గోల్స్) ఫిఫాలో అత్యధిక గోల్స్ చేసిన ఆల్‌టైమ్ ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోజ్ (16 గోల్స్) రికార్డును బద్దలుకొట్టాడు. ఇక అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ 19 గోల్స్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. మెస్సీ రికార్డును సమం చేయడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న ఎంబాపె అత్యధిక గోల్స్ తన పేరిట లిఖించుకోవడానికి మాత్రం ప్రస్తుతానికైతే రెండు గోల్స్ దూరంలో నిలిచాడు. కేప్‌వెర్డెతో జరగనున్న మ్యాచ్‌లో మెస్సీ గోల్స్ చేస్తే మాత్రం ఎంబాపె ఆ రికార్డును అందుకోవడానికి సమయం పడుతుంది. ఏది ఏమైనా ఎంబాపె మాత్రం మెస్సీ రికార్డును ఈ ఫిఫాలోనే అధిగమించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఫిఫాలో అత్యధిక గోల్స్ జాబితాలియోనల్ మెస్సీ (అర్జెంటీనా)- 19 గోల్స్కైలియన్ ఎంబాపె (ఫ్రాన్స్)- 18 గోల్స్మిరాస్లావ్ క్లోజ్ (జర్మనీ)- 17 గోల్స్రొనాల్డో (బ్రెజిల్)- 16 గోల్స్గెర్డ్ ముల్లర్ (జర్మనీ)- 14 గోల్స్జస్ట్ ఫౌంటైన్ (ఫ్రాన్స్)- 13 గోల్స్పీలే (బ్రెజిల్)- 12 గోల్స్Kylian Mbappé scores his NINTH goal in the World Cup knockouts. The most of any men's player ever 😲🇫🇷 pic.twitter.com/mq0JT61eJz— B/R Football (@brfootball) June 30, 2026 -
పట్టాలు కరిగేంత వేడి.. యూరప్ హీట్‌వేవ్ షాక్
యూరప్ అంతటా తీవ్రమైన హీట్‌వేవ్ కారణంగా సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రోడ్లు కరిగిపోవడం, రైల్వే పట్టాలు వంకరలు తిరగడం, రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనేక దేశాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వెస్ట్రన్ యూరప్‌లో మొదలైన ఈ హీట్‌వేవ్ క్రమంగా సెంట్రల్, ఈస్ట్రన్ యూరప్‌కు వ్యాపించి పలు దేశాల్లో ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టింది. డెన్మార్క్‌లో 1874 తర్వాత ఇప్పుడే అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. స్విట్జర్లాండ్‌లో 38.8 డిగ్రీలు, చెక్ రిపబ్లిక్లో 40.8 డిగ్రీలతో ఆల్‌టైమ్ రికార్డులు నమోదయ్యాయి. యూకేలో జూన్ నెలలోనే 37.3 డిగ్రీలతో చరిత్రాత్మక రికార్డు నమోదైంది.🚨 Europe is literally melting.As temperatures soar to 40–45°C, traffic lights in parts of Italy and Germany are reportedly melting under the relentless heat.The continent's extreme heatwave is pushing infrastructure to its breaking point. 🌡️🫠 pic.twitter.com/6oK04O3wgS— RB. (@KailashVashi) June 28, 2026జర్మనీలో వేడిమి ప్రభావంతో ఆటోబాన్ హైవేపై కాంక్రీట్ స్లాబ్స్ పేలిపోవడంతో పలు రహదారులు మూసివేయాల్సి వచ్చింది. ఫ్రాన్స్‌లో రోడ్లు కరిగిపోవడం, విద్యుత్ అంతరాయాలు, రైళ్ల ఆలస్యాలు తీవ్రంగా నమోదయ్యాయి. అణుశక్తి కేంద్రాల్లో కూలింగ్ సమస్యల కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గించాల్సి వచ్చినప్పటికీ సరఫరాకు ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు.హీట్‌వేవ్ ప్రభావంతో ఆసుపత్రులు కూడా ఒత్తిడికి గురయ్యాయి. ఫ్రాన్స్‌లో వేలాది మంది హీట్ సంబంధిత సమస్యలతో ఆసుపత్రులను ఆశ్రయించగా, అత్యవసర సేవలు అలర్ట్‌లోకి వెళ్లాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. జర్మనీలో ఓ నర్సింగ్ హోమ్‌ను ఖాళీ చేయాల్సి రాగా, ఒక వ్యక్తి మరణించగా దాని కారణం వేడిమేనా అన్నది స్పష్టంగా తెలియలేదు. ఇటలీ, యూకేలోనూ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు కొనసాగుతున్నాయి. పలు నగరాల్లో ప్రజలు నీడ కోసం తలదాచుకుంటూ, ఫౌంటెన్ల వద్ద సమయం గడుపుతున్నారు. ఇదే సమయంలో నదులు, సరస్సుల్లో స్నానానికి వెళ్లిన కొందరు ప్రమాదాల్లో మృతి చెందిన ఘటనలు కూడా నమోదయ్యాయి. యూరప్ అంతటా ఈ హీట్‌వేవ్ ప్రజా జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.UNUSUALEurope is facing a severe heatwave disrupting infrastructure: trams in Germany have stopped due to rail expansion, while roads and traffic signals in the UK and Italy are also being affected. pic.twitter.com/7rsduhjMBY— RussiaNews 🇷🇺 (@mog_russEN) June 28, 2026యూరప్‌లో హీట్‌వేవ్‌ల వల్ల మరణాలు ఇటీవల సంవత్సరాల్లో గణనీయంగా పెరుగుతున్నాయి. తాజా అధ్యయనాలు మరియు 2026 జూన్‌లో వచ్చిన తాజా ఘటనల ఆధారంగా ముఖ్య విషయాలు ఇలా ఉన్నాయి.ఫ్రాన్స్‌లో మాత్రమే సుమారు 1,000కి పైగా అదనపు మరణాలు నమోదయ్యాయికొన్ని నివేదికల ప్రకారం ప్యారిస్ ప్రాంతంలో మరణాల సంఖ్య వేగంగా పెరిగింది. జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, హంగేరీ వంటి దేశాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయియూరప్ మొత్తం మీద లక్షలాది మంది ప్రజలు తీవ్రమైన వేడికి గురయ్యారుగత సంవత్సరాల అంచనాలు .. 2024లో యూరప్‌లో సుమారు 62,775 హీట్‌వేవ్ సంబంధిత మరణాలు జరిగాయని అంచనాలు ఉన్నాయి2022–2023 వేసవుల్లో మొత్తం లక్షల సంఖ్యలో హీట్-సంబంధిత మరణాలు జరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయకొన్ని అధ్యయనాల ప్రకారం, యూరప్‌లో వేడి కారణంగా ప్రతి సంవత్సరం మరణాలు పెరుగుతున్న ట్రెండ్ ఉందిహీట్వేవ్ కారణంగా వృద్ధులు (65+ వయస్సు) ఎక్కువగా ప్రభావితమవుతున్నారురాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం గమనార్హం. આ પેરિસના દ્રશ્યો છે….ગરમી એટલી છે કે લોકો રહી શકતા નથી… લગભગ ૪૬ હજાર ઘરોમાં વીજળી નથી.આ રીતે ધુબાકા મારવામાં અત્યાર સુધીમાં ૫૫ લોકોના ડૂબી જવાથી મોત થયાં છે.ઠંડું યુરોપ હવે 40-45 ડિગ્રી ગરમીથી શેકાઈ રહ્યું છે !#Paris | #HeatWave | #Europe pic.twitter.com/ZhCNK9s0UB— Janak Dave (@dave_janak) June 27, 2026HEATWAVE overwhelms France with reports of sharp RISE in DEATHS — EuronewsWith temperatures topping 40°C, officials say around 1,000 more deaths than expected have been recorded since June 24UK, Spain and Germany also recording extreme temperaturesMTodayNews pic.twitter.com/Ob6OCdfTmd— Jack Straw (@JackStr42679640) June 28, 2026 -
ఫ్రాన్స్‌లో వడగాలుల బీభత్సం.. వెయ్యి మంది మృతి
పారిస్: ఫ్రాన్స్‌లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అధిక వేడులతో వడ గాలుల కారణంగా దాదాపు 1,000 మందికి పైగా మృతిచెందినట్లు ఆ దేశం ప్రకటించింది. అదే విధంగా జర్మనీ, స్పెయిన్, బ్రిటన్‌తో సహా 16 దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఆ ఏడాది నమోదైనట్లు పేర్కొంది.ఐరోపా ప్రస్తుతం రికార్డు స్థాయిలో వేడిగాలుల బారిన పడుతోంది. ఈ తీవ్రమైన వేడి కారణంగా ఫ్రాన్స్‌లో దాదాపు 1,000 మంది అదనంగా మరణించారని తెలుస్తోంది. జూన్ 24 నుండి జూన్ 27 మధ్య మూడు రోజులలోనే ఫ్రాన్స్ వ్యాప్తంగా ఈ మరణాలు సంభవించాయని నివేదికలు పేర్కొన్నాయి. రాజధాని పారిస్, పరిసర ప్రాంతాలలో మరణాలు కేసులు ఉన్నాయని మృతులలో అధికంగా వృద్ధులే ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అదే సమయంలో, జర్మనీ, స్పెయిన్, బ్రిటన్, డెన్మార్క్, ఇటలీ స్విట్జర్లాండ్‌తో సహా 16 దేశాలలో ఉష్ణోగ్రతలు దశాబ్దాల నాటి రికార్డులను బద్దలు కొట్టాయి.అయితే యూరప్‌లో 35 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అక్కడి రోడ్లు కరిగిపోతున్నాయని అనేక ప్రాంతాలల కార్చిచ్చులు చెలరేగుతున్నాయనిల అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ సగటు కంటే యూరప్‌లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో బ్రిటన్ చరిత్రలోనే తొలిసారిగా, వరుసగా మూడు రోజుల పాటు రెడ్ వార్నింగ్ హెచ్చరికలు జారీ చేశారు. బ్రిటన్‌లో జూన్ నెలకు సంబంధించి ఈ వారం వరుసగా మూడు రోజుల పాటు బద్దలైందని అధికారులు పేర్కొన్నారు. బ్రిటన్ వ్యాప్తంగా వెయ్యికి పైగా పాఠశాలలను మూసివేయవలసి వచ్చిందని తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా ఇనుప రైలు పట్టాలు వ్యాకోచించి, వంగిపోతున్నాయని తెలిపారు. దీనివల్ల రైళ్లపై కఠినమైన వేగ పరిమితులను గంటకు గరిష్ఠంగా 60 మైళ్లకు తగ్గించాల్సి వస్తోందని పేర్కొన్నారు. -
ఫ్రాన్స్‌లో కుప్పకూలిన విమానం.. 11 మంది మృతి
పారిస్ : ఫ్రాన్స్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తోంబ్లైన్ నగర సమీపంలో సమీపంలో పారాచూట్ సంస్థకు చెందిన ఒక పౌర విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతదేహాల వెలికితీత చేపడుతున్నాయి.స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ విమానం స్కైడైవింగ్ ట్రిప్‌కు వెళ్తున్న కొంతమంది వ్యక్తులతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఈ ఘటనపై త్వరలోనే పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభం కానుంది. అని కథనాలు ప్రచురించాయి.పారాచూట్ స్కూల్‌కు చెందిన విమానంప్రమాదానికి గురైన విమానం ఒక పారాచూటిస్ట్ పాఠశాల కు చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు విమానంలో ఉన్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని స్థానిక ప్రిఫెక్చర్ (అధికార యంత్రాంగం) తెలిపింది. మరణించిన ప్రయాణికులలో ఐదుగురు విద్యార్థులు, ఐదుగురు ఇన్స్ట్రక్టర్లు (శిక్షకులు) ఉన్నట్లు పేర్కొంది. -
ఉస్మాన్ 'హ్యాట్రిక్'
బోస్టన్: ‘ఫిఫా’ ప్రపంచ కప్‌లో మాజీ చాంపియన్ ఫ్రాన్స్ తమ జోరు కొనసాగించింది. గ్రూప్ ‘ఐ’లో ఆడిన మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి టాపర్‌గా ‘నాకౌట్’లోకి ప్రవేశించింది. 1998లో విజేతగా నిలిచిన తర్వాత లీగ్ దశలో ఫ్రాన్స్ అన్ని మ్యాచ్‌లూ గెలవడం ఇదే మొదటిసారి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4–1 గోల్స్ తేడాతో నార్వేను చిత్తు చేసింది. ఫ్రాన్స్ తరఫున ఉస్మాన్ డెంబెలె ‘హ్యాట్రిక్’ గోల్స్ సాధించడం విశేషం.తొలి అర్ధ భాగంలోనే (7వ, 20వ, 32వ నిమిషాల్లో) అతను మూడు గోల్స్ కొట్టాడు. తద్వారా ప్రపంచ కప్ చరిత్రలో రెండో వేగవంతమైన హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. 1954 ప్రపంచ కప్‌లో చెకొస్లవేకియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టియా ఆటగాడు ఎరిక్ ప్రోబ్ ఆట మొదలైన 24 నిమిషాల్లోనే మూడు గోల్స్ కొట్టి రికార్డు నమోదు చేశాడు.తాజా మ్యాచ్‌లో ఫ్రాన్స్ తరఫున నాలుగో గోల్‌ను డిజైర్ డో (90+4వ ని.లో) సాధించగా ... నార్వే ఆటగాడు థెలో అస్గార్డ్ (21వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. అయితే ‘ఐ’ గ్రూప్ నుంచి ఈ మ్యాచ్‌కు ముందే నార్వే కూడా నాకౌట్‌కు అర్హత సాధించగా... సంచలన ప్రదర్శనతో సెనెగల్ కూడా ముందంజ వేసింది. ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సెనెగల్ 5–0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. సెనెగల్ తరఫున పేప్ గుయె (59వ, 71వ నిమిషాల్లో) రెండు గోల్స్ కొట్టగా... హబీబ్ దియారా (4వ ని.), ఇస్మాయిలా సర్ (56వ ని.), లిమాన్ ఎన్దియె (82వ ని.) ఒక్కో గోల్ కొట్టారు. ఈ గ్రూప్‌లో సెనెగల్ మూడో స్థానంలో నిలిచింది. అయితే 12 గ్రూప్‌ల నుంచి మూడో స్థానాల్లో నిలిచిన జట్లలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన టాప్–8 టీమ్‌లు కూడా ముందంజ వేస్తాయి. ఈ మ్యాచ్‌లో ప్రదర్శనతో సెనెగల్ నాకౌట్లోకి ప్రవేశించింది. బెల్జియం, ఈజిప్ట్ ముందంజ 2018 ప్రపంచ కప్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన (మూడో స్థానం) కనబర్చిన బెల్జియం జట్టు మరో సారి నాకౌట్‌కు అర్హత సాధించింది. గ్రూప్ ‘జి’లో జరిగిన పోరులో బెల్జియం 5–1 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ముందంజ వేసింది. బెల్జియం తరఫున లియాండ్రో ట్రొసార్డ్ (28వ, 50వ నిమిషాల్లో), కెవిన్ డి బ్రూన్ (66వ ని.), రొమేలు ల్యూకాకు (86వ ని.), అలెక్సిస్ సెల్మెకర్స్ 99+4వ ని.) గోల్స్‌తో చెలరేగగా... న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఎలీజా జస్ట్ (84వ ని.) ఏకైక గోల్ కొట్టాడు. మూడో సారి ప్రపంచ కప్ బరిలోకి దిగిన కివీస్ టీమ్ ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ఈ గ్రూప్‌లో ఓటమి లేకుండా అజేయంగా నిలిచిన ఈజిప్ట్ రెండో జట్టుగా క్వాలిఫై అయింది. ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌ను ఈజిప్ట్ 1–1తో డ్రా చేసుకుంది. ఈజిప్ట్ తరఫున మహమూద్ సాబెల్ (5వ ని.) గోల్ సాధించగా... ఇరాన్ ఆటగాళ్ళలో రమీన్ రెజైన్ (14వ ని.) గోల్ చేశాడు. 2022 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన ఈజిప్ట్ తొలిసారి నాకౌట్‌కు చేరడం విశేషం. ఈ టోర్నీకి ముందు మూడు వరల్డ్ కప్‌లు ఆడిన ఈజిప్ట్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.ఒక్క మ్యాచ్ గెలవకున్నా... గ్రూప్ ‘హెచ్’లో సంచలన ఫలితం నమోదైంది. మాజీ చాంపియన్ ఉరుగ్వే నిష్క్రమించగా... తొలిసారి ప్రపంచ కప్ ఆడుతున్న కేప్ వెర్డె నాకౌట్‌కు అర్హత సాధించింది. 2010 వరల్డ్ కప్ విజేత స్పెయిన్ 1–0 గోల్‌తో ఉరుగ్వేను ఓడించి నాకౌట్‌కు చేరింది. స్పెయిన్ తరఫున అలెక్స్ బెనా (42వ నిమిషం) ఏకైక గోల్ కొట్టాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ ర్యాంక్‌లో ఉన్న ఉరుగ్వే... ఈ టోర్నీలో లీగ్ దశలోనే నిష్క్రమించిన అత్యుత్తమ ర్యాంకింగ్ టీమ్‌గా నిలిచింది. ఉరుగ్వే 1930, 1950లలో చాంపియన్‌గా నిలిచింది. మరో వైపు కేప్ వెర్డెకు అదృష్టం కలిసొచ్చింది. ఆ జట్టు 3 మ్యాచ్‌లలో ఒక్క విజయాన్ని నమోదు చేయకున్నా... మూడూ ‘డ్రా’గా ముగించడంలో సఫలమైంది. ఫలితంగా ఉరుగ్వేను వెనక్కి నెట్టి ముందంజ వేసింది. కేప్‌వెర్డె, సౌదీ అరేబియా మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. 1998 వరల్డ్ కప్‌లో చిలీ తర్వాత లీగ్ దశలో ఒక్క మ్యాచ్ గెలవకున్నా నాకౌట్‌కు చేరిన మొదటి జట్టుగా కేప్ వెర్డె నిలిచింది. -
వేడుకల పేరిట వికృతం.. మహిళలే టార్గెట్‌గా మారారా?
ఫ్రాన్స్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. సంగీతం, సంబరాలు, ఆనందానికి ప్రతీకగా నిలిచే భారీ ప్రజా వేడుకలు ఎంత ప్రమాదకరంగా మారవచ్చో ఫ్రాన్స్‌లో జరిగిన తాజా ఘటన మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. లక్షలాది మంది పాల్గొన్న వార్షిక సంగీత ఉత్సవంలో మహిళలతో అనుచిత ప్రవర్తన, లైంగిక దాడుల ఆరోపణలు, కత్తిపోట్ల ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు 240 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఫ్రాన్స్‌లో ప్రతి ఏడాది నిర్వహించే ప్రముఖ సంగీత ఉత్సవం ఫెటే డీలా ముసిక్యూ(Fête de la Musique) వేడుక ఈసారి విషాదకర ఘటనలతో వార్తల్లో నిలిచింది. దేశవ్యాప్తంగా జరిగిన వేడుకల్లో 145 మంది సూదులతో గుచ్చినట్లు ఫిర్యాదులు చేయగా, మహిళలపై లైంగిక దాడులు, హింసాత్మక ఘటనల ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు 240 మందిని అదుపులోకి తీసుకున్నారు.According to reports, several incidents of violence and vandalism occurred last night during the annual "Music Festival" in Paris. pic.twitter.com/08murQ3w8c— Yumiko (@sin3950) June 22, 2026జూన్ 21న నిర్వహించిన ఈ ఉత్సవానికి లక్షలాది మంది హాజరయ్యారు. అయితే వేడుకల సమయంలో అనేక మంది మహిళలు, యువతులు తమకు గుర్తుతెలియని వ్యక్తులు సూదులతో గుచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 145 కేసులు నమోదవగా, వాటిలో 13 ఘటనలు పారిస్‌లోనే చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల్లో కొందరిని ఆసుపత్రులకు తరలించి టాక్సికాలజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సూదుల్లో మత్తు పదార్థాలు ఉన్నాయా లేదా అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.Every year, France's Fête de la Musique ends the same way. This year: violence, thefts, sexual assaults, vandalism, and over 240 arrests.THIS TELLS YOU MORE ABOUT THE FRENCH POLITICAL CLASS THAT ENDORSES THE FÊTE THAN IT DOES THE FÊTE DE LA MUSIQUE.pic.twitter.com/ITQIUS8p5u— Steve Hanke (@steve_hanke) June 22, 2026వేడుకలకు ముందు సోషల్ మీడియా వేదికలపై మహిళలను లక్ష్యంగా చేసుకోవాలంటూ కొన్ని పోస్టులు వైరల్ కావడం ఆందోళన కలిగించింది. ఆ హెచ్చరికల తర్వాతే ఈ ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు కుట్ర కోణంలోనూ విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, ఉత్సవాల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఒక 17 ఏళ్ల యువకుడు కత్తిపోట్లతో ఆసుపత్రిలో చేరగా, మొత్తం 14 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 13 మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలు ఫ్రాన్స్‌లో మహిళల భద్రత, భారీ ప్రజా వేడుకల నిర్వహణపై మరోసారి చర్చకు దారితీశాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు దాడుల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు.France’s annual Fête de la Musique was marred by widespread disorder overnight, with authorities making 243 arrests across the country. pic.twitter.com/9BW8oWf2K1— theshadeborough (@theshadeborough) June 23, 2026ప్రతి సంవత్సరం లక్షలాది మంది పాల్గొనే ఈ ఉత్సవం ఫ్రాన్స్ సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు. వీధులు, పార్కులు, ప్రజా ప్రదేశాలు సంగీతంతో మార్మోగే ఈ వేడుక ఈసారి మాత్రం భద్రతా లోపాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఒకప్పుడు సంగీత సంబరాలకు ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవం.. ఈసారి మాత్రం భయం, ఆందోళన, భద్రతా వైఫల్యాల చర్చలకు కేంద్రబిందువుగా మారింది. మహిళల భద్రత, భారీ ప్రజా కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్లు, సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తున్న హింసాత్మక పిలుపులపై ఫ్రాన్స్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వందో మ్యాచ్‌లో ఎంబాపె రికార్డు గోల్స్.. నాకౌట్‌కు ఫ్రాన్స్
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఫ్రాన్స్ జట్టు నాకౌట్ దశకు చేరుకుంది. గ్రూప్-ఐలో ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0తో విజయాన్ని అందుకుంది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కైలియన్ ఎంబాపె డబుల్ గోల్స్ (ఆట 14, 54వ నిమిషం)తో మెరవగా, ఓస్మన్ డెంబ్లె (ఆట 60వ నిమిషం) మరో గోల్ చేశాడు. ఈ విజయంతో ఫ్రాన్స్ నాకౌట్‌కు అర్హత సాధించింది. వర్షంతో మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. మ్యాచ్ ఆలస్యంగా మొదలైనప్పటికీ ఎంబాపె తన గోల్స్ కిక్‌తో అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు. ఆట 14వ నిమిషంలో కార్నర్ నుంచి బంతిని గోల్ పోస్టులోకి తరలించిన ఎంబాపె ఫిఫాలో 15 వ గోల్ సాధించాడు. ఆ తర్వాత రెండో హాఫ్‌లో 54వ నిమిషంలో మరోసారి మెరిసిన ఎంబాపె రెండో గోల్ సాధించడంతో పాటు ఫ్రాన్స్‌ను 2-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో బాలన్ డీ ఓర్ అవార్డు విజేత ఓస్మన్ డెంబ్లె 64వ నిమిషంలో గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో మూడో గోల్ చేరింది. మరోవైపు 1986 తర్వాత రెండో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న ఇరాక్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.కాగా ఎంబాపె ఇరాక్‌తో మ్యాచ్ ద్వారా పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఎంబాపెకు ఇది వందో అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. తన వందో అంతర్జాతీయ మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిసిన ఎంబాపెకు ఫిఫాలో ఇది 16వ గోల్. తద్వారా ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఎంబాపె.. జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోస్ (16 గోల్స్) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. అంతకముందు 15వ గోల్ కొట్టి బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో రికార్డును సమం చేశాడు. మెస్సీ వెనుకే ఎంబాపె..ఇక ఫిఫా ప్రపంచకప్‌లో ఈసారి మెస్సీ, ఎంబాపె మధ్య నంబర్ గేమ్ నడుస్తోంది. ‘వస్తా నీ వెనుక’ అన్నట్లుగా మెస్సీకి పోటీగా ఎంబాపె వరుస గోల్స్‌తో రెచ్చిపోతున్నాడు. ఆస్ట్రియాతో మ్యాచ్‌లో డబుల్ గోల్స్‌తో మెరిసిన మెస్సీ 18 గోల్స్‌తో ఫిఫా అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా తొలి స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరాక్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టి తన గోల్స్ సంఖ్యను 16కు పెంచుకున్న ఎంబాపె.. మెస్సీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. రాబోయే మ్యాచ్‌లో మిరాస్లావ్ క్లోస్ రికార్డును బద్దలు కొట్టనున్న ఎంబాపె ఆ తర్వాత మెస్సీని దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఫిఫాలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితా👉లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)-18👉కైలియన్ ఎంబాపె (ఫ్రాన్స్)-16👉మిరోస్లావ్ క్లోజ్ (జర్మనీ)-16👉రొనాల్డో (బ్రెజిల్)- 15👉గెర్డ్ ముల్లర్ (జర్మనీ)-14👉జస్ట్ ఫాంటైన్ (ఫ్రాన్స్)- 13👉పీలే (బ్రెజిల్)-12Read: 90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన! -
హీట్‌వేవ్ హై అలర్ట్.. వేడుకల్లో మద్యం బంద్
ఐరోపా దేశాలను తీవ్ర వేడిగాలులు వణికిస్తున్న వేళ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ హీట్‌వేవ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో, భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే మ్యూజిక్ ఫెస్టివల్స్, బహిరంగ సంగీత కార్యక్రమాల్లో మద్యం విక్రయాలు, వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించింది.ప్రతి ఏడాది జూన్‌లో నిర్వహించే ప్రముఖ సంగీత వేడుక ‘ఫేట్ డే లా మ్యూజిక్’ సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఈసారి ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నారు. వాతావరణ శాఖ ప్రకారం ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అధిక ఉష్ణోగ్రతల సమయంలో మద్యం సేవించడం వల్ల శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోవడంతో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో స్థానిక పరిపాలన అధికారులు మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వాహకులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. మద్యం విక్రయాలను నిలిపివేయడంతో పాటు, తాగునీటి సరఫరా కేంద్రాలు పెంచడం, నీడ కల్పించే ఏర్పాట్లు చేయడం, అత్యవసర వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం వంటి చర్యలు చేపట్టారు. కాగా, ఇటీవల సంవత్సరాల్లో ఐరోపాలో వాతావరణ మార్పుల ప్రభావంతో తీవ్ర వేడిగాలుల ఘటనలు పెరుగుతున్నాయి.2003లో ఫ్రాన్స్‌లో సంభవించిన ఘోర హీట్‌వేవ్‌లో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో, ఇప్పుడు ప్రభుత్వం వేడిగాలుల హెచ్చరికలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది. అయితే, అధికారుల నిర్ణయంపై కొందరు నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ప్రజల ప్రాణ భద్రతే ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వేడిగాలుల తీవ్రత తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకపోతే మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. -
ఈ పీతను చూస్తే ఫ్రాన్స్‌కు భయం, ఎందుకో తెలుసా?
పిల్లలూ... ఈ పీతను చూడండి. దీని దెబ్బకు ఫ్రాన్స్ దేశం గజగజ వణుకుతోంది. దీని పేరు ‘నీలి పీత’. ‘బ్లూ క్రాబ్’. దీని పుట్టినిల్లు అమెరికా. కాని ఓడల్లో సముద్ర నీరు నింపేటప్పుడు ఎలాగో చేరి ఫ్రాన్స్ సముద్రంలో పడింది. ఇంకేముంది... ఒక్కో ఆడపీత ఒకేసారి లక్షల గుడ్లు పెడుతుంది. అమెరికా సముద్రంలో ఈ పీతల్ని తినే ఆక్టోపస్‌లు ఉన్నాయి. ఫ్రాన్స్ సముద్రంలో లేవు. అమెరికాలో బ్లూ క్రాబ్ విలువైన సీఫుడ్. ప్రతి ఏడాది లక్షల టన్నులు పట్టి తింటారు, ఎగుమతి చేస్తారు. ఫ్రాన్స్‌లో పెద్దగా ఈ అలవాటు లేదు. ఈ నీలి పీతలకు ఆకలి ఎక్కువ. చిన్న చేపల్ని, మరో రకం పీతల్ని గుటుక్కుమనిపిస్తాయి. దాంతో ఫ్రాన్స్‌లో జాలర్లు వల వేస్తే చేపలు పడటం లేదు. ఈ పీతలే పడుతున్నాయి. ఫ్రాన్స్ సైంటిస్టులు మేం ఏమీ చేయలేము అని చేతులెత్తేశారు. ఇవి తగ్గాలంటే పట్టుకుని తినాల్సిందే అన్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పీతలు తినే ప్రోగ్రామ్ నడుస్తోంది. అక్కడ బ్లూ క్రాబ్ బిర్యానీ, బ్లూ క్రాబ్ ఫ్రై ఫేమస్ అయిపోయింది.నీతి: వేరే దేశం నుంచి వచ్చిన జీవులు మన ఇంట్లో సమస్య తెస్తాయి. అందుకే ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదీ చదవండి: రూ. 3,800 కోట్ల గిఫ్ట్ : మురిసిపోయిన డొనాల్డ్ ట్రంప్ -
నాతో ఫొటో కోసం మెలోనీ అడుక్కున్నారు
రోమ్: గొప్పలు చెప్పుకోవడంలో తనకు తానే సాటి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరూపించుకున్నారు. పలుమార్లు భంగపాటు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తనతో ఫొటో కోసం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ యాచించారని ఆయన శుక్రవారం ఉదయం ప్రసారమైన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఉక్రెయిన్ అంశంపై ప్రశ్నించగా, ట్రంప్ మాత్రం హఠాత్తుగా సందర్భం లేకుండా మెలోనీ ప్రస్తావన తీసుకొచ్చారు. తనతో ఫొటో కోసం ఆమె ‘అడుక్కున్నారని’చెప్పారు. నిజానికి ఆమెతో ఫోటో దిగడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని.. కానీ జాలిపడి అంగీకరించానని అన్నారు. చివరకు దయతలచి మెలోనీతో ఫొటో దిగినట్లుగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్, మెలోనీ పలు సందర్భాల్లో పక్కపక్కనే కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఫొటో కోసం ఆమె ట్రంప్‌ను ప్రాధేయపడినట్లుగా ఎక్కడా కనిపించలేదు. అవి బుద్ధిలేని మాటలు ట్రంప్ వాచాలత్వం పట్ల జార్జియా మెలోనీ తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తాను గానీ, ఇటలీ గానీ ఏనాడూ ఒకరి ముందు చెయ్యి చాచబోమని తేల్చిచెప్పారు. ట్రంప్ మాటలు పూర్తిగా కల్పితమని కొట్టిపారేశారు. అయినా ఒక మిత్రదేశం గురించి ఆయన అలాంటివి ఎలా సృష్టించగలుగుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని విషయాల్లో తక్షణమే స్పందించాల్సి ఉంటుంది కాబట్టి తాను స్పందిస్తున్నానని వివరించారు. ట్రంప్ నోటిదురుసు చూసి తాను దిగ్భ్రాంతి చెందానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. ఏదేమైనా ఆయన ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదని గుర్తుచేశారు. ‘‘పశ్చిమ దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ట్రంప్ అదే దృఢ సంకల్పాన్ని చూపకపోవడం సిగ్గుచేటు అని మాత్రమే నేను చెప్పగలను. ఒక్క విషయం మాత్రం ట్రంప్ గుర్తుంచుకోవాలి. నేను గానీ, ఇటలీ గానీ ఏనాడూ ఒకరి ముందు యాచించం’’అని మెలోనీ స్పష్టంచేశారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను ఇటలీ మంత్రులు, ప్రభుత్వ అధికారులు కూడా ఖండించారు. అవి బుద్ధిలేని మాటలు అంటూ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ అన్నారు. అంతేకాకుండా తన అమెరికా పర్యటనను రద్దుచేసుకున్నారు. అయితే, ట్రంప్ మాటల పట్ల జార్జియా మెలోనీ ప్రతిస్పందనపై అమెరికా ఇంకా బదులివ్వలేదు. అందుకేనా వ్యతిరేకత? అమెరికా, ఇటలీ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మెలోనీ ప్రయతి్నస్తున్నారు. అయితే, ఇటలీపై అమెరికా–ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధాన్ని తప్పుపట్టారు. ఇది చట్టవిరుద్ధమని తేల్చిచెప్పారు. అమెరికా చర్యను ఆక్షేపించారు. ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికాకు సహకరించేందుకు నిరాకరించారు. దాంతో ఆమె పట్ల ట్రంప్ వ్యతిరేకత పెంచుకున్నట్లు కనిపిస్తోంది. -
పెట్టుబడులతో ముందుకు రావాలి
పారిస్: భారత్‌లో వ్యాపార అభివృద్ధికి, విస్తరణకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన గురువారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో పలు అగ్రశ్రేణి కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో(సీఈఓలు) సమావేశమయ్యారు. పెట్టుబడి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. నౌకాయానం, సరుకు రవాణా, రైల్వేలు, నిర్మాణం, కృత్రిమ మేధ(ఏఐ) సహా పలు కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై సంప్రదింపులు జరిపారు.భారతదేశంలో ఉన్న అవకాశాలపై చర్చలు జరిపామని సీఎంఏ సంస్థ సీఓఓ రొడాల్ప్ సాదే పేర్కొన్నారు. ఓడల నిర్మాణం, ఓడల రీసైక్లింగ్, లోతైన సముద్ర ఓడరేవులు, అలాగే కంటైనర్ల నిర్మాణం గురించి కూడా మోదీతో చర్చించామని తెలిపారు. ఫ్రాన్స్, భారత్‌లు పరస్పర సహకారాన్ని కొనసాగించడంలోనూ, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంలోనూ గొప్ప అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు చెప్పారు. సెయింట్ గోబైన్ సంస్థ సీఈఓ బెనాయిట్ బెజిన్, అల్‌స్టామ్ సీఈఓ మార్టిన్ సియోన్, మిస్ట్రాల్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆర్థర్ మెన్స్‌ను సైతం మోదీ కలుసుకున్నారు. అందరికీ అందుబాటులో టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. భారతదేశం దృష్టిలో ఏఐ అంటే ‘అందరినీ కలుపుకొని పోయేది’అని తెలిపారు. అమెరికా ఇటీవల కొన్ని కృత్రిమ మేధ(ఏఐ) నమూనాల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలని మోదీ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం పారిస్‌లో వివాటెక్–2026 టెక్నాలజీ సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీల్లో సగం తమ దేశంలోనే జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఆర్థిక సమ్మిళితం, విద్య, టెలిమెడిసిన్, వ్యవసాయం, ఇతర రంగాల్లో సాంకేతికతను భారీ స్థాయిలో వినియోగిస్తున్నామని తెలిపారు.సాంకేతికత, నూతన ఆవిష్కరణలు అందరికీ అందుబాటు ఉండడం చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. సాంకేతికత ప్రజాస్వామీకరణతోనే పురోగతి సాధ్యపడుతుందని వివరించారు. ఈ విప్లవాత్మక మార్పుల యుగంలో టెక్నాలజీ అందరికీ ప్రయోజనం చేకూర్చాలని భారత్ విశ్వసిస్తోందని అన్నారు. ఏఐ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరచాలని వ్యాఖ్యానించారు. ‘‘మా విధానం స్పష్టంగా ఉంది. మా ప్రభుత్వం సహకరిస్తుంది. పరిశ్రమలు ఆవిష్కరణలు చేస్తాయి. స్టార్టప్‌లు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయి. ప్రపంచ భాగస్వాములు మాతో కలిసి అభివృద్ధి చెందుతారు. మనమందరం కలిసి మునుపెన్నడూ లేనంత వేగంగా ముందుకు సాగుదాం’’అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. తమతో కలిసి పని చేయాలని, అందరికీ ఫలితాలను అందించాలని కోరారు. పారిస్‌లో మోదీకి ఘన స్వాగతం ఫ్రాన్స్‌లోని ఎవియన్–లెస్–బెయిన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాజధాని పారిస్‌కు చేరుకున్నారు. పారిస్‌లోని ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ పురోగతికి భారత్–ఫ్రాన్స్ భాగస్వామ్యం అత్యంత కీలకమని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. భారతదేశాన్ని, ఫ్రాన్స్‌ను మరింత సన్నిహితంగా మార్చడానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని చూసి తాను గర్వపడుతున్నానని స్పష్టంచేశారు. -
భారత నావికుల భద్రతే ముఖ్యం
ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారు. అమెరికా, ఇరాన్ ఒప్పందంతో వారి భద్రతకు కచ్చితమైన హామీ లభిస్తుందని ఆశిస్తున్నా. – మోదీనా దృష్టిలో మోదీ చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్. నా మిత్రుడు మోదీ ప్రధానిగా ఉండగా ఎవరైనా భారత్‌పై దాడి చేయడానికి సాహసిస్తే వెంటనే వారి అంతు చూస్తాం. – ట్రంప్ఎవియన్–లెస్–బెయిన్స్: హార్మూజ్ జలసంధి సహా అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాల్లో భారత నావికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. బుధవారం ఫ్రాన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నావికుల భద్రత అంశాన్ని మోదీ ప్రస్తావించారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఆ ప్రాంతంలో భారత నావికులకు ఎదురవుతున్న ఇబ్బందులను ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు.వారికి భద్రత కల్పించే అంశాన్ని ఇరాన్‌తో ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో చేర్చాలని కోరారు. ఇటీవల ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు పాల్పడడంతో ముగ్గురు భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అమెరికా దుశ్చర్యను ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు.అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందితే మోదీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత నావికుల భద్రత గురించి ట్రంప్‌తో భేటీలో మోదీ ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వారిద్దరూ భారత్, అమెరికా సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హార్మూజ్ జలసంధిని తెరవాల్సిందే పశ్చిమాసియా సంఘర్షణను ముగించడానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ అభినందించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరే శాంతి ఒప్పందంలో భారత నావికుల భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని స్పష్టంచేశారు. అక్కడ ఎల్లప్పుడూ స్వేచ్ఛాయుత నౌకాయానికి అనుకూల పరిస్థితులు ఉండాలని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారని, వారి భద్రత తమ అత్యంత కీలకమని వివరించారు. అమెరికా, ఇరాన్ ఒప్పందంతో వారి భద్రతకు కచ్చితమైన హామీ లభిస్తుందని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం విషయంలో సాధించిన పురోగతిని తాము సమీక్షించామని వెల్లడించారు. మోదీ చాలా కఠినమైన వ్యక్తి, కిల్లర్ భారత ప్రధాని మోదీతో అద్భుతమైన సమావేశం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. సమీప భవిష్యత్తులో భారత్‌లో పర్యటిస్తానని చెప్పారు. ‘‘మోదీ చాలా మంచి మనిíÙ, సౌమ్యుడు, నెమ్మదస్తుడు అని అంటుంటారు. మోదీ అత్యంత అందమైన వ్యక్తి. చూడ్డానికి చాలా బాగుంటారు. అచ్చం దేవదూతలా కనిపిస్తారు. మోదీని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ, నిజానికి నా దృష్టిలో ఆయన చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్. వ్యాపారం, వాణిజ్య చర్చల్లో మోదీ చాలా కఠినంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారు.ఆయనకు భారతీయ ప్రజలంటే ఇష్టం, అలాగే అమెరికా అంటే కూడా ఇష్టమే’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా అభివరి్ణంచారు. ‘‘మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ప్రతి విషయంలోనూ భారత్ కీలక పాత్ర పోషిస్తుందని నేను భావిస్తున్నా. భారత్ ఒక పెద్ద పాత్రను పోషించబోతోంది. నేను వైట్‌హౌస్‌లో ఉన్నంత కాలం అమెరికాలో భారత్‌కు ఒక మంచి మిత్రుడు(ట్రంప్) ఉంటారు. ఒమన్ తీరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించిన విషయం నాకు తెలిసింది. వారికి నా సంతాపం తెలియజేస్తున్నా.అది చాలా కఠినమైన వృత్తి, అందులో ఎలాంటి సందేహం లేదు. భారత్‌తో మేము కలిసి పనిచేస్తాం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో మేము చాలా సమీపంలోకి వచ్చేశాం. ఉద్యోగాలు, ఉపాధి విషయంలోనూ రెండు దేశాలు చక్కగా సహకరించుకుంటున్నాయి’’అని ట్రంప్ వివరించారు. 2020లో భారత్‌లోని అహ్మదాబాద్‌లో తనకు లభించిన గౌరవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారని, అది తనకు ‘గొప్ప సమయం’అని చెప్పారు.వచ్చే నెల అమల్లోకి ట్రేడ్ డీల్ మోదీ, స్టార్మర్ ప్రకటన ఎవియన్–లెస్–బెయిన్స్: భారత్, యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ బుధవారం ప్రకటించారు. వారు ఫ్రాన్స్‌లో జీ7 భేటీ సందర్భంగా సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలతోపాటు ఒప్పందం అమలుపై చర్చించారు. ఈ ట్రేడ్ డీల్ భారత్–యూకే సంబంధాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయి అని మోదీ అభివరి్ణంచారు. ఇది వచ్చే నెల 15న అమల్లోకి రానుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఫ్రెడరిక్ మెర్జ్‌తో భేటీ ప్రధాని మోదీ జర్మన్ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణపై కూడా ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, జర్మనీలు కేవలం వాణిజ్య రంగంలోనే కాకుండా, భవిష్యత్తుకు సంబంధించిన వివిధ అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కూడా సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని మోదీ వివరించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఎఫ్‌టీఏపై సంతకాలు యూరోపియన్ యూనియన్ అగ్రనేత ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ప్రధాని మోదీ కూడా సమావేశమయ్యారు. రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆఖరి నాటికి భారత్, యూరోపియన్ యూనియన్లు ప్రతిష్టాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై సంతకం చేయనున్నాయని లేయెన్ తెలిపారు. ఎల్లప్పుడూ శాంతి పక్షాన భారత్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ భేటీ అయ్యారు. మానవతా విలువలకు భారత్ ప్రా ధాన్యం ఇస్తోందని మోదీ చెప్పారు. తాము శాంతి పక్షాన నిలుస్తామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన అంశాలను తాము సమీక్షించామని పేర్కొన్నారు. -
ఎంబాపె ‘డబుల్’ ధమాకా
గత వరల్డ్‌కప్ రన్నరప్ ఫ్రాన్స్ కూడా విజయంతో గెలుపు బోణీ కొట్టింది. గ్రూప్ ‘ఐ’లో భాగంగా భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3–1 గోల్స్ తేడాతో సెనెగల్ జట్టును ఓడించింది. కెప్టెన్ కిలియన్ ఎంబాపె (66వ, 90+6వ నిమిషంలో) రెండు గోల్స్‌తో విజృంభించగా... బ్రాడ్లీ బార్కోలా (82వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. సెనెగల్ తరఫున ఇబ్రహీం ఎంబాయె (90+5వ నిమిషంలో) ఏకైక గోల్ నమోదు చేశాడు. 2002 ప్రపంచకప్‌లో సెనెగల్‌తో ఆడిన ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయిన ఫ్రాన్స్‌కు ఈసారి కూడా గట్టిపోటీనే ఎదురైంది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ ఎంబాపెను సెనెగల్ డిఫెండర్లు కట్టడి చేశారు. దాంతో తొలి అర్ధభాగంలో ఎంబాపె కేవలం 14 సార్లు మాత్రమే బంతిని టచ్ చేశాడు. అయితే రెండో అర్ధభాగంలో ఎంబాపెను నిలువరించడంలో సెనెగల్ ప్లేయర్లు విఫలమయ్యారు. 66వ నిమిషంలో మైకేల్ ఒలిసె అందించిన పాస్‌ను ఎంబాపె గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఖాతా తెరిచిన తర్వాత ఫ్రాన్స్ మరింత జోరును పెంచింది. బార్కోలా గోల్‌తో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన ఫ్రాన్స్ ఇంజ్యూరీ టైమ్‌లో గోల్ సమర్పించుకుంది. అయితే ఆ వెంటనే ఎంబాపె 30 అడుగుల దూరం నుంచి కళ్లు చెదిరే కిక్‌తో ఫ్రాన్స్ ఖాతాలో మూడో గోల్ చేరింది.పోర్చుగల్‌ను నిలువరించిన కాంగోహ్యూస్టన్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. భారీ విజయంతో బోణీ కొడుతుందనుకున్న క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు తొలి మ్యాచ్‌ను ‘డ్రా’తో సరిపెట్టుకుంది. 52 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో జట్టు అసాధారణ ఆటతీరును కనబరిచింది. రొనాల్డో కెప్టెన్సీలోని పోర్చుగల్‌తో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఆరో నిమిషంలో నెవాస్ గోల్‌తో పోర్చుగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 45+5వ నిమిషంలో యోన్ విస్సా గోల్‌తో కాంగో జట్టు స్కోరును 1–1తో సమం చేసింది. ప్రపంచకప్ చరిత్రలో కాంగో జట్టుకు తొలి గోల్ అందించిన ప్లేయర్‌గా విస్సా నిలిచాడు. 1974 ప్రపంచకప్‌లో కాంగో జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఒక్క గోల్ కూడా చేయకుండానే ఓడిపోయింది. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా వరుసగా ఆరో ప్రపంచకప్ ఆడిన రెండో ప్లేయర్‌గా పోర్చుగల్ దిగ్గజం, 41 ఏళ్ల రొనాల్డో గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో మెస్సీ సరసన రొనాల్డో నిలిచాడు. 58 అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ ప్లేయర్‌గా ఎంబాపె గుర్తింపు పొందాడు. 57 గోల్స్‌తో ఒలివర్ గిరూడ్ పేరిట ఉన్న రికార్డును ఎంబాపె బద్దలు కొట్టాడు.14 ప్రపంచకప్ చరిత్రలో ఎంబాపె చేసిన గోల్స్. ఈ మెగా ఈవెంట్లో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ ప్లేయర్‌గా ఎంబాపె అవతరించాడు. 13 గోల్స్‌తో జస్ట్ ఫోంటెన్ పేరిట ఉన్న రికార్డును ఎంబాపె సవరించాడు. ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో ఎంబాపె మూడో స్థానానికి ఎగబాకాడు.ఆ్రస్టియా... 1990 తర్వాతశాన్ఫ్రాన్సిస్కో: తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆసియా జట్టు జోర్డాన్‌కు నిరాశ ఎదురైంది. గ్రూప్ ‘జె’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టియా 3–1తో జోర్డాన్‌ను ఓడించింది. ఆ్రస్టియా తరఫున రొమానో (20వ నిమిషంలో), మార్కో అర్నాటోవిక్ (90+12వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. జోర్డాన్ ప్లేయర్ యాజాన్ అలారబ్ (76వ నిమిషంలో) సెల్ఫ్ గోల్ సాధించాడు. జోర్డాన్ తరఫున అలీ ఒల్వాన్ (50వ నిమిషంలో) రెగ్యులర్ గోల్ చేశాడు. చివరిసారి 1998లో ప్రపంచకప్‌లో ఆడిన ఆ్రస్టియా 1990 తర్వాత ప్రపంచకప్‌లో గెలుపు రుచి చూసింది. 1998లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆ్రస్టియా 1990లో 2–1తో అమెరికాపై నెగ్గింది. 1994 ప్రపంచకప్ టోర్నీకి ఆ్రస్టియా అర్హత సాధించలేదు. -
లేట్ గా వచ్చిన లేటెస్ట్గా.. నేనే బాస్.. G7లో ట్రంప్
పారిస్ : ఫ్రాన్స్‌లో జరిగిన 52వ జీ7 శిఖరాగ్ర సమావేశంలో బుధవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యారు. ఆయన ప్రవేశిస్తుండగా సభికులు లేచి నిలబడి చప్పట్లతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. దీంతో నేనే ఇక్కడ బాస్ అంటూ ఆయన సరదాగా మాట్లాడారు.అనంతరం ఆయన జీ7 ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు."మనం నిజంగా అంతర్జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలనుకుంటే, ఈ సంక్షోభాల భారాన్ని అత్యంత బలహీన దేశాలు ఒంటరిగా మోయకూడదు. నేడు అనేక సమాజాలు వృద్ధాప్యం వైపు పయనిస్తుండగా, భారతదేశం మరియు గ్లోబల్ సౌత్‌లోని ఇతర దేశాలు యువ ప్రతిభ, నైపుణ్యాలతో ఉప్పొంగుతున్నాయి.అని భారత్‌ను ప్రశంసిస్తూ మాట్లాడారు.అంతకుముందు సమావేశంలో మాట్లాడిన భారత ప్రధాని 'పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఇంధనం, ఎరువులు, ఆహార సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాలు గ్లోబల్ సౌత్‌పై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని మోదీ అన్నారు. కాగా జీ 7 దేశాలలో భారత్ సభ్య దేశంగా లేదు. అయినప్పటికీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు సదస్సులో పాల్గొనడానికి మోదీ ఫ్రాన్స్ వెళ్లారు.కాగా ఈ రోజు సాయంత్రం ట్రంప్‌తో, మోదీ భేటి జరగనుంది. వాణిజ్య ఒప్పందంతో సహా పలు అంశాలపై ఈ ఇద్దరు నాయకులు చర్చించే అవకాశం ఉంది. వీరు చివరిసారిగా 16 నెలల క్రితం, 2025 ఫిబ్రవరిలో వాషింగ్టన్లో సమావేశమయ్యారు. -
నావికులకు భద్రత కల్పించాలి!
ఎవియన్–లెస్–బెయిన్స్: సముద్ర రవాణా మార్గాలు సురక్షితంగా ఉండేలా, నావికులు నిర్భయంగా తమ విధులను నిర్వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. సముద్ర వాణిజ్యం ద్వారా అన్ని దేశాలను అనుసంధానించే నావికులకు తగిన భద్రత కచ్చితంగా కల్పించాలన్నారు. మంగళవారం ఫ్రాన్స్‌లో జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. నౌకల్లో విధులు నిర్వర్తించే నావికుల భద్రత గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల ఒమన్ తీరంపై వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేయడంతో ముగ్గురు భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. అమెరికా దుశ్చర్యను భారత్ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. హార్మూజ్ జలసంధిలో సముద్ర వాణిజ్యానికి కలిగిన అంతరాయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించాయని మోదీ తెలిపారు. పశ్చిమాసియా సంఘర్షణలో పలువురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. సంఘర్షణలకు శాశ్వత పరిష్కార మార్గాలను చర్చలు, దౌత్యం, అంతర్జాతీయ సహకారం ద్వారా మాత్రమే కనుగొనాలని చెప్పారు. ప్రపంచం ‘దాత–గ్రహీత’ అనే విధానం నుంచి సంఘీభావం, సమానత్వంపై ఆధారపడిన భాగస్వామ్యాల వైపు పయనించాలని మోదీ చెప్పారు. పరస్పర అనుసంధానం వేగంగా పెరుగుతున్న నేటి ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించడంలో ‘విశ్వాసం’అత్యంత కీలకమని స్పష్టంచేశారు. ‘ఒకరు దాత, మరొకరు గ్రహీత’ అనే విధానాన్ని వదులుకోవాలని, మనమంతా సమాన భాగస్వాములుగా పనిచేయాలని వ్యాఖ్యానించారు. మనం కేవలం ఒకరి పక్కన ఒకరు నడవడమే కాకుండా.. కలిసి నడవాలన్నారు. భాగస్వామ్యాలు గౌరవంతో ముడిపడి ఉండాలి తప్ప పరా«దీనతతో కాదని తేల్చిచెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి: ట్రంప్ మూడున్నర నెలలుగా కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇకపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించడంపై దృష్టి పెడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ అంశం కంటే ఇరాన్ వివాదమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. ఇరాన్ వ్యవహారం ఇక వెనక్కి వెళ్లిపోయినట్లేనని ట్రంప్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణను ముగించడానికి తాను చేయల్సిందంతా చేస్తానని వెల్లడించారు. జీ7 సదస్సులో ట్రంప్‌తోపాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం పాల్గొన్నారు. ఉదయం వర్కింగ్ సెషన్ 75 నిమిషాల్లోనే ముగిసింది. రష్యా చమురు, సహజ వాయువు రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షల ద్వారా ఆ దేశంపై ఒత్తిడిని పెంచడానికి ట్రంప్‌తో సహా జీ7 దేశాల నాయకులు అంగీకరించినట్లు సమాచారం. ఈ సదస్సులో ఉక్రెయిన్ అంశంపై చాలా ఫలవంతమైన సంభాషణ జరిగిందని ఓ దౌత్యవేత్త చెప్పారు. అదనపు వైమానిక రక్షణ సామర్థ్యాలు, ఇతర రక్షణలు సమకూర్చడం ద్వారా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడంపైనా నాయకులు అంగీకారానికి వచ్చారని తెలిపారు. కెనడా ప్రధానితో మోదీ భేటీ ప్రధాని మోదీ మంగళవారం కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇంధనం, ఆవిష్కరణలు, విద్య, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాల ద్వారా బలమైన భాగస్వామ్యాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు సందర్భంగా ఈ భేటీ జరిగింది. భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. హలో మై ఫ్రెండ్ జీ7 సదస్సు వేదిక వద్ద మోదీ, ట్రంప్ ఆత్మీయ సంభాషణ 16 నెలల తర్వాత ముఖాముఖి నేడు పూర్తిస్థాయి ద్వైపాక్షిక సమావేశం ఎవియన్–లెస్–బెయిన్స్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 16 నెలల తర్వాత ముఖాముఖి కలుసుకున్నారు. ఫ్రాన్స్‌లోని ఎవియన్–లెస్–బెయిన్స్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మంగళవారం వారిద్దరూ ఆప్యాయంగా కరచాలనం చేసుకుని, ఆ తర్వాత కాసేపు సంభాషించారు. క్లుప్తంగా చర్చించుకున్నారు. వారు సంభాషణకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఇరువురు నేతల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక చర్చలు బుధవారం జరుగుతాయి. పశ్చిమాసియా సంక్షోభం, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణ, భారత్–అమెరికా సంబంధాలు సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకొనే అవకాశం ఉంది. మోదీ గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్లో పర్యటించారు. అప్పట్లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు ఫోన్లో పలుమార్లు మాట్లాడుకున్నప్పటికీ ముఖాముఖి కలుసుకొని చర్చించుకోవడం ఇదే మొదటిసారి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, అమెరికా మధ్య సంబంధాలు కొంత బలహీనపడ్డాయి. ఇరుదేశాల మధ్య కొన్నాళ్లు టారిఫ్‌ల యుద్ధం సాగింది. చమురు కొనుగోలు విషయంలోనూ భారత్‌పై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. భారత్, అమెరికా మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్ ప్రకటించడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ఆపరేషన్ సింధూర్ను నిలిపివేయడం వెనుక ట్రంప్ ప్రమేయం లేదని భారత్ పలుమార్లు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ట్రంప్ తీసుకొచ్చిన నూతన వలస విధానం, హెచ్–1బీ వీసా రుసుమును పెంచడం వంటి నిర్ణయాలు భారత్–అమెరికా సంబంధాలపై ఒత్తిడి పెంచాయి. -
మెస్సీని అధిగమించిన ఎంబపే.. సెనెగల్పై ఫ్రాన్స్ గెలుపు
ఫిఫా వరల్డ్‌కప్-2026లో ఫ్రాన్స్ స్టార్ ఫార్వర్డ్ కైలియన్ ఎంబపే అరుదైన ఘనత సాధించాడు. సెనెగల్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో రెండు గోల్స్ నమోదు చేయడంతో వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో దిగ్గజాలు లియోనల్ మెస్సీ, పీలేలను అధిగమించాడు. అలాగే తన దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగానూ అవతరించాడు.ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లు:క్లోస్ (జర్మనీ) – 16రొనాల్డో (బ్రెజిల్) – 15ముల్లర్ (జర్మనీ) – 14ఎంబపే (ఫ్రాన్స్) – 14మెస్సీ (అర్జెంటీనా) – 13ఫోంటైన్ (ఫ్రాన్స్) – 13పీలే (బ్రెజిల్) – 12ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లు:ఎంబపే – 58గిరౌద్ – 57మ్యాచ్ విషయానికొస్తే.. ఎంబపే రెండు గోల్స్‌తో చెలరేగడంతో సెనెగల్పై ఫ్రాన్స్ 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఈ గ్రూప్-ఐ మ్యాచ్‌లో ఎంబపేతో పాటు ఫ్రాన్స్ తరఫున బ్రాడ్లే బర్కోలా మరో గోల్ చేశాడు.66వ నిమిషంలో అద్భుతమైన పరుగుతో గోల్ సాధించిన ఎంబపే, ఆతర్వాత ఇంజరీ టైమ్‌లో (96వ నిమిషంలో) 25 గజాల దూరం నుంచి అద్భుత షాట్‌తో మరో గోల్ కొట్టి మ్యాచ్‌ను ఫ్రాన్స్ వైపు తిప్పేశాడు.సెనెగల్ తరఫున ఇబ్రహీం ఎంబయే ఒక గోల్ సాధించి స్కోరు 2-1కు తగ్గించినా, వెంటనే ఎంబపే మెరుపు గోల్‌తో ఫ్రాన్స్ విజయాన్ని ఖాయం చేశాడు.మ్యాచ్ మొత్తం ఎంబపే ఆధిపత్యం కనిపించింది. అతడు అత్యధికంగా నాలుగు షాట్లు ప్రయత్నించడమే కాకుండా, ప్రత్యర్థి బాక్స్‌లో ఏడు సార్లు బంతిని తాకాడు. ఈ మ్యాచ్‌లో ఎంబపే కెప్టెన్‌గానూ ఆకట్డుకున్నాడు. ఈ విజయంతో ఫ్రాన్స్ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. -
ద్వైపాక్షిక వాణిజ్యం ఐదేళ్లలో రెట్టింపు
పారిస్: వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేసుకోవాలని భారత్, ఫ్రాన్స్ నిశ్చయించుకున్నాయి. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 16 మిలియన్ డాలర్లుగా ఉంది. కృత్రిమ మేధ(ఏఐ), స్టార్టప్‌లు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆరోగ్యం సహా కీలక రంగాలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నిర్ణయానికి వచ్చారు.ఆదివారం వారిద్దరూ ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–ఫ్రాన్స్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు. ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరత, భద్రత, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాలపై చర్చించారు. కాన్పూర్‌లో ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో సంబంధాలను పటిష్టం చేసుకోవడంపై ఇరువురు మోదీ, మేక్రాన్ ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే సైన్స్, అంతరిక్షం, స్టార్టప్‌లు, ఫిన్‌టెక్, పౌర అణుశక్తి, మౌలిక సదుపాయాల రంగాలపైనా చర్చ జరిగింది. మొత్తం 13 అంశాలపై అంగీకారం కుదిరింది. ఆవిష్కరణల(ఇన్నోవేషన్) కోసం ఉమ్మడిగా రోడ్‌మ్యాప్ ఏర్పాటు చేసుకోవాలని, రాబోయే ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఒక యంత్రాంగాన్ని నెలకొల్పాలని, ఉమ్మడి ఏఐ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.అలాగే హైస్పీడ్ రైల్వే రంగంలో సహకారం కోసం డిక్లరేషన్, వర్గీకృత డేటాను పరిరక్షించే భద్రతా ఒప్పందాన్ని కూడా ఇరుపక్షాలు ఖరారు చేశాయి. ఇండియాకు చెందిన యూపీఐ చెల్లింపుల సేవలను ఫ్రాన్స్‌కు సైతం విస్తరింపజేయనున్నారు. ఫ్రెంచ్ రక్షణ రంగ దిగ్గజం దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న భారతదేశ ప్రణాళిక కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది.మోదీ–మేక్రాన్ భేటీ అనంతరం.. ఏరోనాటిక్స్, అనుబంధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కాన్పూర్‌లో ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేయనున్నట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా ఫ్రాన్స్ విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు. -
సవాళ్లకు పరిష్కారాల భారత్
పారిస్: భారత్ ఇకపై ప్రపంచ దేశాల పరిష్కారాలను వినియోగించుకునే దేశం మాత్రమే కాదని.. సవాళ్లకు పరిష్కార మార్గాలు సూచించే దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మానవ కేంద్రీకృత ఆవిష్కరణలు, సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. మోదీ ఆదివారం ఫ్రాన్స్‌లోని నైస్ సిటీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి ‘భారత్ ఇన్నోవేట్స్’కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండియా, ఫ్రాన్స్ సహా వివిధ దేశాల స్టార్టప్ కంపెనీలు పాల్గొన్నాయి.నూతన ఆవిష్కరణలు, సమ్మిళితత్వం వేర్వేరు కాదని... అవి పరస్పర ఆధారితమని తాము నిరూపించిట్లు మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఏ ఆవిష్కరణ గొప్పతనమైనా కేవలం దాని విలువలో కాకుండా, మానవ జీవితాలపై అది చూపే ప్రభావంపై ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు.దశాబ్దం క్రితం వరకు ప్రపంచం భారతదేశాన్ని సాంకేతికతను స్వీకరించే దేశంగా చూసేదని, నేడు దేశం సాంకేతికతను అందించే దేశంగా ఎదుగుతోందని హర్షం వ్యక్తంచేశారు. అంతేకాకుండా తమ దేశం సృష్టించే ఆవిష్కరణలు, అందించే పరిష్కార మార్గాలు మానవాళికి ప్రయోజనం చేకూరుస్తాయని వెల్లడించారు. ‘భారత్ ఇన్నోవేట్స్’లక్ష్యం ఇదేనని అన్నారు. సమ్మిళిత, మానవ–కేంద్రీకృత సాంకేతికత, నూ తన ఆవిష్కరణల ప్రాముఖ్యతను ప్రస్తావించారు. సాంకేతిక విప్లవంతో కొత్త అవకాశాలు అత్యాధునిక సాంకేతికత, అణు శక్తి, రక్షణ, ఆవిష్కరణలతో సహా పలు కీలక రంగాల్లో తన ప్రభుత్వం సంస్కరణలు చేపట్టినట్లు ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సంస్కరణల పరంపర ఇక్కడితో ఆగదని, ఇది కొనసాగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు. ఇండియా నుంచి వెలువడే స్టార్టప్‌ల సంఖ్య అనేక రెట్లు పెరుగుతూనే ఉంటుందన్నారు. వివిధ దేశాల మధ్య సంఘర్షణలు, తీవ్రతరమవుతున్న వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని మోదీ గుర్తుచేశారు. అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ అవకాశాలు సైతం విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు.కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్ష సాంకేతికతలు, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ మానవాళి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని వెల్లడించారు. ఇవి మానవ నాగరికతలో తదుపరి అధ్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తాయని అన్నారు. ప్రతి సాంకేతిక విప్లవం మానవాళికి ఒక కొత్త అవకాశాన్ని కల్పిస్తుందని వివరించారు.ప్రపంచం కోసం, సుస్థిర భవిష్యత్తు కోసం భారత్ అనేక ఆవిష్కరణలు చేస్తోందని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణ అనేది దేశం డీఎన్ఏలోనే ఉందని స్పష్టంచేశారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఒక ప్రత్యేక భాగస్వామ్యం ఉందని వెల్లడించారు. ఇందులో అనుబంధం, దృఢ విశ్వాసం, ఆవిష్కరణ, స్ఫూర్తి, ఉమ్మడి దార్శనికత ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ పునాది ఆధారంగానే గత కొన్నేళ్లుగా ఉమ్మడిగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించామని మోదీ చెప్పారు. ఆవిష్కరణల దేశం భారత్: మేక్రాన్ కృత్రిమ మేధ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి కీలక రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య నిజమైన భాగస్వామ్యం ఉందని ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చెప్పారు. భారత్ ఒక ఆవిష్కరణల దేశమని ప్రశంసించారు. ‘భారత్ ఇన్నోవేట్స్’ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. ‘మేక్–ఇన్–ఇండియా’ను గౌరవిస్తున్నామని తెలిపారు. ఇందులో వివిధ రంగాల్లో ఫ్రాన్స్ ఇందులో భాగస్వామిగా ఉందని వివరించారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్ల రంగంతో సహా పౌర అణు ఇంధన రంగంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.‘భారత్ ఇన్నోవేట్స్’లో స్టార్టప్‌ల ఎగ్జిబిషన్‌ను మోదీ, మేక్రాన్ తిలకించారు. నూతన ఆవిష్కర్తలు, పరిశోధకులు, వ్యాపారవేత్తలు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, రక్షణ, అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్, క్లీన్ ఎనర్జీ తదితర రంగాలకు చెందిన స్టార్టప్‌లు ఇందులో పాల్గొన్నాయి. గతంలో ఇండియాలోని జైపూర్‌లో జరిగిన ఆర్ట్ రెసిడెన్సీకి హాజరై, భారతీయ సంస్కృతి, కళల నుంచి స్ఫూర్తి పొందిన ఇద్దరు ఫ్రెంచ్ కళాకారులు తయారు చేసిన కళాకృతులను ‘భారత్ ఇన్నోవేట్స్’లో ప్రదర్శించగా మోదీ, మేక్రాన్ తిలకించారు. -
ఈ ఎక్స్‌ప్రెస్ ఆగేదేలేదు: ఫ్రాన్స్‌లో మోదీ
పారిస్: ఫ్రాన్స్‌లో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. రెండు దేశాలు ఉమ్మడి విలువలు, ఉమ్మడి ప్రయోజనాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు.భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం భద్రత నుంచి స్థిరమైన అభివృద్ధి వరకు విస్తరించిందని ప్రధాని మోదీ అన్నారు. “ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌దే. ఈ ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ ఆగదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. స్టార్టప్‌ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. భారత్‌తో కలిసి పనిచేయండి. ప్రపంచం కోసం సాంకేతికను అభివృద్ధి చేయండి. భారత్ వేగంగా, విస్తృత స్థాయిలో ఆవిష్కరణలు చేస్తోంది. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణలు చేస్తోంది. ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తోంది.సాంకేతికత, ఆవిష్కరణలు, విధానాలు అన్నీ మనుషుల అవసరాలు, సంక్షేమం, జీవన నాణ్యతను మెరుగుపరచడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నాం. ఆవిష్కరణ భారత్ డీఎన్ఏలో ఉంది. గత 12 ఏళ్లలో భారత్ బలమైన ఆవిష్కరణ వ్యవస్థను నిర్మించింది.భారత్-ఫ్రాన్స్ మధ్య ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. ఇందులో నమ్మకం, ఆవిష్కరణ, స్ఫూర్తి, ఉమ్మడి దార్శనికత ఉన్నాయి. భారత్ యువ ఆవిష్కర్తలు మానవాళి మొత్తానికి ఉపయోగపడే వాటిని కనుగొంటున్నారు” అని ప్రధాని మోదీ చెప్పారు.భారత్‌పై మెక్రాన్ ప్రశంసల జల్లుఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత్ ఆవిష్కరణ వ్యవస్థను ప్రశంసించారు. భారత్ తమ దేశంలో నిర్వహించిన తొలి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.“భారత్ ఆవిష్కరణలు చేస్తోందా లేదా అన్నది ప్రశ్న కాదు. భారత్‌తో కలిసి ఎవరు ఆవిష్కరణలు చేస్తారు అన్నదే అసలు ప్రశ్న” అని మాక్రాన్ అన్నారు. భారత్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు ఆతిథ్యం ఇవ్వడం ఫ్రాన్స్‌కు గర్వకారణమని చెప్పారు.భారత్ సాంకేతిక విజయాలను ప్రస్తావిస్తూ చంద్రయాన్ - 3 ల్యాండింగ్ విజయాన్ని ఉదాహరణగా చూపించారు. ఆ మిషన్ భారత్ ఆవిష్కరణ శక్తి, అమలు సామర్థ్యం, పారిశ్రామిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిందని అన్నారు. “పరిశోధన, ఆవిష్కరణ, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా ముందుకెళ్తోంది. ప్రపంచ ఆవిష్కరణ నాయక దేశంగా అవతరిస్తోంది” అని మాక్రాన్ చెప్పారు.కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పు వంటి కీలక రంగాల్లో భారత్-ఫ్రాన్స్ మధ్య నిజమైన భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర అణుశక్తి రంగంలో, ముఖ్యంగా చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్ల విషయంలో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. -
17న ట్రంప్, మోదీ భేటీ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. వారిద్దరూ ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని వైట్‌హౌస్ శనివారం వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న చర్చల పట్ల వారు అభిప్రాయాలు పంచుకొనే అవకాశం ఉంది. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కాబోతుండడం ఇదే మొదటిసారి. అప్పట్లో మోదీ వాషింగ్టన్లో పర్యటించారు. తర్వాత వారు పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు.టారిఫ్‌ల యుద్ధంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు కొంత బలహీనపడ్డాయి. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్ పదేపదే ప్రకటించగా, భారత్ కొట్టిపారేసింది. అలాగే ఇటీవల ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయడంతో ముగ్గురు భారతీయులు మరణించారు. అమెరికా చర్యను భారత్ ఖండించింది. ఈ నేపథ్యంలో ట్రంప్, మోదీ సమావేశం కాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి బయల్దేరిన భారత ప్రధాని మోదీ శనివారం ఫ్రాన్స్ చేరుకున్నారు. నైస్ నగర ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్న మోదీని ఫ్రాన్స్ విద్యా మంత్రి ఎడోగార్డ్ గిఫ్రే, పరిశోధనా మంత్రి ఫిలిఫే బాప్టిస్టే, భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి థియెరీ మాథ్యూ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. నైస్తోపాటు ఎవియాన్, పారిస్‌లోనూ మోదీ పర్యటించనున్నారు. మేక్రాన్‌తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ను ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో ఇరుదేశాలతోపాటు ఇతర దేశాలకు చెందిన అత్యుత్తమ నవ్య అంకుర సంస్థలు, పెట్టుబడుల సంస్థలు పాల్గొననున్నాయి. ఫ్రాన్స్ నుంచి మోదీ తర్వాత స్లోవేకియాకు వెళ్లనున్నారు. 14–15 తేదీల్లో అక్కడ బ్రాటిస్లావాలో అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో, వ్యాపారరంగ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. తిరిగి ఫ్రాన్స్ చేరుకుని 16, 17 తేదీల్లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో గ్లోబల్ సౌత్ గళం వినిపిస్తానని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. -
14న మాక్రాన్‌తో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: శనివారం నుంచి ప్రధాని మోదీ ఫ్రాన్స్, స్లొవేకియాల్లో వారం రోజులపాటు పర్యటించనున్నారు. పారిస్‌లో జరిగే జీ–7 శిఖరాగ్రంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో విస్తృత చర్చలు జరపునున్నారు. నీస్ నగరంలో 14న మేక్రాన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్ కంపెనీలతో మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరే అవకాశముంది. అదేవిధంగా, ఫ్రెంచి కంపెనీలు భారత్‌లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అవగాహన కుదుర్చుకునే వీలుందని సమాచారం. ఫ్రాన్స్‌తో కనీసం 12 ఒప్పందాలు కుదిరేందుకు ఛాన్సుందని చెబుతున్నారు. అనంతరం ప్రధాని జీ 7 దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. శిఖరాగ్రానికి హాజరయ్యే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోనూ ప్రధాని భేటీ అవుతారని భావిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు షెడ్యూల్ ఖరారు కాలేదు. -
ఇల్లు.. కట్టొచ్చు, ప్రింట్ చేయవచ్చు..!
ఈ మధ్య ఫ్రాన్స్‌లో ఓ అపార్ట్మెంట్ కట్టారు. కట్టారు అనడం కంటే ప్రింట్ చేశారనడం కరెక్ట్. ఎందుకంటే పన్నెండు పోర్షన్లు ఉన్న ఈ మూడంతస్తుల బిల్డింగ్‌లో గోడలన్నీ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేసినవే మరి. అక్కడక్కడ స్తంభాలు పాతి... కాలమ్స్, పైకప్పులు అమర్చి సిద్ధం చేశారు. ఆ తరువాత తలుపులు, కిటికీలు, వైరింగ్, బాత్రూమ్ ఫిట్టింగ్ వంటివి అమర్చడంతో సాధారణ పద్ధతుల్లో కట్టేదాని కంటే మూడు నెలల ముందుగానే ‘విలియా స్ప్రింట్’పూర్తయింది. ఫ్రాన్స్‌లోని చారిత్రక నగరం రీమ్స్‌లోని బెజాన్స్ ప్రాంతంలో విలియా స్ప్రింట్ నిర్మాణం జరిగింది. ఒక్కో అపార్ట్మెంట్ సుమారు 800 చదరపు మీటర్ల వైశాల్యంతో ఉంది. ప్రత్యేకమైన, ఫైబర్ కలిపిన కాంక్రీట్ వాడి గోడలు కూడా నిర్మాణం తాలూకూ బరువును మోసేలా చేశారు. దీనివల్ల స్తంభాల సంఖ్య గణనీయంగా తగ్గింది. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ వాడటం పుణ్యమా అని కాంక్రీట్‌ను సమర్థంగా వినియోగించుకోగలిగారు. పది శాతం వరకూ ఆదా చేయగలిగారు. గత ఏడాది మార్చిలో త్రీడీ ప్రింటింగ్ మొదలై 34 రోజుల్లో ముగిస్తే ఆ తరువాత మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుని ఈ భవనం ఈ ఏడాది ఏప్రిల్‌లో గృహప్రవేశానికి సిద్ధమైంది. విలియా స్ప్రింట్ నిర్మాణానికి కోబోడ్ బాడ్–2 అనే భారీ త్రీడీ ప్రింటర్‌ను వినియోగించారు. ఇదే మెషీన్ గతంలో భూకంపాలను తట్టుకోగల ఇల్లు, డేటా సెంటర్‌ను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. సూపర్ స్పెషల్ ఏర్పాట్లు... త్రీడీ టెక్నాలజీ వాడటం ఒక్కటే విలియా స్ప్రింట్ ప్రత్యేకత కాదు. ఇంకా చాలానే ఉన్నాయి. హోల్సిమ్ అనే సంస్థ నిర్మాణ స్థలంలోనే కాంక్రీట్‌ను తయారు చేసి ఇవ్వడం ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గాయి. అలాగే సుమారు 5400 చదరపు అడుగుల విస్తీర్ణంలో సౌర శక్తి ఫలకాలు, హైబ్రిడ్ గ్యాస్/హీట్ పంప్ వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఈ భవన విద్యుత్తు అవసరాలను 60 శాతం వరకూ తీరుస్తాయి. ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతిపెద్ద త్రీడీ అపార్ట్మెంట్ బిల్డింగ్‌గా విలియా స్ప్రింట్ రికార్డు నెలకొల్పింది. కాకపోతే ఈ బిల్డింగ్ డెవలపర్ ప్లూరియల్ నోవిలియా త్వరలోనే రెండు త్రీడీ ప్రింటర్లను వాడి ఏకకాలంలో 40 అపార్ట్మెంట్లను కట్టే ఆలోచనలో ఉన్నందున ఈ రికార్డు ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. ఇదిలా ఉంటే 2030 నాటికి 25 శాతం ఇళ్లను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేసేందుకు దుబాయ్ ప్రయత్నిస్తోంది. భారత్‌లోనూ ఊపందుకుంటోంది... త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది అటు తయారీ రంగంలో.. ఇటు గృహనిర్మాణ రంగంలోనూ ఊపందుకుంటోంది. యూరోపియన్ దేశాల మాదిరిగా మరీ విస్తృతంగా కాకున్నా బుడిబుడి అడుగులైతే పడుతున్నాయి. ఐదేళ్ల క్రితం మద్రాస్ ఐఐటీ ‘త్వస్త’పేరుతో తొలి త్రీడీ ప్రింటెడ్ ఇంటి నిర్మాణం పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఆరువందల చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఈ ఇల్లు అప్పట్లో అందరి దృష్టిని ఆకర్శించింది కూడా. త్వస్తతోపాటు ప్రఖ్యాత ఇంజినీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీ కూడా గృహనిర్మాణాన్ని వేగంగా, చౌకగా పూర్తి చేసేందుకు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. మరోవైపు ఈ టెక్నాలజీని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలోనూ ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అందుకే ఆర్సీబీ సంబురాలకు బ్రేక్!
ఒకటి క్రికెట్ కప్.. మరొకటి ఫుట్‌బాల్ ట్రోఫీ. ఒకటి బెంగళూరు.. ఇంకొకటి పారిస్. క్రీడలు వేరు, దేశాలు వేరు. కానీ రెండు నగరాలు ఒకే ప్రశ్నను ఎదుర్కొన్నాయి. విజయోత్సవాలు ఎక్కడ, ఎలా ముగియాలి?. గత ఏడాది ఆర్సీబీ టైటిల్ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట దేశాన్ని కుదిపేస్తే.. తాజాగా పీఎస్జీ ఛాంపియన్స్ లీగ్ విజయం తర్వాత పారిస్‌లో చెలరేగిన అల్లర్లు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి. ఈ రెండు ఘటనలు కలిసి క్రీడా సంబరాలపై కొత్త హెచ్చరికగా మారాయి.యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఆర్సెనల్ను ఓడించి ప్యారిస్ సెయింట్ జర్మైన్ (PSG) మరోసారి యూరప్ ఛాంపియన్‌గా నిలిచిన వెంటనే పారిస్ వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. మొదట అది ఆనందోత్సవంలా కనిపించింది. ఐఫిల్ టవర్ క్లబ్ రంగులతో మెరిసింది. వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. కానీ కొద్ది గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. కార్లకు నిప్పంటించడం, దుకాణాలపై దాడులు, పోలీసులపై రాళ్లు రువ్వడం, వీధుల్లో విధ్వంసం చోటుచేసుకున్నాయి.అధికారిక లెక్కల ప్రకారం ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 780 మందికిపైగా అరెస్టయ్యారు. 264కు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చింది. క్రీడా విజయాన్ని జరుపుకునేందుకు ప్రారంభమైన రాత్రి చివరకు చట్టవ్యవస్థకు సవాలుగా మారింది.ఈ దృశ్యాలు భారత అభిమానులకు గత ఏడాది బెంగళూరులో జరిగిన విషాదాన్ని గుర్తు చేశాయియి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నప్పుడు నగరం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. జట్టు విజయోత్సవాలను ప్రత్యక్షంగా చూడాలని లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. కానీ భారీ జనసందోహాన్ని పోలీసులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. క్రీడా చరిత్రలో నిలిచిపోవాల్సిన ఆనంద క్షణం విషాద అధ్యాయంగా మారిపోయింది.ఆ ఘటన కేవలం ఒక ప్రమాదంగా ముగియలేదు. క్రీడా విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వాలు, పోలీసు శాఖలు, క్రీడా సంస్థల ఆలోచననే మార్చేసింది. అభిమానుల భావోద్వేగం ఎంత ముఖ్యమో, వారి భద్రత కూడా అంతే ముఖ్యమని అందరికీ అర్థమైంది.అందుకే.. ఈ ఏడాది ఆర్సీబీ మళ్లీ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ, గతంలో లాగా భారీ ర్యాలీలు, నియంత్రణలేని బహిరంగ సంబరాలకు అవకాశం ఇవ్వలేదు. బెంగళూరు పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. నగరంలో పెద్ద ఎత్తున గుమికూడే కార్యక్రమాలపై పరిమితులు విధించారు. భారీ జనసందోహాలు ఏర్పడే అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. విజయోత్సవాల కంటే భద్రతకే ప్రాధాన్యం ఇచ్చారు.ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆర్సీబీ యాజమాన్యం కూడా ఇదే సందేశాన్ని అభిమానులకు ఇచ్చింది. గత ఏడాది విషాదాన్ని గుర్తుచేస్తూ, వీధుల్లోకి పెద్ద ఎత్తున రావద్దని, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సురక్షితంగా విజయాన్ని ఆస్వాదించాలని అభిమానులకు పిలుపునిచ్చింది. సోషల్ మీడియా వేదికగా బాధ్యతాయుతమైన సంబరాలు జరుపుకోవాలని సూచించింది. సాధారణంగా జట్లు అభిమానులను బయటకు రమ్మని పిలుస్తాయి. కానీ ఈసారి అభిమానులు సురక్షితంగా ఉండటమే పెద్ద సంబరమని ఆర్సీబీ భావించడం గమనార్హం.What a night. What a feeling. 🥹To every member of the RCB nation, congratulations. This is YOUR win. 🏆❤️As the celebrations begin, let’s be responsible. 🙌Best way to celebrate is with your loved ones. Relive the memories, and enjoy this special moment from the comfort of… pic.twitter.com/hdGO3n115a— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026వాస్తవానికి పారిస్ ఘటన, బెంగళూరు తొక్కిసలాట రెండూ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. క్రీడా విజయాలు ప్రజలను ఏకం చేయగలవు. కానీ అదే భావోద్వేగం అదుపు తప్పితే ప్రమాదకరంగా మారుతుంది. సంబరాలు అల్లర్లకు దారి తీసినా, జనసందోహం ప్రాణాలను బలిగొన్నా చివరకు నష్టపోయేది అభిమానులే.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడా నిర్వాహకులు ఒక కొత్త వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. విజయం ఎంత గొప్పదైనా, భద్రత దానికంటే గొప్పది. బెంగళూరు తొక్కిసలాట నేర్పిన పాఠాన్ని పారిస్ అల్లర్లు మరోసారి గుర్తు చేశాయి. కప్‌లు ప్రతి ఏడాది ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ ఒక్క ప్రాణం కూడా పోకూడదనే బాధ్యత మాత్రం అందరిదీ. అందుకే ఈసారి ఆర్సీబీ సంబరాలకు బ్రేక్ పడింది. అది ఆనందంపై ఆంక్ష కాదు... గత విషాదం మళ్లీ పునరావృతం కాకూడదన్న ముందస్తు జాగ్రత్త. -
సంబరాలకు వీడ్కోలు
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సంబరాలు ముగిశాయి. ఫ్రాన్స్ వేదికగా జరిగిన 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసింది. ఈ నెల 12న ప్రారంభమైన ఈ చిత్రోత్సవాలు ఈ నెల 23తో ముగిశాయి. ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులకు సంబంధించిన ప్రధానపోటీ విభాగానికి జ్యూరీ ప్రెసిడెంట్‌గా సౌత్ కొరియన్ దర్శకుడు పార్క్ చాన్ ఉక్ వ్యవహరించారు. ‘ది ఎలక్ట్రికల్ కిస్’ చిత్రంతో కాన్స్ చలన చిత్రోత్సవాలు ప్రారంభమై, ‘ఫ్యోర్డ్’ చిత్రంతో ముగిశాయి.క్రిస్టియన్‌కి రెండో పామ్ డి ఓర్’ పురస్కారంకాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యున్నత పురస్కారంగా భావించే పామ్ డి ఓర్ అవార్డును ‘ఫ్యోర్డ్’ సినిమాకుగానూ రొమేనియన్ దర్శకుడు క్రిస్టియన్ ముంగియును వరించింది. ఈ చిత్రం మే 18న కాన్స్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శితమైంది. కాగా క్రిస్టియన్ ముంగియుకు ఇది రెండో పామ్ డి ఓర్’ పురస్కారం కావడం విశేషం.2007లో జరిగిన 60వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘4 మంత్స్, 3 వీక్స్ అండ్ 2 డేస్’ చిత్రానికి తొలిసారి పామ్ డి ఓర్’ పురస్కారాన్ని అందుకుని, ఈ అవార్డును స్వీకరించిన తొలి రొమేనియన్ దర్శకుడిగా నిలిచారాయన. ఇలా రెండుసార్లు పామ్ డి ఓర్’ పురస్కారాన్ని అందుకున్న పదిమంది దర్శకుల్లో ఒకరిగా నిలిచారు క్రిస్టియన్. ఆల్ఫ్ స్జోబెర్గ్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొ΄్పోలా, బిల్లే ఆగస్ట్ వంటి దర్శకులు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.ఆండ్రీకి ‘గ్రాండ్ ప్రీ’ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండో ప్రతిష్టాత్మక పురస్కారంగా చెప్పుకునే ‘గ్రాండ్ ప్రీ’ అవార్డు రష్యన్ దర్శకుడు ఆండ్రీ జ్వా్యగింత్సేవ్ తెరకెక్కించిన ‘మినోటార్’ (2026) చిత్రానికి లభించింది. ఇక ఉత్తమ దర్శకుల అవార్డును ఈసారి ముగ్గురు అందుకోవడం విశేషం. స్పానిష్ ఫిల్మ్ ‘ది బ్లాక్ బాల్’ చిత్రానిగానూ దర్శక ద్వయం జేవియర్ కాల్వో, జేవియర్ అంబ్రోస్సి, జర్మనీ బయోగ్రాఫికల్ ఫిల్మ్ ‘ఫాదర్ ల్యాండ్’ చిత్రానికిగాను పావెల్ పావ్లికోవ్సీ్క ఉత్తమ దర్శకులుగా నిలిచారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాల్లో ఈసారి ఇద్దరికి అవార్డులను ప్రకటించారు.లూకాస్ ధోంట్ దర్శకత్వం వహించిన వార్ డ్రామా ‘కవార్డు’ చిత్రంలోని అద్భుతమైన నటనకుగాను బెల్జియం నటుడు ఇమ్మాన్యుయేల్ మచ్చియా, ఫ్రెంచ్ యాక్టర్ వాలెంటిన్ క్యాంపెయిన్ ఉత్తమ నటులుగా నిలిచారు. జపాన్ దర్శకుడు ర్యూసుకే హమగుచి తెరకెక్కించిన తొలి ఫ్రెంచ్ సినిమా ‘ఆల్ ఆఫ్ ఎ సడన్’లో ప్రతిభ చూపిన ఫ్రాన్స్ నటి వర్జినీ ఎఫిరా, జపాన్ నటి టావో ఒకామోటో ఉత్తమ నటీమణులుగా గెలిచారు. కాన్స్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న తొలి జపాన్ నటిగా టావో ఒకామోటో రికార్డు సృష్టించారు. అన్సర్టైన్ రిగార్డ్ విభాగంలో ఆస్ట్రియన్ దర్శకురాలు సాండ్రా వోల్నర్ తీసిన ‘ఎవ్రీ టైమ్’ చిత్రానికి అవార్డు లభించింది.కాన్స్‌లో భారతీయం ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత సినీ తారలు బాగానే సందడి చేశారు. ఈ చిత్రోత్సవాల్లో ముందుగా ఆలియా భట్ రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఆ తర్వాత ఊర్వశీ రౌతేలా, కళ్యాణీ ప్రియదర్శన్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, అదితీరావు హైదరీ, డయానా పెంటీ, మౌనీ రాయ్ వంటి తారలు రెడ్ కార్పెట్‌పై నడిచారు. ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఐశ్వర్యా రాయ్ మరోసారి తనదైన స్టైల్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తొలిరోజు నీలి రంగు డ్రెస్‌లో కనిపించిన ఐశ్వర్య ముగింపు వేడుకల్లో తెలుపు రంగు డిజైనర్ వేర్లో కనిపించారు. క్రిటిక్స్ జ్యూరీ అధ్యక్షురాలిగా పాయల్ కపాడియా బాధ్యతలు నిర్వర్తించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ‘గ్లోబల్ సినిమా స్టాక్ ఎక్సే్ఛంజ్’ వేదికగా అభివర్ణించారు దర్శక–నిర్మాత గునీత్ మోంగా. దివంగత దర్శకుడు జాన్ అబ్రహాం దర్శకత్వం వహించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘అమ్మ అరియాన్’ రీస్టోర్డ్ 4కే వెర్షన్‌ను కాన్స్ క్లాసిక్స్ విభాగంలో ప్రదర్శించారు. ‘లాసినెఫ్’ విభాగంలో పంజాబీ షార్ట్ ఫిల్మ్ ‘షాడోస్ ఆఫ్ ది మూన్లెస్ నైట్స్’ అవార్డు కోసంపోటీ పడింది. ఈ ఏడాది ఏ భారతీయ సినిమాకూ అవార్డు రాలేదు. -
ముగింపు వేడుకల్లో ఐష్
రెండు దశాబ్దాలకు పైగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు అవుతున్నారు ఐశ్వర్యా రాయ్. అయితే ఈసారి పాల్గొనరనే ప్రచారం సాగింది. కానీ ఇది అవాస్తమన్నట్లుగా ఐశ్వర్యా రాయ్ శుక్రవారం ఫ్రాన్స్‌లో ల్యాండ్ అయ్యారు. 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచారు. కుమార్తె ఆరాధ్యతో కలిసి ఈ చిత్రోత్సవాలకు వెళ్లారామె. నేటితో (మే 23) ఈ ఫెస్టివల్ ముగుస్తుంది. ఈ ముగింపు వేడుకల్లోనూ ఐష్ మెరవనున్నారు. దారుణ ఘటన: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగిన ఓ దారుణ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘మిస్ వెనెజులా – 2025’ కిరీటాన్ని దక్కించుకున్న ప్రముఖ మోడల్ ఆండ్రియా డెల్ వాల్ పై ఆమె స్టైలిస్ట్ లగూనా దాడికి పాల్పడ్డాడు. మంగళవారం కాన్స్‌లోని ఒక హోటల్ గదిలో జరిగిన ఈ దారుణ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘లగూనా నాకు చేసిన పని ఇదే. అతడు నిజంగా ఎలాంటి వ్యక్తో చెప్పడానికి ఇది చాలు. లగూనా నిజస్వరూపం బయటపడింది’ అంటూ ఆండ్రియా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె ముఖంపై రక్తం ఉన్నట్లు కనిపిస్తోంది. ఓ ఫ్యాషన్ ఈవెంట్‌కు సిద్ధం అవుతున్నప్పుడు ఆండ్రియా, లగూనాల మధ్య వాగ్వాదం జరిగిందట. ఈ క్రమంలోనే ఆమెపై లగూనా దాడి చేశారని టాక్. -
నమ్మండి ప్లీజ్..ముగ్గురు కవలలకు జన్మనిచ్చా..! కంగుతిన్న వైద్యులు
డాక్టర్లు అనునిత్యం ఎంతో మంది రోగులకు చికిత్స అందిస్తుంటారు. కానీ వాళ్ల అనుభవంలో ఏదో ఒక విచిత్రమైన కేసు సవాలు విసురుతూనే ఉంటుంది. కొన్ని వాళ్ల వైద్య వృత్తికే అందని విధంగా ఉంటే..మరికొన్ని అత్యంత మిరాకిల్‌గా ఉంటాయి. అలాంటి వింత కేసే ఈ టీనేజర్ పేషెంట్‌ది. ఆమె చెబుతున్న మాటలకు వైద్యులు సైతం ఒక్క క్షణంపాటు అయోమయానికి గురయ్యారు. అసలేం జరిగిందంటే.. ఫ్రాన్స్‌లోని లియాన్‌కు చెందిన 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయి క్లేలియా వెర్డియర్ మూడువారాల కోమా తర్వాత కళ్లు తెరిచింది. ఆమె పలికిన మొదటి మాటలకు ఒక్కసారిగా వైద్యలు కంగుతిన్నారు. అంతేగాదు ఆ అమ్మాయి అడుగుతున్న మాటలకు సమాధానం చెప్పలేక గందరగోళానికి గురైంది ఆస్పత్రి సిబ్బంది. కోమా నుంచి మేల్కోని తొలిసారిగా ఆమె ఏం మాట్లాడిందంటే.." ప్లీజ్ నా కుమార్తెలను తీసుకురండి నేను వాళ్లని చూడలంటూ తల్లడిల్లిపోయింది". ఇదేంటి ఈ యువతికి పెళ్లికాలేదు, పైగా పిల్లలు అంటూ వాళ్లని పేర్లతో పిలవడంతో ఒక్కసారిగా వైద్యులు విస్తుపోయారు. ఒక్క క్షణం అసలు ఏం జరుగుతోందో తెలియక సతమతమయ్యారు. ఆ యువతి వాళ్లను ఒక్కసారి తన వద్దకు తీసుకురమ్మని అర్ధించడం అందర్నీ కలవరపాటుకు గురిచేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె ఇప్పటి వరకు ఎప్పుడు గర్భవతి కాలేదని వైద్యులు ధృవీకరించారు. పైగా ఆమె ఏడేళ్లుగా తన పిల్లలను చూసుకుంటున్నట్లు చెబుతోందంతా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమె మెదడు సృష్టించుకున్నదేనని తేల్చేశారు వైద్యులు. ఆమె గతేడాది జూన్ 2025లో అధిక మోతాదులో మందులు తీసుకుని ఆత్మాహత్యయత్నంకు ప్రయత్నించిందని, ఆ మందుల ప్రభావం కారణంగా మూడు వారాలపాటు కోమాలో ఉందని చెప్పుకొచ్చారు వైద్యులు. అయితే ఆ యువతి మాత్రం వైద్యులు తనని ప్రేరేపిత కోమాలో ఉంచారని, తనకు పిల్లలు ఉన్నారని, ప్రసవ వేదన కూడా అనుభవించానని చెబుతుంది. పైగా ఆమెకు ముగ్గురు కవల కుమార్తెలు పుట్టారని చెబుతోంది. కేవలం పుట్టుక మాత్రమే కాదు ఆ తర్వాత జీవితం గురించి అలవోకగా చెప్పేస్తుంది. వాళ్లను ఎలా పెచ్చింది, వాళ్లకు పెట్టిన పేర్లతో సహా చెప్పయడంతో విస్తుపోవడం వైద్యులు వంతైంది. పైగా తన కూతుళ్ల పేర్లు మిలా, మైల్స్, మైలీ అని పెట్టినట్లు తెలిపింది. అయితే మైలీ పుట్టిన కొద్దిసేపటికే చనిపోవడంతో చాలా ఏడ్చానని, మిగతా ఇద్దరికి తానే పాలివ్వడం నుంచి పెంచి పెద్ద చేయడం వరకు గుర్తుందని వాళ్లకు ఏడేళ్లు ఉంటాయని చెబుతూ ప్లీజ్ వాళ్లని పిలవండి చూడాలి అంటూ అడగడం అందర్నీ కంటతడి పెట్టించింది. అచ్చం అమ్మలా తల్లడిల్లిన తీరు అందరి హృదయాలను మెలిపెట్టింది. కానీ వైద్యలు మాత్రం మెదడుకు తీవ్రమైన గాయం అయితే.. తర్వాత కోమాలో కలలు రావడం సర్వసాదరణమేనని చెబుతున్నారు. కోమాలో ఉన్న రోగులకు చీకటి గానీ, నిద్ర గానీ అనుభవంలోకి రావు. చాలామందికి స్పష్టమైన, వివరమైన కలలు వస్తాయని, అవి పూర్తిగా రియల్‌గా అనిపిస్తాయని చెబుతుండగా, మరికొందరు మాత్రం అసలు ఏ జ్ఞాపకం లేకుండా మేల్కొంటారు. అయితే సదరు యువతి క్లేలియా మాత్రం నా కూతుళ్లు ఇప్పటికీ గుర్తొస్తున్నాంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. అంతేగాదు ఆమెకు కోమాలోంచి మేల్కోగానే పిల్లల పేర్లే కలవరించింది గానీ తన పేరుగానీ, తన తల్లిదండ్రుల పేర్లుగానీ ఆమెకేం గుర్తులేకపోవడం బాధకరం. పైగా తను తల్లిగాదని, పిల్లలు లేరని వైద్యులు చెప్పిన వెంటనే షాక్‌కి గురయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా తన తల్లిదండ్రులను, తన పేరుని గుర్తు తెచ్చుకుంది. కానీ ఇది జరిగి ఏడాది కావొస్తున్నా..ఇప్పటికీ క్లేలియా మాత్రం తాను పిల్లల తల్లిననే అని భావిస్తోంది, వాదిస్తోంది. పైగా ఇంకా ఆ బాధ తన నుంచి పోలేదని అంటోంది.(చదవండి: స్టూడెంట్ సాహసం..!జస్ట్ రూ. 16 వేలతో..) -
ఫ్రాన్స్ అధ్యక్షుడికి భార్య చెంపదెబ్బ.. నటి మెసేజ్ లతో వివాదం
-
‘కాన్స్’ లో ఆలియా ఆసక్తికర వ్యాఖ్యలు.. నెటిజన్స్ ఫైర్!
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ దేశ, విదేశీ తారల తళుకులతో కనువిందుగా సాగుతోంది. మంగళవారం ఆరంభమైన ఈ ఫెస్టివల్ ఈ నెల 23తో ముగుస్తుంది. తొలి రోజు రెడ్ కార్పెట్‌పై పీచ్ కలర్ ఫ్రాక్‌లో తళుకులీనారు ఆలియా భట్. అయితే ఆలియా చేసిన కొన్ని వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ‘‘సినిమాల్లో లీడ్ రోల్స్‌లో ఎవరు నటిస్తారు? అనేది ప్రేక్షకులు చూడరు. వాళ్లకి కథ ముఖ్యం’’ అని పేర్కొనడంతో పాటు ఆలియా ఈ ఫెస్టివల్లో ఇంకా మాట్లాడుతూ – ‘‘బార్బీ’లాంటి మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అయితే భారత్‌లో మాత్రం 75 శాతం సినిమాలు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే రూపొందిస్తారు. అవన్నీ హీరో ప్రాధాన్యంగా సాగే సినిమాలే. అలాంటి సినిమాలు తీయొద్దని అనడంలేదు. కానీ మహిళల కోసమూ సినిమాలు తీయాలి కదా. మహిళా ప్రేక్షకులకు కావాల్సిన సినిమాలు ఎవరు తీస్తారు? ఎందుకంటే సినిమాలు ఒక వర్గానికి మాత్రమే కాదు. అందరి కోసం తీయాలి’’ అన్నారు. సినిమా పరిశ్రమలో పురుషాధిక్యతను ఉద్దేశించి ఆలియా ఈ వ్యాఖ్యలు చేశారని ఊహించవచ్చు. అయితే రెడ్ కార్పెట్‌పై ఆలియా అందానికి ప్రశంసలు కురిపించిన పలువురు నెటిజన్లు ఈ వ్యాఖ్యలను మాత్రం విమర్శిస్తున్నారు. ‘‘ఒకవైపు భర్త (రణ్‌బీర్ కపూర్) ‘యానిమల్’ లాంటి వయొలెంట్ సినిమాలో నటించాడు. ఆ సినిమాలో హింస ఎక్కువగా ఉందని విమర్శలు వచ్చినా ‘యానిమల్’ని సమర్థించింది. అలాగే ‘ధురంధర్’ సినిమా గురించి కూడా పెదవి విప్పలేదు. అలాంటి ఆలియా కాన్స్‌లో మహిళల కోసం సినిమాలు రావాలని మాట్లాడటం ఎందుకు?’’ అంటూ విమర్శించారు. నేను ఊర్వశిని కాదు... భారతదేశాన్ని! ‘‘నా దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన ప్రతిసారీ ‘నేను ఊర్వశిని కాదు... భారతదేశాన్ని! కాన్స్ ఫెస్టివల్ ప్రారంభ వేడుకలో నా భారతదేశం తరఫున నేను ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. వియత్నాంకు చెందిన ఫ్యాషల్ లేబుల్ జోలీపొలీ కోచర్ డిజైన్ చేసిన ఈ బ్యూటిఫుల్ గౌనుని ధరించాను’’ అని ఊర్వశీ రౌతేలా పేర్కొన్నారు. -
కాంస్యంతో సరి.. సెమీస్‌లో భారత్ పరాజయం!
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. ఫ్రాన్స్‌తో జరిగిన ఈ పోరులో 0–3తో వరుస సింగిల్స్ మ్యాచ్‌లలో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 11–21, 9–21 స్కోరుతో క్రిస్టో పొపోవ్ చేతిలో ఓడిపోయాడు. 39 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. రెండో సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కూడా ప్రత్యర్థి ముందు నిలవలేకపోయాడు. 16–21, 18–21తో వరుస గేమ్‌లలో అలెక్స్ లేనియర్ చేతిలో పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్ కూడా 41 నిమిషాల్లో ముగిసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో సింగిల్స్‌లో కూడా హెచ్ఎస్ ప్రణయ్ నిలవలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టోమా జూనియర్ పొపోవ్ 21–19, 21–16తో ప్రణయ్‌ను 48 నిమిషాల్లో చిత్తు చేశాడు. సెమీస్‌లో ఓటమితో భారత్ కాంస్య పతకంతో సంతృప్తి చెందింది. ఫలితం తేలిపోవడంతో తర్వాతి రెండు డబుల్స్ మ్యాచ్‌ల అవసరం రాలేదు. మోచేతి గాయం కారణంగా లక్ష్య సేన్ ఈ మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. చదవండి: ‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’ -
లాటరీలో చవకగా పికాసో పెయింటింగ్
పారిస్: అదృష్టం ఉండాలేగానీ సంపద అయినా అంతకంటే విలువైన వస్తువైనా మనల్నే వెతుక్కుంటూ వస్తుందని మరోమారు నిరూపితమైంది. ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో కుంచె నుంచి జాలువారిన కళాఖండాలకు చిత్రకారులు, సంపన్నుల ప్రపంచంలో భలే డిమాండ్ ఉంది. సంపన్నులు మొదలు సాధారణ కళాకారుల దాకా ఎంతో మంది పికాసో ఒరిజినల్ పెయింటింగ్‌లను తమ సొంతం చేసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. అలాంటిది ఒక ఫ్రాన్స్ సేల్స్ ఇంజనీర్‌కు కేవలం 117 డాలర్లకే అంటే 10,915 రూపాయలకే ఏకంగా రూ.9.33 కోట్ల విలువైన పికాసో పెయింటింగ్ దక్కింది. పెయింటింగ్ విక్రయం కోసం దాని యాజమాన్యం చేపట్టిన లక్కీ డ్రాలో 58 ఏళ్ల అరీ హొదారా అనే వ్యక్తి ఈ ‘హెడ్ ఆఫ్ ఏ ఉమెన్’పెయింటింగ్‌ను సొంతం చేసుకున్నారు. అల్జీమర్స్ వ్యాధి సంబంధ పరిశోధనకు కావాల్సిన నిధుల సమీకరణ కోసం రఫెల్ అనే సంస్థ ఈ పెయింటింగ్‌ను ‘క్రిస్టీస్’అనే వేలంసంస్థకు అప్పగించి అమ్మిపెట్టాలని సూచించింది. లక్కీ డ్రా టికెట్ ధరను 117 డాలర్లు నిర్ణయించారు. మొదారా కొన్న టికెట్‌కే లక్కీ డ్రా తగలడంతో అతను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ‘‘ఎవరో నన్ను ఆటపట్టించడానికి ఫోన్చేశారనుకున్నా. వేలంసంస్థ ఒకటికి రెండు సార్లు విషయం చెప్పడంతో నాకు ఇది అబద్ధం కాదు అని అర్ధమైంది’’మొదారా తెగ సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా టికెట్ల అమ్మకాల ద్వారా రూ.130 కోట్లు సమకూరాయని రఫేల్ సంస్థ తెలిపింది. పికాసో తన ప్రేయసి డోరా మార్ను ఊహించుకుంటూ విభిన్నంగా 1941లో ఈ పెయింటింగ్వేశారు. -
ఎన్నేసి ఫెస్టివల్లో బాహుబలి: ద ఎటర్నల్ వార్
‘బాహుబలి: ది బిగినింగ్’ (2015), ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ (2017) చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా దక్కిన ఆదరణ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో 2025 అక్టోబరు 31న రిలీజ్ చేశారు. తాజాగా ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి రానున్న సరికొత్త యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’. ఈ మూవీకి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇషాన్ శుక్లా దర్శకత్వంలో ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ఈ చిత్రం ఫ్రాన్స్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఎన్నేసి యానిమేషన్ ఫెస్టివల్ 2026’లోని ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు రాజమౌళి. ‘‘ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యానిమేషన్ వేదికపై ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’ని ప్రదర్శించే అవకాశం రావడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇది మన భారతీయ సినిమాకి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు. -
హార్మూజ్ టెన్షన్.. 40 దేశాలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి..
పారిస్: పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్ జలసంధి దిగ్బంధం కొనసాగుతుండడంతో ప్రపంచ దేశాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. హార్మూజ్ జలసంధిలో స్వేచ్ఛగా నౌకాయానం చేసుకునే పరిస్థితులు తీసుకురావడానికి ఏకంగా 40 దేశాలు ఏకం కావడానికి ఓ వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది.హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా 40కి పైగా దేశాలను ఒకే చోటుకు తీసుకురావడానికి యూకే, ఫ్రాన్స్ సంకల్పించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం (ఏప్రిల్ 17న) జరుగుతుందని తెలిపారు. యుద్ధంలో పాల్గొనని దేశాలు దీనికి హాజరవుతాయని పేర్కొన్నారు. ప్రపంచానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా తీసుకునే చర్యలకు సహకరిస్తాయని ఆయన చెప్పారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. ఘర్షణ ముగిసిన తరువాత హార్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా చేసేందుకు సమన్వయంగా పాటించాల్సిన ప్రణాళికపై చర్చించేందుకు 40కి పైగా దేశాలతో సమావేశం జరుపుతామని తెలిపారు.“హార్మూజ్ జలసంధి మూసివేత తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖర్చుల ఒత్తిడిని తగ్గించడానికి గ్లోబల్ షిప్పింగ్ తిరిగి ప్రారంభం కావడం కీలకం. నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణ లక్ష్యంతో 40 కంటే ఎక్కువ దేశాలతో యూకే సంప్రదింపులు జరుపుతోంది. ఈ వారం యూకే, ఫ్రాన్స్ కలిసి అంతర్జాతీయ షిప్పింగ్ రక్షణకు సమన్వయ, స్వతంత్ర, బహుళజాతీయ ప్రణాళికపై సమావేశం నిర్వహిస్తాయి” అని కీర్ స్టార్మర్ ఎక్స్‌లో తెలిపారు.మంగళవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ మాట్లాడుతూ... యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు చర్చలను పునఃప్రారంభించాలి, అపోహలను తొలగించాలి, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూడాలని కోరారు. అన్ని పక్షాలు కాల్పుల విరమణను గౌరవించాలని చెప్పారు.“హార్మూజ్ జలసంధిని వీలైనంత త్వరగా మళ్లీ తెరవడం చాలా ముఖ్యం. ఎటువంటి నియంత్రణలు, టోల్లు ఉండకూడదు. ప్రధాన భాగస్వాముల మద్దతుతో చర్చలు త్వరగా పునఃప్రారంభం కావాలి” అని ఎమ్మాన్యుయేల్ అన్నారు.కాగా, పాకిస్థాన్‌లో ఇటీవల 21 గంటల పాటు జరిగిన చర్చల తర్వాత కూడా అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదరలేదన్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్-యూకే ప్రతిపాదన ఇస్లామాబాద్ చర్చల అడ్డంకిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కావడంతో పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది.పాక్‌లో మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (ఏప్రిల్ 14) ప్రకటించారు. రెండు రోజుల్లో చర్చలు జరగనున్నాయని, ఇవి కూడా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
జస్ట్ రూ.11 వేల లాటరీ టికెట్‌కి ఏకంగా రూ. 9.3 కోట్లు..!
ఒక్కోసారి మన వెచ్చించే ధరకు వచ్చే వస్తువుకి సంబంధ ఉండదు. ఇలాంటివి ఎక్కువగా లాటరీలోనే జరుగుతుంటుంది. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే లక్కీమ్యాన్ అయ్యాడు. ఈ ఘటన ప్రాన్స్‌లో చోటు చేసుకుంది. ప్రాన్స్‌లోని రాఫిల్(లాటరీ టికెట్ల సంస్థ)లో ఒక వ్యక్తి సుమారు వంద యూరోలు అంటే మన దేశ కరెన్సీలో రూ. 10,984 ధరకే స్పానిష్ కళాకారుడైన పికాసో గీసిన చిత్రపటాన్ని గెలుచుకున్నాడు. దీని ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 9.3 కోట్లు విలువ చేస్తుందట. అంత తక్కువ ధరకు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌పై ఏకంగా అన్ని కోట్లు విలువ చేసే చిత్రపటాన్ని గెలుచుకుని రాత్రికిరాత్రే అదృష్టవంతుడిగా మారిపోయాడు. అయితే దీని ద్వారా వచ్చే ఆదాయన్ని అల్జీమర్స్ పరిశోధనకు వినియోగిస్తారట. అంటే ఈ గెలుచుకున్న చిత్రపటాన్ని పారిస్‌లోని క్రిస్టీస్ వేలం నిర్వహిస్తారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని అందరికీ ఉపయోగపడేలా ఆ వ్యాధిపై పరిశోధనలకు వినియోగిస్తారట. కాగా, కాగితంపై ఉన్న ఒక మహిళ తల మాదిరిగా కనిపిస్తున్న ఈ గౌహష్ చిత్రాన్ని 1940లో చిత్రించారు. ఇలాంటి ఘటన తొలిసారేం కాదు. గతంలో కూడా స్పానిష్ కళాకారుడైన పికాసో క్యూబిస్ట్ కాలంలో 1914లో చిత్రించిన “మ్యాన్ ఇన్ ది ఒపెరా హ్యాట్” చిత్రాన్ని పెన్సిల్వేనియాకు చెందిన ఒక ఫైర్-స్ప్రింక్లర్ వ్యాపారంలో పనిచేసే వ్యక్తి గెలుచుకున్నాడు. కాగా, రాఫిల్ (Raffle) అనేది ఒక రకమైన అదృష్ట లాటరీ లేదా పోటీ. ఇందులో పాల్గొనేవారు టిక్కెట్లను కొనుగోలు చేస్తారు, ఆ టిక్కెట్ల నుండి యాదృచ్ఛికంగా (randomly) విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. ఇది సాధారణంగా నిధుల సేకరణ (fundraising) కోసం లేదా స్వచ్ఛంద సంస్థల కోసం నిర్వహిస్తారు. ఇక ఈ ఛారిటీనికి అల్జీమర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధికారులు నిర్వహిస్తున్నారు. ఇది అల్జీమర్ సంబంధిత వైద్య పరిశోధనలకు నిధులు సమకూర్చే అగ్రగామి ప్రైవేట్ సంస్థగా అవతరించించి. (చదవండి: 98 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా బామ్మ..!) -
పెరిగిన పెట్రో ధరలు.. ఆ దేశంలో కొత్త తరహా లోన్లు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అతలాకుతలమవుతున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..ఫ్రాన్స్‌లో 'ఫ్లాష్ ఫ్యూయల్ లోన్లు'పెరుగుతున్న ఇంధన భారంతో సతమతమవుతున్న వ్యాపారుల కోసం ‘ఫ్లాష్ ఫ్యూయల్ లోన్లు’ (Flash Fuel Loans) పేరుతో ఒక అత్యవసర రుణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఫ్రాన్స్ శుక్రవారం ప్రకటించింది.లోన్ల ముఖ్య విశేషాలురుణ పరిమితి: అర్హత కలిగిన సంస్థలు 50,000 యూరోల (సుమారు రూ. 53.64 లక్షలు) వరకు రుణం పొందవచ్చు.ప్రధాన లబ్ధిదారులు: రవాణా, వ్యవసాయం, మత్స్య పరిశ్రమలకు చెందిన చిన్న, మధ్య తరహా సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది.వడ్డీ రేటు: మూడేళ్ల కాలపరిమితి గల ఈ రుణాలపై 3.8 శాతం వడ్డీ వసూలు చేస్తారు.త్వరితగతిన నిధులు: పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 'బీపీఐఫ్రాన్స్' (Bpifrance) ద్వారా డిజిటల్ పద్ధతిలో కేవలం ఏడు రోజుల్లోనే రుణ ప్రక్రియ పూర్తి చేసి నిధులు మంజూరు చేస్తారు.ప్రధాని హామీ అమలుఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను అరికడతామని ఫ్రాన్స్ ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను గత వారం ఇచ్చిన హామీని ఈ పథకం ద్వారా నెరవేర్చారు. యుద్ధ ప్రభావం వల్ల సామాన్యులపై, వ్యాపారాలపై పడుతున్న భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.రిఫైనరీల తీరుపై విచారణకు డిమాండ్మరోవైపు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుని యూరప్‌లోని రిఫైనరీలు ఇంధన ధరలను అడ్డగోలుగా పెంచుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ "దుర్వినియోగం"పై విచారణ జరపాలని కోరుతూ ఫ్రెంచ్ ఆర్థిక మంత్రి రోలాండ్ లెస్క్యూర్ యూరోపియన్ కమిషన్‌కు లేఖ రాశారు.యుద్ధం పేరుతో కంపెనీలు అక్రమంగా లాభాలు గడిస్తున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. ఇంధన సంక్షోభం నుంచి దేశీయ పరిశ్రమలను కాపాడుకునేందుకు ఫ్రాన్స్ తీసుకున్న ఈ చర్యలు ప్రస్తుతం ఐరోపాలో చర్చనీయాంశంగా మారాయి. -
పారిస్ మేయర్‌గా ఎమ్మాన్యుయెల్
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడగా, సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి ఎమ్మాన్యుయెల్ గ్రెగోయర్ విజయం సాధించారు. ఆయన, అదే పార్టీకి చెందిన మాజీ మేయర్ ఆన్ హిడాల్గో స్థానాన్ని భర్తీ చేస్తూ, కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు.గ్రెగోయర్, కన్సర్వేటివ్ ప్రత్యర్థి రషిదా దాతిపై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. విజయం అనంతరం గ్రెగోయర్ మాట్లాడుతూ.. ఇది ఒక కొత్త పారిస్ విజయం. ఉత్సాహభరితమైన, ప్రగతిశీలమైన పారిస్ అని పేర్కొన్నారు. మేయర్‌గా ఎన్నికైన వెంటనే గ్రెగోయర్ సైకిల్‌పై నగర వీధుల్లో చక్కర్లు కొట్టారు. కాగా, ఫ్రాన్స్‌లో 1500 కమ్యూన్లలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మేయర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆరు సంవత్సరాల పదవీకాలానికి ఎన్నికయ్యారు. పారిస్‌తో పాటు మార్సెయ్, నీస్ వంటి ప్రధాన నగరాల్లో పోటీ తీవ్రంగా జరిగింది. ఫ్రాన్స్‌లో వచ్చే ఏడాది (2027) అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. -
ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు.. ఆ రెండు దేశాలపై రష్యా ఆరోపణలు
మాస్కో: ఉక్రెయిన్‌కు గుట్టుచప్పుడు కాకుండా అణ్వాయుధాలను బదలాయించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్నాయని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మంగళవారంతో ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రష్యా విదేశీ నిఘా విభాగం (ఎస్వీఆర్) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. ఇది చాలా ప్రమాదకర పరిణామమంటూ క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ ఆందోళన వెలిబుచ్చారు. యుద్ధానికి తెర దించేందుకు జరుగుతున్న చర్చల్లో తాము విధించిన ప్రధాన షరతుల్లో ఉక్రెయిన్ అణ్వస్త్రరహిత దేశంగా ఉండటం అతి ముఖ్యమైనదని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి నాలుగేళ్లు నిండాయి. ఇరువైపులా లక్షలాది మంది సైనికులు సమరంలో సమిధలుగా నేలకూలినా రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణ దాహం తీరడం లేదంటూ ప్రపంచ దేశాలు ఆగ్రహిస్తున్నాయి. కానీ ఈ పోరును ఆపలేక చేష్టలుడిగి చూస్తున్నాయి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి విఫలమై చోద్యం చూస్తోంది. ఉక్రెయిన్ రణక్షేత్రంలో రక్తధారాలు ఆగి శాంతి కపోతం ఎగురుతుందా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి ఎవరూ బదులు చెప్పలేని పరిస్థితి!ఉక్రెయిన్‌పై తక్షణం యుద్ధం ఆపకపోతే రష్యాపై మరిన్ని అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు. అందుకు జూన్ దాకా గడువు విధించారు. ఆలోపు పుతిన్ వైఖరి మారేనా? యుద్ధానికి తెర దించేందుకు అంగీకరిస్తారా? బదులుగా ఉక్రెయిన్‌లోని కీలక డోన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు వదులుకునేందుకు అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తారా? ఇవి ప్రస్తుతానికి ట్రిలియన్ డాలర్ల ప్రశ్నలుగానే మిగిలాయి.2022 ఫిబ్రవరి 24న మొదలు... 2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకున్నాక కూడా రష్యా దురాక్రమణ దాహం తీరలేదు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దండెత్తింది. నాటి నుంచీ పోరాడుతున్నా ఉక్రెయిన్ నుంచి 20 శాతం భూభాగాన్ని మాత్రం ఆక్రమించుకోగలిగింది. ఈ క్రమంలో ఇరువైపులా ఏకంగా 20 లక్షల మంది సైనికులు చనిపోయారని వార్తలొచ్చాయి! అయితే 3,25,000 మంది రష్యా సైనికులు చనిపోయారని, మొత్తంగా 12 లక్షల మంది గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ ప్రకటించింది.ఉక్రెయిన్ వైపు 140,000 మంది సైనికులు చనిపోయారని, 6 లక్షల మంది గాయపడ్డారని తెలిపింది. రష్యా ఆక్రమణ వేగం నత్త కన్నా మెల్లగా ఉందని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే ఎద్దేవా చేశారు. ఐరోపా దేశాల ఆయుధ, ఆర్థికబలంతో రష్యాపై ఉక్రెయిన్ భీకరంగా పోరాడుతోంది. అందుకే నాలుగేళ్లలో డోనెట్స్క్ ప్రాంతంలో రష్యా కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే ముందుకు రాగలిగిందని అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇటీవల తాము ఆక్రమించిన నాలుగు ప్రాంతాలపై ఉక్రెయిన్ హక్కులు వదలుకోవాలని, ముఖ్యంగా కీలక డోన్బాస్ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. అందుకు జెలెన్స్కీ ససేమిరా అంటున్నారు. -
భారత్, ఫ్రాన్స్ నౌకాదళాధికారుల భేటీ
సాక్షి, విశాఖపట్నం: భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం చేసేందుకు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్‌భల్లా, ఫ్రాన్స్ నేవీ చీఫ్ అడ్మిరల్ నికోలస్ వోజౌర్ ఆదివారం సమావేశమయ్యారు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ– 2026, మిలాన్–2026లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ నౌకాదళం నగరానికి వచ్చింది. ఇందులో భాగంగా నౌకాదళాధిపతులు కీలక భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సముద్ర భద్రత, కార్యకలాపాల సమన్వయం, వృత్తిపరమైన మార్పిడిపై కీలక చర్చలు జరిపారు.ఇటీవల భారత్ – ఫ్రాన్స్ మధ్య కుదిరిన ‘స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్’కు సంబంధించి నౌకాదళ రంగంలో ఆధునిక సాంకేతికత, ఉమ్మడి విన్యాసాల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతిని పెంపొందించడంపై దృష్టి సారించిన ఫ్రాన్స్‌కు చెందిన ‘అట్లాంటిక్ మారీటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఐఎఫ్ఆర్లో పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న క్రియాశీలక భాగస్వామ్యాన్ని చాటిచెప్పిందని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.ఈ చర్చలు భారత్–ఫ్రాన్స్ నౌకాదళాల మధ్య నిరంతర సమన్వయాన్ని, ప్రాంతీయ భద్రతా దృక్పథంతోపాటు ఉమ్మడి సముద్రయాన లక్ష్యాలను ప్రతిబింబించాయని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ భల్లా స్పష్టం చేశారు. అదేవిధంగా వియత్నాం నేవీ డిప్యూటీ చీఫ్ రియర్ అడ్మిరల్ నగుయెన్ థీన్క్వాన్, తూర్పు తైమూర్ నేవీ చీఫ్ కమోడోర్ హిగినో దాస్ నెవెస్తోనూ ఈఎన్సీ చీఫ్ భేటీ అయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక విన్యాసాలు, పరస్పర అవగాహన ఒప్పందాలపై చర్చించారు. -
రఫేల్ విమానాలపై మాక్రాన్ కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. భారత్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. భారత్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఐ లవ్ యువర్ కంట్రీ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో భారత్- ఫ్రాన్స్‌ల మధ్య రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఈ యుద్ధ విమానాలు భారత్‌ను బలీయమైన సైనిక శక్తిగా మారుస్తాయని తెలిపారు. అదేవిధంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయని చెప్పుకొచ్చారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాక్రాన్ మాట్లాడుతూ.. భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న బంధం ప్రత్యేకమైనది. వ్యూహాత్మక ప్రయోజనాలున్న అనేక రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. భారత ప్రభుత్వానికి, దసో ఏవియేషన్‌కు మధ్య జరుగుతున్న చర్చల్లో రఫేల్ కొనుగోళ్లు ఓ భాగం. దీనిపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ డీల్ భారత్‌ను సైనికపరంగా మరింత శక్తిమంతం చేస్తుంది. స్థానికంగా మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుంది.ఇటీవల భారత్- ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలను ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని నిర్ణయించాం. ఇందులో రఫేల్ ఒప్పందం కీలకపాత్ర పోషిస్తుంది. 114 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం, భారత రక్షణ సన్నద్ధతకు వ్యూహాత్మక బలాన్ని ఇస్తుంది’ అని మాక్రాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరిక మేరకు.. ఈ ఒప్పందంలో ‘మేక్ ఇన్ ఇండియా’ విధానానికే పెద్దపీట వేస్తామని మాక్రాన్ హామీ ఇచ్చారు. గరిష్ట సంఖ్యలో భారతీయ విడిభాగాలు, కీలక పరికరాలను భారత్‌లోనే తయారు చేయడానికి, నిర్మించడానికి మేం కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. -
పదునెక్కిన బంధం
అంతర్జాతీయంగా అవాంతరాలు ఎదురైన ప్రతి సందర్భంలోనూ మనకు అండగా నిలబడిన ఫ్రాన్స్‌తో మన అనుబంధం మరింత బలపడింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారత పర్యటన సందర్భంగా రక్షణ, ఆరోగ్యం, అత్యంతా ధునాతన సాంకేతికత, సంప్రదాయేతర ఇంధన వనరులు, అరుదైన ఖనిజాలు సహా పలు అంశాల్లో ఇరు దేశాలకూ లబ్ధి చేకూర్చే 21 ఒప్పందాలపై మంగళవారం సంతకాలు కావటంతోపాటు ఇప్పుడున్న ద్వైపాక్షిక బంధాన్ని ప్రత్యేక ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యానికి విస్తరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, మెక్రాన్‌లు నిర్ణయించటం చరిత్రాత్మకం. పరస్పర గౌరవం, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఉంటే దేశాల మధ్య స్నేహం చిగురించటం, విస్తరించటం కష్టమేమీ కాదు. కానీ చుట్టూ గడ్డు పరిస్థితులున్నా, అనిశ్చితి ఆవరించినా కూడా ఆ బంధం మరింత దృఢపడటం గొప్ప విషయం. మోదీ అన్నట్టు ఇరు దేశాల మధ్యా దశాబ్దాలుగా ఉన్న ‘సరిహద్దులు లేని’ చెలిమి వల్లనే ఇదంతా సాధ్యమైంది. 1988లో పోఖ్రాన్లో అప్పటి వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అణుపరీక్ష నిర్వహించినప్పుడు ఏం జరిగిందో అందరికీ గుర్తుంది. అప్పటికే తమ అమ్ములపొదిలో వందల సంఖ్యలో అణుబాంబులు పెట్టుకున్న అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాలన్నీ మనపై విరుచుకుపడ్డాయి. సుద్దులు చెప్పేందుకు సిద్ధమ య్యాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) శిఖరాగ్ర సదస్సు ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. అప్పుడు భారత్‌ను గట్టిగా సమర్థించి, ఆంక్షలు విధించే తీర్మానాన్ని ‘వీటో’ చేస్తామని ఫ్రాన్స్ హెచ్చరించటంతో అది కాస్తా సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా అణు రియాక్టర్ల సాంకేతికత మొదలు అధునాతన ఆయుధాలు అందించటం వరకూ ఆ దేశం మనకెంతో తోడ్పాటునందించింది. ప్రపంచ దేశాలను బతిమాలి, ఒత్తిడి తెచ్చి మూడు దశాబ్దాల క్రితం తానే తీసు కొచ్చిన ప్రపంచీకరణ విధానాలకు హఠాత్తుగా తిలోదకాలిచ్చిన అమెరికా... ఇప్పుడు ఒంటెత్తు పోకడలతో, బెదిరింపులతో, దబాయింపులతో అందరినీ పాదాక్రాంతం చేసుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ దౌత్య సంప్రదాయాలకూ, మర్యాదలకూ ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెల్లుచీటీ ఇచ్చారు. ఈ కల్లోల స్థితిలో భారత్–ఫ్రాన్స్‌ల మధ్య ఇప్పుడు కుదిరిన ఒప్పందాలు ఏదోమేర సుస్థిరత ఏర్పడటానికి దోహద పడతాయి. వర్తమాన ప్రపంచ పరిణామాలపై ఇరు దేశాల వైఖరులూ ఒకటే. అన్ని దేశాలూ నిబంధనలకు కట్టుబడి ఉన్నప్పుడే అందరూ సమానంగా అభివృద్ధి సాధించగల మెరుగైన ప్రపంచం ఏర్పడుతుందని రెండు దేశాలూ విశ్వసిస్తాయి. ఇలాంటి సారూప్యతల కారణంగానే ప్రగాఢమైన సాన్నిహిత్యం సాధ్యమైంది. మన రక్షణ కొనుగోళ్లలో రష్యా తర్వాత ఫ్రాన్స్‌దే రెండో స్థానం. ఆ రంగంలో మనం స్వావలంబన సాధించాలనీ, విదేశాలపై ఆధారపడటం తగ్గాలనీ అందరూ కోరుకుంటున్నదే. కానీ ఈలోగా మన భద్రతకూ, రక్షణకూ విశ్వసించదగ్గ భాగస్వాములు ఎంతో అవసరం. రష్యాతోపాటు ఫ్రాన్స్ దాన్ని నెరవేర్చగలుగుతోంది. మన వైమానిక దళానికీ, నావికాదళానికీ మరిన్ని రఫేల్ యుద్ధ విమానాల కోసం మనం ఒప్పందం కుదుర్చుకోగా, వాటిలో కొన్నిటిని ఇక్కడే ఉత్పత్తి చేసేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. అలాగే ఎవరెస్టు శిఖరం కన్నా ఎత్తులో ఎగిరే ఎయిర్‌బస్ హెచ్ 125 హెలికాప్టర్ల తయారీ సైతం మొదలైంది. వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తామని మోదీ ప్రకటించారు. ప్రపంచం తూర్పు, పడమరలుగా... ఉత్తర, దక్షిణాలుగా విడివడి ఉంది. మనం పాశ్చాత్య దేశాలుగా పిలుచుకునే వాటిలో సైతం భిన్న ధోరణులు కనబడుతున్నాయి. ఇలాంటి ప్రపంచంలో పరస్పర సహకారం, గౌరవం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఏ రెండు పక్షాల మధ్యనైనా అవగాహన కష్టం కాదని ఇప్పుడు ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పందాలైనా, ఇంత క్రితం బ్రిటన్, ఈయూలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలైనా రుజువు చేశాయి. ఎప్పటికీ ఏకధ్రువ ప్రపంచమే కొనసాగాలనీ, తమ ఆధిపత్యమే శాశ్వతంగా వర్ధిల్లాలనీ, అన్యులెవరూ ఎదగరాదనీ భావిస్తున్న అమెరికా... బహుళ ధ్రువ ప్రపంచం తన కళ్లముందే నిర్మాణమవుతున్న వైనాన్ని ఇకనైనా గ్రహించటం మంచిది. -
భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మాక్రాన్ కీలక ప్రకటన
ఢిల్లీ: భారత విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుభవార్త చెప్పారు. భారతీయ విద్యార్థుల కోసం వీసా, అడ్మిషన్ ప్రక్రియను సరళీకరిస్తామని అన్నారు. అలాగే, 2030 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను ఏడాదికి 30,000కు పెంచడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.భారత్ పర్యటనలో భాగంగా బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి విద్య, శాస్త్రీయ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాక్రాన్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి, 'ఇండో-ఫ్రెంచ్ క్యాంపస్ ఆన్ ఏఐ ఇన్ గ్లోబల్ హెల్త్'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) క్యాంపస్‌లో మాక్రాన్ మాట్లాడుతూ..‘రానున్న రోజుల్లో మా దేశానికి ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను స్వాగతించాలనుకుంటున్నాం. అదేవిధంగా, అలాగే ఫ్రెంచ్ విద్యార్థులు కూడా భారత్‌కు రావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి భారత్ నుంచి ఫ్రాన్స్ వచ్చే విద్యార్థుల సంఖ్య 10వేలుగా ఉంది. ఆ సంఖ్యను 2030 నాటికి 30,000లకు పెంచాలని ప్రధాని మోదీతో చర్చించాను.ఫ్రాన్స్ వైపు నుంచి మేము అడ్మిషన్ల ప్రక్రియను, వీసా విధానాన్ని సరళీకరిస్తాం. విద్యార్థుల అంచనాలకు అనుగుణంగా ఈ ప్రక్రియలను మరింత ఆచరణాత్మకంగా మారుస్తాం అని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఫ్రాన్స్‌లో ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించే కోర్సులను పెంచుతామని మాక్రాన్ ప్రకటించారు. ‘మా వద్ద ఉత్తమ బోధన సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థులకు ఆంగ్లంలో కూడా విభిన్న కోర్సులు అందిస్తాం. ఉన్నత విద్యలో వారికి అవసరమైన అన్ని విధాల సహాయ, సహకారాలను అందిస్తాం’ అని హామీ ఇచ్చారు.#WATCH | Delhi: French President Emmanuel Macron says, "...It's very important for us to welcome more Indian students and to have more French students coming here. We speak about 10,000 per year, more or less, depending on the season. We decided with Prime Minister Modi to have… https://t.co/pj8bOckFdM pic.twitter.com/RPNLq4a7co— ANI (@ANI) February 18, 2026ఇదే సమయంలో రక్షణ రంగంలో సాంకేతిక బదిలీపై కూడా మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జలాంతర్గాములు, రాఫెల్ యుద్ధ విమానాలు, ఐదో తరం విమానాల ఇంజన్లు ఇలా అనేక రంగాలలో ఫ్రాన్స్ భారత్‌తో కలిసి పని చేస్తోందని తెలిపారు. ఈ రంగంలో సాంకేతిక బదిలీని తాము కూడా విశ్వసిస్తామని చెప్పారు. అయితే, ఈ అంశాన్ని తాము కూడా ప్రతిపాదించినట్లు మాక్రాన్ చెప్పుకొచ్చారు. దీంతో పాటు అంతరిక్ష రంగం వంటి అనేక ఇతర విషయాల్లోనూ ఇరు దేశాల మధ్య సంబంధాలు కొన్నేళ్లుగా అద్భుతంగా కొనసాగుతున్నాయని అన్నారు. అందుకే జూలైలో తాము ఫ్రాన్స్‌లో నిర్వహించబోయే అంతరిక్ష రంగ సదస్సుకు భారత్‌ను ఆహ్వానించామని ఆయన స్పష్టం చేశారు. -
ద్వైపాక్షిక బంధం... గ్లోబల్ స్థాయికి!
ముంబై: భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో నూతన శకానికి తెర లేచింది. అంతర్జాతీయంగా తీవ్ర అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. వాటిని ‘ప్రత్యేక ప్రపంచ స్థాయి వ్యూహత్మక భాగస్వామ్యం’గా తీర్చిదిద్దుకోవాలని నిశ్చయించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ నడుమ జరిగిన చర్చల్లో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. రక్షణ, వర్తకం మొదలుకుని అరుదైన ఖనిజాల దాకా అన్ని రంగాల్లోనూ పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని నేతలు నిర్ణయించారు.ఈ దిశగా రక్షణ, అత్యంత అధునాతన టెక్నాలజీ, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఆరోగ్యం తదితరాలకు సంబంధించి ఇరు దేశాల నడుమ 21 కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్, ఫ్రెంచి రక్షణరంగ దిగ్గజం సఫ్రాన్ సంయుక్తంగా భారత్‌లో హమ్మర్ క్షిపణుల తయారీ, భారత, ఇరుదేశాల సైన్యంలో పరస్పరం అధికారుల నియామకం తదితరాలు వీటిలో ఉన్నాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచి్చన మాక్రాన్‌తో మంగళవారం సాయంత్రం మోదీ ముంబైలో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ లోతుగా చర్చించారు. భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక బంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని తీర్మానించారు. అనంతరం మోదీ, మాక్రాన్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కీలక భాగస్వామ్యం: మోదీ ప్రపంచం ప్రస్తుతం అత్యంత అస్థిర దశ గుండా సాగుతోందని మోదీ అభిప్రాయపడ్డారు.ఈ పరిస్థితుల్లో స్థిరత్వ స్థాపనలో భారత్, ఫ్రాన్స్ భాగస్వామ్యం కీలకపాత్ర పోషించగలదని విశ్వాసం వెలిబుచ్చారు. ఫ్రాన్స్ నైపుణ్యం, భారత వనరులు ఒక్కతాటిపైకి వస్తే అద్భుతాలు జరుగుతాయన్నారు. ఇరుదేశాలదీ ఎలాంటి హద్దులూ లేని ఆదర్శ భాగస్వామ్యం. ఇరు దేశాల మధ్య మొదటినుంచీ ప్రత్యేక సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి’’అని చెప్పారు.భారత్‌కు అత్యంత పురాతన వ్యూహాత్మక భాగస్వాముల్లో ఫ్రాన్స్ ఒకటని ఆయన గుర్తు చేశారు. ‘‘మాక్రాన్‌తో తాజా భేటీ ద్వారా ఈ బంధాన్ని ఎన్నడూ లేనంతగా ముందుకు తీసుకెళ్లాం. ఇరు దేశాలు పరస్పర విశ్వాసం, ఉమ్మడి విజన్‌తో కలసి సాగనున్నాయి. ఇది కేవలం వ్యూహాత్మక బంధం మాత్రమే కాదు. ప్రపంచ ప్రగతికి బాటలు పరిచే కీలక బంధం’’అని ప్రకటించారు. ఉగ్రవాదం కూడా మాక్రాన్‌తో చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచి్చనట్టు ప్రధాని తెలిపారు. దాన్ని అన్ని రూపాల్లోనూ తుదముట్టించేందుకు ఇరు దేశాలూ కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు. సంస్కరణలతోనే సమాధానం ఉక్రెయిన్, పశి్చమాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ఇతర చోట్ల యుద్ధ మేఘాలు ఇంకా తొలగలేదని మోదీ గుర్తు చేశారు. ‘‘ఈ కల్లోల పరిస్థితుల నుంచి గట్టెక్కించగలిగేది ప్రజాస్వామిక విలువలే అన్నదే భారత్, ఫ్రాన్స్ వైఖరి. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలను సమూలంగా సంస్కరించినప్పుడే ఈ అంతర్జాతీయ సవాళ్లకు సజావైన పరిష్కారాలు లభిస్తాయి ఆ ప్రయత్నాలకు భారత్, ఫ్రాన్స్ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాయి. ఎందుకంటే రెండు దేశాలూ బహుళ ధ్రువ ప్రపంచాన్నే కోరుతున్నాయి’’అని వివరించారు.యూరోపియన్ యూనియన్‌తో భారత్ ఇటీవలే తన చరిత్రలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని మోదీ గుర్తు చేశారు. అది భారత్, ఫ్రాన్స్ సంబంధాలకు కూడా ఎంతగానో ఊపునిచ్చే పరిణామమేనని ఆయన చెప్పారు. ‘‘ఇరు దేశాల ప్రజలు, కంపెనీలు ఇకపై రెండు పన్నులు కట్టాల్సిన దురవస్థ తప్పింది. పరస్పర వర్తకం, పెట్టుబడులు తదితరాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలకు ఈ ఒప్పందాలు సరికొత్త రోడ్‌మ్యాప్‌గా నిలిచాయి’’అన్నారు. హెలికాప్టర్ నిర్మాణ కేంద్రం ప్రారంభం కర్నాటకలోని వెమగల్‌లో ఎయిర్‌బస్ హెచ్125 హెలికాప్టర్ల నిర్మాణ కేంద్రాన్ని ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇరుదేశాల మధ్య పరస్పరం నెలకొన్న లోతైన విశ్వాసానికి ఈ ప్లాంట్ ప్రారంభమే తాజా నిదర్శనమని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ‘‘మౌంట్ ఎవరెస్టును మించిన ఎత్తుల్లో ఎగరగల సామర్థ్యమున్న ఏకైక హెలికాప్టర్‌ను ఇరుదేశాలూ కలిసి భారత్‌లో సంయుక్తంగా తయారు చేయనుండటం నిజంగా గర్వకారణం. వాటిని ప్రపంచమంతటికీ ఎగుమతి చేయనున్నాం’’అని ప్రకటించారు. ఈ హెలికాప్టర్ల తయారీ ప్లాంటు ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్, భారత్‌కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ జాయింట్ వెంచర్భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి: మాక్రాన్ఫ్రాన్స్కు భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి అని మాక్రాన్ పేర్కొన్నారు. రఫేల్యుద్ధ విమానాలు మొదలుకుని జలాంతర్గాముల దాకా రక్షణ రంగంలో ఇరు దేశాల నడుమ పరస్పర సహకారం నానాటికీ పెంపొందుతోందని హర్షం వెలిబుచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో కూడా భారత్, ఫ్రాన్స్ పరస్పరం మరింతగా సహకరించుకుంటాయని ప్రకటించారు. భారత్‌లో తనకు లభించిన అపూర్వ స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. మాక్రాన్‌కు భారత్‌లో ఇది నాలుగో అధికారిక పర్యటన.ఇన్నొవేషన్ల సారథి భారత్: మాక్రాన్ ‘‘గ్లోబల్ ఇన్నొవేషన్‌లో భారత్ కేవలం భాగస్వామి కాదు. సిలికాన్ వ్యాలీ మొదలుకుని టెక్నాలజీ, సంస్కృతి దాకా అన్ని రంగాల్లోనూ సారథి స్థానంలో రాణిస్తోంది’’ అంటూ మాక్రాన్ ప్రశంసించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోదీతో కలిసి ‘ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నొవేషన్’ను ఆయన ఆవిష్కరించారు. ఇరుదేశాల భాగస్వామ్యాన్ని ప్రజల భాగస్వామ్యంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని నేతలు వివరించారు. ఇందులో భాగంగా పరిశ్రమలు, స్టార్టప్‌లు, చిన్న–మధ్య తరహా పరిశ్రమలు, విద్యార్థులు, రక్షణ రంగంలో పరిశోధనలు, స్వచ్ఛ ఇంధనం, అంతరిక్షం, నూతన టెక్నాలజీలు తదితర రంగాల్లో పరిశోధనలకు మరింత ఊపు లభిస్తుందని మోదీ అన్నారు. ఇన్నొవేషన్ ఇయర్లో భాగంగా ఆరోగ్యం, డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఇండో–ఫ్రెంచ్ ఏఐ సెంటర్లను స్థాపించనున్నారు. ఫ్రాన్స్‌లో భారత్ త్వరలో స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.మెరీన్ డ్రైవ్‌లో మాక్రాన్ జాగింగ్!ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మా క్రాన్ మంగళవారం ఉదయం బాంబేలోని మెరీన్ డ్రైవ్‌లో జాగింగ్ చేశారు. నీలిరంగు టీ షర్టు, నలుపు షార్ట్స్, రన్నింగ్ షూస్ ధరించిన ఆయన జాగింగ్ చేస్తున్న వారితో కలిసి పోటాపోటీగా పరుగు తీశారు. భద్రతా సిబ్బంది మారువేషాల్లో కాస్త వెనకగా ఆయనను అనుసరించారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మాక్రాన్‌ను గుర్తు పట్టిన పలువురు ఆయన్ను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించారు. అవన్నీ వైరల్‌గా మారాయి. మాక్రాన్ విదేశీ పర్యటనల్లో కూడా జాగింగ్ కొనసాగిస్తుంటారు.బాలీవుడ్ తారలతో మాక్రాన్ దంపతుల భేటీఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనలో తారల తళుకులు చోటుచేసుకున్నాయి. పలువురు బాలీవుడ్ తారలతో మాక్రాన్, బ్రిగెటీ దంపతులు మంగళవారం భేటీ అయ్యారు. సినీ పరిశ్రమపరంగా భారత్, ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై వారితో రెండు గంటలకు పైగా చర్చించారు. తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో జోయా అక్తర్, షబానా అజ్మీ, మనోజ్ బాజ్‌పాయ్, అనిల్ కపూర్, కబీర్ ఖాన్, రిచా ఛద్దా తదితరులు పాల్గొన్నారు. 2008లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రమంటే తనకెంతో ఇష్టమని బ్రిగెటీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -
లూవ్రీ మ్యూజియంలో టికెట్ల మోసం
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత లూవ్రీ మ్యూజియంలో టికెట్ల మోసం జరిగినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. గత పదేళ్లలో ఏకంగా 10 మిలియన్ యూరోలు (రూ.106.90 కోట్లు) పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు గురువారం వెల్లడించారు. టికెట్ల విషయంలో మోసంపై మ్యూజియం నిర్వాహకులు 2024 డిసెంబర్లో ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు జ్యుడీíÙయల్ విచారణ ప్రారంభించారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మ్యూజియం ఉద్యోగులు ఉండడం గమనార్హం. టూర్ గైడ్లతోపాటు మరో వ్యక్తి కూడా అరెస్టయ్యాడు. అతడే ఈ మొత్తం మోసానికి మాస్టర్‌మైండ్ అని వెల్లడయ్యింది. ఇద్దరు చైనా టూర్ గైడ్లు తరచుగా చైనా పర్యాటకులను ఈ మ్యూజియానికి తీసుకొస్తూ ఉండేవారు. మ్యూజియంలోకి ప్రవేశించడానికి ఒకసారి ఉపయోగించిన టికెట్లను పదేపదే ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులకు అనుమానం వచి్చంది. చైనా టూర్ గైడ్ల దారిలోనే మరికొందరు గైడ్లు కూడా ఈ మోసానికి పాల్పడ్డారు. మ్యూజియం ఉద్యోగుల అండతో టికెట్లను మళ్లీమళ్లీ ఉపయోగించారు. ఇలా రీసైకల్ అవుతున్న టికెట్లను ప్రవేశద్వారం వద్ద తనిఖీ చేయకుండా ఉద్యోగులను మచి్చక చేసుకున్నారు. వారికి లంచాలు ఎరవేశారు. తద్వారా టికెట్ల రుసుమును మ్యూజియం కోల్పోయింది. ఆర్థికంగా నష్టం వాటిల్లింది. ఈ మొత్తం వ్యవహారంపై గత ఏడాది జూన్‌లో దర్యాప్తు మొదలైంది. ఇది వ్యవస్థీకృత నేరంగా గుర్తించారు. మోసపూరితంగా సంపాదించిన సొమ్మును నిందితులు స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడం గమనార్హం. ఫ్రాన్స్, దుబాయ్‌లో ఆస్తులు కొన్నారు. అధికారులు ఇప్పటిదాకా కొంత నగదును సీజ్ చేశారు. పారిస్‌లోని మరికొన్ని దర్శనీయ కేంద్రాల్లోనూ టికెట్ల మోసం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: అధునాతన యుద్ధ విమానాలతో దేశ సరిహద్దులను, గగనతలాలను శత్రు దుర్భేద్యంగా చేసే లక్ష్యంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ అదనంగా 114 రఫేల్ ఫైటర్జెట్లను కొనుగోలుచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.3.6 లక్షల కోట్లతో రూపొందించిన కొనుగోలు ప్రతిపాదనలను గురువారం రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని రక్షణ శాఖ మంత్రి పరిధిలోని ‘రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ)’ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 18 యుద్ధ విమానాలను ఫ్రాన్స్‌లోనే తయారుచేసి భారత్‌కు సరఫరాచేయనున్నారు. మిగతా 96 విమానాలను భారత్‌లో తయారుచేయనున్నారు. వీటిల్లో సగానికిపైగా విమానాలను దశలవారీగా దేశీయంగా తయారుచేసిన విడిభాగాలతో రూపొందించనున్నారు. ఇందుకోసం దేశీయంగా అనుబంధ కర్మాగారాలను నెలకొల్పడంతో దేశీయ రక్షణరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందనుంది. రఫేల్ విమానాలతో పాటు అత్యంత ఎత్తులో తిరిగే సూడో శాటిలైట్(ఏఎస్–హెచ్ఏపీఎస్)లనూ కొనుగోలుచేయనున్నారు. సూడో శాటిలైట్లు సౌరఫలకాలతో పనిచేస్తూ నిఘా, పర్యవేక్షణ, కమ్యూనికేషన్ సేవలను అందిస్తాయి. మరో నాలుగురోజుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన మొదలుకానున్న వేళ ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్‌తో ఒప్పందం కుదరబోతుండటం విశేషం. దసాల్ట్ సంస్థలో దాదాపు 10 నెలలపాటు విస్తృతస్థాయిలో చర్చలు జరిపాక ఈ ఏడాది చివరిలోపు సమగ్రస్థాయిలో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. విమానాలతోపాటు వాటిలోని విడిభాగాల తయారీకి సంబంధించిన సాంకేతికత బదిలీ వంటి అంశాలపై కూలంకషంగా చర్చిం చాల్సి ఉంది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్) ఆమోదం పొందాల్సి ఉంది. ‘‘అదనపు విమానాలతో భారతవాయుసేన.. సరిహద్దుల వంటి ఉద్రిక్త ప్రాంతాల్లో దాడి సామర్థ్యాలు ద్విగుణీకృతమవుతాయి. వీటితోపాటు కొనే శక్తివంత క్షిపణులు సుదూరాల్లోని శత్రు స్థావరాలపై అత్యంత కచి్చతత్వంతో దాడిచేసే సత్తాను పెంచుతాయి. ఒక సూడో ఉపగ్రహాలు అనేవి 30 కిలోమీటర్ల ఎత్తులో స్ట్రాటో ఆవరణలో చక్కర్లు కొడుతూ శత్రు స్థావరాలపై నిఘా, పర్యవేక్షణ, ఎలక్ట్రిక్ ఇంటెలిజెన్స్, టెలికమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ సేవలను అందిస్తాయి’’అని రక్షణ శాఖ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. ఆనాడు రూ.1.63 లక్షల కోట్లతో మొదలై.. 2015లో మోదీ ప్రభుత్వం భారత వాయుసేనలోని స్క్వాడ్రాన్ల సంఖ్య తగ్గిపోతోందని, వీటిని అత్యాధునిక యుద్ధవిమానాలతో భర్తీచేయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు భారత్‌కు 36 రఫేల్ విమానాలను సరఫరాచేసింది. ఇవి ప్రస్తుతం భారత వాయుసేన స్క్వాడ్రాన్‌లో సేవలందిస్తున్నాయి. గతంలోనూ 114 బహుళ ప్రయోజనకర యుద్ధ విమానాలు(ఎంఆర్ఎఫ్ఏ)లు తమకు అవసరమని భావించి వాయుసేన రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్(టెండర్)ను జారీచేసింది. అప్పట్లో అది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల కొనుగోలు ఒప్పంద ప్రతిపాదనల్లో ఒకటిగా రికార్డ్‌కెక్కింది. ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకునేందుకు దసాల్ట్ ఏవియేషన్‌తోపాటు అమెరికాకు చెందిన లాక్‌హీల్డ్ మార్టిన్, బోయింగ్, యూరోఫైటర్ కంపెనీలు పోటీపడ్డాయి. భారత్‌కు రఫేల్ విమానాలు విక్రయించేందుకు దసాల్ట్, ఎఫ్–21లను అమ్మేందుకు లాక్‌హీల్డ్‌మారి్టన్, టైఫNన్ జెట్లను విక్రయించేందుకు యూరోఫైటర్ సంస్థలు ఆసక్తి చూపించాయి. గరిష్టంగా 42 స్క్వాడ్రాన్లకు అనుమతి ఉండగా 31 స్క్వాడ్రాన్లను కొనుగోలుచేయాలని రక్షణశాఖ భావించింది. సైన్యం, నేవీ కోసమూ కొనుగోళ్లు.. భారత సైన్యం కోసం దేశీయంగా తయారైన వైభవ్ ట్యాంక్ విధ్వంసక మందుపాతరలు, యుద్ధట్యాంక్‌లను తరలించే ఆర్మార్డ్ రికవరీ వెహికల్(ఏఆర్వీ), ఉభయచర ఫైటింగ్ వెహికల్(బీఎంపీ–2), టీ–72 ట్యాంక్‌లనూ కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకూ ‘రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ)’ఆమోదముద్ర వేసింది. భారతనావికాదళం కోసం పీ8ఐ రకం నిఘా, పర్యవేక్షణ విమానంతోపాటు దేశీయంగా తయారుచేసే నాలుగు ఎండబ్ల్యూ మెరైన్ గ్యాస్ టర్బైన్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ల కొనుగోలు ప్రతిపాదనలకూ ఆమోదం తెలిపారు. -
రఫేల్ యుద్ధ విమానాల డీల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
ఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల డీల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఫ్రాన్స్‌తో రూ. 3 లక్షల 25 వేల కోట్లతో రఫేల్ యుద్ధ విమానాల డీల్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఆర్డర్ ఇచ్చినట్లు Defence Acquisition Council (DAC) స్పష్టం చేసింది.ఈ నెల 18వ తేదీన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ .. భారత్‌కు రానున్నారు. అయితే మేక్రాన్ పర్యటనకు ముందే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ీడీల్కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది భారత రక్షణ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా భావిస్తున్నారు.ఈ డీల్ ద్వారా భారత వాయుసేనకు ఆధునిక సాంకేతికతతో కూడిన శక్తిమంతమైన యుద్ధ విమానాలు లభిస్తాయి. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ సరిహద్దుల వద్ద పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ఇది మరింత కీలకం కానుంది. మరొకవైపు భారత నేవీ కోసం, Scalp Cruise Missiles ఇతర రక్షణ సామగ్రిని కూడా కొనుగోలు చేయనున్నారు.కాగా, భారత్ ఇప్పటివరకు రెండు ప్రధాన సందర్భాల్లో రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. 2016లో ఎయిర్‌ఫోర్స్‌ను మరింత పటిష్టం చేసేందుకు 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఫ్రాన్స్‌తో రూ. 59 వేల కోట్లతో ఈ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. 2020లో మొదటి బ్యాచ్ భారత్‌కు చేరింది, 2022 నాటికి అన్ని విమానాలు ఐఏఎఫ్‌లో చేరాయి.ఇక నేవీ కోంస 2025 ఏప్రిల్‌లో భారత్ రూ. 63 వేల కోట్లతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. 22 సింగిల్ సీట్, 4 ట్విన్ సీట్, రఫేల్ మెరైన్ జెట్స్‌ను భారత్ కొనుగోలు చేసింది. ఇవి ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాధిత్యా ఎయిర్‌క్రాఫ్ట్‌పై మోహరించబడతాయి. -
ఏ క్షణమైనా యుద్ధం.. రంగంలోకి ఫ్రాన్స్, జర్మనీ బలగాలు
-
గ్రీన్లాండ్ టారిఫ్‌లు పూర్తిగా తప్పు
లండన్: గ్రీన్లాండ్ స్వాధీన ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామనే కారణంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమపై టారిఫ్‌లను ప్రకటించడాన్ని యూరప్ దేశాల నేతలు ఖండించారు. ట్రంప్ ప్రభుత్వ వైఖరిని డెన్మార్క్, యూకే, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ తప్పుబట్టారు. ‘గ్రీన్లాండ్ విషయంలో మా వైఖరి సుస్పష్టం. ఆ ప్రాంతం డెన్మార్క్ సామ్రాజ్యంలోనిదే. దాని భవిష్యత్తును నిర్ణయించాల్సింది డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలు మాత్రమే’ అని వారు పేర్కొన్నారు. ‘టారిఫ్ హెచ్చరికలు అట్లాంటిక్ దేశాల మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీస్తాయి. ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసే ప్రమాదముంది. యూరప్, అమెరికా మధ్య ఉండాల్సిన సహకారంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాం’ అని వారు పేర్కొన్నారు. ఆర్కిటిక్ ప్రాంత రక్షణ మొత్తం నాటో కూటమికి కీలకమైన అంశం. ఆర్కిటిక్‌లోని వివిధ ప్రాంతాలకు రష్యా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడానికి మిత్రదేశాలన్నీ కలిసి మరిన్ని చర్యలు చేపట్టాలి. నాటో మిత్రదేశాల సమష్టి భద్రత కోసం కృషి చేస్తున్న మిత్రపక్షాలపైనే టారిఫ్‌లు విధించడం పూర్తిగా తప్పు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వంతో నేరుగా చర్చిస్తాం’ అని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ట్రంప్ బెదిరింపులకు తాము లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ స్పష్టం చేయగా యూరప్ మిత్ర దేశాలను ట్రంప్ బ్లాక్ మెయిల్ చేయడం సరికాదని స్వీడన్ ప్రధాని క్రిస్టెర్సన్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఉమ్మడి స్పందన కోసం నార్వే, స్వీడన్, యూకేలతో తీవ్రంగా చర్చిస్తున్నామన్నారు. ఈ విషయంలో సంయమనంతో వ్యవహరించాలని, వాణిజ్య ఉద్రిక్తతలను మరింత ముదిరేలా వ్యవహరించరాదని నార్వే ప్రధాని జొనాస్ పేర్కొన్నారు. ఇది ఎవరికీ మంచిదికాదన్నారు. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా ప్రయత్నాలకు అడ్డు చెబుతున్న డెన్మార్క్, యూకే, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ ఉత్పత్తులపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 10 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తామని ట్రంప్ తాజాగా ప్రకటించారు. గ్రీన్‌లాండ్‌పై ఈ దేశాలు తమతో ఒక అంగీకారానికి రాని పక్షంలో జూన్ నుంచి టారిఫ్‌లను 25 శాతానికి పెంచుతామని ఆయన హెచ్చరించడం తెల్సిందే. -
ట్రంప్ బెదిరింపులు.. మాక్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్లాండ్ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. గ్రీన్లాండ్ అంశంలో అమెరికా విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలను ట్రంప్ టార్గెట్ చేశారు. తాజాగా ఆయా దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పలు దేశాల అధినేతలు..కాగా, ట్రంప్ గ్రీన్లాండ్ అంశంపై చేసిన టారిఫ్ బెదిరింపులపై తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్రంగా స్పందించారు. మాక్రాన్ ట్విట్టర్ వేదికగా..‘ట్రంప్ టారిఫ్‌లు అంటూ ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. అది ఉక్రెయిన్ అయినా, గ్రీన్లాండ్ అయినా, ప్రపంచంలోని మరెక్కడైనా సరే. ఈ తరహా పరిస్థితుల్లో మేం వెనక్కి తగ్గం. టారిఫ్‌ల పేరుతో ఒత్తిడి తేవడం సరికాదు. ఈ సందర్భంలో వాటికి ఎలాంటి స్థానం లేదు. అలాంటి బెదిరింపులు పూర్తిగా అంగీకరించే ప్రసక్తే లేదు’ అని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో టారిఫ్‌లు అమలయ్యే పరిస్థితి వస్తే యూరప్ దేశాలన్నీ కలిసికట్టుగా, సమన్వయంతో దీనికి తగిన సమాధానం ఇస్తాయని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌తో పాటు ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఫ్రాన్స్ కట్టుబడి ఉందని మరోసారి ఆయన స్పష్టం చేశారు.France is committed to the sovereignty and independence of nations, in Europe and elsewhere. This guides our choices. It underpins our commitment to the United Nations and to its Charter.It is on this basis that we support, and will continue to support Ukraine…— Emmanuel Macron (@EmmanuelMacron) January 17, 2026ఫ్రాన్స్ ప్రాధాన్యం అదే.. మరోవైపు.. దేశాల సార్వభౌమత్వం, స్వతంత్రతకు ఫ్రాన్స్ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని మాక్రాన్ గుర్తు చేశారు. అదే సూత్రాల ఆధారంగానే ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచామని, భవిష్యత్తులో కూడా ఆ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను గౌరవించడం ఫ్రాన్స్ విదేశాంగ విధానానికి మూలస్తంభమని ఆయన చెప్పారు. ‘యూరప్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశాల సార్వభౌమత్వం, స్వాతంత్ర్యం మా నిర్ణయాలకు మార్గదర్శకం. అదే కారణంగా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాం. శాంతి కోసం, భద్రత కోసం ఎంత దూరమైనా వెళ్తాం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. గ్రీన్లాండ్ విషయంలో వ్యతిరేకంగా ఉన్న డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలపై 10 శాతం సుంకం వర్తిస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరకులపై 10 శాతం అదనపు సుంకం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని శనివారం ఆయన తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ ఒకటో తేదీకల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. -
అమెరికా తప్పుకున్నా భారత్ ముందుకే
న్యూఢిల్లీ: అమెరికా వైదొలిగినప్పటికీ, మిగిలిన 125 దేశాలతో కలసి భారత్ అంతర్జాతీయ సోలార్ కూటమిని ముందుకు నడిపిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్(ఐఎస్ఏ) అన్నది భారత్, ఫ్రాన్స్ సంయుక్త సహకారంతో ఏర్పడిన కూటమి. సౌర ఇంధన పరిష్కారాలతో వాతావరణ మార్పులపై పోరాటం కోసం ఏర్పాటైన సంస్థ. 2015లో పారిస్‌లో కాప్21 సదస్సు సందర్భంగా దీనికి బీజం పడింది. ఐక్యరాజ్యసమితిలోని అన్ని దేశాలూ ఇందులో చేరేందుకు అనుమతి ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ సహా 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. వీటిల్లో భాగస్వామ్యం అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొనడం గమనార్హం. ఐఎస్ఏ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు వచి్చన మీడియా నివేదికలు ప్రభుత్వం దృష్టికి వచి్చనట్టు అధికార వర్గాలు తెలిపాయి. మిగిలిన దేశాలతో కూటమి యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశాయి. సౌర విద్యుత్ అభివృద్ధి, నిధుల సమీకరణ, సామర్థ్యం ఏర్పాటుపై కృషి కొనసాగుతుందని చెప్పాయి. భారత్ అధ్యక్షత వహిస్తున్న ఐఎస్ఏలో ఇప్పుడు 125 సభ్య దేశాలుగా ఉన్నాయి. సోలార్ ఇంధన సామర్థ్యం విస్తరణలో సభ్య దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ కూటమి దృష్టి సారిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఐఎస్ఏ ఏర్పాటైన నాటి నుంచి సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే విషయంలో ఎంతో కృషి జరగడం గమనార్హం. -
ట్రంప్.. నీ బాంచన్!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ఎగతాళి చేస్తూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. టారిఫ్ బెదిరింపులతోనే ఔషధ ధరల విషయంలో ఫ్రాన్స్ మెడలు వంచానంటూ వ్యాఖ్యానించారు. అయితే.. తాను మాక్రాన్‌పై ఎలాంటి ఒత్తిడి చేశాననే విషయాన్ని బహిరంగంగా వివరించారు. తాజాగా.. వాషింగ్టన్లో రిపబ్లికన్ సభ్యులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘అమెరికన్లు ఫ్రెంచ్ ప్రజల కంటే 14 రెట్లు ఎక్కువగా ఔషధ ధరలు చెల్లిస్తున్నారు. ఈ అసమానతను తగ్గించేందుకు ఫ్రాన్స్‌పై ఒత్తిడి చేశా. మొదట మాక్రాన్ నిరాకరించినా.. చివరికి నా డిమాండ్‌కు లొంగిపోయారు’’ అని అన్నారు. వైన్, షాంపేన్ సహా అన్నిరకాల ఫ్రెంచ్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌ను విధిస్తానని హెచ్చరించా. ఈ బెదిరింపుతో ఫ్రెంచ్ అధ్యక్షుడు వెంటనే దిగి వచ్చారు అని ట్రంప్ చెప్పుకొచ్చారు. “డొనాల్డ్, మీకు డీల్ ఉంది. ఔషధ ధరలను 200 శాతం పెంచుతాను. కానీ ప్రజలకు చెప్పకండి” అని మాక్రాన్ డీల్ సెట్ చేసుకున్నారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ మాత్రమే కాదు.. ఇతర దేశాల నాయకులను కూడా ఇలాంటి టారిఫ్ బెదిరింపులతోనే దిగి వచ్చేలా చేశానని, కేవలం 3.2 నిమిషాలపాటు జరిగిన సంభాషణలలోనే ఔషధ ధరలను నాలుగు రెట్లు పెంచేందుకు అంగీకరించారని తెలిపారు. పైగా ఈ నిర్ణయాన్ని తాము గర్వంగా ఫీలవుతున్నామని వాళ్లు నాతో అన్నారు అని ట్రంప్ వివరించారు. అయితే వాళ్ల పేర్లను మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఫ్రాన్స్‌లో ఈ మధ్యకాలంలో ఔషధ ధరలు 200 శాతం పెరిగాయి. దీంతో ట్రంప్ తన మోస్ట్ పేవర్డ్ నేషన్ విధానం కారణంగా.. అమెరికాలో ధరలు తగ్గుతాయని అంటున్నారు. అది ఎలాగంటే.. MFN విధానం ప్రకారం అమెరికా మెడికేర్ చెల్లింపులు ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోని కనిష్ఠ ధరలకు అనుసంధానించబడతాయి. అలా అత్యల్ప ధర ఉన్న దేశం ధరను మాత్రమే చెల్లించేందుకు ఫెడరల్ సర్కార్ ముందుకు వస్తుంది.ట్రంప్ ప్రకారం.. అమెరికాలో 400 నుంచి 600 శాతం మధ్య తగ్గాయట. జనవరి నుండి కొత్త వెబ్సైట్ TrumpRx.gov ద్వారా తగ్గిన ధరలు అందుబాటులో ఉంటాయని ఆయన అంటున్నారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఫ్రాన్స్‌లో రాజకీయ దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే మాక్రాన్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.Trump mocks Macron:Emmanuel said to me: “Donalddd, you have a deal. I would like to increase my prescription drug prices by 200% or whatever. Whatever you want, Donald, please don’t tell the population, I beg you.”Every country said the same thing. pic.twitter.com/hrAXWkKDD3— Clash Report (@clashreport) January 6, 2026అయితే ట్రంప్ ప్రకటనలో విరుద్ధత కనిపిస్తోంది. ఉదాహరణకు.. ఫ్రాన్స్‌లో ఔషధాల ధర $10 కనిష్ఠ ధర ఉండేది. అప్పుడు అమెరికా benchmark $10 అవుతుంది. ఫలితంగా, అమెరికా తన ధరను $100 నుండి $10కి తగ్గించుకుంటుంది. అదే ఫ్రాన్స్ ఆ తర్వాత $10 నుండి $30కి పెంచింది. జర్మనీలో ఔషధాల ధర $20గా ఉంది. అప్పుడు అమెరికా benchmark $20 అవుతుంది. ఫలితంగా, అమెరికా ధర $100 నుండి $20కి తగ్గుతుంది. అలాంటప్పుడు ఫ్రాన్స్‌పై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముందనేది? కొందరి ప్రశ్న. -
15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్!
సోషల్ మీడియాతో ప్రయోజనాలే కాదు.. అనర్థాలూ పొంచి ఉన్నాయి. ఆ ప్లాట్‌ఫారమ్‌లలో అసభ్యకరమైన కంటెంట్‌ను చూడటం, వేధింపులకు గురికావడంతో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశాన్ని పలు దేశాలు ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నాయి..నిన్న డిసెంబర్లో ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. అయితే.. ఇప్పుడు మరో దేశం ఇప్పుడు ఈ రూట్‌నే ఎంచుకుంది. 15 ఏళ్లలోపు వాడకుండా త్వరలో ఫ్రాన్స్ ఓ చట్టం చేయబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను(డ్రాఫ్ట్)ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.పిల్లలను డిజిటల్ స్క్రీన్ల దుష్ప్రభావాల నుండి రక్షించడమే ఈ చట్టం తీసుకురావడం వెనుక ఉద్దేశమని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ చెబుతున్నారు. ప్రతిపాదనల్లో.. 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించడం, అలాగే సెకండరీ స్కూల్స్‌లో మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడం ఉన్నాయని తెలిపారాయన. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే..పిల్లలను స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లకు దూరం చేయాలనే ఫ్రాన్స్ ప్రయత్నం కొత్తేం కాదు. 2018లో ప్రీ-స్కూల్, మిడిల్ స్కూల్లలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఆదేశాలు తీసుకొచ్చింది. అయితే ఆ సమయంలో అది కఠినంగా అమలు కాలేదు. అయితే 2023లో ఇదే రూల్‌కు ఓ చిక్కు వచ్చిపడింది. “డిజిటల్ లీగల్ ఏజ్” కింద ఫోన్ వాడాలంటే 15 ఏళ్లుగా ఈయూ రూల్ తెచ్చింది. దీంతో ఫ్రాన్స్‌లో ఆ ఆదేశాలను తేలికగా తీసుకున్నారు.అయితే.. పిల్లలకు డిజిటల్ రక్షణను ప్రాధాన్యంగా తీసుకుని ఫ్రాన్స్ ఈసారి మరో రూట్లో వస్తోంది. నేరుగా నిషేధం అని చెప్పకుండా.. సోషల్ మీడియా, మొబైల్ వినియోగంపై కఠిన నియంత్రణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. సెనేట్ ప్రతిపాదనలో 13 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు నేషనల్ అసెంబ్లీ ఆమోద ముద్ర పడాల్సి ఉంది.ఇంటర్నెట్లో యథేచ్ఛగా అశ్లీల చిత్రాలు లభిస్తున్నాయి. వీటిని ఎవరైనా చూసే వీలుంది. ఇవి చిన్నారుల జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాయనే వాదనతో ఏకీభవిస్తున్నాం. ఇలా ఎవరిపడితే వారు అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడకుండా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే అవసరం ప్రభుత్వాలపై ఉంది. అలాగే, ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం అంశాన్ని పరిశీలించాలి. అప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బాలల హక్కుల కమిషన్ దీనిపై అవగాహన కల్పించే బాధ్యతను తీసుకోవాలి..::మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తాజా వ్యాఖ్యలుఇప్పటిదాకా .. ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా నియంత్రిస్తున్నాయి. ఆస్ట్రేలియా పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఈ స్ఫూర్తితో.. యూరోపియన్ యూనియన్ అంశాన్ని పరిశీలిస్తోంది. మరి కొన్ని దేశాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి. సోషల్ మీడియా వాడకంపై వయస్సు పరిమితులు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ధోరణిగా మారుతోందన్నమాట. -
ఆ యువ సైక్లిస్ట్ గట్స్‌కి మాటల్లేవ్..! ఏకంగా 30 దేశాలు..
ఓ యువ సైక్లిస్ట్ ఖండాల మీదుగా అసాధారణ పర్యాటనకు పూనుకున్నాడు. ఏదో రికార్డు సృష్టించాలనో..తానెంటో ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనో కాదు. స్వలాభం ఆశించకుండా ఓ గొప్ప సందేశాన్ని అందించేలా సాహసోపేతమైన స్ఫూర్తిదాయక పర్యాటనను చేపట్టాడు ఆ యువకుడు. ఏకంగా 18 వేల కిలోమీటర్లు తొక్కి..తన టూర్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశాడు. తాను వయసులో చిన్న గానీ ఔదార్యంలో అందరికంటే మిన్నా అని చాటిచెప్పాడు. ఎవరా యువకుడు..ఏ లక్ష్యం కోసం ఇంత పెద్ద సాహసానికి పూనుకున్నాడంటే..ఫ్రాన్స్‌కు చెందిన 24 ఏళ్ల యువ సైక్లిస్ట్ కిలియన్ లే గయాడర్ తన స్వస్థలం నుంచి చైనాకు 18,000 కిలోమీటర్లు తొక్కుకుంటూ సైకిల్‌పై వెళ్లడం విశేషం. అతడు ఖండాలు మీదుగా చేపట్టి అసాధారణ టూర్‌ని చేపట్టి..ఏకంగా 30కి పైగా దేశాలు చుట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ టూర్‌ని వాయువ్య ఫ్రెంచ్ నగరం రెన్నెస్ నుంచి ప్రారంభించి..నెలల తరబడి నిరంతరం ప్రయాణిస్తూ..ఇటీవలే చైనాకు చేరుకున్నాడు. సింపుల్‌గా చెప్పాలంటే..లే గయాడర్ తన జీవితంలో మర్చిపోలేని గొప్ప సాహసోపేతమైన పర్యాటనను విజయవంతంగా పూర్తిచేశాడు. ఇది తన లైఫ్‌లోనే అత్యంత చిరస్మరణీయ విజయాలలో ఒకటిని సమర్థవంతంగా పూర్తిచేయగలిగానంటున్నాడు. ఎందుకోసం ఈ పర్యాటన అంటే..అనారోగ్యంతో పోరాడుతూ కూడా మన డ్రీమ్స్‌ని, లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు అని చెప్పేందుకే ఈ సాహసోపతమైన పర్యాటనకు పూనుకున్నట్లు తెలిపాడు. ఇక లె గయాడర్ 2023లో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. 14 ఏళ్ల ప్రాయంలో అడవిలో ఉండే బొరేలియా బాక్టీరియా కారణంగా లైమ్ వ్యాధి బారిన పడ్డాడు. దాన్నుంచి కోలుకునేందుకే నెలలు, సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత క్రమంగా శక్తిని పొంది, పూర్తిస్థాయిలో ఆరోగ్యంవంతుడయ్యేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యాధిపై ప్రజలందిరికీ అవగాహన కలిగేలా చేయాలని.. ఇలా సైకిల్ యాత్రకు సంకల్పించాడు. తనలా మరెవ్వరూ ఇంతలాబాధ పడకుండా, ముందు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించేందుకే ఈ సాహస యాత్ర అని చెప్పుకొచ్చాడు. ఫ్రాన్స్ నుంచి యూరప్ ఆసియా అంతటా దాదాపు 10 వేల కిలోమీటర్లు పైనే ఒంటిరిగా సైకిల్ తొక్కాడు. టర్కీ, జానీయాల వరకు తన స్నేహితుడు తోడు రాగా, అక్కడ నుంచి లె గయాడర్నే ఒంటరిగా చైనాకు చేరుకున్నాడు. అయితే చైనాకు చేరుకునే మార్గం చాలా కఠినమైన భూభాగం, చాలా సవాళ్లుతో కూడిన వాతావరణమని అంటున్నాడు. ఏకంగా ఎనిమిది నెలలు..ఈ యాత్ర కోసం నిధులు సేకరించడానికి సుమారు ఎనిమిద నెలల పనిచేశాడు. అయితే ఈ మొత్తం పర్యాటకు అతడికి సుమారు రూ.15 లక్షలు పైనే ఖర్చయ్యింది. ఈ టూర్‌కి ఫ్రెంచ్ బ్యాంకు, స్థానిక కౌన్సిల్, సంస్థల నుంచి ఆర్థిక సహాయం సైతం అందింది లె గయాడర్కు. నిజానికి తన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్గాలలో తాను ప్రయాణిచడం అత్యంత క్లిష్టమైన సవాలు, పైగా ప్రత్యేక అనుభవ కూడా అని అంటున్నాడు ఆ యువ సైక్లిస్ట్.లైమ్ వ్యాధి (Lyme disease) అంటే:ఇది బోర్రెలియా (Borrelia) అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. అడవుల్లో, గడ్డిపొదల గుండా వెళ్లినప్పుడూ ఈ వ్యాధి బారిన పడతారట. దీని కారనంగా ఎర్రటి వలయాకారపు దద్దుర్లు , జ్వరం, తలనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు వస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే గుండె, నాడీ వ్యవస్థ, కీళ్లపై ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుందట. (చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
గుండె చప్పుడు వినే స్టెతస్కోప్.. ఎలా పుట్టింది?
పిల్లలూ! మీరు హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు డాక్టర్లను చూసే ఉంటారు కదా! తెల్లకోటులో ఉండే డాక్టర్ల మెడలో స్టెతస్కోప్ వేలాడుతూ ఉంటుంది. వైద్యులు దాన్ని మీ గుండెపై పెట్టి, మీ గుండె చప్పుడు వింటారు. ఆ తర్వాత మీ సమస్య తెలుసుకొని మందులు రాసిస్తారు. చూసేందుకు ఆ స్టెతస్కోప్ చాలా ముచ్చటగా ఉంటుంది. అసలది ఎప్పుడు పుట్టిందో, దాని వల్ల ప్రయోజనాలేమిటో తెలుసా?స్టెతస్కోప్‌ని మొట్టమొదటిసారిగా 1816లో కనుక్కున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన రెన్ లానెక్ అనే వైద్యుడు దీనికి రూపకల్పన చేశారు. ఆయనకు దీన్ని తయారు చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో తెలుసా? స్టెతస్కోప్ లేని కాలంలో రోగుల గుండె పరిస్థితిని తెలుసుకునేందుకు వైద్యులు తమ చెవిని వారి గుండె మీద పెట్టేవారు. ఎన్నో ఏళ్లు ఇదే పద్ధతి కొనసాగింది. అయితే కొందరు పేషంట్లకు ఇది ఇబ్బందికరంగా, మొహమాటంగా ఉండేది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని ఆలోచించిన డాక్టర్ లానెక్ తొలి స్టెతస్కోప్‌ని తయారు చేశారు. ఇదీ చదవండి: పాతికేళ్లకే యంగెస్ట్ బిలియనీర్.. అమన్ అంటే అమేయ ప్రతిభఅయితే ప్రస్తుతం మనం చూసే స్టెతస్కోప్లకూ ఆయన తయారు చేసిన దానికీ చాలా తేడా ఉంది. మొదట్లో ఒక ట్యూబ్ సాయంతో దీన్ని తయారు చేశారు. అనంతరం కొంతకాలానికి అందులో మరిన్ని మార్పులు చేసి ప్రస్తుతం మనం చూసే స్టెతస్కోప్‌ని రూపొందించారు. ప్రస్తుతం ఉన్న స్టెతస్కోప్‌లు గుండె చప్పుడు స్పష్టంగా వినేందుకు తోడ్పడుతున్నాయి. దీనివల్ల రోగుల ఆరోగ్య స్థితి తెలుసుకోవడం వైద్యులకు సులువవుతుంది. ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు -
Louvre heist: ఎట్టకేలకు దొరికిన మ్యూజియం దొంగలు!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లూవ్ర్(లౌవ్ర్) మ్యూజియం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పారిస్ పోలీసులు ధృవీకరించారు. అయితే వీళ్లు పింక్ పాంథర్ ముఠా సభ్యులేనా? అనేది మాత్రం ఇంకా ధృవీకరణ కాలేదు. ప్రస్తుతం వీరిని రహస్య ప్రాంతంలో అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. అక్టోబరు 19న పారిస్‌లోని లూవ్ర్ మ్యూజియంలో జరిగిన చోరీ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది(louvre museum Heist). మ్యూజియంలో ఓ వైపు నిర్మాణం జరుగుతుండగా.. కన్స్ట్రక్షన్ కార్మికుల వేషాలు దుండగులు ఓ భారీ క్రేన్ ద్వారా వెనకభాగం నుంచి లోపలికి చొరబడ్డారు. ఉదయం 10గం. ప్రాంతంలో సరుకు రవాణా ఎలివేటర్(Basket Lift) ద్వారా అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. నెపోలియన్ చక్రవర్తి కాలంనాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులోని తొమ్మిది వస్తువులను దొంగలించి బయటపడ్డారు. ఇదంతా కేవలం ఏడు నిమిషాల్లోనే జరిగిపోవడం గమనార్హం.ఆ ఆభరణాల విలువ 88 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.895 కోట్లు) ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు దాదాపు 100 మందితో కూడిన అంతర్జాతీయ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ప్రస్తుతం అదుపులోకి తీసుకుంది అనుమానితులా? లేదంటే దొంగలేనా? అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. అలాగే నగల రికవరీ ఇంకా జరగలేదని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ చోరీకి సంబంధించి మరో ఇద్దరు, ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని, వాళ్లే ఈ చోరీకి ప్రధాన సూత్రధారులని తెలుస్తోంది. New footage shows thieves using chainsaws to execute robbery at The Louvre in Paris. A manhunt is now underway. pic.twitter.com/0w0Uu6MJyn— Pop Crave (@PopCrave) October 20, 2025పింక్ పాంథర్ ముఠా గురించి.. లూవ్ర్ మ్యూజియం చోరీ వెనుక పింక్ పాంథర్ ముఠా హస్తం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకు కారణం.. చోరీ జరిగిన విధానమే!. 2001లో సెర్బియా బెల్గ్రేడ్ కేంద్రంగా డ్రాగన్ మైకిక్ అనే వ్యక్తి ఈ ముఠాను ప్రారంభించారు. ఆభరణా దొంగతనాలకు ఈ ముఠా పెట్టింది పేరు. స్మోక్ బాంబులు, గేట్‌వే కార్లు ఉపయోగిస్తూ సినీ ఫక్కీలో చోరీలు చేయడం ఈ ముఠా స్టైల్. అందుకే 1963లో వచ్చిన ది పింక్ పాంథర్ అనే సినిమా ఆధారంగా ఇంటర్‌పోల్ ఈ గ్యాంగ్‌కు ఆ పేరు పెట్టింది. ప్రస్తుతం ఈ గ్యాంగ్‌లో సుమారు 800 మంది సభ్యులు ఉన్నారని, యుగోస్లావియా యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయని చెబుతుంటారు. యూరప్, ఆసియా, మిడిల్ ఈస్ట్‌లో ఇప్పటిదాకా 370కి పైగా దొంగతనాలు చేయగా.. చోరీ చేసిన వాటి విలువ 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4200 కోట్లు) ఉండొచ్చని అంచనా. దుబాయ్ మాల్లో 2007లో పట్టపగలే చేసిన భారీ చోరీ, 2004లో టోక్యోలో కాస్ట్లీ డైమండ్ దొంగతనంతో పాటు లండన్, జెనీవా మ్యూజియాల్లో విలువైన చోరీలు చేసింది ఈ పింక్ పాంథర్ గ్యాంగ్. అయితే.. ఈ ముఠా చేసిన చోరీల్లో వస్తువులు రికవరీ కావడం చాలా తక్కువ. ఆభరణాలను ముక్కలు చేసి అమ్మేస్తుండడంతో చాలా కేసులు సాల్వ్కాకుండా ఉండిపోయాయి.ఇదీ చదవండి: చరిత్రలో కాస్ట్లీ దొంగతనం ఏదో తెలుసా? -
చోరీకి గురైన వజ్రాభరణాల విలువ రూ.900 కోట్లు !
పారిస్: కేవలం 250 సెకన్లలోపే ఫ్రాన్స్ రా జ వజ్రాభరణాలను దొంగలు కాజేసిన ఉదంతంలో ఆయా ఆభరణాల మార్కెట్ విలువను ఫ్రాన్స్ అధికారులు మొదటి సారిగా వెల్లడించారు. అక్టోబర్ 19వ తేదీ న పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లౌరీ మ్యూజియంలో నెపోలియన్ రాజుల కా లంనాటి అపురూపమైన వజ్రాభరణాలు చోరీకి గురైన విషయం తెల్సిందే. దీనిపై 100 మంది పోలీసు, ఇంటెలిజెన్స్ అధి కారులు సమగ్రస్థాయిలో కేసు దర్యాప్తు మొదలెట్టిన విషయం తెల్సిందే. చోరీ తర్వాత కనిపించకుండా పోయిన వజ్రా భరణాల వివరాలను పారిస్ ప్రాసిక్యూ టర్ లారే బెకావూ వెల్లడించారు. ‘‘పచ్చ లు, వజ్రాలు పొదిగిన హారం, చెవిదిద్దు లు, 1,354 వజ్రాలు, 56 మరకతమణు లు, పుష్యరాగం పొదిగిన రెండు స్వర్ణ కిరీటాలు, కురులను ఒక దగ్గరకు చేర్చే రెండు పెద్ద పిన్నులు, నీలమణులు, ము త్యాలు, 2,000 వజ్రాలు పొదిగిన నెక్లెస్, మరో పెద్ద ఆభరణాన్ని దొంగలు పట్టుకు పోయారు. ఈ ఆభరణాల్లోని నీలమణు లు, వజ్రాలు, బంగారం విడి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాదాపు రూ.900 కోట్లు ఉండొచ్చు. ఫ్రాన్స్ ప్రాచీన ఘన వారసత్వం, రాజరిక హోదా, అరు దైన డిజైన్ వంటివి సైతం లెక్కిస్తే వీటి విలువను ఊహించలేం’’ అని అధికారి బెకావూ వ్యాఖ్యానించారు. చోరీ జరిగిన తర్వాత ఎట్టకేలకు బుధవారం మ్యూజి యంను సందర్శకుల కోసం తెరచారు. అయితే చోరీకి గురైన అపోలో గ్యాలరీలోకి మాత్రం ఎవరినీ అనుమతించట్లేరు. అయి తే చోరీకి గురైన ఆభరణాల ఆచూకీ కను గొనడం అసాధ్యమని నిపుణులు అంచనావేస్తున్నారు. ‘‘ఇలాంటి చోరీలు చేసే చోరశిఖామణులు అత్యంత తెలివిగా వ్యవ హరిస్తారు. చోర తర్వాత నకిలీ పాస్‌పోర్ట్ తో దేశం దాటేస్తారు. చోరీ చేసిన నగలను ముక్కలు చేసి వాటిలోని బంగారం, వజ్రా లు, విలువైన రత్నాలను విడివిడిగా వేర్వే రు వ్యక్తులకు అమ్మేస్తారు. దీంతో అసలు నగ కోసం వెతికే దర్యాప్తు అధికారులకు అవి ఎప్పటికీ దొరకవు’’ అని చోరీ కేసుల ఇన్వెస్టిగేటర్, లాయర్ అయిన క్రిస్టఫర్ ఏ మ్యారినెల్లో అభిప్రాయపడ్డారు. -
France: మాజీ అధ్యక్షుడి జైలు జీవితం ప్రారంభం
పారిస్: అక్రమంగా భారీగా నిధులు స్వీకరించారనే ఆరోపణలకు సంబంధించి గత నెలలో జైలు శిక్ష ఖరారైన ఫ్రాన్స్ మాజీ అద్యక్షుడు నికోలస్ సర్కోజీ జైలు జీవితం ప్రారంభమైంది. 2007 ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల సమయంలో లిబియాకు చెందిన గడాఫీ నేతృత్వంలోని ప్రభుత్వ నుండి సర్కోజీ అక్రమంగా భారీగా నిధులు స్వీకరించారనే ఆరోపణల దరిమిలా నమోదైన ఈ కేసులోని కొన్ని అభియోగాలనను కొట్టివేయగా, ఒకదానిలో నికొలస్ సర్కోజీని దోషిగా నిర్థారించిన న్యాయస్థానం ఆయనకు శిక్షను ఖరారు చేసింది.సర్కోజీకి జైలు శిక్షను తప్పనిసరిగా అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ సమయంలో జైలు శిక్ష తేదీ ఖరారు చేయని కోర్టు.. అటు తర్వాత ఆ తేదీని కూడా స్పష్టం చేయడంతో సర్కోజీకి తాజాగా జైలు జీవితం అనుభవించడానికి వెళ్లారు. పారిస్‌లోని లా సాంటే జైలులో సర్కోజీని ఉంచారు.నికొలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షునిగా పనిచేశారు. అయితే అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో గడాఫీ నేతృత్వంలోని లిబియా ప్రభుత్వం నుండి వచ్చిన ఆర్థిక సాయంపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిధులను దౌత్య సహాయంగా చెప్పకుండా స్వీకరించారని, అవి తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించినట్లు పలువురు ఆరోపించారు. అవినీతి, ప్రచారానికి అక్రమ నిధుల వినియోగం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం తదితర ఆరోపణలు రుజువు కానప్పటికీ.. నేరపూరిత కుట్రలో సర్కోజీని న్యాయస్థానం దోషిగా ప్రకటించి, ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.ఇదీ చదవండి:చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే -
మోనాలిసాతో మొదలై.. ప్రపంచంలోనే భారీ చోరీ ఏదో తెలుసా?
మిస్టరీతో కూడిన చిరునవ్వు మోనాలిసా.. లియోనార్డో డా విన్సీ చిత్రించిన 16వ శతాబ్దం నాటి అపురూపమైన పెయింటింగ్. అలాంటి దానిని వందల మంది కాపాలా కాసే చోటు నుంచి దానిని దొంగలించడం సాధ్యమేనా?.. తాజాగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన లూవ్ర్ మ్యూజియంలో జరిగిన చోరీని చూస్తే.. ‘అదేం పెద్ద విషయం కాకపోవచ్చు’ అనే సందేశాన్ని ఇస్తోంది.లూవ్ర్ మ్యూజియం.. 12వ శతాబ్దంలో ఇదొక కోట. తర్వాతి కాలంలో.. ఫ్రాన్స్ రాజులు దీనిని రాజభవనంగా మార్చేశారు. అయితే.. లూయీ XIV తన రాజభవనాన్ని వెర్సైల్లెస్కు మార్చారు. అప్పటి నుంచి కళాత్మక ప్రదర్శనలు ఉంచే చోటుగా మారిపోయింది. 1793లో ఫ్రెంచ్ విప్లవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. Musée du Louvre అనే పేరుతో 18వ శతాబ్దం నుంచి దీనికి అధికారిక మ్యూజియం గుర్తింపు దక్కింది. ప్రస్తుతం Louvre museum ప్రపంచంలోనే అతిపెద్ద, సుప్రసిద్ధ కళా మ్యూజియం. మెసపటోమియా, ఈజిప్టు.. అనేక నాగరికతలకు చెందిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. గ్రీకు, రోమన్, ఫ్రెంచ్ రాజ్యాలకు చెందిన ప్రతీకలు ఇక్కడ కొలువు దీరాయి. మోనాలిసా, వీనస్ డి మిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్ వంటి కళాఖండాలు లూవ్ర్కు ప్రత్యేక ఆకర్షణ. గాజు పిరమిడ్ షేపులో ఉండే మ్యూజియం ఎంట్రెన్స్ అదనపు ఆకర్షణ. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఏఐ పై డిజైన్ చేసిన ఈ ద్వారం 1989లో నిర్మించబడింది. పారిస్ నగరానికి ఆధునికతను చేర్చే చిహ్నంగా.. పిరమిడ్ 21.6 మీటర్ల ఎత్తు, 673 గాజు పలకలతో రూపొందించారు. అరోజుకు సగటున 30,000 మంది సందర్శకులు.. ఏటా దాదాపు కోటి మంది దీనిని సందర్శిస్తుంటారు. అందుకే భద్రతా కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ.. 2025 అక్టోబర్ 19న లూవ్ర్ మ్యూజియంలో భారీ దోపిడీ జరిగింది. ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ విభాగం అపోలో గ్యాలరీలో నెపోలియన్ చక్రవర్తి కాలంనాటి విలువైన ఆభరణాలను నలుగురు దుండగులు దొంగలించారు. మోటార్ స్కూటర్లపై వచ్చిన దొంగలు.. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మ్యూజియం లోపలికి వెనకభాగం నుంచి చొరబడి(సీన్ నది వైపు).. సరుకు రవాణా ఎలివేటర్ ద్వారా గ్యాలరీలోకి ప్రవేశించారు. కట్టర్లు ఉపయోగించి రెండు డిస్ప్లే కేసులను ధ్వంసం చేశారు. అద్దాలను పగలగొట్టి తొమ్మిది విలువైన వస్తువులను అపహరించారు. కేవలం నాలుగు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ హైప్రొఫైల్ చోరీ జరిగింది. 🇫🇷 - BFMTV shares the first video of the criminal who is in the process of stealing the Napolean Era jewels in the Louvre museum. https://t.co/u0aXSP6yUv pic.twitter.com/DEuYEq39R7— EuroWatcher - News for you (@EuroWatcherEUW) October 20, 2025ఫ్రాన్స్ కల్చర్ మినిస్టర్ రాచిడా దాతి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. చోరీకి గురైన 9 వస్తువుల్లో నెపోలియన్ చక్రవర్తికి చెందిన తలపాగా.. ముత్యాల హారంతో పాటు ఫ్రాన్స్ చివరి మహారాణి యూజెనీ(నెపోలియన్-3 సతీమణి) ముత్యాల హారం కూడా ఉందని ప్రకటించారామె. అయితే.. తొమ్మిది నగల్లో.. ఒకటి అక్కడే పడిపోయిందని, దానిని తిరిగి భద్రపరిచినట్లు చెప్పారు. వీటి విలువ వెలకట్టలేనిదని తెలుస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. చోరీ నేపథ్యంలో మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అలాగని వరల్డ్ ఫేమస్ అయిన లూవ్ర్ చరిత్రలో ఇదే మొదటి దోపిడేం కాదు. 1911లో సుప్రిసిద్ధ మోనా లిసా చిత్రాన్ని మ్యూజియంలో పని చేసిన విన్సెంజో పెరుగ్గియా అనే ఇటాలియన్ కార్మికుడు దొంగలించాడు. అతని అరెస్ట్‌తో రెండు సంవత్సరాల తర్వాత అది తిరిగి లభించింది. 1976లో గుస్తావ్ కుర్బెట్ ‘ది వేవ్’ చోరీకి గురైనా.. ఇప్పటికీ దొరకలేదు. 1983లో రెండు పురాతన కవచాలను దొంగలించగా.. 40 ఏళ్ల తర్వాత తర్వాత అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చివరగా.. 1998లో Le Chemin de Sèvres అనే పెయింటింగ్ చోరికి గురై ఆ ఆచూకీ ఇప్పటిదాకా లభ్యం కాలేదు. లె చెమిన్ చోరీ తర్వాత లూవ్ర్ మ్యూజియంలో భద్రతను భారీగా పెంచారు. అయినా కూడా ఇలా జరగడం తీవ్ర చర్చనీయాంగా మారింది. అక్కడ చోరీ జరిగితే అది అసలు దొరకదని, దొరికినా అసంపూర్తిగా ఉంటుందనే మచ్చ ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో తాజా చోరీ కేసులో అయినా పురోగతి ఉంటుందేమో చూడాలి.ప్రపంచంలోనే అత్యంత విలువైన చోరీ ఏదో తెలుసా?.. అమెరికా బోస్టన్ ఇసబెల్లా స్టువర్ట్ గార్డ్నర్ మ్యూజియంలో (Isabella Stewart Gardner Museum Heist) జరిగిన చోరీ.. చరిత్రలోనే అత్యంత విలువైన కళా దొంగతనంగా గుర్తించబడింది. అప్పటి అంచనా ప్రకారం చోరీకి గురైన కళాకృతుల విలువ రూ.500 మిలియన్ డాలర్లు. ఆనాడు ఏం జరిగిందంటే.. 1990 మార్చి 18వ తేదీన ఇద్దరు వ్యక్తులు పోలీసుల వేషంలో మ్యూజియంకు వచ్చారు. డిస్టర్బెన్స్ కాల్ ఉందని చెబుతూ లోపలికి వెళ్లి.. భద్రతా సిబ్బందిని గంటపాటు బంధించి తమ పని కానిచ్చారు. మొత్తం 13 కళా వస్తువులను దొంగిలించగా.. అందులో రెంబ్రాంట్, వెర్మీర్, డెగా.. లాంటి పాపులర్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్ రంగంలోకి దిగినా.. దొంగల ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. ఈ కేసుకు సంబంధించి 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ మ్యూజియంలో అవి దొరకకపోతాయా? అనే ఆశతో ఖాళీ ఫ్రేమ్‌లను వేలాడదీయడం చూడొచ్చు. అలాగే.. అంట్వెర్ప్ డైమండ్ హైస్ట్ (2003, బెల్జియం)లో.. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాలు, బంగారం దొంగిలించారు. అందుకే దీనిని ఈ శతాబ్దపు భారీ చోరీ "Heist of the Century" అని పిలుస్తారు. హ్యారీ విన్స్టన్ జువెల్ రాబరీ (2008, పారిస్).. 108 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఈ చోరీలో దొంగలు మహిళల వేషంలో వచ్చారు. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ హైస్ట్ (2003).. సద్దాం హుస్సేన్ పాలనలో 1 బిలియన్ డాలర్ల నగదు కొట్టేసినట్లు ఒక అంచనా. ఇలా.. లూవ్ర్ చోరీ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన దొంగతనాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.ఇదీ చదవండి: స్కాండల్స్‌తో రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ -
ఫ్రాన్స్‌లో భారీ చోరీ
పారిస్: ఫ్రెంచ్ ్రౖఫైస్ దుంపల వేపుడును తినాలన్నా ఏడెనిమిది నిమిషాలు పడుతుంది. అంతకంటే తక్కువగా అంటే కేవలం నాలుగు నిమిషాల్లోనే చోరశిఖామణులు వెలకట్టలేని చారిత్రక వజ్రాభరణాలను దొంగలించిన ఉదంతం ఫ్రాన్స్‌లో జరిగింది. పారిస్ నగరంలో ప్రపంచ ప్రఖ్యాత లౌరీ మ్యూజియంలో ఆదివారం ఉదయం భారీ చోరీ చోటుచేసుకుంది. నెపోలియన్ చక్రవర్తి, రాణి సేకరించిన అరుదైన, పురాతన వజ్రాభరణాలను దొంగలు అలవోకగా కాజేసి ఎంచక్కా బైక్‌లపై ఉడాయించిన ఉదంతం ఇప్పుడు ఫ్రాన్స్‌సహా యూరప్ దేశాల్లో చర్చనీయాంశమైంది. విశ్వవిఖ్యాత లియోనార్డో డావిన్సీ ‘మోనాలిసా’ చిత్రరాజం సైతం ఇదే మ్యూజియంలో కొలువై రోజూ వేలాది మంది ప్రపంచపర్యాటకులను ఆకర్షిస్తున్న విషయం తెల్సిందే. వందేళ్ల క్రితం ఇదే మ్యూజియంలో ఇదే మోనాలిసా పెయింటింగ్ సైతం చోరీకి గురై రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు దొరికింది. ఇప్పుడు ఆదివారం చోరీకి గురైన అత్యంత విలువైన వజ్రాభరణాలు ఎప్పుడు దొరుకుతాయో, అసలు దొరుకుతాయో లేదోనన్న చర్చ ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఎక్కువైంది. మ్యూజియం తలపులు తెరచిన అరగంట తర్వాత ఈ చోరీ జరగడం గమనార్హం. అపోలో గ్యాలరీలోకి ఇంకా ఎవరూ రాకముందే ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.బాస్కెట్ లిఫ్ట్‌తో వచ్చి, కట్టర్‌తో కత్తిరించి..దొంగలు పక్కా ప్రణాళికతో వచ్చి దొంగతనం చేసినట్లు స్పష్టమవుతోంది. ఎక్కడా ఎలాంటి అనుమానం రాకుండా చడీచప్పుడులేకుండా తమ పని కానిచ్చేశారు. ఫ్రెంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు లేదా నలుగురు ముసుగు ధరించిన వ్యక్తులు ఈ చోరీ చేశారు. మ్యూజియంకు కుడివైపున ‘సీన్’ నది ప్రవహిస్తోంది. అటువైపు మ్యూజియం గోడ వద్ద మరమ్మతులు జరుగుతున్నాయి. అదే ప్రాంతాన్ని దొంగలు తమకు అనువుగా మలచుకున్నారు. వీధుల్లో ఎత్తయిన వీధిలైట్లను మార్చేందుకు వాడే ‘బాస్కెట్’ హైడ్రాలిక్ లిఫ్ట్ సాయంతో పైకి వచ్చి ఉదయం 9.30 గంటలప్పుడు మ్యూజియం భారీ కిటికీ వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న పదునైన రంపపు కోత మెషీన్లతో దానిని పరపరా కోసేశారు. తర్వాత నేరుగా డెనన్ వింగ్ విభాగం హాల్లో ఉన్న అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. ఈ గ్యాలరీలో సాధారణంగా ఫ్రాన్స్ చక్రవర్తుల సంబంధిత 23 కిరీటాలు, ఆభరణాలను ప్రదర్శనకు ఉంచుతారు. అందులోనే నెపోలియన్–3 రాజు, రాణిలకు సంబంధించిన వజ్రా భరణాలు ఉన్నాయి. ప్రదర్శన పేటికలను బద్దలు కొట్టి వీటిల్లో తొమ్మిదింటిని దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే వాటిల్లో రాణి యుజెనీకి చెందిన ఒక కిరీటంలోంచి విరిగిపడిన కొన్ని ముక్కలు మాత్రం మ్యూజియం ఆవరణలో కనిపించాయి. వీటిని పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. మ్యూజియం వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం ఈ స్వర్ణకిరీటంలో 1,354 చిన్న వజ్రాలు, 56 మరకతమణులు పొదిగి ఉన్నాయి.ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంవిస్తీర్ణంపరంగా లౌరీ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్దది. 73,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంటే ఏకంగా 10 ఫుట్‌బాల్ స్టేడియాల విస్తీర్ణంలో ఈ మ్యూజియం ఉంటుంది. ఏకంగా 35,000 పురాతన వస్తువులను ఇందులో ప్రదర్శిస్తారు. ప్రపంచంలో అత్యంత సందర్శకుల రద్దీ ఉన్న మ్యూజియం కూడా ఇదే.ఇంటిదొంగల పనా?మ్యూజియంలోని ఉద్యోగుల పాత్ర ఏదైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. దొంగలు ఉపయోగించిన బాస్కెట్ లిఫ్ట్‌ను పారిస్‌లో సర్వసాధారణంగా వాడతారు. అపార్ట్మెంట్లలో మూడు, నాలుగు అంతస్తుల ఫ్లాట్లలోకి ఫర్నీచర్‌ను తరలించేందుకు దీనినే వాడతారు. ఈ హైడ్రాలిక్ నిచ్చెనను చెర్రీ పికర్ అని కూడా పిలుస్తారు. ఇది అక్కడ ఉండటంతో అటుగా వెళ్లేవాళ్లకు ఎలాంటి అనుమానం రాలే దని తెలుస్తోంది. అపోలో గ్యాలరీలో అత్యంత విలువైన రీజెంట్, సాన్సీ, హోర్టెన్సియా వజ్రాలను సైతం ప్రదర్శనకు ఉంచారు. ఇవి చోరీకి గురయ్యాయో లేదో తెలియరాలేదు. ఇది మాత్రమేకాదు ప్రాన్స్‌లో మ్యూజియంలలో చోరీలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో పురాతన వస్తువులకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో వాటి కోసం దొంగలు మ్యూజియంలపై పడుతున్నారు. ఇదీ చదవండి:హమాస్ మరో డేంజర్ ప్లాన్.. అమెరికా సీరియస్ వార్నింగ్ -
స్పెయిన్ టు ఫ్రాన్స్
స్పెయిన్‌లో వెంట వెంటనే లొకేషన్స్ షిఫ్ట్ అవుతున్నారు హీరో రవితేజ. ఆయన కెరీర్‌లోని 76వ సినిమా చిత్రీకరణ ఇటీవల స్పెయిన్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్పెయిన్‌లోని వాలెన్షియా, సమీప దీవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా మరో షూటింగ్ షెడ్యూల్ శుక్రవారం ప్రారంభమైనట్లు యూనిట్ పేర్కొంది. జెనీవా, ఫ్రాన్స్ లొకేషన్స్‌లో కూడా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశామని మేకర్స్ తెలిపారు.మొత్తం ఈ 25 రోజుల ఫారిన్ షెడ్యూల్లో కీలకమైన టాకీపార్టుతోపాటు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రెండుపాటలను కూడా చిత్రీకరించనున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. -
దిక్కుతోచని ఫ్రాన్స్
తీరి కూర్చుని సమస్యలు తెచ్చుకోవటంలో, ఉన్నవాటిని పెంచుకోవటంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌కు ఎవరూ సాటిరారు. స్వీయ సమర్థతపై అతిగా అంచనా వేసుకుని ఆయన తీసుకుంటున్న వరస నిర్ణయాలు ఫ్రాన్స్‌ను నిలువునా ముంచేశాయి. పీఠమెక్కి నిండా నెల రోజులు కాకుండానే ప్రధాని సెబాస్టిన్ లెకొర్నూ సోమవారం నిష్క్రమించటం వాటి పర్యవసానమే. లెకొర్నూ కేబినెట్ ఏర్పాటు ప్రయత్నంలో మెక్రాన్ తలదూర్చి, తన అనుకూలురకు పదవులు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కూటమిలోని ఇతర పక్షాలకు దీంతో ఆగ్రహం కలిగి బడ్జెట్‌కు మద్దతునీయబోమనీ, అవిశ్వాస తీర్మానం తెస్తామనీ చెప్పటంతో లెకొర్నూ రాజీనామా తప్పలేదు. మరో రెండు నెలల్లో బడ్జెట్ ఆమోదించకపోతే దేశం దివాలా స్థితిలో పడుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండగా, తదుపరి ఏం చేయాలన్నది మెక్రాన్‌కు సైతం బోధపడటం లేదు. కరోనా మహమ్మారి కాటేయకముందు యూరప్‌లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్సే. ఆ తర్వాత పల్టీలు కొట్టడం ప్రారంభమైంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దాన్ని మరింత దెబ్బతీసింది. జర్మనీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ ఏదోమేరకు సఫలీకృతమవుతుంటే, ఫ్రాన్స్ మాత్రం గుడ్లు తేలేస్తోంది. అక్కడ పాలన అసాధ్యమైన స్థితికి చేరుకుంది. సామాజిక అశాంతి పెరగటం, నిజ వేతనాలు పడిపోయి ఉద్యోగ వర్గాల ఆగ్రహావేశాలూ, ఉపాధి కొరవడి యువత నిరాశ, ఆకాశాన్నంటుతున్న ధరలూ, అంతంతమాత్రంగా ఉన్న మార్కెట్లూ ఫ్రాన్స్‌ను కుంగదీస్తుండగా పులి మీద పుట్రలా ఈ రాజకీయ సంక్షోభం ముంచుకొచ్చింది. ఫ్రాన్స్ చరిత్రలో ఇలాంటి పరిస్థితి రాలేదని కాదు. 1946–58 మధ్య ఆ దేశం 22 ప్రభుత్వాలను చూసింది. ఎవరికీ మెజారిటీ రాని దశలో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోవటమే అందుకు కారణం. పర్యవసానంగా అప్పటి అధ్యక్షుడు చార్లెస్ డీగాల్ భవిష్యత్తులో ఇంకెప్పుడూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడకుండా నిరోధించేందుకు రాజ్యాంగాన్ని సవరించారు. అటుతర్వాత కూటమికి నాయకత్వం వహించే ప్రధాన పార్టీ మాటేచెల్లుబాటు కావటం రివాజైంది. ఇప్పుడు ఆయన్ను అనుకరించబోయి మెక్రాన్ బోర్లాపడుతున్నారు. ఫ్రాన్స్ కష్టాలకు కేవలం మెక్రాన్ ఒక్కరే కారణం కాదు. కానీ వాటిని మరిన్ని రెట్లు పెంచటంలో ఆయన పాత్ర కాదనలేనిది. 577 మంది సభ్యులుండే దిగువ సభ అసెంబ్లీ నేషనల్లో పాలక పక్షంగా అవతరించాలంటే కనీసం 289 మంది మద్దతు అవసరం. నిరుడు జూలైలో జరిగిన ఎన్నికల్లో వామపక్షాల సారథ్యంలోని న్యూ పాపులర్ ఫ్రంట్ 182 స్థానాలతో అగ్రభాగంలో ఉంది. మెక్రాన్ నాయకత్వంలోని మధ్యేవాద కూటమి ఎన్సెంబుల్కు 168 లభించాయి. వలసలను వ్యతిరేకించే తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ(ఆర్ఎన్) 143తో సరిపెట్టుకుంది. తొలి దశలో అందరికన్నా అత్యధిక శాతం ఓట్లు రాబట్టిన ఆర్ఎన్ను అధికారంలోకి రానీయకుండా రెండో దశలో వామపక్ష, మధ్యేవాద పార్టీలు అనుసరించిన సర్దుబాటు వ్యూహం ఫలించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటులో మెక్రాన్ దీన్ని విస్మరించారు. తన విధానాలను వ్యతిరేకించే వామపక్షాలకు అధికారం అప్పగించరాదన్న కృతనిశ్చయంతో మధ్యేవాద పక్షాలతో ప్రయోగాలు మొదలుపెట్టారు. పర్యవసానంగా ఏడాదిలో ముగ్గురు ప్రధానులు వచ్చారు. పార్లమెంటు రద్దు చేయొద్దని అందరూ ఇచ్చిన సలహాను నిరుడు మెక్రాన్ బేఖాతరు చేశారు. ఎన్నికల తర్వాత మధ్యేవాద పక్షాలు పుంజుకుంటాయనీ, అప్పుడు తాననుకున్న రీతిలో పెన్షన్ల కోత, సంపన్నులకు రాయితీలు, ప్రభుత్వ వ్యయం అదుపు వగైరాలు అమలు చేయొచ్చనీ ఆయన భావించారు. కానీ అదంతా అడియాస అయింది. ఇప్పుడు నిజంగానే పార్లమెంటు రద్దు చేయక తప్పని స్థితి ఏర్పడింది. కానీ అలా చేస్తే ఆర్ఎన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి పుంజుకోవచ్చనీ, దాని ప్రభావం 2027లో జరిగే అధ్యక్ష ఎన్నికలపై పడుతుందనీ మెక్రాన్ ఆందోళన. తక్షణ కర్తవ్యమైన బడ్జెట్ ఆమోదానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఆయనకు స్పష్టత కొరవడింది. ఏతావతా ఫ్రాన్స్ కింకర్తవ్య విచికిత్సలో పడింది. -
ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ రాజీనామా
పారిస్: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం మొదలైంది. నెల రోజుల క్రితమే ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సెబాస్టియన్ లెకోర్ను సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన గత నెల 9న ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చారు. నెల లోపలే పదవి నుంచి తప్పుకోవాల్సి వచి్చంది. సెబాస్టియన్ ఆదివారం తన మంత్రివర్గాన్ని నియమించారు. దీనిపై రాజకీయంగా పలు విమర్శలు వచ్చాయి. దాంతో చేసేది లేక సెబాస్టియన్ రాజీనామా సమర్పించారు. దీన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఆమోదించారు. మాక్రాన్ ఇప్పుడేంద చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త ప్రధానమంత్రిని నియమిస్తారా? లేక జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఫ్రాన్స్‌లో గత రెండేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు రాజీనామా చేయడం గమనార్హం. -
ఫ్రాన్స్‌లో ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ ఉద్యమం..200 మందికి పైగా అరెస్టు
పారిస్: ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ పేరుతో ఆందోళన చేస్తున్న నిరసన కారుల్ని ఫ్రాన్స్ నూతన ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను అరెస్టు చేయిస్తున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున బలగాల్ని మోహరించారు. పలు వ్యవస్థల్ని స్తంభించేందుకు ప్రయత్నిస్తున్న వందలమందిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ అరెస్టులను మరింత ముమ్మరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్రాన్స్‌లో సైతం నేపాల్ తరహా రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరౌ ఆ దేశ పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో దేశ ప్రజల కోసం వివిధ పథకాల్లో కేటాయించే బడ్జెట్లో 43.8 బిలియన్ డాలర్లు కోత విధించారు. దీంతో పాటు రెండు రోజుల నేషనల్ హాలిడేస్‌ను రద్దుచేయడం, పెన్షన్లలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని ఫ్రాంకోయి బేరౌ తీసుకున్న నిర్ణయం ఫ్రాన్స్ దేశప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగిల్చింది. ఆ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఆగస్టు నెలలో సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్లు నిర్వహించారు. ఆ తర్వాత చాపకింద నీరులా సెప్టెంబర్ నెలనుంచి బహిరంగంగా ఆందోళన బాటపట్టారు. ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ పేరుతో మొదలు పెట్టిన ఆందోళన తారాస్థాయికి చేరింది. రవాణా, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపచేసే లక్ష్యంగా నిరసల్ని మరింత ఉదృతం చేశారు. ఫలితంగా ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని భావించిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్.. ప్రధాని ఫ్రాంకోయిస్ బేరౌను పదవి నుంచి తొలగించారు. నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియమించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సెబాస్టియన్ లెకోర్ను.. ఆందోళనల్ని అరికట్టేందుకు ఎక్కడిక్కడే ఆందోళన కారుల్ని అరెస్టు చేస్తున్నారు. అరెస్టులు, భద్రతా చర్యలు నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను మోహరించారు. పారిస్ సహా ప్రధాన నగరాల్లో పోలీసులు భారీగా మోహరించి, శాంతి భద్రతలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 200 మందికి పైగా అరెస్టు కాగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం. నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సెబాస్టియన్ లెకర్నో స్పందించారు.దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు. ప్రజల ఆందోళనలను అర్థం చేసుకుంటామని, శాంతియుతంగా పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. -
మళ్లీ పడిపోయిన ఫ్రాన్స్ ప్రభుత్వం
పారిస్: ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఫ్రానోయిస్ బేరూ(74) ప్రభుత్వం పడిపోయింది. సోమవారం పార్లమెంట్లో ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం 194–364 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయింది. దేశాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వ వ్యయంలో కోత పెడుతూ తీసుకొచ్చిన ప్రతిపాదనలకు ప్రతిపక్షం మద్దతిస్తుందని ఫ్రానోయిస్ వేసిన అంచనాలు లెక్కతప్పాయి. దీంతో ఏడాదిలో నాలుగో ప్రధానిని అన్వేషించే పనుల్లో అధ్యక్షుడు నిమగ్నమయ్యారు. పార్లమెంట్ దిగువ సభలో అధ్యక్షుడు మాక్రాన్ ప్రత్యర్థులదే పైచేయిగా ఉంది. అధ్యక్షుడిగా విదేశాంగ విధానం, యూరోపియన్ వ్యవహారాలు, సైనిక బలగాల కమాండర్‌గా విశేషమైన అధికారాలను కలిగి ఉన్నప్పటికీ మాక్రాన్ విధానాలపై దేశీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 జూన్‌లో అర్థంతరంగా పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. దీనిద్వారా తన అధికారం బలపడుతుందని ఆశించారు. కానీ, మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీని ప్రజలు ఇవ్వలేదు. ఫ్రాన్స్ ఆధునిక చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి. దాని ఫలితంగానే ప్రభుత్వాలు తరచూ మారుతున్నాయి. -
లక్ష కోట్లతో జలాంతర్గామి డీల్
న్యూఢిల్లీ: పెద్దసంఖ్యలో యుద్ధనౌకలు, జలాంతర్గాములతో భారత్‌కు పక్కలో బళ్లెంలో తయారైన చైనాకు సాటిగా ఎదిగేందుకు భారత్ మరో అడుగు ముందుకేస్తోంది. అత్యంత శక్తివంతమైన రెండు జలాంతర్గాముల తయారీ, కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్ సమాయత్తమైంది. ప్రభుత్వరంగ మజగావ్ డాక్ లిమిటెడ్, ఫ్రాన్స్ రక్షణరంగ దిగ్గజం నావల్ గ్రూప్‌లో కలిసి మూడు స్కారి్పయన్ శ్రేణి జలాంతర్గాములను భారత్ తయారుచేయనుంది. రూ.36,000 కోట్ల విలువైన ఈ ఒప్పందానికి రెండేళ్ల క్రితమే రక్షణశాఖ ఆమోదం తెలిపినా సాంకేతిక, వాణిజ్యపర అంశాల్లో స్పష్టతలేక ఇన్నాళ్లూ చర్చల దశలోనే ఈ ఒప్పందం తచ్చాడుతోంది. దీనికి తోడు మరో రూ.65,000 కోట్లతో ఆరు డీజిల్–ఎలక్ట్రిక్ నిఘా జలాంతర్గాములను సమీకరించుకోవాలని భారత రక్షణశాఖ తలపోస్తోంది. మొత్తంగా రూ.1 లక్ష కోట్ల భారీ ప్రాజెక్టులపై కదలిక వచ్చిందని సంబంధిత విశ్వసనీయ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. డీజిల్–ఎలక్ట్రిక్ జలాంతర్గాముల ప్రాజెక్ట్‌కు సైతం రక్షణశాఖ 2021లో ఆమోదం తెలిపినా అది కార్యరూపం దాల్చలేదు. -
అమెరికా రాయబారి చార్లెస్ కుష్నర్కు ఫ్రాన్స్ సమన్లు
ఫ్రాన్స్: అమెరికా రాయబారి చార్లెస్ కుష్నర్కు ఫ్రాన్స్ సమన్లు జారీ చేసింది. యూదు వ్యతిరేకత పెరుగుదలను అరికట్టడంలో విఫలమయ్యారనే ఆరోపణలను విదేశాంగ శాఖ తోసి పుచ్చింది. కుష్నర్ వ్యాఖ్యలు ఆమోదయోగం కాదని పేర్కొంది. రాయబారులు తమ దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అనుమతించబోమని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అల్లుడు జారెడ్ కుష్నర్ తండ్రి చార్లెస్ కుష్నర్ను ప్రాన్స్ రాయబారిగా నియమించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌కు బహిరంగ లేఖ రాశారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఫ్రాన్స్‌లో యూదుల పట్ల ద్వేషం పెల్లుబుకిందని కుష్నర్ ఆరోపించారు. ఇజ్రాయెల్‌పై తన విమర్శలను తగ్గించుకోవాలని మాక్రాన్‌కు పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఫ్రాన్స్ వీధుల్లో యూదులపై దాడి జరగకుండా, యూదుల ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, యూదుల వ్యాపారాలు ధ్వంసం చేయకుండా ఒక్క రోజు కూడా లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళికను రూపొందించాలని, అందుకు మాక్రాన్, ఇతర ఫ్రెంచ్ నాయకులతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కుష్నర్ లేఖ... పాలస్తీనాకు గుర్తింపునివ్వడం యూదు వ్యతిరేకతకు దోహదపడుతోందంటూ మాక్రాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలనే పునరుద్ఘాటించింది. కాగా, సెపె్టంబర్లో పాలస్తీనాను అధికారికంగా గుర్తించాలన్న యోచనలో ఫ్రాన్స్ ఉంది. -
స్థిరమైన దీర్ఘకాలిక విధానాలు అవసరం
ప్యారిస్: భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించి స్థిరమైన, దీర్ఘకాల విధానాలు.. రాష్ట్రాల వ్యాప్తంగా ఏకరూపత అవసమని ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ స్టెల్లాంటిస్ ఇండియా సీఈవో శైలేష్ హజేలా అభిప్రాయపడ్డారు. అప్పుడే ఆటోమొబైల్ కంపెనీలు దీర్ఘకాల దృష్టితో వ్యాపార ప్రణాళికలను అమలు చేయగలవన్నారు. జీప్, సిట్రోయెన్ బ్రాండ్ల రూపంలో భారత మార్కెట్లో స్టెల్లాంటిస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌కు పెట్టుబడులతో వచ్చే వారు విధానాల పరంగా దీర్ఘకాల దృష్టిని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించింది ఏదైనా సరే, దేశవ్యాప్తంగా ఒకే మాదిరిగా, దీర్ఘకాలం పాటు అమలు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ఈవీలకు సంబంధించి, పన్ను పరమైన ఏకీకృత విధానాలు ఉండాలన్నారు. అప్పుడే కంపెనీలు రాష్ట్రాల వారీగా కాకుండా మొత్తం దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోగలవన్నారు. ఈవీలకు సంబంధించి రాష్ట్రాలు వేర్వేరు విధానాలు అమలును ప్రస్తావించారు. సిట్రెయెన్ బ్రాండ్ విస్తరణ గత కొన్ని సంవత్సరాలుగా స్టెల్లాంటిస్ గ్రూప్ భారత్‌లో కార్యకలాపాలకు అవసరమైన సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని శైలేష్ హజేలా తెలిపారు. ఇప్పుడు సిట్రోయెన్ బ్రాండ్ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. సేల్స్, నెట్వర్క్ విస్తరణపై దృష్టి సారించినట్టు తెలిపారు. వచ్చే ఏడాదిలో విక్రయ కేంద్రాలను రెట్టింపు చేసుకోనున్నట్టు (80 నుంచి 150కు) ప్రకటించారు. చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాలపై దృష్టి సారిస్తామన్నారు. టైర్4 పట్టణాల వరకు విస్తరిస్తామన్నారు. మార్కెట్ వాటాను వచ్చే 12 నెలల్లో రెట్టింపు చేసుకునే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. సిట్రోయెన్ బ్రాండ్‌పై రూ.2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు స్టెల్లాంటిస్ ఈ ఏడాదిలో ప్రకటించడం గమనార్హం. -
ఆటోరిక్షా హ్యాండ్‌బ్యాగ్ ధర కేవలం 35 లక్షలే
పారిస్: ఫ్యాషన్ పుట్టిల్లుగా పేరొందిన ఫ్రాన్స్‌లోని పారిస్‌లో కొత్త డిజైన్ విలాసవంత వస్తువొకటి మార్కెట్లోకి రంగ ప్రవేశం చేసింది. కొత్త ఫ్యాషన్‌కు అనుగుణంగా మెటీరియల్ కొని, కొలతలు ఇచ్చి, ధరించేలోపే ఆ ఫ్యాషన్ పాతబడిపోతుందని పారిస్ గురించి చెబుతుంటారు. అలాంటి నగరంలో సరికొత్త హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఇప్పుడు సందడి చేస్తోంది. భారత్‌లో ఇరుకు సందుల్లో సర్రున దూసుకుపోయే సామాన్యుడి రథంగా పేరొందిన ఆటోరిక్షా ఆకృతిలో కొత్త బ్యాగ్‌ను సిద్ధంచేశారు. ప్రఖ్యాత ఫ్రాన్స్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విటన్ సంస్థ నిపుణులు ఈ బ్యాగ్‌ను రూపొందించారు. మూడు చక్రాలతో, రెండు చేతి హ్యాండిళ్లతో ఎంతో అందంగా బ్యాగ్‌కు తుదిరూపునిచ్చారు. ఒంటె రంగులో అత్యంత నాణ్యమైన తోలుతో దీనిని తయారుచేశారు. మెన్స్ స్ప్రింగ్/సమ్మర్ 2026 కలెక్షన్లో భాగంగా భారతీయత ఉట్టిపడేలా నవకల్పనకు ఇలా జీవంపోశారు. మెన్స్‌వేర్ విభాగ క్రియేటివ్ డైరెక్టర్ అయిన ఫారెల్ విలియమ్స్ సారథ్యంలోని బృందం ఈ ఆటోరిక్షా హ్యాండ్‌బ్యాగ్‌ను రూపొందించింది. దీని ధర కేవలం 35 లక్షల రూపాయలు అని ‘డైట్ పరాటా’ అనే నెటిజన్ ఒకరు వెల్లడించారు. వైకుంఠపాళి డిజైన్ ర్యాంప్‌వాక్ స్టేజీపై ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చి ఈ బ్యాగ్‌ను ప్రదర్శిస్తున్న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై కామెంట్ల పరంపర కొనసాగింది. ‘‘మధ్యతరగతి వాహనం ఇలా ఎట్టకేలకు పారిస్ ఫ్యాషన్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది’’, ‘‘ పశ్చిమ దేశాలకు ఒక్కసారిగా ఆసియా ఖండం, భారత్‌పై మక్కువ పెరిగినట్లుంది. ప్రాడా వారి కొల్హాపురీ పాదరక్షలు, బాస్మతీ రైస్ బ్యాగులతో దుస్తులు.. ఇలా ఇంకెన్నో వస్తువులు ఇప్పుడు ఒక్కసారిగా అంతర్జాతీయ ఫ్యాషన్‌గా మారిపోయాయి’’ అని కామెంట్లు పెట్టారు. ‘‘ఫ్యాషన్ డిజైనర్ల మెదళ్లలో ఐడియాలు ఇంకిపోయాయి. అందుకే ఇలా భారత్‌పై పడ్డారు’’, ‘‘ ఆటో బాగుందిగానీ ఎక్కడి నుంచి లోపలికి ఎక్కాలి?’’, ‘‘ ఆ బ్యాగ్ కొనాలంటే ఎన్ని ఆటోలను అమ్మాలో?’’ అని మరికొందరు పోస్ట్‌లు పెట్టారు. ‘‘ గతంలో ఇదే లూయిస్ విటన్ విమానాలు, డాలి్ఫన్లు, పీతల ఆకృతుల్లో బ్యాగులు తెచ్చింది’’ అని మరొకరు గుర్తుచేశారు. -
ఫ్రాన్స్ సంచలన ఆరోపణలు.. చైనా, పాక్‌లు కలిసి..!
తమ యుద్ధ విమానాల అమ్మకాలపై చైనా దుష్ర్పచారాం చేస్తోందని ప్రాన్స్ సంచలన ఆరోపణలు చేసింది. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న రఫెల్ యుద్ధ విమానాల అమ్మకాలను చైనా దెబ్బతీస్తోందని ఫ్రాన్స్ ఆరోపించింది. పలు దేశాల్లో చైనా రాయబార కార్యాలయాల్లో పని నేసే దౌత్య, రక్షణ ప్రతినిధులు ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారని ఫ్రాన్స్ మండిపడుతోంది. ఫేల్ విమానాలను కొనుగోలు చేయవద్దని, వాటి స్థానంలో చైనా తయారీ జెట్లను తీసుకుంటే మంచిదని వివిధ దేశాలను ఒప్పించే యత్నాలు జరగుఉతున్నాయని ఫ్రెంచ్ వర్గాల వెల్లడించాయి. తమ దేశం అధికంగా విమానాల అమ్మకాలనై అత్యధికంగా ఆధారపడిన దేశమని, దాన్ని చైనా దెబ్బ కొట్టడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు ప్రాన్స్ చెబుతోంది. చైనా తన అధికారిక బలంతో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఫ్రాన్స్ అంటోంది. పాకిస్తాన్, చైనా కలిసి ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఫ్రాన్స్ విమర్శించింది. ఈ దుష్ప్రచారంలో భాగంగా, గత మే నెలలో భారత్‌తో జరిగిన ఘర్షణలో మూడు రఫేల్ విమానాలతో సహా ఐదు భారత విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ చేసిన వాదనలను చైనా వాడుకుంటోందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఆన్లైన్లో కూడా ఈ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారని తెలిపింది. ఏఐతో మార్ఫింగ్ చేసిన యుద్ధ విమానాల శిథిలాలను చూపిస్తూ చైనా టెక్నాలజీ అమోఘమనే భావనను వారు కల్గిస్తున్నారని తెలిపింది. రఫెల్ అనేది యుద్ధ విమానం మాత్రమే కాదని, అది ఫ్రాన్స్ వ్యూహాత్మక సామర్థ్యానికి, నమ్మకానికి ప్రతీక ఫ్రాన్స్ పేర్కొంది. ఇప్పుడే దాన్నే చైనా తన అధికారిక బలాన్న ఉపయోగించి దుష్ప్రచారానికి దిగినట్లు ఫ్రాన్స్ ధ్వజమెత్తింది.రఫెల్ యుద్ధ విమానాలకు తయారు చేసే డసెల్ట్ ఏవియేషన్ 533 జెట్స్‌ను వివిద దేశాలకు అమ్మింది. ఈజిప్ట్, భారత్, ఖతర్, గ్రీస్, క్రొయేషియా, యూఏఈ, సెర్బియా, ఇండోనేషియా తదితర దేశాలకు ఫ్రాన్స్ తమ యుద్ధ విమానాలను విక్రయించింద. ఇప్పటివరకూ ఇండోనేషియా 42 యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేయగా, మరిన్ని రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తోంది. -
భారత్‌లో ఫాల్కన్ జెట్స్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారత్‌లో ఫాల్కన్ 2000 బిజినెస్ ఎగ్జిక్యూటివ్ జెట్ విమానాలను తయారు చేసేందుకు ఫ్రాన్స్ ఏరోస్పేస్ దిగ్గజం డసాల్ట్ ఏవియేషన్‌తో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ (ఆర్ఏఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానాలను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడం ఇదే ప్రథమం. ప్యారిస్ ఎయిర్‌షో సందర్భంగా ఇరు సంస్థలు ఈ విషయం ప్రకటించాయి. హై ఎండ్ బిజినెస్ జెట్స్ తయారీకి భారత్ వ్యూహాత్మక కేంద్రంగా ఎదిగేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. దీని ప్రకారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ‘ఫాల్కన్ 2000 జెట్స్’ కోసం అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయనున్నాయి. దీంతో బిజినెస్ జెట్స్‌ను తయారు చేయడంలో అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్ సరసన భారత్ కూడా చేరుతుంది. మేకిన్ ఇండియా నినాదానికి తమ మద్దతును తెలియజేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. రిలయన్స్ గ్రూప్ ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయని గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ అనిల్ డి. అంబానీ పేర్కొన్నారు. జంట ఇంజిన్లుండే ఈ విమానాల్లో 8–10 మంది వరకు ప్రయాణించవచ్చు. 2028 నాటికి తొలి మేడిన్ ఇండియా ఫాల్కన్ 2000 విమానం డెలివర్ కానుంది. డసాల్ట్ ఏవియేషన్ గత వందేళ్లలో 90 పైగా దేశాలకు 10,000 మిలిటరీ, పౌర విమానాలను సరఫరా చేసింది. 2017లో డసాల్ట్ ఏవియేషన్, రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ (డీఆర్ఏఎల్) జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశాయి. 2019లో ఫాల్కన్ 2000 ముందు భాగా న్ని ఉత్పత్తి చేసినప్పటి నుంచి 100కు పైగా కీలకమైన సబ్–సెక్షన్లను ఈ జేవీ తయారు చేస్తోంది. అంతర్జాతీయంగా ఫాల్కన్ జెట్స్ తయారీలో కీలకంగా ఎదిగింది. -
హైదరాబాద్‌లో రఫేల్ ఫ్యూజిలేజ్‌ల తయారీ
సాక్షి, హైదరాబాద్: ఫ్రాన్స్‌కు చెందిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్‌లు హైదరాబాద్‌లో తయారు కానున్నాయి. ఇందుకోసం రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్‌తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఫ్యూజిలేజ్‌ను తయారు చేసేందుకు టాటా సంస్థ హైదరాబాద్‌లో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఫ్రాన్స్ వెలుపల తొలిసారి రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్‌లు హైదరాబాద్ లోనే తయారు కానుండటం విశేషం. రెక్కలు, తోక మినహా విమానంలోని ఇతర భాగాన్ని ఫ్యూజిలేజ్ అంటారు. ఇందులో ప్రయాణికులు, సరుకులు, ఇతర పరికరాల రవాణా కోసం ఏర్పాట్లు ఉంటాయి. ఈ ఒప్పందంతో భారత వైమానిక తయారీ రంగం సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. హైదరాబాద్ యూనిట్లో ఫ్యూజిలేజ్లోని ముందు, వెనుక, పక్క భాగాలు తయారవుతాయి. 2028 నాటికి తొలి ఫ్యూజిలేజ్ ఉత్పత్తిఒప్పందం మేరకు 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రఫేల్ యుద్ధ విమానం తొలి ఫ్యూజిలేజ్ హైదరాబాద్ యూనిట్ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ ప్రతి నెలా రెండు ఫ్యూజిలేజ్లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘రఫేల్ ఫ్యూజిలేజ్‌లు తొలిసారి ఫ్రాన్స్ బయట ఉత్పత్తి కానున్నాయి. భారత్‌లో మా సప్లై చైన్‌ను బలోపేతం చేయడంలో ఈ ఒప్పందాన్ని కీలకమైనదిగా భావిస్తున్నాం’అని డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. ‘డసాల్ట్ ఏవియేషన్‌తో ఒప్పందం భారతదేశ ఏరోస్పేస్ రంగం ప్రయాణంలో ముఖ్యమైన ముందడుగు. ఈ ఒప్పందం ఆధునిక, దృఢమైన ఏరోస్పేస్ తయారీ పర్యావరణ వ్యవస్థ స్థాపనలో గొప్ప పురోగతికి ప్రతిబింబంగా నిలుస్తుంది’అని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సుకరణ్ సింగ్ అన్నారు. -
సాకర్ సంబరాల్లో అపశ్రుతి
పారిస్: యూరోపియన్ సాకర్ ఫైనల్లో శనివారం రాత్రి ఇంటర్ మిలన్‌పై పారిస్ సెయింట్ జెర్మయిన్ జట్టు విజయం అనంతరం ఫ్రాన్సులో జరిగిన ఉత్సవాలు హింసాత్మకంగా మారాయి. వాటిలో ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోగా, ఒక పోలీసు అధికారి తీవ్ర గాయాలతో కోమాలోకి జారుకున్నారు. డాక్స్ నగర వీధుల్లో జరిగిన సంబరాల్లో 17 ఏళ్ల బాలుడు కత్తిపోట్లకు గురై మరణించాడు. పారిస్‌లో విజయోత్సవాల ప్రాంతంలో కారు ఢీకొని ఓ స్కూటరిస్ట్ మృతి చెందాడు. కౌటన్స్ ప్రాంతంలో సాకర్ అభిమానులు పేల్చిన బాణసంచా తాకడంతో తీవ్రంగా గాయపడిన ఓ పోలీసు అధికారి కోమాలోకి వెళ్లారు. వీటికి సంబంధించి 500 మందిపైగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పారిస్‌లో భారీగా పోలీసులను మోహరించారు. -
మాక్రాన్-బ్రిగెట్టా వీడియోపై ట్రంప్ ఫన్నీ.. డోర్ క్లోజ్ చేయాలంటూ..
వాషింగ్టన్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇలాంటివి జరిగేటప్పుడు అక్కడ తలుపులు మూసి ఉన్నాయో.. తెరిచి ఉన్నాయో చూసుకోవాలి అని ఫన్నీ కామెంట్స్ చేశారు. అది చూసుకుంటే ఇలా సోషల్ మీడియాలో మనం ఉండం కదా.. అని చెప్పుకొచ్చారు.అధ్యక్షుడు మాక్రాన్ ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్టా నెట్టినట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ ఘటనపై స్పందించాలని ఓ విలేకరి ట్రంప్‌ను కోరారు. ఈ సందర్భంగా ట్రంప్ స్పందిస్తూ.. దీని గురించి తాను నేరుగా మాక్రాన్తోనే మాట్లాడాను. అంతా బాగానే ఉందని తెలిపారు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు తలుపులు వేసి ఉన్నాయో, లేదో ఒకసారి గమనించుకోవాలి అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. మాక్రాన్-బ్రిగెట్టాల వియత్నాం పర్యటన సందర్బంగా హనోయ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం హనోయ్‌లో దిగిన తరవాత.. ఒక అధికారి తలుపును తెరిచినప్పుడు మాక్రాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతలోనే ఎర్రని స్లీవ్స్ ధరించిన రెండు చేతులు మాక్రాన్‌ను నెట్టివేశాయి. ఆయన వెంటనే తలతిప్పి వెనక్కి జరిగారు. ఇది రికార్డు అవుతున్నట్లు గమనించి చిరునవ్వుతో చేయి ఊపారు. ఆ తరువాత ఫొటోల్లో మెక్రాన్, ఎర్రని జాకెట్ వేసుకొని బ్రిగెట్టా విమానం మెట్ల వరుసపై కనిపించారు. భార్య చేతిని పట్టుకోవడానికి మాక్రాన్ ప్రయత్నించినా ఆమె ఇష్టపడలేదు. తరువాత ఇద్దరూ కలసి మెట్లు దిగి రెడ్ కార్పెట్ మీద పక్కపక్కనే నడిచారు.BREAKING:@pdoocy just asked Donald Trump about Brigitte Macron slapping @EmmanuelMacron earlier this week.TRUMP: "Make sure the door remains closed."🤣🤣 pic.twitter.com/V05Hna79DG— Evan Kilgore 🇺🇸 (@EvanAKilgore) May 30, 2025అనంతరం, ఈ ఘటనపై మాక్రాన్ స్పందిస్తూ.. మా విషయంలో ప్రతీ ఒక్కరూ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. అప్పుడు నా భార్యతో నేను జోక్ చేశాను. ఇది మా మధ్య ఎప్పుడూ జరిగేదే అంటూ క్లారిటీ ఇచ్చారు. ‼️🇫🇷 Here's a higher-quality version of today’s most viral video. Enjoy! #Macron pic.twitter.com/aGkx0nXzKe— Maimunka News (@MaimunkaNews) May 26, 2025 -
కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌పై కుట్ర!
పారిస్: ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న సమయంలోనే గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం నిర్వాహకులను ఆందోళనకు గురిచేసింది. దక్షిణ ఫ్రాన్స్‌లోని అల్పిస్–మారిటైమ్స్ ప్రాంతంలో శనివారం ఉదయం 1.60 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఇదే ప్రాంతంలో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతోంది. కరెంటు లేకపోవడంతో కొన్ని కార్యక్రమాలు రద్దు చేయాల్సి వచ్చింది. అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించడంతో ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం ఫిలిం ఫెస్టివల్ ముగింపు వేడుకలు యథాతథంగా జరిగాయి. కరెంటు సరఫరా హఠాత్తుగా ఆగిపోవడానికి కారణం ఏమిటన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం రాత్రి కాన్స్ సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీనివల్ల విద్యుత్ గ్రిడ్‌లో సమస్యలు తలెత్తాయి. హై–ఓల్టేజీ కరెంటు లైన్ ఒకటి కూలిపోయిందని విద్యుత్ శాఖ సిబ్బంది చెప్పారు. దీనివల్ల అల్పిస్–మారిటైమ్స్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. అయితే, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరగడం వెనుక కుట్ర ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు అంతరాయం కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ కుట్ర జరిగినట్లు అంచనా వేస్తున్నారు. -
Cannes 2025: కాన్స్‌లో ఇండియన్ సినిమాకు అరుదైన గౌరవం
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలి అడుగు వేశారు జాన్వీ కపూర్. పింక్ కలర్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్‌పై నడిచారీ బ్యూటీ. హైదరాబాదీ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ‘హోమ్ బౌండ్’ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘అన్ సర్టైన్ రిగార్డ్స్’ విభాగంలో పోటీలో నిలవగా ఈ చిత్రంలో నటించిన జాన్వీ, ఇషాన్ కట్టర్ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు కోసం ఎంపికైన తొలి భారతీయ చిత్రం కూడా ‘హోమ్ బౌండ్’ కావడం విశేషం. కరణ్ జోహార్, అపూర్వా మెహతా, అదార్ పూనావాలా, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రాన్ని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా, తొమ్మిది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఇదిలా ఉంటే.. గత కొన్ని సంవత్సరాలుగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తప్పకుండా హాజరవుతున్నారు హీరోయిన్ ఐశ్వర్యా రాయ్. ఈ సారి కూడా కాన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచారామె. ఇక ఈ ఫెస్టివల్‌కు ఐశ్వర్యారాయ్ రావడం 22వ సారి కావడం విశేషం.కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా ‘విశ్వంభర’ గ్లింప్స్‌ని ప్రదర్శించనున్నారు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘విశ్వంభర’. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వి. వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘విశ్వంభర’ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం ఫ్రాన్స్ వెళ్లారు నిర్మాత విక్రమ్ రెడ్డి.భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం జీవితం వెండితెరపైకి రానుంది. ‘కలాం: ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో ధనుష్ టైటిల్ రోల్ చేయనున్నారు. కాన్స్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రకటించి, టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘డా. కలాం జీవితం, భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన అమూల్యమైన సేవను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అని మేకర్స్ తెలిపారు. -
జైళ్లనిండా బుల్లి ఫోన్లే
ఇది రికార్డుల కోసం తయారు చేసిన బుల్లి ఫోన్ కాదు. ఎంచక్కా పని చేస్తుంది. ఫ్రాన్స్ జైళ్లలో ఖైదీలు వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారు. జైలు నుంచే దర్జాగా డ్రగ్ డీల్స్ మొదలుకుని కాంట్రాక్ట్ హత్యల దాకా నానా దందాలూ చక్కబెట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంపై కొన్నాళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెంచి జైళ్లలో నిబంధనల జాడే లేనంతగా అరాచకం రాజ్యమేలుతోందని జనం మండిపడుతున్నారు. దాంతో జైళ్లలో ఫోన్ల వాడకంపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ‘ప్రిజన్ బ్రేక్’ పేరిట మంగళవారం దేశవ్యాప్తంగా ఏకంగా 66 జైళ్లలో ఏకకాలంలో తనిఖీ ఆపరేషన్ నిర్వహించారు. కరడుగట్టిన ఖైదీల వద్ద ఇలాంటి బుల్లి ఫోన్లు వేలాదిగా దొరకడంతో విస్తుపోయారు. కేవలం సిగరెట్ లైటర్ పరిమాణంలో ఉండే ఈ ఫోన్లన్నీ చైనా పీసులేనని విచారణలో తేలడం విశేషం! ఆపొరి్టక్ అనే ఫ్రెంచి కంపెనీ వీటిని విక్రయిస్తోంది. జైళ్లలో జరిపే ఎలాంటి ఎల్రక్టానిక్ తనిఖీలకూ ఇవి చిక్కవని వెబ్సైట్లో బాహాటంగా ప్రచారం చేసుకుంటోంది! దాంతో సదరు కంపెనీని ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టింది. -
మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్
భారతీయ సంస్కృతి, ఫ్యాషన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయి. అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో మన ఫ్యాషన్ స్టైల్ ఫ్యాషన్ ప్రియులనుంచి సామాన్యులదాకా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మెట్ గాలా, కేన్స్ లాంటి ప్రతిష్టాత్మక వేదికలు, ఐకానిక్ ప్రపంచ వేదికలపై మన భారతీయ నటీమణులు, సెలబ్రిటీలు భారత సంప్రదాయ ఫ్యాషన్ శైలిని ప్రదర్శిస్తున్నారు. రెడ్ కార్పెట్ దేశీ సంస్కృతిని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కేవలం తారలు మాత్రమే కాదు..వివిధ స్థాయిలలో భారతీయ వారసత్వాన్ని ప్రభావితం చేస్తున్న సామాన్యులకు కూడా కొదవేమీ లేదు. తాజా వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఢిల్లీ మెట్రోలో లెహంగాలు, అనార్కలి లేదా చీరలు ధరించి రీల్స్ చేసే అమ్మాయిలను చూసి ఉంటారు. కానీ విదేశాల్లో మెట్రోలో చీర లేదా మన సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులను చూడటం చాలా అరుదు. తాజా ప్యారిస్‌లోని మెట్రోలో ఒక లెహంగాలో అందంగా మెరిసిన యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో నివ్య సందడి చేస్తోంది. ఇదీ చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!భారతీయ సంతతికి చెందిన ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్ నివ్య ప్యారిస్‌లోని స్థానిక రైలులో అందమైన లెహెంగాలో ప్రయాణించడమే కాదు, చక్కటి హావభావాలను ఆకట్టుకుంది. లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న తన వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు తెగ మురిసి పోతున్నారు. నివ్య బ్రైట్ నారింజ రంగు భారీ లెహంగాలో మెరిసింది. క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ జరీ వర్క్ లెహెంగాకు స్లీవ్‌లెస్ చోలి సెట్, ఇతర నగలతో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కూల్...కూల్‌గా గాగుల్స్ పెట్టుకుని మరింత స్టైల్‌గా కనిపించింది. గత ఏడాది నవంబరులో షేర్ చేసిన ఈ వీడియో ఏకంగా 10 లక్షలకు పైగా వ్యూస్, వేల కామెంట్లను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by MAKEUP & HAIR ARTIST PARIS (@tanzeela.beauty) యూరప్‌లో భారతీయ సంస్కృతిని ప్రదర్శిస్తూ, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించిన నివ్యను నెటిజన్లు ప్రశంసించారు. చాలా అందంగాఉన్నారనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్‌లోని మెట్రోలో బంగారు నగలతో ప్రయాణిస్తున్నారా? సేఫ్టీ ఫస్ట్. ఇవి కాస్ట్యూమ్ ఆభరణాలు అయితే మంచిది. అవి మీ అమ్మగారి ఆభరణాలు కాకూడదని అనుకుంటున్నా అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇదే లెహంగాలో ఆకట్టుకున్న వీడియో కూడా ఆకర్షణీయంగా నిలిచింది. చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు View this post on Instagram A post shared by Nivya | Fashion & Lifestyle (@boho_gram)p> -
గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరిక
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో పూర్తి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్(Israel) నిరంతరం తన దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు ఇజ్రాయెల్ జరుపుతున్న తాజా సైనిక దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్(Gaza Strip)లో తాజాగా ‘ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్’ అనే పేరుతో కొత్త సైనిక దాడిని ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ గాజాలో వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. వీటిని మే 17 నుంచి ప్రారంభించింది. ఈ దాడులలో వందలాది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. మే 14, 2025న జబాలియాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులలో 48 మంది మరణించారు. వీరిలో 22 మంది పిల్లలు ఉన్నారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇటీవల ఈ దాడులను పూర్తి విజయం సాధించే వరకు కొనసాగిస్తామని, హమాస్‌ను నాశనం చేయడం, నిరాయుధీకరణ చేయడం, బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు మే 19, ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్ చేపడుతున్న అత్యంత దారుణమైన చర్యలను ఖండించారు. ఇజ్రాయెల్ తన సైనిక దాడులను ఆపకపోతే, సహాయ నిరోధకాలను ఎత్తివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ మూడు దేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి. కాగా ఇజ్రాయెల్ గత మార్చి నుండి గాజాకు ఆహారం, వైద్య సామగ్రి, ఇంధన సహాయాన్ని నిరోధించింది. దీని వల్ల గాజాలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కాగా ఉత్తర గాజాలో పౌరులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలావుండగా మే 19న ఇజ్రాయెల్ ఒక ప్రాథమిక పరిమాణంలో ఆహార సహాయాన్ని గాజాకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా అక్కడ ఆహారం సంక్షోభం నివారణ జరుగుతుందని తెలిపింది. అయితే, ఐక్యరాష్ట్ర సమితి (యూఎన్ఓ) ఈ సహాయాన్ని సముద్రంలో ఒక చుక్కగా అభివర్ణించింది.ఖతార్‌లోని దోహాలో.. గాజాలో కాల్పుల విరమణ, బందీల మార్పిడికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. హమాస్.. 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 సహాయ ట్రక్కుల అనుమతి తదితర ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇజ్రాయెల్ ఈ దీనిపై ఇంకా బహిరంగంగా స్పందించలేదు. గతంలో గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించడానికి, యుద్ధాన్ని ముగించడానికి నిరాకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. హమాస్ నిరాయుధీకరణ దిశగా ముందడుగు వేస్తేనే గాజా యుద్ధం ముగుస్తుందని ఖతార్ చర్చలలో స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి -
తళతళ తారకలాగా...
ఎరుపు రంగు గౌనులో తళతళ తారకలాగా తళుక్కుమని ప్రత్యక్షమయ్యారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఫ్రాన్స్‌లో జరుగుతున్న 78వ కాన్స్ చిత్రోత్సవాల్లో ఆమె ‘రెడ్ సీ ఫెస్టివల్’లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. అలాగే మహిళా నిర్మాతలు, నటులు, సాంకేతిక విభాగంలో ఉన్నవారు సినిమాలకు చేసిన కృషిని ప్రస్తావించే ‘ఉమెన్ ఇన్ సినిమా’ గాలాలో పాల్గొనే గౌరవం జాక్వెలిన్‌కి దక్కింది. ఇక భారతదేశం నుంచి ఈ వేడుకల్లో రెడ్ కార్పెట్ పై తళుక్కుమన్న తారల్లో హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’లో నటించిన నితాంశా గోయల్ తొలిసారి పాల్గొన్నారు. గత ఏడాది గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకున్న ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ లైట్’లో నటించిన ఛాయా కదమ్ ఆ 77వ చిత్రోత్సవాల్లో సందడి చేశారు. ఈ ఏడాదీ ఆమె కాన్స్ వెళ్లారు. ఇంకా భారతదేశం నుంచి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ మాసూమ్ మీనావాలా, ఇండియన్–థాయ్ బ్యూటీ, ‘మిస్ యూనివర్స్ థాయ్‌ల్యాండ్ సరాబురి’ వీణా ప్రవీణర్ సింగ్, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సాక్షి సింద్వానీ పాల్గొన్నారు. ‘తన్వీ ది గ్రేట్’ స్క్రీనింగ్ కోసం హాజరైన ఆ చిత్రదర్శకుడు అనుపమ్ ఖేర్ కూడా రెడ్ కార్పెట్‌పై స్టైలిష్‌గా కనిపించారు. -
Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు
-
Cannes 2025 తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Cannes 2025) లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela ) తన అద్భుతమైన ప్రదర్శనతో తన మాయాజాలాన్ని మరోసారి రిపీట్ చేసింది. తనదైన ఫ్యాషన్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసే ఊర్వశి రౌతేలా ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తళుక్కుమని మెరిసింది. కొంతకాలంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను మిస్ కాని ఊర్వశి ఈసారి కూడా స్పెషల్ అప్పియరెన్స్‌తో అదరగొట్టేసింది. డార్క్ గ్రీన్ ట్యాబ్ గౌను, ధరించి యువరాణి లుక్‌లో తళుక్కుమంది. మరీ ముఖ్యగా ఆమెధరించిన ప్యారెట్ ఆకారంలో క్రిస్టల్ క్లచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో దాని ధర ఎంత అనే చర్చ నెట్టింట సందడిగా మారింది.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 78వ ఎడిషన్ మే 13, 2025న ప్రారంభమై మే 24, 2025న ముగియనుంది. అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులు 12 రోజుల పాటు జరిగే గ్లామర్, కళల అద్భుతమైన వేడుకలో సందడి చేయనున్నారు. బాలీవుడ్ హీరోయిన్లతోపాటు, ఈ సారి 76 ఏళ్ల సిమీ గరేవాల్ కేన్స్ ఉత్సవంలో అరంగేట్రం చేస్తోంది.. ఈ సంవత్సరం కేన్స్ ముఖ్యాంశాలలో ఒకటి, అమెరికన్ నట దిగ్గజం, రాబర్ డి నీరోకు జీవిత సాఫల్యానికి గౌరవ పామ్ డి'ఓర్ అవార్డును ప్రదానం చేయడం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఉర్వశి రౌతేలా రెడ్ కార్పెట్ మీద నడిచింది.ఇదీ చదవండి: 76 ఏళ్ల వయసులో 56 ఏళ్ల తరువాత కేన్స్‌లో అరంగేట్రం..అస్సలు ఊహించలేదుఊర్వశి ధరించిన గౌనుతో పాటు, రంగురంగుల రత్నాలు, చెవిపోగులు, రంగురాళ్ల కిరీటం మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. ఇక మేకప్ విషయానికి వస్తే, ముదురు ఊదా రంగు ఐషాడోతో బోల్డ్, గ్లామరస్ మేకప్, కళ్ళపై రైన్‌స్టోన్స్ స్టిక్కర్‌తో తన మరింత ఎలివేట్ చేసుకుంది. పక్షి ఆకారంలో ఉన్న బ్యాగును పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ పోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు. కేన్స్‌లో చిలుకలా దుస్తులు ధరించి వచ్చిన తొలి మహిళ, ఇది నిజమా; లేక ఏఐ మాయాజాలమా అంటూ ఆశ్చర్యంలో మునిగి పోయారు.హైలైట్ ఏంటంటేఊర్వశి లుక్‌లో మరో హైలైట్ ఆమె క్లచ్. సాధారణ, ప్రాథమిక క్లచ్‌లను పక్కనపెట్టి, జుడిత్ లిబర్ డిజైనర్ క్రిస్టల్ చిలుక క్లచ్‌ను ఎంచుకుంది.అద్భుతమైన క్లచ్ ధర 5,495 US డాలర్లు అంటే దాదాపు రూ. 4,57,744లు.గతంలో ఊర్వశి రౌతేలా క్రొకోడైల్ నెక్ పీస్ ధరించి పలువుర్ని ఆకర్షించింది. 2023 కేన్స్‌లో రూ. 200 కోట్ల విలువైన నకిలీ మొసలి నెక్‌పీస్ ధరించిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది సిమా కౌచర్ రూపొందించిన పింక్ టల్లే గౌనులో ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై తొలి సారి తన బ్యూటీని ప్రపంచానికి చాటా చెప్పింది. -
రఫేల్ ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్ సంతకాలు
న్యూఢిల్లీ: భారత నావికాదళం కోసం ఫ్రాన్సు నుంచి 26 రఫేల్ (మెరైన్)యుద్ధ విమానాలను రూ.64 వేల కోట్లతో కేంద్రం కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సోమవారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఫ్రాన్స్ రక్షణ రంగ కంపెనీ డసో ఏవియేషన్ నుంచి కొనుగోలు చేయనున్న విమానాలను ఐఎన్ఎస్ అరిహంత్‌పై మోహరించనున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ కమిటీ ఈ డీల్‌కు మూడు వారాల క్రితమే పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల తర్వాత యుద్ధ విమానాల రాక మొదలు కానుంది. అనుబంధ ఆయుధ వ్యవస్థలు, విడిభాగాలతోపాటు విమానాల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం భారత్‌కు బదిలీ చేయనుంది. -
స్తంభించిన విద్యుత్.. మూడు దేశాలు అతలాకుతలం
మాడ్రిడ్: విద్యుత్ సప్లై పూర్తిగా నిలిచిపోవడంతో మూడు ఐరోపా దేశాలు అతలాకుతలమవుతున్నాయి. పవర్ గ్రిడ్ లో తీవ్రమైన సమస్యలు తలెత్తడంతో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలు పూర్తిగా స్తంభించిపోయాయి.ప్రస్తుతం పవర్ గ్రిడ్ తిరిగి పునరుద్దరించే పనిలో పడ్డ మూడు దేశాలు.. సోమవారమంతా చీకటిలో మగ్గిపోయాయి. విమానాల రాకపోకల్లో తీవ్ర సమస్యలే కాకుండా భారీ ట్రాఫిక్ జామ్ లు వంటి ఘటనలు ఆ దేశాల్లో తల్తెతాయి. దీనిపై ఆయా దేశాలు అత్యవసరంగా క్యాబినెట్ భేటీ నిర్వహించి పవర్ గ్రిడ్ ను పునరుద్దరించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు..చిమ్మ చీకటిలో గడుపుతున్న ఈ మూడు దేశాల్లో మెట్రో సేవలు ఉన్నపళంగా నిలిచిపోయాయి. . రైళ్లు కూడా ఎక్కడికక్కడి స్తంభించిపోయాయి. . దీంతో ఆయా దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభంపై ఇప్పటివరకూ ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మాడ్రిడ్ లోని నాలుగు టవర్ బిల్డింగ్ ల్లో ఒక దాన్ని ఖాళీ చేయించారు. ఇందులో బ్రిటీష్ ఎంబాసీ పనిచేస్తున్న దరిమిలా ఆ కార్యాలయాన్ని ఆకస్మింగా ఖాళీ చేయించారు.ఆఫీసులు వదిలి.. రోడ్లపైనేతీవ్రమైన విద్యుత్ సంక్షోభంతో కార్యాలయాలు ఏవీ పని చేయడం లేదు. ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులు.. రోడ్లపైనే తిరుగుతూ కాలయాపన చేస్తున్నారు. అయితే దీనిపై స్పానిష్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఆపరేట్ రెడ్ ఎలక్ట్రికా స్పందించింది. విద్యుత్ ను తిరిగి పునరుద్దరించే క్రమంలో స్థానిక విద్యుత్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అన్ని యూరోపియన్ విద్యుత్ యూనియన్లను సమన్వయం చేసుకుంటూ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తాత్కాలిక ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. -
భారత నౌకాదళం అమ్ములపొదిలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు
-
మరో 26 రఫేల్ జెట్లు
న్యూఢిల్లీ: ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా నావికాదళాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు అంగీకారం తెలిపింది. భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరే ఈ భారీ ఒప్పందం విలువ రూ.63,000 కోట్లు. ఒప్పందంపై త్వరలో సంతకాలు చేసే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 26 ఫైటర్ జెట్లలో 22 సింగిల్–సీటర్ జెట్లు, 4 ట్విన్–సీటర్ జెట్లు ఉన్నాయి. భారత నావికా దళానికి ఈ యుద్ధ విమానాలు సరఫరా చేయడంతోపాటు వాటి నిర్వహణ, మరమ్మతులు, విడిభాగాల సరఫరా, సిబ్బందికి శిక్షణ కూడా ఒప్పందంలో భాగమే. కీలకమైన ఈ డీల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెక్యూరిటీ కేబినెట్ కమిటీ బుధవారం ఆమోద ముద్ర వేసింది. 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల అప్పగింత ప్రక్రియ రాబోయే ఆరేళ్లలో పూర్తి కానుంది. మొదటి బ్యాచ్ యుద్ధవిమానాలు 2029లో ఫ్రాన్స్ నుంచి భారత నేవీకి అందుతాయి. 2031 నాటికి అన్ని విమానాల అప్పగింత పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రెండు దేశాల ప్రభుత్వాల మధ్యే ఒప్పందం కుదరనుంది. విమానాల అప్పగింత, వాటి నిర్వహణ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఆ నిర్ణయం తీసుకున్నారు. సముద్ర గగనతలంపై పట్టు రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్–29కే యుద్ధ విమానాలు భారత నావికా దళానికి సేవలందిస్తున్నాయి. వీటి స్థానంలో రఫేల్ ఫైటర్ జెట్లను దశలవారీగా ప్రవేశపెట్టబోతున్నారు. భారత విమాన వాహక నౌకలైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి వీటిని ఆపరేట్ చేస్తారు. అత్యాధునిక ఎల్రక్టానిక్, ఆయుధ వ్యవస్థతో కూడిన రఫేల్ ఫైటర్ జెట్లతో సముద్ర గగనతలంపై భారత నావికాదళం పట్టు మరింత పెరుగనుంది. మరోవైపు సముద్ర ఉపరితలంపైనే కాకుండా సముద్ర అంతర్భాగంలోనూ పోరాట పటిమను పెంచుకొనే దిశగా ఇండియన్ నేవీ అడుగులు వేస్తోంది. -
నిధుల మళ్లింపు కేసులో దోషిగా తేలిన పెన్
పారిస్: ఫ్రాన్స్ నేషనల్ ర్యాలీ పార్టీ అగ్రనేత మెరీన్ లీ పెన్(56)కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక అవకతవకల కేసులో పారిస్ న్యాయస్థానం ఆమెను దోషిగా నిర్ధారించింది. ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తూ సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కోర్టు తీర్పు పూర్తిగా వెలువడకముందే లీ పెన్ కోర్టు గది నుంచి బయటకు వెళ్లిపోయారు. కరుడుగట్టిన అతివాద నాయకురాలిగా గుర్తింపు పొందిన మెరీన్ లీ పెన్ 2027లో జరిగే ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ప్రతికూలంగా తీర్పు రావడం శరాఘాతంగా మారింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ ఆమెకు ఉపశమనం దక్కే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆలోగా పై కోర్టులో విచారణ జరగడం, తీర్పు రావడం కష్టమేనని అంటున్నారు. యూరోపియన్ యూనియన్ నిధులను దుర్వినియోగం చేసినట్లు లీ పెన్‌పై ఆరోపణలు వచ్చాయి. 2004 నుంచి 2016 మధ్య సుమారు 33 లక్షల డాలర్లను సొంత పార్టీకి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో లీ పెన్‌తోపాటు మరో 12 మందిని సైతం న్యాయస్థానం దోషులుగా గుర్తించింది. లీ పెన్ గతంలో మూడుసార్లు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడ్డారు. 2022లో ఎమ్మానుయేల్ మేక్రాన్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
రష్యా, ఫ్రాన్స్, జర్మనీ బెస్ట్
ఐదు దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇటీవల యువత ధోరణి మారుతోంది. ఇప్పుడు వారి దృష్టి రష్యా, ఫ్రాన్స్, జర్మనీ అలాగే న్యూజిలాండ్ వంటి దేశాలకు మళ్లుతోంది. తమ చక్కటి భవిష్యత్ కోసం ఈ దేశాలను ఎంపిక చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. వీసా విధానాలు, వ్యయాలు, ఉద్యోగ అవకాశాలు వంటివి ఇందుకు కారణం. భారతీయ విద్యార్థులు కొత్త విదేశీ విద్యా గమ్యస్థానాలను ఎందుకు ఎంచుకుంటున్నారు... ఈ దేశాలు అందించే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్యూఎస్,యూకేల్లో కఠిన విధానాలుఅమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పుడు విద్యార్థుల ఆకర్షణ క్రమంగా కోల్పోతుండడానికి ఆయా దేశాలు అనుసరిస్తున్న కఠిన వీసా విధానాలు, అధిక ఫీజులు, విద్యను అభ్యసించిన తర్వాత ఉపాధి అవకాశాలు పరిమితం కావడం వంటి పలు అంశాలు కారణంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండవ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో విద్య, ఉపాధి అవకాశాలు పొందుదామనుకున్నవారి సంఖ్య గణనీయంగా పడిపోతున్న విషయం జగద్విదితమే. ఇక కెనడాకు విద్యార్థుల ఎన్రోల్మెంట్లు తగ్గడానికి దౌత్యపరమైన ఉద్రిక్తతలు ప్రధాన కారణం. ఇప్పటికీ అగ్ర దేశాలే.. కానీ.. అయితే రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్ వంటి దేశాలు బలమైన ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయి తప్ప కెనడా, అమెరికా, బ్రిటన్లను అవి అధిగమించేశాయని భావించడం సరికాదు. గత మూడు సంవత్సరాల్లో (2022–2024) భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు విదేశాలలో చదివేందుకు ఎంపిక చేసుకున్న దేశాల జాబితాలో అగ్ర స్థానంలో కెనడా, అమెరికా, బ్రిటన్‌లున్నాయి. అయితే ఈ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో రష్యా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే వారి సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ ఎందుకు?⇒ రష్యా: రష్యా విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య దేశాలతో పోల్చితే తక్కువ ట్యూషన్ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ముఖ్యంగా వైద్య విద్య విషయంలో రష్యా తన ప్రత్యేకతను చాటుతోంది. అమెరికా, బ్రిటన్లలో పోల్చితే రష్యాలో ప్రవేశ ప్రక్రియ సైతం సరళంగా ఉంటోంది. అలాగే ప్రవేశ పరీక్షల సంఖ్య కూడా తక్కువ. ఇక ఆయా దేశాలతో పోల్చితే రష్యాలో జీవన వ్యయాలూ చాలా తక్కువగా ఉంటున్నాయి. ⇒ జర్మనీ: ఉచిత లేదా తక్కువ ఖర్చుతో విద్యావకాశాలు జర్మనీ ప్రత్యేకత. దీనితోపాటు జర్మనీ సమృద్ధిగా అభివృద్ధి చెందిన ఆరి్థక వ్యవస్థను కలిగి ఉంది. 4.92 ట్రిలియన్ డాలర్లతో దేశం ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడో అతిపెద్ద ఆరి్థక వ్యవస్థగా ఉంది. అంతర్జాతీయ విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. జర్మన్ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాలకు ప్రసిద్ధి. ⇒ ఫ్రాన్స్: అమెరికా, బ్రిటన్లతో పోల్చితే ఫ్రాన్స్ తక్కువ ఖర్చుతో విద్యను అందిస్తోంది. పెద్ద సంఖ్యలో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇంగ్లీషులో కూడా కోర్సులను అందిస్తున్నాయి. దీంతో భారతీయ విద్యార్థులకు అక్కడ చదవడం సులభమవుతోంది. పట్టభద్రులయ్యాక అంతర్జాతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో ఉండి పనిచేసేందుకు అవకాశం ఉంది. ⇒న్యూజిలాండ్: ఈ దేశం భారత్ విద్యార్థులకు ప్రాచుర్యం పొందిన మరో దేశంగా మారింది. అనుకూలమైన వీసా నియమాలు, పనిచేయడానికి సులభమైన అవకాశాలు దీనికి ఒక కారణంకాగా, దేశంలోని విశ్వవిద్యాలయాలు మంచి విద్య, పరిశోధన అవకాశాలను అందిస్తున్నాయి. వీటన్నింటికీ మించి న్యూజిలాండ్ ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం గమనార్హం. ఆయా అంశాలు ఈ దేశాన్ని విద్యార్థులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ⇒ పోలాండ్, ఇటలీ, స్వీడన్ : పోలాండ్ తక్కువ వ్యయంతో విద్యా అవకాశాలు అందిస్తోంది. ఇటలీ విషయానికి వస్తే స్కాలర్షిప్లు ఇస్తూ ట్యూషన్ ఫీజుల వెసులుబాటును కల్పిస్తోంది. ఇక స్వీడన్లో ఇంగ్లీషులో బోధించే అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలూ లభిస్తున్నాయి. -
ఫ్రాన్స్ లో గాల్లో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు
-
ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే అణ్వాయుధాలు!
బ్రస్సెల్స్: ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసింది. గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్‌కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది. పోలండ్‌తో పాటు లిథువేనియా, లాతి్వయా వంటి పలు బాలి్టక్ దేశాలు ఈ ప్రతిపాదనను గట్టిగా సమరి్థంచాయి. యూరోపియన్ యూనియన్‌లో అణ్వాయుధ పాటమున్న దేశం ఫ్రాన్స్ ఒక్కటే కావడం విశేషం. ఫ్రాన్స్‌కున్న ఈ సానుకూలతను యూరప్ భద్రత కోసం ఉపయోగించేందుకు సిద్ధమని బుధవారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా మాక్రాన్ ప్రకటించారు. దీనిపై లోతుగా చర్చ జరగాలని ఈయూ భేటీలో ఆయన పునరుద్ఘాటించారు. దీనిపై రష్యా తీవ్రంగా స్పందించింది. మాక్రాన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైనదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ అన్నారు. ‘‘శాంతి యత్నాలకు బదులు యుద్ధానికే ఫ్రాన్స్ మొగ్గుతోంది. ఉక్రెయిన్‌తో మా యుద్ధం కొనసాగాలనే ఆశిస్తోంది. మాక్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు రుజువు’’ అని ఆయన ఆరోపించారు. -
ఈసారి జెలెన్స్కీ వెంట మాక్రాన్, స్టార్మర్!
పారిస్: అమెరికా అత్యున్నత పరిపాలనా పీఠం శ్వేతసౌధం సాక్షిగా అగ్రరాజ్యాధినేత ట్రంప్‌తో వాగ్వాదంలో తన దేశం తరఫున గట్టిగా వాదించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా అనూహ్యంగా పట్టుసడలించారు. రష్యా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా ఇన్నాళ్లూ చేసిన సైనిక, నిఘా సాయాన్ని హఠాత్తుగా నిలిపివేసిన వేళ జెలెన్స్కీ వైఖరిలో మార్పు రావడం గమనార్హం. ఒంటరిగా వచ్చిన జెలెన్స్కీ ఆనాడు ట్రంప్, జేడీ వాన్స్‌తో మాటల యుద్ధానికి దిగి దౌత్యమంటలు రాజేసిన నేపథ్యంలో అగ్రనేతల ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు ఈసారి ఫ్రాన్స్, బ్రిటన్ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాన మంత్రి కెయిర్ స్టార్మర్లు జెలెన్స్కీని అమెరికాను వెంటబెట్టుకుని తీసుకొచ్చి ట్రంప్‌తో సమాలోచనలు జరుపుతారని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ భేటీ ఎప్పుడనేది ఇంకా నిర్ధారణకాలేదు. ‘‘ఉక్రెయిన్, అమెరికా సంప్రదింపుల బృందాలు తదుపరి భేటీ కోసం తమ వంతు కృషిచేస్తున్నాయి. ఈ కృషిలో పురోగతి కనిపిస్తోంది’’ అని గురువారం తెల్లవారు జామున జెలెన్స్కీ ఒక ప్రకటనచేశారు. బుధవారం ట్రంప్‌కు జెలెన్స్కీ ఒక లేఖ రాయడం, ఆ లేఖాంశాన్ని ట్రంప్ అమెరికా పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో బుధవారం ప్రస్తావించడం తెల్సిందే. ‘‘అమెరికా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరితే వెంటనే యురోపియన్ సైనిక బలగాలను ఉక్రెయిన్‌కు పంపే వీలుంది. రష్యా దూకుడుకు ఈ బలగాలు అడ్డుకట్టవేస్తాయి. డీల్ కుదిరాక బలగాల మోహరింపుపై వచ్చే వారం పారిస్‌లో ఈయూ దేశాల సైనిక చీఫ్‌లతో చర్చలు జరుపుతాం’’ అని మాక్రాన్ చెప్పారు. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే!అమెరికా, ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరకపోతే యుద్ధ పరిస్థితులు అనూహ్యంగా తలకిందులవుతాయని యూరోపియన్ యూని యన్ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా నుంచి అన్ని రకాల సాయం నిలిచిపోతే, పెద్దన్న అమెరికాను కాదని ఈయూ దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేసే సాహసం చేయకపోతే తుదకు యుద్ధంలో రష్యాదే పైచేయి అవుతుంది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో అమెరికాకు బదులు రష్యాతో ఉక్రెయిన్ శాంతి ఒప్పందం చేసుకునే అవకాశముంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఉక్రెయిన్ను అమెరికాకు దగ్గరచేయాలని ఈయూ దేశాలు తామే పెద్దరికం తీసుకుని జెలెన్స్కీని అమెరికా రప్పించి ‘శాంతి, ఖనిజ ఒప్పందం’ కుదిరేలా చేయాలని భావిస్తున్నాయి. అందులోభాగంగా మాక్రాన్, స్టార్మర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. -
రూ.50 లక్షలు, బెంజ్ కారు కావాలి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ అత్యాశతో వరకట్నం కోసం కక్కుర్తి పడ్డారు. అలిగిన వరుడు, అతని తల్లితండ్రులు, బంధువులు పెళ్లి మండపం నుంచి పరారయ్యారు. ఈ వింత సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. న్యాయం చేయాలంటూ వధువు తండ్రి ఉప్పారపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాలేజీ నుంచి ప్రేమ వధువరులు ఇద్దరూ కాలేజీ రోజుల నుంచి స్నేహితులు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. గత ఏడాది జూలై నెలలో ఇండియాకు వచ్చిన యువతి ప్రేమ గురించి తల్లిదండ్రులకు తెలిపింది. ఇరువైపుల పెద్దలు మాట్లాడి గతేడాది జూలైలో నిశ్చితార్థం చేశారు. మార్చి 2న 2025లో వివాహం కూడా నిశ్చయించారు. గత ఫిబ్రవరి 17న షాపింగ్ కోసం ఫ్రాన్స్ నుండి ఢిల్లీకి వచ్చిన యువతి ఓ హోటల్లో బస చేసింది. ప్రియుడు ప్రేమ్ కూడా వచ్చి యూరోపియన్ సంస్కృతి ప్రకారం పెళ్లికి ముందే ఇద్దరూ శారీరకంగా కలవాలని కథలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. పొద్దున పెళ్లనగా గొడవ వివాహ వేడుకల కోసం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకూ బెంగళూరు గాందీనగర్‌లోని రైల్వే ఆఫీసర్స్ ఎన్‌క్లేవ్‌లోని నంది క్లబ్‌ని బుక్ చేశారు. 28న సంగీత్, మెహందీ వేడుకలను జరిపారు. మార్చి 1న రాత్రి వరుడు, తల్లితండ్రులు గొడవకు దిగారు. రూ.50 లక్షల నగదు, అర్ధ కేజీ బంగారం, ఒక బెంజ్ కారును కట్నంగా ఇవ్వాలని పట్టుబట్టారు. వధువు తండ్రి తన చేత కాదని చెప్పాడు. కొంతసేపటికి వరుని కుటుంబం మొత్తం పరారైంది. తెల్లవారితే జరగాల్సిన పెళ్లి జరగలేదు. ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడు ప్రేమ్, అతని తల్లిదండ్రులు శివకుమార్, రాధలపై కేసు నమోదు చేసుకున్నారు. -
పుతిన్ నియంత కాదు: ట్రంప్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ‘నియంత’ అని పిలవడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ‘పుతిన్‌ను నియంతగా భావిస్తున్నారా’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు. తాను ఆ పదాలను అంత తేలికగా ఉపయోగించనని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అనంతరం సోమవారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తెలివిగా వ్యవహరిస్తే ఉక్రెయిన్‌లో యుద్ధం తొందరగా ముగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.‘‘మనం స్మార్ట్ కాకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది. లేదంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించాల్సి ఉంటుందా అనేది కీలక చర్చనీయాంశమైంది. దీనిపై ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘‘సంప్రదింపులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే.. రష్యా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం సంతకం చేయడానికి త్వరలోనే జెలెన్స్కీ అమెరికా వస్తారని ఆశిస్తున్నా’’ అని ట్రంప్ పేర్కొన్నారు.ఏరోస్పేస్, వైద్య, సాంకేతిక పరిశ్రమలలో ఉపయోగించే కీలకమైన ఖనిజాలు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. అయితే.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కీవ్‌కు అందించిన 180 బిలియన్ డాలర్ల అమెరికన్ సహాయంలో కొంత భాగాన్ని భర్తీ చేయడానికి ఖనిజాలపై ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చల అనంతరం పుతిన్‌ను కలుస్తానని ట్రంప్ తెలిపారు. శాంతి ఒప్పందానికి పుతిన్ అంగీకరిస్తారని, అతను మరింత యుద్ధాన్ని కోరుకోవడం లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. శాంతి అంటే ఉక్రెయిన్ లొంగిపోవడం కాదు: మాక్రాన్ అయితే.. ఉక్రెయిన్ సార్వబౌమత్వాన్ని పణంగా పెట్టి ఏ శాంతి ఒప్పందం జరగకూడదని మాక్రాన్ స్పష్టం చేశారు. ఏ శాంతి ఒప్పందంలోనైనా భద్రతా హామీలు ఉండాలని, శాంతి అంటే ఉక్రెయిన్ లొంగిపోవడం కాదని మాక్రాన్ హెచ్చరించారు. ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షక దళాలను పంపే ప్రతిపాదనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి పనిచేస్తామని మాక్రాన్ తెలిపారు. సుస్థిరత్వాన్ని ఏర్పరచడానికి యూరప్ సిద్ధంగా ఉందని, ఆ శాశ్వత శాంతిని సాధించడానికి బలమైన అమెరికా జోక్యం అవసరమని మాక్రాన్ నొక్కి చెప్పారు. అట్లాంటిక్ విభేదాలున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడితో చర్చలు ముందుకు సాగాయని మాక్రాన్ నొక్కి చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక కొత్త దౌత్య అవకాశం లభించిందన్నారు. -
కోట్లు పంచుకుందాం.. టికెట్ ఇవ్వండి
పారిస్: రూపాయి రూపాయి నువ్వేం చేయగలవంటే?. బంధాలు, బంధుత్వాలను తుంచేస్తా అని చెప్పిందట. డబ్బు ఉందన్న అహంతో కొందరు తమ ఆత్మియులను ఆమడ దూరం పెట్టేసిన వైనాలు మనందరం చూశాం. అయితే అదే డబ్బు శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుందని ఫ్రాన్స్‌లోని ఓ ఘటన నిరూపించింది. సాధారణంగా మన పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేసిన వాళ్లు మనకు కనబడితే చితకబాదుతాం. కానీ ఫ్రాన్స్‌లో 40 ఏళ్ల ఓ వ్యక్తి మాత్రం తన క్రెడిట్ కార్డును కొట్టేసిన వ్యక్తులను అక్కున చేర్చుకునేందుకు తహతహలాడుతున్నాడు. ఇందులో ఒక ఆర్థిక కోణం, నగదు ప్రేమ దాగి ఉంది. ఈయన దగ్గర కొట్టేసిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన ఒక లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. ఏ లక్షో రెండు లక్షలో కాకుండా ఏకంగా రూ.4,53,00,000ల జాక్‌పాట్ తగిలింది. టికెట్ ఎలా చేజిక్కించుకోవాలి? జాక్‌పాట్ తగిలిన టికెట్‌ను కౌంటర్లో ఇచ్చేసి నగదుగా మార్చుకునే అవకాశం ఆ దొంగలకు లేదు. ఎందుకంటే సంబంధిత టికెట్ కొనుగోలు పత్రాలు వాళ్ల వద్ద లేవు. ఆ టికెట్ కొనేందుకు ఉపయోగించిన క్రెడిట్ కార్డ్ వాళ్లది కాదు. దొంగతనం చేశారు కాబట్టి ఒకవేళ టికెట్ పట్టుకుని కౌంటర్ వద్దకు వస్తే పోలీసులు పట్టుకెళ్తారు. దీంతో దొంగలు ఆ రూ. 4.53 కోట్ల విలువైన లాటరీటికెట్ను నగదుగా మార్చుకునే అవకాశం కోల్పోయారు. కానీ ఆ అవకాశం క్రెడిట్ కార్డ్ యజమాని అయిన జీన్ డేవిడ్.ఈ అనే వ్యక్తికి ఉంది. కానీ అతని వద్ద టికెట్ లేదు. ఇందుకు ఆయనో పథకం వేశారు. క్రెడిట్ కార్డ్ కొట్టేసిన దొంగలపై ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ‘‘నా క్రెడిట్ కార్డులు దొంగలించిన మీపై నాకు ఇప్పుడు కోపం లేదు. గతంలో మీపై పోలీస్ కేసు పెట్టాను. కావాలంటే ఆ కేసును ఇప్పుడు ఉపసంహరించుకుంటా. అయితే మీరు ఆ లాటరీ టికెట్‌ను నాకు ఇచ్చేయండి. కావాలంటే అందులో సగం మొత్తాన్ని మీకు వాటాగా ఇచ్చేస్తా’’అని ఒక చక్కటి ఆఫర్ ఇచ్చారు. అయితే ఇంకా తమ కౌంటర్ వద్దకు ఎవరూ రాలేదని లాటరీ నిర్వహణ సంస్థ లా ఫ్రాంకైస్ డీస్ జీయక్స్(ఎఫ్‌డీజే) శనివారం ప్రకటించింది. ఆలసించిన ఆశాభంగం క్రెడిట్ కార్డ్ యజమాని జీన్ డేవిడ్ తన లాయర్ ద్వారా మరోసారి ఒక సవివరమైన ప్రకటన ఇప్పించారు. ‘‘ఆ ఇద్దరు దొంగలు లేకుండా ఈ లాటరీ విజయం సాధ్యమయ్యేదే కాదు. వాళ్లు టికెట్ కొన్నారు కాబట్టే ఇవాళ ఇంత సొమ్ము మన పరం అయ్యే సదవకాశం దక్కింది. అందుకే దొంగల్లారా.. దయచేసి ఆ లాటరీ టికెట్ మాకు ఇచ్చేయండి. మీ వద్ద ఉన్నా అది మీకు ఉపయోగపడదు. మాకు ఇచ్చేస్తే మీకూ అందులో వాటా తప్పకుండా ఇస్తాం. డీల్ కుదుర్చుకుందాం. మా ఆఫీస్‌కు వచ్చేయండి. మీరు ఆలస్యం చేస్తే ఆ టికెట్‌ను నగదుగా మార్చుకునే క్లెయిమ్ గడువు తీరిపోతుంది. అప్పుడు మనందరికీ దక్కేది సున్నా. కాలం మించిపోతోంది. సమయం లేదు మిత్రమా. త్వరగా వచ్చి ఒడంబడిక చేసుకుని డబ్బు తీసుకెళ్లండి. ఆ డబ్బుతో మేం సెటిల్ అవుతాం. మీరూ సెటిల్ అవ్వండి’’అని లాయర్ పియరీ డెబూసన్ చెప్పారు. ఈ వింత ప్రకటన చూసి ఫ్రాన్స్ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చినట్లు పోస్ట్‌లు పెడుతున్నారు.సిటీలో కొట్టేసి.. టౌలూస్ నగరానికి చెందిన జీన్ డేవిడ్ ఫిబ్రవరి మూడో తేదీన కారులో తన బ్యాక్‌ప్యాక్‌ను ఉంచేసి వెళ్లాడు. కారు తెరచి దొంగలు ఆ బ్యాక్‌ప్యాక్‌ను, అందులోని పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేశారు. ఆ కార్డుతో ఒక చిల్లర దుకాణంలో లాటరీ టికెట్ కొన్నారు. ‘‘ఇల్లూ, చెప్పుకోవడానికి అడ్రస్ కూడా లేని ఇద్దరు వ్యక్తులు మా దుకాణానికి వచ్చి కాంటాక్ట్‌లెస్ విధానంలో 52.50 యూరోలతో ఒక లాటరీ టికెట్, మరికొన్ని సిగరెట్లు కొన్నారు. టికెట్ కొన్న ఆనందంలో వాళ్లు సిగరెట్లు కూడా మర్చిపోయి వెళ్లారు’’అని టబాక్ దిస్ థెర్మాస్ దుకాణ యజమాని చెప్పారు. -
మోదీ విదేశీ పర్యటన.. విమానానికి బెదిరింపులు..
ముంబై: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో, రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఫోన్ చేసిన వ్యక్తిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా ఫేక్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటన సందర్భంగా బెదిరింపు కాల్ రావడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబై కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని వారు బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఈ సమాచారాన్ని భద్రత అధికారులకు చేరవేశారు. దీంతో, అలర్ట్ అయ్యారు. అనంతరం, ఫోన్ కాల్ చేసిన వ్యక్తని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో అతడి మానసిక స్థితి సరిగాలేదని నిర్ధారించారు. ఇక, ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.ఇదిలా ఉండగా.. భారత ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన ఫ్రాన్స్, అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే మోదీ.. ఫ్రాన్స్‌లో పర్యటించి ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, అమెరికాలో పర్యటనలో భాగంగా మోదీ నేడు వాషింగ్టన్ చేరుకోనున్నారు. రేపు(గురువారం) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు. On 11th February, a call was received at Mumbai Police Control Room warning that terrorists may attack PM Modi's aircraft as he was leaving on an official visit abroad. Considering the serious nature of the information, the Police informed other agencies and began an…— ANI (@ANI) February 12, 2025 -
ఫ్రాన్స్ పిలుస్తోంది.. భారత విద్యార్థులకు శుభవార్త
పారిస్: మూడు రోజుల ఫ్రెంచ్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడంతో ఇప్పుడు అందరి దృష్టి పారిస్ వైపు మళ్లింది. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఆరోసారి. అధ్యక్షుడు మాక్రాన్‌తో కీలక రక్షణ, అణు ఇంధన ఒప్పందాలపై సంతకాలు చేసి భారత్ –ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నారు. ఇవన్నీ పక్కన పెడితే భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి అనుకూలమైన విద్యార్థి వీసా, వర్క్ పర్మిట్లను పారిస్ ప్రకటిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.ఇంతకుముందు బిగ్ ఫోర్‌గా పేరుగాంచిన అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా దేశాలు భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి తొలు నాలుగు గమ్యస్థానాలుగా ఉండేవి. ఇటీవలి కాలంలో ఈ ధోరణి మారింది. యూరప్ దేశాలు ముఖ్యంగా ఫ్రాన్స్ భారతీయ విద్యార్థులకు టాప్ చాయిస్‌గా మారింది. హెచ్ఈసీ పారిస్ బిజినెస్ స్కూల్, సోర్బోన్ విశ్వవిద్యాలయం, ఎకోల్ పాలిటెక్నిక్ వంటి 75 కి పైగా ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, వ్యాపారం, కళలు, సాంకేతికత, శాస్త్రాలలో అగ్రశ్రేణి ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య పట్ల భారతీయ విద్యార్థులకు మక్కువ ఎక్కువైంది.2023–24 విద్యా సంవత్సరంలో 7,344 మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లోని విద్యాసంస్థల్లో చేరారు. 2030 నాటికి ఈ సంఖ్య 200 శాతం పెరుగుతుందని అంచనా. 2024 జనవరిలో రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారతీయ విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. 2030 నాటికి భారత్ నుంచి 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించడమే తమ దేశ లక్ష్యమని ఆనాడు మాక్రాన్ తన మనసులో మాట చెప్పారు. ఇటీవల వేలాది మంది భారతీయ విద్యార్థులతో అభిప్రాయాలతో రూపొందిన క్యూఎస్ నివేదిక ప్రకారం ఫ్రాన్స్ తమ ఇష్టమైన గమ్యస్థానమని 31 శాతం మంది భారతీయ విద్యార్థులు చెప్పడం విశేషం. భారతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది ఫ్రాన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 21 శాతం మంది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు.ఫ్రెంచ్ నేర్చుకుంటే.. ట్రంప్ రాకతో మారిన అమెరికా విధానాలు, నిజ్జర్ ఉదంతంతో భారత్–కెనడా మధ్య సత్సంబంధాలు సన్నగిల్లిన నేపథ్యంలో భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ తన వీసా ప్రక్రియలను సరళతరం చేస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులను ఆకట్టుకోవడానికి ఫ్రెంచ్‌తోపాటు ఇంగ్లీష్ భాషలోనూ కోర్సులను అందిస్తోంది. అంతర్జాతీయ తరగతుల ద్వారా ఫ్రెంచ్ బోధిస్తూ అది పూర్తి చేసిన వారికి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌కు అనుమతిస్తోంది. దీనివల్ల విదేశీ విద్యార్థులకు ఫ్రెంచ్ భాషలో బోధించే 200కి పైగా విద్యా కార్యక్రమాల్లో అవకాశం లభిస్తుంది. అనేక ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉండి, ఫ్రాన్స్‌లో ఒక సెమిస్టర్ చదివిన భారతీయ విద్యార్థులు ఐదేళ్ల షార్ట్–స్టే స్కెంజెన్ వీసా పొందేందుకు అర్హులు అవుతారు. ఫ్రెంచ్ మాస్టర్స్ డిగ్రీతో పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రెండేళ్ల పోస్ట్–స్టడీ వర్క్ వీసాను కూడా ఫ్రాన్స్ అందిస్తుంది. ఈ వీసాను మొత్తం రెండేళ్లపాటు జారీ చేస్తారు. దీంతో భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు.ఖర్చు తక్కువ..భారతీయ విద్యార్థులను ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాల వైపు నడిపించిన అంశాలు అనేకం ఉన్నాయి. ఫ్రెంచ్ ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయి. బిజినెస్, డేటా అనలిటిక్స్, ఫ్యాషన్‌తోపాటు విస్తృతమైన కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య ఖర్చు మిగతా బిగ్‌ఫోర్ దేశాలతో పోలిస్తే తక్కువ. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉంటాయి. చార్పాక్, ఈఫిల్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ వంటి అనేక ఆర్థిక సహాయ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపడతారు. భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 15 కోట్ల రూపాయలకు పైగా ఉపకార వేతనాలను ఫ్రాన్స్ అందిస్తోంది. ఫ్రాన్స్‌లో జీవన వ్యయం కూడా తక్కువే. పారిస్‌లో నెలకు సగటున రూ.1.54 లక్షలు, లియోన్‌లో రూ.1.01 లక్షలు వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇతర నగరాల్లో సగటు జీవన వ్యయం నెలకు లక్ష రూపాయల కన్నా తక్కువ. ఫ్రాన్స్‌లోని విశ్వవిద్యాలయాలు చాలా మంచి ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. -
మోదీ ఫ్రాన్స్ టూర్: PM Modi
-
10న ఫ్రాన్స్‌కు.. 12న అమెరికాకు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)విదేశీ పర్యటన(foreign tour) ఖరారయ్యింది. ఆయన ఈ నెల 10 నుంచి 12వ తేదీ దాకా ఫ్రాన్స్‌లో(France)12, 13వ తేదీల్లో అమెరికాలో(America) పర్యటిస్తారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో కలిసి కృత్రిమ మేధ(ఏఐ) కార్యాచరణ సదస్సులో మోదీ పాల్గొంటారని చెప్పారు. అలాగే ఇండియా–ఫ్రాన్స్ సీఈఓల సదస్సుకు హాజరవుతారని అన్నారు. ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పరిమెంటల్ రియాక్టర్‌ను మోదీ సందర్శిస్తారని వెల్లడించారు.అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి సమావేశమవుతారని పేర్కొన్నారు. మోదీ పర్యటనతో భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని తెలియజేశారు. ఇరుదేశాల మధ్య పరస్పర సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలు, కీలక రంగాల్లో భాగస్వామ్యంపై మోదీ, ట్రంప్ చర్చిస్తారని వివరించారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కొలువుదీరిన మూడు వారాల్లోపే నరేంద్ర మోదీకి ఆహ్వానం అందిందని అన్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా ట్రంప్ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించిందని చెప్పారు. ఇండియాతో భాగస్వామ్యానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదొక ప్రతీక అని విక్రమ్ మిస్త్రీ వివరించారు. ట్రంప్‌ను ఒప్పిస్తారా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా అమెరికాలో అడుగుపెట్టబోతున్నారు. వారిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదార్లను వెనక్కి పంపిస్తున్న సమయంలో మోదీ, ట్రంప్ సమావేశం కాబోతున్నారు. భారత్–అమెరికా మధ్య వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై వారు విస్తృతంగా చర్చించబోతున్నట్లు సమాచారం. ఇరు దేశాల నడుమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇంధన భద్రత, కృత్రిమ మేధ(ఐఏ) వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకొనేలా నిర్ణయం తీసుకోవచ్చు. అక్రమ వలసదార్ల సమస్యను పరిష్కరించే విషయంలో ట్రంప్ ప్రభుత్వం చురుగ్గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీతో భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే వీలుంది. భారతీయ అక్రమ వలసదార్లపై కఠినంగా వ్యవహరించకుండా మోదీ తన మిత్రుడైన ట్రంప్‌ను ఒప్పిస్తారా? అనేది వేచి చూడాలి. అమెరికాలో ఎలాన్ మస్క్ సహా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోదీ సమావేశం కానున్నారు. ట్రంప్ ప్రియమిత్రుడు..మోదీ గొప్ప నాయకుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో మాట్లాడిన అతికొద్ది మంది ప్రపంచ దేశాల నేతల్లో మోదీ కూడా ఉన్నారు. గతవారం కూడా ఇరువురు నేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. వలసలు, భద్రత, వాణిజ్య సంబంధాలపై వారు చర్చించుకున్నారు. ట్రంప్, మోదీ మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని వైట్‌హౌస్ ప్రకటించింది. ట్రంప్‌తో మోదీకి చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ తనకు ప్రియమిత్రుడు అని మోదీ చెబుతుంటారు. మోదీ గొప్ప నాయకుడు అని ట్రంప్ సైతం ప్రశంసించారు. అయితే, ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు అధికంగా విధిస్తున్నారని ట్రంప్ ఆక్షేపించారు. ఇండియాను టారిఫ్ కింగ్‌గా అభివరి్ణంచారు. గత వారం భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం కనిపించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల మోటార్ సైకిళ్లతోపాటు పలు ఉత్పత్తులపై టారిఫ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. మోదీ చివరిసారిగా 2024 సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించారు. క్వాడ్ దేశాల అధినేతల సదస్సులో పాల్గొన్నారు. -
భార్యకు మత్తిచ్చి.. ఏకంగా పదేళ్లపాటు పలువురితో సామూహిక అత్యాచారం
ఒక సామూహిక అత్యాచార కేసు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆమె కథలోని భయంకర నిజాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఆమెను జీవచ్ఛంగా మార్చి, స్వయంగా భర్తే పలువురితో (72మందికిపైగా) దాదాపు పదేళ్ల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సభ్య సమాజాన్ని నివ్వెర పర్చింది. ఈ కేసును విచారించిన కోర్టు జెసిల్ మాజీ భర్తకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దోషులుగా తేలిన మరో 51 మందికి కూడా శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులోని షాకింగ్ విషయాలు ఇలా ఉన్నాయిజెసిల్ పెలికో కేసు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడం మాత్రమే కాదు, ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అత్యాచార కేసు కావడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. జెసిల్ ఫెలికో భర్త డొమినిక్ పెలికో. జిసిల్కు ముగ్గురు పిల్లలు, మనవలు మనవరాళ్లు కూడా ఉన్నారు. 57 ఏళ్ల వయసులో ఉండగా భర్త ఎవ్వరూ ఊహించని విధంగా ఆమెపై భయంకరమైన అఘాయిత్యాలకు పాల్పడ్డాడు.తన భార్యపై అత్యాచారానికి రావాల్సిందిగా ఆన్లైన్ చాట్ రూమ్స్ ద్వారా ఆహ్వానం పలికాడు. ఇలా వచ్చిన వాళ్లు 20-72 వయస్సున్నవారున్నారు. ఇలా ఒకటి రెండూ కాదు ఏకంగా పదేళ్ల పాటు, భార్యకు మత్తుమందు ఇచ్చి తన అకృత్యాన్ని కొనసాగించాడు. ఈ విషయాలను చిత్రీకరించి, భద్రపరిచాడు కూడా. ఈ నేరానికి పాల్పడిన వారిలో కొందరు ఒక్కసారి, మరికొందరు ఆరుసార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే బాధితురాలు పూర్తి అచేతనంగా, దాదాపు కోమాలాంటి పరిస్థితిలో ఉండగా జరిగినట్టు పోలీసులు ధృవీకరించుకున్నారు.అయితే ఇంత జరుగుతున్నా, అనేక సార్లు తీవ్ర అనారోగ్యానికి గురైనా ఆమెకు ఏమాత్రం తెలియలేదు. ఆమెకు తనపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి 2020లో పోలీసుల ద్వారా మాత్రమే తెలిసింది.వెలుగులోకి ఎలా వచ్చింది2020లో ఒక షాపింగ్ మాల్లో యువతులపై అభ్యంతరంగా వీడియో చూస్తున్న క్రమంలో పోలీసులు అతగాణ్న అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా పోలీసులు విచారణలో తాను చేసిన మొత్తం దురాగతాల్ని బహిర్గతం చేశాడు. దీంతో విచారణాధికారులే నివ్వెరపోయారు. అతని ల్యాప్‌టాప్‌లో వేల వీడియోలను కనుగొన్నారు, దాదాపు 200 అత్యాచారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని అంతటినీ ‘అబ్యూజ్’అనే ఫోల్డర్లో స్టోర్ చేసి పెట్టాడు. ఈ వీడియోలను పోలీసులు జెసికా(ఆమె అనుమతి మేరకు) చూపించారు. దీంతో ఆమె కదిలిపోయింది. తనపై అత్యాచారం చేసిన వాళ్లలో తన మనవడు వయస్సున్న వాడు ఉన్నాడంటూ తీరని ఆవేదనకు గురైంది జెసికా. దాదాపు ఇదే తరహాలో కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. అయితే వీటిని డొమినిక్ ఖండించాడు.ఈ కేసు విచారణ సందర్బంగా వందలాదిమంది ఆమెకు మద్దతుగా కోర్టుకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తీర్పుకోసం ఎదురు చూశారు. అనేకమంది స్త్రీవాద గీతాలను ఆలపించారు. అటు జెసికా ముగ్గురు పిల్లలు కూడా కోర్టు ఆవరణలో తీర్పు వెలువరిస్తున్న సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. యుక్తవయస్సులో ఉన్న ఆమె మనవడు తొలిసారి ఆమె పక్కన నిలబడి, ఆమె మీడియాను ఉద్దేశించి ఆమె భుజంపై చేయి భరోసా ఇచ్చాడు. అయితే దోషులకు విధించిన శిక్షలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.71 ఏళ్ల జెసిల్ పెలికా మీడియాతో ఈ విచారణ సందర్భంగా జెసికా మాటలు ఆమెలోని అంతులేని ఆవేదనతోపాటు, తెగువకు నిదర్శంగా నిలిచాయి. నేరస్తులు సిగ్గుపడాలి తప్ప, తానెందుకు కృంగిపోవాలని అంటూ ధైర్యంగా ముందుకొచ్చింది ఇంతటి ఘోరం సమాజానికి తెలియాలి తన గొంతును వినిపించింది. ఇలాంటివి మరో చోట మరొకరికి జరగకూడదని నినదించింది. అంతేకాదు అత్యాచారాలకు ఆడవాళ్ల వేషధారణే, వారి వ్యవహారమే కారణమన్న వాదనను గట్టిగా తోసిపుచ్చింది. స్త్రీల పట్ల చాలా మంది పురుషుకున్న ఇలాంటి అసహ్యకరమైన వైఖరి మారాలని నినదించింది. దీనిపై చర్చ జరగాలని, ఈ కేసుపై నిజా నిజాలు ప్రపంచానికి తెలియజెప్పాలని కూడా మీడియాను కోరింది. తనపై జరిగిన దుర్మార్గంపై బహిరంగ విచారణ జరగాలని కోరుకున్న ధీర ఆమె.2021లో పోలీసులు తమ ప్రాథమిక విచారణను నిర్వహించినప్పుడు అరెస్టయిన దోషుల్లో చాలా మంది ఇప్పటికే జైలు జీవితం గడిపారు. కనుక కొంతమంది త్వరలో విడుదల కానున్నారు. మరోవైపుతాజా తీర్పుపై అప్పీల్లా? వద్దా? అనేది ఆలోచిస్తున్నానని డొమినిక్ న్యాయవాది తెలిపారు. అప్పీల్‌కు వెళ్లేందుకు 10 రోజుల సమయం ఉంది. గత వారం (డిసెంబరు 19)న తీర్పు వెలువడినప్పటి నుండి, పారిస్ ఆసుపత్రి హెల్ప్‌లైన్ నెంబర్లు కాల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిందట. -
వావ్, వావ్..యానివర్సరీ వీక్ అంటే ఇలా, మంచు పూల జల్లుల్లోన (ఫోటోలు)
-
90 ఏళ్ల తర్వాత.. గడగడలాడించిన చిడో తుపాన్
పారిస్ : చిడో తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. హిందు మహాసముద్రంలో ఏర్పడిన చిడో తుపాను తీవ్రతతో మయోట్ ద్వీపంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులైనట్లు ఫ్రాన్స్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.తుపాను కారణంగా గంటకు దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు ద్వీపాన్ని అతలా కుతలం చేశాయి. ఫలితంగా తాత్కాలిక గృహాలు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ గాలుల ప్రభావం వల్ల ప్రాణ,ఆస్తినష్టం భారీ ఎత్తున జరిగిందని అన్నారు.గత 90 ఏళ్లలో మయోట్‌ను తాకిన అత్యంత భయంకరమైన తుపాను ఇదేనని అధికారులు చెప్పారు. ఫ్రాన్స్ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఆదివారం ఉదయం చిడో తుఫాన్ ప్రారంభంలో 11మంది మరణించగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు ధృవీకరించింది. అయితే మరణాలు, గాయపడ్డ వారి సంఖ్య సోమవారం ఉదయం నాటికి గణనీయంగా పెరిగినట్లు అంచనా వేసింది. 🚨 Intense Tropical #CycloneChido hit Cabo Delgado, Nampula & Niassa early Sunday with winds over 200km/h & heavy rains, impacting an estimated 1.7M people in 🇲🇿IOM, govt & partners are on the ground, assessing needs & coordinating early response, with PSEA measures reinforced. pic.twitter.com/KUd1N5Zbkb— IOM Mozambique (@IOM_Mozambique) December 15, 2024 శనివారం తుఫాను కారణంగా మయోట్ ద్వీపం పూర్తిగా దెబ్బ తిన్నదని, జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎంతనేది అంచనా వేయడం కష్టంగా ఉందన్నారు. ఫ్రాన్స్ రెస్క్యూ టీమ్‌లు.. మెడిసిన్, ఆహారంతో పాటు ఇతర నిత్యవసర వస్తువుల్ని ద్వీపానికి తరలించినట్లు మయోట్ ద్వీప ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. -
అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా..
పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని, బ్రహ్మదేవుని నిర్ణయం ప్రకారం ఎవరెవరి ఎప్పుడు, ఎవరితో వివాహం జరగాలో నిశ్చయమవుతుందని అంటారు. ఆలోచిస్తే ఇది కొందవరకూ నిజమేనని అనిపిస్తుంది. హర్యానావాసి అమిత్, ఫ్రాన్స్‌కు చెందిన సీసెల్ జంటను చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..హర్యానాలోని పల్వాల్ జిల్లాలోని కలువా గ్రామానికి చెందిన అమిత్ నర్వార్(30) ఫ్రాన్స్ యువతి సీసెల్ను వివాహమాడటం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 12న వీరి వివాహం పాల్వాల్‌లోని విష్ణు గార్డెన్లో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సందర్భంగా విదేశీ వధువును చూసేందుకు ఊరిజనమంతా తరలివచ్చారు. ఈ సందడిలో సదరు విదేశీ యువతి తన భర్త, అత్తామామలతో కలసి నృత్యం చేసి అందరినీ అలరించారు. అమిత్ నర్వార్ ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో 2019లో యోగా టీచర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో అతని దగ్గర యోగా నేర్చుకునేందుకు ఫ్రాన్స్ నుంచి సీసెల్ మార్లీ వచ్చారు. ఈ కోర్సు రెండు నెలల పాటు సాగింది. ఈ నేపధ్యంలో అమిత్, సీసెల్ ప్రేమలో పడ్డారు. యోగా కోర్సు ముగిసిన అనంతరం సీసెల్ తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోయారు. ఆ తరువాత వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకోసాగారు.ఇదిలా ఉండగా అమిత్ కుటుంబ సభ్యులు అతనికి మరో యువతితో వివాహం చేయాలనుకున్నారు. అయితే అమిత్ తన ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో అమిత్ చేస్తున్న ఉద్యోగాన్ని, ఇంటిని విడిచిపెట్టి 2022లో ఫ్రాన్స్‌కు వెళ్లారు. అప్పటికే సీసెల్ అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. డబ్బుకు ఇబ్బంది లేకపోవడంతో అమిత్, సీసెల్ లివ్ ఇన్ రిలేషన్ షిప్లో 2022 నుంచి 2024 వరకు ఉన్నారు. ఇదే సమయంలో సీసెల్ తండ్రి క్యాన్సర్‌తో మరణించారు. ఆ తర్వాత సీసెల్, అమిత్‌లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇరు కుటుంబాలవారికీ చెప్పారు. వారు ఓకే చెప్పడంతో సీసెల్ తమ కుటుంబసభ్యులతో సహా భారతదేశానికి వచ్చారు. డిసెంబర్ 12న అమిత్, సీసెల్ల వివాహం ఘనంగా జరిగింది.ఇది కూడా చదవండి: Vallabhbahi Patel: ‘ఉక్కు మనిషి’ చివరి రోజుల్లో.. -
ఫ్రాన్స్ ప్రధానిగా ఫ్రాంకోయిస్
ప్యారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇ మ్మానుయేల్ మాక్రాన్ శుక్ర వారం అధికార కూటమికి చెందిన నేత ఫ్రాంకోయిస్ బైరూ పేరు(73)ను ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించారు. గత వారం నేషనల్ అసెంబ్లీ పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో ఓడిపోవడంతో మైకేల్ బెర్నియర్ ప్రభుత్వం గద్దె దిగడం తెలిసిందే. ఫ్రాన్సు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న బైరూ అందరికీ తెలిసిన వ్యక్తి. పార్లమెంట్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో తలెత్తిన అస్థిర పరిస్థితులను చక్కదిద్దే సత్తా బైరూకు ఉందని భావిస్తున్నారు. -
అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి
నోట్రే డామ్ క్యాథలిక్ చర్చి.. ఇది ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లోగల ఒక ప్రధాన క్యాథలిక్ చర్చి. దీనిని నోట్రే డామ్ కేథడ్రల్ అని కూడా పిలుస్తారు. ఐదేళ్ల క్రితం ఈ చర్చిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎగసిపడిన మంటల కారణంగా చర్చి తీవ్రంగా దెబ్బతింది.నోట్రే డామ్ క్యాథలిక్ చర్చి ప్రత్యేక నిర్మాణశైలి, మతపరమైన ప్రాముఖ్యత, చారిత్రక సంఘటనల పరంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ చర్చిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు పారిస్‌కు తరలి వస్తుంటారు.నోట్రే డామ్ నిర్మాణం 12వ శతాబ్దంలో ప్రారంభమై, 14వ శతాబ్దంలో పూర్తయింది. చర్చి గోపురం గోతిక్ శైలిలో నిర్మితమయ్యింది. ఇది ఆకాశం అంత ఎత్తుకు ఉన్నట్లు కనిపిస్తుంది.ఈ చర్చి నిర్మాణాన్ని 1163లో బిషప్ మారిస్ డి సుల్లీ చేపట్టారు. 1345లో ఈ చర్చిని ప్రారంభించారు. చర్చి వెలుపలి భాగంలో ఉన్న గార్గోయిల్లు ప్రత్యేకమైన శిల్పశైలిలో కనిపిస్తాయి.నోట్రే డామ్ కాథలిక్ చర్చి క్యాథలిక్ మతాన్ని అనుసరించేవారికి ఒక ముఖ్యమైన మతపరమైన ప్రదేశం. ఇక్కడ తరచూ మతపరమైన వేడుకలు జరుగుతుంటాయి.ఈ చర్చి కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు. చరిత్ర, కళ, సంస్కృతికి చిహ్నంగానూ నిలిచాయి. ఈ చర్చి నెపోలియన్ పట్టాభిషేకం, జోన్ ఆఫ్ ఆర్క్ పునరుద్ధరణలాంటి పలు చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది.2029, ఏప్రిల్ 15న నోట్రే డామ్ చర్చిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చర్చి ప్రధాన గోపురం, పైకప్పు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తదనంతరం చర్చికి మరమ్మతులు చేపట్టారు. అదే రీతిలో పునర్నిర్మించడానికి సమయం పట్టింది.ఈ చర్చి విశిష్ట వాస్తుశిల్పం, చారిత్రక ప్రాముఖ్యత రీత్యా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది. అగ్ని ప్రమాదం తర్వాత పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాక చర్చి ఇప్పుడు తిరిగి అద్భుతమైన రూపంలో కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ -
శతాబ్దాల ఖ్యాతి.. సమున్నతం
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో 861 సంవత్సరాల చరిత్ర కలిగిన నోట్రే డామ్ చర్చి మళ్లీ పునరుజ్జీవనం చెందింది. ఐదేళ్ల క్రితం భారీ అగ్నిప్రమాదంలో పాక్షిక్షంగా ధ్వంసమై కోట్లాది క్రైస్తవ భక్తుల్లో ఆవేదన మిగిల్చిన ఈ చర్చి మళ్లీ ప్రార్థనలకు సిద్ధమైంది. అప్పట్లో దీని పూర్తి నిర్మాణానికి ఏకంగా 200 ఏళ్లు పట్టిందని చెబుతారు. విభిన్నమైన డిజైన్, విశిష్ట నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ చర్చికి మళ్లీ ఆ రూపం తేవడం చాలా కష్టమని నిర్మాణ రంగ నిపుణులే పెదవి విరిచారు. అయినా ఫ్రాన్స్ ప్రభుత్వం వెరవకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన చర్చికి ప్రాణప్రతిష్ట చేసింది. కేవలం ఐదేళ్లలో ఏకంగా రూ.6,350 కోట్ల భారీ వ్యయంతో నాణ్యతో రాజీ పడకుండా అదే స్థాయిలో పునరుద్ధరించింది. శనివారం చర్చి పునఃప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, బ్రిటన్ యువరాజు విలియంసహా దాదాపు 50 దేశాలకు చెందిన అధి పతులు, రాజులు, సెలబ్రిటీలు, వివిధ దేశాల నుంచి 170 మంది బిషప్‌లు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. రికార్డు సమయంలో చర్చిని అందుబాటులోకి తేవడంలో కార్మికుల అంకితభావం దాగుందని మేక్రాన్ జాతి నుద్దేశించి ప్రసంగంలో చెప్పారు. కోర్సియా పర్యటనలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన లేదు. 2,000 మంది నిపుణులతో.. 2019 ఏప్రిల్ 15న ఘోర అగ్నిప్రమాదంలో చర్చి పై కప్పు, శిఖరం, అంతర్గత దారు నిర్మాణాలన్నీ కాలి బూడిదయ్యాయి. షాట్ సర్క్యూటో, కాల్చేసిన సిగరెట్ పీకో ఇందుకు కారణమంటారు. చర్చి పునఃనిర్మాణ వ్యయాన్ని భరిస్తామంటూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ముందుకొచ్చారు. వేలాది కోట్ల విరాళాలిచ్చారు. చర్చి నిర్మాణ ఖర్చంతా ఇలా సమకూరిందే! పునర్నిర్మాణ క్రతువులో ఏకంగా 2,000 మంది నిపుణులు భాగస్వాములయ్యారు. అత్యంత నాణ్యమైన కలపను ఇచ్చే 2,000 ఓక్ చెట్ల నుంచి సేకరించిన కలపను ఈ నిర్మాణంలో వాడారు. భారీ సంగీత విభావరితో.. చర్చి ప్రారంభోత్సవంలో భాగంగా ప్రముఖ సంగీతకళాకారులతో భారీ సంగీత విభావరి నిర్వహించారు. ఒపెరా గాయకులు ప్రెటీ యేండీ, జూలీ ఫచ్, పియానిస్ట్ లాంగ్ లాంగ్ తదితరుల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. పారిస్‌లోని సీన్ నదీ తీరం వెంట ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ తెరల్లో కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంచేశారు. ప్రత్యక్షంగా 40,000 మంది, పరోక్షంగా కోట్లాది మంది వాటిని వీక్షించనున్నారు. ఆరుబయట కార్యక్రమం నిర్వహిద్దామనుకున్నా భారీ ఈదురుగాలుల వల్ల లోనికి మార్చారు. ఆదివారం నుంచి చర్చిలో ప్రార్థనలను అనుమతిస్తారు.సామ్యవాదంతో సంబంధం మతసంబంధ ప్రదేశంగా మాత్రమే గాక ఫ్రాన్స్ రాజకీయాలతోనూ నోట్రేడామ్ చర్చి ముడిపడి ఉంది. ఫ్రెంచ్ విప్లవానికి, రెండు ప్రపంచయుద్ధాలకు ఇది సజీవ సాక్షి. 1302లో రాజు నాలుగో ఫిలిప్ ఎస్టేట్ చట్టాన్ని ఈ చర్చిలోనే చర్చించి ఖరారు చేశారు. పన్నులు, రాజ్య పరిపాలనపై ఇక్కడే నిర్ణయాలు జరిగాయి. రోడ్లన్నీ రోమ్‌కే దారి తీస్తాయి (ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్) అనే సామెతకూ ఈ చర్చే మూలం. రోమన్ సామ్రాజ్యంలో రోడ్లన్నీ ఈ చర్చి సమీపంగా వెళ్లాలని చక్రవర్తి అగస్టస్ ఆదేశించారు. ప్రత్యేకతలెన్నో..→ పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లో నోట్రేడామ్ చర్చి ఒకటి. → ఫ్రాన్స్ చరిత్ర, సాంస్కృతిక వైభవంలో ఈ చర్చిది కీలక పాత్ర. → దీన్ని ఏటా ఏకంగా 1.3 కోట్ల మంది విదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు. → ఈఫిల్ టవర్ కంటే ఈ చర్చిని చూడ్డానికి పారిస్‌లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ. → సీన్ నదిలో అత్యంత చిన్న ద్వీపమైన ‘ ది లే డీ లా సిట్’లో ఈ అద్భుత చర్చి నిర్మాణాన్ని నాటి బిషప్ మారీస్ డి సలీ ఆదేశాల మేరకు 1163లో పూర్తి చేశారు. → 64 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ చర్చి 12వ శతాబ్దం దాకా యూరప్ ఖండంలో అతి పెద్ద మానవ నిర్మాణం. → మేరోవియన్, కారోవియన్, రోమన్ల, గోథిక్ నిర్మాణ శైలిలో దీనిని కట్టారు. → మన తల కంటే ముంజేయి పొడవు సరిగ్గా 1.61803399 రెట్లు పెద్దగా ఉంటుందని గణిత సూత్రం. దీన్నే గోల్డెన్ రేషియో అంటారు. → చర్చి నిర్మాణంలో ఈ గణిత సూత్రాన్ని అణువణువునా వాడారు. చర్చిలో అంతర్నిర్మాణాల మధ్య కూడా ఇవే కొలతలను పాటించడంతో ఏ వైపు నుంచి చూసినా చర్చి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్రాన్స్ అమ్మాయి.. గొల్లపల్లి అబ్బాయి
హిందూపురం: ప్రేమకు హద్దులు లేవని ఓ జంట నిరూపించింది. ఫ్రాన్స్ దేశస్తురాలైన ఆడ్ సవివ్, శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గొల్లపల్లికి చెందిన గొల్లసందీప్ యాదవ్ శుక్రవారం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలో హిందూపురంలో ఘనంగా జరిగింది. గొల్లపల్లికి చెందిన సామాన్య రైతు కేశప్ప, గంగమ్మ 11వ సంతానమైన సందీప్ యాదవ్ ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సీఎన్‌ఆర్‌లో సైంటిస్ట్‌గా స్థిరపడ్డారు. అక్కడ గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఫ్రాన్స్ దేశస్తురాలు ఆడ్ సవివ్తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. సందీప్ యాదవ్ అన్న ‘అక్షరమాల’ శ్రీనివాసులు పెళ్లి పెద్దగా వ్యవహరించారు. -
దిక్కులు చూస్తున్న ఫ్రాన్స్!
యూరప్ దేశాల్లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోతున్న ఫ్రాన్స్ సంక్షోభం నుంచి సంక్షోభానికి ప్రయాణిస్తున్నది. దేశాన్ని చుట్టుముట్టిన అనిశ్చితి పోవాలంటే ఎన్నికలొక్కటే మార్గమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్ ఆర్నెలల క్రితం భావించి పార్లమెంటు రద్దుచేశారు. కానీ మొన్న జూలైలో నిర్వహించిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాకపోవటంతో సమస్య మొదటికొచ్చింది. దిక్కుతోచని స్థితిలో రెండు నెలల అనంతరం మైకేల్ బార్నియర్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. కానీ అది మూడునెలల ముచ్చటైంది. ఆరు దశాబ్దాల చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా పతనమైన తొలి ప్రభుత్వం బార్నియర్ దే. అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన అప్రదిష్ట కూడా ఆయనదే. ఫ్రాన్స్ పెద్ద ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్యోగాల కోత, పరిశ్రమల మూత రివాజుగా మారాయి. అసలే పడిపోయిన నిజ వేతనాలతో, నిరుద్యోగ బెడదతో బతుకులు ఎలా నెట్టుకు రావాలో తెలియక పౌరులు కొట్టుమిట్టాడుతున్నారు.ప్రజల కొనుగోలు శక్తి క్షీణించటంతో రెస్టరెంట్లు, చిన్నా పెద్దా దుకాణాలు మూసేస్తున్నారు. ఈ దశలో పులి మీద పుట్రలా ప్రభుత్వ వ్యయాన్ని అదుపుచేసే పేరిట బార్నియర్ భారీ కోతలకు దిగారు. ఇది ప్రతిఘటనకు దారితీసింది. పబ్లిక్ రంగ సంస్థల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి విరుచుకుపడక ముందు యూరప్ దేశాల్లో అగ్రగాములుగా వెలిగిన జర్మనీ, ఫ్రాన్స్‌లు రెండూ 2021నుంచి ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆర్థిక స్వస్థతకు తీసుకున్న చర్యలు ఫలించ బోతున్నాయన్న సంకేతాలున్న తరుణంలోనే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వచ్చిపడి ఆర్థిక వ్యవస్థలను మరింత దెబ్బతీసింది. జర్మనీ కొంతవరకూ దీన్ని తట్టుకోగలిగినా ఇంధన సంక్షోభంతో, భారీ వడ్డీ రేట్లతో ఫ్రాన్స్ కుదేలవుతోంది. ఒకపక్క ఊపిరాడనీయని రుణ భారం, మరోపక్క ద్రవ్యలోటు ఆ దేశాన్ని పీడిస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో సజావుగా నడిచేందుకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకూ పరిశ్రమలకు ప్రభుత్వం ఉదారంగా పంచిన 15,000 కోట్ల యూరోలు ఆవిరైపోయాయి. సరిగదా... ఇంధన ఆధారిత సంస్థలు ఉత్పత్తిని తగ్గించి వేలాదిమందిని తొలగించబోతున్నామని గత నెలలో ప్రకటించాయి. నెక్సిటీ వంటి భారీ నిర్మాణరంగ సంస్థ సైతం తడిసి మోపెడవుతున్న వడ్డీ రేట్ల కారణంగా కొత్త పెట్టుబడులకు వెళ్లటం లేదని తెలిపింది. పర్యవసానంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోక తప్పని స్థితి ఏర్పడింది. ప్రభుత్వ రుణాలు కనీవినీ ఎరుగని రీతిలో 3 లక్షల 20 వేల కోట్ల యూరోలకు చేరాయి. ఇది దేశ జీడీపీ కన్నా 112 శాతం అధికం. గ్రీస్, స్పెయిన్ వంటి దేశాలను మించి ప్రభుత్వ లోటు 6.1 శాతం చేరుకుంది. సంపన్నులకూ, కార్పొరేట్ సంస్థలకూ ఇచ్చిన పన్ను రాయితీల వల్ల కాస్తయినా ప్రయోజనం లేకపోగా, వచ్చే ఏడాది కనీసం 6,000 కోట్ల యూరోలు పొదుపు చేయటానికి తాత్కాలికంగా పన్నులు పెంచుతామని మొన్న అక్టోబర్‌లో ప్రతిపాదించగానే అంతంత మాత్రంగా నడుస్తున్న సంస్థలు అంతెత్తున లేచాయి. కొత్త పెట్టుబడులకు ఆస్కారమే లేని స్థితిలో ఈ పన్నుల మోతేమిటని ప్రశ్నించాయి.ఫ్రెంచి పౌరులు గర్వపడే పారిస్‌లోని 860 యేళ్లనాటి పురాతన భవంతి నోటర్‌డామ్ కేథడ్రిల్కు 2019లో నిప్పంటుకుని చాలా భాగం ధ్వంసమైనప్పుడు సంక్షోభంలో కూరుకుపోయిన వర్తమాన ఆర్థిక స్థితికి అది అద్దం పడుతోందని అనేకులు వ్యాఖ్యానించారు. అయిదేళ్లలో దాన్ని పునర్నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన మేక్రాన్ జయప్రదంగా ఆ పని పూర్తిచేయగలిగారు. కానీ ఆర్థికవ్యవస్థ మాత్రం ఆయనకు చుక్కలు చూపిస్తోంది. మామూలుగా అయితే శనివారం 50మంది ప్రపంచాధినేతలు, కాబోయే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వగైరాల సమక్షంలో ఆ భవంతి ప్రారంభం కాబోయే వేళ మేక్రాన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. కానీ తాజా రాజకీయ సంక్షోభం ఎదుర్కొనటం ఎలాగో తెలియక ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.577మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు కావాలి. కానీ వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్‌కు 182, మేక్రాన్‌కు చెందిన ఎన్సెంబుల్కు 168 ఉన్నాయి. తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్)కి 143 సీట్లున్నాయి. వామపక్ష ఫ్రంట్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరచటం ద్వారా ఆర్ఎన్ ఇప్పుడు బార్నియర్ ప్రభుత్వ పతనానికి కారణమైంది. తన బడ్జెట్ పార్లమెంటులో నెగ్గే స్థితి లేదని తెలిసి రాజ్యాంగంలోని అధికరణ ఉపయోగించి బార్నియర్ దాన్ని అమల్లోకి తెచ్చారు.పర్యవసానంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనక తప్పదని అర్థమైనా ఆయన ఈ మార్గం ఎంచుకున్నారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఏడాది గడిస్తే తప్ప... అంటే వచ్చే ఏడాది జూలై వరకూ మళ్లీ ఎన్నికలు జరపకూడదు. కనుక అప్పటివరకూ ఫ్రాన్స్‌కు ఆపద్ధర్మ ప్రభుత్వమే గతి. ఈలోగా తన వైఫల్యాలను అంగీకరించి మేక్రాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిరావొచ్చు. ఫలితంగా దేశానికి మరిన్ని ఇక్కట్లు తప్పవు. అంతంతమాత్రంగా ఉన్న తమ బతుకులు ఆర్ఎన్ నిర్ణయంవల్ల మరింత అధోగతికి చేరాయని జనం అనుకుంటే అధ్యక్ష ఎన్నికల్లో ఆ పదవి దక్కించుకోవాలని తాపత్రయ పడుతున్న ఆర్ఎన్ అధినాయకురాలు మెరిన్ లీ పెన్ ఆశలు అడుగంటినట్టే. ఫ్రాన్స్ సంక్షోభం మరింత వికటిస్తే అది మొత్తం యూరప్ దేశాల ఆర్థికవ్యవస్థలను అనిశ్చితిలో పడేస్తుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతోసహా అన్ని సంక్షోభాలూ ఆగితేనే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం యూరప్‌కు సాధ్యమవుతుంది. -
ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం
పారిస్: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని మైకేల్ బార్నియర్ సారథ్యంలోని ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మితవాద, అతివాద విపక్షాలు చేతులు కలపడంతో ఈ అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. 577 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీ దిగువ సభలో బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి 331 మంది ఎంపీలు ఓటేశారు. దీంతో తీర్మానం నెగ్గింది. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన కేవలం మూడు నెలలకే బార్నియర్ తన పదవిని కోల్పోవాల్సి రావడం గమనార్హం. ప్రధాని తన రాజీనామాను దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు అందజేశారు. ఫ్రాన్స్ పార్లమెంట్లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం గత అరవై ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారికావడం విశేషం. ఈ ఏడాది మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మళ్లీ వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో కేవలం నూతన ప్రధానిని ఎంపిక చేసే బాధ్యతలు మాత్రం అధ్యక్షుడు మేక్రాన్ చేతికొచ్చాయి. ఇటీవలి కాలంలోనే ఈయన రెండు సార్లు ప్రధానులను ఎంపికచేశారు. జూలైలో పగ్గాలు చేపట్టిన గేబ్రియల్ కొద్దికాలానికి వైదొలగగా ఇప్పుడు బార్నియర్ అదేబాటలో పయనించారు. దీంతో మేక్రాన్ తాజాగా మూడోసారి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. అవిశ్వాస తీర్మానానికి అధ్యక్షుడు మేక్రాన్ పదవికి సంబంధం లేదు. దీంతో మేక్రాన్ పదవికి ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేదు.France's government officially collapses after a no-confidence vote against French Prime Minister Michel Barnier. pic.twitter.com/t0vP2LoA9D— Spacy (@TheSpacy_) December 5, 2024 -
అన్ని తనిఖీలు దాటుకుని ఎంచక్కా పారిస్‌కు
న్యూయార్క్/పారిస్: అమెరికా. నిఘా నేత్రాలమయం. అక్కడ మన లాంటి భారతీయులు రోడ్లపై తిరుగుతున్నా అనుమానమొస్తే పోలీసులు మొత్తం ఆరాతీస్తారు. సంబంధిత గుర్తింపు కార్డులు చూపిస్తేనే వదిలేస్తారు. లేదంటే పోలీస్‌స్టేషన్‌కు పోవాల్సిందే. మరి అలాంటిది అంతర్జాతీయ విమానాశ్రయంలో నేరుగా విమానం ఎక్కనిస్తారా?. అస్సలు కుదరదు. పాస్‌పోర్ట్, వీసా, ఐడీ కార్డులు, లగేజీ తనిఖీలు, నిషేధిత వస్తువుల లేకుండా చూసుకోవడం.. వంటివన్నీ పూర్తిచేసుకుంటేనే బోర్డింగ్ పాస్ చేతికొస్తుంది. విమానంలోకి అడుగుపెట్టగలం. అలాంటిది ఒక మధ్యవయస్కురాలు ఇవేం లేకుండా నేరుగా విమానం ఎక్కేసింది. అదేదో మారుమూల విమానాశ్రయంలో అంతరాష్ట్ర విమానమో ఆమె ఎక్కలేదు. నేరుగా అంతర్జాతీయ విమానమే ఎక్కింది. న్యూయార్క్ నగరం నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చేరుకుంది. దీంతో అత్యంత కట్టుదిట్ట భద్రత అని చెప్పుకునే అమెరికా ఎయిర్‌పోర్ట్‌లోనూ డొల్ల వ్యవస్థ ఉందని ఆమె పరోక్షంగా నిరూపించింది. ఎక్కడా ఎవరికీ చిక్కుకుండా పారిస్‌లో దిగి ఎయిర్పోర్ట్ బయటకు వెళ్దామని ఆశించి భంగపడింది. ఫ్రాన్స్‌లో విమానం ల్యాండ్ అయ్యాక దొరికిపోయింది. అమెరికా ఎయిర్పోర్ట్ వ్యవస్థ పరువుతీసిన ఈ మహిళ గురించే ఇప్పుడు ఎయిర్‌లైన్స్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డెల్టా ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం వల్లే ఆమె ఖండాంతయానం చేయగలిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. అమెరికా ఎయిర్పోర్ట్ అథారిటీ వర్గాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాయి. తప్పు ఎక్కడ జరిగిందని కూపీలాగుతున్నాయి. ఈమె ఊరు పేరు ఇతరత్రా వివరాలను అధికారులు బయటపెట్టలేదు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ట్రాన్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి న వివరాల ప్రకారం గత మంగళవారం న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. 55–60 ఏళ్ల మహిళ టికెట్, ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. అక్కడ రెండు చోట్ల ఐడెంటిటీని చెక్ చేసే గుర్తింపు కేంద్రాలను ఒడుపుగా దాటేసింది. తర్వాత అనుమానాస్పద వస్తువులను తనిఖీచేసే సెక్యూరిటీ చెక్పాయింట్లనూ దాటింది. తర్వాత బోర్డింగ్ పాస్ జారీచేసే చోటు నుంచి తెలివిగా ఆవలి వైపునకు వచ్చేసింది. రన్‌వే మీద నిలిచి ఉన్న విమానం దాకా ప్రయాణికులను తీసుకెళ్లే బస్సును ఎక్కేసింది. తర్వాత విమానం తలుపు దగ్గర ఎయిర్‌హోస్టెస్ స్వాగత పలకరింపులు, పరిచయాలను పూర్తిచేసుకుని లోపలికి ప్రవేశించింది. నిండుగా ఉన్న విమానంలో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండదుకాబట్టి బాత్రూమ్లోకి వెళ్లి దాక్కుంది. అంతా సవ్యంగా ఉండటంతో విమానం గాల్లోకి ఎగిరింది. ఫ్రాన్స్‌లోని ఛార్లెస్ డి గాలే ఎయిర్పోర్ట్ పార్కింగ్ పాయింట్ వద్ద విమానం ఆగిన తర్వాత విమానంలోనే ఈమెను అధికారులు గుర్తించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రాబ్ జాక్సన్ ఇంకొన్ని వివరాలను వెల్లడించారు. విమానంలో సీట్లో కూర్చోకుండా ఒక బాత్రూమ్ నుంచి ఇంకో బాత్రూమ్లోకి మారుతూ అటూ ఇటూ తిరుగుతున్న ఈమె వాలకం చూసి విమానసిబ్బందికి అనుమానమొచ్చింది. ఈమెను ఆపి ప్రశ్నించేలోపు ఇంకో బాత్రూమ్లో దూరి గడియపెట్టుకుంది. దీంతో ఫ్రాన్స్‌లో దిగాక పైలట్ వెంటనే ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. ఏ ఉగ్రవాది నక్కాడో అని ప్రయాణికులు భయపడతారనే ఉద్దేశ్యంతో వాళ్లకు ఏమీ చెప్పలేదు. ‘‘అందరూ మీమీ సీట్లలో ప్రశాంతంగా కూర్చోండి. మన విమానంలో అదనపు అతిథి ఉన్నారు. పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు’’అని ప్యాసింజర్లను ప్రశాంతపరిచాడు. చివరకు పోలీసులు వచ్చి ఈమెను అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు. అమెరికా గ్రీన్‌కార్డ్.. విమానంలో చొరబడిన ఈమెకు అమెరికా గ్రీన్‌కార్డ్ ఉందని, రష్యా పాస్‌పోర్ట్ ఉందని మీడియాలో వార్తలొచ్చాయి. అమెరికాలో ఉండే ఉద్దేశంలేక కావాలనే ఫ్రాన్స్ శరణుకోరు తూ శరణారి్థగా ఇక్కడికి అక్రమంగా వచ్చిం దని మరో కథనం వెలువడింది. ఆమె మానసిక స్థితి గురించి ఇంకా వివరాలు తెలియరాలేదు. అనుమతిలేకుండా విమానం ఎక్కి సేవల దుర్వినియోగం, దేశం దాటి రావడం, ఇతరత్రా సెక్షన్ల కింద కేసులు మోపి ఫ్రాన్స్ జైళ్లో పడేయొచ్చు. లేదంటే అమెరికాకే తిరిగి పంపొచ్చు. అప్పుడు అమెరికా చట్టాల ప్రకారం శిక్ష పడే వీలుంది. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించడంతో తమ వైపు సెక్యూరిటీ చెక్ విషయంలో ఏం లోపాలు జరిగాయో తెల్సుకునేందుకు విమానయాన సంస్థ ఈమెను ప్రశ్నించే వీలుంది. అమెరికాకు తిరిగొస్తే జేకేఎఫ్ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను విచారించే అవకాశముంది. గత మంగళవారం థ్యాంక్స్‌గివింగ్ హాలిడే రోజు అమెరికా ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. అమెరికాలో ఆ ఒక్కరోజే 27 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. ఆ రద్దీని ఈమె తనకు అనువుగా మలుచుకుని ఉంటుందని భావిస్తున్నారు. -
భారత్‌లో ప్లాంట్లు పెట్టండి
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని ఫ్రాన్స్ ఏవియేషన్ సంస్థలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ కోరారు. విమానాశ్రయాలు, అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయదల్చుకునే సంస్థలకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ మార్కెట్ల కోసం ఉత్పత్తులను తయారు చేసేలా రక్షణ రంగంలో భారత్, ఫ్రాన్స్ కంపెనీలు కలిసి పని చేయొచ్చని మంత్రి తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తదితర విభాగాల్లో భారత సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవచ్చని గోయల్ వివరించారు. ఫ్రెంచ్ ఫారిన్ ట్రేడ్ అడ్వైజర్లకు సంబంధించిన ఆసియా–పసిఫిక్ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశీ విమానయాన సంస్థలు 1,500 పైచిలుకు విమానాలకు ఆర్డర్లివ్వగా అందులో సింహభాగం వాటా ఫ్రాన్స్ కంపెనీ ఎయిర్‌బస్‌కి లభించాయి. భారత్‌లో సుమారు 750 ఫ్రెంచ్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తుండగా, 75 భారతీయ కంపెనీలు ఫ్రాన్స్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇరు దేశాల మధఅయ 2023–24లో 15 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. భారత్ ఎగుమతులు 7 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
లవ్ హోటళ్లు.. పోటెత్తుతున్న ప్రేమ జంటలు
అణుబాంబుల వినాశనం నుంచి తేరుకుని జపాన్ సాధించిన ప్రగతి అన్ని దేశాలకూ స్ఫూర్తిదాయకమే. అక్కడి గమ్మత్తైన సంగతులను కెమెరాలో బంధించేందుకు బయల్దేరిన ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఫ్రాంకోయిస్ ప్రోస్ట్ను లవ్ హోటళ్ల సంస్కృతి బాగా ఆకర్షించింది. ప్రైవసీ కోసం ప్రేమ పక్షులు కాస్త ‘ఏకాంతంగా’ సమయం గడిపే ఈ హోటళ్లు జపాన్‌లో సూపర్‌హిట్‌గా మారాయి. వింత ఆకృతుల్లో అలరించే వీటి విశేషాలను రకరకాల యాంగిళ్లలో కెమెరాలో బంధించాడు.పడవలు, కోటలు, అంతరిక్ష వస్తువులు హోటల్ జాయ్, హోటల్ ప్యాషన్, హోటల్ బేబీ కిస్... ఇలా ఆకర్షణీయ పేర్లతో లవ్, కిస్ సింబళ్లతో ఈ హోటళ్లు ఆకట్టుకునేలా ఉంటాయి. విభిన్న ఆకృతుల్లో ఉండటం వీటిలోని మరో విశేషం. ఒక హోటల్ భారీ పడవలా, మరోటి పేద్ద కోటలాగా దర్శనమిస్తాయి. ఇంకోటి తిమింగలంలా, మరోటి గ్రహాంతరవాసుల ఎగిరే పళ్లెం (యూఎఫ్ఓ)లా నిర్మించారు. సాధారణ భవంతుల మధ్య చూడగానే కనిపెట్టేలా వీటిని కట్టారు. ఇలాంటి 200కు పైగా లవ్ హోటళ్లను ప్రోస్ట్ ఫొటోలు తీశారు. వ్యభిచారాన్ని నిషేధిస్తూ జపాన్‌లో 1958లో చట్టం తెచ్చాక ఈ లవ్ హోటళ్ల సంస్కృతి పెరగడం విశేషం. వీటిల్లో వ్యభిచారం జరుగుతోందని కొందరు విమర్శిస్తుండగా మరికొందరు దాన్ని గట్టిగా ఖండిస్తుండటం విశేషం.ఇరుకు ఇళ్లు, ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల్లో కొత్త జంటలకు ఊపిరాడదు. చిలిపి చేష్టలు తదితరాలు కష్టం. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నివసించే ఇళ్లు, గదులు మరీ ఇరుకు, ఇలాంటి కొత్త, పేద జంటల ‘అవసరాలు’ తీర్చే ప్రత్యామ్నాయ వేదికలుగా లవ్ హోటళ్లు బాగా ఉపయోగపడుతున్నాయని జపాన్‌లో చాలామంది భావిస్తున్నారు. కొత్త జంటలు, ప్రేమ పక్షుల ప్రైవసీకే గాక నైట్‌క్లబ్ వంటి పలు వసతులకు ఇవి నెలవులు. జలాంతర్గామిలా, పెద్ద నౌకలా చూపు తిప్పుకోలేనంతటి ముదురు రంగు పెయింటింగుల్లో, రాత్రిళ్లు ధగధగల విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఫుల్ ప్రైవసీ ఈ లవ్ హోటళ్లలో సిబ్బంది చాలా తక్కువగా ఉంటారు. ఉన్నా సరిగా కనపడరు. తెరలు, మసకమసక గాజు తలుపుల వెనుక నుంచే సేవలందిస్తారు. చార్జీలను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. కారు పార్కింగ్ ప్రాంతం కూడా కాస్త చీకటిగానే ఉంటుంది గనుక ప్రైవసీకి లోటే ఉండదు. 1970ల నుంచీ బాగా పాపులరైన మెగురో ఎంపరర్ లవ్ హోటల్‌ను యూరప్ కోట ఆకృతిలో నిర్మించారు. దాని బాటలో జపాన్ అంతటా చాలా నగరాల్లో లవ్ హోటళ్లు కోట డిజైన్లలో పుట్టుకొచ్చాయి. హోన్సు, షికోకు దీవులు మొదలుకుని టోక్యోదాకా అంతటా అలరిస్తూ వచ్చాయి. ఒకయామాలోని హోటల్ అలాదిన్ను గ్రాండ్ అరేబియన్ ప్యాలెస్‌లా భారీ గుమ్మటాలతో కట్టారు.ఏటా 50 కోట్ల మంది జపాన్వ్యాప్తంగా 20,000 లవ్ హోటళ్లుంటాయని అంచనా. 1980ల్లో వచి్చన కఠిన చట్టాల తర్వాత వీటి సంఖ్య తగ్గింది. అయినా ఇప్పటికీ వీటికి విపరీతమైన జనాదరణ ఉంది. 1990ల నుంచి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ హోటళ్లను ప్రేమ జంటలు ఏటా 50 కోట్లసార్లు సందర్శిస్తున్నారు! ఆ లెక్కన జపాన్‌లో సగం శృంగారం ఈ హోటళ్లలోనే జరుగుతోందని ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త మార్క్ డి.వెస్ట్ విశ్లేíÙంచారు. 2005లో రాసిన ‘లా ఇన్ ఎవ్రీడే జపాన్’ పుస్తకంలో ఇలాంటి బోలెడు విషయాలను వెల్లడించారాయన.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతులేని జాతి వివక్ష.. మూలాలను వెతుక్కుంటూ ఇంటిబాట..ఇక మాకు ఫ్రాన్స్ వద్దు..!
అలెక్స్ హేలీ ‘రూట్స్’. ఆఫ్రికా ఖండంలోని తనవారి మూలాలు వెతుక్కుంటూ వెళ్లిన ఓ నల్లజాతి అమెరికన్ చరిత్ర. ఆ నవల వెనక 12 ఏళ్ల ఎడతెగని అన్వేషణ, అధ్యయనం, పరిశోధన ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌లోని నల్లజాతీయులు కూడా అలాగే తమ మూలాలు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. అయితే వారు వెళ్తున్నది పరిశోధనల కోసం కాదు. కాస్త మెరుగైన భవిష్యత్తు వేటలో. ఫ్రాన్స్‌లో వారికి ఎదురవుతున్న తీవ్ర జాతి వివక్షే ఈ వలసలకు ప్రధాన కారణం. ఫ్రెంచివారి మితిమీరిన జాతీయవాదాన్ని భరించలేక ఫ్రాన్స్‌ను వీడుతున్న ఆఫ్రికన్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఫ్రాన్స్‌లోనే పుట్టి పెరిగి, జీవితమంతా ఆ దేశంతోనే ముడిపడిందని అనుకున్న ఆఫ్రికన్లు కూడా అన్వేషిస్తూ ఈ జాబితాలో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది... ఫ్రాన్స్‌ను వీడుతున్న నల్లజాతీయుల సంఖ్య బాగా పెరిగింది. ప్రధానంగా సెనెగల్ వాసులు ఫ్రాన్స్‌ను వీడి స్వదేశీ బాట పడుతున్నారు. ముస్లిం దేశమైన సెనెగల్ పురాతన ఫ్రెంచ్ కాలనీ. సెనెగల్‌తో ఫ్రాన్స్ సంబంధాలకు మూడు శతాబ్దాల పై చిలుకు చరిత్ర ఉంది. 1960లో సెనెగల్‌కు రాజకీయ స్వాతంత్య్రం వచి్చనా వ్యాపారం, జాతీయ భద్రత, సైనిక ఒప్పందాలు, భాగస్వామ్య సాంస్కృతిక ప్రోత్సాహం తదితరాల రూపంలో ఫ్రాన్స్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. సెనెగల్ నుంచి వలస వెళ్లిన వారు ఫ్రాన్స్‌లో పలు రంగాల్లో స్థిరపడ్డారు. కానీ ‘ప్రత్యేక సంబంధం’ఇప్పుడు బీటలు వారుతోంది. పెరిగిన జాత్యాహంకార నేరాలు ఫ్రాన్స్‌లో నల్లజాతీయులపై నిర్వహించిన సర్వేలో ఏకంగా 91 శాతం మంది తాము జాతి వివక్షకు గురైనట్టు చెప్పుకొచ్చారు. 85% మంది చర్మం రంగు ఆధారంగా వివక్షకు గురయ్యారు. ఇది బహిరంగ స్థలాల్లో 41 శాతం, పని ప్రదేశాల్లో 31 శాతముంది. చర్మం రంగు వల్ల ఉద్యోగం నుంచి ప్రమోషన్ల దాకా నల్ల జాతీయులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాపరంగా కూడా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఇల్లు కొనడం, అద్దెకు తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోయారు. ఒక్క గత ఏడాదిలోనే ఫ్రాన్స్‌లో జాత్యహంకార నేరాలు మూడింట ఒక వంతు పెరిగినట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. 15,000 పై చిలుకు జాతి, మతాధార నేరాలు నమోదయ్యాయి. 2023 జూన్‌లో అల్జీరియా సంతతికి చెందిన నహెల్ మెర్జౌక్ (17) అనే టీనేజర్‌ను పోలీసులు కాలి్చచంపారు. వీటన్నింటి కారణంగా విద్యాధికులైన ఫ్రెంచ్ ఆఫ్రికన్ ముస్లింలు భారీ సంఖ్యలో నిశ్శబ్దంగా వలస బాట పట్టినట్టు పలు పరిశోధనల్లో తేలింది. అయితే వీరి సంఖ్య ఇదమిత్థంగా తెలియరావడం లేదు. జాతి, మతాధారిత గణాంకాల సేకరణపై ఫ్రాన్స్‌లో నిషేధమే ఇందుకు కారణం.మా విశ్వాసాలంటే చులకన 2015లో ఇస్లామిక్ ముష్కరులు పారిస్‌లో పలుచోట్ల దాడులకు పాల్పడ్డారు. వాటిలో ఏకంగా 130 దుర్మరణం పాలయ్యారు. నాటినుంచీ ఫ్రాన్స్‌లో ఇస్లామోఫోబియా తారస్థాయికి చేరింది. లౌకిక దేశమైన ఫ్రాన్స్‌లో హిజాబ్ ధారణ కూడా వివాదాస్పదంగా మారింది. దాన్ని 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వ స్కూళ్లలో నిషేధించారు. ఈ మార్పులు ఆందోళనకరమని కాంగో సంతతికి చెందిన ఆడ్రీ మొంజెంబా అనే టీచర్ తెలిపారు. ఆమె రోజూ తన చిన్న కుమార్తెతో కలిసి బస్సు, రైలు మారి స్కూలుకు వెళ్తుంది. అక్కడ బురఖా తీసేసి లోనికి వెళ్లాల్సి వస్తుంది. ఇటీవలే కుటుంబంతో పాటు సెనగల్లో స్థిరపడ్డారామె. ‘‘ఫ్రాన్స్ నాది కాదని అనుకోవడం లేదు. కానీ మా విశ్వాసాలను, విలువలను గౌరవించే వాతావరణంలో నేను, నా పిల్లలు ఎదగాలనేది నా ఆకాంక్ష’’అంటోంది 35 ఏళ్ల మొజెంబా. సెనెగల్‌కు చెందిన 34 ఏళ్ల ఫటౌమాటా సిల్లాదీ ఇలాంటి కథే. ‘‘మా కుటుంబానికి మెరుగైన జీవితం కోసం మా నాన్న ఆఫ్రికా వదిలి ఇక్కడికొచ్చారు. అయితే మూలాలను ఎన్నటికీ మరవొద్దని నిత్యం చెప్పేవారు. ఆ వారసత్వాన్ని నేను మరిచిపోలేదు. అందుకే ఈ వివక్షను భరించే బదులు సెనెగల్ తిరిగి వెళ్తున్నా. అక్కడ టూరిజం వ్యాపారం చేసుకుంటా’’అని ఆయన చెప్పుకొచ్చారు. వెంటాడుతున్న వివక్ష.. మెంకా గోమెస్దీ ఇదే కథ. వివక్షను తట్టుకోలేక ఫ్రాన్స్‌ను వీడి తమ మూలాలకు తిరిగి వెళ్లాలనుకుంటున్న ఆఫ్రికన్ల కోసం సెనెగల్‌లో ట్రావెల్ ఏజెన్సీనే ఏర్పాటు చేశారాయన. ‘‘నేను ఫ్రాన్స్‌లోనే పుట్టి పెరిగా. కానీ ఇక్కడ జాత్యహంకారం భరిచలేనంతగా పెరిగింది. ఆరేళ్ల వయసులో స్కూల్లో నన్ను ఎన్–వర్డ్ అని పిలిచేవారు. నేను ఫ్రెంచివాన్నే అయినా నా తల్లిదండ్రులు ఎక్కడి నుంచో రావడమే ఇందుకు కారణం. ఆ వివక్ష నీడలా వెంటాడుతూనే ఉంది. ఇక చాలనిపించింద. ఇ అందుకే కుటుంబాన్ని, స్నేహితులను అందరినీ విడిచి మరీ సెనెగల్ వెళ్లిపోతున్న. ఇక నా భవిష్యత్తంతా ఆఫ్రికాలోనే’’అని చెప్పుకొచ్చారు. పుట్టినప్పటి నుంచీ ఫ్రాన్స్‌లోనే గడిపిన ఫాంటా గుయిరాస్సీ కూడా తల్లి జన్మస్థలమైన సెనెగల్ వెళ్లే ఆలోచనలో ఉంది. ‘‘కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో రక్షణ లేదు. నా 15 కొడుకు వీధిలో స్నేహితులతో మాట్లాడుతుంటే పోలీసులు అవమానకరంగా తనిఖీ చేశారు. టీవీలో ఎప్పుడు చూసినా మాకు సంబంధించి ఏదో ఒక న్యూస్! ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన వెంటాడుతోంది’’అన్నారామె.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జర్నలిజం నేరం కాదు: జూలియన్ అసాంజే
వికీలీక్స్ వ్యవస్థపకుడు జూలియన్ అసాంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జర్నలిజం నేరం అని ఒప్పుకున్నందుకే విడుదల అయినట్లు వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన తొలిసారి మంగళవారం అసాంజ్.. స్ట్రాస్‌బర్గ్ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ ఆఫ్ యూరప్ హక్కుల సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.‘‘నేను స్వేచ్ఛగా లేను. ఎందుకంటే వ్యవస్థ అలా సాగుతోంది. అయితే కొన్ని ఏళ్ల నిర్భందం తర్వాత నేను ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నాను. దానికి గల కారణం జర్నలిజం నేరాన్ని ఒప్పుకున్నాను. అందుకే నిర్భందం నుంచి బయటపడ్డాను. చివరికి అవాస్తవమైన న్యాయం కంటే స్వేచ్ఛను ఎంచుకున్నా. నాకు న్యాయం ఇప్పుడు అసాధ్యంగా మారింది. నేను ప్రస్తుతం 175 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్నా. అయితే జర్నలిజం నేరం కాదు. పౌర సమాజానికి, స్వేచ్ఛకు ఒక మూల స్తంభం. ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏం లేదు. కానీ, జర్నలిస్టులుగా తమ విధులు నిర్వహిస్తున్నవారిని విచారించవద్దు’ అని అన్నారు. అదేవిధంగా తాను ఖైదీగా ఉన్న సమయంలో తనకు సంబంధించిన భూమిని కోల్పోయానని తెలిపారు. నిజం చెప్పినందుకు శిక్ష, ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇచ్చినట్లు అయిందని అసాంజే పేర్కొన్నారు."I want to be totally clear. I am not free today because the system worked. I am free today because after years of incarceration I pleaded guilty to journalism. I pleaded guilty to seeking information from a source" - Julian Assange, Council of Europe pic.twitter.com/N0Ix58CeSu— WikiLeaks (@wikileaks) October 1, 2024 గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందడం, వాటిని బయట పెట్టడం వంటి నేరాలను ఇటీవల అసాంజ్ అంగీకరించారు. దీంతో ఆయన్ను అమెరికా పసిఫిక్ ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైపన్లోని ఫెడరల్ కోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐదేళ్లుగా బ్రిటన్‌లో జైలు జీవితం అనుభవిస్తున్న అసాంజే.. అమెరికా న్యాయ విభాగంతో నేరాంగీకార ఒప్పందం కుదుర్చుకోవడంతో విడుదలకు మార్గం సుగమమైన విషయం తెలిసిందే. ఇదీ నేపథ్యంఇరాక్, అఫ్గానిస్తాన్ తదితర చోట్ల అమెరికా సైన్యం పాల్పడ్డ తప్పిదాలు, చేపట్టిన తప్పుడు చర్యలకు సంబంధించిన లక్షలాది రహస్య పత్రాలను లీక్ చేసి జూలియన్ అసాంజే సంచలనం సృష్టించడం తెలిసిందే. దాంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అసాంజే స్థాపించిన వికీలీక్స్ అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలెన్నింటినో విడుదల చేసింది. బాగ్దాద్‌పై 2010లో అమెరికా వైమానిక దాడిలో ఇద్దరు రాయిటర్ జర్నలిస్టులతో పాటు సామాన్యులు మృతి చెందిన వీడియో వంటివి వీటిలో ఉన్నాయి.అఫ్గాన్ యుద్ధానికి సంబంధించి 91,000కు పైగా పత్రాలనూ వికీలీక్స్ విడుదల చేసింది. తర్వాత ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను విడుదల చేసింది. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపడంతో అసాంజ్‌పై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. మరోవైపు లైంగిక నేరాల ఆరోపణలపై అసాంజే అరెస్టుకు స్వీడన్ కోర్టు 2010 నవంబర్‌లో ఆదేశించింది. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.చదవండి: WikiLeaks: అసాంజ్‌కు విముక్తి -
UNSC: భారత్‌కు బూస్ట్.. మద్దతు ప్రకటించిన యూకే
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. భారత్‌కు మద్దతుగా ఉన్నట్టు పలు దేశాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ మద్దతు ఇవ్వగా.. తాజాగా ఈ జాబితాలో యూకే కూడా చేరింది.న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ సాధారణ చర్చను ఉద్దేశించి యూకే ప్రధాని కైర్ స్టార్మర్ మాట్లాడుతూ..యూఎన్‌సీసీ మరింత ప్రాతినిధ్య సంస్థగా మారాలి. ఇందులో భాగంగానే యూకే పలు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుకుంటోంది. బ్రెజిల్, భారత్, జపాన్, జర్మనీలు శాశ్వత సభ్య దేశాలుగా ఉండాలనుకుంటున్నాం. అలాగే, ఆఫ్రికన్ దేశాల ప్రాతినిధ్యం కూడా చూడాలనుకుంటున్నాం’ అని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు.అంతకుముందు.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిందేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్ స్పష్టం చేశారు. బుధవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ.. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. భద్రతా మండలిని విస్తరించి, బలోపేతం చేద్దాం. ఇందుకు ఫ్రాన్స్ అనుకూలంగా ఉంది. ఆఫ్రికాలోని రెండు దేశాలతో పాటు జర్మనీ, జపాన్, ఇండియా, బ్రెజిల్ కు చోటు ఇవ్వాలి. ఆ రెండు దేశాలు ఏవన్నది నిర్ణయించుకునే అధికారం ఆఫ్రికాకే ఇవ్వాలి’ అని కామెంట్స్ చేశారు.ఇక, గత వారంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్.. భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన మూడు దేశాల నుంచి భారత్ మద్దతు దక్కించుకుంది.ప్రస్తుతం, యూఎస్సీపీలో ఐదు శాశ్వత సభ్యులు, పది తాతాల్కిక సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతాయి. రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఐదు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. వీటికి ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని వీటో చేసే అధికారం ఉంది.ఇది కూడా చదవండి: అమెరికాలో గన్ కల్చర్‌పై బైడెన్ కొత్త చట్టం -
వాళ్లలా నేనూ రేపిస్ట్‌నే
అవిగ్నోన్(ఫ్రాన్స్): అత్యంత జుగుప్సాకరమైన, అమానవీయ ఘటనకు వేదికగా నిలిచిన ఫ్రాన్స్‌లోని అత్యాచారాల పర్వంలో ప్రధాన నిందితుడు, బాధితురాలి మాజీ భర్త ఎట్టకేలకు తన తప్పును ఒప్పుకున్నాడు. తనను క్షమించాలని మాజీ భార్య, తన ముగ్గురు పిల్లలను వేడుకున్నాడు. అవిగ్నోన్ పట్టణంలోని కోర్టులో సెప్టెంబర్ రెండో తేదీన కేసులో వాదోపవాదనలు మొదలెట్టాక తొలిసారిగా నిందితుడు మంగళవారం తన తప్పును ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇచ్చారు. మిగతా రేపిస్టుల్లాగే తాను కూడా భార్యను రేప్చేశానని ఏడుస్తూ చెప్పాడు. వాంగ్మూలం ఇచ్చిన సమయంలో ప్రధాన నిందితుడితోపాటు దాదాపు 50 మంది ఇతర రేపిస్ట్ నిందితులూ కోర్టు హాలులోనే ఉన్నారు. గతంలో ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసిన 71 ఏళ్ల డొమినిక్ పెలికోట్ తన భార్య గిసెలీకి భోజనంలో మత్తు మందు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లాక ముక్కూముఖం తెలియని, దారిన పోయే వాళ్లను పిలిచి మరీ రేప్ చేయించాడు. ఇలా 72 మంది గిసెలీని 92 సార్లు రేప్‌చేశారు. ఈ అత్యాచారపర్వం పదేళ్లపాటు అంటే 2011 నుంచి 2020దాకా కొనసాగింది. అయితే 2020లో ఒక సూపర్మార్కెట్లో అమ్మాయిలను స్కర్టుల కింది నుంచి వీడియోలు తీస్తూ పెలికోట్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఇంటికొచ్చి అతని వస్తువులకు పోలీసులు తనిఖీచేశారు. దీంతో ఫోన్, కంప్యూటర్లో వెలుగుచూసిన అంశాలు చూసి పోలీసులే విస్తుపోయారు. భార్యను అపరిచితులు రేప్ చేస్తున్న డజన్ల కొద్దీ వీడియోలు, ఫొటోలు అందులో ఉన్నాయి. మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న పెలికోట్ మంగళవారం కోర్టులో మాట్లాడాడు. ‘‘ ఎవరూ తప్పుడు నడవడికతో పుట్టరు. పరిస్థితులు అలా మారుస్తాయి’’ అని అన్నారు. నేరం రుజువైతే పెలికోట్కు కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. పెలికోట్ భార్యను రేప్ చేసిన వారిలో 26 ఏళ్ల యువకుల నుంచి 74 ఏళ్ల వృద్దుల వరకు ఉన్నారు. మత్తులోకి జారకముందే ఆమె తన సమ్మతి తెలిపిందని, భర్త తమతో ఇలా చేయిస్తున్నట్లు తమకు నిజంగా తెలియదని వారిలో చాలా మంది చెప్పడం గమనార్హం. -
ప్రజాభీష్టానికి పాతర
వేసవి ఒలింపిక్స్, పారాలింపిక్స్ – రెండూ పూర్తవడంతో ఫ్రాన్స్‌లో ఆటల వేడి ముగిసిందేమో కానీ, రాజకీయ క్రీడ మాత్రం బాగా వేడెక్కింది. కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ పార్టీ నేత మిషెల్ బార్నియెర్ను దేశ ప్రధానిగా నియమిస్తున్నట్టు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ గడచిన గురువారం చేసిన ప్రకటనతో రచ్చ రేగుతోంది. కొద్ది నెలల క్రితం జూన్ 9న పార్లమెంట్ దిగువ సభను రద్దు చేసి, ఆకస్మిక ఎన్నికలు ప్రకటించి, దేశాన్ని రాజకీయ ప్రతిష్టంభనకు గురి చేసిన మెక్రాన్ తీరా ఎన్నికల ఫలితాలొచ్చిన 60 రోజుల తర్వాత తాపీగా ప్రజాతీర్పుకు భిన్నంగా నాలుగో స్థానంలో నిలిచిన పార్టీ వ్యక్తిని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన దేశంలో జరిగిన ఈ అపహాస్యమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆగ్రహించిన వేలాది జనం వీధుల్లోకి వచ్చి, ప్రదర్శనలకు దిగింది అందుకే. కొత్త ప్రధాని సారథ్యంలో సరికొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది కానీ, రాజకీయ సంక్షోభం అంచున ఉన్న దేశానికి సారథ్యం వహించడం అగ్నిపరీక్షే. వెరసి ఫ్రాన్స్‌లో అనిశ్చితి తొలగకపోగా, మరింత పెరగనుండడమే వైచిత్రి. నిజానికి, ఫ్రాన్స్‌లో జూలైలో రెండో విడత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీవ్ర మితవాద పక్షమైన ‘నేషనల్ ర్యాలీ’నీ, అలాగే మెక్రాన్‌కు చెందిన ‘రినైజెన్స్ బ్లాక్’నూ వెనక్కి నెట్టారు. వామపక్ష కూటమి ‘న్యూ పాపులర్ ఫ్రంట్’ (ఎన్‌ఎఫ్‌పీ)కి అధిక మద్దతు ప్రకటించారు. అయితే, ఎన్ఎఫ్పీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేని విధంగా ఇన్నాళ్ళుగా కొత్త ప్రభుత్వమేదీ లేకుండానే మెక్రాన్ కథ నడిపారు. పైగా, అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాన్ని వాడి, వామపక్ష కూటమి ప్రతిపాదించిన అభ్యర్థు లెవరినీ ప్రధానిగా అంగీకరించలేదు. చివరకు ఎన్నికల్లోని ప్రజా తీర్పును అగౌరవిస్తూ, నాలుగో స్థానంలోని పార్టీ తాలూకు వ్యక్తిని ప్రధానిగా దేశాధ్యక్షుడు ఎంపిక చేయడం ఓటర్లకు, అందునా యువతరానికి అమితమైన ఆగ్రహం కలిగించింది. దాని పర్యవసానమే – వేలాదిగా జనం వీధు ల్లోకి రావడం! ఒక రకంగా ఈ ప్రధానమంత్రి ఎంపిక ‘ఎన్నికల చోరీ’ అని పేర్కొంటూ, ఏకంగా దేశాధ్యక్షుడు మెక్రాన్కే ఉద్వాసన పలకాలంటూ వాదించే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ఉన్నంతలో అధిక స్థానాలున్న కూటమికే పగ్గాలు అప్పగించడం విహితమని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వ సిద్ధాంతాలను ప్రవచించిన ఘన ప్రజాస్వామ్యం నుంచి ఎవరైనా ఆశిస్తారు. కానీ, 2017 నుంచి విభజన రాజకీయాలు చేస్తున్న ప్రెసి డెంట్ మెక్రాన్ ఎన్నికలలో తన పార్టీ కింద పడ్డా తనదే పైచేయిగా వ్యవహరించారు. వరుసగా చేస్తూ వస్తున్న తప్పుల్ని కొనసాగిస్తూ ఇష్టారీతిన వ్యవహరించారు. ఆ మాటకొస్తే, రాజకీయాల పట్ల నమ్మకం క్షీణింపజేసే ఇలాంటి చర్యల వల్లనే ఫ్రాన్స్ సహా యూరప్ అంతటా తీవ్ర మితవాదం పైకి ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆధిక్యం కనబరిచినవారికి కనీసం ఏకాభిప్రాయ సాధనకైనా అవకాశమివ్వకుండా అధ్యక్షుడు తన పదవీకాలపు లెక్కలతో తోచిన ఎంపికలు చేయడం అవివేకం. తీవ్ర మితవాదానికీ, దాని జాత్యహంకార, విదేశీయతా విముఖ సిద్ధాంతానికీ పట్టం కట్టరాదన్న ప్రజాభీష్టానికి వ్యతిరేకం. ఈ కొత్త సర్కార్ కింగ్ మేకర్లయిన తీవ్ర మితవాదుల మద్దతుపై ఆధార పడక తప్పని స్థితి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అధ్యక్షుడు దేశాన్ని మళ్ళీ చిక్కుల్లోకి నెట్టారు. అలాగని ప్రధానిగా ఎంపికైన 73 ఏళ్ళ బార్నియెర్ మరీ అనామకుడేమీ కాదు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ పక్షాన గతంలో సంప్రతింపులకు సారథ్యం చేసిన వ్యక్తి. ఏకాభిప్రాయ సాధనలో ప్రసిద్ధుడు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోగలి గినవాడు. ముగ్గురు దేశాధ్యక్షుల హయాంలో మంత్రిగా చేసిన ఆయనది యూరోపియన్ అనుకూల వైఖరి. అది వామపక్షాలకు నచ్చవచ్చు. ఇక, వలసల నియంత్రణకు మరింత కఠినమైన నిబంధనలు ఉండాలన్న వాదననే బార్నియెర్ సమర్థిస్తున్నారు. అది కన్జర్వేటివ్‌లకు నచ్చే అంశం. ప్రభుత్వ భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడంతో... ప్రధానిగా ఇలాంటి వ్యక్తే సరైనవాడని మెక్రాన్ ఎంచు కున్నారట. కానీ, ఫ్రెంచ్ సమాజం నుంచి ఆమోదం లభించడం, రాజకీయంగా విజయం సాధించడం మెక్రాన్, బార్నియెర్లు ఇద్దరికీ అంత సులభమేమీ కాదు. సుదీర్ఘంగా శ్రమించక తప్పదు. యూకేతో బ్రెగ్జిట్ ఒప్పందం వేళ చేసినట్టే... ఇప్పుడూ ఏదో ఒక రాజీ మార్గంలో, అందరి మధ్య సహకారం సాగేలా కొత్త ప్రధాని చేయగలుగుతారా అన్నది ఆసక్తికరమైన అంశం. వచ్చే 7 నుంచి 12 ఏళ్ళ లోగా ఫ్రాన్స్ తన ప్రభుత్వ లోటును 10 వేల కోట్లు యూరోల పైగా తగ్గించనట్లయితే, ఇటలీ లాగానే ఫ్రాన్స్ సైతం అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 1లోగా కొత్త ప్రధాని, ఆర్థిక మంత్రితో కలసి 2025 బడ్జెట్ ముసాయిదాతో బిల్లుకు రూపకల్పన చేయాల్సి ఉంది. అది అతి కీలకమైన మొదటి అడుగు. అదే సమయంలో దేశాన్ని ఒక్క తాటి మీదకు తీసుకురావడానికే తాను పగ్గాలు చేపట్టినట్టు ఫ్రెంచ్ ప్రజానీకానికి ఆయన నచ్చజెప్పగలగాలి. ఏమైనా, ప్రజలు, పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర స్థాయి విభేదాలతో ఫ్రెంచ్ రిపబ్లిక్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. అది ఈ ఘన ప్రజాస్వామ్యా నికి పెను ముప్పు. ఆ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఇంకా అనేక సమస్యలను కొత్త ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ఇప్పటికే పాలన పూర్తిగా అటకెక్కిన ఫ్రాన్స్‌ను ఆ దేశపు అతి పెద్ద వయసు ప్రధాని, అధ్యక్షుడు కలసి ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి. -
ఫ్రాన్స్ ప్రధానిగా మైకేల్ బార్నియర్
పారిస్: ఫ్రాన్ నూతన ప్రధాని మైకేల్ బార్నియర్‌ను దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ గురువారం నియమించారు. బ్రెగ్జిట్ చర్చల్లో యూరోపియన్ యూనియన్‌కు 73 ఏళ్ల బార్నియర్ ప్రాతినిధ్యం వహించారు. హంగ్ పార్లమెంటు ఏర్పడటం వామపక్షాలు అతిపెద్ద గ్రూపుగా అవతరించడంతో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎన్నికల్లో ఓటమితో గాబ్రియెల్ అట్టల్ జూలై 16న ప్రధానిగా రాజీనామా చేసినా ఒలింపిక్స్ క్రీడల దృష్ట్యా మాక్రాన్ ఆయన్నే తాత్కాలిక ప్రధానిగా కొనసాగించారు. లెఫ్ట్ కూటమి ఇదివరకు ఒకరిని ప్రధానిగా ప్రతిపాదించగా మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్లి ప్రభుత్వాన్ని నడపగల అభ్యర్థి కోసం మాక్రాన్ శిబిరం అన్వేíÙంచింది. చివరకు బార్నియర్‌ను ఎంపిక చేసింది. ‘దేశానికి, ఫ్రెంచ్ ప్రజలకు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను బార్నియర్‌కు అప్పగించాం’ అని మాక్రాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బార్నియర్ గతంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిగా, పర్యావరణ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. యూరోపియన్ యూనియన్ కమిషనర్‌గా రెండు పర్యాయాలు చేశారు. -
టెలిగ్రామ్ సీఈవో చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ అక్రమ రవాణా.. ఇతరత్రా చట్టవిరుద్ధ కార్యకలాపాల వ్యాప్తిని అరికట్టడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని ప్యారిస్ కోర్టు ధృవీకరించింది. దీంతో ఈ వ్యవహారంలో ఆయన విచారణ ఎదురోవాల్సి ఉండనుంది. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో అభ్యంతరకర కార్యకలాపాలకు(నేరాలుగా పరిగణిస్తూ..) పాల్పడేందుకు ఆయన అనుమతి ఇచ్చారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. అంతేకాదు.. యాప్‌లో పిల్లలపై అశ్లీల కంటెంట్ వ్యాప్తి చేశారనే అరోపణలకుగానూ అధికారులు కోరిన డాక్యుమెంట్లను సమర్పించేందుకు ఆయన నిరాకరించినట్లు ప్యారిస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. దీంతో.. కోర్టు అనుమతితో ఆయన్ని ఫ్రాన్స్ విచారణ జరపనుంది. రష్యాలో జన్మించిన దురోవ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. 2021 ఆగస్టులో ఈయన ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నారు. టెలిగ్రామ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్లమంది వినియోగిస్తున్నారు. దురోవ్ అరెస్టుపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. వాక్ స్వాతంత్య్రంపై పశ్చిమ దేశాల ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమని రష్యా అంటోంది... గత శనివారం సాయంత్రం అజర్బైజాన్ నుంచి పారిస్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 39 ఏళ్ల పావెల్ దురోవ్‌ను అక్కడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయడం వంటి అభియోగాలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలోనే ఆయనపై అరెస్టు వారెంటు జారీ చేసిన ఫ్రాన్స్ అధికారులు.. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. -
కటకటాల్లో టెలిగ్రామ్ చీఫ్
ఆయనేమీ అమెరికా సైనికుల అకృత్యాలను ఆన్లైన్లో రచ్చకీడ్చిన జులియన్ అసాంజ్ కాదు. దేశదేశాల్లోని కోట్లాదిమంది పౌరులపై నిఘా ఉంచుతున్న అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) తీరుతెన్నులను బట్టబయలు చేసి రష్యాలో తలదాచుకుంటున్న ఎడ్వర్డ్ స్నోడెన్ కాదు. ఆయన వేలాది కోట్ల డాలర్ల విలువైన అతి పెద్ద మెసేజింగ్ సంస్థ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ ద్యురోవ్. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ పోలీసులు పారిస్‌లో ఆయన్ను అరెస్టు చేసి నిర్బంధించారని తెలియగానే ట్విటర్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ ఖండించారు. పావెల్ విడు దల కోసం ట్విటర్ వేదికగా ‘ఫ్రీ పావెల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రపంచాధినేతల్లో ఎంతో పలుకుబడిగల మస్క్ గతంలో ఎప్పుడూ ఇలాంటి వివాదాల జోలికిపోలేదు. ఆరు నూరైనా... ఎలాంటి పర్యవసానాలూ, పరిణామాలూ ఎదురైనా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ ఉండితీరాలని వాదించటంలో పావెల్‌కి ఎవరూ సాటిరారు. నిజానికి అది వివాదాస్పదం కావటంతోనే అతను జైలుపాలయ్యాడు. కారణాలు వెల్లడి కాకపోయినా పసివాళ్లతో రూపొందించిన బూతుచిత్రాల పంపిణీకీ, మాదకద్రవ్య ముఠాల కార్యకలాపాలకూ, ఉగ్రవాద కార్యకలాపాలకూ, అక్రమమార్గాల్లో ద్రవ్య చలామణీకీ టెలిగ్రామ్ అవకాశమిస్తోందన్నది చాన్నాళ్లుగా ఉంటున్న అభియోగాల సారాంశం. భావప్రకటనా స్వేచ్ఛకు ఏమేరకు హద్దులుండాలి... దానివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలకు బాధ్యులెవరు... ఈ విషయంలో ప్రభుత్వాల ప్రమేయాన్ని ఎంతవరకూ అనుమతించాలి వంటి ప్రశ్నలు ఎప్పటినుంచో అందరినీ వేధిస్తున్నాయి. ఇప్పుడు పావెల్ అరెస్టుతో అవి మరింత ప్రము ఖంగా చర్చకొస్తున్నాయి. పావెల్ రష్యా పౌరుడని పేరునిబట్టి ఎవరైనా గుర్తుపడతారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల పౌరసత్వం ఉంది. అసమ్మతిని అణిచేయటంలో సిద్ధహస్తుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్ చాన్నాళ్లుగా అతన్ని బంధించాలని ప్రయత్నిస్తున్నారు. పావెల్‌ను అప్పగించాలని, కనీసం మాట్లాడటానికి అనుమతించాలని తాజాగా ఫ్రాన్స్‌ను రష్యా డిమాండ్ చేస్తోంది. 2011లో రష్యా నిర్వహించిన ఎన్నికలు పూర్తిగా బోగస్ అంటూ బయ ల్దేరిన ‘మంచు విప్లవం’ (స్నో రివల్యూషన్) దేశం నలుమూలలా విస్తరించటానికి పావెల్ దోహద పడ్డాడు. ఆ క్రమంలో ఏర్పడిన మెసేజింగ్ యాప్ కాస్తా తర్వాతకాలంలో టెలిగ్రామ్‌గా రూపుదిద్దు కుంది. పావెల్ ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను ఖండించే అభిప్రాయాలకు చోటిచ్చాడు.అంతేకాదు... ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న అకృత్యాలను బట్టబయలు చేసే వీడియోలను వెల్లడించేందుకు అనుమతించాడు. ఇతర దిగ్గజ సంస్థలు మొహం చాటేసిన ఈ అకృత్యాలు టెలి గ్రామ్ లేకపోతే బాహ్య ప్రపంచానికి బహుశా తెలిసేవి కాదు. వాట్సాప్ వంటి ఇతర సంస్థలకు లేని వెసులుబాటు– రెండు లక్షలమందితో గ్రూప్ నిర్వహించటం– టెలిగ్రామ్లోనే సాధ్యం. అయితే ఇందువల్ల అనర్థాలు తలెత్తటం కూడా వాస్తవం. ఆమధ్య పారిస్, బెర్లిన్ నగరాల్లో పేలుళ్లకు, దాడులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ టెలిగ్రామ్ యాప్‌ను వాడుకుంది. ఆ తర్వాత సంస్థ సాంకేతిక సిబ్బంది దాన్ని కట్టడిచేశారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటీయని వ్యవస్థ ఏర్పర్చు కోవాలని, నేరగాళ్ల ఆనుపానులు ఎప్పటికప్పుడు తమకు అందించాలని అనేక దేశాలు టెలిగ్రామ్‌ను కోరుతున్నాయి. యూరప్ దేశాలు ఈయూ డిజిటల్ సర్వీసుల చట్టాన్ని రెండేళ్ల క్రితం తీసు కొచ్చాయి. పర్యవసానంగా చాలా మాధ్యమ సంస్థలు దారికొచ్చాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధా రంగా ‘అవాంఛిత’ సందేశాలను జల్లెడ పడుతున్నాయి. వాటిని నిలిపేస్తున్నాయి. అయితే సమస్యే మంటే... ఈ వంకన అనేక మాధ్యమాలు సహేతుకమైన అసమ్మతికి కూడా తలుపులు వేస్తున్నాయి. నియంతలకు వంత పాడుతున్నాయి. కొన్ని సంస్థలైతే సంకేత నిక్షిప్త సందేశాల(ఎన్క్రిప్షన్)కు అవకాశమున్నదని పైకి చెబుతూ తమ వినియోగదారుల ఆనుపానులు తెలుసుకోవటానికి ప్రభు త్వాలకు అవకాశమిస్తున్నాయి. కానీ టెలిగ్రామ్ లొంగటం లేదు. ప్రతి దేశంలోనూ స్థానిక చట్టాల లొసుగులను వాడుకుని బయటపడుతోంది. అలాగని తన వేదికపై వినియోగదారులు పరస్పరం పంపుకునే సందేశాలు టెలిగ్రామ్‌కు తెలియక కాదు. వాటిని అవసరమనుకున్నప్పుడల్లా చూస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛకూ, బాధ్యతకూ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. స్వేచ్ఛ మాటున వదంతులు సృష్టించటం, అల్లర్లకు ఆజ్యం పోయటం ఎవరు చేసినా తప్పే అవుతుంది. అలాంటి వారు చట్టం ముందు తలవంచాల్సిందే. ఆ మధ్య గోరక్షణ పేరుతో బృందాలు ఏర్పడి వ్యక్తులను కొట్టిచంపిన ఉదంతాలు పెరిగాక సందేశాల పంపిణీపై వాట్సాప్ అనేక పరిమితులు విధించింది. మన దేశంలో టెలిగ్రామ్‌కు 50 లక్షలమంది చందాదారులున్నారు. మాదకద్రవ్యాలు, జూదం, బెది రించి డబ్బులు గుంజుకోవటం వంటి కార్యకలాపాలకు అది వేదిక వుతున్నదని మన ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీకు పుణ్యం టెలిగ్రామ్దే. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ఆ వ్యవహారాలపై దృష్టి సారించింది. ఇది ఒక కొలిక్కి వస్తే టెలిగ్రామ్ నిషేధానికి కూడా గురికావొచ్చన్నది విశ్లేషకుల అంచనా. ఏదేమైనా తనవల్ల సమాజానికి నష్టం కలుగుతున్నదని గ్రహించాక టెలిగ్రామ్ బాధ్యత గుర్తెరగవలసింది. కనీసం ఆ పని ఇప్పుడైనా జరగాలి. అదే సమయంలో ఆ వంకన ప్రభుత్వాలు సహేతుక విమర్శ లకూ, అసమ్మతికీ పాతరేయకుండా చూడటం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం. -
ఎయిర్‌షోలో అపశృతి.. సముద్రంలో కుప్పకూలిన విమానం
ప్యారిస్: ఫ్రాన్స్‌లో ఓ ఎయిర్‌షోలో అపశృతి దొర్లింది. 65 ఏళ్ల పైలట్ ఓ ట్రైనింగ్ విమానంలో ఆకాశంలో విన్యాసాలు చేస్తుండగా మధ్యదరా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతిచెందారు. ప్రమాదానికి గురైన ఫోగా మ్యాగిస్టర్ జెట్ విమానం వరల్డ్‌వార్ 2 తర్వాత తయారైంది కావడం గమనార్హం. ఈ విమానాన్నిఫ్రాన్స్ ఆర్మీ శిక్షణ కోసం వాడుతోంది. విమానంలో ఎజెక్షన్ సీటు లేకపోవడమే పైలట్ మృతికి కారణమని చెబుతున్నారు. -
పారాలింపిక్స్ సమయం
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా భారత అథ్లెట్ల బృందం శుక్రవారం ఫ్రాన్స్‌కు పయనమైంది. ఇటీవల పారిస్ వేదికగా ఒలింపిక్స్ ముగియగా.. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు అక్కడే పారాలింపిక్స్ జరగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పాల్గొంటారు. విశ్వ క్రీడలకు బయలుదేరే ముందు భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 54 మంది బరిలోకి దిగి 19 పతకాలు (5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు) సాధించగా.. ఈసారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా అన్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కనోయింగ్, సైక్లింగ్, బ్లైండ్ జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండోలో మన అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. ‘ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మన పారా అథ్లెట్లు ఒలింపిక్స్ వరకు చేరుకున్నారు. ‘పారిస్’ పారాక్రీడల్లో సత్తా చాటి అధిక సంఖ్యలో పతకాలు సాధిస్తారనే నమ్మకముంది. ఈ బృందంలో చాలా మంది అథ్లెట్లు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా లబ్ది పొందినవారే. అథ్లెట్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విశ్వక్రీడల్లో అధిక సంఖ్యలో పతకాలు సాధించి దేశ ఖ్యాతిని మరింత పెంపొందించాలి’ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా అన్నారు. ఫ్లాగ్ బేరర్లుగా భాగ్యశ్రీ, సుమిత్ పారిస్ పారాలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. టోక్యో పారాలింపిక్స్ ఎఫ్64 విభాగంలో స్వర్ణం నెగ్గిన సుమిత్ అంటిల్.. గత ఏడాది ప్రపంచ పారా చాంపియన్íÙప్లోనూ బంగారు పతకం సాధించాడు. మహిళల ఎఫ్34 కేటగిరీలో పోటీపడుతున్న భాగ్యశ్రీ ఆసియా పారా క్రీడల్లో రజతం సాధిచింది. ఈ నేపథ్యంలో పీసీఐ అధ్యక్షుడు ఝఝారియా మాట్లాడుతూ.. ‘విశ్వక్రీడల ఆరంభ వేడుకలో సుమిత్, భాగ్యశ్రీ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరిస్తారు. వీరిద్దరూ గత కొంతకాలంగా చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. టోక్యో పారాలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధిస్తామనే నమ్మకముంది. అనేక క్రీడాంశాల్లో మన అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. దాని వెనక వారి కఠోర శ్రమ, కృషి ఉంది. పారిస్ పారాలింపిక్స్‌లో దానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నాడు. ఈ క్రీడల్లో తెలంగాణ నుంచి మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో జివాంజి దీప్తి పోటీపడనుంది. -
అమెరికాకే అందలం
పారిస్: విశ్వ క్రీడల్లో చివరిరోజు ఆఖరి మెడల్ ఈవెంట్లో అమెరికా అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. చివరి మెడల్ ఈవెంట్‌గా జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా 67–66 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును ఓడించింది. మహిళల బాస్కెట్‌బాల్ జట్టు స్వర్ణ పతకంతో పతకాల పట్టికలో అమెరికా జట్టు టాప్ ర్యాంక్‌ను ఖరారు చేసుకోవడం విశేషం. అమెరికా, చైనా జట్లు 40 స్వర్ణ పతకాలతో సమంగా నిలిచాయి. అయితే చైనాకంటే అమెరికా ఎక్కువ రజత పతకాలు, ఎక్కువ కాంస్య పతకాలు సాధించింది. దాంతో అమెరికాకు అగ్రస్థానం దక్కింది. ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో అమెరికా మహిళల జట్టుకు గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో అమెరికాకు ఓటమి తప్పదా అనిపించింది. ఆఖరి క్వార్టర్లో నాలుగు నిమిషాలు మిగిలి ఉన్నంతవరకు ఫ్రాన్స్ 53–52తో ఒక్క పాయింట్ ఆధిక్యంలో ఉంది. ఈ దశలో తమకు లభించిన ఫ్రీ త్రోను అమెరికా పాయింట్‌గా మలిచి స్కోరును 53–53తో సమం చేసింది. ఆ తర్వాత అమెరికా కీలక పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి వెళ్లింది. 17 సెకన్లు మిగిలి ఉన్నాయనగా అమెరికా 63–59తో ముందంజలో నిలిచింది. ఈ దశలో తమకు లభించిన రెండు ఫ్రీ త్రోలను ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ పాయింట్లుగా మలిచింది. దాంతో అమెరికా ఆధిక్యం 63–61గా మారింది. 11 సెకన్లు ఉన్నాయనగా అమెరికా ప్లేయర్ కెల్సీ ప్లమ్ రెండు పాయింట్లు సాధించి 65–61తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ గ్యాబీ విలియమ్స్ మూడు పాయింట్ల షాట్ సంధించడంతో అమెరికా ఆధిక్యం 65–64కు తగ్గింది. మూడు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ ఫౌల్ చేయడంతో అమెరికాకు రెండు ఫ్రీ త్రోలు రావడం, వాటిని పాయింట్లుగా మలచడం జరిగింది. దాంతో అమెరికా 67–64తో ముందంజలోకి వెళ్లింది. చివరి క్షణంలో ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ రెండు పాయింట్లు సాధించినా ఆతిథ్య జట్టు పాయింట్ తేడాతో ఓటమి చవిచూసింది. అమెరికా జట్టులో విల్సన్ అజా 21 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... కెల్సీ ప్లమ్, కాపర్ కాలీ 12 పాయింట్ల చొప్పున సాధించారు. ఈ గెలుపుతో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా ఎనిమిదో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఓవరాల్‌గా అమెరికా మహిళల జట్టుకిది పదో స్వర్ణం. 1984 లాస్ ఏంజెలిస్, 1988 సియోల్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన అమెరికా జట్టు 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. ఆ తర్వాత 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల జట్టు పసిడి పతకాల వేట మళ్లీ మొదలై 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు కొనసాగుతూనే ఉంది. మరోవైపు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల బాస్కెట్‌బాల్ ఫైనల్లో అమెరికా జట్టు 98–87 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుపై గెలిచి ఓవరాల్‌గా 17వసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టులో స్టీఫెన్ కర్రీ త్రీ పాయింటర్ షాట్లను ఎనిమిదిసార్లు వేయడం విశేషం. దిగ్గజ ప్లేయర్లు కెవిన్ డురాంట్ 15 పాయింట్లు, లెబ్రాన్ జేమ్స్ 14 పాయింట్లు, డేవిడ్ బుకెర్ 15 పాయింట్లు సాధించారు. 14 అమెరికా సాధించిన స్వర్ణాల సంఖ్యలో అత్యధికంగా అథ్లెటిక్స్ నుంచి 14 పసిడి పతకాలు లభించాయి. ఆ తర్వాత స్విమ్మింగ్‌లో 8, జిమ్నాస్టిక్స్‌లో 3, బాస్కెట్‌బాల్, సైక్లింగ్ ట్రాక్, ఫెన్సింగ్, రెజ్లింగ్‌లో 2 చొప్పున స్వర్ణాలు దక్కాయి. సైక్లింగ్ రోడ్, ఫుట్‌బాల్, గోల్ఫ్, రోయింగ్, షూటింగ్, సరి్ఫంగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒక్కో స్వర్ణం చొప్పున లభించాయి. 19 ఇప్పటి వరకు 30 సార్లు ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 19 సార్లు అమెరికా జట్టు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సోవియట్ యూనియన్ ఆరుసార్లు టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. యూనిఫైడ్ టీమ్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ ఒక్కోసారి మొదటి స్థానంలో నిలిచాయి. -
ఫ్రాన్స్ మళ్లీ 40 ఏళ్ల తర్వాత..
ఒలింపిక్స్ ఫుట్‌బాల్ ఫైనల్లో ఫ్రాన్స్ రెండోసారి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచేందుకు ఫ్రాన్స్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు విజయం దూరంలో నిలిచింది. స్వదేశంలో జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో ఫ్రాన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీఫైనల్లో ఫ్రాన్స్ 3–1 గోల్స్‌తో ఈజిప్ట్ జట్టుపై విజయం సాధించి 1984 తర్వాత మళ్లీ ఒలింపిక్స్ క్రీడల్లో టైటిల్ పోరుకు అర్హత పొందింది.ఫ్రాన్స్ తరఫున మెటెటా జీన్ ఫిలిప్ (83వ, 99వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో మెరవగా... మైఖేల్ ఒలీస్ (108వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. ఈజిప్ట్ తరఫున మహమూద్ సాబెర్ (62వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. ఒలింపిక్స్ చరిత్రలో ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 1900 పారిస్ క్రీడల్లో రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్ ఆ తర్వాత 1984 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. -
కొలనులో కొత్త కెరటం
ఒలింపిక్స్‌లో ఈత పోటీలు అనగానే.. ఠక్కున గుర్తొచ్చే పేరు మైకేల్ ఫెల్ప్స్! మకుటం లేని మహారాజులా స్విమ్మింగ్‌పూల్‌ను ఏలిన ఈ అమెరికా స్విమ్మర్.. విశ్వక్రీడల్లో ఏకంగా 28 పతకాలు సాధించి అదుర్స్ అనిపించుకున్నాడు. అందులో 23 స్వర్ణాలు ఉన్నాయంటే.. విశ్వక్రీడల్లో అతడి హవా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రాన్స్ నయా స్విమ్మర్ లియాన్ మర్చండ్.. అమెరికా దిగ్గజం బాటలో దూసుకెళ్తున్నాడు. పాల్గొన్న తొలి ఒలింపిక్ క్రీడల్లోనే నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకొని ఫెల్ప్స్‌కు తానే సరైన వారసుడినని అనిపించుకుంటున్నాడు. రెండు గంటల వ్యవధిలో రెండు స్వర్ణాలు సాధించి అభిమానుల దృష్టిని ఆకర్షించిన మర్చండ్.. ‘పారిస్’ క్రీడల్లో నాలుగో పసిడి చేజిక్కించుకున్నాడు. నాలుగు భిన్న రేసుల్లో అగ్రస్థానంలో నిలిచిన మర్చండ్.. ఈ నాలుగింట ఒలింపిక్ రికార్డులు బద్దలు కొట్టడం విశేషం. ఫ్రాన్స్ యువ స్విమ్మర్ లియాన్ మర్చండ్ బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్‌లోనే నాలుగో పసిడి పతకంతో సత్తా చాటాడు. ఇప్పటికే మూడు స్వర్ణాలు నెగ్గిన మర్చండ్.. ఆదివారం పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే రేసులో 1 నిమిషం 54.06 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో పసిడి పతకాలు గెలుచుకున్న 22 ఏళ్ల మర్చండ్.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యమని అంటున్నాడు. మర్చండ్ పోటీపడ్డ తొలి రేసును కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మక్రాన్.. అతడి ప్రతిభకు ముగ్ధుడయ్యారు. వారం రోజుల వ్యవధిలో కొలనులో సంచలన ఫలితాలు సాధించి రికార్డులు తిరగరాసిన మర్చండ్కు తాను అభిమాని అయిపోయానని వెల్లడించారు.‘అభిమాన సందోహం మధ్య పతకం గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చొని అభివాదం చేస్తుంటే.. ఇన్నేళ్లు పడ్డ కష్టం అంతా మరిచిపోయినట్లు అనిపిస్తుంది’ అని నాలుగో పసిడి పతకం గెలిచిన అనంతరం మర్చండ్ అన్నాడు. తనను తాను సిగ్గరిగా చెప్పుకునే మర్చండ్.. తాజా క్రీడల్లో చివరగా బరిలోకి దిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే సమయంలో చాలా ప్రశాంతంగా కనిపించాడు. మూడు పతకాలు గెలిచిన గర్వం కానీ, మరో పతకం సాధించాలనే ఒత్తిడి కానీ ఏమాత్రం లేకుండా బరిలోకి దిగి బంగారు పతకం చేజిక్కించుకున్నాడు. ‘నాలుగు స్వర్ణాలు గెలవడం నమ్మశక్యంగా లేదు. మొదట ఒక పతకం గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆ తర్వాత వరుసగా మంచి ప్రదర్శనలు కనబర్చా. ఫలితం నాకు అనుకూలంగా వచ్చింది’ అని మర్చండ్ పేర్కొన్నాడు. ఫ్రెంచ్ ఫెల్ప్స్... ఈత కొలనులో సంచలనాలు నమోదు చేస్తున్న మర్చండ్ను అభిమానులు ముద్దుగా ‘ఫ్రెంచ్ ఫెల్ప్స్’ అని పిలచుకుంటున్నారు. అయితే అది తనపై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని.. ఒకింత ఆనందంగా కూడా ఉందని మర్చండ్ పేర్కొన్నాడు. దశాబ్దకాలం పాటు ఒలింపిక్స్‌లో ఏకఛత్రాధిపత్యం కనబర్చిన ఫెల్ప్స్ నమోదు చేసిన రెండు ఒలింపిక్ రికార్డుల (400 మీటర్ల మెడ్లే, 200 మీటర్ల మెడ్లే)ను మర్చండ్ తాజాగా బద్దలు కొట్టాడు. మరోవైపు ఫెల్ప్స్ కూడా మర్చండ్ ఫీట్‌కు ఫిదా అయిపోయాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, బ్రెస్ట్‌స్ట్రోక్‌లో మర్చండ్ స్వర్ణాలు గెలిచిన సందర్భంలో ఫెల్ప్స్ సంబరాలు జరుపుకున్న వీడియో వైరల్‌గా మారింది. ‘ఫెల్ప్స్తో పోల్చినప్పుడు గర్వంగా ఉంటుంది. స్విమ్మింగ్ రూపురేఖలను మార్చిన ఘనత అతడిది’ అని మర్చండ్ అన్నాడు. ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు సాధించేందుకు ఫెల్ప్స్ ఇచ్చిన సూచనలు కూడా పనిచేశాయని వెల్లడించాడు. అయితే ‘పారిస్’ క్రీడల్లో మర్చండ్తో పోటీపడిన సహచరులు మాత్రం.. ఫెల్ప్స్ కన్నా మర్చండ్ కఠిన ప్రత్యర్థి అని ప్రశంసించారు. మర్చండ్తో కలిసి 400 మీటర్లు, 200 మీటర్లు వ్యక్తిగత మెడ్లే విభాగంలో బరిలోకి దిగిన అమెరికా స్విమ్మర్ కార్సాన్ ఫాస్టర్ మాట్లాడుతూ.. ‘పోటీలో పాల్గొన్న వారందరికీ.. అత్యుత్తమ స్విమ్మర్తో బరిలోకి దిగిన అనుభవం ఎదురైంది. పోటీ పడిన నాలుగు ఈవెంట్లలోనూ స్వర్ణాలు గెలవడం మామూలు విషయం కాదు’ అని పేర్కొన్నాడు. –సాక్షి క్రీడా విభాగం -
Paris Olympics: ఫ్రాన్స్‌లో దుండగుల దుశ్చర్య
పారిస్: ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న ఫ్రాన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు క్రీడోత్సవాలు ప్రారంభం కాగా, దుండగుల దుశ్చర్య కారణంగా ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సబ్స్టేషన్లపై దాడి చేశారు. కేబుళ్లు తెంపేశారు. ఫలితంగా ఫ్రాన్స్‌తోపాటు యూరప్‌లోని పలు ప్రాంతాల నుంచి పారిస్‌కు రైల్వే సేవలు నిలిపివేయాల్సి వచి్చంది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైళ్లలో వెళ్లాల్సిన ఒలింపిక్ క్రీడాకారులను బస్సుల్లో పారిస్‌కు తరలించారు. ఒలింపిక్స్ ప్రారంభమైన రోజే పథకం ప్రకారం జరిగిన ఈ చర్యల వెనుక కుట్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వామపక్షవాద మిలిటెంట్లు లేదా పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్నదే వారి ఎత్తుగడ కావొచ్చని చెబుతున్నారు. అయితే, ఒలింపిక్ క్రీడలతో ఈ దాడులకు ప్రత్యక్ష సంబంధం లేదని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. క్రీడలను అడ్డుకోవాలన్నది దుండగుల ఆలోచన కాకపోవచ్చని తెలిపారు. హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను స్తంభింపజేసిన దుండుగులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. నేరం రుజువైతే వారికి పదేళ్ల నుంచి 20 ఏళ్ల దాకా జైలు శిక్షపడే అవకాశం ఉందని చెప్పారు. తాజా ఘటనలపై ఫ్రాన్స్ ప్రధానమంత్రి గాబ్రియెల్ అటాల్ స్పందించారు. ఇవి ముందస్తు పథకం ప్రకారం జరిగిన దాడులేని చెప్పారు. ఉత్తర, తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి పారిస్‌కు దారితీసే రైలు మార్గాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పారిస్‌కు వెళ్లే రైళ్లను అడ్డుకోవాలన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దుండగుల కోసం గాలింపు ప్రారంభమైందన్నారు. మధ్యాహ్నం తర్వాత రైళ్ల రాకపోకలు కొనసాగాయని రవాణా మంత్రి పాట్రిస్ వెర్‌గ్రిటే చెప్పారు. ఒలింపిక్స్ సందర్భంగా ముష్కరులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని ఫ్రాన్స్ నిఘా వర్గాలు నెల రోజుల క్రితమే హెచ్చరించాయి. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్‌లో కలకలం
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కలకలం. పారిస్ వేదికగా ఓ వైపు సమ్మర్ ఒలింపిక్స్ 2024 (జులై 26) ప్రారంభం కావడం.. మరోవైపు పారిస్ హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్‌ను గుర్తు తెలియని అగంతకులు పెద్ద మొత్తంలో విధ్వంసం చేయడం ఆందోళన నెలకొంది. ఫలితంగా ఫ్రాన్స్ ఇంటర్సిటీ హై స్పీడ్ రైల్ సర్వీస్ నెట్వర్క్ స్తంభించినట్లు ఫ్రాన్స్ ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే కంపెనీ సొసైటీ నేషనల్ డెస్ కెమిన్స్ డి ఫెర్ ఫ్రాంకైస్ (ఎస్ఎన్సీఎఫ్) తెలిపింది.నిందితులు ఏకకాలంలో దాడులు చేయడంతో అట్లాంటిక్, తూర్పు-ఉత్తర రైల్వే లైన్లలో కార్యకలాపాలు ఆగిపోయాయిని ఎస్ఎన్సీఎఫ్ అధికారులు వెల్లడించారు.France's high-speed rail network has been hit by "malicious acts" including arson attacks that have disrupted the transport system, train operator SNCF said, hours before the opening ceremony of the Paris Olympics. “This is a massive attack to paralyse the Railway” https://t.co/RaAzI1URZC pic.twitter.com/JPHZXmO1k8— #𝕎𝕒𝕣 ℍ𝕠𝕣𝕚𝕫𝕠𝕟 (@WarHorizon) July 26, 2024 ‘రైల్వే కార్యకలాపాల్ని దెబ్బతీసేందుకు రైల్వే లైన్లను విధ్వంసం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రభావిత మార్గాలలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరమ్మత్తులు నిర్వహించి, పరిస్థితుల్ని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరమ్మత్తులు చేసిన రైల్వే ట్రాక్‌లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే వారం రోజుల సమయం పడుతుంది’ అని రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లను వేర్వేరు ట్రాక్‌లకు మళ్లిస్తున్నాం. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో రైళ్ల రాకపోకల్ని రద్దు చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రజలు తమ రైల్వే ప్రయాణాల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోమని ఎస్ఎన్సీఎఫ్ విజ్ఞప్తి చేస్తోంది. -
స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?
అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి, స్టైల్‌కి ఐకాన్ అయిన నటాషా పూనావాల ఎప్పటికప్పుడూ సరికొత్త ఫ్యాషన్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె స్వతహాగానే ఫ్యాషన్‌గా ఉంటుంది ఆమె ఆహార్యం. ఆమె ఎప్పటికప్పుడూ ట్రెండ్‌ని సెట్ చేసే సరికొత్త డిజైనర్ వర్ దుస్తులతో తుళ్లక్కుమంది. అలానే ఈసారి ఫ్రాన్స్‌లో జరిగిన సమ్మర్ గాలా 2024 కోసం క్రిస్టల్స్‌తో అలంకరించిన గౌనుని ధరించింది. ఈ గాలా ఈవెంట్లో నటాషా ధరించిన మార్టిన్ గ్లాస్ ఆకృతి పర్సు హైలెట్‌గా నిలిచింది. ఈ పర్సు వోడ్కా, జిన్, కాక్టెయిల్ వంటి జ్యూస్‌లనే సర్వ్ చేసే మార్టిన్ గ్లాస్ ఆకృతిలో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడ ఉన్న ప్రేక్షకుల దృష్టిని ఈ పర్సు ఎక్కువగా ఆకర్షించింది. అంతేగాదు సోషల్ మీడియాలో సైతం అందుకు సంబంధించిన ఫోటోల్లో కనిపించిన ఈ పర్సే అందరి దృష్టిని అట్రాక్ట్ చేసింది. ఇక్కడ నటాషా ముగ్ధమనోహరంగా ఉండేలా ట్రాన్స్పరేంట్ క్రిస్టల్ గౌనులో మెరిసిపోయింది. అందుకు తగ్గట్లు చేతికి ధరించిన పర్సు ఎవర్ గ్రీన్‌గా ఉంది. అంతేగాదు ఈ మార్టిన్ గాజు ఆకృతి పర్సుని క్రిస్టల్స్‌తో అలంకరించడంతో నటాషా దివి నుంచి భువి వచ్చిన దేవకన్యలా ధగ ధగ మెరిసిపోయింది. ఈ పర్సు ఓపెనింగ్ అద్దం మాదిరిగా ఉంటుంది. జుడిత్ లీబర్ బ్రాండ్‌కి చెందిన ఈ పర్సు ధర ఏకంగా రూ. 4.85 లక్షలు పైనే ఉంటుందట. నటాషా ఎప్పుడూ డిఫెరెంట్ ఫ్యాషన్ ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈ సారి ఆమె ధరించి గ్లాస్ ఆకృతి పర్సు అందరి మనసులను దోచుకుంది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రియులను ఈ పర్సు ఎంతగానో ఆకట్టుకుంది. అంతా వాటే ఏ స్టైలిష్ పర్సు అని ప్రశంసిస్తున్నారు కూడా. ఎవరీ నటాషా?భారతదేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన అదార్ పూనావాలా భార్యే నటాషా పూనావాలా. ఆమె అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. 2023 నాటికి, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విలువ రూ. 1.92 లక్షల కోట్లుగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అంతేగాదు ఆమె సైరస్ పూనావల్ల గ్రూప్‌లోని వివిధ కంపెనీల కోసం సృజనాత్మకతతో కూడిన వ్యాపార వ్యూహాలతో లాభాల బాట పట్టించడంలో నటాషా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె తన అత్తగారి గౌరవార్థం 2012లో స్థాపించబడిన కుటుంబ ఫౌండేషన్ అయిన విల్లో పూనావల్లా ఫౌండేషన్‌కు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే భారతదేశం కోసం బ్రిటీష్ ఆసియన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫండ్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. పైగా బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్‌కు ఇండియా అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యురాలు కూడా.(చదవండి: హీరోయిన్ కత్రినా అనుసరించే రెండుపూటల భోజనం, షట్పావళి డైట్ ప్లాన్ అంటే..?) -
షారూఖ్ ఖాన్‌కు దక్కిన మరో అరుదైన గౌరవం.. భారత్‌లో ఏకైక హీరోగా రికార్డ్
ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ మ్యూజియం ప్రత్యేకంగా ఆయన పట్ల గౌరవాన్ని చూపించింది. హీరోగా, ప్రొడ్యూసర్‌గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన షారుఖ్‌ను ఇప్పటికే పలు అవార్డ్స్‌తో పాటు మంచి గుర్తింపు కూడా దక్కింది. తాజాగా ఆయన పేరుతో బంగారు నాణేలు ముద్రించి షారుఖ్ పట్ల తమ అభిమానాన్ని ఆ మ్యూజియం చాటుకుంది.గతేడాదిలో వరుస సూపర్ హిట్లు అందుకున్న షారూఖ్ ఖాన్‌ను ఫ్రాన్స్‌లోని గ్రేవిన్ మ్యూజియం సత్కరించనుంది. ఆయన పేరుతో బంగారు నాణేలను ముద్రించి ఆయన పట్లు తమ అభిమానాన్ని చాటుకుంది. భారతీయ సినిమా రంగంలో 100కుపైగా సినిమాల్లో నటించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు గాను ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆగష్టు 10 అవార్డుతో పాటు షారుక్ ఖాన్ బంగారు నాణేలను గ్రేవిన్ మ్యూజియం విడుదల చేయనుంది. దీంతో ఈ ఘనతను సాధించిన తొలి భారతీయడిగా షారూఖ్ ఖాన్ రికార్డు క్రియేట్ చేశారు.లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్‌లో షారుక్లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్ జ్యూరీ ఆయన్ను 'కెరీర్ అఛీవ్మెంట్ అవార్డు'కు తాజాగా ఎంపిక చేసింది. ఆగస్టు 7 నుంచి 17 వరకు లొకర్నో (స్విట్జర్లాండ్)లో ఈ కార్యక్రమం జరగనుంది. లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్ 77వ ఎడిషన్ కోసం అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 10న ఈ అవార్డును షారుక్ అందుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన కెరీర్లో హిట్ సినిమాల లిస్ట్‌లో ఒకటైన 'దేవ్‌దాస్'ను అక్కడ ప్రదర్శించనున్నారు. ఆ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ నటుడిగా షారుక్ నిలిచారు. -
Paris Olympics: విశ్వ క్రీడల వేదికలివే.. ఆ ఐదు ప్రత్యేకం
ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఆరంభానికి సమయం ఆసన్నమైంది. ఫ్రాన్స్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక క్రీడలు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.జూలై 26 నుంచి ఆగష్టు 11 వరకు విశ్వ క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు 33 భిన్న వేదికలు ఆతిథ్యం ఇస్తున్నాయి. మరి ఆ వేదికలు, అక్కడ జరిగే ఈవెంట్స్ ఏమిటో తెలుసుకుందాం!ఐకానిక్ సైట్స్.. ఈ ఐదూ స్పెషల్ఈఫిల్ టవర్ఈ ప్రఖ్యాత కట్టడం సమీపంలోనే బీచ్ వాలీబాల్(ఐరన్ లేడీ పాదాల చెంత), జూడో, రెజ్లింగ్(చాప్స్ డీ మార్స్ పార్క్) నిర్వహించనున్నారు.కాగా ఈఫిల్ టవర్‌ను 1889లో ప్రారంభించగా.. ప్యారిస్ ఐకానిక్ సింబల్‌గా మారింది. పర్యాటకుల సందడితో కలకలలాడుతూ ఉంటుంది.గ్రాండ్ పలైస్వరల్డ్ ఫెయిర్ 1900లో భాగంగా రూపొందించిన గ్లాస్ అండ్ స్టీల్ మాస్టర్‌పీస్. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దీనిని మిలిటరీ తాత్కాలిక ఆస్పత్రిగా మార్చారు.ఇక 21వ శతాబ్దంలో తిరిగి ఆర్ట్ గ్యాలరీగా మారిపోయిన గ్రాండ్ పలైస్‌లో.. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఆరిస్టుల పెయింటింగ్‌లతో నిండిపోయింది. ఇప్పుడు ఫెన్సింగ్, తైక్వాండో క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది.ప్లేస్ డి లా కాన్కోర్డేప్యారిస్లోని మేజర్ పబ్లిక్ స్క్వేర్స్‌లో ఒకటి. చాంప్స్- ఎలిసీస్కు తూర్పు భాగంలో ఉంటుంది. ఫ్రెంచి విప్లవ సమయంలో ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.దీంతో తాత్కాలికంగా రివల్యూషన్ స్క్వేర్గానూ ఈ ప్లేస్ పేరును మార్చారు. తర్వాత మళ్లీ ప్లేస్ డి లా కాన్కోర్డేగానే పిలుచుకుంటున్నారు.ఇక్కడ BMX(బైస్కిల్, మోటోక్రాస్ స్టంట్) ఫ్రీస్టైల్ స్కేట్ బోర్డింగ్, 3X3 బాస్కెట్‌బాల్ క్రీడలు నిర్వహించనున్నారు.ప్యాలస్ ఆఫ్ వెర్సైల్స్డ్రెస్సేజ్, షోజంపింగ్, ఈక్వెస్ట్రియన్లకు వేదిక. ప్యారిస్ నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. మారథాన్, పెంటథ్లాన్ ఈవెంట్లకు కూడా వేదిక కానుంది.17వ శతాబ్దంలో ‘ది సన్ కింగ్’ లూయీస్ XIV వెర్సైల్స్‌ను ఫ్రెంచి రాజ నివాసంగా మార్చాడు. దాదాపు పది వేల మంది సిబ్బందితో ఇక్కడ నివసించాడు.ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపు పొందిన వెర్సైల్స్ ప్యాలస్ 1979 నుంచి పర్యాటకుల ఫేవరెట్లలో ఒకటిగా మారిపోయింది.మర్సెలీఅధునాతన ఫ్రాన్స్‌లోని పట్టణాల్లో పేరెన్నికగన్నది సిటీ ఆఫ్ మర్సెలీ. ఇక్కడ సెయిలింగ్ పోటీలు నిర్వహించనున్నారు. మూడు వందలకు పైగా సెయిలర్లు మర్సెలీలోని నదీ జలాల్లో పతకాల కోసం పోటీపడనున్నారు. ఈ పట్టణం పది ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు కూడా గతంలో ఆతిథ్యం ఇచ్చింది.మిగిలిన వేదికలు, అక్కడి ఈవెంట్లు ఇవే👉ఆక్వాటిక్స్ సెంటర్- ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో👉బెర్సీ ఎరీనా- ఆర్టిస్టిక్ జిమ్మాస్టిక్స్, బాస్కెట్‌బాల్, ట్రంపోలిన్👉బోరీయాక్స్ స్టేడియం- ఫుట్‌బాల్👉చెటారౌక్స్ షూటింగ్ సెంటర్- షూటింగ్👉ఎలాన్కోర్ట్ హిల్- సైక్లింగ్ మౌంటేన్ బైక్👉జెఫ్రాయ్- గీచర్డ్ స్టేడియం- ఫుట్‌బాల్👉హోటల్ డి విల్లే- అథ్లెటిక్స్👉ఇన్వాలిడ్స్- ఆర్చరీ, అథ్లెటిక్స్, సైక్లింగ్ రోడ్👉లా బ్యూజౌరీ స్టేడియం- ఫుట్‌బాల్👉లీ బౌర్గెట్ స్పోర్ట్ క్లైంబింగ్ వెన్యూ- స్పోర్ట్ క్లైంబింగ్👉గోల్ఫ్ నేషనల్-గోల్ఫ్👉లియాన్ స్టేడియం- ఫుట్‌బాల్👉నైస్ స్టేడియం- ఫుట్‌బాల్👉నార్త్ ప్యారిస్ ఎరీనా- బాక్సింగ్, మోడర్న్ పెంటాథ్లాన్👉పార్క్ డెస్ ప్రిన్సెస్- ఫుట్‌బాల్👉ప్యారిస్ లా డిఫెన్స్ ఎరీనా- స్విమ్మింగ్, వాటర్ పోలో👉పియరీ మౌరాయ్ స్టేడియం- బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్👉పోన్ట్ అలెగ్జాండ్రీ III- సైక్లింగ్ రోడ్, మారథాన్ స్విమ్మింగ్, ట్రిథ్లాన్👉పోర్టే డీ లా చాపెల్లె ఎరీనా- బ్యాడ్మింటన్, రిథమిక్ జిమ్నాస్టిక్స్👉స్టాడే రొలాండ్- గ్యారోస్- బాక్సింగ్, టెన్నిస్👉సెయింట్ క్వెంటిన్ ఎన్ వెలీన్స్ బీఎంఎక్స్ స్టేడియం- సైక్లింగ్ బీఎంఎక్స్ రేసింగ్👉సెయింట్ క్వెంటిన్ ఎన్ వెలీన్స్ వెలొడ్రోమ్స్- సైక్లింగ్ ట్రాక్👉సౌత్ ప్యారిస్ ఎరీనా- హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్👉స్టాడే డి ఫ్రాన్స్- అథ్లెటిక్స్, రగ్బీ సెవెన్స్👉టీహుపో టాహిటి- సర్ఫింగ్👉ట్రొకాడెరో- అథ్లెటిక్స్, సైక్లింగ్ రోడ్👉వైర్స సర్ మార్నే నాటికల్ స్టేడియం- కానో స్లాలమ్, కాన్స్ స్ప్రింట్, రోయింగ్👉వెస్-డూ- మానియర్ స్టేడియం- హాకీ.చదవండి: Paris Olympics 2024: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే.. -
EURO CUP 2024: సెమీస్‌లో ఫ్రాన్స్ ఓటమి.. ఫైనల్లో స్పెయిన్
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో స్పెయిన్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ద భాగంలోనే మూడు గోల్స్ నమోదయ్యాయి. 8వ నిమిషంలో రాండల్ కోలో ముఆని గోల్ సాధించి ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం స్పెయిన్ ఆటగాళ్లు 21వ నిమిషంలో లామిన్ యమాల్, 25వ నిమిషంలో డానీ ఓల్మో గోల్స్ సాధించారు. రెండో అర్ద భాగంలో ఫ్రాన్స్ ఎంత ప్రయత్నించినా.. స్పెయిన్ ఆధిక్యతను తగ్గించలేక పోయింది. ఫలితంగా ఓటమిపాలైంది. లామిన్ యమాల్ యూరో కప్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన గోల్ స్కోరర్‌గా రికార్డుల్లోకెక్కాడు.ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ రేపు (జులై 11) జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జులై 15న జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.


