రొయ్యలతో.. టేస్టీ టేస్టీగా బట్టర్‌ గార్లిక్‌ ఫ్రాన్స్‌ చేయండిలా..! | Sakshi
Sakshi News home page

రొయ్యలతో.. టేస్టీ టేస్టీగా బట్టర్‌ గార్లిక్‌ ఫ్రాన్స్‌ చేయండిలా..!

Published Fri, Oct 6 2023 10:49 AM

Indian Style Butter Garlic Prawns Recipe - Sakshi

గ్లారిక్‌ బటర్‌ ప్రాన్స్‌కి కావలసినవి:
పచ్చిరొయ్యలు – అరకేజీ
వెల్లుల్లి రెబ్బలు – ఐదు 
వెన్న – రెండు టేబుల్‌ స్పూన్లు 
నూనె – టేబుల్‌ స్పూను
కారం – టీస్పూను 
మిరియాల పొడి – అర టీస్పూను 
నిమ్మరసం – టేబుల్‌ స్పూను 
కొత్తిమీర తరుగు – పావు కప్పు
ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ విధానం:
రొయ్యలను శుభ్రం చేసి, నాలుగైదు సార్లు కడగాలి. మందపాటి బాణలిలో టేబుల్‌ స్పూను వెన్న, నూనె వేసి మంటమీద పెట్టాలి. వెన్న కరిగిన వెంటనే కడిగిన రొయ్యలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి. ఐదు నిమిషాలు మగ్గిన తరువాత వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి వేయాలి. రెండు నిమిషాలు తరువాత మిగిలిన వెన్న, కారం నిమ్మరసం వేసి అన్ని కలిసేలా కలపాలి. వెన్న పైకి తేలేంత వరకు వేయించాలి. వెన్న పైకి తేలిన తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించేయాలి. 

(చదవండి: ఈజీగా బరువు తగ్గేలా..ఈ ఓట్స్‌ లడ్డూ ట్రై చేయండిలా!)

Advertisement
Advertisement