
స్పెయిన్‌లో వెంట వెంటనే లొకేషన్స్ షిఫ్ట్ అవుతున్నారు హీరో రవితేజ. ఆయన కెరీర్‌లోని 76వ సినిమా చిత్రీకరణ ఇటీవల స్పెయిన్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్పెయిన్‌లోని వాలెన్షియా, సమీప దీవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా మరో షూటింగ్ షెడ్యూల్ శుక్రవారం ప్రారంభమైనట్లు యూనిట్ పేర్కొంది. జెనీవా, ఫ్రాన్స్ లొకేషన్స్‌లో కూడా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశామని మేకర్స్ తెలిపారు.
మొత్తం ఈ 25 రోజుల ఫారిన్ షెడ్యూల్‌లో కీలకమైన టాకీపార్టుతోపాటు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రెండుపాటలను కూడా చిత్రీకరించనున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.