
ప్రపంచంలో అతిపెద్ద పర్యాటక మ్యూజియంగా గుర్తింపు పొందిన ప్రాన్స్ దేశపు పారిస్ నగరంలోని లౌవ్రే మ్యూజియంలో జరిగిన భారీ ఆభరణాల దొంగతనం ఫ్రెంచ్ సాంస్కృతిక ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. నిమిషాల వ్యవధిలోనే దొంగలు అత్యంత చాకచక్యంగా తమ పని కానిచ్చేశారు.
కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ భారీ దొంగతనం జరగడం, అందులోనూ భారీ భద్రత ఉండే ఈ మ్యూజియం నుంచి విలువైన ఆభరణాలను అపహరించడంతో తాత్కాలికంగా ఆ మ్యూజియాన్ని మూసివేశారు.
ఫ్రెంచ్ క్రౌన్ జువెల్స్ (రాజ కుటుంబ ఆభరణాలు) ప్రదర్శించే ప్రఖ్యాత గ్యాలరీ (Galerie d’Apollon) మ్యూజియం తెరిచిన వెంటనే కాచుకుని కూర్చున్న దొంగలు తమ పనిని అతి తక్కువ వ్యవధిలో ముగించేశారు. బాస్కెట్ లిఫ్ట్ ద్వారా మ్యూజియంలోకి ప్రవేశించి నెపోలియన్, ఆయన భార్య జోసెఫిన్‌కు చెందిన తొమ్మిది విలువైన ఆభరణాలను అపహరించారు. దాంతో మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశారు.
19వ శతాబ్దం ప్రారంభంలో నెపోలియన్ పాలన సమయంలో రూపొందించబడిన ఆభరణాలుగా వీటిని చెబుతున్నారు. 1804–1814 మధ్య, నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ఉన్న కాలంలో ఆయన భార్య జోసెఫిన్ వీటిని ధరించేదట.
రోమన్ శైలిలో క్లాసికల్ లుక్‌లో ఉండే ఈ ఆభరణాల్లో బంగారం, ముత్యాలు, రత్నాలు ఎక్కువగా ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది. నెపోలియన్ తన భార్య జోసెఫిన్ కోసం విలాసవంతమైన ఆభరణాలు తయారు చేయించేవాడని, అందులో భాగంగా ఆయన చేయించిన ఆభరణాలు ఈ మ్యూజియంలో ఇప్పటికీ గుర్తుగా ఉంచారట.
అయితే అందులో కొన్ని ఆభరణాలను దొంగలు అపహరించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ విషయాన్ని ఫ్రెంచ్ ప్రముఖ వార్త పత్రికల ప్రముఖంగా ప్రచురించడంతో ఈ విషయం వెలుగు చూసింది. ముందస్తు చోరీ ప్రణాళికలో భాగంగా నలుగుర్ని నంచి ఐదుగురు దొంగలు మ్యూజియంలోకి ప్రవేశించి విలువైన ఆభరణాలను అపహరించినట్లు ఫ్రెంచ్ వార్తా సంస్థ Le Parisien వెల్లడించింది.
ఇదీ చదవండి:
హమాస్ మరో డేంజర్ ప్లాన్.. అమెరికా సీరియస్ వార్నింగ్