
పారిస్: కేవలం 250 సెకన్లలోపే ఫ్రాన్స్ రా జ వజ్రాభరణాలను దొంగలు కాజేసిన ఉదంతంలో ఆయా ఆభరణాల మార్కెట్ విలువను ఫ్రాన్స్ అధికారులు మొదటి సారిగా వెల్లడించారు. అక్టోబర్ 19వ తేదీ న పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లౌరీ మ్యూజియంలో నెపోలియన్ రాజుల కా లంనాటి అపురూపమైన వజ్రాభరణాలు చోరీకి గురైన విషయం తెల్సిందే. దీనిపై 100 మంది పోలీసు, ఇంటెలిజెన్స్ అధి కారులు సమగ్రస్థాయిలో కేసు దర్యాప్తు మొదలెట్టిన విషయం తెల్సిందే.
చోరీ తర్వాత కనిపించకుండా పోయిన వజ్రా భరణాల వివరాలను పారిస్ ప్రాసిక్యూ టర్ లారే బెకావూ వెల్లడించారు. ‘‘పచ్చ లు, వజ్రాలు పొదిగిన హారం, చెవిదిద్దు లు, 1,354 వజ్రాలు, 56 మరకతమణు లు, పుష్యరాగం పొదిగిన రెండు స్వర్ణ కిరీటాలు, కురులను ఒక దగ్గరకు చేర్చే రెండు పెద్ద పిన్నులు, నీలమణులు, ము త్యాలు, 2,000 వజ్రాలు పొదిగిన నెక్లెస్, మరో పెద్ద ఆభరణాన్ని దొంగలు పట్టుకు పోయారు.
ఈ ఆభరణాల్లోని నీలమణు లు, వజ్రాలు, బంగారం విడి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాదాపు రూ.900 కోట్లు ఉండొచ్చు. ఫ్రాన్స్ ప్రాచీన ఘన వారసత్వం, రాజరిక హోదా, అరు దైన డిజైన్ వంటివి సైతం లెక్కిస్తే వీటి విలువను ఊహించలేం’’ అని అధికారి బెకావూ వ్యాఖ్యానించారు. చోరీ జరిగిన తర్వాత ఎట్టకేలకు బుధవారం మ్యూజి యంను సందర్శకుల కోసం తెరచారు. అయితే చోరీకి గురైన అపోలో గ్యాలరీలోకి మాత్రం ఎవరినీ అనుమతించట్లేరు.
అయి తే చోరీకి గురైన ఆభరణాల ఆచూకీ కను గొనడం అసాధ్యమని నిపుణులు అంచనావేస్తున్నారు. ‘‘ఇలాంటి చోరీలు చేసే చోరశిఖామణులు అత్యంత తెలివిగా వ్యవ హరిస్తారు. చోర తర్వాత నకిలీ పాస్‌పోర్ట్ తో దేశం దాటేస్తారు. చోరీ చేసిన నగలను ముక్కలు చేసి వాటిలోని బంగారం, వజ్రా లు, విలువైన రత్నాలను విడివిడిగా వేర్వే రు వ్యక్తులకు అమ్మేస్తారు. దీంతో అసలు నగ కోసం వెతికే దర్యాప్తు అధికారులకు అవి ఎప్పటికీ దొరకవు’’ అని చోరీ కేసుల ఇన్వెస్టిగేటర్, లాయర్ అయిన క్రిస్టఫర్ ఏ మ్యారినెల్లో అభిప్రాయపడ్డారు.