ఈసారి అమెరికాలో
కాలిఫోర్నీయా చరిత్రను చెప్పే వెయ్యి వస్తువులు అపహరణ
ఓక్‌లాండ్ (కాలిఫోర్నీయా): అమెరికాలో చారిత్రక ప్రాధాన్యమున్న దాదాపు 1000 వస్తువులను దుండగులు అపహరించారు. కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్ మ్యూజియం నుంచి ఈ నెల 15న ఈ వస్తువులను అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన వస్తువులు కాలిఫోర్నీయా చరిత్రకు సాక్ష్యాలుగా భద్రపర్చబడ్డవి అని పేర్కొన్నారు.
ఈ చోరీపై దర్యాప్తు జరుగుతోందని మ్యూజియం డైరెక్టర్ లోరీ ఫోగర్టీ తెలిపారు. దొంగలు ఆ వస్తువులను ఎక్కడైనా విక్రయించటానికి ప్రయతి్నస్తే తమకు సమాచారం అందించాలని పురాతన వస్తువులను విక్రయించే మార్కెట్లు, దుకాణాదారులకు విజ్ఞప్తి చేశారు. ‘వారు కొల్లగొట్టింది మ్యూజియాన్ని మాత్రమే కాదు. ప్రజల సంపదను కొల్లగొట్టారు. మన సమాజాన్ని కొల్లగొట్టారు.
వాటిని తిరిగి తెచ్చేందుకు ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నాం’అని లోరీ గురువారం ఆశాభావం వ్యక్తంచేశారు. చోరీకి గురైన వస్తువుల్లో మెటల్ వర్క్ ఆభరణాలు, అమెరికా మూలవాసులు ఉపయోగించిన బుట్టలు, గతంలో కాలిఫోర్నీయా వాసులు నిత్యజీవితంలో వినియోగించిన వస్తువులు, అథ్లెటిక్స్ ట్రోఫీలు తదిర విలువైన వస్తువులు ఉన్నాయి.
‘దుండగులు భవనంలోకి ప్రవేశించి కనిపించిన వస్తువునల్లా తీసుకొని వచ్చిన దారినే వెళ్లినట్లు కనిపిస్తోంది’అని లోరీ తెలిపారు. చోరీకి గురైనవాటిలో ప్రముఖ లోహవస్తువుల కళాకారుడు ఫ్లోరెన్స్ రెస్నికోఫ్ రూపొందించిన అందమైన ఆభరణాలతోపాటు నగిషీలు చెక్కిన వాల్‌రస్ (సముద్ర జంతువు) దంతాలు ఉన్నాయి. చాలా వస్తువులు కాలిఫోర్నీయా 20వ శతాబ్దపు చరిత్రను తెలియజేసేవేనని లోరీ తెలిపారు.
వాటిని ఇప్పటికే అమ్మేసి ఉంటారు
చోరీ జరిగి ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయినందున దొంగలు వాటిని ఎక్కడో ఓ చోట అమ్మేసి ఉంటారని లాస్‌ఏంజెల్స్ పో లీస్ విభాగంలో కెపె్టన్‌గా పనిచేసి రిటైరైన జాన్ రోమెరో అభిప్రాయపడ్డారు. దర్యాప్తు అధికారులు వాటికోసం వస్తువుల రీసేట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లైన ఈబే, క్రెయిగ్స్‌లిస్ట్‌తోపాటు చారిత్రక ప్రాధాన్యమున్న వస్తువులను సేకరించే దుకాణాల్లో వెదకాలని సూచించారు. ‘దోపిడీ చేసినవారు వాటిని అమ్మేసి వెంటనే డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు. వాటి విలువ తెలిసినవారు కాదు’అని పేర్కొన్నారు.


