అమ్మాన్: ప్రధాని నరేంద్ర మోదీ.. కింగ్ అబ్దుల్లా- II ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా జోర్డాన్ యువరాజు, మహమ్మద్ ప్రవక్త ప్రత్యక్ష వారసుడైన అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా- II ప్రధాని మోదీకి అరుదైన గౌరవం అందించారు. యువరాజు తన వ్యక్తిగత బ్లాక్ కలర్ బీఎండబ్ల్యూ కారులో ప్రధాని మోదీని స్వయంగా అమ్మాన్‌లోని జోర్డాన్ మ్యూజియంనకు తీసుకెళ్లారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను చాటి చెప్పింది.
అమ్మాన్‌లోని రాస్ అల్-ఐన్‌లో ఉన్న జోర్డాన్ మ్యూజియం పురావస్తు, చారిత్రక కళాఖండాలకు నిలయం. 2014లో నెలకొల్పిన ఈ మ్యూజియం జోర్డాన్ ప్రాంత సుదీర్ఘ నాగరిక ప్రయాణాన్ని వివరిస్తుంది. ఇక్కడ 1.5 మిలియన్ సంవత్సరాల నాటి జంతువుల ఎముకలు ఉన్నాయి. అత్యంత పురాతన విగ్రహాలలో ఒకటైన తొమ్మిదివేల ఏళ్లనాటి ఐన్ ఘజల్ సున్నపు ప్లాస్టర్ విగ్రహాలు ఉన్నాయి.ఈ మ్యూజియంను ప్రధాని మోదీ సందర్శించారు.
These outcomes mark a meaningful expansion of the India-Jordan partnership.
Our cooperation in new and renewable energy reflects a shared commitment to clean growth, energy security and climate responsibility.
Collaboration in water resources management and development will… https://t.co/SYbOTkd4B2— Narendra Modi (@narendramodi) December 16, 2025
ప్రధాని మోదీ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి దోహదపడింది. ఈ సందర్భంగా భారతదేశం, జోర్డాన్‌లు పలు కీలక రంగాలలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి ఇండియా-జోర్డాన్ వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో కూడా ప్రసంగించారు. ఇరు దేశాలు వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడి సంబంధాలను పెంచగల రంగాలను ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ మూడు దేశాల (జోర్డాన్, ఇథియోపియా, ఒమన్) పర్యటనలో జోర్డాన్ మొదటి మజిలీ.
ఇది కూడా చదవండి: Bengal SIR list: ఎన్ని లక్షల పేర్లు తొలగించారంటే..


