ప్రధాని మీటింగ్‌ లీక్స్‌.. కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు | BJP Leader Kishan Reddy Comments On Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ప్రధాని మీటింగ్‌ లీక్స్‌.. కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Dec 16 2025 11:08 AM | Updated on Dec 16 2025 11:29 AM

BJP Leader Kishan Reddy Comments On Rahul Gandhi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓటు చోరీ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని, ప్రధానమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి సమావేశం జరిగిన విషయాన్ని కిషన్ రెడ్డి వివరించారు. ఆ సమావేశం మర్యాదపూర్వక భేటీ అని, అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లే తెలంగాణ ఎంపీలను కూడా పిలిచారని తెలిపారు. పార్టీని బలోపేతం చేయాలని, సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలని ప్రధానమంత్రి సూచించారని చెప్పారు.

ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను బయట పెట్టడం మంచిది కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మీటింగ్ వివరాలు ఎవరైనా లీక్ చేస్తారా? లీక్ చేసినోడు మెంటలోడు. ఎవరో తెలిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతర్గత విషయాలను బయటకు చెప్పడం పార్టీ ఐకమత్యానికి విఘాతం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement