దక్షిణ బ్రెజిల్‌లోని గువైబా నగరంలో తీవ్ర తుఫాన్ బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు, తుఫాన్ తాకిడికి దాదాపు 114 అడుగుల ఎత్తున్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కుప్పకూలిపోయింది.అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్ బాగా షేర్ అవుతోంది.
సోమవారం మధ్యాహ్నం బ్రెజిల్‌లోని గుయిబా నగరాన్ని తీవ్రమైన తుఫాను ముంచెత్తింది. దీంతో దాదాపు 40 మీటర్ల పొడవైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కూలిపోయింది. ఫాస్ట్-ఫుడ్ అవుట్‌లెట్ సమీపంలోని హవాన్ రిటైల్ మెగాస్టోర్ ,కార్ పార్కింగ్‌లో ఏర్పాటు చేయబడినఈ విగ్రహాన్ని తీవ్రమైన గాలులు తాకాయి. బలమైన గాలుల ధాటికి తొలుత వంగిపోయిన ఈ విగ్రహం తాకిడి తీవ్రం కావడంతో స్టాట్యూ తల ముక్కలైంది.
బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ అధికారుల ప్రకారం.. పై భాగం మాత్రమే ప్రభావితమైది. అయితే 11 మీటర్లు (36 అడుగులు) పీఠం చెక్కుచెదరకుండా ఉంది. గుయిబా మేయర్ మార్సెలో మారనాటా మాట్లాడుతూ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. సత్వరమే స్పందించిన అధికారులను ప్రశంసించారు. విగ్రహం కూలిపోవడానికి ఖచ్చితమైన కారణాన్నిగుర్తించేందుకు, తీవ్రమైన వాతావరణం తోపాటు, తర అంశాలు పాత్రపై ఆరా తీసేందుకు సాంకేతిక తనిఖీ నిర్వహించబడుతుందని అధికారి ఒకరు చెప్పారు.

ఇదీ చదవండి: బోండీ బీచ్ హీరోకు సర్వత్రా ప్రశంసలు : భారీగా విరాళాలు
గుయిబాలో తుఫాను రియో గ్రాండే డో సుల్‌ను కూడా చాలా వరకు ప్రభావితం చేసింది. వడగళ్ల వాన, పైకప్పులు, చెట్లు, కూలిపోవడం, తాత్కాలిక విద్యుత్తు అంతరాయం లాంటి సంఘటనలు చోటు చేసు కున్నాయి. భారీ వర్షం కారణంగా కొన్ని వీధులు జలమయమయ్యాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటియాలజీ తుఫాను హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. చలిగాలులే దీనికి కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ మంగళ వారం నుండి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
కాగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అసలైన విగ్రహం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. బ్రెజిల్‌లోని హవాన్ అనే డిపార్ట్‌మెంటల్ స్టోర్ చైన్ బ్రాండ్ గుర్తుగా 2020లో దీన్ని ఏర్పాటు చేశారు..
Video footage shows a forty-meter-tall replica of the Statue of Liberty, located across from a McDonald's within the parking lot of a Havan in the Brazilian city of Guaíba, one of several dozen replicas of the statue located throughout the country, collapsing during a wind and… pic.twitter.com/kUid9lwA3b
— OSINTdefender (@sentdefender) December 15, 2025


