స్త్రీత్వంపై ప్రపంచ కుభేరుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపాయి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోనీ సైంటిఫిక్‌గా చెప్పని అందరికి సమంజసంగా ఉండేలా మాట్లాడాలి గానీ మరి ఇలానా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే..టెస్లా, స్సేస్ ఎక్స్ దిగ్గజం ఎలోన్ మస్స్ స్త్రీత్వంపై తన అభిప్రాయలను పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శులు వెల్లువెత్తాయి. మస్క్ స్త్రీకి నిర్వచనం గర్భం అంటూ గర్భాశయం ఉన్నవాళ్లను స్త్రీలుగా వ్యవహరిస్తారని, గర్భం ఉనికి ద్వారా స్త్రీని నిర్వచించాలి అని నొక్కి చెప్పాడంతో ఒక్కసారివ ఆయనపై తారాస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన వైఖరిని చాలామంది ఖండించారు.
అంతేగాదు అస్సలు మనం ఇంకా ఏ కాలంలో జీవిస్తున్నాం అని విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. గర్భం ఉంటే స్త్రీ అంటే.. మరి ఎంఆర్‌కేహెచ్ సిండ్రోమ్ మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌసర్ సిండ్రోమ్) అరుదైన పరిస్థితితో బాధపడుతున్న ఆడవాళ్లు..స్త్రీలు కాకుండా పోతారా అని నిలదీశారు. ఎంఆర్‌కేహెచ్ సిండ్రోమ్ అంటే గర్భాశయం లేకుండా లేదా అభివృద్ధి చెందని స్త్రీలని అర్థం.
లింగ మార్పిడిని బహిరంగంగా వ్యతిరేకిస్తూ తన ట్రాన్స్‌జెండర్ కుమార్తె పరిస్థితిని "విషాదకరమైన మానసిక అనారోగ్యం"గా అభివర్ణించారు. ఆయన తనను లక్ష్యంగా చేసుకుని డెమొక్రాట్ అభ్యర్థి కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ ఇలా ప్రతిస్పందించారు.
కాగా, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పాడ్‌కాస్టర్‌తో తాను ఎక్కువ మంది ట్రాన్స్ పిల్లలను చూడాలనుకుంటున్నానని, తనను తాను ట్రాన్స్-ప్రో చట్టం LGBTQ హక్కుల బలమైన మద్దతుదారుగా భావిస్తానని చెప్పారు. అంతేగాదు సారీ మస్క్ మిమ్మల్ని మీ కూతురు ద్వేషిస్తున్నందుకు అని నేరుగా సెటైర్ వేశారు. దాంతో మస్క్ ఇలా విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
Correct. We’re sorry your daughter hates you, Elon. https://t.co/HeJIm5fJMS
— Governor Newsom Press Office (@GovPressOffice) December 11, 2025
(చదవండి: ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా! సర్వేలో షాకింగ్ విషయాలు)


