ఆస్ట్రేలియాలో పహల్గామ్‌ తరహా టెర్రర్‌ ఎటాక్‌.. 10 మంది మృతి | Australia Shooting, 10 Lives End After Gunman Opens Fire At Crowded Bondi Beach, Watch Shocking Videos Inside | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో పహల్గామ్‌ తరహా టెర్రర్‌ ఎటాక్‌.. 10 మంది మృతి

Dec 14 2025 3:16 PM | Updated on Dec 14 2025 5:19 PM

Australia Shooting: Gunman Opens Fire At Crowded Bondi Beach

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి కలకలం రేపింది. జమ్మూకశ్మీర్‌ పహల్గాం తరహాలో సిడ్నీ బాండీ బీచ్‌లో ఉగ్రదాడి జరిగింది. బీచ్‌లోని యూదులే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో పదిమందికి పైగా పర్యాటకులు మృతిచెందారు. ముసుగు ధరించిన ఉగ్రవాదులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు.

అయితే బీచ్‌లో సరదాగా గడుపుతున్న పర్యాటకులు.. కాల్పుల మోతతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బీచ్‌లో ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

బీచ్‌లోకి పర్యాటకులను నిషేధించారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లొద్దంటూ న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. కాల్పుల తర్వాత ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

 

 

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement