మెహసానా : గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన దంపతులు వారి మూడేళ్ల కుమార్తెతో పాటు పోర్చుగల్‌కు వలస వెళ్లే ప్రయత్నంలో లిబియాలో కిడ్నాప్‌కు గురయ్యారు. వీరిని కిస్మత్‌సింగ్ చావ్డా, అతని భార్య హీనాబెన్, కుమార్తె దేవాన్షిగా గుర్తించారు. కిస్మత్‌సింగ్ సోదరుడు నివసిస్తున్న పోర్చుగల్‌లో స్థిరపడాలనే ఉద్దేశ్యంతో వీరు నవంబర్ 29న అహ్మదాబాద్ నుండి బయలుదేరారు. వీరు దుబాయ్ మీదుగా లిబియాలోని బెన్‌ఘాజీ నగరానికి విమానంలో చేరుకోవలసి ఉంది. అయితే ఇంతలోనే బెన్‌ఘాజీలో కిడ్నాప్‌కు గురయ్యారు.
ఈ కుటుంబం పోర్చుగల్ కేంద్రంగా పనిచేసే ఒక విదేశీ ఏజెంట్ సహాయంతో ఈ ప్రయాణం చేస్తున్నట్లు మెహసానా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమాన్షు సోలంకి తెలిపారు. కిడ్నాపర్‌లు మెహసానాలోని చావ్డా బంధువులను సంప్రదించి, వారిని విడుదల చేయడానికి రూ. రెండు కోట్లు డిమాండ్ చేశారు.ఈ సమాచారం అందుకున్న బంధువులు.. సహాయం కోసం మెహసానా జిల్లా కలెక్టర్ ఎస్‌కే ప్రజాపతిని ఆశ్రయించారు.
ఈ కిడ్నాప్ ఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం.. విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఏజెంట్లు ఎవరూ భారతీయులు కాదని సోలంకి ధృవీకరించారు. దీనిలో అంతర్జాతీయ ఏజెంట్ల ప్రమేయం ఉండవచ్చన్నారు. కాగా ఇదే తరహాలో గత జూలైలో జమ్ముకశ్మీర్‌కు చెందిన రంజిత్ సింగ్ .. నైజర్‌లోని డోస్సో ప్రాంతంలో కిడ్నాప్‌కు గురయ్యారు.
ఇది కూడా చదవండి: తరలిపోనున్న ‘తీహార్’.. ఎక్కడకి? ఎందుకు?


