సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా వాకాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఎస్‌కే నజీర్ బాషా కిడ్నాప్‌కు గురయ్యారు. ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నజీర్ బాషా నెల్లూరు 34 వార్డు కార్పొరేటర్ ఫమిదా తండ్రి.
నిన్న వైఎస్ జగన్ సమక్షంలో కార్పొరేటర్ ఫమిదా వైఎస్సార్‌సీపీలో చేరారు. నిన్న రాత్రి(డిసెంబర్ 12, గురువారం) పథకం ప్రకారమే నజీర్ బాషాను కిడ్నాప్ చేసినట్టు సమాచారం. వాకాడు పోలీసులకు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.


