పుట్టా మహేష్‌ ఇష్యూ: షోకాజ్‌ నోటీసుతో సరిపెట్టిన చంద్రబాబు | TDP MP Putta Mahesh issue Chandrababu Issues Show-Cause Notice | Sakshi
Sakshi News home page

పుట్టా మహేష్‌ ఇష్యూ: షోకాజ్‌ నోటీసుతో సరిపెట్టిన చంద్రబాబు

Mar 15 2026 7:52 PM | Updated on Mar 15 2026 8:12 PM

TDP MP Putta Mahesh issue Chandrababu Issues Show-Cause Notice

సాక్షి, విజయవాడ: టీడీపీలో డ్రగ్స్‌ కలకలం చెలరేగుతోంది. హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ డ్రగ్స్‌ తీసుకుని పట్టుబడ‍్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ, షోకాజ్‌ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్‌ను టీడీపీ ఆదేశించింది. డ్రగ్స్‌ ఘటనపై పుట్టా మహేష్‌ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు.  

పుట్టా మహేష్‌ను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్‌ వస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం షోకాజ్‌ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్‌, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా వేస్తున్నారు. గలీజ్‌ కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్‌ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్‌. 

ఇవీ చదవండి: 

పుట్టా మహేష్‌, ప్రియాంక రెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు  


పుట్టా మహేష్‌ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement