ఏపీలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం | Class 10 Exams Begin March 16th in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

Mar 15 2026 9:49 PM | Updated on Mar 15 2026 9:49 PM

Class 10 Exams Begin March 16th in Andhra Pradesh

విజయవాడ:  ఏపీలో పదో తరగతి పరీక్షలు రేపటి(సోమవారం, మార్చి 16వ తేదీ)  నుండి ప్రారంభం కానున్నాయి.  ఏప్రిల్‌ 1వ తేదీ వరకూ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం గం. 9.30 ని.లు నుండి  మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షా సమయం ఉంటుంది. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు.  6,40,916 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. 6,22,074 మంది రెగ్యులర్ విధానంలో పరీక్షలు రాస్తుండగా,, 18,842 మంది ప్రైవేటు విధానంలో పరీక్షలు రాయనున్నారు. మొత్తం పరీక్షలు రాసేవారిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.

విద్యార్థులు ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలో రిపోర్టు చేయాలని, 10 గంటల తర్వాత ఎవ్వరిని లోనికి అనుమతించబోమని  పరీక్షల విభాగం పేర్కొంది. పరీక్షల నిర్వహణ కి 38,958 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మాల్ ప్రాక్టీసు అరికట్టేందుకు 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 210 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించారు. ఫోన్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్లను  పరీక్షా హాల్‌లోకి అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement