మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో పైలెట్‌ రోహిత్‌రెడ్డికి రిమాండ్ | Moinabad farmhouse drugs case: Magistrate remands Rohith Reddy for 14 days | Sakshi
Sakshi News home page

మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో పైలెట్‌ రోహిత్‌రెడ్డికి రిమాండ్

Mar 15 2026 11:07 PM | Updated on Mar 16 2026 5:54 AM

Moinabad farmhouse drugs case: Magistrate remands Rohith Reddy for 14 days

సాక్షి, హైదరాబాద్‌/మొయినాబాద్‌: మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మెజిస్ట్రేట్ తీర్పు ప్రకారం..  మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, రితేష్ రెడ్డి, నితిన్ శర్మలకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు దాడి చేసిన సమయంలో నితిన్ శర్మ గన్‌తో కాల్పులు జరిపినట్లు సమాచారం. 

ఈ ఘటన నేపథ్యంలో అర్మ్స్ ఆక్ట్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు పంపారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనతో డ్రగ్స్ కేసు మరింత సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాలు అధికారులు వెల్లడించనున్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement