breaking news
shooting
-
ఏషియన్ గేమ్స్‌లో ఇవాళ భారత్‌కు మూడో స్వర్ణం
ఏషియన్ గేమ్స్ 2026లో ఇవాళ (11వ రోజు) భారత్ పతకాల వేటలో దూసుకెళ్తోంది. ఆర్చరీలో రెండు స్వర్ణాలు సాధించిన భారత్.. తాజాగా షూటింగ్‌లోనూ బంగారు పతకం గెలిచింది. దీంతో ఇవాళ భారత్ ఖాతాలో ఇప్పటివరకు మూడు స్వర్ణాలు చేరాయి.మహిళల ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో నీరూ ధండా, కైనన్ చెనాయ్ జోడీ అద్భుత ప్రదర్శనతో స్వర్ణం సాధించింది. ప్రారంభంలో భారత్ 10 టార్గెట్లలో కేవలం 6 మాత్రమే ఛేదించి పతకాల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ఆ తర్వాత ధండా, చెనాయ్ ఒక్క టార్గెట్ కూడా మిస్ కాకుండా అద్భుతంగా పుంజుకున్నారు.చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో భారత్ ఒక్క పాయింట్ తేడాతో అగ్రస్థానంలో నిలిచింది. ఖతార్ రజతం, చైనా కాంస్య పతకాలను సాధించాయి.ఈ విజయంతో భారత్ మొత్తం 34 పాయింట్లు సాధించి ఆసియా రికార్డును కూడా బద్దలు కొట్టింది. నీరూ ధండాకు ఇది రెండు రోజుల్లో రెండో స్వర్ణ పతకం. అంతకుముందు మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో ఆమె పసిడి సాధించింది.ఇదిలా ఉంటే, ఇవాళ ఆర్చరీలో భారత జట్లు ఇప్పటికే రెండు స్వర్ణాలు సాధించాయి. మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో చైనాను ఓడించి స్వర్ణం గెలిచిన భారత్.. అనంతరం కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దక్షిణ కొరియాను ఓడించి మరో పసిడి పతకం సాధించింది. మిక్స్డ్ టీమ్ స్వర్ణంతో భారత్ 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత కూడా సాధించింది.ఘంఘాస్‌కు కాంస్యంబాక్సింగ్లో ప్రియ ఘంఘాస్ మహిళల 60 కేజీల సెమీఫైనల్లో చైనా బాక్సర్ చేతిలో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మరోవైపు లవ్లీనా బోర్గొహైన్ మహిళల 75 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి భారత్‌కు కనీసం రజత పతకాన్ని ఖాయం చేసింది.మహిళల టీమ్ స్క్వాష్‌లో తన్వి ఖన్నా, అనాహత్ సింగ్ సింగపూర్‌పై 2-0తో విజయం సాధించి భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేశారు.ఇదీ చదవండి: Asian Games 2026: భారత్ ఖాతాలో ఎనిమిదో స్వర్ణం -
జోరుగా... హుషారుగా...
సినిమా షూటింగ్స్ అంటే లోకల్లోనే కాదు... కథ డిమాండ్ చేస్తే దేశ విదేశాల్లోనూ చిత్రీకరణలు జరుగుతుంటాయి. అయితే టాలీవుడ్‌కి హార్ట్ ఆఫ్ ది సిటీగా చెప్పుకునే హైదరాబాద్‌లో మాత్రం ఎప్పుడూ సినిమాల షూటింగ్‌ల సందడి నెలకొంటుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్‌బాబు, రిషబ్ శెట్టి, గోపీచంద్, నితిన్, శర్వానంద్, శ్రీ విష్ణు వంటి హీరోల సినిమాల షూటింగ్స్ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భలే జోరుగా జరుగుతున్నాయి. ఆ విశేషాలు ఏంటో చూద్దాం... అన్నపూర్ణలో కింగ్ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ 100’. ఈ సినిమాకి తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నారు కూడా! ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ భాగ్యనగరంలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో నాగార్జునతోపాటు టబు కూడా పాల్గొంటున్నారు. వీరిద్దరిపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కార్తీక్. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత అక్టోబర్ 1 నుంచి హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొత్త షెడ్యూల్ జరగనుంది. అక్కడ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘కింగ్ 100’ నాగార్జున కెరీర్లో వందో చిత్రం కావడంతో ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ‘కింగ్ 100’ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అజీజ్ నగర్లో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో వెంకటేశ్–డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. (బావ బామ్మర్ది సౌజన్యంతో అన్నది ట్యాగ్‌లైన్). ఈ మూవీలో కల్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కీర్తీ సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో వెంకటేశ్, కల్యాణ్ రామ్‌తో పాటు హీరోయిన్లు, అలాగే చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాల భోగట్టా. అనిల్ రావిపూడి. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఆర్ఎఫ్సీలో... బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దాదా’. ఈ మూవీలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘వీరసింహా రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ఇది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట గోపీచంద్ మలినేని. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోకాపేటలో... ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘ఫౌజి’. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. ‘‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజి’. తన కెరీర్లో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ లుక్‌లో ప్రభాస్ కనిపించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ‘ఫౌజి’ సినిమా ఈ డిసెంబరు 3న విడుదల కానుండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. రాకా యాక్షన్... ‘పుష్ప ది రైజ్, పుష్ప 2: ది రూల్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకా’. ఈ మూవీకి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ భాగ్యనగరం సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ పాల్గొనడం లేదని తెలిసింది. ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట అట్లీ. అక్టోబరులో అల్లు అర్జున్ ఈ చిత్రం షూట్లో జాయిన్ అవుతారని టాక్. ఆయనపై కీలకమైన ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారట దర్శకుడు. ఇదిలా ఉంటే... ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ‘రాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, విడుదల చేసిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ట్రెండ్ అయింది. గుండు, వింత శరీరాకృతితో ఓ సరికొత్త అవతారంతో అందర్నీ ఆశ్చర్యపరిచారాయన. ఈ మూవీ 2027లో విడుదల కానుంది. శంకరపల్లిలో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. ఈ సినిమా ద్వారా ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ హీరోయిన్గా తెలుగులో అడుగుపెడుతున్నారు. ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి సినిమాలను నిర్మించిన 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ‘సింగ’ మూవీని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హీరో హీరోయిన్లతోపాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట వెంకట్. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘సింగ’. ఫైట్ మాస్టర్‌గా సక్సెస్ అందుకున్న వెంకట్‌కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్లా కథను తీర్చిదిద్దుతున్నారు. గోపీచంద్‌ను సరికొత్త పాత్రలో చూపించనున్నారాయన. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు రాజీ పడకుండా నిర్మిస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. హనుమాన్ 2 ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘హను–మాన్’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా నటించారు. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ 2024 జనవరి 12న రిలీజైంది. చిన్న చిత్రంగా ప్రారంభమై, పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన హను–మా¯న్కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జై హనుమాన్’. ఈ మూవీలో ఆంజనేయ స్వామిగా ‘కాంతారా’ మూవీ ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తున్నారు.‘హను–మాన్’లో హనుమంతుగా నటించిన తేజ సజ్జా సీక్వెల్లోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎప్సీలో శరవేగంగా జరుగుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? అనే నేపథ్యంలో ‘జై హనుమాన్’ని రూపొందిస్తున్నారని సమాచారం. మొయినాబాద్‌లో... ‘నారీ నారీ నడుమ మురారి, బైకర్’ వంటి హిట్ మూవీస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘జార్జ్ క్రిష్’. ఈ మూవీకి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్గా నటిస్తున్నారు. ఏటీవీ సమర్పణలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం భాగ్యనగరం సమీపంలోని మొయినాబాద్‌లో జరుగుతోంది. శర్వానంద్, మానస వారణాసితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సీన్స్ తీస్తున్నారట శ్రీను వైట్ల. సంక్రాంతి సీజన్లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆడియన్స్‌ని అలరించనున్న ఈ సినిమా 2027 జనవరి 14న విడుదల కానుంది. శంకరపల్లిలో... సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు). ఈ మూవీ ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ వంటి విజయవంతమైన సినిమా తీసిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. సాయి దుర్గాతేజ్‌తో పాటు కీలక తారాగణంపై పలు సన్నివేశాలు రూపొందిస్తున్నారట రోహిత్. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని మూవీ షూటింగ్స్ కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జోరుగా హుషారుగా జరుగుతున్నాయి. శంషాబాద్‌లో... మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘వారణాసి’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటి ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోంది.అయితే ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబు పాల్గొనడం లేదు. ఎందుకంటే తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ని ఆయన ఇటీవల పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మహేశ్ లేని సీన్స్‌ని తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. ఈ చిత్రంలో శ్రీరాముడిగా, రుద్రుడి గా మహేశ్‌బాబు కనిపిస్తారు. ‘వారణాసి’ని అంతర్జాతీయ స్థాయిలో 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు మేకర్స్. 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.అల్యూమినియం ఫ్యాక్టరీలో... కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కేఏ 13’(వర్కింగ్ టైటిల్). దేవిక భట్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో శరత్ కుమార్, సాయి కుమార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జాయ్ ఫిలింస్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ ప్రస్తుతం గచ్చిబౌలి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. హీరో హీరోయిన్లతోపాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు కిరణ్. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాతో కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ‘కేఏ 13’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతోపాటు హీరోగా నటిస్తుండటం విశేషం. అల్యూమినియం ఫ్యాక్టరీలో... నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’. మురళీ కాంత్ దేవాసోత్ రచన, దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో సాయి కుమార్, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా జరుగుతోంది. నితిన్, సాయి కుమార్, హర్ష వర్ధన్, ఇతర నటీనటులు పాల్గొనగా కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట మురళీ కాంత్. ‘‘కోర్ట్–స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ వంటి అద్భుత విజయం తర్వాత నాని సమర్పణలో యునానిమస్ ప్రొడక్షన్స్‌పై రూపొందుతున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’. తొట్ట తొలి చిత్రం ‘దండోరా’తోనే విమర్శకులను ఆకట్టుకున్న మురళీకాంత్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఒక ఆసక్తికరమైన కథతో కూడిన విలక్షణమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది ఈ చిత్రం. ఈ సినిమాలో నితిన్ చాలా విలక్షణమైన పాత్రలో నటిస్తున్నారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఫ్యామిలీ ప్యాక్... హీరో శ్రీ విష్ణు–డైరెక్టర్ రామ్ అబ్బరాజు కాంబినేషన్లో వచ్చిన ‘సామజవరగమన’ (2023) చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ హిట్ మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్’. ఈ సినిమాలో సాక్షి మధోల్కర్ హీరోయిన్ న్గా నటిస్తున్నారు. నరేష్ వీకే, అభిరామి, మురళీ శర్మ, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్, సుదర్శన్, సత్య, రోహిణి, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, రఘుబాబు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. అనిల్ ఎర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీ విష్ణుతో పాటు ఇతర నటీనటులపై కీలకమైన సీన్స్ తీస్తున్నారు రామ్ అబ్బరాజు. ఈ మూవీ 2027 సంక్రాంతికి విడుదల కానుంది.– డేరంగుల జగన్ మోహన్ -
నీరూ బంగారు ‘ట్రాప్’
ఆసియా క్రీడల షూటింగ్లో మంగళవారం పోటీలకు పదో రోజు... ఇప్పటి వరకు ఎన్నో అంచనాలు పెట్టుకున్న టాప్ షూటర్లంతా విఫలం కావడంతో మన దేశానికి ఒక్క వ్యక్తిగత స్వర్ణం కూడా దక్కలేదు. కానీ పదో రోజు ఎట్టకేలకు ఆ సంబరం తీరింది. మహిళల ట్రాప్ ఈవెంట్లో నీరూ ధండా సత్తా చాటి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో కూడా ఈ ఈవెంట్లో ఇదే తొలి పసిడి పతకం కావడం విశేషం. మరోవైపు నీరూ అత్యుత్తమ ప్రదర్శన కారణంగానే టీమ్ ఈవెంట్లో కూడా భారత్‌కు రజతం లభించింది. ఈ పతకంలో నీరూకు ఆషిమా ఆహ్లావత్, మనీషా కీర్ తోడుగా నిలిచారు. మొత్తంగా ఇప్పటివరకు 14 పతకాలు గెలుచుకున్న మన షూటింగ్ బృందం మిగిలిన రెండు రోజుల్లో మరిన్ని పతకాలపై గురి పెట్టింది.నగోయా: ఆసియా క్రీడల షూటింగ్లో భారత్ ఖాతాలో తొలి వ్యక్తిగత స్వర్ణం చేరింది. మహిళల ట్రాప్ ఈవెంట్లో భారత షూటల్ నీరూ ధండా అగ్రస్థానంలో నిలిచి పసిడిని సొంతం చేసుకుంది. మొత్తం 30 టార్గెట్లలో ఆమె 28 టార్గెట్లను విజయవంతంగా ఛేదించగలిగింది. సున్ యునాంగ్ (చైనా; 26) రజత పతకం గెలుచుకోగా, హాజర్ అబ్దుల్ మాలిక్ (కువైట్; 21)కు కాంస్యం దక్కింది. మొత్తం ఆరు సిరీస్‌లలో రెండో, ఐదో సిరీస్‌లలో 4 చొప్పున టార్గెట్లను కొట్టిన నీరూ... మిగిలిన నాలుగు సిరీస్‌లలో 5 చొప్పున పూర్తి స్కోర్‌ను ఛేదించింది. ఆసియా క్రీడల పురుషుల ట్రాప్‌లో భారత్ తరఫున 1978లో రణ్‌దీర్ సింగ్, 2010లో రంజన్ సోధి స్వర్ణాలు గెలిచారు. నీరూ ప్రదర్శన ఆమెకు వ్యక్తిగత స్వర్ణాన్ని అందించడంతో పాటు భారత జట్టు రజతం గెలవడంలో కూడా కీలకపాత్ర పోషించింది. మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో నీరూ, ఆషిమా, మనీషా సభ్యులుగా ఉన్న జట్టు రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో నీరూ 118 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... ఆషిమా 106 పాయింట్లతో 16వ స్థానంతో, మనీషా 104 పాయింట్లతో 23వ స్థానంతో ముగించారు. అయితే ఈ ముగ్గురు కలిసి సాధించిన మొత్తం 328 పాయింట్లతో భారత్‌కు రజతం దక్కింది. చైనా (346 పాయింట్లు) స్వర్ణం సాధించగా, కువైట్ (325 పాయింట్లు)కు కాంస్యం లభించింది.అనారోగ్యం నుంచి ఆసియా పతకం వరకు..రెండు నెలల క్రితమే షూటింగ్ ప్రపంచకప్‌లో నీరూ ధండా స్వర్ణం గెలిచింది. ట్రాప్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా నిలవడంతోనే ఆమెపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పరిస్థితి మారిపోయింది. ఆసియా క్రీడల కోసం జపాన్ చేరడానికి పది రోజుల ముందు నీరూ తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. తీవ్రమైన జ్వరంతో హెచ్1ఎన్1 వ్యాధి లక్షణాలతో ఆమె భోపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల పాటు ఏమీ తినలేకపోయింది. అసలు ఆసియా క్రీడలకు వెళతానా లేదా అనే సందేహాలు వచ్చాయి.దాదాపు నాలుగు వారాలు పూర్తిగా శిక్షణకు దూరమైంది. అయితే ఇలాంటి స్థితిలో కోచ్ మన్షేర్ సింగ్ నీరూను ఎంతో ప్రోత్సహించాడు. నువ్వు లక్ష్యం నుంచి దృష్టి మరల్చవద్దు అంటూ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశాడు. దాంతో అన్నీ వెనక్కి తోసి ఆమె శక్తిని కూడదీసుకుంది. హరియాణాలోని జింద్ జిల్లాలో పుట్టినా ... కుటుంబం మధ్యప్రదేశ్‌లోని శివపురికి వలస వెళ్లడంతో నీరూ అక్కడే పెరిగింది. ఆమె కెరీర్ కూడా మధ్యప్రదేశ్‌లోనే మొదలైంది. 2018 ఆసియా క్రీడల్లో ట్రాప్‌లో రజతం సాధించిన ఆమె కజిన్ లక్షయ్ షెరాన్ ప్రేరణతో నీరూ పూర్తి స్థాయిలో ఆటపై దృష్టి పెట్టింది. లక్షయ్ తండ్రి ఇచ్చిన గన్‌తోనే ఆమె ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 2019లో భోపాల్‌కు చేరి మధ్యప్రదేశ్ స్టేట్ షూటింగ్ అకాడమీలో శిక్షణతో తన ఆటకు మెరుగులు దిద్దుకుంటూ నీరూ దూసుకుపోయింది. రైతు అయిన తండ్రి షూటింగ్లాంటి ఖరీదైన క్రీడకు అండగా నిలిచే పరిస్థితి లేకపోయింది. ఇలాంటి స్థితిలో ప్రభుత్వం అందించిన గన్, ఇతర ఎక్విప్‌మెంట్‌తోనే ఆమె సాధన చేయగలిగింది. ప్రస్తుతం ఆర్మీలో ఆమె నాయబ్ సుబేదార్‌గా పని చేస్తోంది. ‘ఈ విజయం సరిహద్దులోని సైనికులకు అంకితం. వారితో పోలిస్తే నా ఘనత గొప్పదేమీ కాదు. అందరి లక్ష్యం కూడా ఒలింపిక్ పతకమే. అయితే ఈ విజయాలు వాటి వైపు సాగేందుకు పునాదిరాళ్లుగా ఉపకరిస్తాయి’ అని నీరూ వ్యాఖ్యానించింది.‘ట్రాప్’ అంటే...సామాన్యుల భాషలో చెప్పాలంటే ‘ట్రాప్’ ఈవెంట్ సరిగ్గా పక్షులను వేటాడటంలాంటిదే! ఇప్పుడు షూటింగ్ ఈవెంట్లో కూడా లక్ష్యాలను బర్డ్స్ లేదా పీజియాన్స్ అనే పిలుస్తారు. పాత కాలంలో పంజరాల నుంచి పక్షులను విడిచి పెట్టగానే తుపాకీతో వాటిని వేటాడేవారు. ఇప్పుడు మెకానికల్ పద్ధతిలో లక్ష్యాలను నిర్దేశిస్తారు. ట్రాప్ హౌస్‌లో నిలిచి ఉండే షూటర్ సిద్ధం కాగానే... డిస్క్ ఆకారంలో ఉండే మట్టితో తయారు చేసిన ఒక ‘బర్డ్’ దూసుకొస్తుంది. దీనిని షూటర్ కొట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత పోటీల్లో ఐదేసి టార్గెట్ల చొప్పున ఆరు సిరీస్‌లు (మొత్తం 6్ఠ5 = 30 పాయింట్లు) ఉంటాయి. ‘డబుల్ ట్రాప్’లో ఒకేసారి రెండు బర్డ్స్లను కొట్టాల్సి ఉంటుంది. ట్రాప్, డబుల్ ట్రాప్, స్కీట్లను ‘షాట్‌గన్’ ఈవెంట్లుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో ట్రాప్, స్కీట్ మాత్రమే ఉన్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచే డబుల్ ట్రాప్‌ను తప్పించారు. భారత ఆటగాడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో డబుల్ ట్రాప్‌లోనే రజతం గెలిచాడు. -
Asian Games 2026: భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. మహిళల వ్యక్తిగత ట్రాప్ షూటింగ్లో నీరూ ధండా స్వర్ణ పతకం సాధించింది. దీంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య ఐదుకు చేరింది.మహిళల టీమ్ ట్రాప్ విభాగంలో రజతం సాధించిన కొద్దిసేపటికే నీరూ వ్యక్తిగత విభాగంలో అద్భుత ప్రదర్శన చేసింది. వర్షం కురుస్తున్న ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె ఏమాత్రం తడబడకుండా లక్ష్యాలను ఛేదించింది.వ్యక్తిగత షూటింగ్లో భారత్‌కు తొలి స్వర్ణంఈ ఆసియా గేమ్స్‌లో వ్యక్తిగత షూటింగ్ ఈవెంట్లో భారత్‌కు లభించిన తొలి స్వర్ణ పతకం ఇదే. నీరూ తొలుత టీమ్ ఈవెంట్లో రజతం సాధించి, ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించడం విశేషం.మరిన్ని పతకాలపై ఆశలుఇవాళ (10వ రోజు) షూటింగ్‌తో పాటు ఆర్చరీ, స్క్వాష్, టెన్నిస్, కానోయ్ స్లాలోమ్ తదితర విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడుతున్నారు.బాక్సింగ్‌లో పర్వీన్, అంకుష్ పాంగల్, నరేందర్ సెమీఫైనల్స్‌లో బరిలోకి దిగనున్నారు. అథ్లెటిక్స్‌లోనూ గుల్వీర్ సింగ్, అవినాశ్ సేబుల్, గురిందర్‌వీర్ సింగ్, అనిమేశ్ కుజూర్ తదితరులపై భారత్ ఆశలు పెట్టుకుంది.ఇదీ చదవండి: Asian Games 2026: షూటింగ్లో మరో రజతం.. 50 పతకాల దిశగా భారత్ -
షూటింగ్లో మరో రజతం.. 50 పతకాల దిశగా భారత్
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ 10వ రోజు పతకాల వేటను రజతంతో ప్రారంభించింది. మహిళల టీమ్ ట్రాప్ షూటింగ్లో భారత జట్టు (నీరూ ధండ, అషిమ అహ్లావత్, మనీష కీర్) రజత పతకం సాధించింది. దీంతో భారత్ 50 పతకాల (46) మార్క్‌కు మరింత చేరువైంది.మరోవైపు నీరూ ధాండా మహిళల వ్యక్తిగత షూటింగ్ విభాగంలో అదరగొట్టింది. ఆమె 118 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించింది.పురుషుల ట్రాప్ టీమ్ విభాగంలో భారత్‌కు పతకం దక్కలేదు. అయితే శపత్ భరద్వాజ్ వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించాడు.భారత ఆర్చర్ల జోరుపురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ధీరజ్ బొమ్మదేవర ఫిలిప్పీన్స్‌కు చెందిన గిర్విన్ గార్సియాను 6-0తో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరాడు. అనంతరం చైనీస్ తైపీకి చెందిన చెంగ్ హ్సియాంగ్-హుయ్‌పై 6-2తో విజయం సాధించాడు.నీరజ్ చౌహాన్ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇండోనేషియాకు చెందిన రియావు ఎగా అగత సల్సబిల్లాపై 6-4తో గెలిచిన అతడు, ఆ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జె-డియోక్ను కూడా 6-4తో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరాడు.స్క్వాష్‌లో విజయంమహిళల టీమ్ స్క్వాష్ పూల్-సి మ్యాచ్‌లో భారత్ 2-0తో ఇరాన్‌ను ఓడించింది. తాన్వీ ఖన్నా, అనాహత్ సింగ్ భారత విజయానికి కారణమయ్యారు.బాక్సింగ్, అథ్లెటిక్స్‌పై దృష్టిబాక్సింగ్లో పర్వీన్, అంకుష్ పాంగల్, నరేందర్ సెమీఫైనల్స్‌లో బరిలోకి దిగనున్నారు. వీరు ఫైనల్‌కు చేరితే భారత్‌కు కనీసం మరో మూడు రజతాలు ఖాయమవుతాయి.అథ్లెటిక్స్‌లో గుల్వీర్ సింగ్, అవినాశ్ సేబుల్, గురిందర్‌వీర్ సింగ్, అనిమేశ్ కుజూర్, హరితా భద్ర తదితర భారత అథ్లెట్లు పతకాల కోసం పోటీ పడనున్నారు.సైక్లింగ్‌లో మిశ్రమ ఫలితాలుపురుషుల టీమ్ స్ప్రింట్‌లో రోజిత్ సింగ్, డేవిడ్ బెక్‌హమ్, రొనాల్డ్ సింగ్ 44.895 సెకన్లతో ఏడో స్థానంలో నిలిచారు. తొలి రౌండ్లో రెండో సీడ్ చైనాతో తలపడనున్నారు.మహిళల టీమ్ స్ప్రింట్‌లో సెలెస్టినా, సరితా కుమారి, కీర్తి రంగస్వామి చిక్కా 50.414 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచారు. తొలి రౌండ్లో చైనీస్ తైపీతో పోటీ పడనున్నారు.మహిళల టీమ్ పర్స్యూట్‌లో హర్షితా ఝాకర్, పూజా దనోలే, మీనాక్షి, స్వస్తి సింగ్‌ల బృందం ఐదో స్థానంలో నిలిచి హెడ్-టు-హెడ్ హీట్స్‌కు అర్హత సాధించింది.ఇదీ చదవండి: Asian Games Cricket: మరో చిన్న జట్టుకు అన్యాయం -
Asian Games 2026: రజతంతో సరిపెట్టుకున్న ఈషా సింగ్
ఏషియన్ గేమ్స్ 2026లో తొమ్మిదో రోజు భారత్‌కు షూటింగ్లో మరో పతకం లభించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఈషా సింగ్ రజత పతకం సాధించింది. ఫైనల్లో ఈషా సింగ్ అద్భుతంగా పోరాడినప్పటికీ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఈవెంట్లో చైనాకు చెందిన షియావో జియారుయ్షువాన్ స్వర్ణం గెలిచింది. ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 39కి చేరింది.ఇక ఇతర విభాగాల్లోనూ భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఇవాళే కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ బల్హారా కాంస్యం సాధించింది. బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహెయిన్ 75 కేజీల సెమీఫైనల్‌కు చేరి మరో పతకాన్ని ఖాయం చేసుకుంది.పురుషుల క్రికెట్లోనూ భారత్ సెమీఫైనల్‌కు చేరింది. ఆఫ్ఘనిస్తాన్‌తో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.అథ్లెటిక్స్‌లో పారుల్ చౌధరి మహిళల 5000 మీటర్ల ఫైనల్లో బరిలోకి దిగనుంది. ఇప్పటికే ఒక పతకం సాధించిన పారుల్ మరో పతకంపై దృష్టి పెట్టింది.ఇదీ చదవండి: Asian Games Cricket: సెమీఫైనల్‌కు టీమిండియా -
అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్‌లోని ఓ క్లబ్లో జరిగిన గొడవ తీవ్ర హింసకు దారితీసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ముగ్గురు పురుషులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవారిగా పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అమెరికాలోని మిచిగన్ రాష్ట్రం డెట్రాయిట్లో ఆదివారం ఉదయం సుమారు 7.21 గంటలకు ఈ ఘటన జరిగింది. నగరంలోని పశ్చిమ ప్రాంతంలో ఈటన్ అవెన్యూ, ప్రెస్ట్ స్ట్రీట్ సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాల్పులకు ముందు ఘటన జరిగిన ప్రదేశంలో గొడవ జరిగినట్లు డెట్రాయిట్ పోలీస్ చీఫ్ టాడ్ బెట్టిసన్ తెలిపారు. గొడవ అనంతరం కొందరు తుపాకీతో హింసకు పాల్పడ్డారని చెప్పారు. అయితే అసలు గొడవ ఎందుకు మొదలైంది? కాల్పులకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.ఈ కేసులో పోలీసులకు కొన్ని ఆధారాలు, సమాచారం లభించాయని బెట్టిసన్ తెలిపారు. అయితే దర్యాప్తు దృష్ట్యా వాటిని బహిర్గతం చేయలేదు. అనుమానితుడి వివరాలు లేదా అతడి రూపురేఖలను కూడా పోలీసులు వెల్లడించలేదు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది. డెట్రాయిట్ మేయర్ మేరీ షెఫీల్డ్ ఈ ఘటనపై స్పందిస్తూ, దీనికి సంబంధించిన సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ ఘటనతో ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని డెట్రాయిట్ పోలీస్ విభాగం తెలియజేసింది.ఇదీ చదవండి: సల్ఫర్ ధర డబుల్.. భారత్‌కు సరికొత్త సంక్షోభం! -
షూటింగ్లో మరొకటి.. 25కు చేరిన భారత్ పతకాల సంఖ్య
ఏషియన్ గేమ్స్ 2026లో ఏడో రోజు భారత్‌కు శుభారంభం లభించింది. ఒకే రోజు రెండు ఖాతాలో రజత పతకాలు చేరాయి. తొలుత పురుషుల మారథాన్‌లో సావన్ బర్వాల్ రజతం సాధించగా.. ఆతర్వాత మహిళల షూటింగ్ జట్టు కూడా సిల్వర్ మెడల్ గెలుచుకుంది.మారథాన్‌లో సావన్ బర్వాల్ చరిత్రపురుషుల మారథాన్‌లో సావన్ బర్వాల్ వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ 2:11:37తో రజత పతకం సాధించాడు. దీంతో ఏషియన్ గేమ్స్ పురుషుల మారథాన్‌లో భారత్‌కు 44 ఏళ్ల తర్వాత పతకం లభించింది.షూటింగ్లో మహిళల జట్టుకు రజతంమహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో తిలోత్తమ సేన్, విదర్సా వినోద్, ఆశి చౌక్సేతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఇదే ఈవెంట్లో తిలోత్తమ సేన్, విదర్సా వినోద్ వ్యక్తిగత ఫైనల్‌కు కూడా అర్హత సాధించారు.25కు చేరిన భారత్ పతకాల సంఖ్యఏడో రోజు రెండు రజతాలు రావడంతో ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 25కు చేరింది.ఇదీ చదవండి: భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన -
'గోల్డ్' తెచ్చిన 'గన్'
ఆసియా క్రీడల్లో భారీ సంఖ్యలో పతకాలు వస్తాయని ఆశించిన షూటింగ్లో ఒక్కో రోజు గడుస్తున్నకొద్దీ నిరాశ పెరుగుతూ వచ్చింది. అంచనాలు పెట్టుకున్న స్టార్లంతా విఫలం కావడంతో గత క్రీడల 22 పతకాలకు దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఎట్టకేలకు రజత, కాంస్యాలు దక్కినా... పసిడి మాత్రం దూరంగా ఉండిపోయింది. కానీ శుక్రవారం భారత్‌కు ఆ లోటు తీరింది. సురుచి సింగ్–కమల్జీత్ జోడీ షూటింగ్లో స్వర్ణ పతకాన్ని అందించి ఊరటనిచ్చింది. దీనికి తోడు మరో రజతం కూడా షూటర్ల ఖాతాలో చేరింది. మరోవైపు అథ్లెటిక్స్‌లో లాంగ్‌డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 10 వేల మీటర్ల విభాగంలో వెండి పతకంతో మెరిశాడు. మహిళా పోల్‌వాల్టర్ బరానికా ఇలంగోవన్, షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ కూడా కాంస్యాలు అందించారు. టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనుశ్ షా–దియా చిటాలె ద్వయం కాంస్యం గెలవడంతో ఆసియా క్రీడల ఆరో రోజును భారత్ ఆరు పతకాలతో ముగించింది. నగోయా: ఆసియా క్రీడల్లో భారత్ రెండో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు మహిళల టి20 క్రికెట్లో ఏకైక పసిడి దక్కగా, ఇప్పుడు షూటింగ్ ఆ జాబితాలో చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు చెందిన సురుచి సింగ్–కమల్జీత్ ద్వయం స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో భారత జంట మొత్తంగా 484.6 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సురుచి 245.7 పాయింట్లు స్కోర్ చేయగా, కమల్జీత్ 238.9 పాయింట్లు నమోదు చేశాడు. క్వాలిఫయింగ్‌లో తొలి స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించిన భారత జంట చివరి వరకు అదే జోరును కనబర్చడంలో సఫలమైంది. దక్షిణ కొరియా (478.0 పాయింట్లు) రజతం సాధించగా, ఇరాన్ (415.8)కు కాంస్యం దక్కింది. ఆధిక్యం కోల్పోయి... షూటింగ్లో భారత్ మరో స్వర్ణం గెలుచుకునే ప్రయత్నంలో హోరాహోరీగా తలపడినా... చివరకు రెండో స్థానానికే పరిమితమైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు రజతం లభించింది. మన త్రయం ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, నీరజ్ కుమార్ ఓవరాల్‌గా 1762 పాయింట్లు సాధించారు. వీటిలో ఐశ్వర్య ప్రతాప్ 589, నీరజ్ 588, రుద్రాంక్ష్ 585 పాయింట్లు స్కోర్ చేశారు. చైనా (1766 పాయింట్లు) స్వర్ణం గెలుచుకోగా, దక్షిణ కొరియాకు (1751 పాయింట్లు) కాంస్యం లభించింది. ఒకదశలో ఇక్కడి ప్రదర్శనను బట్టే వ్యక్తిగత విభాగంలో ఫైనల్స్‌కు కూడా షూటర్లు అర్హత సాధిస్తారు. దాంతో మూడో స్థానంతో ఐశ్వర్య ప్రతాప్, నాలుగో స్థానంతో నీరజ్ ఫైనల్ చేరారు. 9వ స్థానంతో నిలిచిన రుద్రాంక్ష్ ముందంజ వేయడంలో విఫలమయ్యాడు. అయితే వ్యక్తిగత ఫైనల్లో భారత షూటర్లు నిరాశపర్చారు. క్వాలిఫయింగ్‌లో ప్రదర్శనను పునరావృతం చేయలేక నీరజ్ 8వ స్థానంలో, ఐశ్వర్య ప్రతాప్ ఐదో స్థానంలో నిలిచి నిష్క్రమించారు. కమల్ కా కమాల్... కమల్జీత్ విజయం కూడా సరిగ్గా ఇదే తరహాలో రెండు ఓటముల తర్వాతే వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 9వ స్థానంతో ఫైనల్ అవకాశాలు చేజారగా, టీమ్ ఈవెంట్లో జట్టు నాలుగో స్థానానికి పరిమితమైంది. తొలిసారి పాల్గొన్న ఆసియా క్రీడల్లో పతకం లేకుండానే నిష్క్రమిస్తానని భయపడ్డానని, అయితే తన ఆటకు తోడు అదృష్టం కూడా కలిసొచ్చిందని కమల్జీత్ చెప్పాడు. నిజానికి మిక్స్డ్ ఈవెంట్లో సురుచితో పాటు కేదార్లింగ్ బరిలోకి దిగాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అతడిని తప్పించి కమల్జీత్కు కోచ్ సమరేశ్ జంగ్ అవకాశం ఇచ్చాడు. దాంతో తనను తాను కచ్చితంగా నిరూపించుకోవాల్సిన స్థితిలో అతను నిలిచాడు.హరియాణాలోని రేవారికి చెందిన 23 ఏళ్ల కమల్జీత్ మెరుగ్గానే ఆరంభించినా... చివరికొచ్చేసరికి కాస్త తడబడ్డాడు. అయితే సురుచి స్కోరు కారణంగా ఇద్దరికీ స్వర్ణం దక్కింది. ఏడేళ్ల క్రితం షూటింగ్ మొదలు పెట్టిన కమల్జీత్ 2023లో భారత జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. అదే ఏడాది తాను ప్రయాణిస్తున్న ఆటోకు ప్రమాదం జరగడంతో కాలుకు తీవ్ర గాయమైన అతను కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. ఇటీవలే ఆర్మీలో హవల్దార్‌గా చేరిన అతను ఇప్పుడు పసిడి పతకంతో వెనుదిరుగుతున్నాడు. స్వర్ణం ‘సురుచి’కరం... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 26వ స్థానం... టీమ్ విభాగంలో త్రుటిలో పతకం చేజారి నాలుగో స్థానంతో సరి... ఈ ఆసియా క్రీడల్లో రెండు వైఫల్యాల తర్వాత శుక్రవారం తీవ్ర ఒత్తిడి మధ్య సురుచి బరిలోకి దిగింది. 20 ఏళ్ల వయసులో ఆమె ఖాతాలో ఇప్పటికే వరల్డ్ చాంపియన్‌షి ప్ రజతం, వరల్డ్ కప్ ఫైనల్ స్వర్ణం, 5 వరల్డ్ కప్ స్వర్ణాలు, గత ఏడాదే వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్లాంటివి ఉన్నాయి. ఇలాంటి రికార్డు కారణంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన సురుచి రెండు ఈవెంట్ల వైఫల్యంతో భారత షూటింగ్ మేనేజ్మెంట్ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంది. కానీ ఇప్పుడు తన ప్రదర్శనతోనే ఆమె వాటికి సమాధానం ఇచ్చింది. ఈ క్రీడల షూటింగ్లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన ప్లేయర్‌గా సురుచి నిలిచింది. క్వాలిఫికేషన్లో 295 పాయింట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన 296 పాయింట్లు స్కోర్ చేసిన ఆమె... ఫైనల్లో 246 పాయింట్ల లక్ష్యంతో గురి పెట్టి అతి చేరువగా 245.7 పాయింట్లు సాధించగలిగింది. అయితే స్వర్ణం గెలుచుకోవడానికి ఇది సరిపోయింది. హరియాణాలోని ఝఝర్ జిల్లాకు చెందిన సురుచి తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసింది. ‘ఎలాగైనా స్వర్ణమే సాధించాలని బరిలోకి దిగాను. నా ప్రదర్శన పట్ల చాలా ఆనందంగా ఉన్నా. గత రెండు వైఫల్యాలను నా మనసులోంచి చెరిపేసి కొత్తగా మొదలు పెట్టా. నీకు మరో అవకాశం ఉందంటూ కోచ్‌లు స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ఫలితం కనిపించింది’ అని సురుచి వ్యాఖ్యానించింది. కాంస్యం నుంచి రజతానికి...భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ గత ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాడు. ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శనతో అతను రజతాన్ని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. గత రెండేళ్లుగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గుల్వీర్ అంచనాలను అందుకోవడంలో సఫలమయ్యాడు. 10 వేల మీటర్ల పరుగును గుల్వీర్ 28 నిమిషాల 28.38 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. బిర్హాను బలెవ్ (బహ్రెయిన్; 28 నిమిషాల 27.51 సెకన్లు) స్వర్ణ పతకం సాధించగా, ఆల్బర్టో కిప్టో (బహ్రెయిన్; 28 నిమిషాల 34.18 సెకన్లు)కు కాంస్యం దక్కింది. ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా గుల్వీర్ 10 వేల మీటర్ల పరుగులో రజతం, 5 వేల మీటర్ల పరుగులో కాంస్యం అందుకున్నాడు. ఆర్మీలో నాయబ్ సుబేదార్‌గా పని చేస్తున్న గుల్వీర్ పేరిటే ఈ రెండు ఈవెంట్లలో జాతీయ రికార్డులు ఉన్నాయి. 5 వేల మీటర్ల పరుగును 13 నిమిషాల్లోపు పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్‌గా అతను గుర్తింపు పొందాడు. 36 ఏళ్ల వయసులో... రెండు దశాబ్దాల క్రితం ఆసియా జూనియర్ చాంపియన్‌షి ప్తో అంతర్జాతీయ కెరీర్ మొదలు... కానీ షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్‌కు విజయాల పరంగా ఎలాంటి గుర్తింపూ రాలేదు. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో మూడుసార్లు పాల్గొంటే 9వ, 7వ, 4వ స్థానాలు మాత్రమే దక్కాయి. గత ఆసియా క్రీడల్లో 5వ స్థానం లభిస్తే ఒలింపిక్స్‌లో 23వ స్థానం మాత్రమే! పైగా డోపింగ్ వివాదంతో నాలుగేళ్లపాటు నిషేధం కూడా ఎదుర్కొంది. కానీ పట్టువదలకుండా పోరాడిన ఆమె ఇప్పుడు ఆసియా క్రీడల్లో కాంస్యంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల షాట్‌పుట్ ఫైనల్స్‌లో ఇనుప గుండును 17.17 మీటర్లు విసిరి మన్‌ప్రీత్ మూడో స్థానంలో నిలిచింది. సంగ్ జియాయున్ (చైనా; 19.40 మీటర్లు) పసిడి పతకాన్ని అందుకోగా, జాంగ్ లిన్రు (చైనా; 18.14 మీటర్లు) రజత పతకం సాధించింది. జాతీయ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి ప్లో ఆసియా క్రీడల అర్హత మార్క్‌ను అందుకొని ఈ పోటీలకు వచ్చిన మన్‌ప్రీత్ తన అత్యుత్తమ ప్రదర్శనతో పతకం సాధించి సగర్వంగా నిలిచింది. బార్బరా వెబ్‌స్టర్ (1951), కిరణ్ బలియాన్ (2023) తర్వాత ఆసియా క్రీడల మహిళల షాట్‌పుట్‌లో పతకం నెగ్గిన భారత అథ్లెట్‌గా ఆమె నిలిచింది. బరానిక కొత్త చరిత్రభారత అథ్లెటిక్స్ చరిత్రలో శుక్రవారం కొత్త ఘనత నమోదైంది. ఆసియా క్రీడల చరిత్రలో పురుషుల, మహిళల విభాగాల్లో ఒక్కసారి కూడా పతకం లభించని పోల్‌వాల్ట్‌లో ఈసారి భారత క్రీడాకారిణి పోడియంపై నిలిచింది. తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల బరానిక ఇలంగోవన్ ఈ ఘనత సాధించిన అథ్లెట్‌గా తన పేరును లిఖించుకుంది. మహిళల పోల్‌వాల్ట్ ఈవెంట్లో 4.15 మీటర్ల ఎత్తుకు ఎగిరిన బరానిక కాంస్యం సొంతం చేసుకుంది. కజకిస్తాన్‌కు చెందిన పొలీనా ఇవనోవా కూడా 4.15 మీటర్లు ఎగిరి భారత అథ్లెట్‌తో సమంగా నిలిచింది. ఇద్దరూ కూడా సరిగ్గా 4.25 మీటర్ల ప్రయత్నంలోనే విఫలమయ్యారు. దాంతో ఇద్దరికీ కాంస్యాన్ని ప్రకటించారు. ఈ ఈవెంట్లో మిసాకి మొరోటా (జపాన్; 4.55 మీటర్లు) స్వర్ణాన్ని అందుకోగా, చుంగే నియు (చైనా; 4.50 మీటర్లు) రజతం గెలుచుకుంది. ఈ ఏడాది జాతీయ ఇండోర్ ఓపెన్ ఈవెంట్లో బరానిక 4.23 మీటర్లతో తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. దీనిని అధిగమించలేకపోయినా... పతకం మాత్రం గెలుచుకోవడంలో ఆమె సఫలమైంది. ఆరేళ్ల క్రితం ఏసీఎల్ గాయంతో చాలా కాలం ఆటకు దూరమై కెరీర్ ప్రమాదంలో పడినా... 2023లో రిలయన్స్ హైపర్ఫార్మెన్స్ సెంటర్లో చేరడం ఆమెకు కొత్త ఊపిరి పోసింది. గత మూడేళ్ల కఠోర సాధన తర్వాత ఇప్పుడు ఏషియాడ్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా బరానిక సగర్వంగా నిలిచింది. ‘మిక్స్డ్ డబుల్స్’ టీటీలో మనుశ్–దియాలకు కాంస్యంగత ఆసియా క్రీడల్లో ఏకైక పతకం అందించిన టేబుల్ టెన్నిస్ (టీటీ)లో శుక్రవారం తొలి పతకం చేరింది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీ మనుశ్ షా–దియా చిటాలె సెమీఫైనల్లో ఓడి కాంస్యంతో ముగించింది. సెమీఫైనల్లో భారత జంట 8–11, 5–11, 8–11, 2–11తో చైనాకు చెందిన వాంగ్‌చుక్–సున్ యింగ్షా జోడీ చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో మనుశ్–దియా 11–6, 13–15, 11–9, 11–5తో ప్రపంచ నాలుగో ర్యాంక్ హాంకాంగ్ జోడీ వాంగ్ టున్ టింగ్–డూ హోయ్ కిమ్‌పై సంచలన విజయంతో సెమీఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నారు.స్క్వాష్ లో 3 పతకాలు ఖాయంఆసియా క్రీడల స్క్వాష్ లో భారత్‌కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల సింగిల్స్‌లో అనాహత్ సింగ్, పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్, మిక్స్డ్ డబుల్స్‌లో జోష్నా చినప్ప–సెంథిల్ కుమార్ జోడీ సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖరారు చేసుకున్నారు. రికార్డు స్థాయిలో ఏడోసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న జోష్న ఇప్పటికే ఐదు పతకాలు సాధించింది. 2018 ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గిన జోషా్న... 2014, 2018 క్రీడల్లో టీమ్ విభాగాల్లో రజత పతకాలు గెలుచుకుంది. 2010, 2023లో టీమ్ విభాగంలో కాంస్యాలు దక్కించుకుంది. శుక్రవారం మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో జోషా్న–సెంథిల్ జోడీ 11–3, 11–5తో డేవిడ్ పెలినో–జెమికా అరిబాడో (ఫిలిప్పీన్స్) ద్వయంపై గెలుపొందింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అనాహత్ 11–2, 11–5, 11–3తో భారత్‌కే చెందిన తన్వీ ఖన్నాపై గెలిచింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అభయ్ 11–4, 11–3, 11–6తో ర్యోనోసుకె సుకువే (జపాన్)పై గెలిచాడు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో వీర్ చోత్రాని 11–6, 8–11, 3–11, 3–11తో ఇర్ఫాన్ (పాకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
అదరగొట్టిన షూటర్లు.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్ రెండో పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 6 వరోజు భారత షూటర్లు సంచలన ప్రదర్శన కనబరిచారు. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో కమల్జీత్ - సురుచి సింగ్ జోడీ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్ పోరు ఆరంభం నుంచే కమల్జీత్ - సురుచి జోడీ ప్రత్యర్ధులకు చుక్కలు చూపించింది. మొత్తంగా ఈ భారత ద్వయం 484.6 పాయింట్లతో గోల్డ్‌మెడల్‌ను సొంతం చేసుకుంది. కమల్జీత్ - సురుచి జోడీ భారత్‌కు పసిడి పతకాన్ని అందించడమే కాకుండా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ విభాగం ఫైనల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ఏషియన్ జంటగా వారు నిలిచారు. ఇంతకుముందు ఈ రికార్డు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ కమాలోవ్ - నిగినా సైద్కులోవా(481.3 పాయింట్లు) పేరిట ఉండేది. తాజా ప్రదర్శనతో వారిని కమల్జీత్ - సురుచి అధిగమించారు.మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్ త్రయం రజత పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో భారత్ పతకాల సంఖ్య 19కు చేరింది.చదవండి: Asian Games: 'అంతా మోసం.. నా నుంచి గోల్డ్ మెడల్ లాగేసుకున్నారు' -
పదిహేనుకు చేరిన పతకాల సంఖ్య
జపాన్ వేదికగా ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్లో భారత్ ఖాతాలో మరో రెండు కాంస్యాలు చేరాయి. తద్వారా పతకాల సంఖ్య పదిహేనుకు చేరింది. కాగా గురువారం తొలుత వుషు అథ్లెట్ రోషిబినా దేవి భారత్‌కు పతకాన్ని అందించింది.రోషిబినాకు రజతంమహిళల అరవై కిలోల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన జియాయు ఝాంగ్‌తో తలపడ్డ రోషిబినా.. దురదృష్టవశాత్తూ 2-0 తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఆమె రజత పతకం సాధించింది. కాగా ఆఖరి నిమిషంలో రోషిబినా ఆసియా క్రీడల బృందంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.కాగా దివ్యాంశి చౌదరి స్థానంలో ఆమె వచ్చి చేరగా.. దివ్యాంశి తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే, ఆఖరికి ఆమె వెనక్కి తగ్గగా.. రోషిబినా పతకంతో మెరిసి తన ఎంపిక సరైందేనని నిరూపించుకుంది. మరో రెండు కాంస్యాలుఇక డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం గెలిచారు. మరోవైపు.. స్కీట్ షూటింగ్ మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో భారత షూటర్లు అనంత్‌జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధలీవాల్ కాంస్యం సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలో ఆసియా క్రీడల తాజా ఎడిషన్‌లో పతకాల సంఖ్య పదిహేనుకు చేరింది. ఇప్పటి వరకు భారత్‌కు మహిళల క్రికెట్లో స్వర్ణంతో పాటు.. ఆరు రజతాలు, ఎనిమిది కాంస్య పతకాలు లభించాయి. పట్టికలో భారత్ ప్రస్తుతానికి పద్నాలుగో స్థానంలో నిలిచింది.చదవండి: చైనా చేతిలో ఓటమి.. కాంస్యంతో సరిపెట్టుకున్న భారత జట్టు -
మను బాకర్‌కు నిరాశ.. షూటింగ్లో భారత్‌కు డబుల్ బ్రాంజ్
2026 ఆసియా క్రీడల నాలుగో రోజు భారత షూటర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. స్వర్ణం ఖాయమనుకున్న స్టార్ షూటర్ మనూ బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కనీసం కాంస్య కూడా సాధించలేకపోగా.. స్కీట్ ఈవెంట్లో మహిళలు, పురుషుల జట్లు కాంస్య పతకాలు సాధించాయి. తొలుత మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధలివాల్‌తో కూడిన భారత జట్టు.. ఆతర్వాత పురుషుల స్కీట్ టీమ్ అనంత్‌జీత్ సింగ్ నరూకా, మైరాజ్ ఖాన్, భవ్‌తేజ్ సింగ్ గిల్‌తో కూడిన భారత జట్టు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి. అనంత్‌జీత్ సింగ్ వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్‌కు అర్హత సాధించాడు.సాఫ్ట్ టెన్నిస్‌లో చరిత్ర.. జయ్ మీనాకు పతకం ఖాయంపురుషుల సాఫ్ట్ టెన్నిస్ సింగిల్స్‌లో భారత ఆటగాడు జయ్ మీనా సెమీఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో ఆసియా గేమ్స్ చరిత్రలో సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది.మహిళల కబడ్డీలో భారత్ ఘన విజయంమహిళల కబడ్డీలో భారత జట్టు అదరగొట్టింది. గ్రూప్-ఎ మ్యాచ్‌లో ఇరాన్‌ను 37-23తో ఓడించింది. మరోవైపు, వెయిట్‌లిఫ్టింగ్ మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను పతకంపై ఆశలు పెట్టుకుంది. ఆసియా గేమ్స్‌లో తన తొలి పతకం సాధించడమే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగనుంది.ఇదీ చదవండి: టీమిండియా క్రికెటర్‌కు తమిళనాడు సీఎం విజయ్ భారీ నజరానా -
Asian Games 2026: షూటింగ్లో భారత్‌కు మరో పతకం
జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్లు మరో పతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధలివాల్‌తో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ఈవెంట్లో చైనా స్వర్ణం సాధించగా.. కజకిస్తాన్ రజతంతో సరిపెట్టుకుంది. షూటింగ్లో భారత్‌కు ఇది ఆరో పతకం కాగా.. మొత్తంగా ఎనిమిదో పతకం (ఒక గోల్డ్, 4 సిల్వర్, 3 బ్రాంజ్).ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 58 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది.కాగా, నాలుగో రోజు భారత క్రీడాకారులు పలు విభాగాల్లో సత్తా చాటుతున్నారు. ఇప్పటకే షూటింగ్లో మహిళల స్కీట్ టీమ్ కాంస్య పతకాన్ని సాధించగా, స్టార్ షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు, సాఫ్ట్ టెన్నిస్‌లో జయ్ మీనా సెమీఫైనల్‌కు చేరడంతో భారత్‌కు ఆ క్రీడలో ఆసియా గేమ్స్ చరిత్రలో తొలి పతకం ఖాయమైంది.ఇదీ చదవండి: 'మన బంగారం' మహిళా క్రికెటర్లు -
Asian Games 2026: షూటింగ్లో డబుల్ ధమాకా.. మొత్తం 6 పతకాలు
ఏషియన్ గేమ్స్ 2026లో రెండో రోజు భారత్‌కు పతకాల పంట పండింది. షూటింగ్లో భారత షూటర్లు సత్తా చాటారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాంశు ధిల్లాన్ రజతం, రుద్రాంక్ష్ పాటిల్ కాంస్యం సాధించారు.ఇదే ఈవెంట్లో అంతకుముందు వీరిద్దరూ పార్త్ మానేతో కలిసి టీమ్ విభాగంలో రజతం గెలుచుకున్నారు. దీంతో రెండో రోజు భారత్ ఖాతాలో మూడు షూటింగ్ పతకాలు చేరాయి.తొలి రోజు కూడా భారత్ ఖాతాలో రెండు షూటింగ్ పతకాలు చేరాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్ వలరివన్.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో సోనమ్ మస్కర్, విదర్సా వినోద్, ఎలావెనిల్ వలరివన్ రజత పతకాలు సాధించారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో కేవలం షూటింగ్‌లోనే ఐదు పతకాలు చేరాయి. ఇప్పటివరకు భారత్ మొత్తం 6 పతకాలు గెలిచింది.ఇవాళే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మహిళల సంప్రదాయ 60 కేజీల విభాగంలో సుచికా తరియాల్ కాంస్య పతకం సాధించింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఎంఎంఏలో భారత్‌కు ఇదే తొలి పతకం.మరోవైపు ఇవాళ జరిగిన మహిళల టేబుల్ టెన్నిస్‌లో భారత జట్టు పాకిస్తాన్‌ను 3-0తో చిత్తు చేసి, క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది.ఇదీ చదవండి: Asian Games 2026: మహిళల ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకం -
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మూడో పతకం
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు-2026లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. రెండో రోజు పోటీల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు మరో రజత పతకం లభించింది. హిమాంశు ధిల్లాన్, పార్థ్ మానే, రుద్రాంక్ష్ పాటిల్‌తో కూడిన భారత జట్టు రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. ఈ ఈవెంట్లో చైనా ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణం గెలిచింది.తాజా పతకంతో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. పోటీల తొలి రోజు కూడా భారత్ ఖాతాలో రెండు రజత పతకాలే చేరాయి. అవి కూడా షూటింగ్‌లోనే రావడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్ వలరివన్.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో సోనమ్ మస్కర్, విదర్సా వినోద్, ఎలావెనిల్ వలరివన్ రజత పతకాలు సాధించారు.కాగా, ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలోనూ భారత షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. దీంతో షూటింగ్లో భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్‌లో స్టార్ హీరో తనయుడు.. ఎవరో తెలుసా? -
Asian Games 2026: భారత్ ఖాతాలో రెండో పతకం
ఏషియన్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగుతోంది. తొలి రోజే షూటింగ్లో భారత్‌కు మరో పతకం దక్కింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్ వలరివన్ రజతం సాధించింది. దీంతో ఈ ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య రెండుకు చేరింది.ఇప్పటికే సోనమ్ మస్కర్, విదర్సా వినోద్‌తో కలిసి మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రజతం గెలిచిన ఎలావెనిల్.. వ్యక్తిగత విభాగంలోనూ సత్తా చాటింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య జరిగిన ఫైనల్లో రాణించి మరోసారి పోడియంపై నిలిచింది.మరో పతకం ఖాయంషూటింగ్లో రెండు రజత పతకాలు కైవసం చేసుకున్న భారత్.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లోనూ మరో పతకం ఖాయం చేసుకుంది. మహిళల సంప్రదాయ 60 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో మంగోలియా క్రీడాకారిణి ఆల్టాంచిమెగ్ బైగల్మాను ఓడించిన సుచికా తరియాల్ సెమీఫైనల్‌కు చేరింది. దీంతో భారత్‌కు ఈ క్రీడలో తొలి పతకం ఖాయమైంది.తొలి రోజు భారత అథ్లెట్ల ఫలితాలువుషు: పురుషుల చాంగ్‌క్వాన్ ఫైనల్లో సూరజ్ సింగ్ మయాంగ్లంబం 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.టెక్బాల్: మహిళల సింగిల్స్ కాంస్య పతక పోరులో జపాన్ క్రీడాకారిణి యుయినా సకమోటో చేతిలో క్విమ్సీ డిసౌజా ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ కాంస్య పతక పోరులోనూ క్విమ్సీ డిసౌజా, మహమ్మద్ అనస్ బేగ్ జోడీకి నిరాశ ఎదురైంది. వియత్నాం జోడీ చేతిలో ఓటమి పాలైంది.స్విమ్మింగ్: పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్‌లో రిషబ్ దాస్ ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఉత్కర్ష్ పాటిల్ 12వ స్థానంలో నిలిచాడు. పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్స్‌లో బెనెడిక్షన్ బెనిస్టన్ 12వ స్థానంలో, ఆకాష్ మణి 23వ స్థానంలో నిలిచారు.టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ గ్రూప్ ఎఫ్ మ్యాచ్‌లో ఇండోనేషియాపై భారత్ 3-0తో విజయం సాధించింది. పురుషుల టీమ్ గ్రూప్ ఎఫ్ మ్యాచ్‌లోనూ భారత్ 3-0తో ఇండోనేషియాను ఓడించింది.ఎంఎంఏ: మహిళల సంప్రదాయ 60 కేజీల క్వార్టర్ ఫైనల్లో సుచికా తరియాల్ విజయం సాధించి భారత్‌కు పతకం ఖాయం చేసింది.హాకీ: ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన పూల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 19-0తో ఘన విజయం సాధించింది. దీపికా సెహ్రావత్ ఏకంగా 9 గోల్స్ చేసి టోర్నీలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.మహిళల క్రికెట్: సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతోంది. ఫైనల్ బెర్త్ కోసం భారత జట్టు పోరాడుతోంది.ఇదీ చదవండి: Asian Games 2026: షూటింగ్ 'సిల్వర్'తో ఖాతా తెరిచిన భారత్ -
Asian Games 2026: షూటింగ్ 'సిల్వర్'తో ఖాతా తెరిచిన భారత్
జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట ప్రారంభమైంది. క్రీడల తొలి రోజే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఎలావెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్సా వినోద్ రజత పతకం సాధించారు. ఈ ఈవెంట్లో చైనా స్వర్ణం సాధించగా.. ఆతిథ్య జపాన్ కాంస్యంతో సరిపెట్టుకుంది.మరో పతకం ఖాయంమహిళల ట్రెడిషనల్ MMA (మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్) 60 కేజీల విభాగంలో సుచికా తరియాల్ సెమీఫైనల్‌కు చేరుకోవడంతో భారత్‌కు మరో పతకం ఖాయమైంది.హాకీ జట్టుకూ అదిరిపోయే ఆరంభంభారత మహిళల హాకీ జట్టుకు అదిరిపోయే అరంభం లభించింది. ఉజ్బెకిస్తాన్‌పై టీమిండియా 19-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దీపిక 9 గోల్స్‌తో చెలరేగగా.. ఇషిక హ్యాట్రిక్ సాధించింది.టేబుల్ టెన్నిస్‌లోనూ ఘనంగా బోణీమహిళల టేబుల్ టెన్నిస్ ఈవెంట్లోనూ భారత్ ఘనంగా బోణీ కొట్టింది. ఆకుల శ్రీజ, సుతిర్థ ముఖర్జీ, సిండ్రెల దాస్ జోడీ ఇండోనేషియా జోడీపై 3-0తో విజయం సాధించింది.నేడు భారత్ కీలక ఈవెంట్లుమహిళల క్రికెట్: బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్పురుషుల హాకీ: ఇండోనేషియాతో తొలి మ్యాచ్షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్బ్యాడ్మింటన్: కజకిస్థాన్‌తో మహిళల టీమ్ మ్యాచ్వుషు: భారత్ ఆటగాళ్లకు నాకౌట్ పోటీలుఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు -
హబ్‌లో జోరు.. హుషారు
కథ డిమాండ్ చేస్తే చాలు.. తమ సినిమాల షూటింగ్స్ కోసం దేశ విదేశాలు చుట్టేస్తుంటారు మేకర్స్. పైగా తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా పరిధి దాటి అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటుతోంది. అందుకే కాబోలు స్వదేశంతో పాటు బడ్జెట్ ఎక్కువ అయినా విదేశాల్లోనూ షూటింగ్స్‌కి ఏమాత్రం వెనకాడటం లేదు. పలు సినిమాల చిత్రీకరణలు మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరుగుతుంటే మరికొన్ని మూవీస్ షూటింగ్స్ విదేశాల్లోనూ జరుగుతున్నాయి.అయితే మెజారిటీ సినిమాలు మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ హబ్‌గా చెప్పుకునే హైదరాబాద్‌లోనే జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్‌లు జోరుగా, హుషారుగా సాగుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, గోపీచంద్, శర్వానంద్, శ్రీ విష్ణు... వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. మరి... ఆ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం. కాలేజ్‌లో కాకా... చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. ఈ సినిమాకి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా ఇది. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాలో నివేతా పేతురాజ్, అనశ్వర రాజన్, సునీల్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ కాలేజ్‌లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ బాబీ. చిరంజీవిని ఇప్పటి వరకు చూడని సరికొత్త తరహా పాత్రలో చూపించనున్నారట ఆయన. ‘‘చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేసిన ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రకటన నుంచే ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, మాస్ అప్పీల్‌తో ఆ అంచనాలను మరింత పెంచింది. చిరంజీవిని రెండు విభిన్నమైన లుక్స్‌లో చూపించిన విధానం, పవర్ఫుల్ విజువల్స్, మ్యూజిక్, యాక్షన్ కలిసి గ్లింప్స్‌ను ఆసక్తికరంగా మార్చాయి. మిడిల్ క్లాస్ అవతార్‌లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్‌తో కనిపించగా, యంగ్ వెర్షన్లో ఆయన యాటిట్యూడ్, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ తన డైనమిక్ విజువల్స్‌తో గ్లింప్స్‌ను మరింత ఆసక్తికరంగా మలిచారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంటాయి. ‘గ్యాంగ్ లీడర్’ మూవీలోని ఐకానిక్ ‘గ్యాంగ్ గ్యాంగ్...’ పాటను రీమిక్స్ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్‌కు మరింత స్వాగ్‌ను జోడించింది. సంక్రాంతి సందర్భంగా ‘కాకా’ సినిమాని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అజీజ్ నగర్లో... వరుస పాన్ ఇండియన్ మూవీస్‌తో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఏకకాలంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నారాయన. ఓ వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం చేస్తున్న ప్రభాస్.. మరోవైపు ‘ఫౌజీ’ మూవీలో నటిస్తున్నారు. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. ‘‘భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీగా ‘ఫౌజీ’ని రూపొందిస్తున్నాం. ఇప్పటివరకూ ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ లుక్‌లో కనిపించనున్నారు ప్రభాస్. డిసెంబరు 3న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, విడుదల చేసిన ప్రభాస్ సరికొత్త పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఓ యోధుడిలా, రక్తంతో తడిసిన దుస్తులు, శరీరమంతా గాయాలతో, చుట్టూ నేలకూలిన సైనికుల మధ్య తుపాకీని పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్న ప్రభాస్ లుక్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. 2026లో అత్యంత భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంషాబాద్‌లో... మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. ‘‘సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘వారణాసి’ నుంచి మహేశ్ రెండు స్పెషల్ స్టిల్స్‌ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండు స్టిల్స్ చూస్తే ‘వారణాసి’ సినిమా సోల్, రుద్ర పాత్ర తీరు అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. శతాబ్దాలను దాటి ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ వ్యక్తి ప్రయాణంగా సాగే ఇతిహాసం ఇది. ఇందులో ఒక వ్యక్తి అసాధారణ ప్రయాణం అతడిని భారతదేశంలోని పవిత్ర జలాల నుంచి భూమి మారుమూల ప్రాంతాలకు తీసుకువెళుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు, 120 దేశాల్లో విడుదల చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ‘వారణాసి’లో శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు మహేశ్. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్‌లో విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. ఈ చిత్రం ద్వారా ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనార్కలి నజర్ హీరోయిన్గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. గోపీచంద్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ‘‘విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ ‘సింగ’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న ‘సింగ’ టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను రివీల్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ఫుల్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. గోపీచంద్‌ను కొత్త కోణంలో చూపించేలా వెంకట్ ఒక గ్రిప్పింగ్ కథని సిద్ధం చేశారు. ఈ మూవీ నుంచి గడ్డం, మీసం, చెవిపోగు, రక్తం, చెమటతో కనిపించే రగ్డ్ అవతార్‌లో రిలీజ్ చేసిన గోపీచంద్ లుక్ ఆయన అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్‌గా నిలిచింది. టైటిల్ టీజర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో రూపొందింది. ఫైట్ మాస్టర్‌గా సక్సెస్ అందుకున్న వెంకట్ దర్శకుడిగా హీరోను ఎంత పవర్ఫుల్ మాస్ లుక్‌లో చూపించారో ఈ గ్లింప్స్‌తోనే నిరూపించారు. ఈ సినిమా కోసం గోపీచంద్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. కెమెరామెన్ షామ్‌దత్. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన సినీ అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ముచ్చింతల్‌లో... శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఆరంభం అయింది. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ముఖ్యమైన నటీనటులు పాల్గొంటున్నారట. ‘‘పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘భోగి’. శర్వానంద్–సంపత్ నందిల కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన, లెన్తీ యాక్షన్ షెడ్యూల్‌ను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్‌తో కూడిన ప్రదేశాల్లో తెరకెక్కించాం. దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో రూపొందించిన ఈ పోరాట సన్నివేశాలు సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రంలోని శర్వానంద్ రగ్డ్, గ్రాండ్ స్కేల్ విజన్‌కు ప్రశంసలు లభించాయి. పల్లెటూరి యువతిగా కథానాయిక అనుపమా పరమేశ్వరన్ కనిపించిన ఫస్ట్ లుక్కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాని ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాయిదా పడింది. శంకర్‌పల్లిలో... హీరో శ్రీ విష్ణు–డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్æ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజ వరగమన’. ఈ మూవీలో రెబ్బా మోనికా జాన్ హీరోయిన్గా నటించారు. అనిల్ సుంకర, రాజేష్ దండ నిర్మించిన ఈ మూవీ 2023 జూన్ 28న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులకు పూర్తి వినోదాలు అందించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది.‘సామజ వరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘వెన్నెల’ కిషోర్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెకక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపిస్తుందని యూనిట్ పేర్కొంది. ఆర్ఎఫ్సీలో... తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్ర ఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024 జనవరి 12న విడుదలైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆంజనేయస్వామి పాత్రను ‘కాంతారా’ మూవీ ఫేమ్ రిషభ్ శెట్టి పోషిస్తున్నారు.‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హంపీలోని అంజనాద్రి బెట్టలో ఆరంభం అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ‘జై హనుమాన్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ వర్మ. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? అన్న నేపథ్యంలో ‘జై హనుమాన్’ రూపొందుతోంది. ‘హనుమాన్’లో హనుమంత్గా నటించిన తేజ సజ్జా ‘జై హనుమాన్’లోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. హీరో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్ర పోషించనున్నారట.సంబరాల జోరు ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. సాయిదుర్గా తేజ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు రూపొందిస్తున్నారట రోహిత్ కేపీ. ‘‘ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది’’ అని యూనిట్ పేర్కొంది.ఇదిలా ఉంటే... పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని సినిమాల చిత్రీకరణలు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
అమెరికా: కత్తితో మహిళ వీరంగం: ఒకరి మృతి.. నిందితురాలి కాల్చివేత!
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో సోమవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో 32 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోగా, 68 ఏళ్ల వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం నిందితురాలిని పోలీసులు ఘటనా స్థలంలోనే కాల్చిచంపారు.పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. క్వీన్స్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ తన షాపింగ్ బ్యాగ్‌లోంచి రెండు పెద్ద కత్తులను బయటకు తీసి ఈ ఘాతుకానికి పాల్పడింది. సబ్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి, రోడ్డు దాటేందుకు భార్యతో కలిసి వేచి చూస్తున్న 68 ఏళ్ల వ్యక్తి పొట్ట భాగంలో ఆమె మొదట కత్తితో పొడిచింది. ఆ వెంటనే మరో 32 ఏళ్ల మహిళపై దాడి చేసింది. బాధితులిద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 32 ఏళ్ల మహిళ మరణించింది. గాయపడిన వృద్ధుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని చుట్టుముట్టారు. చేతిలోని కత్తులను కింద పడేయాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ ఆమె నిరాకరించింది. ‘నేను దేన్నీ వదలను, మీ ఇద్దరినీ చంపడానికైనా సిద్ధమే’ అంటూ వారి వైపు దూసుకురావడంతో పోలీసులు తొలుత టేజర్ ప్రయోగించి, అనంతరం కాల్పులు జరిపారు. బుల్లెట్ తగలడంతో నిందితురాలు అక్కడికక్కడే కుప్పకూలింది. నిందితురాలికి మానసిక సమస్యలు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు 7వ అవెన్యూలోని కొంత భాగాన్ని తాత్కాలికంగా మూసివేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: భూమిలో రంధ్రాలు పడని 2,000 అండర్వేర్లు.. భూసార రహస్యాలు వెల్లడి! -
అమెరికా: సౌత్ కరోలినాలో కాల్పుల కలకలం
అమెరికాలోని సౌత్ కరోనాలిలో కాల్పుల కలకలం రేగింది. దుండగుడి కాల్పుల్లో పోలీస్ అధికారి మృతి చెందారు. మరో పోలీస్ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. నిందితుడికి నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. మృతి చెందిన పోలీస్ అధికారి.. రెండు సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.శనివారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. ఓ వ్యక్తి తన ఇంటి వద్ద ఆస్తులను ధ్వంసం చేస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు అధికారి వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అనుమానితుడు ఇంటి నుంచి పరారయ్యాడు.ఆ మహిళ అనుమానితుడి రూపురేఖలు.. అతని వాహనం వివరాలను అధికారికి ఇచ్చింది. అయితే, కొద్ది నిమిషాల తర్వాత, ఆ మహిళ చెప్పిన వివరాలకు సరిపోలే వాహనం సమీపంలో ఒక వ్యక్తిని గమనించారు. దీంతో అనుమానాస్పద వ్యక్తి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులకు, నిందితుడికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. -
స్కూల్లో కాల్పులు
నొంతబురి (థాయ్‌లాండ్): బ్యాంకాక్ సమీపంలోని ఓ పాఠశాలలో శుక్రవారం భారీ విషాదం చోటు చేసకుంది. పద్నాలుగేళ్ల విద్యార్థి ఒకరు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఉపాధ్యాయులు మరణించారు. దాదాపు 20 మందికిపైగా గాయపడ్డారు. పాఠశాలకు వచ్చే ముందే ఈ విద్యార్థి తన తాత, అమ్మమ్మలను కూడా చంపేశాడు. ఆ తరువాత తాను కూడా పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. నొంతబురి ప్రావిన్స్‌లోని డెబ్సిరిన్ నొంతబురి పాఠశాలలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తరగతి మొదలు కాగానే నిందితుడు కాల్పులు మొదలుపెట్టాడు. ఆ తరువాత బయటకు వచ్చి మరిన్ని తూటాలు పేల్చాడు. ఒక భవనం నుంచి కాల్పుల శబ్ధం వినిపించగానే మిగిలిన తరగతి గదుల్లోని విద్యార్థులు భయంతో అక్కడే దాక్కున్నారు. నిందితుడు 20కి పైగా రౌండ్లు కాల్చాడని, ఆత్మహత్య చేసుకున్న తరువాత కూడా తుపాకీలో 30 వరకూ బుల్లెట్లు మిగిలి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంట సేపటి తరువాత పోలీసులు తలుపు తట్టి, విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఆ తరువాత విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాఠశాల వెలుపల ఒకరినొకరు ఓదార్చుకుంటూ కనిపించారు. గాయపడ్డ వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉందని పాఠశాల సమీపంలోని బాంగ్యై ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పాఠశాలకు సమీపంలోనే ఉన్న ఓ హోటల్ యజమాని అమ్పోర్న్ నియాంఫాంగ్ మాట్లాడుతూ....‘‘ముందు ఒక బుల్లెట్ పేలిన శబ్ధం వచ్చింది. ఆ తరువాత కొంతసేపు నిశ్శబ్ధం. దీని తరువాత వరుస పేలుడు శబ్దాలు వినిపించాయి’’అని గుర్తు చేసుకున్నాడు. హోటల్ ముందున్న చిన్న రహదారి పిల్లలతో కిక్కిరిసిపోయిందని, చాలామంది ఏడుస్తూ కనిపించారని చెప్పాడు. విద్యార్థి ఇంట్లో మృతదేహాలు... కాల్పుల అనంతరం పోలీసులు నిందితుడి తాత, అమ్మమ్మ ఇంటికి వెళ్లగా తలుపులు మూసి కనిపించాయి. ఎవరూ స్పందించకపోవడంతో అధికారులు తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా తుపాకీ గాయాలతో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. నిందితుడు ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడు కాదని, బాగా చదువుకునే వాడని అతడి మామ, తాత, అక్కచెల్లెళ్ల ద్వారా తెలిసింది. ఇంట్లోకానీ, బడిలో కానీ సమస్యలు ఉన్న విషయం తమకు తెలియదని వారు స్పష్టం చేశారు. అయితే... కాల్పుల ఘటన తరువాత పాఠశాలను సందర్శించిన థాయ్‌లాండ్ ప్రధాని అనుతిన్ చార్న్విరకుల్ మాత్రం నిందితుడు పాఠశాలకు సంబంధించిన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు చెప్పడం గమనార్హం. అలాగే పాఠశాకు వచ్చే ముందే నిందితుడు ఇంట్లో తాత, అమ్మమ్మలను హత్య చేసినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సువుంచ్వీ ధ్రువీకరించారు. కాల్పుల కోసం నిందితుడు ఉపయోగించిన తుపాకీ తాత పేరుతో రిజిస్టర్ అయి ఉందని పోలీసుల ద్వారా తెలిసింది. దాడులకు ముందు నిందితుడు మూక కాల్పులపై ఆన్లైన్లో వెతికాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. -
ఇరవై గంటలు నాన్‌స్టాప్ షూట్లో...
వరుస చిత్రీకరణలతో కీర్తి సురేష్‌కి సరైన నిద్ర ఉండటం లేదట. ఇటీవల నాన్‌స్టాప్‌గా ఇరవైగంటలు షూటింగ్లో పాల్గొన్నారామె. ఈ విషయంపై కీర్తి తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘నిన్న ఉదయం ఆరు గంటలకు నా గది నుంచి బయలుదేరాను. మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు గదికి చేరుకున్నాను. ఇందులో 20 గంటలు పనిలోనే ఉన్నాను. మరో గంటలో మరో షూట్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉంది.ఇది ఇబ్బందికరంగా ఉందని చెప్పడంలేదు. ఇంత బిజీగా పని చేయడాన్ని ఆశీర్వాదంలా భావిస్తున్నాను’’ అని కీర్తి తన ఇన్‌స్టా స్టోరీలో ఆగస్టు 3న ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోపై 41 గంటలు మేల్కొని ఉన్నానని క్యాప్షన్ జోడించారామె. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్, కళ్యాణ్‌రామ్ హీరోలుగా నటిస్తున్న సినిమాలో, ‘రౌడీ జనార్ధన’లో, తమిళంలో ‘డోరోతి’లో కీర్తి హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే నాని ‘ది ప్యారడైజ్’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారట. హిందీలో ‘రఫ్తార్’ నటిస్తున్నారు కీర్తి. -
ఇంటి నుంచే లొకేషన్‌కి...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలు భలే జోరుగా జరుగుతున్నాయి. కొన్ని చిత్రాల షూటింగ్స్ స్వదేశంలో జరుగుతుంటే మరికొన్ని చిత్రీకరణలు విదేశాల్లోనూ జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పలు సినిమా చిత్రీకరణలతో ఆయా సెట్స్‌లో సందడి నెలకొంది. లోకల్లోనే షూటింగ్ కాబట్టి ఇంటి నుంచే షూటింగ్‌కి వెళ్లి సందడి సందడిగా షూటింగ్ చేస్తున్నారు స్టార్స్. ఇలా ‘కేరాఫ్ హైదరాబాద్’ అంటూ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, మహేశ్‌బాబు, గోపీచంద్, నాని, విజయ్ దేవరకొండ, శ్రీవిష్ణు, సాయిదుర్గా తేజ్... తదితర హీరోలు తమ మూవీ షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం... ఆర్ఎఫ్సీలో... చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చిరుబాబీ 2’ (వర్కింగ్ టైటిల్). చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా ఇది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో నివేత పేతురాజ్, అనశ్వరా రాజన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట బాబీ.‘‘మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న బాబీ కొల్లి ‘మెగా 158’లో చిరంజీవిని పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారు. చిరంజీవిని ఇప్పటివరకు చూడని అత్యంత ఫెరోషియస్ లుక్‌లో ప్రజెంట్ చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఈ సినిమా కోసం 12 గంటల పాటు వర్షంలో తెరకెక్కించిన ఓ ఫైట్ చిరంజీవి కెరీర్లో అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఒకటిగా నిలవనుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీ 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. అజీజ్ నగర్లో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో వెంకటేష్–డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కల్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్నారు. వెంకటేశ్–కల్యాణ్ రామ్–అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీకి ‘వెంకీఅనిల్ 5, ఎన్‌కేఆర్‌ఏఆర్2’ అన్నది వర్కింగ్ టైటిల్. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తీ సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రోడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు హీరోయిన్లు, అలాగే చిత్రంలోని నటీనటులు పాల్గొంటుండగా కీలక సీన్స్ తీస్తున్నారట అనిల్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ గా నటించారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. కోకాపేటలో... ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘ఫౌజి’. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. సీనియర్ నటీనటులు జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ‘ఫౌజి’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి.‘‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజి’. ఈ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ లుక్‌లో ప్రభాస్ కనిపించనున్నారు. 2026లో అత్యంత భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘ఫౌజి’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ మూవీని ఈ డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. శంషాబాద్‌లో... మహేశ్ బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘వారణాసి’. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో మహేశ్ బాబుతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.ఈ సినిమా కోసం మహేశ్ బాబు ΄÷డవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాల్ని తారాస్థాయికి పెంచేసింది. ఈ విజువల్ వండర్‌ను చూడటానికి అంతర్జాతీయ స్థాయిలో సగటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘వారణాసి’ని అంతర్జాతీయ స్థాయిలో 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్ బాబు శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ సినిమా విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. ఈ సినిమా ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ హీరోయిన్గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై ఇంపార్టెంట్ సీన్స్ తీస్తున్నారట వెంకట్. జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ‘సింగ’ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఆయన లుక్‌ను రివీల్ చేసింది యూనిట్. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘సింగ’. ఫైట్ మాస్టర్‌గా సక్సెస్ అందుకున్న వెంకట్‌కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అయినప్పటికీ ఒక బలమైన స్క్రిప్ట్‌ను తయారు చేశారు. గోపీచంద్‌ను పూర్తి యాక్షన్, ఎమోషన్స్ కూడిన పాత్రలో చూపించనున్నారాయన. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ‘సింగ’ సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ముచ్చింతల్‌లో... నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో నానితో పాటు ముఖ్యమైన నటీనటులపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. పీరియాడిక్ యాక్షన్ డ్రామా, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘ది ప్యారడైజ్’లో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ ఆయన కెరీర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఆ తేదీకి విడుదల కాక పోవచ్చని, సెప్టెంబరు 24న రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. గండిపేటలో... విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ–రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. విజయ్ దేవరకొండతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. ‘‘19వ సెంచరీ నేపథ్యం కథతో రూపొందుతోన్న చిత్రం ‘రణబాలి’. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ కథ సాగుతుంది. ఈ మూవీలోని విజయ్ దేవరకొండ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. సెప్టెంబరు 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. శంకరపల్లిలో... వైవిధ్యమైన చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మరో వైవిధ్యమైన చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సామజవరగమన’ (2023) చిత్రం ఘన విజయం సాధించింది. ఆ హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు–రామ్ అబ్బరాజు కాంబోలో ద్వితీయ చిత్రం రూపొందుతోంది. ‘వెన్నెల’ కిశోర్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీ విష్ణుతో పాటు ఇతర నటీనటులపై కీలకమైన సీన్స్ తీస్తున్నారు రామ్ అబ్బరాజు. తొలి చిత్రంతో కడుపుబ్బా నవ్వించిన శ్రీ విష్ణు–రామ్ అబ్బరాజు కాంబినేషన్ రెండో సినిమాతో ఏ మేర నవ్వులు పంచనున్నారో వేచి చూడాలి. శంకరపల్లిలో... సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ (2024) వంటి విజయవంతమైన సినిమా తీసిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. ‘‘తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారు సాయి దుర్గాతేజ్. ఈ చిత్రాన్ని పవర్ఫుల్ కథనం, ఉత్కంఠ భరితమైన విజువల్స్, హై యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో గ్రాండ్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు రోహిత్. చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రోడక్షన్ పనులను ప్రారంభిస్తాం. ఈ సినిమాని డిసెంబరులో విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పైన పేర్కొన్న చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ్రపాంతాల్లో జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
అమెరికాలో కాల్పుల కలకలం..
అమెరికాలోని పశ్చిమ ఇడాహోలోని ఓ రెస్టారెంట్లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. నిందితుడు కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ట్విన్ ఫాల్స్‌లోని 'ఇన్-ఎన్-అవుట్ బర్గర్' రెస్టారెంట్ దగ్గర జరిగిన ఈ కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారని ట్విన్ ఫాల్స్ నగర ప్రతినిధి జోష్ పాల్మర్ తెలిపారు. అయితే మృతుల్లో దుండగుడు కూడా ఉన్నాడా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదన్నారు.స్థానిక మీడియా ప్రసారం చేసిన వీడియో ఫుటేజ్‌లో ఒక యువకుడు రెస్టారెంట్ వెలుపల లాంగ్ గన్‌తో కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల్లో ప్రజలు రెస్టారెంట్ నుండి బయటకు పరుగులు తీయడం కనిపించింది. ట్విన్ ఫాల్స్.. ఇడాహో దక్షిణ ప్రాంతంలో సుమారు 56,000 జనాభా కలిగిన ఒక నగరం. ఇది సాల్ట్ లేక్ సిటీకి వాయువ్యంగా సుమారు 290 కిలోమీటర్లు దూరంలో ఉంది. -
ఫుడ్ ఫెస్టివల్లో కాల్పుల కలకలం
సియాటెల్: అమెరికాలోని సియాటెల్ నగరంలో కాల్పులు కలకలం రేపాయి. ‘బైట్ ఆఫ్ సియాటెల్’పేరుతో ఏటా నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల బాలుడితోపాటు నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటూండగా ఈ ఘోరం చోటు చేసుకుందని తెలుస్తోంది. దుండగుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొకరి కోసం గాలింపు ముమ్మరమైంది. తప్పించుకున్న వ్యక్తిని వరి్ణంచే గుర్తులు ఏవీ లేవని సియాటెల్ అసిస్టెంట్ పోలీస్ చీఫ్ టైరోన్ డేవిస్ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించారని ఒకరు 19 ఏళ్ల యువకుడు కాగా, ఇంకొకరు 44 ఏళ్ల పురుషుడని వివరించారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తూండగా 56 ఏళ్ల మహిళ మరణించారని తెలిపారు. గాయపడ్డ వారి పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. సియాటెల్‌లో 1982 నుంచి ఏటా ఈ బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్‌ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు.మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్‌కు సుమారు మూడు లక్షల మంది హాజరయ్యారని అంచనా. మరికొనిన గంటల్లో ఈ ఫెస్టివల్ ముగుస్తుంది అనగా ఆదివారం సాయంత్రం సుమారు ఆరుగంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కాల్పులు చోటు చేసుకున్నాయి. సరిగ్గా ఆ క్షణంలో తాము ఒకానొక స్టాల్లో క్రేప్స్ కొనుగోలు చేశామని, కాల్పులు జరుపుతున్న వాళ్లు తనకు దగ్గరగానే ఉన్నారన్న విషయాన్ని గుర్తించి తాను వెంటనే దగ్గర్లోని సియాటెల్ చి్రల్డన్స్ మ్యూజియమ్‌లోకి పారిపోయి తలదాచుకున్నానని ఫెయిత్ ఆడియా హంటర్ అనే మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు. తనతోపాటు చాలామంది పరుగులు పెడుతూ కనిపించారని చెప్పారు. ఫుడ్ స్టాల్స్ నిర్వాహకులు కూడా కాల్పుల శబ్ధం వినిపించగానే పారిపోయారని, గంటల తరువాత కొందరు పోలీసులు ఏర్పాటు చేసిన హద్దుల వద్ద తచ్చాడుతూ కనిపించారని తెలిసింది. రొబెర్టో రమిరెజ్ అనే ఫుడ్‌స్టాల్ యజమాని మాట్లాడుతూ ‘‘అవి టపాకాయలు అనుకున్నా. ఇంతలోనే ఎవరో షూటర్ అని అరిచారు. అంతే అక్కడున్న వారందరూ తలో దిక్కుకు పరుగెత్తారు’’అని వివరించారు. కొంతమంది దాక్కుంటే.. కొంతమంది ఒకరిని ఒకరు తోసుకుంటూ కనిపించారు. కొందరు కిందపడిపోయారు. పసిపిల్లల స్ట్రోలర్స్ కూడా కింద పడిపోయాయి అని ఎస్టాన్ వాకనాబో అనే వ్యక్తి తెలిపారు. శబ్ధం వినిపించగానే అవి కాల్పులేనని తనకు అర్థమైందని, ఆ వెంటనే ప్రియురాలితో కలసి సురక్షిత ప్రాంతానికి పరుగుపెట్టానని చెప్పారు. సంఘటన స్థలాన్ని ఖాళీ చేయించిన పోలీసులు భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు. -
సెల్ఫీ తీస్తుండగా ఉగ్ర అల.. విద్యార్థిని మృతి, యువకుడు గల్లంతు
సాక్షి, చెన్నై : రీల్స్, సెల్పీల వ్యామోహంతో సముద్రంలో దిగి మరీ వీడియో చిత్రీకరించుకుంటూ వచ్చిన విద్యార్థుల బృందాన్ని భారీ అల తాకింది. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులను జాలర్లు రక్షించగా, ఒకరు గల్లంతయ్యారు. మరొకరు మరణించారు. శనివారం చెన్నై ఎన్నూర్ బీచ్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు.. చెన్నై సూరపట్టులోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న కృతిక (19), ఆకాష్ (21), పవిత్ర, తరుణ్, శివాని అనే ఐదుగురు విద్యార్థుల బృందం ఎన్నూర్ రామకృష్ణా నగర్ సముద్ర తీరానికి విహారయాత్రకు వచ్చారు. సముద్రం మధ్యలో ఉండే రాళ్లపై నిలబడి సెల్ఫీ, వీడియోలు తీసుకుంటున్న సమయంలో, ఒక్కసారిగా వచ్చిన ఉగ్ర అలల తాకిడికి వారంతా సముద్రంలో పడిపోయారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో అక్కడున్నవారు ఇద్దరు విద్యార్థులను అతికష్టంపై రక్షించారు. సముద్రంలో మునిగి పోయి కొన ఊపిరితో ఉన్న కృతికను రక్షించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలల్లో కొట్టుకుపోయిన మరో విద్యార్థి ఆకాష్ కోసం అగి్నమాపక సిబ్బంది, పోలీసులు, మత్స్యకారులు తీరం వెంబడి తీవ్రంగా గాలింపు చేపట్టారు. బతికి ఉండేందుకు ఛాన్స్ లేని దృష్ట్యా, చెన్నై తీరంలో మృతదేహం ఏదైనా ఒడ్డుకు కొట్టుకువచ్చిందా? అని ఆరా తీస్తున్నారు. కాగా, మృతి చెందిన కృత్రిక పుదుచ్చేరికి చెందిన విద్యార్థి కాగా, ఆకాశ్ చెన్నై తిరునగర్ కు చెందిన వైదీశ్వరన్ కుమారుడిగా గుర్తించారు. -
జాతీయ మహిళా షూటర్ ఆచూకీ లభ్యం
రెండు రోజుల కిందట అదృశ్యమైన పశ్చిమ బెంగాల్‌కు చెందిన జాతీయ స్థాయి షూటర్ దమయంతి సేన్ (15) సురక్షితంగా ఇంటికి చేరింది. శనివారం ఉదయం హౌరా పోలీసులు ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు.హౌరాలోని రామ్కృష్ణపూర్ ఫెర్రీ జెట్టీ సమీపంలో ఒంటరిగా తిరుగుతుండగా గమనించిన మార్నింగ్ వాకర్స్ వెంటనే దమయంతి తండ్రి ధ్రువజ్యోతి సేన్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడికి చేరుకుని, పోలీసుల సహకారంతో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లారు.గురువారం ఇంటి నుంచి ఒక పని కోసం వెళ్లిన దమయంతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు చేపట్టిన దర్యాప్తులో దమయంతి హౌరా రైల్వే స్టేషన్‌లోని 4, 5 ప్లాట్‌ఫారమ్‌ల వద్ద సంచరించినట్లు తెలిసింది. దమయంతి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, క్రీడా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.కారణాలు ఏంటి..?అయితే దమయంతి అదృశ్యానికి గల అసలు కారణాలపై పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదువుల ఒత్తిడి, షూటింగ్ శిక్షణకు సంబంధించిన ఒత్తిడి వంటి అంశాలను కూడా విచారణలో పరిశీలిస్తున్నారు. దీనిపై పోలీసులు లేదా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేదు. -
పీవోకేలో పాక్ ఆర్మీ కాల్పులు.. ఆరుగురు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రావాలాకోట్లోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో సాధారణ ప్రజలపై అక్కడి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ఇస్లామాబాద్ (పాకిస్తాన్ ప్రభుత్వం)పై స్థానికుల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత ఒక్కసారిగా పెరిగాయి. పీవోకే ప్రజలు పాక్‌కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు.వైట్‌హౌస్ ఎదుట నిరసనకాగా ఇటీవలే అమెరికాలో ఉన్న పీవోకే ప్రజలు వాషింగ్టన్లో ఉన్న వైట్ హౌస్ వెలుపల నిరసన కార్యక్రమం చేపట్టారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో పెద్దఎత్తున హింసచేలరేగుతందని పాకిస్థాన్ ఆ ప్రాంతంలో మానవహక్కులని కాల రాస్తుందని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం పీవోకేలో జరుగుతున్న మానవతా సంక్షోభంపై దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. PoK లోని పౌర నివాస ప్రాంతాల నుండి పాకిస్తాన్ సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, నిరాయుధులైన పౌరులపై ప్రాణాంతక బలగాలను ప్రయోగించడాన్ని అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంతలోనే మరోసారి ప్రాంతంలోకాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. భారత్ సహాయం చేయాలిదాదాపు 40 లక్షల మంది ప్రజలను బాహ్య ప్రపంచానికి దూరం చేస్తూ పాక్ ప్రభుత్వం అక్కడ సుదీర్ఘకాలంగా ఇంటర్నెట్ను నిలిపివేసిందని నిరసనకారులు ఆరోపించారు. స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడటానికి, మానవతా సహాయాన్ని అందించడానికి భారతదేశం జోక్యం చేసుకోవాలని వారు ఒక అసాధారణ విజ్ఞప్తి చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందేలా పూంచ్, డోడా సెక్టార్ల ద్వారా నియంత్రణ రేఖను తెరవాలని డిమాండ్ చేశారు.పేదరికంతో సతమతమవుతున్న ప్రజలుతాజా ఘర్షణల పక్కన పెడితే, అక్కడి ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు తెలిపాయి.'నేచర్'జర్నల్ 2025 నాటి అధ్యయనం ప్రకారం, ఇక్కడి జనాభాలో 66% మంది వ్యవసాయం, పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయినప్పటికీ 57% కంటే ఎక్కువ కుటుంబాలు ఆహార భద్రత లేకుండా నివసిస్తున్నాయి. దాదాపు 29% మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు (పాకిస్తాన్ జాతీయ సగటు 19.9% కంటే ఇది చాలా ఎక్కువ). పర్వత ప్రాంతాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది, అక్కడ 90% కుటుంబాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. -
క్రైమ్ కామెడీగా చోర శికామణులు.. గ్రాండ్‌గా ప్రారంభం
రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం ‘చోర శికామణులు’. ఈ సినిమాకు ఆనంద్ కుర్మా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ మీద బానూరు నాగరాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి దర్శకడు నక్కిన త్రినాథరావు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు స్క్రిప్ట్ అందించగా.. తొలి సన్నివేశానికి త్రినాథరావు గౌరవ దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని యాక్షన్, క్రైమ్, కామెడీ జానర్లో తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ ఆనంద్ కుర్మా వెల్లడించారు. జూలై 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ చిత్రంలో నరేశ్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీకి ఆనంద్ రాజావిక్రమ్ సంగీతం అందిస్తున్నారు. ఓ మంచి సాంగ్‌తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని.. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో మీ ముందుకు వస్తామని మేకర్స్ పేర్కొన్నారు. -
టొరంటోలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
టొరంటో: కెనడాలోని టొరంటోలో స్ట్రీట్ ఫెస్టివల్ జరుగుతుండగా కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్దాలతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత అక్కడ యాక్టివ్ షూటర్ ఉన్నట్లు హెచ్చరించిన పోలీసులు, ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని ప్రకటించారు. సెయింట్ క్లేర్ ఎవెన్యూ వెస్ట్, అర్లింగ్టన్ ఎవెన్యూ సమీపంలో 'సాల్సా ఆన్ సెయింట్ క్లేర్' ఉత్సవం జరుగుతుండగా ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని, మొత్తం ఆరుగురికి బుల్లెట్ గాయాలయ్యాయని టొరంటో పోలీసులు వెల్లడించారు.పరారీలో నిందితులుకాల్పులు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రజలెవరూ ఆ ప్రాంతానికి రావద్దని హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సురక్షితంగానే ఉన్నప్పటికీ, కాల్పులకు తెగబడిన నిందితుడు లేదా నిందితులు ఇంకా పట్టుబడలేదని పోలీసులు తెలిపారు. లాటినో సంస్కృతి నేపథ్యంలో జరుగుతున్న ఈ 'సాల్సా' ఉత్సవ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. Toronto, Canada | An incident of mass shooting reported at a street festival on St Clair Ave W & Arlington Ave, resulting in two deaths and injuring 6 others. The suspect is still at large. Heavy police force deployed at the scene. Public has been asked to avoid the area: Toronto… pic.twitter.com/37cPvePepe— ANI (@ANI) July 12, 2026ప్రత్యక్ష సాక్షుల కథనంఈ ఉత్సవంలో స్టాల్ నడుపుతున్న ప్యాట్సీ గుటిరెజ్ అనే మహిళ మాట్లాడుతూ.. తాను కస్టమర్లకు వస్తువులు ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా జనం భయంతో పరుగులు తీయడం చూశానని తెలిపారు. దీంతో తాము వ్యాపారాన్ని నిలిపివేశామని, ఇలాంటి ఉత్సవాల్లో హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రత్యక్ష సాక్షి వాలెరీ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. శనివారం రాత్రి తాను ఒక రెస్టారెంట్ సమీపంలో కూర్చుని ఉన్నప్పుడు జనం కేకలు వేస్తూ పరుగులు తీశారని చెప్పారు. ఏం జరుగుతుందో తెలియక, ప్రాణభయంతో అందరం నేలపై పడుకున్నామని ఆమె వివరించారు.ఈ హింసాత్మక ఘటనపై అంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘సాల్సా ఆన్ సెయింట్ క్లేర్ ఫెస్టివల్లో జరిగిన ఈ దారుణ హింస నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం బాధాకరం. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.ఘనంగా ‘సాల్సా ఆన్ సెయింట్ క్లేర్’అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. లాటినో సంస్కృతి ప్రతిబింబించేలా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో లైవ్ లాటిన్ సంగీతం, నృత్య ప్రదర్శనలు, సంప్రదాయ ఆహార స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఏడాది ఈ ఉత్సవం 22వ సారి జరుగుతోంది. టొరంటో నగర నడిబొడ్డున ఉన్న వాణిజ్య ప్రాంతంలో జరిగే ఈ వేడుకకు వేలాది మంది ప్రజలు తరలివస్తుంటారు. అలాంటి రద్దీ ప్రాంతంలో ఈ ఘోరం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తర అమెరికాలోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా టొరంటోకు పేరుంది. కెనడాలోనే అతిపెద్ద నగరమైన ఇక్కడ, ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో కాల్పులు జరగడం చాలా అరుదు. -
పన్నెండు గంటలు వర్షంలో...
చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగా స్టంట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో వర్షం నేపథ్యంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ‘‘వర్షంలో తెరకెక్కించిన ఈ ఫైట్ చిరంజీవి కెరీర్లో అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ షెడ్యూల్ చిత్రీకరించాం. మధ్యలో గంట లంచ్ బ్రేక్ తీసుకున్న చిరంజీవి మిగతా 12 గంటల పాటు వర్షంలోనే తడుస్తూ ఏకధాటిగా షూటింగ్ చేశారు’’ అని చిత్రబృందం తెలిపింది. -
ఫౌజీ షూటింగ్లో నటుడికి ప్రమాదం.. పీఏ క్లారిటీ..!
ప్రభాస్ హీరోగా వస్తోన్న పీరియాడిల్ యాక్షన్ లవ్‌స్టోరీ ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ కథలో బ్రిటిష్ సోల్జర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని తెలిసింది. ఈ మూవీలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కూడా చేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రభాస్ షూటింగ్లో ప్రముఖ నటుడు రాజేశ్ శర్మకు విషపురుగు కాటేసిందని ప్రచారం జరుగుతోంది. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారని టాక్ వినిపించింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫౌజీ నటుడు రాజేశ్ శర్మ పీఎ స్పందించారు. ఈ వార్తలన్నీ అవాస్తమని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. రాజేశ్ శర్మ పీఏ సుభాశిష్ పాండా మాట్లాడుతూ..' రాజేశ్ శర్మకి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు. ఆయనను ఎలాంటి విషపురుగు కాటేయలేదు. కేవలం ఆయనకు ఉన్న షుగర్ వల్ల కాలు కొద్దిగా వాచింది. అందుకే హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా అవుతారు. రాజేష్ శర్మకి షూటింగ్ చేస్తుండగా ఏదో అయ్యిందంటూ సోషల్ మీడియాలో, కొన్ని మీడియా ఛానల్స్‌లో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. రాజేష్ శర్మ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు నేను ఉంటా. కేవలం కొందరు తమ స్వార్థం కోసం ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు' అని అన్నారు. దయచేసి నిజా నిజాలు తెలుసుకోకుండా అసత్య వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేయవద్దని కోరిన పీఏ సుభాశిష్ పాండా కోరారు. Rajesh Sharma Asst saying all social media is fake and that he got admitted due to Diabetes and doctors have said he will be discharged tomorrow#fauji#rakeshsharma#prabhas#prabhasfans #actorrakeshsharma#actorrajeshsharmahealthupdate pic.twitter.com/cmFWtG8Dh7— SATISH @ SAKSHI (@SatishKottangi) July 8, 2026 -
నెలసరి అని సరిపెట్టద్దు
ఒకప్పుడు స్త్రీల ‘నెలసరి’ ఒక దాపరికం. సిగ్గు, భయం, ఆందోళనల మధ్య ఇంటిలో ఏదో మూలన దాగే దైన్యం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎలాంటి సందర్భంలోనైనా తమని తాము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వెండితెరపైన రాకుమార్తెల్లా మెరిసే ఈ హీరోయిన్లు షూటింగ్లలో పాల్గొనేటప్పుడు పీరియడ్స్ సమయంలో తమ సమస్య గురించి వివిధ సందర్భాలలో పంచుకున్న విషయాలు..అదేమీ నిషిద్ధ విషయం కాదునెలసరి గురించిన సంభాషణలు ఇప్పటికీ గుసగుసగా జరుగుతుంటాయి. అది ఒక నిషిద్ధ విషయంగా పరిగణిస్తారు. మహిళలుగా మనం చాలా విషయాల్లో ఎంతో ముందున్నాం. కానీ, ఇప్పటికీ నెలసరికి సంబంధించిన విషయాల్లో సిగ్గుపడుతుంటాం. పాతకాలపు భావనలు బద్దలు కొట్టడం ఈ రోజుల్లో చాలా కీలకం. మన రుతుక్రమాలు చాలా శక్తిమంతమైనవి. ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. – సమంతఎక్స్క్యూజ్ ఉండదు‘సాంగ్ అండ్ డ్యాన్స్ స్వీక్వెన్స్ టైమ్‌లో పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు’ అని అడుగుతుంటారు కొందరు. నావరకు ఫైట్‌సీన్లు ఉన్న ప్రతిసారీ పీరియడ్స్‌లోనే ఉంటాను. నా టీమ్ జోక్ చేస్తారు కూడా.. ‘మేడమ్ డేట్ వచ్చిందా, మీకు ఫైట్ సీన్ తప్పక ఉంటుంది..’ అంటారు. ఫైట్ సీన్లలో తాళ్లు పట్టుకొని పైకి ఎక్కడం, దిగడం, పరిగెత్తడం.. ఇవన్నీ ఉంటాయి. కానీ, ‘నాకు పీరియడ్స్ వచ్చింది, ఈ టైమ్‌లో చేయలేను. నన్ను ఎక్స్క్యూజ్ చేయండి’ అని అడగడానికి ఉండదు. షూట్లో కొన్నిసార్లు ΄్యాడ్స్ మార్చుకోవడానికి కూడా వీలుండదు. ఒకసారి ఫైట్ సీన్లు చేసే సమయంలో ఓవర్ బ్లీడింగ్ అయ్యింది. చెయిర్ పైన కూడా కనిపించి, చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ, అలాంటి టైమ్‌లో కూడా మేనేజ్ చేయక తప్పదు. మహిళలకు శారీరకపరంగా ప్రతినెలా ఈ సమస్య తప్పదు. ఇది మన శరీరం. మహిళలుగా మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకు తగిన జాగ్రత్తలూ తీసుకోవాలి. – వరలక్ష్మి శరత్పరిమితులు ఉండవునేను చేసిన ఫాస్ట్ బీట్ సాంగ్స్ అన్నీ ప్రశంసలు అందుకున్నాయి. నేను నెలసరిలో ఉన్నప్పుడు కూడా షూటింగ్లో పాల్గొన్నా. పీరియడ్ టైమ్‌లో కూడా మాకు ఎక్స్క్యూజ్ ఉండదు. అంతే జోష్‌తో సాంగ్స్ షూట్లో పాల్గొనాలి. మిగతావారితో సమానంగా డ్యాన్స్ చేయాలి. స్త్రీలకు శారీరకంగా కొన్ని పరిమితులు ఉంటాయి. అవి మానసికంగానూ ప్రభావం చూపేవీ ఉంటాయి. అయినా వర్క్ విషయంలో వేటికీ పరిమితులు ఉండవు. శారీరక అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్లాల్సిందే. – శ్రీ లీలపీరియడ్స్ పురుషులకు ఉంటే...మగవాళ్లు కూడా ఒక్కసారన్నా నెలసరిని అనుభవించి, ఆ నొప్పిని, ఆ వేదనను తెలసుకోవాలని నేను కోరుకుంటున్నాను. హార్మోన్ల అసమతుల్యత కారణంగా మనకు అర్థం కాని భావోద్వేగాలను అనుభవిస్తాం. ఆ పెయిన్, ఆ ట్రామా, హార్మోనల్ ఇన్ బ్యాలన్స్, ఆ ఒత్తిడిని ఎంత వివరించినా వారికి ఆ ఫీలింగ్స్ అర్థం కావు. కాబట్టి మగవారికి ఒక్కసారైనా నెలసరి వస్తే, నెలసరి నొప్పి ఎలా ఉంటుందో భరిస్తే.. అర్ధం అవుతుంది. నాకు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. చాలాసార్లు అబ్డామినల్ స్కాన్, బ్లడ్ టెస్టులు చేయించాల్సి వచ్చింది. చాలా మంది డాక్టర్లను కలిశాను. కానీ, ఎలాంటి ఉపయోగమూ లేదు. ప్రతి నెలా దేవుడు నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నాడు .. నేనేం చేశానా అని ఫీలవుతుంటాను కూడా. ఈ బాధ అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకి కూడా ఒక్కసారి పీరియడ్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది. – రష్మికా మందన్నాపోరాటం తప్పదునెలసరి సమయంలో చాలా నొప్పితో బాధపడుతుంటాను. అలాంటి సమయంలో నటిగా డ్యాన్స్, స్టంట్స్ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అప్పటికే అలసిన శరీరంతో పోరాడుతుంటాం. ఇక వర్క్ విషయంలో మరింత శక్తిని ధారపోయక తప్పదు. ఆ సమయంలో కొందరు విశ్రాంతి తీసుకుంటారు. కానీ, మాలో చాలా మందికి నెలసరి విశ్రాంతి ఉండదు. సాకుగా కూడా చెప్పలేం. – శృతీ హాసన్ నిర్వహణ: నిర్మలారెడ్డి -
మా దుస్తులపై కూడా వాళ్లదే నిర్ణయం..: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఆదిపురుష్ భామ కృతి సనన్ ఈ ఏడాది ప్రారంభంలో కాక్టెయిల్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీలో షాహిద్ కపూర్ సరసన మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కృతి సనన్.. సినీ ఇండస్ట్రీలో పురుషాధిక్యతపై మాట్లాడింది. ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేసింది.సినీ పరిశ్రమలో లింగ వివక్ష దశాబ్దాలుగా కొనసాగుతుందని కృతి సనన్ అన్నారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉంటే స్టార్డమ్ చాలా ప్రత్యేకమన్నారు. హీరోయిన్ల విషయానికి వస్తే ఎలాంటి గుర్తింపు ఉండదని తెలిపారు. సెట్లో పురుషులకు అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. తెరపై రాసే పాత్రల విషయంతో పాటు సెట్లో పురుష, మహిళా నటీనటులను వేర్వేరుగా చూసే విధానంలో కూడా సినీ పరిశ్రమ పురుషులకే అనుకూలంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటివీ ఎక్కువగా చూశానని తెలిపారు. ఒక మహిళా నటి ఎక్కువ ప్రశ్నలు అడిగినప్పుడు సెట్లో వ్యతిరేకత పెరిగిపోతుందని కృతి సనన్ పంచుకుంది. కృతి సనన్ మాట్లాడుతూ..' సెట్లో దర్శకుడిని ప్రశ్నలు అడగడం నాకు అలవాటు. నాకు ఆసక్తి ఎక్కువ. ఎప్పటినుంచో అంతే. అలానే నేను ఎదిగాను. నేను నటనలో ఎప్పుడూ శిక్షణ తీసుకోలేదు. ఏమీ తెలియనట్టు ఉండటం కన్నా ప్రశ్నలు అడగడమే మేలు అనుకుంటా. నేను ఏదైనా సలహా ఇస్తే.. నువ్వు దీన్ని అనవసరంగా విశ్లేషిస్తున్నావ్ అంటారు. సెట్స్‌పై ఉండే మేనేజ్మెంట్కు హీరోల టైమింగ్స్ అంటే ఒక రకమైన భయం, గౌరవం. అందుకే వాళ్లను షాట్ పెట్టాక పిలుస్తారు. కానీ హీరోయిన్లను మాత్రం ముందే పిలిచి సెట్స్‌లో కూర్చోబెడతారని' ఆమె తెలిపింది.కృతి సనన్ ఇంకా మాట్లాడుతూ.. 'చాలాసార్లు హీరోయిన్లకు దక్కాల్సిన ఆత్మగౌరవం, సమానత్వం దక్కదు. చెప్పింది చెయ్ అంటూ అవమానిస్తారు. ఇక హీరోయిన్లు ఏ ఏ ప్రమోషన్లలో పాల్గొనాలి.. ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారు. చివరకు మేం వేసుకునే దుస్తులు కూడా వాళ్లే చెబుతారు. అందుకే హీరోయిన్లకు ప్రాధాన్యత లేని పాత్రలు చేయడానికి తాను ఇష్టపడట్లేదని' చెప్పుకొచ్చింది. -
ఫిలిప్పీన్స్ స్కూల్లో కాల్పులు.. ముగ్గురు మృతి
మనీలా: ఫిలిప్పీన్స్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఒక పాఠశాల లోపల దుండగులు జరిపిన విచక్షణారహిత కాల్పులు కలకలం రేపాయి. నిత్యం విద్యార్థుల సందడితో ఉండే క్లాస్‌రూమ్‌ల మధ్యే బుల్లెట్ల వర్షం కురవడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘాతుకంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది.పాఠశాల ఆవరణలోకి చొరబడి..స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని టాక్లోబన్ సిటీ పరిధిలో గల ‘బారంగే సాన్ జోస్’ లోని ఒక పాఠశాలలో సోమవారం ఉదయం దాదాపు 9 గంటల సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. పాఠశాల ఆవరణలోకి చొరబడిన దుండగులు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో మొత్తం ఎనిమిది మందికి బుల్లెట్లు దూసుకెళ్లాయి. సమాచారం అందిన వెంటనే టాక్లోబన్ సిటీ పోలీస్ స్టేషన్-1 అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.ఒకరి అరెస్ట్.. మరొకరి కోసం వేటఈ ఘటన అనంతరం పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని మైనర్‌గా గుర్తించారు. ఈ దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న రెండో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితులిద్దరూ స్థానిక బారంగే సాన్ జోస్ ప్రాంతానికి చెందినవారేనని ప్రాథమిక సమాచారం.ఆస్పత్రిలో క్షతగాత్రులు.. దర్యాప్తు ముమ్మరంఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాతే పేర్లను ప్రకటిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘాతుకానికి గల కారణాలు, వారి లక్ష్యం ఏమిటనే దానిపై టాక్లోబన్ సిటీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: కోడింగ్ టు ప్రిస్క్రిప్షన్: సత్తా చాటిన ‘ఆకృతి @ 32’ -
జస్పాల్ రాణా మృతి వెనుక అసలు కారణమిదే!
భారత దిగ్గజ షూటర్, కోచ్ జస్పాల్ రాణా శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం గుండెపోటుకు గురైన జస్పాల్ రాణా న్యూఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కాగా గురువారం రాత్రి వరకు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడం, మరునాడే ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు విడవడం పలు అనుమానాలకు తావిచ్చింది. మరి జస్పాల్ రాణా ఆకస్మిక మృతి వెనుక కారణం ఏమై ఉంటుందనేది కార్డియాక్ సైన్సెస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ బల్బీర్‌సింగ్ వివరించారు. 'జస్పాల్ రాణా మూడు రోజుల క్రితం తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రిలో జాయినయ్యారు. అయితే విమాన ప్రయాణంలో ఉండగానే ఛాతిలో నొప్పి వచ్చింది. అత్యంత విషమ పరిస్థితిలో ఆయన ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే జస్పాల్ గుండెలో రక్త ప్రసరణ జరిగే ధమని పూర్తిగా మూసుకుపోయింది. దీనివల్ల అతడి గుండె పంపింగ్ సామర్థ్యం పూర్తిగా బలహీనపడిపోయింది. ఆయన కోలుకున్నట్లే కనిపించినప్పటికీ ధమని మూసుకుకపోవడం వల్ల హార్ట్ ఫెయిలయ్యింది. గుండెపోటు తర్వాత కూడా కొంతమందికి మైల్డ్, మరికొంతమందికి తీవ్రమైన హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశముంటుంది. అయితే జస్పాల్ రాణా గుండె పరిస్థితి మొదట సాధారణ స్థితికి రావడంతో ఆయన కోలుకున్నట్లే కనిపించారు. డాక్టర్లు కూడా శుక్రవారం ఆయన్ను పరీక్షించి డిశ్చార్జ్ చేయాలని భావించారు. కానీ దురదృష్టవశాత్తూ శుక్రవారం ఉదయం నిద్రలో ఉండగానే మరోసారి గుండెపోటు రావడంతో జస్పాల్ మరణించారు.' అని చెప్పుకొచ్చారు.జస్పాల్ రాణా కేవలం కోచ్‌గానే కాకుండా, స్టార్ పిస్టల్ షూటర్‌గా ఎన్నో పతకాలను కొల్లగొట్టి దేశాన్ని గర్వపడేలా చేశాడు. 1990ల కాలంలో భారత షూటింగ్లో ఆయన తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి పతకాలు అందించారు. ముఖ్యంగా 2006 దోహా ఆసియా క్రీడల్లో ప్రపంచ రికార్డును సమం చేస్తూ గోల్డ్ మెడల్ సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకంగా 9 స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం 15 పతకాలను కొల్లగొట్టారు. దీంతో ఆయనకు చిన్న వయస్సులోనే అర్జున అవార్డు దక్కింది. షూటింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక, దేశంలో అత్యుత్తమ షూటర్లను తయారుచేసే పనిలో జస్పాల్ నిమగ్నమయ్యారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను భాకర్‌కు ఈయనే వ్యక్తిగత కోచ్. సౌరభ్ చౌదరి, అనీష్ భాన్వాలా వంటి అద్భుతమైన షూటర్లను తీర్చిదిద్దినందుకు గానూ 2020లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 'ద్రోణాచార్య' అవార్డుతో సత్కరించింది. జస్పాల్ ప్రస్తుతం భారత పిస్టల్ షూటింగ్ విభాగానికి హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఉన్నారు.చదవండి: అతడిని విస్మరించొద్దు.. సెలెక్టర్లకు మాజీ క్రికెటర్ హెచ్చరిక! -
సింగ్ గీతం.. 94 ఏళ్ల వయసులో అదే డెడికేషన్..!
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిచిన తాజా చిత్రం సింగ్ గీతం. ఆయన ఇంటి పేరుతోనే వచ్చిన ఈ మూవీకి 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించారు. ఈ వయసులో సినిమాకు దర్శకత్వం వహించడం అంటే మాటలు. దాదాపు 90 ఏళ్లు పైబడిన వ్యక్తి సెట్‌కు వచ్చి తెరకెక్కించడం సవాల్‌తో కూడుకున్న పనే. అయినా కూడా ఆయన పట్టుదలతో ఈ మూవీని రూపొందించారు. ఈ వయసులో కూడా కథ చెప్పడం పట్ల ఆయనకున్న అభిరుచి, నిబద్ధతతో ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవలం 77 రోజుల్లోనే పూర్తి చేయడం మరో విశేషం. ఈ విషయాన్ని మూవీ టీమ్ సన్నిహితులు వెల్లడించారు.ఈ మూవీ కోసం సింగీతం శ్రీనివాసరావు పనిచేసిన తీరును కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పంచుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు ఎలా దర్శకత్వం వహించారో వివరించారు. ఈ మూవీ కోసం ఎన్నో సర్దుబాట్లు అవసరమయ్యాయని అన్నారు. చెన్నైలో షూటింగ్ బాగానే జరిగిందని.. కానీ హైదరాబాద్‌లో మాత్రం కష్టంగా అనిపించిందని చెప్పారు. ఆయన ప్రయాణించలేని సమయంలో ఇంట్లోనే ఒక వర్చువల్ మానిటర్‌ను ఏర్పాటు చేశారు. సింగీతం హెడ్సెట్ ద్వారా నటీనటులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు. దూరం నుంచే షూటింగ్‌ను పర్యవేక్షించారు.అయినప్పటికీ ఆయన ఎక్కువ భాగం ఆయన భౌతికంగా సెట్లోనే ఉన్నారని తెలిపారు. ఈ మూవీ చివరి రెండు నెలల్లో దర్శకుడికి దగ్గు రావడం.. అది తీవ్రమై ఇన్ఫెక్షన్గా మారిందని నాగ్ అశ్విన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కొంచెం బరువు తగ్గారని.. కానీ అదేమీ ఆయన ఉత్సాహాన్ని తగ్గించలేదన్నారు. సింగీతం అభిరుచి ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రంలో అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
టాక్సిక్ వంద రోజుల రీ షూట్.. నిర్మాణ సంస్థ క్లారిటీ
కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో నటించిన యాక్షన్ మూవీ టాక్సిక్..ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. జూన్ 4న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో అదే తేదీన రామ్ చరణ్ పెద్ది థియేటర్లలోకి వచ్చేసింది.అయితే తాజాగా ఈ మూవీపై కొన్ని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌పై హీరో యశ్ తీవ్ర అసంతప్తిగా ఉన్నారని టాక్. అందుకే దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద రోజుల షూటింగ్‌ను రీ షూట్ చేయాలని అడిగారని ఓ వార్త వైరలవుతోంది. రిలీజ్ తేదీ వాయిదా పడడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది.ఈ నేపథ్యంలోనే టాక్సిక్ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ స్పందించింది. రీ షూట్ అంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ఈ చిత్రానికి ఎలాంటి రీషూట్లు షెడ్యూల్ చేయలేదని నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా.. మొదట 'టాక్సిక్' మూవీని మార్చి 19న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కుదరలేదు.. ఆ తర్వాత జూన్ 4వ తేదీని అనౌన్స్ చేసినప్పటికీ మళ్లీ వాయిదా వేశారు. ఇప్పటి వరకు చిత్ర నిర్మాతలు ఇంకా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు.'కేజీఎఫ్-2' తర్వాత యశ్ నటిస్తోన్న చిత్రం ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు. -
అమెరికాలో కాల్పుల కలకలం: వేడుకల్లో బుల్లెట్ల వర్షం!
ఓహియో: అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో కలకలం చెలరేగింది. టోలెడో నగరంలోని ఒక ప్రాంతంలో వేడుకలు జరుగుతుండగా, గుర్తుతెలియని ఆగంతకుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఉత్సాహంగా సాగుతున్న వేడుకల్లో ఒక్కసారిగా వినిపించిన తుపాకీ శబ్దాలు..అక్కడి వాతావరణాన్ని ఆందోళనకరంగా మార్చివేశాయి. జనం ప్రాణభయంతో అటూఇటూ పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.పండుగ వేళ బుల్లెట్ల వర్షంఓహియోలో ‘ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్’ జరుగుతుండగా కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులకు రక్తపు మడుగులో పలువురు క్షతగాత్రులు కనిపించారు. ఈ ఘటనపై నగర కౌన్సిల్ సభ్యురాలు థెరిసా మోరిస్ స్పందిస్తూ.. ఈ కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది గాయపడ్డారని, రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ఇలాంటి దారుణం జరగడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా నౌకాదళంలో పనిచేసిన కెవిన్ బెర్రీ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం, కాల్పుల అనంతరం ఎవరో గన్ను కింద పడేసి వెళ్లడం తాను చూశానని, అర్బోరేటమ్ ప్రాంతంలో ఐదుగురు గాయపడి పడి ఉండటాన్ని గమనించానని పేర్కొన్నారు.నిందితుడి కోసం ముమ్మర గాలింపుఈ హింసాత్మక ఘటనకు పాల్పడిన నిందితుని కోసం టోలెడో పోలీస్ డిపార్ట్మెంట్ ముమ్మరంగా గాలిస్తోంది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోలీసులు స్పందిస్తూ.. డెలావేర్ అవెన్యూ, రాబిన్‌వుడ్ అవెన్యూ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు, దర్యాప్తుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు స్థానికులు, సందర్శకులు ఎవరూ ఆ ప్రాంతానికి రావద్దని హెచ్చరించారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై ఆధారాలు సేకరిస్తున్నారు.‘బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ఈ ఉదంతంపై ఓహియో గవర్నర్ మైక్ డివైన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేసవి ఉత్సవాలు అనేవి సంతోషంగా గడపడానికి ఉద్దేశించినవని, ఇలాంటి చోట్ల హింస చోటుచేసుకోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కాల్పుల శబ్దాలు వినగానే జనం ప్రాణాలు కాపాడుకోవడానికి చెల్లాచెదురుగా పరుగులు తీయడం కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ‘వాస్తవంలో బతకండి మిస్టర్ ట్రంప్’.. నీళ్లు చల్లిన టెహ్రాన్! -
విజయ్ దేవరకొండ రణబాలి.. గండికోటలో గుర్రపు స్వారీ..!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ రణబాలి. ఈ మూవీని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ కథ బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే కర్నూల్, నంద్యాల జిల్లాలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ జరిగింది.ప్రస్తుతం రణబాలి షూటింగ్ కడప జిల్లాలోని గండకోటలో జరుగుతోంది. రాయలసీమ కథకు తగినట్లుగా యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా కోట ముఖద్వారం వద్ద, ధాన్యాగారంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ చేసే యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Grand Canyon of India Gandikota Maa Rayalaseema Ela anipinchindi anna @TheDeverakonda ❤️#VijayDevaraKonda #Ranabali https://t.co/NVMZTfLF9a pic.twitter.com/ALGkWAr9Fb— Narasimha NTR 🦚 (@NarasimhaNTR_) June 2, 2026 -
అమెరికాలో కాల్పులు.. ఏడుగురి మృతి
అయోవా: అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. కుటుంబంలోని వివాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో నిందితుడుతో సహా ఏడుగురు మృతి చెందారు. అయోవాలోని మస్కటీన్ ప్రాంతంలో ఘటన జరిగింది. మస్కటీన్ నగరంలోని రెండు నివాస గృహాలు, ఒక వ్యాపార సముదాయంలో ఈ వరుస హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం సుమారు 12:12 గంట సమయంలో పార్క్ ఎవెన్యూలోని ఒక ఇంట్లో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకునేసరికి.. ఆ ఇంటో నలుగురు వ్యక్తులు బుల్లెట్ గాయాలతో పడి ఉన్నారు. వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడిని మస్కటీన్‌కు చెందిన 52 ఏళ్ల రయాన్ విల్లిస్ మెక్ఫార్లాండ్గా గుర్తించారు. అయితే పోలీసులు వచ్చేసరికే అతడు అక్కడ నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటికే నిందితుడిని బ్రిడ్జి సమీపంలో గుర్తించారు. అప్పటికే అతడు తుపాకీతో తనను తాను కాల్చుకుని తీవ్ర గాయాలతో ఉన్నాడు. పోలీసులు, పారామెడికల్ సిబ్బంది అతడికి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతడు అక్కడికక్కడే మరణించాడు.ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు నిర్థారించారు. మరణించిన వారంతా నిందితుడి కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. అయితే, మృతుల పేర్లను అధికారులు ఇంకా వెల్లడించలేదు. మీడియా నివేదికల ప్రకారం.. నిందితుడికి గతంలో క్రిమినల్ రికార్డు ఉన్నట్లు తెలుస్తోంది. -
దర్శకధీరుడికి షాక్.. వారణాసికి తప్పని లీక్‌ల బెడద
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకే భారీ ఈవెంట్ నిర్వహించారు. అప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అదే సమయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి లీక్‌ల బెడద తప్పడం లేదు. ఒడిశాలో జరిగిన తొలి షెడ్యూల్ చిత్రీకరణ టైమ్‌లో కొన్ని సీన్స్ నెట్టింట వైరలయ్యాయి. తాజాగా కీలకమైన ఉగ్రభట్టి గుహ సన్నివేశానికి సంబంధించిన భారీ సెట్ స్టిల్స్ ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. దీంతో మన దర్శకధీరుడిని సైతం లీక్‌ల కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఫోటోలు లీక్ కావడంపై మేకర్స్ నిరాశకు గురయ్యారు. ఇకనుంచి భద్రతను కట్టుదిట్ట చేసేలా చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. #Varanasi On Sets Is Just Another Level 💥💥💥 pic.twitter.com/va9BkiAF4c— Freak4Flims (@Freak4Flims) May 28, 2026 -
‘స్కూల్ గ్యాంగ్ వార్’.. విద్యార్థి తలలోకి దిగిన బుల్లెట్!
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది. ఒక ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి, తన స్నేహితురాలితో కలిసి ఆహారం తింటుండగా, గుర్తుతెలియని వ్యక్తులు అతడి తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాలుడి మెదడులోకి ఒక బుల్లెట్ దూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు.చిన్నపాటి ఘర్షణతో మొదలై..ఆహారం తీసుకుంటున్న విద్యార్థిని పక్కనే ఉన్న మరో బృందం ఉద్దేశపూర్వకంగా తాకడంతో వివాదం మొదలైంది. కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత ఆ బృందం అక్కడి నుండి వెళ్లిపోయింది. అనంతరం తిరిగి వచ్చి తుపాకీతో కాల్పులు జరపడంతో కలకలం చెలరేగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు అత్యంత సమీపం నుండి కాల్పులు జరిపి, అక్కడి నుండి పరారయ్యారు.చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలింపుకాల్పుల అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధితుడిని వెంటనే మూల్‌చంద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు మృత్యువుతో పోరాడుతున్నాడని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న నిందితులు కూడా విద్యార్థులేనని, ప్రేమ వ్యవహారమే ఈ ఘర్షణకు అసలు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.పోలీసుల గాలింపు ముమ్మరంఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, ఎస్హెచ్ఓ, ఏసీపీ బృందాలు ఆధారాల కోసం గాలింపు చేపట్టాయి. ఘటనా స్థలంలోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులు పరారీలో ఉండటంతో, వారి కోసం నగరం అంతటా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఐసోలేషన్‌కు మహిళ తరలింపు -
‘వైట్‌హౌస్’ఘటన అప్డేట్: ఎవరీ నాసిరే బెస్ట్?
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ సమీపంలో శనివారం సాయంత్రం విచక్షణారహితంగా కాల్పులు జరిపి తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాడు 21 ఏళ్ల నాసిరే బెస్ట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనం లోపల ఉన్న సమయంలోనే, సెక్రెట్ సర్వీస్ చెక్‌పోస్ట్ వద్దకు వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడి వివరాలు బయటకు వచ్చాయి. దర్యాప్తు సంస్థలు సేకరించిన వివరాల ప్రకారం అతని ప్రొఫైల్ ఇలా ఉంది..నిందితుడి వివరాలుచిరునామా: నాసిరే బెస్ట్ అమెరికాలోని మేరీల్యాండ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అతని వయసు 21 సంవత్సరాలు.మానసిక స్థితి: ఇతను గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు విచారణలో తేలింది.నేర చరిత్ర: వైట్‌హౌస్ భద్రతా వలయాన్ని దాటేందుకు ఇతడు ప్రయత్నించడం ఇది మొదటిసారేం కాదు. గతంలో కూడా పలుమార్లు వైట్‌హౌస్ పరిసరాల్లోకి చొరబడేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు.గతంలో అరెస్టులు: ఏడాది క్రితం, అంటే 2025 జూన్, జూలై నెలల్లోనే ఇతను ఇటువంటి చొరబాటు కేసుల్లో అరెస్టయ్యాడు.కోర్టు నిషేధాజ్ఞలు: ఇతని మానసిక స్థితి, ప్రవర్తనను గమనించిన కోర్టు.. గతంలోనే ఇతనిపై ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. వైట్‌హౌస్ పరిసర ప్రాంతాల్లోకి అస్సలు రావద్దంటూ బెస్ట్‌పై గతంలోనే కోర్టు నిషేధాజ్ఞలు విధించింది.శనివారం సాయంత్రం ఏం జరిగింది?కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ శనివారం సాయంత్రం వైట్‌హౌస్ సమీపంలోని 17వ వీధి, పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద ఉన్న సెక్రెట్ సర్వీస్ చెక్‌పోస్ట్ వద్దకు నాసిరే బెస్ట్ చేరుకున్నాడు. అందరూ చూస్తుండగానే తన బ్యాగులో నుంచి తుపాకీ తీసి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు.సెక్రెట్ సర్వీస్ అధికారులు తక్షణమే స్పందించి ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు నాసిరే బెస్ట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కాల్పుల్లో ఒక సాధారణ పౌరుడు (బైస్టాండర్) కూడా గాయపడగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం ఎఫ్‌బీఐ , ఫెడరల్ దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నాయి. ఇది కూడా చదవండి: వైట్‌హౌస్: అటు కాల్పులు.. ఇటు లైవ్ రిపోర్టింగ్ -
ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)
-
నాని ది ప్యారడైజ్‌పై రూమర్స్.. మేకర్స్ రియాక్షన్..!
దసరా బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్, ఆయా షేర్ పాట ఫ్యాన్స్‌ను అలరించాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. సుబ్బలక్ష్మి పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఈ మూవీలో జడల్ పాత్రలో హీరో నాని అలరించనున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ చిత్రంపై ఇటీవల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌కు హీరో నాని రీ షూట్ కోరాడని సోషల్ మీడియాలో వైరలైంది. కొన్ని సన్నివేశాలతో నాని పూర్తిగా సంతృప్తి చెందలేదని.. అందుకే దర్శకుడు ఓదెలను రీ షూట్ చేయాలని కోరినట్లు పెద్దఎత్తున టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్ మేకర్స్ స్పందించారు.రీ షూట్ వార్తలపై టీమ్ క్లారిటీ..ది ప్యారడైజ్ మూవీని ఎలాంటి రీ షూట్ చేయడం లేదని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా మా సినిమాకు సంబంధించి నిరాధారమైన, బాధ్యతారహితమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయని అన్నారు. అంతా మేము అనుకున్న విధంగానే ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన షెడ్యూల్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రణాళిక ప్రకారం జరుగుతోందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.దయచేసి సోషల్ మీడియాలో వచ్చే రీ షూట్ లాంటి వార్తలు ఎవరు నమ్మవద్దని మూవీ టీమ్ కోరింది. మా అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని.. ఏదైనా ఉంటే మేమే నేరుగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అవాస్తవ కథనాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో విలన్ శికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 21న థియేటర్లలో సందడి చేయనుంది.Over the past few days, we’ve noticed several baseless rumors and irresponsible speculations being circulated about #TheParadise.For clarity:• #TheParadise was planned with absolute clarity from day one, and the film is progressing exactly as intended. Over 100 shooting days… https://t.co/kjP8VpgV9x— THE PARADISE (@TheParadiseOffl) May 12, 2026 -
పెద్ది సెట్స్‌లో మెగాస్టార్ సందడి.. వీడియో వైరల్
రామ్ చరణ్ మూవీ పెద్ది షూటింగ్ సెట్లో మెగాస్టార్ సందడి చేశారు. షూటింగ్ సెట్‌కు వెళ్లిన దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్‌తో ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ది బాస్, మై గురు పెద్ది సెట్స్‌లో అడుగుపెట్టారని.. ఇది నా జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకమంటూ పోస్ట్ చేశారు. పెద్దిని ఆదర్శంగా తీసుకుని నా కండలు పెంచానని ఫన్నీగా రాసుకొచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.The BOSS and my GURU on sets of #Peddi...It's one of the best memories ❤️And yes...I've built a bit of muscle with my Peddi's inspiration 💪🏻😅@KChiruTweets Sir @AlwaysRamCharan Sir ❤️❤️❤️🤗🤗🤗 pic.twitter.com/gvgcNmkffZ— BuchiBabuSana (@BuchiBabuSana) May 8, 2026 -
ఇది అమెరికా రాజ్యాంగంపై దాడి: ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అత్యంత పటిష్ట భద్రత నడుమ జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్లో ఒక్కసారిగా తుపాకీ మోతలు దద్దరిల్లాయి. వందలాది మంది ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు హాజరైన ఈ ప్రతిష్టాత్మక విందులో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటం తీవ్ర కలకలం రేపింది. ఈ అనూహ్య ఘటన నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా ప్రముఖులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్ హౌస్‌లో ప్రసంగించారు. ఇది అమెరికా రాజ్యాంగంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదిక వెలుపల చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై డోనాల్డ్ ట్రంప్, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ కీలక వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద అనేక ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొనగా, ఘటనా స్థలంలో ఒక లాంగ్ గన్, తుపాకీ షెల్స్ లభ్యమైనట్లు కాష్ పటేల్ ధృవీకరించారు. అయితే, నిందితుడి వద్ద ఉన్న ఆయుధాల గురించి మరిన్ని ఇతర వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవన్నారు.ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ తాను ఎంతో పదునైన ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నానని, కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల తదుపరి కార్యక్రమంలో తన ప్రసంగం చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. తాను ప్రసంగించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నానని, కానీ భద్రతా కారణాల దృష్ట్యా వచ్చేసారి చాలా సాదాసీదాగా వ్యవహరిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ, భవిష్యత్తులో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ వేదికపైనే ఉండాలని తాను గట్టిగా ప్రయత్నించానని, కానీ భద్రతా బలగాల సూచన మేరకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ట్రంప్ వివరించారు. ఈ కాల్పుల ఘటన ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది అత్యంత వేగంగా స్పందించిన తీరును అభినందించిన ట్రంప్.. ‘సీక్రెట్ సర్వీస్ అద్భుతంగా స్పందించింది... ఒక వ్యక్తి అనేక ఆయుధాలతో భద్రతా తనిఖీ కేంద్రం వైపు దూసుకువచ్చాడు.. అతడిని సీక్రెట్ సర్వీస్‌కు చెందిన కొందరు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో పారదర్శకత, స్పష్టత కోసం, నేను విడుదల చేయమని ఆదేశించిన ఒక టేప్‌ను ఇప్పుడే అధికారులు విడుదల చేశారు... మన రాజ్యాంగంపై దాడి చేసిన ఈ దుండగుడి హింసాకాండను, అలాగే మన దేశం తరపున సీక్రెట్ సర్వీస్, చట్ట అమలు సంస్థలు ఎంత వేగంగా స్పందించాయో ఆ టేప్ తెలియజేస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు. ఎవరూ మన సమాజాన్ని హస్తగతం చేసుకోవడానికి వీల్లేదని, ఇలాంటి ఘటనల వల్ల కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. -
స్కూల్లో కాల్పులు.. 9 మంది మృతి
దక్షిణ మధ్య తుర్కియేలోని ఓ పాఠశాలలో ఒక విద్యార్థి కాల్పుల కలకలం సృష్టించాడు. దీంతో తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందగా, 13 మందికి గాయాలయ్యాయి. బుధవారం కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిల్పులు జరిపినట్లు గవర్నర్ ముకెర్రెం ఉన్న్లుయెర్ తెలిపారు. కాల్పులు చేసిన విద్యార్థి కూడా మృతి చెందాడు.“తొమ్మిది మంది మృతి చెందడం విచారకరం… 13 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు, అందులో ముగ్గురి మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది” అని అంతర్గత మంత్రి ముస్తఫా చిఫ్ట్చి తెలిపారు.కాల్పులు జరిపిన విద్యార్థి తన తండ్రికి చెందిన తుపాకులను ఉపయోగించినట్లు భావిస్తున్నామని ఉన్న్లుయెర్ తెలిపారు. అతని తండ్రి మాజీ పోలీసు అధికారి. ఆ విద్యార్థి ఆయుధాలను బ్యాక్‌ప్యాక్‌లో దాచుకుని, రెండు తరగతి గదుల్లోకి వెళ్లి కాల్పులు జరిపినట్లు తెలిపారు.తుర్కియేలో రెండు రోజుల వ్యవధిలో రెండు పాఠశాలల్లో కాల్పులు జరగడం గమనార్హం. మంగళవారం దక్షిణ-తూర్పు సాన్లియుర్ఫా ప్రావిన్స్‌లోని ఒక పాఠశాలలో కాల్పులు జరిగాయి. ఓ మాజీ విద్యార్థి కాల్పులు జరిపి 16 మందిని గాయపర్చి, ఆత్మహత్య చేసుకున్నాడు. -
న్యూజెర్సీలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి
న్యూజెర్సీ: అమెరికాలో మరోసారి తుపాకీల మోత మోగింది. న్యూజెర్సీలోని ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ‘చికెన్-ఫిల్-ఏ’లో జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం రాత్రి 8:40 గంటల సమయంలో ఈ రెస్టారెంట్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం, ఈ రెస్టారెంట్ లో ఘటన జరిగిన సమయంలో పలువురు వినియోగదారులు ఉన్నారు. కాల్పులు జరిగిన వెంటనే భయాందోళనలు చెలరేగాయి. కొందరు ప్రాణాల కోసం పరుగులు తీశారు. ఘటనా స్థలానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. కాల్పుల్లో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు మరణించగా, మిగిలిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై యూనియన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం విచారణ చేపట్టింది. కాల్పులు జరిపిన నిందితుడి వివరాలను, ఈ దారుణానికి కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ సంఘటన అమెరికాలో మరోసారి తుపాకీల చట్టాలపై చర్చకు దారితీసింది. -
సాయుధుల దాడిలో 70 మంది మృతి
జుబా: దక్షిణ సూడాన్‌లో బంగారు గని విషయమై తలెత్తిన వివాదం 70కి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. సెంట్రల్ ఈక్విటోరియా ప్రావిన్స్‌లోని దేశ రాజధాని జుబా నగర శివారులోని బంగారు గని వద్ద శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. జెబెల్ ఇరాక్‌లోని బంగారు గనిలో తవ్వకాలపై మైనింగ్ కంపెనీలు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి గుర్తు తెలియని సాయుధులు గని వద్ద ఉన్న వారిపై మూకుమ్మడిగా కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 70 మందికి పైగా చనిపోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రాంతం ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉందని, ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని ప్రతిపక్ష సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మి(ఎస్‌పీఎల్‌ఎం) ఆరోపించింది. -
పోలీసులపై బాలుడి హత్య కేసు నిందితుడి దాడి
తాడిపత్రి టౌన్: ఆస్తి కోసం బామ్మర్దిని హత్య చేసిన వ్యక్తిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పోలీసులపై ఒక్కసారిగా దాడి చేశాడు. ఘటనా స్థలంలో ఉన్న బీరు సీసాతో కానిస్టేబుల్, సీఐపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో నిందితునిపై సీఐ ఆరు రౌండ్లు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోనుప్పలపాడులో బుధవారం గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతుల కుమారుడు వేమచంద్ర (7)ను కిడ్నాప్ చేసి చంపేసిన విషయం తెలిసిందే. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా వేమచంద్ర పెద్ద అక్క భర్త (బావ) సర్వేష్ ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. హత్య జరిగిన తీరును తెలుసుకునేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ ఎలా హత్య చేశాడో పోలీసులకు వివరిస్తూ ముందుకు వెళ్లిన సర్వేష్... సమీపంలో దొరికిన బీరు బాటిల్‌తో కానిస్టేబుల్ వెంకటేష్ పై దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీఐ రామసుబ్బయ్యపైనా దాడికి తెగబడ్డాడు. వెంటనే సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు. నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, అతని కాళ్లపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం నిందితుడిని, గాయపడిన పోలీసులను తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. సర్వేష్ ను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. తాడిపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్, సీఐలను ఎస్పీ జగదీష్ పరామర్శించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. -
రామ్ చరణ్‌కు గాయం.. పెద్ది టీమ్ క్లారిటీ
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గాయంపై పెద్ది టీమ్ స్పందించింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. షూటింగ్లో చరణ్ ఎడమకన్నుకు చిన్న గాయమైందని వెల్లడించింది. అనంతరం రామ్ చరణ్‌కు చికిత్స అందించామని ప్రకటించింది. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్ ప్రారంభమవుతుందని పెద్ది టీమ్ నోట్ విడుదల చేసింది. దయచేసి ఎటువంటి ఊహాగానాలు నమ్మవద్దని అభిమానులకు సూచించింది. పెద్ది షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం ఈ మూవీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.An update regarding @AlwaysRamCharan Garu's injury on the sets of #Peddi.We promise everything is safe and on track ❤️Kindly do not speculate. Thank you. pic.twitter.com/5Abhs2QyHb— PEDDI (@PeddiMovieOffl) March 25, 2026 -
దురంధర్-2 మూవీ.. ఈ అరుదైన షూటింగ్ ఫోటోలు చూశారా? (ఫోటోలు)
-
కాల్పులు జరిపి తప్పించుకోవాలని..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిప్రకారం ఫాంహౌస్‌ను ‘ఈగల్’ బృందం, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అవాక్కైన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ , పైలట్ రోహిత్‌ల బృందం వారిపై కాల్పులు జరిపి తప్పించుకోవాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ 0.32 జర్మనీ తయారీ రివాల్వర్‌తో తొలుత మూడు రౌండ్లపాటు కాల్పులకు దిగాడు. తాము పోలీసులమని, సోదాలకు వచ్చామని చెబుతున్నా నమిత్ శర్మ మాత్రం తమను లక్ష్యంగా చేసుకొని కూడా ఒక రౌండ్ కాల్పులు జరిపాడని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ బుల్లెట్ ఎవరికీ తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కాల్పుల శబ్దాలు వినగానే తాము అప్రమత్తం అయ్యామని.. అదే సమయంలో ‘కాల్చి పారేయండి.. మొత్తం నేను చూసుకుంటాను. ఏం జరిగినా నాదే బాధ్యత’ అంటూ ఒకరు గట్టిగా అరిచినట్లు వినిపడిందని వివరించారు. తమను భయభ్రాంతులకు గురిచేసి కాల్పులు జరిపి ఫాంహౌస్ నుంచి తప్పించుకొని పారిపోవాలని అక్కడున్న వారు ప్లాన్ వేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం, ఎక్సైజ్ చట్టాలతోపాటు ఆయుధాల చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కాల్పులతో సంబంధం ఉన్న పైలట్ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్ శర్మలను అరెస్ట్ చేశారు. కాల్పులుకు తెగబడ్డ నమిత్ శర్మను ఏ–1గా, ఫాంహౌస్ యజమాని, పార్టీ ఏర్పాటు చేసిన పైలట్ రోహిత్‌రెడ్డిని ఏ–2గా, అతడి సోదరుడు, కాల్పుల జరిగిన తుపాకీ లైసెన్స్ కలిగిన రితేశ్‌రెడ్డిని ఏ–3గా పేర్కొన్నారు. పోలీసులపై హత్యాయత్నం, వారి విధులను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం నిందితులకు జ్యుడీíÙయల్ కస్టడీ విధించింది. మరింత కిక్కు కోసమే మద్యంలో కొకైన్.. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. మత్తు కిక్కు కోసమే టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, వారి మిత్రులు మద్యంలో కొకైన్ కలుపుకొని తాగారు. పార్టీని రంజుగా ఎంజాయ్ చేసేందుకే ఖరీదైన పలు బ్రాండ్ల మద్యంతోపాటు కొకైన్ తెప్పించుకున్నారు. పోలీసుల సోదాల అనంతరం పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ టెస్ట్‌లు, అనంతరం రక్త పరీక్షలు నిర్వహించగా పుట్టా మహేశ్, రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, కౌశిక్ రవి, నమిత్ శర్మలకు పాజిటివ్ వచ్చింది. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయింది. పార్టీలో వాడిన కొకైన్‌ను తానే తెచ్చానని కౌశిక్ రవి పోలీసుల ఎదుట అంగీకరించాడు. సిమ్లాలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్టీ కోసమే కొకైన్‌ను ఒక్కో గ్రాము రూ. 15,000 చొప్పున చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ అంగీకరించాడు. -
టెక్సాస్ ఘటనలో భారత సంతతి విద్యార్థిని మృతి
ఆస్టిన్: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో గల యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో మృతి చెందిన నలుగురిలో సవితా షణ్ముగసుందరం(21) అనే భారత సంతతి విద్యార్థి కూడా ఉన్నారు. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు చనిపోగా, 14 మంది గాయాలపాలయ్యారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. కాగా, సవితా షణ్ముగసుందరం మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎకనామిక్స్‌లో డ్యూయెల్ డిగ్రీ చేస్తున్నారు. వచ్చే మే నెలలో ఈమె గ్రాడ్యుయేషన్ పూర్తి కానుండగా ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఆస్టిన్లోని పేరున్న బ్యూఫోర్డ్‌లోని ఓ బార్ వెలుపల మిత్రులతో కలిసి ఉండగా కారులో వచి్చన దుండగుడు వారిపైకి కాల్పులకు దిగాడు. సమాచారం అందుకున్న నిమిషానికే అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. మృతులను సవితా షణ్ముగసుందరం, రైడర్ హారింగ్టన్, జోర్జ్ పెడెర్సన్‌లుగా, దుండగుడిని సెనెగల్‌లో జని్మంచిన 53 ఏళ్ల ఎన్డిగా డియాగ్నెగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఒక భారతీయ విద్యార్థి కూడా ఉన్నాడు. మొత్తమ్మీద ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇరాన్‌పై దాడుల నేపథ్యం.. 2000వ సంవత్సరంలో టూరిస్టు వీసాపై వచి్చన ఎన్డిగా డియాగ్నెగా 2006లో అమెరికా పౌరురాలిని వివాహమాడాడు. దీంతో 2013లో ఇతడికి పౌరసత్వం కూడా వచి్చందని హోం ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. ఇతడి ఇంట్లో జరిపిన సోదాల్లో ఇరాన్ జాతీయ పతాకం, ఇరాన్ నేతల ఫొటోలు కొన్ని లభించాయి. అతడు ధరించిన టీ షర్టుపై ఇరాన్ జెండా డిజైన్, ‘ప్రాపర్టీ ఆఫ్ అల్లాహ్’అని రాసి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడటానికి కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. ఎఫ్‌బీఐ శాన్ ఆంటోనియో విభాగం అధికారి అలెక్స్ డోరన్ మాత్రం ఘటనకు ఉగ్రవాదంతో సంబంధం ఉండే అవకాశం ఉన్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఎన్డిగా డియయాగ్నా ఈ ఘటనకు ప్రేరేపించిన కారణాలపై ముందుగానే ఒక నిర్ణయానికి రాలేమని ఎఫ్‌బీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ బలగాల వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అలీ ఖొమైనీ, ఇతర ఉన్నతాధికారులు మరణించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆమె సూపర్ స్టార్.. సవితా షణ్ముగ సుందరం మృతిపై టెక్సాస్ వర్సిటీ అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమెది కష్టించేతత్వమని, అందరితో కలిసిపోయే విద్యార్థి అని గుర్తు చేసుకుంటున్నారు. మెక్‌కాంబ్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రుస్ ఫిన్నే ‘ఎక్స్’లో..‘మా సూపర్‌స్టార్ విద్యార్థుల్లో షణ్ముగసుందరం ఒకరు. ఆమెను కోల్పోవడం నిజంగా బాధాకరం’అని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆమె ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగ జీవితం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. సవితా షణ్ముగసుందరం ఇక లేరనే విషయాన్ని తాము ఇప్పటికీ నమ్మలేకున్నామని తోటి విద్యార్థి ఒకరన్నారు. ‘తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమించే కుమార్తె. ఎందరికో మంచి స్నేహితురాలు. ఈ ప్రపంచంలో తనవంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ విద్యారి్థని’అంటూ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ప్రెసిడెంట్ జిమ్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మరణం వార్త తమను ఎంతగానో కలిచి వేసిందని, ఆమెను మర్చిపోలేమని పేర్కొన్నారు. -
'కల్కి 2' సెట్స్‌లో అమితాబ్-కమల్.. 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా
రెండేళ్ల క్రితం వచ్చిన 'కల్కి 2898 AD' ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రలు చేశారు. చివరలో ప్రభాస్‌ని కర్ణుడి పాత్రలో చూపించి సీక్వెల్‌పై అప్పుడే హైప్ పెంచారు. మరి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ మాట్లాడుకున్నారు. అయితే దీపిక.. ఈ మూవీ నుంచి తప్పుకోవడం లాంటివి జరగడంతో చిత్రీకరణ కాస్త ఆలస్యంగా మొదలైంది. దానికి తోడు ప్రభాస్ కూడా పలు మూవీస్‌తో బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)కొన్నిరోజుల క్రితమే ఎట్టకేలకు 'కల్కి' సీక్వెల్ షూటింగ్ మొదలైంది. తొలి భాగంలో సుప్రీం యాస్కిన్ పాత్రలో భయపెట్టిన కమల్ హాసన్ ఇందులో పూర్తిస్థాయి పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. అమితాబ్.. ఎప్పటిలానే అశ్వద్ధామగా అలరించబోతున్నాడు. తాజాగా వీళ్లిద్దరూ సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ ఫొటోలని అమితాబ్ తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. 40 ఏళ్ల తర్వాత కమల్‌తో మళ్లీ కలిసి పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు.'దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్ హాసన్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి ఇస్తోంది. చివరగా మేమిద్దరం 1985లో 'గిరఫ్తార్'లో కలిసి నటించాం' అని అమితాబ్ రాసుకొచ్చారు. వీళ్లిద్దరిపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మరి ప్రభాస్ ఎక్కడున్నాడు? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం 'ఫౌజీ', 'స్పిరిట్' షూటింగ్స్‌తో బిజీగా ఉన్న డార్లింగ్ హీరో.. మరి ఈ సెట్స్‌కి ఎప్పుడొస్తాడనేది తెలియాల్సి ఉంది.ఇదే సినిమా తొలి భాగంలో సుమతిగా కీలక పాత్ర చేసిన దీపికా పదుకొణె.. సీక్వెల్ నుంచి తప్పుకొంది. చాన్నాళ్ల క్రితమే నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారా అని అందరూ అనుకుంటున్నారు. సాయిపల్లవిని తీసుకున్నారనే టాక్ వినిపించింది. కానీ నిర్మాణ సంస్థ ఈ విషయం ఎప్పుడు ప్రకటిస్తుందో ఏంటో?(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?) -
కెనడా కాల్పులు: పసిగట్టిన ఏఐ.. ఆగని మారణకాండ
న్యూయార్క్: కెనడాలోని టంబ్లర్ రిడ్జ్‌లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనపై చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ తాజాగా విడుదల చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. స్కూల్లో కాల్పులకు పాల్పడిన నిందితుడు జెస్సీ వాన్ రూట్సెలార్ (18) ఖాతాను తాము 2025లోనే గుర్తించి, నిలిపివేసినట్లు సంస్థ వెల్లడించింది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ ఏఐ ఒక ప్రకటన విడుదల చేస్తూ, గత ఏడాది జూన్ నెలలోనే జెస్సీ వాన్ రూట్సెలార్ ఖాతాను తమ ‘అబ్యూస్ డిటెక్షన్ సిస్టమ్’ ద్వారా గుర్తించినట్లు తెలిపింది.నిందితుడు హింసాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించే విధంగా ఏఐని వాడుతున్నట్లు ఓపెన్ ఏఐ గుర్తించింది. దీనిపై అంతర్గతంగా సమీక్ష నిర్వహించిన సంస్థ నిందితుని ఖాతాను 2025 జూన్‌లో నిషేధించింది . అయితే ఆ సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని భావించినప్పటికీ, అతని కార్యకలాపాలు తక్షణ ప్రమాదాన్ని సూచించే స్థాయిలో లేవని భావించి వెనక్కి తగ్గినట్లు సంస్థ పేర్కొంది. శాంతిభద్రతల విభాగాలకు సమాచారం ఇచ్చే విషయంలో తమకంటూ కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయని ఓపెన్ ఏఐ వివరించింది.ఘటన జరిగిన తరువాత ఓపెన్ ఏఐ ప్రతినిధులు కెనడా అధికారులను కలుసుకుని, నిందితుడు చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించాడనే వివరాలను తెలియజేశారు. ఈ విషయాన్ని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ స్టాఫ్ సర్జెంట్ క్రిస్ క్లార్క్ వెల్లడించారు. నిందితుడి సోషల్ మీడియా ఖాతాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర డిజిటల్ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడు జెస్సీ తొలుత తన తల్లిని, సవతి సోదరుడిని ఇంట్లోనే హతమార్చి, అనంతరం సమీపంలోని పాఠశాలపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒక టీచింగ్ అసిస్టెంట్‌తో పాటు ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌తో ప్రధాని మోదీ బిగ్ డీల్? -
కెనడా కాల్పుల ఘటన: నిందితుని ఉన్మాదం వెనుక..
వాంకోవర్: కెనడాలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో నిందితునికి సంబంధించిన విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ‘జెస్సీ’ అనే యువకుడు సృష్టించిన బీభత్సానికి పదిమంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో జెస్సీ కన్నతల్లి, సోదరితో పాటు ఒక ఉపాధ్యాయురాలు, అభం శుభం తెలియని పసిపిల్లలు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురు ఆస్పత్రులలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 🔥 BREAKING 🔥This is Jesse.Jesse shot 35 innocent people yesterday including his mother, sister, a teacher & young children.10 are dead & many are fighting for their lives.The Government decided that instead of supporting Jesse’s mental health & helping a disturbed child… pic.twitter.com/RDS6ruOcGa— Lozzy B 🇦🇺𝕏 (@TruthFairy131) February 12, 2026ఈ ఉన్మాదానికి వెనుక ఉన్న కారణాలు ఇప్పడు వార్తల్లో నిలిచాయి. జెస్సీ గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతను ఎప్పుడైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వానికి, సంబంధిత ఏజెన్సీలకు ముందే తెలుసని సమాచారం. అయినప్పటికీ అతడిని ఒక రోగిగా గుర్తించి, సరైన మానసిక చికిత్స అందించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం జెస్సీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సింది పోయి, అతడిని ఒక అమ్మాయిగా పరిగణించి కృత్రిమమైన పద్ధతులను ప్రోత్సహించిందనే మాట వినిపిస్తోంది. అతనికి ‘క్రాస్ సెక్స్ హార్మోన్లు’, ఇతర మందులను ఇవ్వడం ద్వారా అతని శరీరాన్ని, ఆలోచనా తీరును విషపూరితం చేశారని తెలుస్తోంది. ఒక మానసిక రోగి భ్రమలను సరిదిద్దకుండా, వాటిని మరింతగా ప్రేరేపించిన కారణంగానే అతను తనపై తాను నియంత్రణ కోల్పోయి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. -
థాయ్‌లాండ్‌లో కాల్పుల కలకలం
-
కెనడాలో కర్నాటక వాసి కాల్చివేత
ఒట్టావా/బెంగళూరు: కెనడాలోని టొరంటో నగరంలో ఉన్న షాపింగ్ సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కర్నాటక వాసి (37) ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని బ్రాంప్టన్‌లో ఉండే చందన్ కుమార్ రాజా నందకుమార్‌గా కెనడా పోలీసులు గుర్తించారు. వుడ్బైన్ షాపింగ్ సెంటర్ వాహన పార్కింగ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, చికిత్స పొందుతూ అతడు చనిపోయాడన్నారు. చందన్‌కుమార్ వాహనం కిటికీల అద్దాలకు బుల్లెట్ రంధ్రాలు పడగా, డ్రైవర్ వైపు ఉన్న కిటికీ అద్దం పూర్తిగా ధ్వంసమైంది. కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తుల వివరాలు తెలియనప్పటికీ, దీనిని లక్షిత ఘటనగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంటికి రావాలని చెబుతున్నా...వినలేదు:తల్లిదండ్రులు చందన్ మరణవార్త విని కర్నాటక రాజధాని బెంగళూరులో శివారు నెలమంగళలో ఉంటున్న అతడి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఇలాంటిది జరుగుతుందని తాము కలలో సైతం ఊహించలేదన్నారు. దాదాపు ఏడేళ్ల నుంచి కెనడాలో ఉంటున్న చందన్‌ను ఇంటికి రావాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని, కానీ వినిపించుకోలేదని తండ్రి నందన్ కుమార్ వాపోయారు. అంతిమ సంస్కారం జరిపేందుకు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని ఆయన కోరారు. చందన్ టొరంటోలో ఇటీవలే కన్నడ అసోసియేషన్‌ను స్థాపించారని, బహుశా ఇదే కక్షతో అతడిని బలి తీసుకుని ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేశారు. -
భారత్‌లో పర్యటించనున్న బంగ్లాదేశ్ జట్టు
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో జరిగిన హైడ్రామా తర్వాత కూడా బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే మీరనుకున్నట్లు ఇది బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కాదు. షూటింగ్ జట్టు. ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్షిప్ కోసం బంగ్లా టీమ్ భారత పర్యటనకు రానుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో జరగనుంది. క్రికెట్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్.. షూటింగ్ పోటీల్లో ఎలా పాల్గొనబోతుందోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ మ్యాచ్‌లకు లభించని భద్రత షూటింగ్‌కు లభిస్తుందా అని భారత క్రీడాభిమానులు సెటైర్లు వేస్తున్నారు.కాగా, భారత్‌లో జరగాల్సిన తమ టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను భద్రతా కారణాలు సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడంతో భారత్-బంగ్లాదేశ్ మధ్య వివాదం మొదలైంది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. భారత్‌పై ప్రతీకార చర్యగా స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసింది. ఇంతటితో ఆగకుండా భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, భారత్‌లో జరగాల్సిన తమ ప్రపంచకప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. ఐసీసీ ససేమిరా అనడంతో చివరికి ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. ఇప్పుడేమో తమ దేశ షూటింగ్ జట్టును భారత్‌కు పంపుతూ కొత్త చర్చకు తెరలేపింది. ఈ విషయంలో భారత షూటింగ్ సమాఖ్య ఎలా స్పందిచబోతుందోనన్నది ఆసక్తికరంగా మారింది. -
మేలో స్టార్ట్
‘దేవర 2’ సినిమా ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘దేవర’. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి దేవర, కొడుకు వర పాత్రల్లో నటించారు ఎన్టీఆర్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్, షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో నటించారు.నందమూరి కల్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం 2024 సెప్టెంబరులో విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా ఎండింగ్లో ‘దేవర 2’ ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. తాజాగా ఈ సినిమా అప్డేట్ను వెల్లడించారు నిర్మాత మిక్కిలినేని సుధాకర్. ‘‘దేవర’ సీక్వెల్ పనులు ఈ ఏడాది మేలోప్రారంభం అవుతాయి. 2027లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అంటూ వెల్లడించారు. కాగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. -
Canada: గ్యాంగ్ వార్ కారణమా?
కెనడాలో 28 ఏళ్ల భారత మూలాలకు చెందిన వ్యక్తిని కొంతమంది కాల్చి హత్య చేయడంపై గ్యాంగ్ వార్‌గా అనుమానిస్తున్నారు. దిల్‌రాజ్ సింగ్ గిల్ అనే వ్యక్తిని కొంతమంది దాడి చేశారు. గత గురువారం సాయంత్రం గం. 5.30 ని.లకు బర్నబీ నగరంలో గిల్‌ను పలువురు కాల్చి చంపారు. బర్నబీ ఆర్సీఎంపీ ఫ్రంట్‌లైన్ అధికారులు కెనడా వే 3700 బ్లాక్ వద్ద కాల్పులు జరిగాయని వచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి అక్కడ ఓ వ్యక్తి రోడ్డపై పడి ఉన్నాడు. అయితే అతని ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ వ్యక్తి తుదిశ్వాస విడిచాడని పోలీసులు తెలిపారు. తమక గిల్ బాగా తెలిసిన వ్యక్తిగా పోలీసులు చెబుతున్నారు. రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న గ్యాంగ్ వార్ కారణంగానే గిల్‌ను కాల్చి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా పబ్లిక్ ప్లేస్‌లో కాల్పులు జరగగంపై పోలీసుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇది పోలీసులకు మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని కూడా కలవరపెట్టే అంశం. సంఘటనా స్థలంలో ఉన్న సాక్షులు, అక్కడి ప్రజల నుండి లభించే సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం రేగింది. న్యూసౌత్ వేల్స్‌లోని లేక్ కార్గెల్లిగో పట్టణంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. బాండీ బీచ్ దాడి ఘటన జరిగిన నెల రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 1500 మంది జనాభా ఉన్న ఈ పట్టణంలోని వాల్కర్ వీధిలోని ఒక నివాస ప్రాంతంలో సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని సెంట్రల్ వెస్ట్ పోలీస్ డిస్ట్రిక్ట్ అధికారులు వెల్లడించారు.తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగులు పరారీలో ఉండటంతో.. ప్రజలను ఆ ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్నందున స్థానికులు ఇళ్లలోనే ఉండాలని పోలీస్ అధికారులు సూచించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే సెంట్రల్ వెస్ట్ పోలీస్, క్రైమ్ స్టాపర్స్ (1800 333 000) నంబర్‌కు కాల్ చేయాలని కోరారు. UPDATE: Police have commenced an investigation following reports of a shooting where three people have died at Lake Cargelligo this afternoon.About 4.40pm, emergency services were called to Walker Street, near Yelkin Street, Lake Cargelligo, following reports of a shooting.… https://t.co/XCvCpkL9Qz— NSW Police Force (@nswpolice) January 22, 2026 -
టాలీవుడ్ మూవీ అరుదైన ఘనత.. ఇండియాలోనే తొలి చిత్రంగా..!
నరేష్ అగస్త్య, సంజనా సారథి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మరొక్కసారి. ఈ మూవీకి నితిన్ లింగుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సీకే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టిబెట్ సరిహద్దు సమీపంలోని ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో జరుగుతోంది. గురుడోంగ్మార్ సరస్సు వద్ద షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమాగా ఘనత సాధించింది. సముద్ర మట్టానికి సుమారు 5,430 మీటర్లు (17,800 అడుగులు) ఎత్తులో ఉన్న గురుడోంగ్మార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సులలో ఒకటి. ఈ సరస్సు వద్ద చిత్రీకరించిన మొదటి భారతీయ సినిమాగా నిలిచింది.కఠినమైన పరిస్థితుల్లో, సాయుధ దళాల ప్రత్యేక అనుమతులతో ఈ అరుదైన చిత్రీకరణ జరగడం విశేషం. చాలా తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, తీవ్రమైన చలి, పరిమిత షూటింగ్ సమయాల్లో అనుకోని వాతావరణ మార్పులు వంటి కఠిన పరిస్థితుల మధ్య షూటింగ్‌ను కంప్లీట్ చేసే సమయంలో నటీనటులు, సాంకేతిక బృందం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. కఠినమైన వాతావరణంలోనూ షూటింగ్ సజావుగా పూర్తి చేశారు. ఈ మూవీని దక్షిణాది అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాత బి.చంద్రకాత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి కీలక పాత్రల్లో నటించారు. -
ఓ మై గాడ్
బాలీవుడ్ సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘ఓ మై గాడ్’ నుంచి ‘ఓ మై గాడ్ 3’ సినిమా షూటింగ్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. ‘ఓ మై గాడ్ (2012), ఓ మై గాడ్ 2 (2023)’ చిత్రాల్లో లీడ్ రోల్లో నటించిన అక్షయ్‌కుమార్ ‘ఓ మై గాడ్ 3’లోనూ నటించనున్నారు. ఈ చిత్రంలోని మరో లీడ్ రోల్లో రాణీ ముఖర్జీ కనిపిస్తారని బాలీవుడ్ టాక్. అమిత్ రాయ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఒక సామాజిక అంశాన్ని చర్చించేలా ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారట అమిత్. ఈ ఏడాది జూన్‌లో చిత్రీకరణను ప్రారంభించనున్నారని తెలిసింది . ఇక ప్రస్తుతం దర్శకుడు అనీస్ బాజ్మీతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి రెడీ అవుతున్నారు అక్షయ్‌కుమార్. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కి హిందీ రీమేక్‌గా ఇది తెరకెక్కనుందట. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల మూడోవారంలో ప్రారంభం కానుందని తెలిసింది. -
కొంచెం మోదం... కొంచెం ఖేదం
పురుషుల హాకీ, బ్యాడ్మింటన్, షూటింగ్ ప్రతీ సంవత్సరం తరహాలోనే ‘సమ్’తృప్తిని పంచాయి. చెస్‌లో మహిళల వరల్డ్ కప్ టైటిల్‌తో కాస్త అదనపు ఆనందం దక్కితే, ఆర్చరీ, బాక్సింగ్‌లలో ఫర్వాలేదనిపించే ఫలితాలు వచ్చాయి. ఫుట్‌బాల్, టెన్నిస్ ఎప్పటిలాగే నిరాశను పంచితే... వెయిట్‌లిఫ్టింగ్‌లో కొత్త తరం విజయాలు అందించలేకపోయింది. నీరజ్ చోప్రా తన స్థాయికి తగినట్లు పతకం తేలేక ప్రపంచ వేదికపై నిరాశ పర్చడం అనూహ్య ప్రదర్శనగా మిగిలిపోయింది. 2025లో క్రికెటేతర క్రీడల్లో భారత ఆటగాళ్లు అటు టీమ్ ఈవెంట్లలో, ఇటు వ్యక్తిగత క్రీడాంశాల్లోనూ మిశ్రమ ప్రదర్శన కనబర్చారు. ప్రపంచ వేదికపై ఓ ఆటగాడిని శిఖరాన నిలిపే అసాధారణ ప్రదర్శన లేదా అద్భుత క్షణాలు మాత్రం చెప్పుకోదగ్గవి ఏవీ రాలేదు. ఈ ఏడాది భిన్న క్రీడాంశాల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను సమీక్షిస్తే... ఆర్చరీ: భారత్‌కు సంబంధించి ఆర్చరీలో ఈ ఏడాది గుర్తుంచుకోదగ్గ విధంగా సాగింది. నాలుగు ప్రపంచకప్‌లలో కలిపి భారత ఆర్చర్లు మొత్తం 15 పతకాలు గెలుచుకున్నారు. 2025 ప్రపంచ కప్ పతకాల పట్టికను భారత్ నాలుగో స్థానంతో ముగించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం గెలుచుకుంది. ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో 10 పతకాలతో అగ్రస్థానం సాధించడం విశేషం. వరల్డ్ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో శీతల్ దేవి స్వర్ణంతో మెరిసింది. ఫుట్‌బాల్: భారత ఫుట్‌బాల్ చరిత్రలో మరో చెత్త సంవత్సరంగా ఇది మిగిలిపోనుంది. అతి చిన్న జట్ల చేతుల్లో ఓడిపోవడంతోపాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరింత దిగువకు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 127వ ర్యాంక్‌లో ఉన్న టీమ్ చివరకు వచ్చేసరికి 142వ ర్యాంక్‌తో ముగించింది. మహిళల జట్టు కొంత మెరుగ్గా ఆడటం విశేషం. క్వాలిఫికేషన్ టోర్నమెంట్ గెలవడం ద్వారా 2026 ఆసియా కప్‌కు భారత మహిళలు అర్హత సాధించారు.రెజ్లింగ్: 2025 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఏకైక పతకాన్ని గెలుచుకుంది. మహిళల 53 కేజీల విభాగంలో అంతిమ్ ఆ ఘనతను సాధించింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో మన దేశం 10 పతకాలు గెలుచుకుంది. తాను రిటైర్మెంట్ను వీడి మళ్లీ రెజ్లింగ్ బరిలోకి దిగుతున్నట్లు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఏడాది చివర్లో ప్రకటించింది. సీనియర్లతో పోలిస్తే ప్రపంచ అండర్–20, అండర్–23 ఈవెంట్లలో మన రెజ్లర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చి భవిష్యత్తుపై ఆశలు రేపారు.టెన్నిస్: పురుషుల టెన్నిస్‌లో భారత్‌కు సంబంధించి చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. ఏ ఒక్కరు కూడా టాప్–200 ర్యాంకింగ్స్‌లోకి వెళ్లలేకపోగా, చాలెంజర్ టూర్లో సింగిల్స్ విభాగంలో ఒక్కరూ కనీసం ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయారు. ఏటీపీ టూర్ డబుల్స్‌లో యూకీ బాంబ్రీ దుబాయ్ ఓపెన్ గెలవగా, రితి్వక్ బొల్లిపల్లి చిలీ ఓపెన్ సాధించాడు. డేవిస్ కప్‌లో స్విట్జర్లాండ్‌ను ఓడించి భారత్ 2026 డేవిస్ కప్ క్వాలిఫయర్ దశకు అర్హత సాధించగా... బిల్లీ జీన్‌కింగ్ కప్‌లో భారత్ ప్లే ఆఫ్స్ దశ వరకు వెళ్లగలిగింది. వర్ధమాన క్రీడాకారిణుల్లో శ్రీవల్లి రషి్మక, మాయ చక్కటి ఆటతో అందరి దృష్టిలో పడినా... ఫలితాలపరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సీనియర్ డబుల్స్ స్టార్, రెండు గ్రాండ్‌స్లామ్‌ల విజేత రోహన్ బోపన్న ఈ ఏడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్యాడ్మింటన్: భారత షట్లర్లు అంతర్జాతీయ వేదికపై మెరుగైన ప్రదర్శన కనబర్చారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడి కాంస్యం గెలుచుకోవడం ఈ ఏడాది హైలైట్ కాగా బీడబ్ల్యూఎఫ్ టూర్లో మరో మూడు టైటిల్స్ మన ఆటగాళ్ల ఖాతాలో చేరాయి. ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను లక్ష్య సేన్, యూఎస్ ఓపెన్‌ను ఆయుశ్ శెట్టి గెలుచుకోగా... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడి సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. టేబుల్ టెన్నిస్: వరల్డ్ టీటీ టూర్లో భారత ఆటగాళ్లు రెండు టైటిల్స్ సాధించగలిగారు. మిక్స్డ్ డబుల్స్‌లో దియా–మనుష్ జోడీ ట్యూనిస్ కంటెండర్ టోర్నీని, పురుషుల డబుల్స్‌లో సత్యన్–ఆకాశ్ ద్వయం లాగోస్ కంటెండర్ టోర్నీని సొంతం చేసుకున్నారు. ఆసియా టీటీ చాంపియన్‌షిప్‌లో కనీసం ఒక్క పతకమైనా గెలుచుకోవడంలో భారత ప్యాడ్లర్లు సఫలం కాలేకపోయారు. పురుషుల టీమ్ 11వ, మహిళల టీమ్ 12వ ర్యాంక్‌తో ఈ ఏడాదిని ముగించింది. షూటింగ్: ఈ ఏడాది షూటింగ్లో భారత్ ప్రదర్శన సంతృప్తికరంగా సాగింది. అన్ని ప్రపంచకప్‌లలో కలిపి 11 స్వర్ణాలు సహా మొత్తం 28 పతకాలు గెలుచుకున్న భారత్... ఓవరాల్‌గా రెండో స్థానంతో ముగించింది. వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కూడా మన షూటర్లు మొత్తం 13 పతకాలు అందించారు. ఈ ఏడాది కొత్తగా వెలుగులోకి వచ్చి వేర్వేరు టోర్నీల్లో సత్తా చాటిన షూటర్‌గా సురుచి సింగ్ (మహిళల పిస్టల్)కు గుర్తింపు లభించింది.వెయిట్‌లిఫ్టింగ్: వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. ఇవి మినహా ఈ క్రీడాంశంలో భారత్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు.హాకీ: భారత పురుషుల జట్టు ఆసియా కప్‌లో విజేతగా నిలిచి వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించడం చెప్పుకోదగ్గ విశేషం. అయితే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ టోర్నీలో పేలవ ప్రదర్శనతో జట్టు ఎనిమిదో స్థానంతో ముగించింది. మహిళల హాకీ జట్టు ప్రదర్శన అయితే మరీ పేలవంగా ఉంది. చెప్పుకోదగ్గ విజయం ఒక్కటీ దక్కకపోగా...ప్రొ హాకీ లీగ్‌లో దిగువ స్థానానికి పడిపోయింది. చెస్: మహిళల చెస్ వరల్డ్ కప్‌లో భారత్‌కు చెందిన దివ్య దేశ్‌ముఖ్ చాంపియన్‌గా, కోనేరు హంపి రన్నరప్‌గా నిలవడం ఈ ఏడాది చదరంగంలో చెప్పుకోదగ్గ విశేషం. వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాతి ఏడాది గుకేశ్ కెరీర్ పడుతూ, లేస్తూ సాగింది. ‘ఫిడే’ వరల్డ్ కప్‌లో, ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్‌లో అతను విఫలమయ్యాడు. అయితే నార్వే ఓపెన్‌లో దిగ్గజం కార్ల్‌సన్‌పై సాధించిన గెలుపు చిరస్మరణీయంగా నిలిచింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్‌లో ప్రజ్ఞానంద, అర్జున్, నిహాల్, విదిత్, హరికృష్ణ విఫలం కాగా...‘ఫిడే’ సర్క్యూట్లో గెలిచి ఎట్టకేలకు ప్రజ్ఞానంద క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించగలిగాడు. ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి, ఇరిగేశి అర్జున్ కాంస్య పతకాలతో మెరిశారు. ఈ ఒక్క ఏడాదే భారత్ నుంచి ఆరుగురు కొత్త ‘గ్రాండ్‌మాస్టర్లు’ రావడం విశేషం.అథ్లెటిక్స్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో ఏడాదిని తన పేరిట లిఖించుకున్నాడు. పారిస్ డైమండ్ లీగ్, పోష్్రసూ్టమ్ ఇని్వటేషనల్, కుసోసిన్కీ మెమోరియల్, గోల్డెన్ స్పయిక్ ఒస్ట్రావా, నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లలో (మొత్తం ఐదు) నీరజ్ విజేతగా నిలిచాడు. పైగా కెరీర్లో తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను కూడా (దోహా డైమండ్ లీగ్‌లో) అతను దాటడం మరో విశేషం. అయితే దురదృష్టవశాత్తూ 2025 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చోప్రా పతకం గెలవకుండా వెనుదిరగడం మాత్రం నిరాశ కలిగించిన అంశం. మరోవైపు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు 8 స్వర్ణాలు సహా మొత్తం 24 పతకాలు గెలుచుకున్నారు.బాక్సింగ్: వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 4 పతకాలు గెలుచుకుంది. వరల్డ్ బాక్సింగ్ కప్ సిరీస్‌లో భారత్ 3 ప్రపంచ కప్‌లలో కలిపి 13 స్వర్ణాలు సహా మొత్తం 40 పతకాలు సాధించడం విశేషం. తెలంగాణ బాక్సర్ నిఖత్ కూడా పసిడి పతకం నెగ్గింది. –సాక్షి క్రీడా విభాగం -
మా వందే ప్రారంభం
భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ‘మావందే’ టైటిల్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో మోదీగా ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. రవీనా టాండన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సీహెచ్ క్రాంతికుమార్ దర్శకత్వంలో వీర్ రెడ్డి .ఎం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శనివారం ప్రారంభమైంది. ‘‘మోదీగారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలను సహజంగా ‘మా వందే’లో చూపించనున్నాం.ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ మోదీగారి జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖ సాంకేతిక, వీఎఫ్ఎక్స్ నిపుణులతో ఈ బయోపిక్‌ను రూపొం దిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: గంగాధర్, వాణిశ్రీ, లైన్ ప్రోడ్యూసర్: రాజేశ్. -
నిజామాబాద్: ఇందల్వాయిలో కాల్పుల కలకలం
నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. పాతకక్షల కారణమా.. లేక వేరే ఏ కారణాలో కానీ లారీడ్రైవర్ సల్మాన్‌పై కొంతమంది దుండగులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సల్మాన్ మృతిచెందాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, కాల్పుల కలకలం అనేది తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో కూడా చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. -
బోండీ బీచ్ లో కాల్పుల ఘటనపై ముమ్మర దర్యాప్తు
-
ఆస్ట్రేలియాలో పహల్గామ్ తరహా టెర్రర్ ఎటాక్.. 10 మంది మృతి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి కలకలం రేపింది. జమ్మూకశ్మీర్ పహల్గాం తరహాలో సిడ్నీ బాండీ బీచ్‌లో ఉగ్రదాడి జరిగింది. బీచ్‌లోని యూదులే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో పదిమందికి పైగా పర్యాటకులు మృతిచెందారు. ముసుగు ధరించిన ఉగ్రవాదులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు.అయితే బీచ్‌లో సరదాగా గడుపుతున్న పర్యాటకులు.. కాల్పుల మోతతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీచ్‌లో ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.బీచ్‌లోకి పర్యాటకులను నిషేధించారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లొద్దంటూ న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. కాల్పుల తర్వాత ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.One of the shooters was disarmed and possibly shot by one of the Bondi Beach goers. He is the shooter who the police gave CPR.pic.twitter.com/LS6IP68jlH— Terrible Pics (@TerriblePic) December 14, 2025 -
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లో ఉన్న బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో విద్యార్థులు తుది పరీక్షలు రాస్తున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. నల్లటి దుస్తులు ధరించిన ఒక ఆగంతకుడు ఈ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. నిందితుని జాడ ఇంకా తెలియరాలేదు. పోలీసు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. There is currently heavy Providence Police and Fire presence on Hope Street near Brown University. Please exercise caution and avoid this area until further notice.— Providence Police (@ProvidenceRIPD) December 13, 2025We are actively monitoring the shooting at @BrownUniversity. Our teams at @RIStatePolice and @RhodeIslandEMA are working closely with local law enforcement. Please stay clear of the area and monitor official channels for updates. Praying for our community.— Governor Dan McKee (@GovDanMcKee) December 13, 2025బారస్ అండ్ హోలీ భవనంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇది ఏడు అంతస్తుల భవనం. ఇందులో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ విభాగం ఉన్నాయి. కాల్పులు జరిగిన సమయంలో ఇంజనీరింగ్ డిజైన్ పరీక్ష జరుగుతోంది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ పోలీస్ టిమోతీ ఓ'హారా ప్రకారం.. నిందితుడు ముదురు రంగు దుస్తులు ధరించాడు. దాడి జరిగిన ఇంజనీరింగ్ భవనం నుండి అతను బయటకు వెళ్లడం చివరిసారిగా కనిపించింది. ఈ సందర్భంగా మేయర్ బ్రెట్ స్మైలీ మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ‘షెల్టర్-ఇన్-ప్లేస్’ అమలులో ఉందని ప్రకటించారు. క్యాంపస్ సమీపంలో నివసించే ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, పరిస్థితి సద్దుమణిగే వరకు బయలకు రాకూడదని కోరారు.గాయపడిన ఎనిమిది మంది పరిస్థితి నిలకడగా ఉందని మేయర్ స్మైలీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన విద్యార్థులలో తీవ్ర భయాందోళనను సృష్టించింది. ఒక విద్యార్థి తన వసతి గృహంలో ప్రాజెక్ట్‌పై పని చేస్తుండగా సైరన్లు, సందేశం విని తన భయపడ్డానని తెలిపారు. మరో ల్యాబ్‌లోని విద్యార్థులు హెచ్చరిక అందగానే డెస్క్‌ల కింద దాక్కుని, లైట్లు ఆపివేశామన్నారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ ప్రస్తుతం మనం బాధితుల కోసం ప్రార్థించడం తప్ప మరేమీ చేయలేమని అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో, ఎఫ్బిఐ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారని తెలిపారు. అయితే, నిందితుడు అదుపులో ఉన్నాడని మొదట చెప్పినప్పటికీ, తరువాత అతను పోలీసుల అదుపులో లేడని స్పష్టం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ, ఈ వార్తను తాను విన్నానని ఎఫ్బిఐ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నదని, బాధితుల కోసం ప్రార్థిస్తున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: ‘షాక్ అయ్యాను’.. మెస్సీ కార్యక్రమంపై మమతా క్షమాపణలు -
బ్యాక్ టు సెట్
వివాహం తర్వాత తిరిగి షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టారు హీరోయిన్ సమంత. దర్శక–నిర్మాత రాజ్ నిడుమోరు, సమంత ఈ డిసెంబరు 1న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున్న ఐదు రోజుల్లోనే సమంత తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్లో తిరిగిపాల్గొన్నారు.సమంత లీడ్ రోల్లో నటిస్తున్న ఈ పీరియాడికల్ ఫ్యామిలీ, యాక్షన్ మూవీకి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఓ...బేబీ’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత సమంతతో కలిసి నందినీ రెడ్డి చేస్తున్న సినిమా ఇది. సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్న ఈ ‘మా ఇంటి బంగారం’ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
దక్షిణాఫ్రికా హాస్టల్లో కాల్పులు.. 11 మంది మృతి
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో దారుణం జరిగింది. ఇక్కడి ప్రటోరియా సమీపంలో ఓ హాస్టల్లో జరిగిన కాల్పుల్లో 11 మంది మృతిచెందగా.. మరో 14 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు జొహన్నెస్‌బర్గ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలిక ఉన్నారు.కాల్పులు జరిపిందెవరో స్పష్టంగా తెలియరాలేదని పోలీసు అధికారి అథ్లెండా మాథే తెలిపారు. మృతుల్లో 10 మంది అక్కడికక్కడే మృతిచెందారని, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని వివరించారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున 4.30 సమయంలో హాస్టల్‌కు వచ్చి, తుపాకులతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.ఘటనాస్థలిలో మద్యం సీసాలు లభించినట్లు, దుండగులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా.. ఐక్యరాజ్య సమితి(ఐరాస) 2023-24 నివేదిక ప్రకారం హత్యల రేటులో దక్షిణాఫ్రికా టాప్-10లో ఉంది. ఇక్కడ ప్రతి లక్ష మందికి గాను 45 మంది హత్యకు గురవుతున్నారు. రోజుకు సగటున 63 హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.BREAKING: PRETORIA MASSACRE11 Dead in South Africa. A 3-Year-Old Among Them.At 4:30 AM this morning, three gunmen walked into an illegal tavern at Saulsville Hostel and opened fire on everyone inside.They did not discriminate.A three-year-old boy. A twelve-year-old boy. A… pic.twitter.com/cAGTw2sKdr— Shanaka Anslem Perera ⚡ (@shanaka86) December 6, 2025 -
దృశ్యం 3 షూట్ కంప్లీట్
హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లోని సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ ‘దృశ్యం’ సిరీస్ నుంచి ఇప్పటికే ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఈ ఏడాది ‘దృశ్యం 3’ సినిమాను కూడా ప్రకటించారు మోహన్‌లాల్. ఈ ఏడాది సెప్టెంబరు మూడో వారం ‘దృశ్యం 3’ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. డిసెంబరు 2న ఈ’ సినిమా చిత్రీకరణ ముగిసిందని యూనిట్ సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా పేర్కొంది. ఇలా అతి తక్కువ సమయంలోనే ‘దృశ్యం 3’ సినిమా చిత్రీరకణ పూర్తి కావడం విశేషం.ఇక ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరంబవూర్ నిర్మించిన ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కనుంది. ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్లో వెంకటేశ్, హిందీ వెర్షన్లో అజయ్ దేవగన్ నటిస్తారు. కాగా, ‘దృశ్యం 3’ సినిమాను మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తామన్నట్లుగా ఆ మధ్య దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పారు.మరి... జీతూ జోసెఫ్ అనుకున్నట్లుగానే ‘దృశ్యం 3’ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... మోహన్‌లాల్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘వృషభ’ ఈ డిసెంబరు 25న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది మోహన్‌లాల్ హీరోగా నటించి, విడుదలైన ‘ఎల్2: ఎంపురాన్, తుడరుమ్, హృదయపూర్వం’ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇంకా ‘దృశ్యం 3’ సినిమా తర్వాత రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట మోహన్‌లాల్. -
అమెరికాలో కాల్పుల మోత
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్‌కు కొద్ది దూరంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై కాల్పులకు జరిగాయి. వీరిని వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులుగా గుర్తించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల కస్టడీలో ఉన్న అనుమానితుడికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. అయితే అవి ప్రాణాపాయం కాని గాయాలని చట్ట అమలు అధికారులు తెలిపారు. అనుమానితుడి ఉద్దేశ్యం ఏమిటి? అతను గార్డ్ సభ్యులనే లక్ష్యంగా చేసుకున్నాడా? అనే విషయాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఈ ఘటన గురించి గవర్నర్ పాట్రిక్ మోరిస్సే స్పందిస్తూ ‘దర్యాప్తు కొనసాగుతున్నందున మేము సమాఖ్య అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని అన్నారు.చట్ట అమలు సంస్థలు సంఘటనా స్థలం నుండి సేకరించిన నిఘా వీడియోను సమీక్షిస్తున్నాయి. ఈ వీడియో ఆధారంగా అనుమానితుడు.. సైనికుల వద్దకు వచ్చి, తుపాకీని బయటకు తీసినట్లుగా తెలుస్తోంది. ఒక అధికారి చెప్పిన వివరాల ప్రకారం..సైనికులలో ఒకరు ఆ దాడి చేసిన వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ పరస్పర కాల్పుల ఫలితంగానే అనుమానితుడికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.ఈ కాల్పుల ఘటన వైట్ హౌస్‌కు రెండు బ్లాక్‌ల దూరంలో జరిగింది. ఘటన జరిగిన వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలలో.. సైనికులలో ఒకరికి సీపీఆర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. మరొక సైనికుడికి, అదుపులో ఉన్న అనుమానితునికి కూడా చికిత్స అందిస్తున్న దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నాయి. అలాగే ఆ దారిలో గాజు పెంకులు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఎఫ్‌బీఐ కూడా సమాఖ్య స్థాయిలో దర్యాప్తులో పాలుపంచుకుంటోంది. -
ఎయిర్ ఫోర్స్ అధికారులను చంపింది మాలికే
1990లో జరిగిన ఎయిర్ ఫోర్స్ అధికారుల హత్య కేసులో కీలక ముందడుగు పడింది. ఆ హత్య సమయంలో ఎయిర్ ఫోర్స్ అధికారిని షూట్ చేసింది జేకేఎల్ఎఫ్ లీడర్ యాసిన్ మాలిక్ అని ప్రధాన సాక్షి గుర్తించారు. ఈ కేసు విచారణ టాడా కోర్టులో జరుగగా యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడని కాల్పుల సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి తెలిపారు.1990లో జమ్మూకశ్మీర్ శ్రీనగర్ పరిసరాల్లో జరిగిన నలుగురు ఎయిర్ ఫోర్స్ అధికారుల హాత్య కేసు విచారణను ప్రత్యేక టాడా కోర్టు విచారించింది. ఈ సందర్భంగా కాల్పుల ఘటన సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు ప్రత్యక్ష సాక్షులను విచారించింది. ఆరోజు అధికారులను కాల్చి చంపింది జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు యాసిన్ మాలిక్ అనే ప్రధాన సాక్షి తెలిపారు. ఈ కేసులో మాలిక్ ను ఎలా గుర్తించారని ప్రశ్నించగా "మాలిక్ గడ్డం స్టైల్ తప్ప ప్రస్తుతం ఏమీ మారలేదు కనుక నిన్ను గుర్తించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు" అని ప్రధాన సాక్షి అన్నారు. అంతే కాకుండా ఆరోజు దాడిచేసిన మరో ముగ్గురు షౌకత్ భక్షి, నన్నాజీ, జావేద్ అహ్మద్ లను సాక్షులు గుర్తించారు. ఆరోజు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని పేర్కొన్నారు.అసలేం జరిగింది1990 జనవరి 25న శ్రీనగర్ రవల్పురా వద్ద బస్సుకోసం వేచి చూస్తున్న వారిపై యాసిన్ మాలిక్ నేతృత్వంలోని టెర్రరిస్టుల బృందం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో నలుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులు మృతిచెందారు. కాగా ఆ ఘటనలోప్రధాన నిందితుడిగా ఉన్న యాసిన్ మాలిక్ ప్రస్తుతం టెర్రర్ ఫండింగ్ కేసులో ఢిల్లీ తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. -
తెలంగాణ షూటర్‌కు మరో స్వర్ణం
టోక్యోలో జరుగుతున్న డెఫ్లింపిక్స్ 2025లో తెలంగాణకు చెందిన యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ మరోసారి స్వర్ణం సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్స్ ఈవెంట్లో ప్రపంచ రికార్డుతో పసిడి పతకం నిలబెట్టుకున్న ధనుష్.. తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లోనూ స్వర్ణ పతకం సాధించి డెఫ్లింపిక్స్ 2025లో రెండో గోల్డ్‌ను సొంతం చేసుకున్నాడు.23 ఏళ్ల ధనుశ్ శ్రీకాంత్ 2022లో కాక్సియస్ డొ సుల్ (బ్రెజిల్)లో జరిగిన డెఫ్లింపిక్స్లోనూ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్‌కు చెందిన ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.డెఫ్లింపిక్స్లో ధనుష్ సాధించిన విజయాలకు తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) శ్రీ ఏ. పి. జితేందర్ రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి అభినందనలు తెలిపారు. సింగిల్స్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న అనంతరం ధనుష్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. శ్రీకాంత్‌కు రూ. 1 కోటి 20 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నట్లు వాకిటి శ్రీహరి వెల్లడించారు. -
షూటర్ ధనుష్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా
టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లంపిక్స్‌లో హైదరాబాద్‌కు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ అదరగొట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో శ్రీకాంత్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. దనుష్ ఫైనల్లో 252.2 పాయింట్లతో అగ్రస్దానంలో నిలిచాడు. తద్వారా డెఫ్లంపిక్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో అత్యధిక పాయింట్ల సాధించిన షూటర్‌గా శ్రీకాంత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. సూరత్‌కు చెందిన మరో షూటర్ మహ్మద్ వానియా 250.1 పాయింట్లతో రజత పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో రెండు పతకాలూ భారత్‌కే దక్కాయి.భారీ నజరానా..ఇక ఈ డెఫ్లంపిక్స్‌లో సత్తాచాటిన ధనుష్ శ్రీకాంత్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం కోటి 20 లక్షలు రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఆదివారం (నవంబర్ 16) హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో ఈ విషయాన్ని వెల్లడించారు.చదవండి: సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్ -
ప్రభాస్ స్పిరిట్.. ఏకంగా స్టార్ హీరో తనయుడు కూడా!
ప్రభాస్(Prabhas)- సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) క్రేజీ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ మూవీ స్పిరిట్(Spirit Movie). ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 23న రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్' ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీతో బాలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. జిగ్రీస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సందీప్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. స్పిరిట్ చిత్ర షూటింగ్ ఈ నెలఖరులో ప్రారంభించినున్నట్లు తెలిపారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. స్పిరిట్‌పై రూమర్స్..అయితే బిగ్ ప్రాజెక్ట్‌పై రూమర్స్ కూడా అదే స్థాయిలో వైరలవుతున్నాయి. ఈ మూవీలో మెగాస్టార్‌తో పాటు కొరియన్ స్టార్ డాన్లీ కూడా నటించనున్నారని వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేం లేదని సందీప్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాజాగా స్పిరిట్‌కు సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఈ మూవీతో టాలీవుడ్ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కుమారులు ఎంట్రీ ఇవ్వనున్నారని లేటేస్ట్ టాక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్, అలాగే హీరో రవితేజ కుమారుడు మహదాన్ భూపతిరాజు స్పిరిట్‌కు పని చేయనున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు సందీప్ రెడ్డికి అసిస్టెంట్స్ డైరెక్టర్స్‌గా పని చేస్తారని టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. #SandeepReddyVanga ropes in two star kids as assistant directors for #Spirit 🔥Rishie Manoj (#Trivikram’s son) & Mahadhan (#RaviTeja’s son) join the team! 🎬#Prabhas pic.twitter.com/vHb7KbucL8— CHITRAMBHALARE (@chitrambhalareI) November 13, 2025 -
కాంతార చాప్టర్-1 షూట్.. ఆ సీన్స్ కోసం ఏకంగా!
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్-1. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ఏడాది దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కాంతార టీమ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మూవీ షూటింగ్ సహకరించిన అన్నదమ్ములకు శుభాకాంక్షలు తెలిపారు. కుందాపురకు చెందిన ఉవా మెరిడియన్ ఫిల్మ్ స్టూడియో యాజమానులు ఉదయ్ కుమార్ శెట్టి, వినయ్ కుమార్ శెట్టి తమ సినిమా కాంతార చాప్టర్-1 ఎంతో సహకరించారని అన్నారు. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ కోసం 22 వేల చదరపు అడుగుల ఏసీ సెట్‌ను రూపొందించారని వెల్లడించారు. ఇందులోనే ఇండోర్ సీక్వెన్స్ తెరకెక్కించామని ట్విటర్లో పోస్ట్ చేశారు. తన మూవీకి మద్దతుగా నిలిచిన మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటామని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాంతార చాప్టర్-1 మూవీని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. రిషబ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ సినిమా ఛావాను అధగమించింది. అంతేకాకుండా కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో మూవీగా ఘనత సాధించింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. Uday Kumar Shetty and Vinay Kumar Shetty, the dynamic brothers from Kundapura and proud owners of Uva Meridian!. They helped to build a 22,000 sq.ft A/C floor for shooting Kantara Chapter 1, where all of our indoor sequences was shot. We remain thankful for their constant support… pic.twitter.com/hUPGm3F4qy— Rishab Shetty (@shetty_rishab) November 1, 2025 -
ఫైనల్లీ సమంత హీరోయిన్గా కొత్త సినిమా (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో షూటింగ్స్ సందడి
కొందరు సెట్స్‌లో... కొందరు నేచురల్ లొకేషన్స్‌లో... ఇలా హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తూ ఈ వారం అంతా బిజీ బిజీగా గడిపారు కొందరు స్టార్స్. ఆదివారం, దీపావళికి సోమవారం బ్రేక్ తీసుకోనున్న స్టార్స్ కొందరైతే... హాలిడే లేకుండా షూట్లో పాల్గొననున్న స్టార్స్ కూడా ఉన్నారు. ఇక గత ఆరేడు రోజులుగా హైదరాబాద్‌లో ఏయే సినిమాల షూటింగ్స్ జరి గాయో తెలుసుకుందాం.సెట్లో శంకరవరప్రసాద్... చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత చిరంజీవి, నయనతార జోడీగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. అయితే ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో హీరో వెంకటేశ్, హీరోయిన్ కేథరిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో చిరంజీవి, నయనతార, కేథరిన్, నటుడు సచిన్ ఖేడేకర్‌లతో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో రిలీజ్ కానుంది.ఆర్ఎఫ్సీలో అడ్వెంచర్ మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రధారులు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తు్త్తన్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ మహేశ్‌బాబుకి సంబంధించిన ఎలాంటి లుక్ అధికారికంగా చిత్రయూనిట్ విడుదల చేయలేదు. అయితే చిత్రీకరణ సమయంలోని కొన్ని ఫొటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే.అమేజాన్ అడవుల నేపథ్యంలో భారీ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్లో నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తోంది.ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకీ లభించని ఘనత ‘ఎస్ఎస్ఎమ్బీ 29’కి దక్కనుందని టాక్. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కెన్యా దేశంలో ఈ సినిమా చిత్రీకరణని ΄్లాన్ చేశారు రాజమౌళి. ఇప్పటికే ఆయన అక్కడి లొకేషన్స్‌ని కూడా పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన మొదటి బిగ్ రివీల్ ఈ నవంబరులో రానుండటంతో అందరిలో ఎంతో క్యూరియాసిటీ నెలకొంది.యాక్షన్ ఎంటర్టైనర్... పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్‌సింగ్’ (2012) తర్వాత హీరో పవన్ కల్యాణ్– డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రమిది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సీన్స్‌ని తెరకెక్కిస్తున్నారట హరీష్ శంకర్. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చిందట. నవంబరు చివరికల్లా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని ఫిల్మ్‌నగర్ టాక్.హిట్ కాంబినేషన్లో... హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరిలది హిట్ కాంబినేషన్ అని చెపొ్చ్చు. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ (2023) మూవీ బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ హిట్ కాంబోలో వస్తున్న ద్వితీయ చిత్రం ‘ది ΄్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం వేసిన ప్రత్యేకమైన సెట్స్‌లో చిత్రీకరిస్తున్నారు. నానితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొంటోందట.ఈ చిత్రంలో నాని పాత్ర పేరు జడల్. గతంలో విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. హీరో లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్. ‘దసరా’ వంటి హిట్ కాంబినేషన్లో వస్తున్న ‘ది ΄్యారడైజ్’ పై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.ఓ వీరాభిమాని కథ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్, కింగ్డమ్’ చిత్రాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలుపోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలోని రైల్వేస్టేషన్లో హీరో రామ్‌పై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు మహేశ్‌బాబు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. రామ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై పలు సన్నివేశాలను తీస్తున్నారట దర్శకుడు. ఈ సినిమాలో ఉపేంద్ర ఓ స్టార్ హీరోగా నటిస్తుండగా ఆయన వీరాభిమాని పాత్రలో రామ్పోతినేని నటిస్తున్నారు. తన అభిమాన హీరో కోసం ఈ వీరాభిమాని ఏం చేశాడు? అన్నది తెలియాలంటే నవంబరు 28 వరకు వేచి ఉండాలి. ఈ చిత్రం అదే రోజు విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారాయన. ‘తండేల్’ వంటి హిట్ మూవీ తర్వాత ‘విరూపాక్ష’ (2023) మూవీ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘ఎన్సీ 24’ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీ చౌదరితో పాటు ఇతర నటీనటులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ‘తండేల్’లో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించిన నాగచైతన్య ‘ఎన్సీ 24’లో స్టైలిష్‌గా సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. అదే విధంగా మీనాక్షీ చౌదరి కూడా సరికొత్త పాత్రలో కనిపిస్తారు. రాయలసీమ నేపథ్యంలో... అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి విజయవంతమైన సినిమా తెరకెక్కించిన మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ‘లెనిన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. అఖిల్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు మురళీ కిశోర్.రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్, గెడ్డంతో మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ సినిమాలో తొలుత శ్రీలీల హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. శ్రీలీల స్థానాన్ని ‘మిస్టర్ బచ్చన్, కింగ్డమ్’ సినిమాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ చేశారట. అయితే హీరోయిన్ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు మేకర్స్.యాక్షన్... ఎమోషన్ విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పూరిసేతుపతి’ (వర్కింగ్ టైటిల్) అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్‌కుమార్, బ్రహ్మాజీలతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట పూరి జగన్నాథ్. తనదైన మాస్, కమర్షియల్ స్టయిల్లో ఒక యునిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారట పూరి. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ముచ్చింతల్‌లో మహాకాళి ‘హనుమాన్’ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రూపొందిన తొలి చిత్రం ‘హను–మాన్’ (2024) పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో 12 సూపర్ హీరోస్ సినిమాలను తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించారు ప్రశాంత్ వర్మ. అందులో భాగంగా ఈ యూనివర్స్‌లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథతో బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. నటీనటుల వివరాలను మేకర్స్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే అసురుల గురువు శుక్రాచార్యుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నట్లు ప్రకటించి, ఆయన ఫస్ట్ లుక్‌ని మాత్రం ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ‘మహాకాళి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. నటీనటులపై కీలకసన్నివేశాలు తీస్తున్నారు మేకర్స్. డిసెంబరు నెలాఖరుకి ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
కాంతార చాప్టర్-1.. 90 శాతం అక్కడే పూర్తి చేశాం: రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం కాంతార చాప్టర్-1. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. సూపర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. కర్ణాటకలోని ప్రాచీన కళ భూతకోల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తకర విషయం బయటకొచ్చింది. ఈ మూవీ షూటింగ్ రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలోనే తెరకెక్కించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా దాదాపు 90 శాతం ఎడిటింగ్ తన ఊర్లోనే పూర్తి చేశామని రిషబ్ శెట్టి తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. కాగా.. కర్ణాటకలోని ప్రత్యేక ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి, జానపద కథ నిర్మాణం కోసం రిషబ్ శెట్టి తన స్వగ్రామంలోనే ఎక్కువగా ఈ మూవీని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.రిషబ్ శెట్టి మాట్లాడుతూ..'ఈ సినిమా దాదాపు 90 శాతం పోస్ట్, ప్రొడక్షన్ పనులన్నీ మా సొంత గ్రామంలోనే జరిగాయి. మేము కేవలం మిగిలిన పదిశాతం పనికోసమే బెంగళూరు, కొచ్చికి వచ్చాం. ఈ సినిమా కోసం ఏకంగా సంగీత దర్శకుడిని కూడా గ్రామానికి తీసుకువచ్చి అక్కడే మొత్తం రికార్డింగ్ పూర్తి చేశాం. సినిమా ఎడిటింగ్‌లో దాదాపు 90 శాతం మా గ్రామంలోనే జరిగింది. మా గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున షూటింగ్ వద్దకు రావడంతో ఒకరకంగా ఫిల్మ్ టౌన్‌గా మారిపోయింది. ప్రతి రోజు కనీసం 100 వాహనాలు షూటింగ్‌కు వచ్చేవి. దాదాపు ప్రతి రోజు వెయ్యిమందిని సెట్లో ఉంచాం. కాంతార కోసమే నేను, నా భార్య, పిల్లలతో కలిసి నా స్వగ్రామానికి వెళ్లా' అని అన్నారు.కాగా.. కాంతార: చాప్టర్ 1 కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
ప్రభాస్ ది రాజా సాబ్ షూటింగ్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజా సాబ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కిస్తోన్న హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఇకపోతే ది రాజా సాబ్ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉంది. ఈ స్పెషల్ సాంగ్స్ షూటింగ్ చేసేందుకు రాజా సాబ్ టీమ్ యూరప్‌కు బయలుదేరింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత ఎస్కేఎన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. డైరెక్టర్ మారుతితో ఫ్లైట్‌లో ఉన్న పిక్‌ను పోస్ట్ చేశారు. ఈ సాంగ్స్‌ను షూట్ చేసేందుకు చిత్రబృందం యూరప్‌కు పయనమయ్యారు. కాగా.. మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించారు. కల్కి తర్వాత వస్తోన్న ప్రభాస్ మూవీ కావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. కంచు కనకమాలక్ష్మి అప్డేట్!
మల్లిక శంకర్ , కిషోర్ రావు, గౌతమ్ నంద, అమిత శ్రీ, హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'కంచు కనకమాలక్ష్మి'. ఈ సినిమాను గణేష్ అగస్త్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. యువన్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ దసరాకు క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.విజయ దశమి సందర్భంగా ఈ మూవీ షూటింగ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. పాటల రికార్డింగ్‌తో పాటు చిత్రీకరణ మొదలెట్టారు. ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఈ మూవీని వీరేంద్రనాథ్ కోలుకుల, భరత్ అట్లూరి, బృందకర్ గౌడ్ ,రాజేష్ గంగునాయుని, గణపతి నాయుడు సీర, కొండల రావు చూక్కాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు గణేష్ అగస్త్య మాట్లాడుతూ.."ఇది క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. అందరికీ కంచు కనకమాలక్ష్మి స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చుతుంది. విజయదశమి నాడు అజయ్ పట్నాయక్ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్‌తో మొదలుపెట్టాం. ఈ నెల 10 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తున్నాం. విజయనగరం, పట్టిసీమ, అరకు పరిసర ప్రాంతాల్లో 28 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఆ తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తామని' వెల్లడించారు. -
ప్రపంచకప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఆంధ్రప్రదేశ్ షూటర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీని భారత్ ‘టాప్’ ర్యాంక్‌తో ముగించింది. చివరిరోజు బుధవారం భారత్‌కు మూడు పతకాలు లభించాయి. జూనియర్ పురుషుల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నేలవల్లి స్వర్ణ పతకాన్ని సాధించాడు. గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్ 585 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన సాహిల్ 573 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ టోరీ్నలో ముకేశ్కిది రెండో పతకం. అంతకుముందు ముకేశ్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో రజతం గెలిచాడు. జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్ తేజస్విని 30 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. ఓవరాల్‌గా భారత్ 8 స్వర్ణాలు, 10 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచింది. -
శ్రీనిధి శెట్టి 'తెలుసు కదా' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)
-
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం, ముగ్గురు దుర్మరణం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్ కరోలినాలో ఒక రెస్టారెంట్ వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. బోటులో వచ్చి జనంపై విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.North Carolina shooter opens FIRE from a boatGunfire tears into restaurant — reports of 7 victimsSuspect takes off by boat & remains at large https://t.co/Y5rvJl2PWS pic.twitter.com/B3rPl1BbS4— RT (@RT_com) September 28, 2025విల్మింగ్టన్కు సమీపంలోని సౌత్‌పోర్ట్ యాట్ బేసిన్ ప్రాంతంలో ఉన్న ‘అమెరికన్ ఫిష్ కంపెనీ’ అనే రెస్టారెంట్లో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్ సమీపంలో బోటులు వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా తుపాకీతో జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అదే బోటులో పరారయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పుల ఘటనను సిటీ మేనేజర్ నోవా సాల్డో ధ్రువీకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే మృతుల వివరాలను, గాయపడిన పరిస్థితుల గురించి వివరాలను అధికారులు ఇంకా విడుదల చేయలేదు. స్థానికులు సంఘటనా ప్రాంతానికి దూరంగా ఉండాలని, సౌత్‌పోర్ట్ ప్రాంతానికి ఎవరూ రావొద్దని, ఇంటి లోపలే ఉండాలని మరియు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 911కు నివేదించాలని పోలిసులు కోరారు. బ్రున్స్విక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం, సౌత్‌పోర్ట్ పోలీస డిపార్ట్మెంట్కు సహాయం అందిస్తోంది. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశాయి.pic.twitter.com/0P055nihKy— TheBlaze (@theblaze) September 28, 2025 -
క్రైమ్ థ్రిల్లర్ మూవీలో యషిక.. 25 రోజుల్లోనే ప్లాన్!
తనదైన అందాలతో యువతను ఆకట్టుకునే బ్యూటీ యషిక ఆనంద్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం టాస్. ఈ మూవీలో తేజస్విని మరో హీరోయిన్గా నటిస్తోది. ఈ చిత్రంలో రత్నం మౌళి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సగు పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ఇటీవల తమిళనాడులోని కోవెల్ పట్టిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ సందర్భంగా టాస్ దర్శకుడు మాట్లాడుతూ.. 'ఇది ఒక ప్రాంతంలో జరిగే 3 హత్యల నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఆ హత్యల నేపథ్యం ఏమిటి? వాటికి నటి యషిక ఆనంద్‌కు ఉన్న సంబంధం ఏంటి అన్న అంశాలతో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథగా తెరకెక్కిస్తున్నాం. ఈ మూవీ షూటింగ్‌ను కోవెల్ పట్టి, బిరుదు నగర్, సాత్తూర్ ప్రాంతాల్లో నిర్వహించి 25 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. అదేవిధంగా చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో గాని 2026 ప్రథమార్ధంలో గాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు' చెప్పారు.ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మముందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రానికి శాంతన్ అనిభజనే సంగీతం అందిస్తుండగా.. ధర్మ దురై సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ టీవీ ఫేమ్ యోగి ,షన్న, సంజయ్ శంకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బ్లాక్ డైమండ్ స్టూడియో పతాకంపై సయ్యద్ జాఫర్ నిర్మిస్తున్నారు. -
ప్రేమకథ షురూ
దుల్కర్ సల్మాన్‌ని ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని రయ్ రయ్‌మంటూ పూజా హెగ్డే బండి నడిపారు. ఇద్దరూ ఎలా చిరునవ్వులు చిందించారో ఇక్కడున్న ఫొటోలో చూడొచ్చు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్గా ఓ ప్రేమకథా చిత్రం షురూ అయింది. రవి నెలకుదిటి దర్శకునిగా పరిచయం చేస్తూ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డేని కథానాయికగా ప్రకటించి, బుధవారం ఆమె షూట్లో పాల్గొన్న విషయాన్ని చిత్రబృందం తెలియ జేసింది. ‘‘రవి నెలకుదిటి చక్కని ప్రేమకథ రాశారు. ఈ కథలో మంచి హ్యూమన్ డ్రామా, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఉన్నాయి’’ అని కూడా యూనిట్ పేర్కొంది. పాన్–ఇండియా మూవీగా ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: అనయ్ ఓం గోస్వామి. -
మాళవిక 'హృదయపూర్వం' జ్ఞాపకాలు.. ఫుల్ హ్యాపీ (ఫొటోలు)
-
వీడియో వైరల్: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పుల కలకలం
న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులతో ఒక్కసారిగా అలజడి రేగడంతో జనం భయంతో పరుగులు తీశారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 17 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు గాయపడగా.. వారిలో ఒక యువతి ఉన్నారు. వారిని బెల్లెవ్యూ ఆసుపత్రికి తరలించారు.నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.అతడి వద్ద నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో గన్ క్రైమ్ తగ్గుతోందన్న పోలీస్ కమిషనర్ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.ఈ ఘటనలు అమెరికాలో గన్ కల్చర్‌కు అమాయకులు బలైపోతున్నారు. గత నెల జులై 29న న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఆఫీస్ భవనంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఎన్‌వైపీడీ అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా గాయాలతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు.@bufocalvinA teenager opens fire in the middle of Times Square (New York City) and injures three people... pic.twitter.com/w7zD4DX3vD— patomareao (@patomareao81945) August 9, 2025మరో ఘటనలో మే 27న ఫిలడెల్ఫియాలోని ఫెయిర్‌మౌంట్ పార్క్ కాల్పులు కారణంగా ఇద్దరు మైనర్లు మృతి చెందారుజ ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. మెమోరియల్ డే సందర్భంగా జనసంచారం ఎక్కువగా ఉండగా.. రాత్రి 10:30 సమయంలో కాల్పులు జరిగాయి. -
అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూయార్క్ సెంట్రల్ మాన్‌హట్టన్‌లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారితో సహా ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. సీఎన్ఎస్ నివేదిక ప్రకారం కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా గాయాలతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు.గ్రాండ్ సెంట్రల్ స్టేషన్, రాక్ఫెల్లర్ సెంటర్, మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లకు సమీపంలోని మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లోని రద్దీగా ఉండే ప్రాంతంలోని ఒక భవనంపైకి కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో లాక్డౌన్ విధించారు. ఈ ప్రాంతంలో పలు ఫైవ్ స్టార్ హోటళ్లు, కోల్గేట్-పామోలివ్, ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీతో సహా పలు కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నాయి. మేయర్ ఎరిక్ ఆడమ్స్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ దాడిపై విచారం వ్యక్తం చేశారు. పోలీసు అధికారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.4 people, including NYPD officer, killed in shooting at Manhattan office building. https://t.co/7Fj8zQKr5b— Ground News (@Ground_app) July 29, 2025పోలీసులు ‘ఎక్స్’లో పార్క్ అవెన్యూలో జరిగిన ఘటనలో నిందితుడు మృతి చెందాడని, అతని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఘటన జరిగిన అనంతరం ఆ స్థలాన్ని తమ స్వాధీనంలోనికి తీసుకున్నామని, ఒంటరి షూటర్‌ను చుట్టుముట్టామని పోలీసు కమిషనర్ జెస్సికా టిష్ ‘ఎక్స్’ లో రాశారు. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో ఒక పోలీసు అధికారితో సహా కనీసం ఆరుగురిపై కాల్పులు జరిగాయని, ఆ అధికారి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. సాయంత్రం రద్దీ సమయంలో పార్క్ అవెన్యూ సమీపంలో అధికారులు ఉన్న సమయంలో కొందరు సాయుధులు, బాలిస్టిక్ షర్టులను ధరించి కాల్పులు జరిపారని సమాచారం. -
టాలీవుడ్ మూవీ షూటింగ్లో ప్రమాదం.. అడివి శేష్, మృణాల్‌కు గాయాలు!
టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా జరుగుతున్న షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హీరోతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు కూడా గాయాలైనట్లు సమాచారం. అయినప్పటికీ ఈ రోజు షూట్‌ను యథాతథంగా కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అడివి శేష్‌కు కాలు బాగా వాపు రావడంతో ఆస్పత్రికి వెళ్లనున్నట్లు టాక్.కాగా.. ఇప్పటికే డకాయిట్ మూవీ నుంచి ఫైర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. షానీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డకాయిట్‌ను ప్రేక్షకులమ ముందుకు తీసుకొస్తున్నారు. -
కళ్లలో కారం చల్లి కాల్చి చంపారు
సాక్షి, హైదరాబాద్/మలక్‌పేట: సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ అలియాస్ చందు నాయక్ (50) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ మలక్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ పార్కులో వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా దుండగుల కాల్పుల్లో చనిపోయారు. కళ్లలో కారం చల్లిన నిందితులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన శరీరంలోకి మూడు తూటాలు దూసుకుపోయాయి. ఈ హత్యలో నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు.. పరోక్షంగా సహకరించిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం ఎల్బీనగర్ ఠాణాలో నమోదైన హత్య కేసులో చందు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీకారం, భూ వివాదాలతోపాటు వివాహేతర సంబంధం కోణాన్ని పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, హతుడి కుటుంబీకులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వసూళ్లు అడ్డుకోవడంతో వివాదాలు నాగర్‌కర్నూల్ జిల్లా నర్సాయిపల్లికి చెందిన చందు.. భార్య నారీబాయి, కుమారుడు సిద్ధు, కుమార్తె సింధులతో కలిసి దిల్సుఖ్నగర్ సమీపంలోని విద్యుత్‌నగర్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం సిద్ధు కెనడాలో ఎంటెక్ చదువుతుండగా... సింధు గ్రూప్స్‌కు సన్నద్ధమవుతోంది. చందు విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో, కారి్మక నాయకుడిగా సీఐటీయూలో పని చేశారు. ఎల్బీనగర్ ఏరియా సీపీఎం నాయకుడిగా నాగోల్ శ్రీ సాయినగర్‌లోని స్థలాల్లో పేదలతో గుడిసెలు వేయించారు. 2010లో సీపీఐలో చేరి భూపోరాటం చేసి పట్టాలు ఇప్పించారు. సీపీఐ (ఎంఎల్) నాయకుడు రాజేష్ తో కొన్నాళ్లుగా చందుకు విభేదాలున్నాయి. కుంట్లూర్ రావినారాయణరెడ్డి నగర్‌లోని మూడెకరాల భూమిలో గుడిసెలు వేసుకున్న వారి నుంచి రాజేష్ తదితరులు డబ్బులు వసూలు చేస్తుండటాన్ని చందు అడ్డుకున్నారు. దీంతో రాజేష్ , సుధాకర్, మున్నా, రాయుడుతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వాకింగ్ చేసిన పార్కు బయటే... రాజేశ్‌తోపాటు మరికొందరు సోమవారం రాత్రి కారులో చందు ఇంటి సమీపంలో సంచరించడాన్ని నారీబాయి గమనించి చందును హెచ్చరించారు. మంగళవారం ఉదయం భార్య, కుమార్తెతో కలిసి చందు శాలివాహననగర్ పార్కులో వాకింగ్ చేశారు. 7.30 గంటల ప్రాంతంలో బయటకు రాగా.. అక్కడే కారులో రాజేష్ కనిపించడంతో నారీబాయి హెచ్చరించారు. ‘నాకేం కాదు. ఏం భయం లేదు. మీరు ఇంటికి వెళ్లండి’అంటూ భార్య, కుమార్తెను పంపేశాడు. పార్కు వెస్ట్ గేట్ నుంచి కుడి వైపు రోడ్డులో కారు వద్దకు వెళ్తుండగా అందులోంచి దిగిన ఇద్దరు చందు కళ్లలో కారం కొట్టారు. అప్రమత్తమైన ఆయన తప్పించుకోవడానికి వెనక్కు పరిగెత్తగా.. పార్కు గేటు వద్ద ఉన్న ఇసుకలో కాలు జారి పడిపోయారు. సమీపంలోకి వచ్చిన ఇద్దరు పిస్టల్‌తో అతని ఛాతీ, పొట్ట భాగాల్లో కాల్చారు. రక్తం మడుగులో ఉన్న అతడిని కాలుతో వెనక్కు తిప్పి తలపై మరో రౌండ్ కాల్చి కారులో పారిపోయారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారు అద్దెకు తీసుకుని... ఘటనాస్థలి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దుండగులు స్విఫ్ట్ (టీఎస్ 08 హెచ్‌డబ్ల్యూ 0875) కారులో వచి్చనట్లు గుర్తించారు. ఇది పీర్జాదిగూడకు చెందిన ఓ మహిళ పేరుతో రిజిస్టరై ఉంది. ఆమె దీన్ని కొత్తపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఏజెన్సీకి కాంట్రాక్టుకు ఇచ్చారు. సోమవారం ఆన్లైన్లో ఆ కారును బుక్ చేసుకున్న ఏడుకొండలు అనే వ్యక్తి తీసుకుని వెళ్లారు.అతడితోపాటు రాజేష్ , ప్రశాంత్, మరొకరు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏడుకొండలు కారు తీసుకెళ్లి అద్దెకు ఇచ్చిన సంస్థకు అప్పగించి పారిపోయారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలిలో మూడు ఖాళీ క్యాట్రిడ్జ్‌లు, రెండు పేలని తూటాలను స్వాధీనం చేసుకుంది. పేలింది నాటు తుపాకీ అని, తూటాలు 7.65 ఎంఎం క్యాలిబర్‌కు చెందినవిగా తేల్చారు. భానుచందర్ హత్య కేసులో నిందితుడు... చందు 2022లో జరిగిన రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి పదిర భానుచందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. భూ వివాదాల నేపథ్యంలో నాగోలుకు చెందిన భాను చందర్‌ను, మన్సూరాబాద్‌కు చెందిన సీపీఐ నాయకుడు కందుల సుధాకర్, చందు తదితరులు ఆ ఏడాది ఏప్రిల్ 16న కిడ్నాప్ చేశారు. యాదాద్రి జిల్లా తిరుమలగిరి వద్ద అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సమీపంలో పడేశారు. ఈ కేసులో పోలీసులు చందుతోపాటు మిగిలిన నిందితులను అరెస్టు చేశారు. రంగంలోకి పది ప్రత్యేక బృందాలు హత్య విషయం తెలిసిన వెంటనే సౌత్ఈస్ట్ డీసీపీ ఎస్.చైతన్యకుమార్, అదనపు డీసీపీ కె.శ్రీకాంత్, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు ఘటనాస్థలికి వచ్చారు. సీపీఐ నాయకులు అజీజ్‌పాషా, ఈటీ నర్సింహా, ఛాయాదేవి తదితరులు ఘటనాస్థలికి తరలివచ్చారు. చందు భార్య, కుమార్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరయ్యారు. ఏడాదిన్నర నుంచి చందుకు ప్రాణహాని ఉందని రాజేష్ తదితరులే చంపారని ఆమె ఆరోపించారు. చందు మృతితో నాగర్‌కర్నూల్ జిల్లాలోని స్వగ్రామం నర్సాయిపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. చందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. నిందితులను పట్టుకోవడానికి పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చైతన్య కుమార్ చెప్పారు. మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెంటల్ ఏజెన్సీ నుంచి నిందితులు వాడిన కారును స్వా«దీనం చేసుకున్నారు. -
'అట్లీ' సినిమా కోసం ముంబై బయల్దేరిన అల్లు అర్జున్ (ఫోటోలు)
-
అందమైన 'కోయిల'గా దేత్తడి హారిక (ఫోటోలు)
-
సందడే సందడి
భాగ్యనగరంలో భలే జోరుగా షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు టాలీవుడ్ స్టార్ హీరోస్. సందడి సందడిగా ఈ షూటింగ్స్ జరుగుతున్నాయి. మరి... హైదరాబాద్‌లో ఏ స్టార్ ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారో తెలుసుకుందాం.షామిర్‌పేటలో... తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో ఒకరైన చిరంజీవి ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఒక పాట మినహా ‘విశ్వంభర’ సినిమా పూర్తి చేశారు చిరంజీవి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో నటిస్తున్నారు చిరంజీవి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడవ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని షామిర్‌పేటలో శరవేగంగా జరుగుతోంది. చిరంజీవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ నెలాఖరు వరకు అక్కడే షూటింగ్ ఉంటుందని, జూలై 1 నుంచి కేరళలో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందనీ తెలిసింది. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో ఈ సినిమా రూపొందుతోందని టాక్. ‘మెగా 157’ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. అఖండ తాండవం హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ చిత్రాల తర్వాత వారి కాంబినేషన్లో రూపొందుతోన్న నాలుగో చిత్రమిది. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌కి సమీపంలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట బోయపాటి శ్రీను. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఆర్ఎఫ్సీలో... వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ఆయన కథానాయకుడిగా ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఫౌజి’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. సినిమాలోని ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తీస్తున్నారట హను రాఘవపూడి. ‘సీతారామం’ వంటి హిట్ మూవీ తర్వాత ఏడాదికిపైగా సమయం తీసుకుని ‘ఫౌజి’ కథను తీర్చిదిద్దారు దర్శకుడు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆలియా భట్ యువరాణి పాత్ర చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆటా పాటా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్, దేవర’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్‌రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో భాగంగా ఎన్టీఆర్‌పై ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. అయితే ఇది రెగ్యులర్ సాంగ్ కాదని, దేశభక్తి నేపథ్యంలో ఉంటుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా, మలయాళ నటుడు టొవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమా 2026 జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్‌పల్లిలో... హీరో మహేశ్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. అయితే ఆమెది హీరోయిన్ పాత్ర కాదని... నెగటివ్ క్యారెక్టర్ అని టాక్.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలోని ఓ స్టూడి యోలో జరుగుతోంది. అమేజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారట. ప్రస్తుతం మహేశ్‌బాబు, ఇతర నటీనటులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో మహేశ్ సరికొత్త లుక్‌లోకి మారిపోయారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్‌నగర్ టాక్. మొయినాబాద్‌లో... హీరో రవితేజ, దర్శకుడు కిశోర్ తిరుమల కాంబినేషన్ లో ‘ఆర్టీ 76’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రవితేజ నటిస్తున్న 76వ చిత్రం ఇది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌కి సమీపంలోని మొయినాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరణ జరుగుతోంది.రవితేజతో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొంటున్నారని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ ట్రేడ్ మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్ మిస్ అవకుండా కథను సిద్ధం చేశారు కిశోర్ తిరుమల. ఈ సినిమా కోసం రవితేజ స్పెషల్‌గా మేకోవర్ అయ్యారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ మహేశ్‌బాబు పి. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ర్యాపో 22’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ గబ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్ స్టాప్‌గా డే అండ్ నైట్ షూటింగ్ చేసిన అనంతరం తర్వాతి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు యూనిట్. ముచ్చింతల్‌లో... ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ఫ్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. నానితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు నాని. ‘ది ఫ్యారడైజ్’ నుంచి ‘రా స్టేట్మెంట్’ పేరుతో ఇప్పటికే విడుదలైన ఓ గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సినిమా 2026 మార్చి 26న రిలీజ్ కానుంది. తుక్కుగూడలో... ‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. హీరో, హీరోయిన్‌తో పాటు ప్రముఖ తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. గండిపేటలో... ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.ప్రత్యేకంగా వేసిన సెట్లో సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధిలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మనసును హత్తుకునే స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలతో ఈ సినిమా రూపొందుతోంది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.శంషాబాద్‌లో... ‘జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాల ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ శంషాబాద్‌లో జరుగుతోంది. నవీన్ పొలిశెట్టితో పాటు ఇతర తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ప్రముఖ స్టూడియోలో...‘హనుమాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియన్ హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. మనోజ్ మంచు, జగపతి బాబు, శ్రియ శరణ్, జయరామ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. టీమ్ అంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. ‘మిరాయ్’ 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లో సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.పై సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. - డేరంగుల జగన్ మోహన్ -
భారత షూటింగ్ లీగ్‌కు అనూహ్య స్పందన
న్యూఢిల్లీ: భారత షూటింగ్ లీగ్ (ఎస్ఎల్ఐ)లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా షూటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఈ లీగ్ కోసం ఇప్పటి వరకు దేశవిదేశాలకు చెందిన 400 మందికి పైగా షూటర్లు పేర్లు నమోదు చేసుకున్నట్లు జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) బుధవారం వెల్లడించింది. ఇందులో కజకిస్తాన్, రష్యా, ఇరాన్, హంగేరి, క్రొయేషియా, అజర్బైజాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ్రెనెడా, ఇటలీ, ఆ్రస్టేలియా, ఆ్రస్టియా, సెర్బియా, అమెరికా, స్పెయిన్, థాయ్‌లాండ్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, నార్వే, సాన్ మారినో, రొమానియా దేశాలకు చెందిన షూటర్లు ఉన్నారు. తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్‌కు అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉందని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు కాళికేశ్ నారాయణ్ సింగ్ పేర్కొన్నారు. ‘ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న భారత షూటింగ్ లీగ్ పై స్పష్టమైన అవగాహనతో ఉన్నాం. ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నాం. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేవిధంగా సహృద్భావ వాతావరణంలో పోటీలు నిర్వహిస్తాం’ అని అన్నారు. జూలై వరకు పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 వరకు ఎస్ఎల్ఐ తొలి సీజన్ జరిగే అవకాశం ఉంది. లీగ్‌లో పిస్టల్ విభాగంలో 10 మీటర్లు, 25 మీటర్లు... రైఫిల్ విభాగంలో 10 మీటర్లు, 50 మీటర్లు, ‘త్రీ’ పొజిషన్... షాట్‌గన్ విభాగంలో ట్రాప్, స్కీట్‌లో పోటీలు నిర్వహించనున్నారు. లీగ్‌లో కనీసం ఆరు జట్లు పాల్గొననుండగా... రెండు గ్రూప్‌లుగా విభజించి పోటీలు చేపట్టనున్నారు. ఆటగాళ్లను ఎలైట్ చాంపియన్స్, వరల్డ్ ఎలైట్, నేషనల్ చాంపియన్స్, యూత్ చాంపియన్స్ అనే నాలుగు కేటగిరీల్లో విభజించనున్నారు -
కాంతార షూటింగ్ సెట్లో ప్రమాదం.. నిర్మాణ సంస్థ క్లారిటీ!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 సెట్లో ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకుందని.. 30 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆదర్శ్ ఈ అంశంపై మాట్లాడారు.ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 షూటింగ్ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతోంది. ఈ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. చిత్రీకరణలో భాగంగా జలాశయం వద్ద తాము సెట్ వేశామని.. అయితే వీపరీతమైన గాలి వీయడంతో అది పాడైపోయిందని వెల్లడించారు. ఈ ఘటన జరిగినప్పుడు సెట్లో నటీనటులు కానీ.. సిబ్బంది లేరన్నారు. ఈ రోజు యథావిధిగా షూటింగ్ జరుగుతున్నట్లు వెల్లడించారు. షూటింగ్ జరిగే ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్స్ సమక్షంలోనే మూవీ షూట్ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రకటనలో ఉదయం నుంచి వస్తున్న రూమర్స్‌కు నిర్మాణ సంస్థ చెక్ పెట్టేసింది.(ఇది చదవండి: 'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో)కాగా.. 2022లో సూపర్ హిట్‌గా నిలిచిన కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హీరో రిషభ్ శెట్టి దర్శకత్వంలోనే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. -
హైదరాబాద్ టు ముస్సోరీ
ముస్సోరీలో ల్యాండ్ అయ్యారు చిరంజీవి. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. వీటీవీ గణేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో వెంకటేశ్, కేథరిన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటరై్టన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగింది. మలి షెడ్యూల్ ముస్సోరీలో ప్రారంభమైందని, పది రోజుల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందని బుధవారం మేకర్స్ అధికారికంగా తెలిపి, ఓ వీడియోను విడుదల చేశారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి, నయనతార, వీటీవీ గణేశ్ పాల్గొనగా కొన్ని కీలక, వినోదాత్మక సన్నివేశాలను చిత్రీకరించడానికి ΄్లాన్ చేశారు. ‘‘1990, 2000లలో చిరంజీవి గోల్డెన్ ఎరాలో కనిపించిన వింటేజ్ కామెడీ టైమింగ్‌ను ఈ సినిమాలో మళ్లీ ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇది అభిమానులకు ఒక విజువల్ ట్రీట్. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా...
హీరోకి గాయం... షూటింగ్‌కి బ్రేక్ ఆర్టిస్ట్ డేట్స్ సర్దుబాటు కాలేదు... షూటింగ్ లేట్ సినిమాకి అనుకున్న థియేటర్లు అమరలేదు... రిలీజ్ పోస్ట్‌పోన్ ఒక సినిమా మేలు కోరి ఇంకో సినిమా వెనక్కి తగ్గితే... విడుదల వాయిదా... కారణం ఏదైనా కొన్ని సినిమాలు అనుకున్న సమయానికి థియేటర్లకు రావు. వాయిదా పడుతుంటాయి. ఇలాంటప్పుడే లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తా అని రజనీకాంత్ ‘బాషా’లో చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంటుంది. అలా లేట్ అయిన సినిమాలన్నీ లేటెస్ట్గా వస్తాయని ఊహించవచ్చు. ఇక... విడుదల వాయిదా పడిన చిత్రాల గురించి తెలుసుకుందాం. తనయుడి కోసం... చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిషా కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలుపోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ సపై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే షూటింగ్‌ని కూడా శరవేగంగా జరిపారు.చిరంజీవి ఎలాగైనా సంక్రాంతి బరిలో దిగుతారని అటు మెగా ఫ్యాన్స్, ఇటు సినిమా అభిమానులు అనుకున్నారు. కట్ చేస్తే... తనయుడు రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం తన ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేసుకున్నారు చిరంజీవి. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న రిలీజ్ చేశారు. ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘దిల్’ రాజుగారు అడగడంతో ‘విశ్వంభర’ సినిమా విడుదల వాయిదా వేశాం’ అంటూ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై ఇప్పటి వరకూ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే మే 9న ఈ సినిమా విడుదలకానుందనే వార్తలు గతంలో వినిపించాయి. కానీ వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతుండటంతో ఆ తేదీకి రిలీజ్ కాలేదు. కాగా జూలై 24న ‘విశ్వంభర’ థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం. చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ చిత్రం 2002 జూలై 24న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ పరంగానూ ఆ డేట్ కలిసొచ్చే అవకాశం ఉండటంతో చిత్రయూనిట్ జూలై 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఏదిఏమైనా కొత్త విడుదల తేదీపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి ఉండక తప్పదు. రాజా సాబ్ వచ్చేదెప్పుడు?రాజా సాబ్ రాక కోసం అటు ప్రభాస్ అభిమానులు ఇటు సగటు సినిమా ప్రేమికులు వేచి చూస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు.అది కూడా ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. అయితే ఆ తేదీకి రిలీజ్ వాయిదా పడినప్పటికీ కొత్త విడుదల ఎప్పుడు? అన్నది మాత్రం చిత్రబృందం ఇప్పటివరకూ ప్రకటించ లేదు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని టాక్.చారిత్రక యోధుడు వీరమల్లు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు వంటి వారు ఇతర ముఖ్య పాత్రలుపోషించారు. చారి్రతక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ నటించారు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రోడక్షన్స్ సపై ఎ.దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా, 2025లోనూ రెండు స్లారు రిలీజ్ వాయిదా పడింది.ఈ ఏడాది మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన యూనిట్.. ఆ తేదీకి వాయిదా వేసి, మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తేదీకి కూడా విడుదల కాలేదు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నందున మే 9 నుంచి జూన్ 12కి విడుదలను వాయిదా వేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈసారి ఎలాగైనా ఈ తేదీకే రిలీజ్ చేసేందుకు ప్రమోషన్స్‌ని కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.మాస్ ఎంటర్టైనర్వెండితెరపై తనదైన శైలిలో మాస్ జాతరని ప్రేక్షకులకు చూపించనున్నారు రవితేజ. అయితే ఆ సమయం ఎప్పుడు? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. (మనదే ఇదంతా అనేది ట్యాగ్‌లైన్). భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గత ఏడాది దీపావళి సందర్భంగా ‘మాస్ జాతర’ అనే టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు 2025 మే 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. అయితే ఈ నెల 9న విడుదల కాలేదు.రిలీజ్‌ని వాయిదా వేసిన చిత్రబృందం కొత్త విడుదల తేదీని మాత్రం ప్రకటించ లేదు. దీంతో రవితేజ అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్‌పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో రవితేజ భుజానికి గాయం కావడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఈ కారణంగా చిత్రీకరణ ఆలస్యం అయింది. అయితే మేజర్ టాకీ పార్ట్ పూర్తయిందని, కేవలం పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ శ్రీలీల కూడా ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరక పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు టాక్. అయితే జూలైలో ‘మాస్ జాతర’ని రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల జరిగిన ఓ ప్రెస్మీట్లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చె΄్పారు. ఆయన విడుదల తేదీ ప్రకటించనప్పటికీ జూలై 18న రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. భక్తి పరవశంవిష్ణు మంచు హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మంచు మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్‌కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర కీలక పాత్రలుపోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు మేకర్స్.అయితే వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం వల్ల రిలీజ్‌ని జూన్ 27కి వాయిదా వేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త రిలీజ్ డేట్‌కి సంబంధించినపోస్టర్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా విడుదల చేయించింది యూనిట్. మహాశివుడికి వీర భక్తుడైన కన్నప్ప కథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ద్వారా మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా, తనయుడు అవ్రామ్ భక్త వెండితెరపై ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగానే కాదు.. అమెరికాలోనూ విస్తృతంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మంచు విష్ణు అండ్ టీమ్. పీరియాడికల్ నేపథ్యంలో... విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న పీరియాడికల్ చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.ఈ సినిమాను తొలుత ఈ ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఆ తేదీకి విడుదల కాలేదు. ఆ తర్వాత మే 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ డేట్ కూడా జూలై 4కి వాయిదా పడింది. ‘‘కింగ్డమ్’ని ముందుగా అనుకున్నట్టు మే 30న రిలీజ్ చేయాలని ఎంతగానో ప్రయత్నించాం. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు (ఆపరేషన్ సిందూర్) జరిగాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్స్ స, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, వాయిదా నిర్ణయం తీసుకున్నాం. సినిమా కాస్త ఆలస్యంగా వచ్చినా అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’ ఏ టైటిల్ పెట్టాలి? అన్నది తొలి భాగం ఫలితం తర్వాత నిర్ణయిస్తాం’’ అని ఆయన తెలిపారు. అక్కా తమ్ముడి అనుబంధం నితిన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కథానాయికలుగా నటించారు. నటి లయ కీలక పాత్ర చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహా శివరాత్రి సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించారు. అయితే ఆ తేదీకి వాయిదా పడిన ఈ సినిమాని జూలై 4న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్రయూనిట్. అక్క– తమ్ముడు అనుబంధాలతో అల్లుకున్న కథతో రూపొందిన ఈ చిత్రంలో నితిన్ అక్క పాత్రలో లయ కనిపించనున్నారు. ఇందులో క్రీడా నేపథ్య అంశాలు కూడా ఉంటాయని, ఆర్చరీ ఆటగాడిగా నితిన్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.నితిన్, ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్లో ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సలో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ‘తమ్ముడు’ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ వాయిదా పడి, చివరికి జూలై 4కి రాబోతోంది. అదే తేదీకి విడుదలకు సిద్ధమైన నితిన్ ‘తమ్ముడు’ మరోసారి వాయిదా పడుతుందా? లేక విడుదలవుతుందా? అనేది వేచి చూడాల్సిందే. పై సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు జరిగాయి.. మరికొన్ని జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
గురి తప్పని విజయం... భళా ముఖేశ్!
వెంట్రుక వాసిలో పతకాలు చేజారిపోయే పిస్టల్ షూటింగ్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ గుంటూరుకు చెందిన ముఖేశ్ నేలపల్లి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. జూనియర్ పిస్టల్ షూటింగ్లో పతకాలతో భవిష్యత్ తారగా ఎదిగాడు.... గత ఏడాది పెరూలో జరిగిన వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మొత్తం 5 బంగారు, 2 కాంస్య పతకాలు సాధించి ముఖేశ్ రికార్డు సృష్టించాడు. ఈ నెల 17 నుంచి 26 వరకు జర్మనీలోని సుహుల్లో జరగనున్న జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీలకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో ముఖేశ్ సాధన చేస్తున్నాడు. 11 ఏళ్ల వయస్సులో స్కూల్ నిర్వహించిన వేసవి శిబిరంలో బాస్కెట్‌బాల్ సాధన కోసం ముఖేశ్ చేరాడు. కోచ్ సూచనతో అనుకోని విధంగా పిస్టల్ షూటింగ్ శిక్షణలో అన్న హితేశ్‌తో కలిసి సాధన ప్రారంభించాడు. కొద్ది రోజులకే ముఖేశ్ పతకాలు సాధించడంతో తండ్రి శ్రీనివాసరావు 2018లో స్థానికంగా అందుబాటులో ఉన్న అంతర్జాతీయ కోచ్, ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ చీఫ్ కోచ్ నగిశెట్టి సుబ్రమణ్యం దగ్గర శిక్షణలో చేర్పించారు. తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు ముఖేశ్పుణేకు మకాం మార్చాడు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ పుణేలో నిర్వహిస్తున్న ‘గన్ ఫర్ గ్లోరీ’ షూటింగ్ అకాడమీలో చేరాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్‌లో విభాగాలలో ముఖేశ్ నిలకడగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో 80కుపైగా పతకాలు సాధించిన ముఖేష్ భారత రైఫిల్ షూటింగ్ శిబిరానికి ఎంపికయ్యాడు.ఒలింపిక్స్ లక్ష్యంభారత జట్టు తరపున సీనియర్ విభాగంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం. జర్మనీలో జరగనున్న పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో పోటీపడుతున్నాను. పతకాలతో తిరిగి వస్తానని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. – ముఖేశ్– మురమళ్ళశ్రీనివాసరావు, సాక్షి స్పోర్ట్స్, గుంటూరు -
ఈ తీపి గుర్తులు మరిచిపోలేను.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
-
వేసవొచ్చింది... సెలవులు తెచ్చింది
వేసవి వచ్చిందంటే చాలు... స్కూల్స్, కాలేజీలు క్లోజ్ అవుతాయి. స్టూడెంట్స్‌కు సెలవులొచ్చేస్తాయి. అలాగే ప్రతి ఏడాది సినిమా స్కూల్స్‌కు కూడా వేసవి సెలవులు వస్తుంటాయి. ఈ సెలవుల్లో మెజారిటీ స్టార్ హీరోలు షూటింగ్ నుంచి బ్రేక్స్ తీసుకుంటుంటారు. అలా ఈ ఏడాది షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన కొందరు తెలుగు హీరోలపై ఓ లుక్ వేయండి.లండన్‌లో ల్యాండ్ నిన్న మొన్నటివరకు ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవలే లండన్‌లో ల్యాండ్ అయ్యారు. ఆయన తనయుడు, హీరో– నిర్మాత రామ్‌చరణ్ మైనపు విగ్రహం లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం కోసం చిరంజీవి ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు చిరంజీవి. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిసింది.ఈ మూవీలో నయనతార, కేథరీన్ హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. సాహు గార పాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘విశ్వంభర’ సినిమాకు చిన్న పాటి ΄్యాచ్ వర్క్, ఓ స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయట. వీలు చూసుకుని, ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టే ఆలోచనలో ఉన్నారు చిరంజీవి. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా, యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, విక్రమ్, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషా, ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తారు. ఇక ‘విశ్వంభర’ సినిమా కొత్త విడుదల తేదీపై అతి త్వరలోనే ఓ స్పష్టత రానుంది.ఓవర్ టు ఓజీ కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉంటూ, సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న పవన్ కల్యాణ్ ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇది. దీంతో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ కల్యాణ్ వంతు షూటింగ్ పూర్తయింది. జాగర్లమూడి రాధాకృష్ణ, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ నిర్మించారు. అయితే ఈ సినిమాను తొలుత మే 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ...పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాని నేపథ్యంలో రిలీజ్‌ను వాయిదా వేశారని, అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుందని తెలిసింది. రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల కానుంది.తొలి భాగంగా ‘హరిహర వీరమల్లు: స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ విడుదలవుతుంది. ఇలా ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ పూర్తి కావడంతో, ఇక పవన్ ఫోకస్ అంతా ‘ఓజీ’ సినిమాపైనే. అయితే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన పవన్ కల్యాణ్ షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చారు. అతి త్వరలోనే ఆయన ‘ఓజీ’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, బాబీ డియోల్, నాజర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తారు.ఫారిన్ వెకేషన్ ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్తుంటారు హీరో మహేశ్‌బాబు. అయితే ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు సినిమాప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబుకు ఈ ఏడాది ఫారిన్ హాలిడే బ్రేక్ దొరక్కపోవచ్చని కొందరు అనుకున్నారు. కానీ మహేశ్‌బాబుకు ఆ అవకాశం లభించింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా లాంగ్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత ఫారిన్ ఫ్లైట్ ఎక్కారు మహేశ్‌బాబు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి యూఎస్‌లో ఉన్నారని సమాచారం.ఇంకా రెండు వారాలు మహేశ్‌బాబు అక్కడే ఉంటారట. వచ్చిన తర్వాత రాజమౌళి సినిమా షూటింగ్‌ను మళ్లీ షురూ చేస్తారు. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2027 వేసవిలో ఈ చిత్రం విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది.ఇటలీలో... ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో కొన్ని రోజులు క్రితం బిజీ బిజీగా గడి పారు ప్రభాస్. దాంతో ఈ సినిమా చిత్రీకరణలకు బ్రేక్ ఇచ్చి, ఇటీవల ఫారిన్ వెళ్లారు ప్రభాస్. దాదాపు ఇరవై రోజుల నుంచి ప్రభాస్ ఇటలీలోనే ఉంటున్నారని తెలిసింది. అతి త్వరలోనే ప్రభాస్ ఇండియాకు తిరిగి రానున్నారు. వచ్చిన తర్వాత ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలనుప్రారంభిస్తారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరో నటి రిద్దీ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘ఫౌజి’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026లో ‘ఫౌజి’ సినిమా విడుదల కానుంది.లండన్‌లో... లండన్ వెళ్లారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే హై ఓల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ చిత్రకరణ కర్ణాటకలో జరిగింది. ఎన్టీఆర్ పాల్గొనగా, యాక్షన్ సీక్వెన్స్‌లు, కొంత టాకీ పార్టును చిత్రీకరించారు ప్రశాంత్ నీల్. కాగా ఈ కర్ణాటక షూటింగ్ షెడ్యూల్ తర్వాత ఎన్టీఆర్ లండన్ వెళ్లారని తెలిసింది. లండన్‌లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్క్రీనింగ్ జరగనుందని తెలిసింది. అలాగే ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కాన్సెర్ట్ కూడా ఉంది.ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ లండన్ వెళ్తున్నారని తెలిసింది. ఈ వేడుకలో ‘ఆర్ఆర్ఆర్’లో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఈ చిత్రదర్శకుడు రాజమౌళిలతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌లోని మరికొందరు పాల్గొంటారట. తిరిగొచ్చిన తర్వాత మళ్లీ ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు ఎన్టీఆర్. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డ్రాగన్’ సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.విదేశాల్లో వెరీ బిజీ ‘పెద్ది’ సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి, లండన్ వెళ్లారు రామ్‌చరణ్. లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ, ‘ఆర్ఆర్ఆర్’ వేడుకల్లో పాల్గొనేందుకు రామ్‌చరణ్ ఆల్రెడీ లండన్‌లోనే ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలతో ప్రస్తుతం రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో ఆరంభిస్తారు రామ్‌చరణ్. బుచ్చిబాబు దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు, శివ రాజ్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు హీరోలు ఈ వేసవికి షూటింగ్ బ్రేక్స్ ఇచ్చారు.– ముసిమి శివాంజనేయులువేసవి తర్వాతే... ఈ వేసవికి కొందరు హీరోలు షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వగా, ఈ వేసవి తర్వాతనే కొత్త సినిమా షూటింగ్లనుప్రారంభించాలని మరి కొందరు హీరోలు ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ నెక్ట్స్ సినిమాపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. వెంకటేశ్ కూడా చాలా కథలు వింటున్నారు. కాగా వెంకటేశ్ నెక్ట్స్ మూవీ దర్శకుడు త్రివిక్రమ్‌తో ఉంటుందని, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారని, వేసవి తర్వాత అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. ఇక మరో సీనియర్ హీరో నాగార్జున సోలో హీరోగా కొత్త సినిమాపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. అయితే తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ చెప్పిన ఓ కథ నాగార్జునకు నచ్చిందని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. వేసవి తర్వాతనే ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలని నాగార్జున భావిస్తున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి తర్వాతే ఈ సినిమా చిత్రీకరణనుప్రారంభించాలని అట్లీ అండ్ టీమ్ ప్లాన్ చేసిందట. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇలా మరికొంతమంది తెలుగు హీరోలు ఈ వేసవి సెలవుల తర్వాత తమ కొత్త సినిమాల సెట్స్‌లోకి అడుగుపెట్ట నున్నారని తెలిసింది. -
పహల్గాం ఉగ్రదాడి ప్రాంతంలో షూటింగ్స్ జరుకున్న చిత్రాలివే
-
ఒడిశాలో షూటింగ్ పై వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి
-
ఇలాంటి ప్రాంతాలను రక్షించుకోవడం మన బాధ్యత: ఎస్ఎస్ రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 మూవీతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ పర్వత ప్రాంతాల్లో జరిగింది. అక్కడ మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్యాకప్ చెప్పేసింది. దీంతో మూవీ టీమ్ అంతా తమ లోకేషన్ నుంచి తిరుగుపయనమయ్యారు. ప్రియాంక చోప్రా తాను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా తీసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.తాజాగా ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీ షూటింగ్ లోకేషన్ సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒడిశాలోని అత్యంత ఎత్తైన, అద్భుతమైన శిఖరం డియోమాలికి ట్రెక్కింగ్ చేసినట్లు వెల్లడించారు. పైనుంచి చూస్తే అత్యంత ఉల్లాసభరితంగా అనిపించిందని ట్విటర్లో పోస్ట్ చేశారు.అయితే ఆ పర్వతంపై పర్యాటకులు చెత్త చెదారం అలాగే ఉంచడం చూసి నిరుత్సాహానికి గురైనట్లు తెలిపారు. ఇటువంటి సహజమైన అద్భుతమైన ప్రాంతాలను ఎంతో బాగా చూసోకోవాలి.. ఒక ఒక్కరూ పౌరుడు బాధ్యతగా తీసుకుంటే చాలా పెద్ద మార్పు వస్తుంది... ప్రతి సందర్శకుడు ఇలాంటి ఆహ్లాదకరమైన స్థలాలను రక్షించడంలో సహాయపడటానికి మీ వ్యర్థాలను తిరిగి మీరే తీసుకువెళ్లాలని రాజమౌళి సూచించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Had an amazing solo trek to Deomali, Odisha’s highest and most stunning peak. The view from the top was absolutely breathtaking.However, it was disheartening to see the trail marred by litter. Such pristine wonders deserve better. A little civic sense can make a huge… pic.twitter.com/8xVBxVqQvc— rajamouli ss (@ssrajamouli) March 19, 2025 -
నిర్మాతగా సమంత తొలి సినిమా.. ఫోటోలు షేర్ చేసిన సామ్
-
SSMB 29 మూవీ మేకింగ్ సీన్స్.. వీడియో వైరల్
-
పార్లమెంట్‌కు రామ్ చరణ్.. ఎందుకంటే?
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం ఆర్సీ16. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే సెట్లోని ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు చెర్రీ. తన కూతురు క్లీంకారతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్సీ16 మూవీ షూటింగ్ షెడ్యూల్ మైసూరులో జరుగుతోన్న సంగతి తెలిసిందే.మైసూరు షెడ్యూల్లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ దాదాపుగా ముగిసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్ మూవీ టీమ్ ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం. ఢిల్లీలోని పార్లమెంట్లో మరిన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుడా జామా మసీదు ప్రాంతంలోనూ షూట్ చేయనున్నారని టాక్. షూటింగ్ అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. మార్చి 4న పార్లమెంట్లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
జాతీయ కోచ్‌గా భారత దిగ్గజ షూటర్
భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా తిరిగి కోచ్‌గా జాతీయ షూటింగ్ జట్టుతో చేరాడు. భారత జాతీయ రైఫిల్ సమాఖ్య (ఎన్ఆర్ఏఐ).. జస్పాల్ రాణాను 25 మీటర్ల పిస్టల్ విభాగానికి ‘హై పెర్ఫార్మెన్స్’ కోచ్‌గా నియమించింది. అతడితో పాటు మాజీ ఆటగాడు జీతు రాయ్‌ను కూడా కోచింగ్ బృందంలో భాగం చేసింది.జీతూ ఆటగాడిగా ఆసియా క్రీడల్లో రెండు, కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు గెలవడంతో పాటు ఆరు వరల్డ్ కప్ పతకాలు సాధించింది. అతని ఖాతాలో వరల్డ్ చాంపియన్íÙప్ రజతం కూడా ఉంది. తొలి సారి అతను కోచ్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్ శిక్షణ ఇవ్వనున్నాడు.రైఫిల్ విభాగానికి హెడ్ కోచ్‌గా ఇటీవల ద్రోణాచార్య అవార్డు దక్కించుకున్న దీపాలీ దేశ్‌పాండేను ఎంపిక చేసింది. మొత్తంగా ఎన్ఆర్ఏఐ 16 మంది కొత్త కోచ్‌లను ఎంపిక చేసింది. వీరితో పాటు ఇప్పటికే ఉన్న 19 మందిని కూడా కొనసాగించనున్నారు.పిస్టల్ విభాగంలో జీతు యువ షూటర్లకు శిక్షణ ఇవ్వనుండగా... 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌కు పూజ ఘట్కర్, 25 మీటర్ల పిస్టల్ విభాగానికి పెంబా తమాంగ్, స్కీట్కు అమరిందర్ చీమ, ట్రాప్‌కు వర్ష తోమర్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. ఇద్దరు హై పెర్ఫార్మెన్స్ మేనేజర్లుగా మాన్షేర్ సింగ్, రోనక్ పండిట్‌ను ఎన్ఆర్ఏఐ నియమించింది. రాణాతో పాటు డీఎస్ చండేల్ (ఎయిర్ రైఫిల్), అన్వర్ సుల్తాన్ (ట్రాప్), మనోజ్ కుమార్ (50 మీటర్ల రైఫిల్) హై పెర్ఫార్మెన్స్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. -
కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్?
యూపీలో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా పలువురి తలరాతలను మార్చేసింది. అటువంటి వారిలో మోనాలిసా ఒకరు. కుంభమేళాకు పూసల దండలు విక్రయించేందుకు వచ్చిన ఆమె రాత్రికిరాత్రే ఎంతో ఫేమస్ అయిపోయింది. జనం ఆమెను చూసేందుకు గుమిగూడుతుండటంతో ఆమె తండ్రి మోనాలిసాను మధ్యప్రదేశ్‌లోని తమ ఇంటికి తిరిగి పంపించేశాడు. అయితే అక్కడకు కూడా ఆమె అభిమానులు తరలివస్తున్నారు.కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా నటిస్తున్న తొలిచిత్రం షూటింగ్ ఫిబ్రవరి 12న ఢిల్లీలోని ఇండియాగేట్ దగ్గర ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. అయితే షూటింగ్ తేదీ విషయమై ఇంకా నిర్థారణ కాలేదని సమాచారం. ఇదిలావుండగా ఇంతలో ఆమెను ఒక ప్రముఖ జ్యూలయరీ కంపెనీ కలుసుకున్నదని, ఆమెను ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.మోనాలిసా నటిస్తున్న సినిమాకు చెందిన చిత్రబృందం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ జ్యూయలరీ కంపెనీ మోనాలిసాను సంప్రదించిందని, ఆమెతో వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. ఇందుకోసం వారు రూ.15 లక్షలకు కూడా ఇచ్చారని చిత్రబృందం పేర్కొంది. ఈ కంపెనీకి సంబంధించిన ప్రకటన షూటింగ్ ఫిబ్రవరి 14న మొదలుకానున్నదని, ఇందుకోసం మోనాలిసా కేరళ వెళ్లనున్నారని వివరించింది.ఇది కూడా చదవండి: Mahakumbh: మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి -
కందిపోయిన సుందరి
ఎండ తాకిడిని లెక్క చేయకుండా షూటింగ్లో పాల్గొంటున్నారు జాన్వీ కపూర్. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న హిందీ చిత్రం ‘పరమ్ సుందరి’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ కేరళలో ప్రారంభమైంది. సిద్ధార్థ్, జాన్వీలతోపాటు ప్రధాన తారాగణంపాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అయితే అక్కడి లొకేషన్స్‌లో తీవ్రమైన ఎండ ప్రభావం కారణంగా తన చర్మం కందిపోయినట్లుగా సోషల్ మీడియాలో ‘బర్ట్ట్న్’ అంటూ ఓ ఫొటోను షేర్ చేశారు జాన్వీ కపూర్. ఈ ఫోటోను బట్టి ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ తీవ్రమైన ఎండ వేడిమిని కూడా తట్టుకుంటూ షూటింగ్లోపాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మా సుందరి కందిపోయిందన్నట్లుగా కొందరు నెటిజన్లు, ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నార్త్ అబ్బాయి పరమ్గా సిద్ధార్థ్ మల్హోత్రా, సౌత్ అమ్మాయి సుందరిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది. -
‘మోనాలిసా’ ఫొటోషూట్..ఆశ్చర్యపోతున్న ఫొటోగ్రాఫర్
కోల్‌కతా:మహాకుంభమేళాలో పాపులర్ అయిన తేనేకళ్ల మోనాలిసా గురించి ఆసక్తికర విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల క్రితం 2022లో మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ అహిళ్యాదేవికోటలో పరికర్మ అనే సినిమా చిత్రీకరిస్తున్నపుడు ఆ షూటింగ్ చూసేందుకు మోనాలిసా వచ్చింది. ఆకట్టుకునే కళ్లతో పాటు విలక్షణమైన మోనాలిసా ముఖ కవలికలు ఆ సినిమా యూనిట్‌ను ఆకట్టుకున్నాయి. ఆ సినిమాకు పనిచేసిన ఫొటోగ్రాఫర్ సంజీత్ చౌదరి మోనాలిసాను చూశారు. ఆమెలోని కట్టిపడేసే ఆకర్షణకు ముగ్ధులయ్యారు. వెంటనే మోనాలిసాతో ఫొటో సెషన్ చేయాలని డిసైడయ్యారు. ఫొటోలు తీసకునేందుకు మోనాలిసాను ఒప్పించారు. ఇంకేముంది షూటింగ్ భోజన విరామ సమయంలో మోనాలిసా ఫోజులను తన కెమెరాలో బంధించారు. సినిమా షూటింగ్ పూర్తయి కోల్‌కతాకు వచ్చిన వెంటనే మోనాలిసా ఫొటోలను సంజీత్ సోషల్‌మీడియాలో కూడా పోస్టు చేశారు.అయితే ప్రస్తుతం కుంభమేళాలో పూసలమ్ముకునేందకు వెళ్లిన మోనాలిసా ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసి ఫొటోగ్రాఫర్ సంజీత్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.మోనాలిసా రూపం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుందని ఫొటోగ్రాఫర్ అన్నారు.కాగా, కుంభేళాలో వచ్చిన పాపులారిటీతో తాజాగా మోనాలిసాకు ఏకంగా బాలీవుడ్లో మూవీ ఆఫర్ కూడా వరించింది. ప్రముఖ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో తెరకెక్కించనున్న సినిమాలో మోనాలిసా కనిపించనుంది.అయితే మోనాలిసాకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.సినిమాలో నటించడం కోసం మేకప్ వేసుకుని వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూస్తే మోనాలిసా ప్రస్తుతం ముంబయిలో ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్గా మోనాలిసా మేకోవర్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఏదేమైనా కుంభమేళా మోనాలిసా ఫేట్‌ను మార్చేసి బాలీవుడ్లో సినిమా ఆఫర్ వచ్చేలా చేసింది. -
ఎముకలు కొరికే చలిలో షూటింగ్.. పట్టువదలని విక్రమార్కుడిలా స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి(Vidaamuyarchi Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించగా.. త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించింది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లోనూ రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు.అయితే ఈ మూవీని అజర్ బైజాన్ అనే దేశంలో చిత్రీకరించారు. ఇందులో కారుతో అజిత్ కుమార్ కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేశారు. ఆ సమయంలో ఓసారి అజిత్ నడుపుతున్న కారు అదుపుతప్పి కిందపడిపోయింది. అజిత్ కుమార్‌కు కారు రేసింగ్‌తో రియల్ స్టంట్స్ చేయడమంటే సరదా. అలా సినిమాల్లోనూ డూప్ లేకుండానే రియల్‌గా కొన్ని సీన్స్ చేస్తుంటారు.తాజాగా విదాముయార్చి ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. విదాముయార్చి షూటింగ్ సమయంలో ఎదురైన పరిస్థితులను వీడియో రూపంలో ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇందులో అజిత్ కుమార్ స్టంట్స్‌తో పాటు.. ఎముకలు కొరికే చలిలోనూ షూటింగ్ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాతావరణం అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ ఈ మూవీని షూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో మీరు కూడా చూసేయండి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.The toughest challenges forge the greatest triumphs! 🔥 Step behind the scenes of VIDAAMUYARCHI 💪 Pushing limits in the harshest terrains. ⛰️🔗 https://t.co/WPFLwCykLRFEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar… pic.twitter.com/haDfk8fono— Lyca Productions (@LycaProductions) February 3, 2025 -
HYD: గచ్చిబౌలిలో కాల్పుల కలకలం
సాక్షి,హైదరాబాద్: నగరంలో ఐటీకి పేరుగాంచిన గచ్చిబౌలిలో శనివారం సాయంత్రం (ఫిబ్రవరి1) కాల్పలు కలకలం రేపాయి. ఇక్కడున్న ఒక పబ్‌కు వెళ్లిన పాత నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా సమాచారంతో పబ్‌కు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నేరస్తుడు తన వద్దనున్న తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. మొత్తం రెండు రౌండ్లు పాత నేరస్తుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పబ్‌లో పనిచేసే బౌన్సర్‌కు, కానిస్టేబుల్ వెంకట్రామ్‌రెడ్డికి గాయాలయ్యాయి. అయితే చివరకు ఆ పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నేరస్తుడు పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
డాకు మహారాజ్లో ప్రగ్యా జైస్వాల్ షూటింగ్ స్టిల్స్ (ఫోటోలు)
-
యువకుడిపై దాడి.. చిక్కుల్లో కాంతార మూవీ టీమ్..!
కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు.. దేశవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రిషబ్ శెట్టి ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. కాంతారకు ముందు ఏం జరిగిందనే కథాశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ టీమ్ చిక్కుల్లో పడింది. ఈ సినిమా షూటింగ్ వల్ల అటవీ ప్రాంతం నాశనం అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని గవిగుడ్డ అటవీ ప్రాంతంలో కాంతారా చాప్టర్-1 చిత్రీకరణ జరుగుతోంది. దీంతో స్థానికులతో పాటు జిల్లా పంచాయతీ మాజీ సభ్యులు ఆందోళనకు దిగారు. అడవుల్లో పేలుడు పదార్థాల వినియోగిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో గవిగుడ్డ, హేరురు గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో రహస్యంగా చిత్రీకరణ చేయడంపై స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గడ్డి మైదానంలో చిత్రీకరణకు అనుమతి తీసుకుని.. అటవీ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.స్థానిక నేతల సీరియస్సినిమా చిత్రీకరణ వల్ల జంతువులు, పక్షులకు హాని కలుగుతోందని జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు సన్న స్వామి ఆరోపించారు. ఇప్పటికే అడవి ఏనుగుల దాడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అడవులను రక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.చిత్రబృందంతో వాగ్వాదం..అడవుల్లో పేలుడు పదార్ధాల వినియోగంపై స్థానికులు చిత్ర బృందం సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవలో స్థానికుడైన హరీష్ అనే యువకుడిపై సిబ్బంది దాడి చేయగా గాయాలైనట్లు సమాచారం. అతన్ని వెంటనే సమీపంలోని సకలేష్‌పూర్‌లోని క్రాఫోర్డ్ ఆసుపత్రిలో చేర్పించారు.ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంతార మూవీ చిత్రీకరణను వేరే ప్రదేశానికి మార్చాలని.. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా యెసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.కాగా.. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతారా: చాప్టర్ 1 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని కేజీఎఫ్ మేకర్స్, హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. 2022లో వచ్చిన కాంతార అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. -
అమెరికాలో కాల్పులు..హైదరాబాద్ యువకుడి దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన కొయ్యడ రవితేజ కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు.రవితేజ మరణవార్త విని చైతన్యపురి ఆర్కేపురం డివిజన్లో నివసిస్తున్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజ 2022లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాణ్వేషణలో ఉన్నారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఒక్కసారి కనబడు బిడ్డా -
ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ ఇంట తీవ్ర విషాదం
పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ (జనవరి 19) ఉదయం మనూ బాకర్ అమ్మమ్మ, మామ రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెందారు. హర్యానాలోని చర్కీ దాద్రిలో గల మహేంద్రఘర్ బైపాస్ రోడ్డులో ఈ ఘటన సంభవించింది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్తున్న మనూ బాకర్ అమ్మమ్మ, మామను బ్రీజా కారు ఢీకొంది. మానూ బాకర్ అమ్మమ్మ, మామ స్పాట్లోనే చనిపోయారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు.కాగా, మనూ బాకర్ రెండు రోజుల కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డు అందుకుంది. మనూ బాకర్ గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మనూ.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. పారిస్ ఒలింపిక్స్‌లో మనూ 10మీ ఎయిర్ పిస్తోల్, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీం (సరబ్జోత్ సింగ్‌తో కలిసి) ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించింది. -
ష్... ఎగ్జామ్ ప్రిపరేషన్..!
సినీరంగంలో రాణించాలనే లక్ష్యం ఉన్నంత మాత్రాన అకాడమిక్ జర్నీని నిర్లక్ష్యం చేయనక్కర్లేదు. అయితే రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం అనేది పెద్ద కళ. ఆ కళలో రాషా ఆరితేరింది.ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ(Rasha Thadani) ‘ఆజాద్’(Azzad) సినిమాతో బాలీవుడ్లో ఆరంగేట్రం చేయనుంది. ‘ఆజాద్’ సెట్స్‌కు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌లో సినిమా సెట్స్‌లో మేకప్‌లో ఉన్న రాషా 12వ తరగతి ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతూ కనిపిస్తుంది. జాగ్రఫీ పరీక్ష కోసం శ్రద్ధగా ప్రిపేరవుతున్న రాషా వీడియోను చూసి నెటిజెనులు ప్రశంసలు కురిపించారు. ‘ఎంతైనా చదువు చదువే. సినిమాల్లోనే కాదు అకడమిక్‌గా కూడా రాషా విజయం సాధించాలి’ అని ఆశీర్వదించారు. (చదవండి: కలల మేఘంపై అనూజ..) -
12 మందిని కాల్చి ఆపై ఆత్మహత్య
పొడ్గొరిక(మాంటెనెగ్రో): నూతన సంవత్సర సంబరాలు జరుగుతున్న వేళ మాంటెనెగ్రోలోని సెటింజె పట్టణంలో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. అకో మార్టినోవిక్(45) అనే వ్యక్తి ఉన్మాదిగా మారి బార్ యజమాని, అతడి ఇద్దరు పిల్లలతోపాటు సొంత కుటుంబ సభ్యులను సైతం పొట్టనబెట్టుకున్నాడు. స్థానిక బార్లో బుధవారం ఉదయం నుంచి మార్టినోవిక్ గడిపాడు. సాయంత్రం గొడవకు దిగి ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి తుపాకీ తీసుకుని బార్లోకి ప్రవేశించిన అతడు బార్‌లోని వారిపైకి కాల్పులకు దిగాడు. అనంతరం బయటకు వెళ్లి మరో మూడు చోట్ల కాల్పులు జరిపాడు. పోలీసులు వెంబడించడంతో అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొడ్గొరికకు వెళ్లాడు. పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకున్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. హింసా ప్రవృత్తి, చంచల స్వభావి అయిన మార్టినోవిక్పై గతంలో పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. యూరప్‌లోని చిన్న దేశం మాంటెనెగ్రో జనాభా 6.20 లక్షలు. ఆయుధాలను కలిగి ఉండటం ఇక్కడో సంప్రదాయం. తుపాకీ సంస్కృతి కారణంగా తరచూ నేరాలు జరుగుతుంటాయి. తాజా ఘటన జరిగిన సెటింజెలోనే 2022 ఆగస్ట్‌లో ఓ దుండగుడు ఇద్దరు చిన్నారులు సహా 10 మందిని కాల్చి చంపాడు. ఓ వ్యక్తి సకాలంలో అతడిని కాల్చి చంపడంతో మారణ హోమానికి పుల్‌స్టాప్ పడింది. -
వనితదే చరిత
చరిత్ర సృష్టించిన విజేతలు కాలం దారిలో వెలిగే దీపాలు అవుతారు. ఎంతోమందిని తమ బాటలో నడిపించే ఉత్తేజం అవుతారు. క్రీడల నుంచి సైన్యం వరకు వివిధ రంగాలలో 2024లో ‘శభాష్’ అనిపించుకోవడమే కాదు చరిత్ర సృష్టించారు మహిళలు...పవర్ఫుల్ బుల్లెట్హరియాణ లోని ఝుజ్జర్ జిల్లాకు చెందిన మను బాకర్ చిన్న వయసులోనే వివిధ ఆటల్లో అద్భుత ప్రతిభాసామర్థ్యాలు చూపింది. షూటింగ్‌లోకి అడుగు పెట్టడానికి ముందు మార్షల్ ఆర్ట్స్, టెన్నిస్, బాక్సింగ్, స్కేటింగ్లాంటి వివిధ విభాగాలలో రాణించింది. ‘షూటింగ్’లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను బాకర్ చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత షూటర్ల వరుసలో చేరింది. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో తన అద్భుతమైన ప్రదర్శనతో కాంస్య పతకం సాధించి దేశం మొత్తం గర్వపడేలా చేసింది. మిక్స్డ్ టీమ్ విభాగంలో సరబ్జోత్ సింగ్‌తో కలిసి మన దేశానికి మరో కాంస్య పతకాన్ని సాధించింది. స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.పట్టుదల ఉంటే ప్రతికూలతలు పారిపోతాయిప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా సరే... దృఢ సంకల్పం, నిబద్ధత ఉంటే తిరుగులేని విజయాలు సాధించవచ్చని నిరూపించింది రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అవని లేఖర. 2012లో రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. నిరాశ నిండిన ఆ చీకటిలో అవని విల్‌పవర్ కోల్పోయి ఉంటే విజయాలు సాధించి ఉండేది కాదు. స్తబ్దత నుంచి బయటపడడానికి తండ్రి సలహాతో క్రీడల వైపు వచ్చింది. పారిస్‌లో జరిగిన 2024 పారాలింపిక్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్–1 విభాగంలో స్వర్ణపతకం గెల్చుకొని మన దేశంలోని ప్రసిద్ధ పారాలింపియన్లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. టోక్యో పారాలింపిక్స్‌లో తొలిసారి స్వర్ణం గెలుచుకున్న అవని రెండోస్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.స్ఫూర్తినిచ్చే తేజంభారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ యుద్ధవిమానాన్ని నడిపిన తొలి మహిళా ఫైటర్‌పైలట్‌గా స్క్వాడ్రన్ లీడర్ మోహనా సింగ్ చరిత్ర సృష్టించింది. జోద్‌పూర్‌లో జరిగిన ‘తరంగ్ శక్తి’ సైనిక విన్యాసాల్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. సాయుధ దళాలలో జెండర్ బ్యారియర్స్‌ను విచ్ఛిన్నం చేసిన అద్భుతం అది.రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్‌లో సైనిక కుటుంబంలో పుట్టిన మోహనాసింగ్కు ఫైటర్ పైలట్ కావాలని కోరిక. భారత వైమానిక దళం ఫైటర్ పైలట్ ్రపోగ్రామ్(2016)లో అవనీచతుర్వేది, భావనా కాంత్‌తో కలిసి చేరిన మొదటి మహిళల్లో మోహన ఒకరు. ఐఏఎఫ్ హాక్ ఎంకే.132 అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్లలో పూర్తిస్థాయి ఆపరేషన్ స్టేటస్ సాధించిన తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా రికార్డ్ సృష్టించింది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ కాంబాట్ మోడ్స్లోప్రావీణ్యం సాధించింది. -
Manu Bhaker: నేను చేసిన తప్పు అదే.. అందుకే ఇలా!
తన కూతురిని ‘షూటర్’గా తీర్చిదిద్ది తప్పుచేశామంటూ మనూ భాకర్(Manu Bhaker) తండ్రి రామ్ కిషన్ భాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను క్రికెటర్‌ను చేసి ఉంటే ఇలాంటి దుస్థితి ఎదురయ్యేది కాదని పేర్కొన్నారు. ఒకే ఒలింపిక్ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించినా సరైన గుర్తింపు దక్కడం లేదని వాపోయారు.కాగా భారత ప్రభుత్వం ప్రదానం చేసే క్రీడా అత్యుతన్నత పురస్కారం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న’(Major Dhyan Chand Khel Ratna). ఇందుకు సంబంధించిన అవార్డు కమిటీ సోమవారం నామినీల పేర్లను ప్రకటించగా.. అందులో మనూ భాకర్‌కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనైన మనూ తండ్రి రామ్ కిషన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.నా బిడ్డ ఇంకేం చేయాలి?‘‘ఇప్పటి వరకు భారత్ తరఫున ఎవరూ సాధించని ఘనత నా కూతురు సాధించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇంతకంటే దేశం కోసం నా బిడ్డ ఇంకేం చేయాలి? ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించాలి కదా!.పతకాలు గెలవకుంటేనే బాగుండేదిఈ విషయం గురించి నేను మనూతో మాట్లాడాను. తన మనసంతా బాధతో నిండి ఉంది. ‘నేనసలు దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించకపోయి ఉంటే.. ఈ బాధ ఉండేదే కాదు. అసలు క్రీడాకారిణిని కాకపోయే ఉంటే ఇంకా బాగుండేది’ అని తను నాతో అన్నది’’ అని రామ్ కిషన్ భాకర్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తమ ఆవేదనను పంచుకున్నారు.బాహ్య శక్తుల ప్రభావం ఉంది!ఇక దేశానికి ఇంత గొప్ప పేరు తెచ్చినా గుర్తింపు దక్కకపోవడం చూస్తుంటే.. కమిటీపై బాహ్య శక్తుల ప్రభావం లేదంటే నమ్మబుద్ధి కావడం లేదని రామ్ కిషన్ భాకర్ అనుమానం వ్యక్తం చేశారు. తన కుమార్తె విషయంలో ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.కాగా హర్యానాకు చెందిన రామ్ కిషన్ భాకర్ మర్చెంట్ నేవీ చీఫ్ ఇంజనీర్. ఇదిలా ఉంటే.. టోక్యో ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్న మనూ భాకర్.. ప్యారిస్ ఒలింపిక్స్-2024(Paris Olympics 2024)లో రెండు మెడల్స్ గెలిచింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో కాంస్యాలు కైవసం చేసుకుంది. తద్వారా స్వాతంత్ర్యం తర్వాత భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన మొట్టమొదటి ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించింది.చదవండి: BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్? -
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. హైదరాబాద్‌లో షూటింగ్!
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘శంబాల. ఈ మూవీ హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఈ సినిమాకు'ఏ' యాడ్ ఇన్ఫినిటిమ్ ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటించనున్నారు.ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఈ మూవీలో శ్వాసిక కీలక పాత్ర పోషిస్తుండగా.. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను చిత్రయూనిట్ ప్రకటించనుంది. -
ది రాజాసాబ్ ఆన్ ట్రాక్.. రూమర్స్‌పై స్పందించిన నిర్మాణ సంస్థ!
కల్కి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇటీవల బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మారుతి.. ప్రభాస్ సినిమా గురించి మాట్లాడారు. నా నవ్వు చూస్తే చాలు.. ది రాజాసాబ్ గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది రాజాసాబ్ విడుదల వాయిదా పడిందంటూ వార్తలొచ్చాయి. అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ మూవీ రానుందని.. అందువల్లే ది రాజాసాబ్ డేట్ మారినట్లు న్యూస్ వైరలైంది.డే అండ్ నైట్ జరుగుతోంది..తాజాగా ఈ వార్తలపై ది రాజాసాబ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందించింది. ది రాజాసాబ్ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని తెలిపింది. ఈ మూవీ షూటింగ్ డే అండ్ నైట్ షెడ్యూల్స్ నిరంతరాయంగా జరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది.అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ది రాజా సాబ్ టీజర్ విడుదల కానుందని మరికొన్ని ఊహాగానాలు వస్తున్నాయని తెలిసింది. ఇలాంటి వాటిని ఎవరూ కూడా నమ్మవద్దని కోరుతున్నట్లు టీమ్ వెల్లడించింది. ఈ మూవీకి సంబంధించి సరైన సమయంలో మేమే అప్డేట్స్ ఇస్తామని ట్విటర్ ద్వారా కోరింది నిర్మాణ సంస్థ. ఈ ప్రకటనతో ది రాజాసాబ్ చిత్రంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది.గాయం కావడం వల్లే రూమర్స్..'ది రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. #TheRajaSaab shooting is progressing rapidly with continuous day and night schedules. Nearly 80% of the shoot has been completed, and post production work is in full swingWe’ve noticed various speculations circulating about the teaser release during Christmas or New Year. We… pic.twitter.com/qJIX2AXxDh— People Media Factory (@peoplemediafcy) December 18, 2024 -
బాదల్‌పై కాల్పులు..కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ మీద కాల్పులు జరిగిన ఘటనపై కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాల్పులు జరిపిన నరేన్ సింగ్ చౌరా సిక్కు జాతి రత్నం అని కొనియాడారు. నరేన్‌కు న్యాయ సహాయం అందించాలని శిరోమణి గుర్ద్వారా ప్రబంధక్ కమిటీకి విజ్ఞప్తి చేశారు.నరేన్ కాల్పులు జరపడం వెనుక తన వ్యక్తిగత కారణాలేవీ లేవని, సిక్కుల మనోభావాలు దెబ్బతినడంపై ప్రతీకారం తీర్చుకున్నారన్నాడన్నారు. గతంలో అధికారంలో ఉన్నపుడు బాదల్ ప్రభుత్వం సిక్కులు పవిత్రంగా భావించే శ్రీ గురు గ్రాంత్ సాహిబ్‌ను అపవిత్రం చేయడమే కాకుండా స్వర్ణ దేవాలయం నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బాదల్ చేసిన తప్పుల ఫలితంగానే కాల్పులు జరిగాయని తెలిపారు. నరేన్ టార్గెట్ స్వర్ణ దేవాలయం, అకల్ తక్త్ సాహిబ్ కాదని కేవలం సుఖ్బీర్ సింగ్ బాదలేనని చెప్పారు. అయితే హింసకు పాల్పడడాన్ని మాత్రం ఖండిస్తున్నట్లు బిట్టు తెలపడం గమనార్హం. ఇదీ చదవండి: స్వర్ణ దేవాలయంలో కాల్పులు -
ఎనిమిది రాష్ట్రాలు.. నాలుగు దేశాలు.. 14 నెలల జర్నీ: మోహన్ లాల్
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ఎంపురన్ (లూసిఫర్-2). 2019లో విడుదలైన లూసిఫర్‌కు సీక్వెల్‌గా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మోహన్‌లాల్ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.మోహన్ లాల్ తన ట్వీట్లో రాస్తూ..' ఎంపురాన్ 14 నెలల అద్భుతమైన ప్రయాణం. ఎనిమిది రాష్ట్రాలతో పాటు యూఎస్, యూకే, యూఏఈ సహా దాదాపు నాలుగు దేశాల్లో పర్యటించాం. ప్రతి ఫ్రేమ్‌ని ఎలివేట్ చేసే సృజనాత్మకత, అద్భుతమైన దర్శకత్వం పృథ్వీరాజ్ సుకుమారన్ సొంతం. స్క్రీన్ ప్లేతో కథకు ప్రాణం పోసిన మురళీ గోపీకి ధన్యవాదాలు. మాపై నమ్మకం ఉంచి ఎంతోగానో సపోర్ట్ చేసిన సుభాస్కరన్, లైకా ప్రొడక్షన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక నటుడిగా నా ప్రయాణంలో ఎంపురాన్ ఒక గొప్ప అధ్యాయం. ఈ కథకు పనిచేసిన తారాగణం, సిబ్బంది లేకుండా ఇవేవీ సాధ్యం కాదు. మీ ప్రేమ, మద్దతు మాకు అడుగడుగునా స్ఫూర్తినిస్తాయి.' అని రాసుకొచ్చారు.కాగా.. లూసిఫర్ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్, మంజు వారియర్, టొవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూట్ ప్రారంభించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.That’s a wrap for L2: Empuraan!What an incredible 14-month journey across 8 states and 4 countries, including the UK, USA, and UAE.This film owes its magic to the brilliant direction of Prithviraj Sukumaran whose creativity elevates every frame. A big thank you to Murali Gopy… pic.twitter.com/6bnuItDlxd— Mohanlal (@Mohanlal) December 1, 2024 -
అమెరికాలో కాల్పులు.. ఖమ్మం యువకుడి మృతి
సాక్షి,ఖమ్మంజిల్లా: తెలంగాణకు చెందిన యువకుడిపై అమెరికాలో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు.సాయితేజ అమెరికాకు ఎమ్మెస్ చేయడానికి వెళ్లాడు. సాయితేజ మృతితో రామన్నపేటలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని ఖమ్మం తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు. -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం
ఉమాన్: జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పలువురు దుండగులు కాల్పులకు పాల్పడడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనంతరం దుండగులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ దుండగుడు మరణించగాముగ్గురు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది.కాల్పుల్లో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించామని,ఎంబసీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని అధికారులు తెలిపారు. ఎంబసీ సమీపంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ ప్రాంతంలో పలుమార్లు నిరసనలు జరిగాయని పోలీసులు తెలిపారు.2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లో చొరబడి వందల మంది ఇజ్రాయెల్ పౌరులను హత్య చేయడంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల్లో 44 వేల మంది గాజా వాసులు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా చెబుతోంది. కాగా మరోవైపు ఇజ్రాయెల్,లెబనాన్ మధ్య కాల్పుల విరమణ కోసం కొద్ది కాలంగా చర్చలు జరుగుతున్నాయి.ఇదీ చదవండి: భారత్‌లో ఓట్ల లెక్కింపుపై మస్క్ ఆసక్తికర ట్వీట్ -
షూటింగ్ సెట్లో ప్రమాదం.. స్టార్ నటుడికి గాయాలు!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న హంటర్ వెబ్ సిరీస్ సెట్స్‌లో గాయపడినట్లు సమాచారం. ఓ ఫైట్ సీక్వెన్స్ చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ సన్నివేశంలో ఒక చెక్క లాగ్ అనుకోకుండా ఆయన పక్కటెముకలకు తగిలిందని తెలిపారు. ఈ సంఘటనతో ముంబయిలో జరుగుతున్న షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే సునీల్ శెట్టికి వైద్యచికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని సునీల్ శెట్టి సైతం ట్విటర్ ద్వారా పంచుకున్నారు. నాకు చిన్న గాయం మాత్రమే తగిలిందని.. ప్రస్తుతం బాగానే ఉన్నానని పోస్ట్ చేశారు. దయచేసి ఎవరూ కూడా ఆందోళనకు గురికావద్దని అభిమానులను కోరారు. మీ అందరి ప్రేమ, అభిమానాలకు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు.కాగా.. హంటర్ వెబ్ సిరీస్‌ను ముంబయిలోని అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆయన పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఈషా డియోల్, బర్ఖా బిష్త్, కరణ్వీర్ శర్మ, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ తర్వాత వెల్కమ్ టు ది జంగిల్ అనే చిత్రంలో నటించనున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, దిశా పటానీ, సంజయ్ దత్లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.Minor injury, nothing serious! I'm absolutely fine and ready for the next shot. Grateful for all the love & care 🙏❤️ #OnSet— Suniel Shetty (@SunielVShetty) November 7, 2024 -
లక్కీ భాస్కర్‌తో 'మీనాక్షి చౌదరి' రొమాన్స్.. షూటింగ్ ఫోటోలు చూశారా..?
-
మైసూర్లో రామ్‌చరణ్,జాన్వీకపూర్ ప్రయాణం
హీరో రామ్‌చరణ్ ఓ వైపు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్సీ 16’(వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు ఈ నెలలో మైసూర్ వెళ్లనున్నారాయన. తొలి చిత్రం ‘ఉప్పెన’ తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ద్వితీయ చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేసే అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ‘ఆర్సీ 16’ ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన శివ రాజ్‌కుమార్ పవర్ఫుల్ రోల్ పోషించనున్నారు. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈ నెల 22 నుంచి కర్నాటక రాష్ట్రంలోని మైసూర్లో మొదలవుతుందని సమాచారం. రామ్ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారట బుచ్చిబాబు. అక్కడ నాన్‌స్టాప్‌గా 15 రోజుల పాటు షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
బొగ్గుగనిలో కాల్పులు..20 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని బొగ్గుగనిలో కాల్పులు కలకలం రేపాయి. డుకి జిల్లాలో ఉన్న ఓ బొగ్గుగనిలో కార్మికులపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గనిలో కార్మికుల షెల్టర్ వద్దకు దూసుకొచ్చిన దుండగులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో 20 మంది కార్మికులు మరణించగా మరికొందరు గాయపడ్డారు. కాల్పుల్లో మృతిచెందిన వారిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినవారిగా గుర్తించారు. ఇస్లామాబాద్‌లో అక్టోబర్ 16,17 తేదీల్లో షాంఘై కోఆపరేషన్ సదస్సు(ఎస్సీవో)జరగనున్న నేపథ్యంలో కాల్పులు జరగడం చర్చనీయాంశమైంది. ఈ సదస్సుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా హాజరవనున్నారు.ఇదీ చదవండి: విమానం నడుపుతూ పైలట్ మృతి -
‘ఆప్’ నేతపై కాల్పులు..బుల్లెట్ గాయం
చండీగఢ్:పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత మన్దీప్ సింగ్ బ్రార్ కాల్పుల్లో గాయపడ్డారు.ప్రతిపక్ష శిరోమణి అకాళీదళ్‌నేత మన్‌దీప్‌సింగ్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపనలున్నాయి. ఆదివారం(అక్టోబర్6) అకాలీదళ్ నాయకుడు వర్దేవ్ సింగ్ మాన్ ఓ స్కూల్‌కు సంబంధించిన ఫైల్ గురించి బీడీపీఓ కార్యాలయానికి వెళ్లారు.ఆ ఫైల్ చూపించేందుకు అధికారులు నిరాకరించడంతో సింగ్ అక్కడినుంచి వెనుదిరిగారు. వెళుతు వెళుతూ బయట ఉన్న ఆప్ నేత మన్దీప్ సింగ్ బ్రార్‌తో సింగ్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఆప్‌నేత మన్‌దీప్‌కు బుల్లెట్ గాయమైంది. వెంటనే ఆయనను జలాలాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అకాలీ పార్టీ నాయకులే కాల్పులకు ఆప్ నేతలు ఆరోపించారు. పంచాయితీ ఎన్నికల సమయంలో అకాళీదళ్ పార్టీ దాడులకు పాల్పడుతోందన్నారు. ఈ నెల 15న పంజాబ్‌లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.ఇదీ చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం -
ముకేశ్ పాంచ్ పటాకా
లిమా (పెరూ): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శనివారం భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మన షూటర్లు క్లీన్‌స్వీప్ చేస్తూ మూడు పతకాలు ఖాతాలో వేసుకోగా... ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నేలవల్లి ఓవరాల్‌గా ఐదో పతకంతో సత్తా చాటాడు. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు స్వర్ణాలు గెలిచిన గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్... పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. భారత్‌కే చెందిన సూరజ్ శర్మ 571 పాయింట్లతో బంగారు పతకం కైవసం చేసుకోగా... 568 పాయింట్లతో ముకేశ్ కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల ఫైనల్లో దివాన్షి 564 పాయింట్లు సాధించి అగ్ర స్థానం దక్కించుకోగా... భారత్‌కే చెందిన పారిశా గుప్తా 557 పాయింట్లతో రజత పతకం సాధించింది. ఇదే విభాగంలో భారత షూటర్ మాన్వి జైన్ 557 పాయింట్లతో కాంస్యం దక్కించుకోవడంతో మూడు పతకాలు మన ఖాతాలోనే చేరాయి. దీంతో ఈ టోర్నీ చరిత్రలో భారత షూటర్లు తొలిసారి ఒక విభాగంలో మూడు పతకాలను క్లీన్‌స్వీప్ చేసిన ఘనత సాధించారు. దివాన్షికి ఈ పోటీల్లో ఇది ఐదో పతకం కావడం విశేషం. ఈ టోరీ్నలో భారత్ 21 పతకాలతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 13 స్వర్ణాలు, రెండు రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. -
ముకేశ్ ఖాతాలో నాలుగో స్వర్ణం
లిమా (పెరూ): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం భారత్ ఖాతాలో 11వ స్వర్ణ పతకం చేరింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నెలవల్లి, రాజ్వర్ధన్ పాటిల్, హర్సిమర్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 1722 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. ముకేశ్, రాజ్వర్ధన్ 579 పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... హర్సిమర్ 564 పాయింట్లు సాధించాడు. ముకేశ్, రాజ్వర్ధన్ వ్యక్తిగత విభాగం ఫైనల్లోనూ పోటీపడ్డారు. ఆరుగురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రాజ్వర్ధన్ 17 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా... ముకేశ్ 10 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్ ఈ టోరీ్నలో నిలకడగా రాణించి నాలుగు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఈ టోరీ్నలో భారత్ 11 స్వర్ణాలు, ఒక రజతం, 4 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
జాతీయ రైఫిల్ కొత్త అధ్యక్షుడిగా కాళికేశ్
న్యూఢిల్లీ: జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) నూతన అధ్యక్షుడిగా కాళికేశ్ నారాయణ్ సింగ్ దేవ్ ఎన్నికయ్యారు. శనివారం కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన రైఫిల్ సంఘం జనరల్ బాడీ మీటింగ్ ఎన్నికల్లో ఒరిస్సాకు చెందిన మాజీ ఎంపి కాళికేశ్ 36–21 ఓట్ల తేడాతో ప్రత్యర్థి వి.కె.ధల్‌పై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. కొన్నాళ్లుగా కాళికేశ్ ఎన్ఆర్ఏఐ రోజూవారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. జాతీయ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యల్లో ఎవరైనా గరిష్టంగా 12 ఏళ్లకు మించి పదవుల్లో ఉండటానికి వీలు లేదు. దీంతో 2010 నుంచి 2022 వరకు పలు దఫాలు అధ్యక్షుడిగా ఎన్నికైన రణీందర్ సింగ్ గతేడాది కేంద్ర క్రీడాశాఖ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు.అప్పటినుంచి సీనియర్ ఉపాధ్యక్షుడైన కాళికేశ్ జాతీయ రైఫిల్ సంఘం వ్యవహారాలను చక్కబెట్టారు. తాజా ఎన్నికతో ఆయన 2025 వరకు అధ్యక్ష పదవిలో ఉంటారు. ఆయన తాత్కాలిక బాధ్యతలు నిర్వహించిన హయాంలోనే పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. అంతకుముందు జరిగిన రియో–2016, టోక్యో–2020 ఒలింపిక్స్‌లో భారత షూటర్లు ఒక్క పతకం కూడా గెలుపొందలేకపోయారు. -
అమెరికా స్కూల్లో కాల్పుల మోత
విండర్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. జార్జియా రాష్ట్రంలోని విండర్ పట్టణంలో అపలాచీ హైస్కూల్లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. అయితే 30 మంది గాయపడినట్లు తొలుత వార్తలొచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు స్కూల్లో కాల్పులు మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ప్రాణభయంతో దగ్గర్లోని ఫుట్‌బాల్ స్టేడియంలో తలదాచుకునేందుకు పరుగులుపెట్టారు. కాల్పుల విషయం తెల్సి పోలీసులు నిమిషాల్లో పాఠశాలను చుట్టుముట్టారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు, ఎందరు గాయపడ్డారనే వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కాల్పులు జరిపింది 14 ఏళ్ల టీనేజర్ అని మీడియాలో వార్తలొచ్చాయి. అతను ఆ స్కూల్ విద్యార్థేనా అనేది తెలియాల్సి ఉంది. కాల్పులకు కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ‘‘ తుపాకీ శబ్దాలు వినిపించినపుడు రసాయనశాస్త్ర తరగతి గదిలో ఉన్నా. ఒక టీచర్ పరుగున వచ్చి కాల్పులు జరుగుతున్నాయి. గడియ పెట్టుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత ఎవరో వచ్చి తలుపు తెరవండని గట్టిగా పలుమార్లు అరిచారు. మేం తీయలేదు. తర్వాత కాల్పుల శబ్దాలు, అరుపులు వినిపించాయి. మేం తర్వాత దగ్గర్లోని ఫుట్‌బాల్ మైదానంలోకి పరుగులు తీశాం’ అని ప్రత్యక్ష సాక్షి, 17 ఏళ్ల విద్యార్థి సెర్గియో కాల్డెరా చెప్పారు. విషయం తెల్సి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తరలివచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఏటా పెద్దసంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్న విషయం విదితమే. ఘటనపై దేశాధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ‘‘అమెరికా విద్యార్థులు చదవడం, రాయడం అనే వాటితోపాటు దాక్కోవడం, తమను తాము కాపాడుకోవడం అనేవి నేర్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అమెరికాలో కాల్పులు మామూలే అనే ధోరణిని ఆమోదించబోం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
Paris Paralympics: భారత్ ఖాతాలో మరో పతకం.. రుబీనాకు కాంస్యం
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. షూటింగ్ విభాగంలో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్ లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకం సాధించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల రుబీనా.. ఫైనల్లో 211.1 స్కోర్‌తో మూడో స్ధానంలో నిలిచి కాంస్యం పతకం సొంతం చేసుకుంది. ఇరాన్‌కు చెందిన సారే జవాన్‌మర్డి 236.8 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. టర్కీ షూటర్ ఐసెల్ ఓజ్గాన్ రజతం కైవసం చేసుకుంది. కాగా ఇప్పటివరకు ఈ పారాలింపిక్స్‌లో భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించాయి. అందులో నాలుగు పతకాలు షూటర్లు సాధించినవే కావడం గమనార్హం. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించిగా.. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు. BRONZE 🥉 For INDIA 🇮🇳Rubina Francis wins bronze medal in the Women's 10m Air Pistol SH1 Final with a score of 211.1⚡️#Paris2024 #Cheer4Bharat #Paralympic2024 #ParaShooting@mansukhmandviya @MIB_India @PIB_India @IndiaSports @ParalympicIndia @PCI_IN_Official @Media_SAI… pic.twitter.com/iSBUZ6KNS7— Doordarshan Sports (@ddsportschannel) August 31, 2024 -
ప్రమాదం నుంచి పతకం దాకా, చరిత్రను తిరగరాసింది
‘పుస్తకం హస్తభూషణం’ అంటారు. అయితే అది అలంకారం మాత్రమే కాదు అంధకారాన్ని పారదోలే వజ్రాయుధం అనేది ఎంత నిజమో చెప్పడానికి అవని లేఖరా ఒక ఉదాహరణ. కారు ప్రమాదం తాలూకు జ్ఞాపకాల కారు చీకట్లో నిస్తేజంగా మారిన అవని జీవితంలో ఒక పుస్తకం వెలుగు నింపింది. విజేతను చేసింది. తాజాగా... పారిస్ పారాలింపిక్స్ షూటింగ్లో స్వర్ణం గెలుచుకొని మరోసారి సత్తా చాటింది అవని లేఖరా..టోక్యోలో జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ 1 ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది అవని లేఖరా. చిన్నప్పటి నుంచే అవనికి ఆటలు అంటే ఇష్టం. తండ్రి సలహా మేరకు ఆర్చరీ ప్రాక్టీస్ చేసేది. ఆ తరువాత తన ఆసక్తి షూటింగ్ వైపుకు మళ్లింది. జైపూర్(రాజస్థాన్)లోని కేంద్రీయ విద్యాలయాలో చదువుకున్న అవని అక్కడే షూటింగ్లో తొలిసారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది.2012లో కారు ప్రమాదంలో వెన్నెముక గాయంతో పక్షవాతానికి గురైంది అవని. పక్షవాతం మాట ఎలా ఉన్నా మానసికంగా తాను బాగా బలహీనపడింది. ఆ సమయంలో స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఆత్మకథ అవనికి ఎంతో స్ఫూర్తి ఇచ్చింది, జీవితాన్ని ఉత్సవం చేసుకునే శక్తిని ఇచ్చింది. అలా 2015లో తనకు ఇష్టమైన షూటింగ్‌లోకి వచ్చింది. ఒక యజ్ఞంలా సాధన మొదలు పెట్టింది. ఒకే పారాలింపిక్స్ (టోక్యో)లో రెండు పతకాలు అందుకున్న భారతదేశ ఏకైక మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. గత మార్చిలో అవనికి పిత్తాశయ శస్త్ర చికిత్స జరిగింది. మరోవైపు తన ముందు పారిస్ పారాలింపిక్స్ కనిపిస్తున్నాయి. కొన్ని నెలల విరామం తరువాత మళ్లీ రైఫిల్ చేతిలోకి తీసుకుంది. ఆ సమయంలో ఆపరేషన్ తాలూకు శారీరక బాధ, మానసిక ఒత్తిడి తన నుంచి దూరమయ్యాయి. లక్ష్యం ఒక్కటే తన కళ్ల ముందు కనిపించింది,టోక్యో ఒలింపిక్స్ విజేతగా అవనిపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీంతో సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. అయితే ఆమెకు ఒత్తిడి అనుకోని అతిథి ఏమీ కాదు. టోక్యో పారాలింపిక్స్ తన తొలి ఒలింపిక్స్. దీంతో ఎంతో ఒత్తిడి ఉంటుంది. అయినా సరే ఆ ఒత్తిడిని చిత్తు చేసి చరిత్ర సృష్టించింది.తాజాగా పారిస్ పారాలింపిక్స్‌లోనూ విజయభేరీ మోగించింది.ఒక క్రికెటర్ టోర్నీలో విఫలమైతే తనను తాను నిరూపించుకోవడానికి పట్టే సమయం తక్కువ. అదే ఒలింపియన్ విషయంలో మాత్రం నాలుగేళ్లు వేచిచూడాలి’ అభినవ్ బింద్రా ఆత్మకథలోని వాక్యాన్ని అవని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. దీనివల్ల బంగారంలాంటి అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత పడుతుంది. ఆ జాగ్రత్తే ఈసారి కూడా బంగారు పతకాన్ని మెడలోకి తీసుకువచ్చింది. టోక్యో పారాలింపిక్స్‌లో 249.6 పాయింట్లతో రికార్డ్ నెలకొల్పింది అవని. తాజాగా 249.7 పాయింట్లతో తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేసుకోవడం మరో విశేషం. -
అవని అద్వితీయం
పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల జోరు మొదలైంది. పోటీల రెండో రోజే మన ఖాతాలో నాలుగు పతకాలు చేరడం విశేషం. షూటింగ్లో అవని లేఖరా తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ స్వర్ణ పతకంతో మెరిసింది. అదే ఈవెంట్లో మోనా అగర్వాల్‌కు కాంస్య పతకం దక్కింది. వీటితో పాటు పురుషుల షూటింగ్లో మనీశ్ నర్వాల్ రజతాన్ని గెలుచుకోగా ... స్ప్రింట్‌లో ప్రీతి పాల్ కూడా కాంస్య పతకాన్ని అందించింది. అయితే అన్నింటికి మించి గత టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న అవని లేఖరా ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఒకే ఈవెంట్లో తొలిసారి రెండు పతకాలు దక్కాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్లో అవని లేఖరా స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. అవని 249.7 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. జైపూర్‌కు చెందిన 22 ఏళ్ల అవని టోక్యోలో మూడేళ్ల క్రితం జరిగిన ఒలింపిక్స్‌లోనూ పసిడి పతకం గెలుచుకుంది. ఈ క్రమంలో గత ఒలింపిక్స్‌లో తాను నమోదు చేసిన 249.6 పాయింట్ల స్కోరును కూడా అవని సవరించింది. ఈ ఈవెంట్లో దక్షిణ కొరియాకు చెందిన యున్రీ లీ (246.8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా... భారత్‌కే చెందిన మోనా అగర్వాల్ (228.7 పాయింట్లు) కాంస్య పతకం సాధించింది. నడుము కింది భాగంలో శరీరాంగాలు పూర్తి స్థాయిలో పని చేయకుండా ఉండే అథ్లెట్లను ఎస్‌హెచ్1 కేటగిరీలో పోటీ పడేందుకు పారాలింపిక్స్‌లో అనుమతిస్తారు. ‘బరిలోకి దిగినప్పుడు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఆటపై దృష్టి పెట్టడమే తప్ప ఇతర విషయాలను పట్టించుకోలేదు. టాప్–3లో నిలిచిన ముగ్గురు షూటర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువ. పసిడి పతకం రావడం చాలా సంతోషాన్నిచ్చిం ది. ఇక్కడ భారత జాతీయ గీతం వినిపించడం గొప్పగా అనిపిస్తోంది. మరో రెండు ఈవెంట్లలో కూడా పతకాలు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తా’ అని అవని లేఖరా చెప్పింది. అవని సహచర్యం వల్లే తాను ఆటలో ఎంతో నేర్చుకోగలిగానని, ఆమె వల్లే ఇక్కడా స్ఫూర్తి పొంది పతకం సాధించానని 37 ఏళ్ల మోనా అగర్వాల్ వెల్లడించింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో కూడా అవని తలపడనుంది. మనీశ్ నర్వాల్‌కు రజతం... పురుషుల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 22 ఏళ్ల మనీశ్ నర్వాల్ కూడా పతకంతో మెరిశాడు. అయితే గత ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న మనీశ్ ఈసారి రజత పతకానికే పరిమితమయ్యాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1లో మనీశ్ రెండో స్థానంలో నిలిచాడు. మనీశ్ మొత్తం 234.9 పాయింట్లు సాధించాడు. ఫైనల్లో ఒకదశలో మెరుగైన ప్రదర్శనతో అగ్రస్థానంలో కొనసాగిన ఈ షూటర్ ఆ తర్వాత వరుస వైఫల్యాలతో వెనుకబడిపోయాడు. ఈ పోరులో జెంగ్డూ జో (కొరియా; 237.4 పాయింట్లు) స్వర్ణ పతకం గెలుచుకోగా... చావో యాంగ్ (చైనా; 214.3)కు కాంస్యం లభించింది. కంచు మోగించిన ప్రీతి పాల్... పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ట్రాక్ ఈవెంట్లో ప్రీత్ పాల్ తొలి పతకాన్ని అందించింది. మహిళల 100 మీటర్ల టి–35 పరుగులో ప్రీతికి కాంస్యం లభించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల ప్రీతి రేసును 14.21 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. 1984 నుంచి పారాలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు అన్ని పతకాలు ఫీల్డ్ ఈవెంట్లలోనే వచ్చాయి. ఇటీవలే ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో కాంస్యం సాధించిన అనంతరం ప్రీతి ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. ఆమెకు ఇవే తొలి పారాలింపిక్స్. సెమీస్‌లో సుహాస్, నితీశ్... పారా బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్, నితీశ్ కుమార్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... మనోజ్ సర్కార్, మానసి జోషి నిష్క్రమించారు. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత సుహాస్ (ఎస్ఎల్4 ఈవెంట్) 26–24, 21–14తో షియాన్ క్యూంగ్ (కొరియా)పై నెగ్గగా... నితీశ్ (ఎస్ఎల్3 ఈవెంట్) 21–5, 21–11తో యాంగ్ జియాన్యువాన్ (చైనా) ను చిత్తు చేశాడు. 2019 వరల్డ్ చాంపియన్ మానసి జోషి (ఎస్ఎల్3) 21–10, 15–21, 21–23తో ఒక్సానా కొజినా (ఉక్రెయిన్) చేతిలో... గత ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మనోజ్ 19–21, 8–21తో బున్సున్ (థాయిలాండ్) చేతిలో ఓడారు. టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ద్వయం భవీనా–సోనాలీబెన్ పటేల్ 5–11, 6–11, 11–9, 6–11 స్కోరుతో యంగ్ జుంగ్–సుంగ్యా మూన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రిక్వార్టర్స్‌లో రాకేశ్ మరోవైపు ఆర్చరీలో పురుషుల కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్లో రాకేశ్ కుమార్ తొలి రౌండ్లో 136–131తో ఆలియా డ్రేమ్ (సెనెగల్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల సైక్లింగ్ పర్సూ్యట్ సీ2 కేటగిరీలో భారత ఆటగాడు అర్షద్ షేక్ తొమ్మిదో స్థానంలో నిలిచి ని్రష్కమించాడు. -
పారాలింపిక్స్: భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. పారా షూటర్ మనీష్ నర్వాల్ అదరగొట్టాడు. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్ ఫైనల్ లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు.మూడు రౌండ్లలో మనీష్ 234.9 పాయింట్స్ సాధించి రెండో స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన జియోంగ్డు జో గోల్డ్‌మెడల్ సొంతం చేసుకోగా.. చైనా షూటర్ యాంగ్ చావో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల 100 మీ. టీ35 పరుగు పందెంలో ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ప్రీతి 14.21 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. దీంతో భారత్ మొత్తం 4 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.అంతకుముందు ఇవాళ(శుక్రవారం) మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించింది. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా భారత్ ఖాతాలో మొత్తం 4 పతకాలు ఉన్నాయి. -
Paris Paralympics 2024: మెరిసిన అవని.. షూటింగ్లో భారత్‌కు స్వర్ణం
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్-2024లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. భారత పారా షూటర్ అవని లేఖరా పసిడి పతకంతో మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో బంగారుపతకం సాధించింది. ఫైనల్లో 249.7 స్కోరు సాధించి అగ్రస్ధానంలో నిలిచిన అవని.. గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా పారా ఒలింపిక్స్‌లో అవనీకి ఇది రెండో బంగారు పతకం కావడం గమనార్హం. టోక్యో పారాలింపిక్స్-2021లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 22 ఏళ్ల అవని పసిడి పతకం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను ఆమె తన పేరిట లిఖించుకుంది. పారా ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రెండు గోల్డ్‌మెడల్స్‌ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షూటర్‌గా అవని చరిత్ర సృష్టించింది.కాంస్యంతో మెరిసిన మోనా అగర్వాల్..ఇక ఇదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో మరో భారత షూటర్ మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో మోనా 228.7 స్కోరుతో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. 🇮🇳🥇 UNSTOPPABLE! The defending champion Avani Lekhara clinches gold at the Paris Paralympics 2024, proving she's still on top!📷 Pics belong to the respective owners • #AvaniLekhara #Shooting #ParaShooting #Paris2024 #Paralympics #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/advcNuWvYR— The Bharat Army (@thebharatarmy) August 30, 2024 -
ప్రభాస్ కల్కి సీక్వెల్.. షూటింగ్ ఎప్పటినుంచంటే?
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ నిర్మించారు. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందన ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.తాజాగా కల్కి సీక్వెల్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇటీవల రష్యాలోని మాస్కోలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ వీక్‌లో నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్‌లు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో కల్కి-2 షూటింగ్‌కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూట్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కాగా.. కల్కి మూవీని త్వరలోనే రష్యన్ భాషలోనూ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ చిత్రంలో కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు. అంతేకాకుండా రాజమౌళి, రాంగోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి ప్రముఖులు అతిథి పాత్రల్లో మెరిశారు. ఈ మూవీలోని బుజ్జి కారుకు కీర్తి సురేశ్ వాయిస్ అందించారు. అయితేస పార్ట్-2లో కమల్ హాసన్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చారు. దీంతో పార్ట్-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
కాకినాడలో మట్కా
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వంలో డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ కాకినాడలో జరుగుతోంది.‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మట్కా’. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ డిఫరెంట్ మేకోవర్లలో కనిపించనున్నారు. ప్రస్తుతం కాకినాడలో జరుగుతున్న షెడ్యూల్లో కీలక తారాగణంపై టాకీ పార్ట్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి. రవి శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: ఎ. కిశోర్ కుమార్. -
భారత సంతతి వ్యాపారి కాల్చివేత
వాషింగ్టన్: దోపిడీకి యత్నించిన దుండగుడు భారతసంతతికి చెందిన దుకాణదారును కాల్చిచంపాడు. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం రొవాన్ కౌంటీలో చోటుచేసుకుంది. మైనాంక్ పటేల్(36) టొబాకో హౌస్ స్టోర్ పేరుతో దుకాణం నడుపుతున్నారు. మంగళవారం ఉదయం షాట్గన్తో దుకాణంలోకి ప్రవేశించిన శ్వేతజాతీయుడైన బాలుడు మైనాంక్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ∙బాలుడిని కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు.


