ఓ మై గాడ్‌ | Akshay Kumar to return in the franchise of Oh My God 3 | Sakshi
Sakshi News home page

ఓ మై గాడ్‌

Jan 3 2026 4:44 AM | Updated on Jan 3 2026 4:44 AM

Akshay Kumar to return in the franchise of Oh My God 3

బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ ఫ్రాంచైజీ ‘ఓ మై గాడ్‌’ నుంచి ‘ఓ మై గాడ్‌ 3’ సినిమా షూటింగ్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. ‘ఓ మై గాడ్‌ (2012), ఓ మై గాడ్‌  2 (2023)’ చిత్రాల్లో లీడ్‌ రోల్‌లో నటించిన అక్షయ్‌కుమార్‌ ‘ఓ మై గాడ్‌ 3’లోనూ నటించనున్నారు. ఈ చిత్రంలోని మరో లీడ్‌ రోల్‌లో రాణీ ముఖర్జీ కనిపిస్తారని బాలీవుడ్‌ టాక్‌. అమిత్‌ రాయ్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్‌ జరుగుతున్నాయి. 

ఒక సామాజిక అంశాన్ని చర్చించేలా ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారట అమిత్‌. ఈ ఏడాది జూన్లో చిత్రీకరణను ప్రారంభించనున్నారని తెలిసింది . ఇక ప్రస్తుతం దర్శకుడు అనీస్‌ బాజ్మీతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి రెడీ అవుతున్నారు అక్షయ్‌కుమార్‌. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కి హిందీ రీమేక్‌గా ఇది తెరకెక్కనుందట. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల మూడోవారంలో ప్రారంభం కానుందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement