టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో జరిగిన హైడ్రామా తర్వాత కూడా బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే మీరనుకున్నట్లు ఇది బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కాదు. షూటింగ్ జట్టు. ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్‌షిప్ కోసం బంగ్లా టీమ్ భారత పర్యటనకు రానుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.
ఈ టోర్నీ ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరగనుంది. క్రికెట్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్.. షూటింగ్ పోటీల్లో ఎలా పాల్గొనబోతుందోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ మ్యాచ్‌లకు లభించని భద్రత షూటింగ్‌కు లభిస్తుందా అని భారత క్రీడాభిమానులు సెటైర్లు వేస్తున్నారు.
కాగా, భారత్‌లో జరగాల్సిన తమ టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను భద్రతా కారణాలు సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడంతో భారత్-బంగ్లాదేశ్ మధ్య వివాదం మొదలైంది.
ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. భారత్‌పై ప్రతీకార చర్యగా స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసింది. ఇంతటితో ఆగకుండా భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, భారత్‌లో జరగాల్సిన తమ ప్రపంచకప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. ఐసీసీ ససేమిరా అనడంతో చివరికి ప్రపంచకప్ నుంచి తప్పుకుంది.
ఇప్పుడేమో తమ దేశ షూటింగ్ జట్టును భారత్‌కు పంపుతూ కొత్త చర్చకు తెరలేపింది. ఈ విషయంలో భారత షూటింగ్ సమాఖ్య ఎలా స్పందిచబోతుందోనన్నది ఆసక్తికరంగా మారింది.


