కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఏటీపీ–1000 మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో మూడోసారి టైటిల్ సాధించాలని ఆశించిన ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్‌కరాజ్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 7–6 (7/3)తో టాప్ సీడ్ అల్‌కరాజ్‌ను ఓడించి ఈ టోర్నీలో మూడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
ఈ ఏడాది అల్‌కరాజ్‌కిదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఆ్రస్టేలియన్ ఓపెన్, ఖతర్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన అల్‌కరాజ్ ఈ ఏడాది 16 వరుస విజయాల తర్వాత తొలి పరాజయం చవిచూశాడు. 2023, 2024లలో ఈ టోర్నీ ఫైనల్లో అల్‌కరాజ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న మెద్వెదెవ్ ఈసారి టైటిల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ)తో తలపడతాడు.


