
టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా జరుగుతున్న షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హీరోతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్కు కూడా గాయాలైనట్లు సమాచారం. అయినప్పటికీ ఈ రోజు షూట్ను యథాతథంగా కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అడివి శేష్కు కాలు బాగా వాపు రావడంతో ఆస్పత్రికి వెళ్లనున్నట్లు టాక్.
కాగా.. ఇప్పటికే డకాయిట్ మూవీ నుంచి ఫైర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. షానీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డకాయిట్‌ను ప్రేక్షకులమ ముందుకు తీసుకొస్తున్నారు.