
అల్లు అర్జున్(Allu Arjun) కొత్త సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైంది. ఇక ఆల్ సెట్ గో... అంటూ అల్లు అర్జున్ చిత్రీకరణలో పాల్గొననున్నారు.

అల్లు అర్జున్ హీరోగా అట్లీ(Atlee ) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్‌గా నటిస్తారు.

కాగా ఈ సినిమా చిత్రీకరణ ఈ వారంలోనే ప్రారంభం కానుందని తెలిసింది. దాదాపు ఇరవై రోజుల పాటు ముంబైలో జరగనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణలో అల్లు అర్జున్, మృణాల్ ఠాగూర్ పాల్గొంటారని, వీరిద్దరి కాంబినేషన్‌లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను దర్శకుడు అట్లీ ప్లాన్ చేశారని సమాచారం.










