మా వందే ప్రారంభం | PM Narendra Modi biopic Maa Vande starring Unni Mukundan commences shooting | Sakshi
Sakshi News home page

మా వందే ప్రారంభం

Dec 21 2025 2:52 AM | Updated on Dec 21 2025 2:55 AM

PM Narendra Modi biopic Maa Vande starring Unni Mukundan commences shooting

∙గంగాధర్, రవి బస్రూర్, ఉన్ని ముకుందన్, క్రాంతికుమార్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ ‘మావందే’ టైటిల్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో మోదీగా ఉన్ని ముకుందన్‌ నటిస్తున్నారు. రవీనా టాండన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. సీహెచ్‌ క్రాంతికుమార్‌ దర్శకత్వంలో వీర్‌ రెడ్డి .ఎం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శనివారం ప్రారంభమైంది. ‘‘మోదీగారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలను సహజంగా ‘మా వందే’లో చూపించనున్నాం.

ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ మోదీగారి జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోని ప్రముఖ సాంకేతిక, వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులతో ఈ బయోపిక్‌ను రూపొం దిస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: గంగాధర్, వాణిశ్రీ, లైన్‌ ప్రోడ్యూసర్‌: రాజేశ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement